Municipal Department
-
తూతూ మంత్రం.. ప్రజా సమస్యల పరిష్కారం!
సాక్షి, అమరావతి: ప్రజా వినతులకు సరైన పరిష్కారం చూపకుండా ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. చాలా వినతులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజా వినతుల పరిష్కారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరు సక్రమంగా లేదని ప్రకటించారు.గత ఏడాది జూలై 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు 7.42 లక్షల ప్రజా వినతులు రాగా, అందులో ఇంకా 2.91 లక్షలు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. మరోవైపు కొన్ని వినతులు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. ప్రజా వినతుల పరిష్కార పరిస్థితి ఇదీ... » పోలీసు శాఖ ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరుపై 70 శాతం అర్జీదారులు అసంతృప్తి చేశారు. » మున్సిపల్ శాఖపై 69 శాతం మంది అసంతృప్తి. » స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై 67 శాతం సంతృప్తి వ్యక్తమైంది. » రెవెన్యూ శాఖలోను 60 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యధికంగా రెవెన్యూలో మ్యుటేషన్, విస్తీర్ణంలో తేడాలపై సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీల సరవణలు, భూ కమతాల పంపిణీ, పట్టాదారు పాస్‌పుస్తకాల గురించి వినతులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా సంబంధిత వీఆర్వోలకు బదిలీ చేస్తున్నారు. వీఆర్వో నివేదిక ఆధారంగా అధికారులు ఎండార్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పిటీషనర్ల దగ్గరకు వెళ్లడం లేదు. ప్రాథమిక విచారణ చేయడం లేదు. » ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కొన్ని కేసుల్లో అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు. కానీ, చాలా కేసుల్లో నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులను అప్లోడ్ చేయడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. అటువంటి వాటిపై నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. » అర్జీదారుల వినతి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఫిర్యాదులను తిరిగి తెరిచినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. » వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి శాఖల వారీగా చేసిన సర్వేకు, సీఎంవో చేసిన సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సీఎంవో నిర్వహించి సర్వేలో ఎక్కువ శాఖల్లో ప్రజల వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. -
మళ్లీ తెరపైకి ఈ-కార్ రేస్ వ్యవహారం.. ఏసీబీకి ఫిర్యాదు
హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.చదవండి: ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్ -
పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమస్యగా మారిన చెత్త తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, దీనిని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలన్నారు. శుక్రవారం రాత్రి సచివాలయంలో మునిసిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కాగా జరగాలని, మార్పు రాష్ట్రంలో ప్రతిచోట కనిపించాలన్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాడిలో పడాలని సూచించారు. టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని, ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలన్నారు. యూఎల్బీల్లో 50 లక్షల గృహాలు ఉండగా, 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని, మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేయండిపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని చంద్రబాబు పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రూ.100 సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు.ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని.. రూ.లక్ష కట్టిన వారికి టీడీపీ శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా కార్యకర్త మృతిచెందితే అంత్యక్రియలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తానని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లుఅమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్ల ఆర్థిక రుణ సాయం అందించేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు కూడా హడ్కో సంసిద్ధత వ్యక్తంచేసిందని ఆయన తెలిపారు. హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ, ఇతర ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా?
‘పరిధి’ దాటుతోందా? చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఔటర్ వెలుపలే ఉంది. దీంతో ‘హైడ్రా’ పరిధిని దాటి, టార్గెట్ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.సెలబ్రిటీల నిర్మాణాలను ‘టచ్’ చేస్తారా? 111 జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీల లగ్జరీ ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని ‘టచ్’ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ప్రయోగించగలదా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: వందేళ్లుగా భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అక్రమ భవనాలను తొలగించి, జలాశయాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ ‘ఈ కూల్చివేతలను కేవలం ‘ఎంపిక’చేసిన భవనాలు, నిర్మాణాలకే పరిమితం చేస్తారా? లేక అక్రమ నిర్మాణాలు అన్నింటిపైకీ బుల్డోజర్లు వెళతాయా? విచ్చలవిడి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ దృష్టిపెడుతుందా?’అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని అక్రమ నిర్మాణాలపైకి ‘హైడ్రా’ బుల్డోజర్లను నడిపిస్తున్న నేపథ్యంలో.. ట్రిపుల్ వన్ జీవో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ట్రిపుల్ వన్’పై తీవ్ర గందరగోళం జంట జలాశయాలను కాపాడేందుకు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో–192ను తీసుకొచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో–111ను తెల్చింది. ఇటీవలి వరకు అది కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసి, దాని స్థానంలో జీవో నంబర్ 69ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడి 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. కానీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈలోపు ఎన్నికలు సమీపించడం, ప్రభుత్వం మారడంతో జీవో–111పై గందరగోళం నెలకొంది. ‘ఎంపిక’ చేసిన భవనాలపైనేనా? గ్రేటర్ హైదరాబాద్ సిటీకి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. క్లుప్తంగా జీవో– 111 పరిధి ఇది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. అదీ శాశ్వత నిర్మాణం అయి ఉండకూడదు. నీటి సహజ ప్రవాహానికి ఏమాత్రం అడ్డుగా ఉండకూడదు. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితయ్యాయి. అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అడ్డగోలుగా నిర్మాణాలను చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇది ఈ జలాశయాల పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ఉంటుందా? లేదా కేవలం ‘ఎంపిక’ చేసిన నిర్మాణాల కూల్చివేతతోనే ఆగిపోతుందా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కూడా భవిష్యత్తులో హుస్సేన్‌సాగర్‌లా మురికికూపమైపోయే మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకున్నా లక్షల్లో నిర్మాణాలు 40 ఏళ్ల కిందటే జంట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చినా.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ వచ్చాయి. గత పది, పదిహనేళ్లలో విపరీతంగా పెరిగాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టారీతిగా నిర్మాణాలు సాగుతున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ప్రధానంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాల్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, హోటళ్లు, ఇతర భవన నిర్మాణాలు వెలిశాయి. జీవో–111 పరిధిలో 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 426 అక్రమ లే–అవుట్లు, 10,907 గృహాలు, 1,363 వాణిజ్య నిర్మాణాలు, 190 పారిశ్రామిక, ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.అటు అభివృద్ధి.. ఇటు మనుగడ.. అభివృద్ధిలో వెనుకబడుతున్నామని, జీవో–111 ఎత్తే యాలని ఆ ప్రాంతంలోని వారు మొదట్నుంచీ కోరుతున్నారు. అలా చేస్తే జంట జలాశయాల మనుగడకు విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సర్కారు జీవో–111పై కోదండరెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ఫిఫ్త్ సిటీగా జీవో–111 జీవో–111 పరిధిలోని 84 గ్రామాలను ఫిఫ్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. జీవో పరిధిలోని 84 గ్రామాలకు నెట్ జీరో పాలసీని అవలంబించేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వాన నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. -
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. -
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశుద్ధ్య, సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు కార్మికుల ఆత్మగౌరవం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య పనుల్లో ఇకపై యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. తమను కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడని సమాజంలోనూ సఫాయి కార్మికులు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే పర్యావరణమే మురికికూపంగా మారుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ చిన్నరాముడు, సఫాయి కార్మిక ఆందోళన్ ప్రతినిధి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
‘హరితం’లో ప్రథమం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కారాలకు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హరితహారం పచ్చదనం విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాల పంపిణీలో రెండో స్థానం లభించింది. మూడున్నరేళ్ల కాలంలో అనేక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. ముఖ్యంగా పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగులో పేరుకుపోయిన పూడిక తొలిగించి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీరు చేరకుండా చేశారు. బుగ్గవాగును క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో దోమల బెడద తొలిగిపోయింది. కాగా, వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని శిల్పారామంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం అవార్డు అందుకోనున్నారు. పలు సమస్యలు పరిష్కారం.. కోరగుట్ట భగీరథ ట్యాంక్ నుంచి ఇందిరానగర్, ఫైర్ స్టేషన్, జగదాంబ సెంటర్, కోర్టు ఏరియాల్లో వేసవికాలం మినహా రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. మున్సిపాల్టీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు చేరుస్తున్నారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లను శుభ్రం చేశారు. తద్వారా దుర్వాసన సమస్య పరిష్కారం అయింది. పట్టణంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను కూల్చేశారు. రైల్వే పట్టాల వెంట గల ఖాళీ స్థలం, పురాతన భవనాలను తొలిగించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలను స్వాధీనం చేసుకుని వివిధ మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఆరు జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, ఆయా బస్తీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అంధకార సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన మహబూబాబాద్ క్రాస్‌రోడ్, గోవింద్ సెంటర్, కొత్తబస్టాండ్, బుగ్గవాగు, పాత బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, జగదాంబా సెంటర్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలక వర్గం అధికారంలోకి వచ్చాక పట్టణంలో మోడల్ మార్కెట్, మల్టీయుటిలిటీ సెంటర్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్ సెంటర్, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజావసర పనులు చేశారు. కేటీఆర్ ప్రోత్పాహంతో ముందడుగు ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, ఎమ్మెల్యే హరిప్రియ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారం మరువలేనివి. పట్టణాన్ని అన్ని విధాలా అగ్రభాగంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేస్తోంది. మాతోపాటు కార్మికులు, సిబ్బంది, అధికారుల సమష్టికృషితో ఆక్రమణల తొలగింపు, బుగ్గవాగు క్లీనింగ్, ఆంబజార్ రోడ్ నిర్మాణం.. ఇలా రూ.153 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. – డి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ -
బ్లాక్ స్పాట్స్‌పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్‌శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్‌లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా పరిగణిస్తారు. -
ఇళ్లు ఫుల్ స్పీడ్!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద వీరికి ఇళ్ల పట్టాల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైకోర్టుకు అదనపు భవనం.. కోర్టు హాళ్లలో సదుపాయాలు అమరావతిలో 50,004 మంది పేదలకు 1,402.58 ఎకరాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పది లేఅవుట్లలో, ఎన్టీఆర్ జిల్లా లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. దాదాపు 180 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు అదనపు భవన నిర్మాణం కూడా పూర్తవుతున్నట్లు చెప్పారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన పనులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుందరంగా బెజవాడ రివర్ బెడ్ విజయవాడలో కృష్ణానది వరద ముప్పు తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడిన రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా వివిధ సుందరీకరణ పనుల గురించి అధికారులు వివరించారు. నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పరిశుభ్రంగా విశాఖ బీచ్‌లు విశాఖలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మెరుగుపడుతుందన్నారు. గుడివాడ టిడ్కో ఇళ్లు జూన్‌లో పంపిణీ ఫేజ్–1 కింద 1,50,000 టిడ్కో ఇళ్లకు సంబంధించి 1.39 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పటికే 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రెండో విడతకు సంబంధించి 1,12,092 ఇళ్లను సెప్టెంబరు – డిసెంబరు మధ్య లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్‌కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీసర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లావాసులకు నెరవేరనున్న సొంతింటి కల..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణావృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. 21 లేఅవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు.. – ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. – 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. – మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు. – గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు. – ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. – జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిశాయని వెల్లడించిన అధికారులు. – దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని తెలిపారు. – ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు. – 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించిన అధికారులు. – సీఐటీఐఐఎస్ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు. – దాదాపు 12 అర్భన్ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్ష.. – టిడ్కో ఇళ్లలో ఫేజ్ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి. – 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని వెల్లడించిన అధికారులు. – జూన్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపిన అధికారులు. – రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. – గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. – జూన్ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్న అధికారులు. – ఈ సందర్బంగా విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. – దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. – వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్నారు. – పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. – విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. – రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. – విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక -
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్ఆర్సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
వెంకటగిరి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు విభాగాల్లో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జనార్ధన్‌నాయుడు నేతృత్వంలో ఐదుగురు సీఐలు, 15 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 14400 కు ఫిర్యాదుతోనే తనిఖీలు.. వెంకటగిరి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) విభాగంపై 14400, వెబ్సైట్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము తనిఖీలు నిర్వహించినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. ఆదరణ పథకం లబ్ధిదారుల వద్ద కట్టించుకున్న నగదులో రికార్డ్ అసిస్టెంట్ పెంచలయ్య వద్ద రూ.14,000 తక్కువగా ఉన్నట్లు, పన్నులు వసూళ్లకు సంబంధించి ఉండాల్సిన నగదులో రూ.25,000 తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. పలు విభాగాల్లోని అధికారుల వద్ద అనధికారికంగా మరో రూ.45,000 నగదు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. -
మున్సిపల్ అధికారుల చేతివాటం.. 12కోట్ల విలువైన ల్యాండ్..
సాక్షి, రంగారెడ్డి: తట్టిఅన్నారంలో మున్సిపల్ అధికారులు చేతవాటం చూపించారు. కబ్జాదారుడు కేవీ సత్యనారాయణ రెడ్డితో అధికారులు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. కేవీ సత్యనారాయణతో చేతులు కలిపిన మున్సిపల్ అధికారులు వివాదాస్పద ప్రైవేటు భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపించారు. రూ.12 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు క్రుట చేశారు. ఈ క్రమంలో స్థానికులు వారిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ఆపేశామని చెప్పి తెల్లారేసరికి రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం అడ్డుకున్న బాధితున్ని కబ్జాదారుడు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ప్రతీరోజు ప్రైవేటు గూండాలను పెట్టి పహరా కాస్తున్నట్టు తెలిపారు. దీంతో, పోలీసులు సత్యనారాయణరెడ్డిపై హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. -
నిండు ప్రాణాలను బలిగొన్న నిద్రమత్తు
మెదక్‌జోన్: నిద్రమత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన సంగాయిపేట యాదమ్మ(48), పద్మగల్ల నర్సమ్మ (52), విజయ ముగ్గురూ మెదక్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం తెల్లవారు జామున మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రోడ్లను ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న పెట్రోల్ పంపులో స్వీపర్లుగా పని చేస్తున్న మరియమ్మ, శాంతమ్మ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కొల్చారం మండలం వరిగుంతం తండాకు చెందిన సురేశ్ కుటుంబీకులతో కలసి నిజామాబాద్ జిల్లా అర్మూర్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. నిద్రమత్తులో కారును వేగంగా నడుపుతూ పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఐదుగురిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ, నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. విజయ, శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరియమ్మ స్వల్ప గాయాలతో మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగే వరకు తనకు తెలియలేదని, శుక్రవారం రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధు తెలిపారు. -
‘స్థానిక’ ఉప ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఈఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి సోమవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయినవి కాకుండా 2021లో ఎన్నికలు జరిగి, గెలిచిన అభ్యర్థుల మరణం, రాజీనామాల కారణంగా ప్రస్తుతం ఐదు జెడ్పీటీసీ, 102 ఎంపీటీసీ, 53 సర్పంచి, 770 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 డివిజన్ కార్పొరేటర్, నాలుగు వార్డు కౌన్సిలర్ పదవులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 945 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమని గుర్తించారు. మరోవైపు ఒక మున్సిపల్ చైర్మన్, ఏడు ఎంపీపీ, తొమ్మిది వైస్ ఎంపీపీ, ఐదు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు కూడా పరోక్ష పద్ధతిలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తేల్చారు. కొత్త ఓటర్ల జాబితాలతోనే... కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరిలో కొత్త ఓటర్ల జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాల ప్రకారమే స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. -
కొత్త ఒరవడితో.. సమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్‌గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు. నాణ్యమైన సేవలు అందాలి పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా? -
ఆ 87 గ్రామాలు పంచాయతీలా.. కాదా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను వాటిపక్కనే ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండున్నరేళ్ల కిందట మున్సిపల్ శాఖ ప్రతిపాదించింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీలను స్థాయి పెంచాలని, లేకపోతే సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది. పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు కొన్నింటిని వాటిపక్కనున్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. 19 మండలాల్లోని 87 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. మున్సిపల్ శాఖ ఈ తరహాగా ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆ 87 గ్రామ పంచాయతీల తాజా పరిస్థితి గురించి ఆరాతీసింది. వాటిని నగర పంచాయతీలుగా మార్చే, సమీప పట్టణాల్లో విలీనం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు లేఖ రాసింది. ఆ పంచాయతీలను గ్రామాలుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారా అని అడిగింది. ఈ విషయాలు తెలపాలని కోరింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయా పంచాయతీల తాజా పరిస్థితిని తెలియజేయాలంటూ రెండురోజుల కిందట మున్సిపల్ శాఖకు లేఖ రాసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఒకటి నుంచి పట్టణ సర్వే పనులు
సాక్షి, అమరావతి: పట్టణ ఆస్తుల సమగ్ర భూ హక్కు సర్వే పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వేగవంతం చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆయా నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల హక్కుదారులకు నోటీసులు జారీచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న రికార్డుల ప్రకారం ఆస్తులు, వాటి యజమానుల గుర్తింపు ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. మొత్తం 123 స్థానిక సంస్థల్లో 38 లక్షల ఆస్తులున్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పట్టణాల్లోని ఆస్తుల సర్వే ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. ఇప్పటికే 20 వేల మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ప్రతి వార్డుకి ఐదుగురు సర్వే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. 648 గ్రామాల రికార్డులు పరిశీలన పట్టణాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలతోపాటు ఒకే స్థలం లేదా ఇల్లు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటి సమస్యలు లేకుండా ఆయా ఆస్తిదారులకు నమ్మకమైన గుర్తింపు పత్రం ఇచ్చేందుకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆస్తుల సర్వేకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ పూర్తయినట్లయితే వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నట్లుగానే. పట్టణాల్లోని స్థలాలు, ఇళ్లకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ఆస్తులకు సమగ్రమైన రికార్డులు సిద్ధమవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాలు ఉండగా, వాటిల్లో వందలాది గ్రామాలు చేరాయి. దాంతో పట్టణాల్లో విలీనమైన 648 గ్రామాల రికార్డులు, ప్రస్తుతమున్న రికార్డులతో సరిపోల్చి ఏ ఆస్తి ఎవరి పేరిట నమోదైందో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేతో పాటు రెవెన్యూ రికార్డులు, ప్లానింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ కమిషనరేట్‌లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేశారు. ఇందులో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఇదే తరహాలో 123 మున్సిపాలిటీల్లోనూ పీఎంయూ విభాగాలను ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. నవంబర్ ఒకటి నుంచి ఆస్తుల యజమానులకు నోటీసులు జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. యజమానుల నుంచి అభ్యంతరాలను సైతం తీసుకుని, వాటిని పరిష్కరించి మొత్తం సర్వే పనులను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు ఆయన వివరించారు. రికార్డుల్లో 38 లక్షల ఆస్తులు ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 31 లక్షల ఆస్తులు, ఏడు లక్షల ఖాళీ స్థలాలున్నట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. అయితే, సర్వే ప్రక్రియ మొదలైతే రికార్డుల్లోకి రాని ఆస్తులు మరో 10 శాతం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. వేటికవి ప్రత్యేకంగా గుర్తించి డేటా తయారుచేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాలు పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సమగ్రంగా సర్వే ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి సరిహద్దుల సర్వేను పూర్తిచేశామని, సర్వేలో పాల్గొనే సిబ్బందికి మూడంచెల్లో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇచ్చామని రీ సర్వే ప్రత్యేకాధికారి బి.సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల రికార్డులను సమగ్రంగా ఆన్లైన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
మున్సిపల్ శాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, మళ్లీ పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీజన్ ప్రారంభం కాగానే మళ్లీ డ్రైవ్ చేపట్టాలని, మార్చి 31 నాటికి అన్నిరోడ్లనూ మళ్లీ బాగు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదన్నారు. ఇలాంటి చోట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి నిర్వహణలో ఎలాంటి స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తున్నామనే దానిపై అవగాహన కల్పించాలని తెలిపారు. గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలోనూ అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. చదవండి: ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాలపై నివేదికలు ►ప్రతి మున్సిపాల్టీలో కూడా వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలి. ►ప్రతి మున్సిపాల్టీలో కూడా ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలి. ►మున్సిపాల్టీల వారీగా చెత్త శుద్ధిచేసే ప్రక్రియలో ఉన్న సౌకర్యాలు, వసతులు, మురుగునీటి శుద్ధి.. ఈ అంశాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై నివేదికలు తయారు చేయాలి. ►లేనివాటికి ఆ వసతులను కల్పించుకుంటూ మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్మెంట్లలో ప్రతిమున్సిపాల్టీ సంపూర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలి. ►కృష్ణానది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించింది. గోడకు ఇటువైపున మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►అలాగే రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలు, ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దాలి. ►ప్లాస్టిక్ ప్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ►దీన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. ►ప్లాస్టిక్ నుంచి క్లాత్ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వారికి తోడుగా నిలవాలి. ►రుణాలు ఇప్పించి వారికి అండగా నిలవాలి. ఇప్పించిన రుణాలను సకాలంలో కట్టేవారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలి. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు.. ►జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►కాలక్రమేణా వీటిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. ►పెద్ద కాలనీలు నిర్మాణం పూర్తయ్యే కొద్దీ.. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందుకు సాగాలి. ►ప్రాధాన్యతా క్రమంలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటుచేసి తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి.. ►విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలు అందించారు. ►అంబేద్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు.. ►వీటి తర్వాత విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ►జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమంపై శ్రద్ధపెట్టాలి. ►ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి. ►జిల్లాల వారీగా కలెక్టర్లతో దీనిపై సమీక్ష చేసి, ప్రత్యేక దృష్టిపెట్టాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంపై సమీక్ష ►వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషిచేయాలి. ►ప్రతి ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్నవారికి వైయస్సార్ చేయూత కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నాం. ►ఈ డబ్బు ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషిచేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మునిసిపల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట/నరసరావుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మునిసిపల్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయం వద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో ఒక భవనం కొలతలు తీసుకున్నారు. ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.1.9 లక్షల స్వాధీనం సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్ నేతృత్వంలోని అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని స్పందనలో సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన వెంటనే మునిసిపల్ కమిషనర్ చాంబర్ కిటికీకి పక్కనే రూ.500 నోట్ల కట్టలు రెండు, వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి కనిపించాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ కారులో రూ.50 వేలు దొరికాయి. కొందరు ఉద్యోగుల వద్ద రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు అధికారి లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రస్తుతం కమిషనర్ చూస్తున్నారు. వసూలు చేసిన ఫీజు అధికారుల వద్దే.. నరసరావుపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ అదనపు ఎస్పీ జె.వెంకటరావు ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రతాప్‌కుమార్, ఇతర అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్లాన్ల∙వివరాలను పరిశీలించారు. పాతూరు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఒక నూతన భవనాన్ని టేపులతో కొలతలు తీసుకున్నారు. ఆ సమయంలో మునిసిపల్ కమిషనర్ డి.రవీంద్ర అక్కడే ఉండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంతకు గంటముందే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరినట్లు తెలిసింది. తరువాత ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు టీపీఎస్‌తోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ వెంకటరావు విలేకర్లతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంపై తమకు రెండు ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ తనిఖీల్లో చాలా అవకతవకలను కనుగొన్నట్లు చెప్పారు. ప్లాన్‌కు విరుద్ధంగా, అసలు ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు నియంత్రించలేదని తెలిపారు. అనుమతి ఇచ్చిన ప్లాన్‌కు సంబంధించిన ఫీజును వీరే వసూలు చేసి తమ దగ్గరే ఉంచుకున్నారని చెప్పారు. -
సమ్మె విరమిస్తేనే చర్చలు
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) సమాచారం ఇచ్చినట్లు మంగళవారం ఆయన చెప్పారు. మంత్రుల ముందుంచిన డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరిస్తామని సోమవారం మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కార్మిక జేఏసీకి చెప్పినప్పటికీ కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారని, దీంతో పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఇతర విధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరైతేనే వారితో చర్చిస్తామని ఆయన ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రాత్రి జరిగిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో మంత్రులు సురేష్, బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్మిక జేఏసీతో చర్చించారు. ఇందులో కార్మికులు వెల్లడించిన మొత్తం 23 డిమాండ్లలో ఓహెచ్ఏ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఓహెచ్‌ఏను గతంలో మాదిరిగా రూ.6 వేలు చెల్లించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబట్టారు. గత ప్రభుత్వంలో పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందన్నారు. పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలంటున్నారన్నారు. కానీ, కార్మికులు విధుల్లో చేరితేనే వారితో చర్చించాలని, అంతవరకు చర్చలు ఉండబోవని మంత్రి ఆదిమూలపు తేల్చిచెప్పారు. విధుల్లో సగం మందికి పైగా కార్మికులు సమ్మెకు మద్దతుగా సగంమంది కార్మికులు విధులకు దూరంగా ఉండగా, మిగిలిన సగం మంది విధుల్లో ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండ్రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ మొత్తం ఒప్పంద కార్మికుల్లో సగం మంది సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తించారు. ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని కోరారు పట్టణ ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇక వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్రంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందన
-
AP: వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌లతో కూడిన హై పవర్ కమిటీని సమస్య పరిష్కారం కోసం నియమించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష.. వనరులపై దృష్టిసారించాలని ఆదేశం -
ఆటంకాలున్నా.. అభివృద్ధి బాటే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టి వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. జూలై 15వతేదీ కల్లా మునిసిపాలిటీల్లో రహదారులపై గుంతలు పూడ్చి ఆ వెంటనే జూలై 20 నాటికి అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రెండు లేన్ల రహదారుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్అండ్బీ.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో జరుగుతున్న రహదారుల పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ... సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేడా కచ్చితంగా కనిపించాలి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. గతంలో పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. వీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలి. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఫలితాలు కచ్చితంగా కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలి. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు వెంటనే చేపట్టాలి. రూ.2,205 కోట్లతో మరమ్మతులు ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక పనుల కింద 7,804 కి.మీ. మేర 1,168 పనులు చేపట్టాం. వాటి కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 675 పనులు పూర్తి కాగా మరో 491 కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 62.09 శాతం పనులను రూ.1369 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2,479.61 కోట్లతో 233 పనులు చేపట్టాం. ఇప్పటికే రూ.1,321.08 కోట్ల విలువైనవి పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి. వ్యత్యాసాన్ని వెల్లడించేలా ఫొటో గ్యాలరీలు రోడ్ల నిర్మాణమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ సిద్ధం చేయాలి. 1,843 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 4,635 కి.మీ. మేర రహదారులు మెరుగుపడనున్నాయి. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చురుగ్గా మరమ్మతులు చేపట్టాలి. మునిసిపాలిటీల్లో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న నాడు – నేడు ద్వారా వ్యత్యాసాన్ని తెలియచేసేలా అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం. -
AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’
‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. కనికట్టు కథనాలతో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విషం నింపుతోంది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్న నిజానికి పాతర వేయాలని చూస్తోంది. పాత, మారుమూల శివారు ఫొటోలతో పతాక స్థాయిలో దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రోడ్ల పరిస్థితి నాడునేడు మచ్చుకు కొన్ని ఉదాహరణలతో ‘సాక్షి’ ప్రజల ముందుంచుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని కేబీఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ జంక్షన్ వరకు ఉన్న కేటీ (కొత్తూరుతాడేపల్లి) రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు తొలి ఫేజ్‌లో ఎడమ వైపు భాగంలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అధిక ట్రాఫిక్, కల్వర్టుల నిర్మాణం దృష్ట్యా నిర్మాణ పనులు ఒక వైపు మాత్రమే జరుగుతున్నాయి. పనులు దాదాపు పూర్తయ్యాయి. చిట్టినగర్ జంక్షన్ నుంచి కేబీఎన్ కళాశాల వైపు ఇప్పటికే సర్వే పూర్తవగా చిట్టినగర్ ఏరియాలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలను ‘ఈనాడు’ విస్మరించడం గమనార్హం. విజయవాడలోని కేటీ రోడ్డుపై బురద జల్లుతూ ఈనాడు వేసిన ఫొటో.. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం నెల రోజులుగా నగరాలు, పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులకు నడుం బిగించడాన్ని పట్టించుకోని ‘ఈనాడు’.. పట్టణ రోడ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని శుక్రవారం తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఇప్పటికే 118 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ) గుంతలను గుర్తించిన అధికారులు వాటి మరమ్మతులకు రూ.60.53 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టారు. కొన్నిచోట్ల గుంతలను పూడ్చగా, మరికొన్ని చోట్ల కొత్తగా సీసీ రోడ్లు వేశారు. 33 పట్టణాల్లో నూరు శాతం గుంతలు పూడ్చగా, 21 పట్టణాల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన నగరాలు, పట్టణాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రోడ్ల మరమ్మతుల కోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడే గుంతలను కూడా పూడ్చడంతో పాటు, మున్సిపాలిటీల్లో ఈ అంశాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గుంతలను గుర్తించి వాటిని ఆన్లైన్ చేయడంతో పాటు పూడ్చిన తర్వాత నాడునేడు కింద వెబ్సైట్లో ఉంచుతున్నారు. కానీ ఇవేమీ పట్టని ఆ పత్రిక.. అన్ని చోట్లా ఏక కాలంలో పనులు నిర్వహించడం సాధ్యం కాదని తెలిసీ, విష ప్రచారానికి దిగింది. ఏ మున్సిపాలిటీలో రోడ్ల మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో మాట మాత్రం ప్రస్తావించకుండా, పురపాలక శాఖ వెబ్‌సైట్‌ను సైతం పరిశీలించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. శర వేగంగా పనులు రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, వాటిలో 118 పట్టణాల్లోనే 43,563 గుంతలు ఉన్నట్టు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఇప్పటి దాకా 34,316 గుంతలకు టెండర్లు ఖరారు కావడం.. 21,720 గుంతలను పూడ్చంతో పాటు, కొన్నిచోట్ల బీటీ రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు కూడా వేశారు. అంటే 49.86 శాతం పాట్ హోల్స్‌ను పూడ్చారు. గ్రేటర్ విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లోని రోడ్లకు అత్యధికంగా గుంతలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అధికంగా దెబ్బతిన్న రోడ్లను జీవీఎంసీ, విజయవాడ, గుంటూరులోనే గుర్తించారు. విశాఖ మహానగరంలో 6,679 గుంతలను గుర్తించగా 4,208 (63 శాతం) గుంతలను పూడ్చారు. విజయవాడలో 6,314 పాట్ హోల్స్ ఉండగా, 4,400 (దాదాపు 70 శాతం) పూడ్చారు. గుంటూరు నగరంలో 3,482 గుంతలను గుర్తిస్తే వాటిలో 2,260 గుంతలు (65 శాతం) పూడ్చారు. మిగిలిన యూఎల్బీల్లో సైతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంతల గుర్తింపునకు యాప్ పట్టణాల్లో పాట్ హోల్స్ గుర్తింపునకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది నిత్యం పట్టణ రోడ్లను పర్యవేక్షిస్తూ వారి దృష్టికి వచ్చిన గుంతలను ఎప్పటికప్పుడు యాప్‌లో ఫొటోతో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో ఆ చిత్రం ఏ ప్రాంతంలో ఉందో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా సదరు మున్సిపల్ కమిషనర్‌తో పాటు మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం, సీడీఎంఏ కార్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులకు సైతం చేరుతుంది. గుంతలను పూడ్చిన అనంతరం తిరిగి అదే ప్రాంతంలో నుంచి ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా పనుల ప్రగతి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాప్ పనితీరును పరిశీలించి, వార్డు ఎమినిటీ కార్యదర్శులు సులభంగా వినియోగించేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ పట్టణ స్థానిక సంస్థల్లో రోడ్లను బాగు చేయడమనేది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బాధ్యత. ఈ పనులు నిరంత ప్రక్రియ. 365 రోజులు పనులు చేయాల్సిందే. కేవలం వర్షాకాలం ముందు పనులు చేసి వదిలేస్తే సరికాదు. మరమ్మతు పనులపై సీడీఎంఏలోనూ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం. స్థానికంగా పనులు జరుగుతున్న తీరు, ప్రగతిని తెలుసుకునేందుకు యాప్‌ను కూడా రూపొందించి, అందుబాటులోకి తెచ్చాం. త్వరలో జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్ల మరమ్మతులకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తేస్తాం. -ప్రవీణ్ కుమార్, సీడీఎంఏ అంతటా అదే పరిస్థితి అని ఎలా చెబుతారు? ఒక రోడ్డుకు సంబంధించి నాలుగు ఫొటోలు పెట్టి, ఒంగోలు నగరంలోని రోడ్లన్నీ ఇదే విధంగా ఉన్నాయనటం సమంజసం కాదు. కేశవరాజుకుంట రోడ్డు నిర్మాణ దశలో ఉంది. ఆ రోడ్డుకు పొడిగింపే ముక్తినూతలపాడు రోడ్డు. దీనికి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించింది. – ఎం.సుందరరామి రెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వేగంగా పనులు ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.716 కోట్లతో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. చాలా పనులు పూర్తయ్యాయి. రోడ్డు పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరేట్లో నాలుగు రోజుల కిందటే ఏర్పాటు చేశాం. – మీడియాతో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు విజయనగరం కార్పొరేషన్‌లోని ఆర్అండ్బి రైతు బజారు నుంచి ఉడా కాలనీ మీదుగా అయ్యన్నపేట జంక్షన్ వరకు వెళ్లే రహదారిని విస్తరించాలని రెండేళ్ల క్రితం వీఎంఆర్డీఏ అధికారులు పనులు ప్రారంభించారు. ఆ మార్గంలోని పలు భవనాలకు పరిహారం చెల్లించి తొలగించేందుకు యత్నించగా కొందరు యజమానులు తమకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని విస్మరించి ఈ రోడ్డును అభివృద్ధి చేయలేదని ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. -
తెలంగాణలో మరో 1,433 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్‌లో236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. కాగా ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా మంగళవారం మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడ చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు -
మున్సిపల్ శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
-
మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్‌గా రాజు వెన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్‌గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చాంబర్ ప్రధాన కార్యదర్శిగా ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా సీహెచ్ మంజుల, సలహాదారుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుల కమిటీ సభ్యులుగా బీఎస్ కేశవ్ (గద్వాల), కె.నరేందర్ (షాద్‌నగర్–రంగారెడ్డి), ఎ.నర్సింహ (దేవరకొండ–నల్లగొండ), పి.జమున (జనగామ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ల సమస్యలను సీఎం, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. -
పుట్టగానే ఆధార్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. పిల్లలు జన్మించిన ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకుని.. అదే రోజున ఆధార్‌కు ఎన్రోల్ చేసేలా రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పురపాలక శాఖ జనన నమోదు పోర్టల్‌ను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు అనుసంధానం చేయనుంది. వారం, పదిరోజుల్లోనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు. జననాల పోర్టల్ నుంచి.. ఆస్పత్రులు ఆన్లైన్ ద్వారా ఏ రోజుకారోజు జననాల వివరాలను నమోదు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఆస్పత్రులు శిశువు తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ నంబర్లు, చిరునామా, పుట్టిన తేదీ, సమయం, లింగం, వయసు వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని వినియోగించి.. నవజాత శిశువులకు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్‌ను కేటాయించడానికి రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. జనన నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌కు జనన ధ్రువీకరణ పత్రం డౌన్లోడ్ లింక్‌తోపాటు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ సైతం ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందుతుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఆ ఎన్రోల్మెంట్ నంబర్‌తో మీసేవ కేంద్రం నుంచి ఆధార్‌కార్డును పొందడానికి వీలుంటుందని వివరించారు. పుట్టినబిడ్డలకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ కేటాయింపు ఇప్పటివరకు ఎక్కడా ప్రారంభం కాలేదని.. తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. నీలి రంగు ఆధార్ కార్డు యూఐడీఏఐ ఐదేళ్లలోపు పిల్లల కోసం నీలిరంగులో తాత్కాలిక ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటా సేకరించరు. పిల్లల ఫొటో, తల్లిదండ్రు ల సమాచారం, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను మీసేవ కేంద్రాలు లేదా యూఐడీఏఐ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. ఐదేళ్లు దాటాక బయోమెట్రిక్ డేటా ఇచ్చి శాశ్వత ఆధార్ కార్డును పొందాలి. 15 ఏళ్ల వ యసు తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటా ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు ఊరట.. దేశంలో చాలా సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు కీలకంగా మారింది. వ్యక్తిగత, చిరునామా గుర్తింపులోనూ, పాఠశాలలో ప్రవేశాలలో అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ జారీ చేయనుండటం తల్లిదండ్రులకు ఊరట కలిగించనుంది. -
అధికారుల ఓవరాక్షన్.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..
సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు. సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్ చదవండి: Hyderabad: డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా అధికారులు.. ఇదేం తీరు..! -
మున్సిపల్ అధికారుల దౌర్జన్యం.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నూర్: మున్సిపాలిటీ అనుమతితో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షెడ్డును కూల్చివేస్తామని మున్సిపాల్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడడంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చెన్నూర్ పట్టణంలో గురువారం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల అస్నాద రోడ్డులో జిల్లెల సమత షెడ్డు వేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటోంది. వ్యాపార అనుమతి కోసం మున్సిపాలిటీలో రూ.1,000 చెల్లించి లైసెన్స్ కూడా తీసుకుంది. లైసెన్స్ గడువు ఈ ఏడాది మార్చి 31వరకు ఉంది. మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిజొద్దీన్ సిబ్బంది, జేసీబీ తీసుకుని గురువారం షాపు వద్దకు వచ్చారు. అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారని, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ షెడ్డే తనకు జీవనాధారమని, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే రోడ్డున పడతానని సమత వేడుకుంది. దీంతో రెండు రోజులు గడువు ఇస్తున్నామని, షెడ్డు తొలగించకపోతే మళ్లీ వచ్చి కూల్చేస్తామని తెలిపి వెళ్లిపోయారు. షెడ్డు తొలగిస్తే జీవనోపాధి పోతుందని మనస్తాపం చెందిన సమత పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సమతను స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల అసుపత్రికి తీసుకెళ్లారు. చదవండి: బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి అధికారులు కూల్చివేసేందుకు వెళ్లిన షెడ్డు ఇదే.. పరస్పరం ఫిర్యాదు.. మున్సిపల్ అధికారులు షెడ్డు కూల్చివేస్తామని, మహిళ అని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడడంతో సమత పురుగుల మందు తాగిందని, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు మమత, ఆమె కుటుంబ సభ్యులు అటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ ఖాజామోహీజొద్దీన్ ఫిర్యాదు చేసినట్లు చెన్పూర్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించండి నోటీసులు ఇచ్చాం... అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో రెండుసార్లు సమతకు నోటీసులు ఇచ్చాం. అక్రమ కట్టడాలు కూల్చివేతలో భాగంగా గురువారం షెడ్డు తొలగించాలని చెప్పడం జరిగింది. మరో రెండు రోజులు గడువు సైతం ఇచ్చాం. మా విధులను మేము నిర్వహించాం. దౌర్జన్యం చేయలేదు. జిల్లా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించకతప్పదు. – ఖాజా మోహిజొద్దీన్, -మున్సిపల్ కమిషనర్, చెన్నూర్ -
Telangana: ఆ ‘ట్రిపుల్’తోనే ట్రబుల్
సాక్షి, హైదరాబాద్: ఆ మూడు విభాగాలు ప్రజలకు అత్యవసరమైన విభాగాలు. వాటితో నిత్యం ఏదో ఒక పని ఉంటుంది. అయితే, ఆ విభాగాలపై ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి నేరుగా రావడంతోపాటు, ఏసీబీ, విజిలెన్స్... ఇలా పలు వ్యవస్థల ద్వారా అందుతూనే ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రతి నెలా నమోదు చేసే కేసుల్లోనూ ఈ శాఖలవే ఎక్కువ ఉండటం ఆందోళన రేపుతోంది. ఆ మూడు శాఖలు ఏంటంటే.. మున్సిపల్–అర్బన్ డెవలప్ మెంట్, పోలీస్, రెవెన్యూ, అవినీతి నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ నుంచి నివేదిక తెప్పించుకొని చర్యలకు సిఫారసు చేసే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ఈ విభాగాలపైనే ఫిర్యాదులు ఎక్కువ రావడం ఆందోళన రేపుతోంది. ఆయా శాఖల్లో ఎంత మందిపై ఫిర్యాదులు వచ్చాయి, ఎంతమందిపై చర్యలకు సిఫారసు చేశారన్న అంశాలను విజిలెన్స్ కమిషన్ త్రైమాసిక నివేదికలో వివరించింది. విభాగాల వారీగా...: రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ప్రభుత్వంలోని ప్రతీ విభాగం నుంచి అవినీతి, శాఖాపరమైన తప్పులు చేసిన వారిపై చర్యల నిమిత్తం కేసులు వస్తుంటాయి. అందులోభాగంగా గత జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 175 ఫైళ్లు వచ్చినట్టు విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు త్రైమాసికానికి సంబంధించి మరో 62 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంది. మొత్తం కేసుల్లో మున్సిపల్ శాఖవి 43, హోంశాఖ 38, రెవెన్యూ 27, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖవి 22 ఉన్నాయి. ఆ తర్వాత ఇరిగేషన్, రోడ్డు రవాణా శాఖలకు సంబంధించి ఫిర్యాదులున్నాయి. వీటిలో లంచం తీసుకుంటూ పట్టుబడినవి, ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టినవి, అధికార దుర్వినియోగం చేసిన కేసులున్నాయి. విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుల్లో... రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు కాకుండా నేరుగా విజిలెన్స్ కమిషన్‌కే నేరుగా ఫిర్యాదులు రావడం సహజం. అయితే ఇలా గత త్రైమాసికంలో మొత్తంగా 126 ఫిర్యాదులు 24 విభాగాలకు సంబంధించిన అధికారులపై వచ్చాయి. అందులో అత్యధికంగా 36 మున్సిపల్ శాఖవారిపైనే రావడం సంచలనం రేపుతోంది. ఆ తర్వాత రెవెన్యూలో 30 ఫిర్యాదులు రాగా, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్లోని అధికారులపై 10, హోం శాఖపై 8 ఫిర్యాదులు అందినట్టు విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. వీటిలో 112 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా, మిగిలిన 14 మందిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత విభాగాలను కమిషన్ ఆదేశించింది. మున్సిపల్ విభాగంలో ముగ్గురు గెజిటెడ్ అధికారులను, అటవీ శాఖలో ఒక గెజిటెడ్ అధికారి, ఒక నాన్ గెజిటెడ్ అధికారిని, రెవెన్యూలో ఒక నాన్ గెజిటెడ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు నివేదికలో పొందుపరిచారు. 32 మందిపై ప్రాసిక్యూషన్... 32 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ, ఇతర దర్యాప్తు విభాగాలు పంపిన ప్రతిపాదనలకు విజిలెన్స్ కమిషన్ అనుమతిచ్చింది. అందులో రెవెన్యూ అధికారులు ఆరుగురు ఉండగా, హోంశాఖ నుంచి నలుగురు, న్యాయశాఖలో ముగ్గురు, పీఆర్ విభాగంలో ముగ్గురున్నారు. ఇకపోతే శాఖాపరమైన విచారణలో 158 మందిపై సంబంధిత విభాగాల్లోని ఉన్నతాధికారులను చర్యలు తీసుకునే అధికారిగా నియమించింది. ఇలా 158 మంది అవినీతి అధికారులపై చర్యలకు సిఫారసు చేసిన జాబితాలో 69 మంది అధికారులతో మున్సిపల్ శాఖ మొదటి స్థానంలో ఉండగా, 49 మందితో రెవెన్యూ రెండో స్థానంలో ఉంది. ఇరిగేషన్లో 9 మంది, రెవెన్యూ (పీఅండ్‌ఈ)లో ఐదుగురు, హోం శాఖలో ముగ్గురు, అటవీ శాఖలో ఐదుగురు ఇలా ఇతర విభాగాల్లో మిగిలిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. 12 విభాగాల్లో 82 మందిపై మైనర్, మేజర్ పెనాల్టీ కింద చర్యలకు సిఫారసు చేసినట్టు కమిషన్ నివేదికలో వెల్లడించింది. -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్‌లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్లకు మంచి స్పందన
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని వసతులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్లకు తొలిరోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆన్లైన్ బుకింగ్ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెబ్సైట్ ప్రారంభించిన కొద్దిసేపటికే దరఖాస్తులు వచ్చాయని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వీపనగండ్ల రాముడు తెలిపారు. తొలివిడత ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఔట్లలో 150, 200, 240 చదరపు గజాల్లో 3,894 ప్లాట్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం సాయంత్రానికి 643 మంది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడంతోపాటు మొదటి విడతగా 10% ఫీజును చెల్లించారు. మరో 97 మంది మొత్తం ప్లాట్ ధరను ఆన్లైన్లో చెల్లించి 5 శాతం రాయితీ పొందారు. నవులూరు లేఔట్లో 200, 240 చ.గజాల్లో 538 ప్లాట్లను అందుబాటులో ఉంచగా.. మొదటిరోజు 210 మంది ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించారు. 17 మంది మొత్తం ప్లాట్ ధర చెల్లించారు. భరోసాగా ముందుకొస్తున్నారు సంక్రాంతి సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చాం. మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో లాభాపేక్ష లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. జగనన్న టౌన్‌షిప్స్‌లో ప్రతీ లేఅవుట్ నిబంధనల మేరకు, క్లియర్ టైటిల్‌తో ఉంటుంది. ప్రభుత్వమే ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. భరోసాగా ముందుకొస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక టౌన్షిప్ ఉండాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ చేపడతాం. ప్రజలకు మంచి జరుగుతుంటే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
‘టౌన్’లో ప్రక్షాళన
సాక్షి, అమరావతి: మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని పత్రాలున్నా ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించక విసిగెత్తిపోయే పరిస్థితులకు తెరదించి దరఖాస్తు ఏ దశలో ఉందో కిందిస్థాయి సిబ్బంది నుంచి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉన్నతస్థాయి అధికారుల వరకు తెలుసుకునేలా మార్పులు చేశారు. ఐదేళ్ల క్రితమే ఆన్లైన్ విధానం వచ్చినా సాఫ్ట్ వేర్ లోపాలతో కొందరు సిబ్బంది దరఖాస్తు దారు లకు చుక్కలు చూపిస్తున్నారు. మున్సిపల్ ఉన్నతా ధికారుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మెనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్) లో సమూల మార్పులు చేశారు. మాన్యువల్ విధా నానికి స్వస్తి పలికారు. ఆన్లైన్ వల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ విభాగం అధికారి వద్ద ఎన్నిరోజులు ఉందో కూడా వెల్లడి కానుంది. ఒకవేళ ఏదైనా ఫైల్‌ను నిలిపివేస్తే దరఖాస్తుదారుడికి నిర్ణీత గడువులోగా కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పరిశీలన.. ఫీజుల చెల్లింపు సాధారణంగా ఇంటి నిర్మాణం లేదా లే అవుట్ పనులకు టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి పొందిన తర్వాత స్థానిక అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించాలి. ఈ దశలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ‘పోస్ట్ వెరిఫికేషన్’ విధానాన్ని రద్దు చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తు పత్రాల పరిశీలన అనంతరం మాస్టర్ ప్లాన్ నిబంధనలకు లోబడి ఉంటే వెంటనే నిర్దేశించిన ఫీజు చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించగానే ఆటోమెటిక్‌గా సంబంధిత ప్లాన్‌తోపాటు నిర్మాణ ఉత్తర్వులను సైతం దరఖా స్తుదారులు డౌన్లోడ్ చేసుకునేలా మార్పులు చేశా రు. ఈ విధానం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సం స్థలు, 18 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అమ ల్లోకి వచ్చింది. నిర్మాణ ప్లాన్‌ను సైతం ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ మార్పులతో అనవసర జోక్యానికి, ఆలస్యానికి తావులేకుండా చేశారు. ఇప్పటివరకు ఉన్న పోస్ట్ వె రిఫికేషన్ విధానం, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను రద్దుచేసి క్షేత్రస్థాయిలో అక్రమాలు జరగకుండా వా ర్డు ప్లానింగ్ సెక్రటరీల సేవలను వినియోగిం చుకుంటున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆన్లైన్ విధానంలోనే నోటీసులు జారీ చేస్తున్నారు. 15 రోజుల్లోనే అనుమతులు టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులు తెచ్చి అనుమతులు వేగంగా ఇస్తుండడంతో నిర్మాణ రంగానికి మేలు జరుగుతోంది,. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పత్రాలు సరిగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అవసరమైతే అధికారులను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా, అనుమతులు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారు. – వీపనగండ్ల రాముడు, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ -
అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ నజర్.. బీపాస్’తప్పనిసరి.. బైపాస్ లేదు!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త నిర్మాణాలన్నింటికీ ‘టీఎస్–బీపాస్’ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల అనుమతితో రెండు అంతస్తులకన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉన్న కట్టడాలన్నీ అక్రమమేనని ప్రకటించింది. 2020 నవంబర్లోనే టీఎస్–బీపాస్ విధానం అమలులోకి వచ్చినప్పటికీ కొత్త పురపాలికల్లో గ్రామ పంచాయతీల అనుమతితోనే నిర్మాణాలు జరుగుతున్నట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. దీంతో అన్ని నిర్మాణాలకు కొత్త మున్సిపల్ చట్టం కింద అనుమతులు పొందాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు (మెమో నంబర్ 420) జారీ చేశారు. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అలాంటి భవనాలు నిర్మించిన వారంతా టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం గ్రామ పంచాయతీల అనుమతితో బహుళ అంతస్తులు.. గ్రామ పంచాయతీ అనుమతితో జీ+2కు మించి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రెండంతస్తులకు మించి భవనాలు నిర్మించాలంటే హెచ్ఎండీఏ లేదా ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. అయినా హైదరాబాద్ శివార్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల సమీప గ్రామాల్లో పంచాయతీల అనుమతితో రియల్టర్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కళాశాలలు, అపార్ట్మెంట్లు, హోటళ్లు తదితర నిర్మాణాలన్నీ గ్రామ పంచాయతీల అనుమతితోనే సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018లో కొత్తగా 61 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటితోపాటు 131 గ్రామ పంచాయతీలను ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీల అనుమతుల పేరుతో కొత్త మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల అండతో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగినట్లు దుండిగల్‌లోని ఓ రియాల్టీ సంస్థ మోసంతో వెలుగులోకి వచ్చింది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో.. దీంతో అన్ని కొత్త మున్సిపాలిటీల్లో నిర్మించిన కట్టడాల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చేసే పనిలో కూడా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అరికట్టకుండా ప్రోత్సహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నిర్మించిన కట్టడాలకు కూడా టీఎస్–బీపాస్ ద్వారా అనుమతి పొందాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి కోసం ఫీజు చెల్లించినప్పటికీ కొత్తగా అనుమతి రుసుము కట్టాలని, గ్రామ పంచాయతీకి చెల్లించిన మొత్తాన్ని తరువాత సర్దుబాటు చేస్తామని పురపాలక శాఖ డైరెక్టర్ తెలిపారు. అక్రమ కట్టడాలపై చర్యలకు అదనపు కలెక్టర్లకు ఆదేశాలు.. నూతన మున్సిపల్ చట్టం కింద అనుమతి పొందని నిర్మాణాలను గుర్తించి ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా జీ+2కన్నా ఎక్కువ అంతస్తుల్లో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. -
దేశమంతా బీ‘పాస్’ అనాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సహా పట్టణాల్లో భవన నిర్మాణ, లేఅవుట్లకు సరళతర అనుమతుల కోసం అమలు చేస్తున్న టీఎస్–బీపాస్ విధానాన్ని సైతం టీఎస్–ఐపాస్ తరహాలో దేశానికే ఆదర్శంగా నిలిచే వ్యవస్థగా మార్చాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు తెచ్చిన ఈ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్–బీపాస్ విధానం క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం అమల్లో తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా వాటిని అధిగమించినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం టీఎస్–బిపాస్‌ను పౌరులు ఉపయోగిస్తున్న తీరును గణాంకాలతో సహా తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎస్–బీపాస్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసేలా వెబ్సైట్లో మార్పులు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం, టోల్ ఫ్రీ నంబర్‌కు విస్తృత ప్రచారం వంటి చర్యలను చేపట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పట్టణ ప్రగతితో పురోగతి... ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు, అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాల పురోగతి గురించి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కోసం ప్రతి నెలా పురపాలికలకు ప్రత్యేక నిధులను అందించేందుకే టీయూఎఫ్‌ఐడీసీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయగలుగుతున్నట్లు వివరించారు. మాస్టర్ ప్లాన్ల తయారీలో వేగం పెంచండి... రాష్ట్రంలోని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ల తయారీపై మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ల తయారీ ప్రక్రియ ఇప్పటికే అనేక పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని అధికారులు వివరించారు. మరోవైపు ఔటర్ రింగ్‌రోడ్డు పరిధి లోపల పురపాలక శాఖ తరఫున కొనసాగిస్తున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సైతం కేటీఆర్ సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్ఆర్డీపీ వంటి అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ వారంలోనే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మరో రెండు ఫ్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను ఆదేశించింది. సాధారణంగా హెచ్ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు జీ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. - అంతకు మించి భారీ నిర్మాణాలు, అనుమతి లేని విల్లాలను కూల్చి వేయాలని ఆదేశించింది. కాగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలపై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం నాళాల అభివృద్ధి పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నాలలను పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. నాళాలపై నిర్మణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్ -
నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్
సాక్షి, హైదరాబాద్: నయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ నజర్ పెట్టింది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో సర్పంచ్, పాలకమండలితోపాటు కార్యదర్శులుగా వ్యవహరించినవారు ఇచ్చిన ‘అనుమతుల’తో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల దుండిగల్‌లో నకిలీ అనుమతితో సాగిన నిర్మాణం వెలుగులోకి రావడంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది. ఇటీవల ఏర్పాటైన 68 కొత్త మునిసిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన 131 గ్రామ పంచాయతీల్లో 2018 తర్వాత పాత తేదీల అనుమతితో వెలిసిన వెంచర్లు, నిర్మించిన భవనాలు, ఇళ్లు, తదితర కట్టడాల వివరాలను తెప్పించింది. ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లపై కోర్టుల్లో వివాదాలున్న నేపథ్యంలో కొత్త విధానం ద్వారా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేలా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం కష్టంగా మారడంతో న్యాయ పరమైన చిక్కులు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లోనే ఈ కొత్తవిధానం వర్తించేలా రూపొందించాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఏ సర్వే నంబర్లో ఏ స్థలానికి ఎప్పుడు అనుమతి మంజూరైంది? నిర్మాణం సాగిన వివరాలను కూడా ఇన్‌వార్డు, అవుట్వార్డుల్లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ శివార్లు, ఇతర పట్టణాల సమీపంలో... గ్రేటర్ హైదరాబాద్ శివార్లన్నీ గతంలో గ్రామపంచాయతీలే. శివార్లలో గత 20 ఏళ్ల నుంచి వేల సంఖ్యలో లేఅవుట్లు వెలసి కాలనీలు ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016 నుంచి మళ్లీ శివారు పంచాయతీల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు వచ్చాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లోనూ పాత తేదీల ‘అనుమతి పత్రాల’తో కొత్త లేఅవుట్లు వెలిశాయి. దీంతో ఐటీ కారిడార్ పరిధిలోని కిస్మత్పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, కోకాపేట, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి, మంచిరేవుల, బండ్లగూడ, దుండిగల్, పోచారం ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్కు లోపలున్న స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతిపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగి నట్లు, ఇంకా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, పిర్జాదిగూడ, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పే ట, జిల్లెలగూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం, జల్పల్లి, కోకాపేట, పోచారం, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, కరీంనగర్లో కొత్తపల్లి, మహబూబ్‌నగర్‌లో భూత్పూరు మొదలైన మున్సిపాలిటీల్లో ఒక ఫ్లోర్ అనుమతితో రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించి నట్లు, పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం లే అవుట్లో వదిలేసిన స్థలాలు కూడా ఆక్రమణలకు గురై భవనాలు వెలిసినట్లు పురపాలక శాఖ గుర్తించింది. -
కుప్పం విడిచి వెళ్లండి
కుప్పం/చిత్తూరు అర్బన్: ఎన్నికల నేపథ్యంలో కుప్పం మునిసిపల్ కార్యాలయం వద్ద సోమవారం దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలపై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదుచేశారు. కుప్పం పోలీస్‌స్టేషన్ వద్ద డీఎస్పీ గంగయ్య మంగళవారం మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పారు. కుప్పం 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ప్రకటించడంతో కమిషనర్ చిట్టిబాబుపై సోమవారం దాడికి యత్నించి, ఆయన చాంబర్ అద్దాలు ధ్వంసం చేసి టీడీపీ అల్లరిమూకలు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. కమిషనర్ విధులకు విఘాతం కలిగించడమే కాక ఆయనపై ఇష్టంవచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు విధులు చేయకుండా తనకు ఆటంకం కలిగించారంటూ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా టీడీపీ నేతలు మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మనోహర్, పీఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ దొరబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు మరికొందరిపై కేసులు నమోదుచేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వెళ్లకపోతే చర్యలు: క్రిమినల్ కేసులు నమోదైన ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు వెంటనే జిల్లా వదిలి వెళ్లిపోవాలని డీఎస్పీ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇతర జిల్లాలకు చెందిన వారు కుప్పం వదిలివెళ్లకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. -
ఒకేసారి 15 మందికి..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ల నుంచి మొదలుకొని స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2 స్థాయి మున్సిపల్ కమిషనర్ల వరకు స్థానభ్రంశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఒకేసారి 15 మందికి స్థానభ్రంశం కల్పించారు. త్వరలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశముంది. మున్సిపల్ బదిలీలు ఇవే.. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా.. జీహెచ్ఎంసీలోనే అదనపు కమిషనర్‌గా ఉన్న సీహెచ్ నాగేశ్వర్‌ను మీర్‌పేట కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) రామకృష్ణారావు.. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ పి.రవీందర్ సాగర్ మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డిని నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. సీడీఎంఏ సూపరింటెండెంట్ ఎస్.వి.జానకిరామ్ సాగర్‌ను గద్వాల మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించగా.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్ కె.జయంత్కుమార్రెడ్డిని షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్‌రెడ్డిని ఆదిబట్ల మున్సిపాలిటీకి బదిలీ చేయగా.. గుండ్లపోచంపల్లికి కమిషనర్‌గా డి.లావణ్యకు పోస్టింగ్ ఇచ్చారు. టీయూఎఫ్ఐడీసీ ఎండీ ఎంఎన్ఆర్ జ్యోతిని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్‌గా.. సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ కె.ఫల్గున్కుమార్ను మణికొండ మున్సిపాలిటీకి కమిషనర్‌గా నియమించారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఎస్.జయంత్‌ను సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్‌గా నియమించగా.. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ మహ్మద్ యూసఫ్‌ను ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫీయుల్లా నియమితులయ్యారు. డీఎల్పీఓ ఎ.జ్యోతిరెడ్డిని జవహర్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. -
దుర్ఘటన జరిగితే సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: పురపాలికల పరిధిలో జరిగే అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతు పనుల వర్క్సైట్లలో ఇటీవల వరుస దుర్ఘటనలు జరిగి ప్రాణనష్టం సంభవించడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ సీరియస్ అయింది. ఏదైనా ఘటన జరిగి ప్రాణనష్టం సంభవించినా, ఎవరైనా గాయాలపాలైనా.. అందుకు కారణమైన క్షేత్రస్థాయి సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వీరితో సహా సంబంధిత కాంట్రాక్టర్/నిర్మాణ సంస్థ అధిపతిపై క్రిమినల్ చర్యలు కేసులు పెట్టాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. హైదరాబాద్‌లో ఇటీవల రాత్రి వేళలో నిబంధనలకు విరుద్ధంగా మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు గల్లంతై మరణించడం.. అభివృద్ధి పనుల కోసం తీసిన గుంతలను పూడ్చకపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు వాటిలో పడి మృతి చెందడం వంటి ఘటనలు జరిగాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటనలు జరిగినట్లు పురపాలక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో వర్క్సైట్లలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల విషయంలో మార్గదర్శకాలను ప్రకటిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతిమ బాధ్యత కమిషనర్లదే.. : పురపాలికలు రోజువారీగా చేపట్టే నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ క్లీనింగ్, వీధి దీపాలు వంటి పనులతో పాటు ఫ్లై ఓవర్ల నిర్మాణం వరకు అన్ని రకాల పనుల సైట్లలో పౌరులు/కార్మికులు/ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, నిర్వహణ పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నా, దీనిని సాకుగా తీసుకుని సిబ్బంది, విభాగాధిపతులు రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు. పురపాలికల పరిధిలోని వర్క్సైట్ల వద్ద అంతిమంగా రక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. తవ్వకాలు జరిపేటప్పుడు కనీసం 1.5 మీటర్ల ఎత్తుతో బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి ఎల్ఈడీ లైట్లు బిగించాలని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు 100 మీటర్ల దూరంలోనే డేంజర్ సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. -
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ వ్యవస్థపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలని అందుకు మౌళిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తాగునీటికి సమస్య లేకుండా చేశామని, తాగునీటి సమస్య 90 శాతం పూర్తి చేయడంతోపాటు విద్యుత్ ఇబ్బందులు కూడా లేకుండా చేసి అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3,866.21 కోట్లు మంత్రివర్గం కేటాయించిందని వెల్లడించారు. నగరంలో కొత్తగా 2 లక్షల వాటర్ కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగరంలో 20 శాతంపైగా నీటిని రీయూస్ చేస్తున్నట్లు వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్కై వేలు నిర్మించడానికి అనుమతికి ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రూ.1,200 కోట్లతో 137 ఎంఎల్డీ కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మురుగునీటి శుద్ది, తిరిగి ఉపయోగించడానికి కాలుష్య నియంత్రణ బోర్డ్, వాటర్ బోర్డ్‌తో కలిసి కొత్త పాలసీని తెస్తామని కేటీఆర్ వివరించారు. చదవండి: Jubilee Hills:వాష్‌రూమ్‌లో స్పై కెమెరా: వన్ డ్రైవ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు -
రూ. 500 కోట్లతో పట్టణ రోడ్లకు మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వం మునిసిపాలిటీల్లో అసంపూర్తిగా నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలు, ఇతర పనుల వల్ల చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిని పట్టణ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. 1,500 కి.మీ. మేర మరమ్మతులు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.500 కోట్లు వెచ్చించనుంది. దీన్లో విజ యవాడ, గుంటూరు, విశాఖపట్నంసహా 17 నగరపాలక సంస్థల్లో చేపట్టే పనులకు రూ.350 కోట్లు వెచ్చిస్తారు. మిగిలిన 106 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు రూ.150 కోట్లు కేటాయించారు. మొత్తంగా 1,500 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనల్ని సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే చేపడతాం నగరాలు, పట్టణాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరు నాటికి సాంకేతికపరమైన కార్యక్రమాలు పూర్తి చేసి.. వచ్చే నెలలో వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – డాక్టర్ వి.చంద్రయ్య, ఈఎన్సీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం -
ఈఎస్ఆర్ నమోదుకు గడువు మూడు రోజులే
సాక్షి, అమరావతి: గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మునిసిపల్ టీచర్ల సర్వీస్ రిజిస్టర్ అప్డేట్కు ఇటీవల మున్సిపల్ శాఖ నడుంబిగించింది. మునిసిపల్ టీచర్స్ యూనియన్ నాయకుల వినతి మేరకు సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడంతోపాటు, ఎంప్లాయిస్ సర్వీస్ రిజిస్టర్ (ఈఎస్ఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఈ నెల 2న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 9 తేదీలోగా పూర్తిచేయాలని అందులో పేర్కొన్నారు. నిజానికి.. ఉద్యోగం ప్రారంభం నుంచి ఏటా పొందే ఇంక్రిమెంట్లు, పీఆర్సీ, పదోన్నతులు, సెలవులు వంటి సమగ్ర సమాచారం పొందుపరిచే అధికారిక పుస్తకమే సర్వీస్ రిజిస్టర్. దీని స్థానంలో ఈఎస్ఆర్ ఆన్లైన్ పోర్టల్ విధానాన్ని 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,115 మున్సిపల్ స్కూల్స్‌లో 13వేల మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. అయితే.. చాలా మున్సిపాలిటీల్లో సర్వీస్ రిజిస్టర్ నిర్వహణను అనేక ఏళ్లుగా గాలికొదిలేశారు. ఉదా.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 500 మందికి పైగా టీచర్లు పనిచేస్తుండగా వీరి సర్వీస్ రిజిస్టర్‌ను గత ఐదేళ్లకు పైగా అప్డేట్ చేయలేదు. ఫలితంగా ఈ నెల తొమ్మిదో తేదీలోగా సర్వీస్ రిజిస్టర్ అప్డేట్, ఈఎస్ఆర్ పోర్టల్‌లో అప్లోడ్ అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. డీడీఓ పవర్ లేకనే స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉండే జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో హెడ్మాస్టర్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీఓ)గా వ్యవహరిస్తారు. హెడ్ మాస్టర్ తన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సర్వీస్ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ సర్వీస్ రిజిస్టర్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే, మున్సిపల్ స్కూల్స్‌లో హెడ్మాస్టర్లు డీడీఓలుగా ఉండటంలేదు. మున్సిపాలిటీలో పనిచేసే ఓ అధికారి డీడీఓగా ఉండటం, ఇతనే మున్సిపాలిటీలో పనిచేసే అందరు ఉద్యోగులకు డీడీఓగా వ్యవహరిస్తుంటారు. ఆ అధికారిపై పనిభారం పెరిగి సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ సరిగా ఉండటంలేదనే ఆరోపణలున్నాయి. హెడ్మాస్టర్లను డీడీఓలుగా ఉంచాలి టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొన్నేళ్లుగా వీటి నిర్వహణలేదు. తొమ్మిదో తేదీ గడువులోగా ఈఎస్‌ఆర్‌ల నమోదు పూర్తికాదు. కాబట్టి గడువు పెంచి, టీచర్లను భాగస్వాములుగా చేసుకుని నమోదు ప్రక్రియ చేపట్టాలి. హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలివ్వాలి. – రామకృష్ణ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
అధికారులను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటు దక్కడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా 9 నగరాలు మాత్రమే వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించగా వాటిలో 3 నగరాలు ఏపీ నుంచి అర్హత సాధించాయని సీఎం జగన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. (చదవండి: ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’) గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వాటర్ ప్లస్ అంశాన్ని మంత్రి బొత్స తెలిపారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అధికారులను అభినందించిన అనంతరం సీఎం ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీల్లో అవి అమలయ్యేలా చూడాలని చెప్పారు. పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయిని చేరుకోవాలని అభిలషించారు. చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్.. భయాందోళనలో స్థానికులు
పశ్చిమ గోదావరి: భీమవరంలో ఓ అపార్ట్మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో అపార్ట్మెంట్ ఎప్పుడు కూలుతుందో.. అని దానిలో నివాసం ఉండేవారు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్మెంట్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అపార్ట్మెంట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండేవారు జాకీలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అపార్ట్మెంట్లో పిల్లర్లు విరిగి భారీ శబ్దలు రావడంతో నివాసం ఉండే వారు రోడ్డుపైకి పరుగులు తీశారు. 2004లో కట్టిన ఈ అపార్ట్మెంట్లో 20 కుటుంబాలు వరకూ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు.. అందులో ఉండేవారిని ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యతా లోపం వల్ల అపార్ట్మెంట్ ఎక్కడికక్కడ బీటలు తీసింది. దీనికి మరమ్మత్తులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో అందులో ఉన్న వారిని ఖాళీ చేయించడం ఒక్కటే మార్గంలా కనబడుతుంది. లక్షలు పోసి కొనుక్కున్న అపార్ట్మెంట్ ఇలా కూలిపోవడానికి సిద్ధంగా ఉండటంతో అందులో ఉన్న వారు ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారు. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ప్రభుత్వ భూముల సేకరణ
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికాబద్ధమైన ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ లేఅవుట్లు) నిర్మాణానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి భూములను గుర్తించి ముందస్తుగా మునిసిపల్ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి అందుకు ఉపయోగించకుండా ఉన్న భూములను సేకరించాలని ఆదేశించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి భూములను క్రమబద్ధీకరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు నేరుగా ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అలాంటి భూముల వివరాలను సీసీఎల్ఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం మాత్రమే కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవదాయ, వక్ఫ్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంబంధిత భూములు, పర్యావరణ సున్నితమైన భూములను ఈ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. చెరువు, కాలువ కట్టలు, నీటి వనరులున్న భూములు, అడవులతో నిండిన కొండ ప్రాంతాలతోపాటు అభ్యంతరకరమైన ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనిటీ పోరంబోకు భూములను సైతం సేకరించవద్దని ఆదేశించారు. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాస స్థలాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనుంది. -
జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ లే అవుట్లకు ప్రభుత్వ భూములు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ గృహాల లే అవుట్లకు ప్రభుత్వ భూములు కేటాయించింది. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఏప్రిల్ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. -
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్ అధికారులను చేపట్టారు. అయితే రవీంద్ర కల్సించుకుని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా వారు ఎంత చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్న కారణంగా కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
జీవో 19 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: మంగళగిరి మునిసిపాలిటీ, తాడేపల్లి మునిసిపాలిటీలను విలీనం చేసి మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 19 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 19పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లకు నోటీసులిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీవో 19ని సవాలు చేస్తూ తాడేపల్లి మండలం, చిర్రావూరుకు చెందిన సీర్ల లాల్‌చంద్, మరో ముగ్గురు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. -
ఎల్ఆర్ఎస్ ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్!
సాక్షి, హైదరాబాద్: అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లతోపాటు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (ఖాళీ స్థలాల పన్ను) పడబోతోంది. ఈ రెండు కేటగిరీల ప్లాట్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ స్పష్టం చేసింది. నిర్మాణాలకు అనువైన/ నిర్మాణాలు అనుమతించదగిన ఖాళీ స్థలాలపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 సెక్షన్ 94(ఏ) పేర్కొంటోందని, ఆయా ప్లాట్లపై ఈ మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ మినహా), మున్సిపాలిటీల కమిషనర్లను తాజాగా పురపాలక శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. లేఅవుట్ల అప్రూవల్స్ జారీ/ ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించే సమయంలో సంబంధిత ఖాళీ స్థలాల మదింపు (అసెస్మెంట్) చేసే సమయంలో ఈ పన్ను విధించాలని కోరింది. మార్కెట్ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా, 0.20 శాతానికి మించకుండా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల నిబంధనలు–2020 చెబుతు న్నాయి. ఈ మేరకు పన్ను విధించే అంశాన్ని సం బంధిత మున్సిపాలిటీల పాలక మండలి ముందు ఉంచి ఆమోదం పొందాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఈ పన్ను రేట్లను సైతం శాఖ పోర్టల్‌లో నవీకరించాలని కోరింది. మదింపు చేపట్టి అడ్వాన్స్‌గా... రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గతేడాది ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)–2020 ప్రవేశపెట్టగా, గడువులోగా మొత్తం 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామ పంచాయతీల పరిధి నుంచి 10.83 లక్షలు, మున్సిపాలిటీల పరిధి నుంచి 10.60 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 4.16 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న 14.75 లక్షలకు పైగా ప్లాట్లు/లేఅవుట్ల యజమానులపై సమీప భవిష్యత్తులో ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయి. ఆయా ప్లాట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ సమయంలోనే పన్నుల మదింపు సైతం చేపట్టి అడ్వాన్స్‌గా పన్నులు కట్టించుకోనున్నట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం -
మునిసిపల్ స్కూళ్లలో ఆన్లైన్ బోధన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించింది. రాష్ట్రంలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 2,110 మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలమంది విద్యార్థులున్నారు. వీరికి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పదో తరగతి విద్యార్థులకు విజయవంతంగా ఆన్లైన్ తరగతులు రాష్ట్రంలో ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్లైన్ తరగతులు విజయవంతమయ్యాయి. విజయవాడ, తిరుపతి, ఒంగోలు నగరాలు, శ్రీకాళహస్తి, నరసాపురం మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌లో ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేయడంతో 33 వేలమంది విద్యార్థులు లబ్ధిపొందారు. దీంతో అన్ని మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయమని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మొదటి దశలో ఏడాదిపాటు లైసెన్సుల కొనుగోలుకు మునిసిపాలిటీల సాధారణ నిధులు వినియోగిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనన్ని లైసెన్సులను కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాల కనీసం 5 జూమ్ లైసెన్సులు, మొబైల్ స్టాండ్, బోర్డులు కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోళ్ల ప్రతిపాదనలను ఈ నెల 28లోగా నివేదించాలని, జూన్ 30 నాటికి కొనుగోలు చేయాలని పురపాలకశాఖ సూచించింది. తరువాత ముందుగా బ్రిడ్జ్ కోర్సులు, అనంతరం సిలబస్‌ను అనుసరించి తరగతులు నిర్వహిస్తారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, మునిసిపల్ స్థాయిల్లో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీ స్థాయి సెల్లో మునిసిపల్ మేనేజర్, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, విద్యా సూపర్వైజర్లు, వార్డు విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. -
పదిరోజుల్లో మారాలి: సీఎం కేసీఆర్
జిల్లాను దత్తత తీసుకుంటా... నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుని, పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటా. అదనపు కలెక్టర్, నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం 24 అంతస్తుల్లో ఆస్పత్రి.. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తులతో, ఆధునిక సదుపాయాలతో గ్రీన్ బిల్డింగ్‌గా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తం. వైద్యం కోసం రోగులు హెలికాప్టర్లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలిప్యాడ్ నిర్మిస్తం. సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కంకణబద్ధులు కావాలని... గ్రామాలు, పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ప్రకటించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉందని, ఏమైనా తప్పులుంటే ఆలోగా సరిదిద్దుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదివారం రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కావలసినంత సమయమిచ్చా.. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) కష్టపడి పనిచేస్తున్నా ఆశించినంత పని జరగట్లేదని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కావలసినంత సమయమిచ్చాకే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నానని, దానికి ముందు మరోసారి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుందామని సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులు, సర్పంచులను సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ వారు అని కూడా చూడవద్దని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అదనపు కలెక్టర్‌కు తక్షణమే రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అభివృద్ధి కోసం అందరి భాగస్వామ్యం రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఒక జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హరితహారం ప్రారంభించిన పది పదిహేను రోజుల్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను పూర్తి చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ 24 అంతస్తులతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 24 అంతస్తులతో, ఆధునిక సాంకేతిక సదుపాయాలతో, గ్రీన్ బిల్డింగ్‌గా ఆ ఆస్పత్రిని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం కోసం రోగులు హెలికాప్టర్లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలీప్యాడ్ నిర్మించాలని సూచించారు. కెనడా మోడల్లో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్ వెంటిలేషన్ పద్ధతుల్లో ఆస్పత్రి నిర్మాణం జరగాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు కెనడాలో పర్యటించి రావాలన్నారు. మొదట ప్రేమగా.. వినకుంటే కఠినంగా.. మొదట సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రేమగా ఉండాలని, మంచిగా, సముదాయించి చెప్పాలని.. అభిమానంతో పనిచేయించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అలా వినకుంటే కఠినంగా మారాలన్నారు. ‘‘నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు అని సామెత ఉంది. మంచిగా బతిమాలి చెప్తే కూడా కొన్ని కొన్ని సార్లు వినరు. అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు’’ అని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొందరు అదనపు కలెక్టర్లు, డీపీవోలను ఎంపిక చేసి కేరళకు పంపి పరిశీలన చేయించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలుచేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుందని.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ, తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. లేఅవుట్ల విషయంలో జాగ్రత్త నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠ ధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతి పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణాల్లో లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, వాటర్ ట్యాంకులు వంటి అవసరాలకు కేటాయించిన స్థలాలను స్థానిక మున్సిపాలిటీ పేరు మీద రిజిస్టర్ చేయించాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణ కోసం మాస్టర్ ప్లాన్లను నవీకరించాలని సూచించారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. సేవ్ ది విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ గ్రామ సభలు నిర్వహించి, గ్రామాల ఆర్థిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీపీవోలదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపులు, గ్రీన్ కవరేజీ కోసం ఖర్చులు అన్న ‘చార్జ్డ్ అకౌంట్’ కిందికి వస్తాయని.. వాటికి ముందు నిధులు కేటాయించాకే మిగతా ఖర్చులు చేసుకోవాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని సూచించారు. ‘సేవ్ ది పీపుల్.. సేవ్ ది విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్’ అనే నినాదంతో పనిచేయాలన్నారు. పనితీరు సరిగా లేనివారికి షోకాజ్ నోటీసులు పంపాలని, తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు జిల్లా, మండల, పీహెచ్సీ స్థాయిల్లో సీజనల్ వ్యాధుల నిర్మూలనపై వైద్య, పంచాయాతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ముందస్తుగా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మలేరియాలో ప్రీఎలిమినేషన్ దశ నుంచి ఎలిమినేషన్ (నిర్మూలన) దశకు చేరుకున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇవే పద్ధతులు అవలంబిస్తే మరో మూడేళ్లలో మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని పేర్కొన్నారు. -
ఆకస్మిక తనిఖీలకొస్తా: సీఎం కేసీఆర్
►రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గింది. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడత పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతా. ►పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. వాటిపై చర్యలు తీసుకోవాలి. ►మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరాం. వారు ఎలా భాగస్వాములవుతున్నారో పరిశీలిస్తున్నాం. ►పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలి. సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా ఆకస్మిక తనిఖీలను చేపడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలుస్తున్నా ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. పల్లె/పట్టణ ప్రగతి అమలుపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ‘పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలి. ఈ విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉద్యోగులు అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. తాత్సారం, అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు నా పర్యటనలో గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు... క్షమించేదీ లేదు. కఠిన చర్యలు తీసుకుంటం’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అదనపు కలెక్టర్ల పనితీరు బాగోలేదు.. ‘అదనపు కలెక్టర్లు ఆశించిన రీతిలో సామర్థ్యాన్ని నిరూపించుకోవట్లేదు. వారి నుంచి చాలా ఆశించా’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలను బాగు చేయడానికి నియమించిన అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలని ఆదేశించారు. డీపీవోలు, కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారు (డీపీవో)లతో ప్రగతి భవన్లో భేటీ కానున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ప్రగతిపై చార్టులు పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై వేర్వేరు చార్టులను రూపొందించాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, బతికిన మొక్కల శాతం, గ్రామ సభల నిర్వహణ, స్థానిక ఎంపీవోల హాజరు, అందులో వారు గ్రామ ప్రగతికి తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికలపై జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టుల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త సేకరణ, డంపు యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరు బావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్న తీరు, కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు, డ్రైనేజీలు, నాలాల క్లీనింగ్, శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణం వంటి అంశాలను చార్టుల్లో చేర్చాలన్నారు. ఉత్తమ గ్రామాలు, మండలాలు, అధ్వానంగా ఉన్న గ్రామాలు, మండలాలను గుర్తించి వాటికి గల కారణాలను చార్టుల్లో పేర్కొనాలని ఆదేశించారు. మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీల్లో తనకు అందచేయాలని సీఎస్‌ను ఆదేశించారు. పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీవోలు కూడా పల్లె పర్యటనలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చార్టులు.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు సీజన్లవారీగా తీసుకోవాల్సిన చర్యలతో చార్ట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘వానాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టడం చాలా కీలకం. ఇందుకు పంచాయితీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరా ట్యాంకులను శుద్ధి చేయాలని సూచించారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు ... పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు తనకు సమాచారం వుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పనలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరామని, ఏ మేరకు అవుతున్నారని ఆరా తీశారు. చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్ -
క్లీన్ ఏపీకి ‘క్లాప్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలను చెత్త రహితం చేసి స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఏపీ (క్లాప్) కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టేలా మునిసిపల్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. మొదటి దశలో రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లో అమలు చేయనున్న క్లాప్ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. చెత్త సేకరణ వాహనాల సమీకరణ, కంపాక్టర్ బిన్స్ కొనుగోలు, ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం టెండర్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ 34 వేల మంది పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం కోసం పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్లు ప్రతి ఇంటికి మూడు వేర్వేరు రంగుల డస్ట్ బిన్లను మునిసిపాలిటీలు సరఫరా చేస్తాయి. తడి, పొడి..హానికర చెత్తలను వేర్వేరుగా అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఇందులో వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లను భాగస్వామ్యంతో మునిసిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి డస్ట్ బిన్ల కొనుగోలు చేయాలని మునిసిపాలిటీలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రతి మునిసిపాలిటీలో ఇళ్ల సంఖ్యను బట్టి అధికారులు డస్ట్బిన్లను కొనుగోలు చేస్తారు. ఒక్కో డస్ట్‌బిన్ దాదాపు రూ.80 వరకు ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఒక్కో ఇంటికి రూ.240 వరకు ప్రాథమికంగా వెచ్చించనున్నారు. 4వేల వాహనాలతో చెత్త సేకరణ చెత్తను వీధుల్లో పారబోయడం అన్నది పూర్తిగా నిషిద్ధం. మునిసిపల్ పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తారు. అందుకోసం 4 వేల గూడ్స్ ఆటోల వంటి వాహనాలను ఉపయోగిస్తారు. ఒకొక్కటీ రూ.60వేల వరకు ఖర్చయ్యే ఆ వాహనాలను ఔట్ సోర్సింగ్ విధానంలో సమకూర్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. 4 వేల కంపాక్టర్ బిన్లు.. 122 ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్రతి ఐదారు వార్డులకు ఓ కంపాక్టర్ బిన్ (కొక్కేలు గల దృఢమైన తొట్టె)లను ఏర్పాటు చేస్తారు. వాహనాల ద్వారా సేకరించిన చెత్తను ఆ కంపాక్టర్ బిన్లలో వేస్తారు. చెత్తను చేతితో తీయాల్సిన అవసరం లేకుండా కంటైనర్ వాహనాల్లోకి ఆ చెత్తను వేసి తరలిస్తారు. ఇప్పటికే 4 వేల కంపాక్టర్ బిన్ల కొనుగోలు కోసం పురపాలక శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సేకరించిన చెత్తను ట్రీట్మెంట్ ప్లాంటకు తరలించి కంపోస్ట్ తయారు చేస్తారు. ఇందుకోసం రాష్ట్రం మొత్తం మీద 122 ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. ప్రస్తుతం 50 ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. మిగిలిన 72 ట్రీట్మెంట్ ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయడం కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టారు. 34 వేల మంది పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యం 125 మునిసిపాలిటీలలో క్లాప్ కార్యక్రమంలో 34 వేల మంది పారిశుధ్య కార్మికులు భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో 100 శాతం పారిశుధ్య నిర్వహణ లక్ష్యాలను సాధించేందుకు పురపాలక యంత్రాంగం సమష్టిగా సన్నద్ధమవుతోందని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ఎండీ సంపత్ ‘సాక్షి’కి తెలిపారు. పట్టణాలను గార్బేజ్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, డస్ట్‌బిన్ ఫ్రీ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. -
ముంపు ముప్పు ఉండదిక
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో ముంపు నుంచి పట్టణాలను రక్షించేందుకు పురపాలక శాఖ సమాయత్తమైంది. భారీ వర్షాలకు జనావాసాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న దుస్థితికి చెక్ పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. పట్టణాలు కొన్ని దశాబ్దాలుగా ప్రణాళికా రహితంగా విస్తరించడంతో చిన్న చిన్న వాననీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. భారీ వర్షాలు వస్తే నీటి ప్రవాహానికి మార్గం లేక జనవాసాలు ముంపునకు గురవుతుండటం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో వరద నీటి కాలువలు నిర్మించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రూ.350 కోట్లతో రెండు దశల్లో 14 మునిసిపాలిటీలలో కాలువల్ని నిర్మించనుంది. అనంతరం దశలవారీగా లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లోనూ ఈ కాలువలు నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో 7 కార్పొరేషన్లలో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా గల 32 నగరాలను అమృత్ పథకం పరిధిలోకి చేర్చారు. తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం మొదలైనవి చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం రూ.3,762.91 కోట్ల ప్రాజెక్టు ఇది. అందులో కేంద్రం వాటా రూ.1,056.62 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.436.97 కోట్లు. మునిసిపల్ కార్పొరేషన్లు/ మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో 14 పట్టణాల్లో వరద కాలువల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. అందుకోసం రూ.350.75 కోట్లతో 118 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం నగరాలను ఎంపిక చేసి పనులను మొదలు పెట్టింది. రెండో దశ కింద మిగిలిన 7 మునిసిపాలిటీలను త్వరలో ఎంపిక చేస్తారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. మూడేళ్లలో 32 మునిసిపాలిటీల్లో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లోనూ వరద కాలువలు నిర్మిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. మరో 14 మునిసిపాలిటీలను ఎంపిక చేయనుంది. మూడేళ్లలో మొత్తం 32 మునిసిపాలిటీల్లో కాలువల నిర్మాణం పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. అత్యంత ప్రాధాన్య అంశంగా ఈ పనులు చేపట్టామని పురపాలక శాఖ ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. నీటి వనరులతో అనుసంధానం వర్షపు నీరు జనావాసాల్లోకి చేరకుండా నేరుగా ఈ కాలువల్లోకి చేరేలా డిజైన్లు రూపొందించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఎత్తు ప్రదేశం నుంచి నేరుగా శివారు ప్రాంతానికి అనుసంధానిస్తూ భారీ కాలువలు నిర్మిస్తారు. ఆ కాలువలను మునిసిపాలిటీకి సమీపంలో ఉన్న నదులు/సముద్రం /ఇతర నీటి వనరులకు అనుసంధానిస్తారు. దాంతో ఎత్తు ప్రదేశాల నుంచి వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించి నిర్దేశిత గమ్యానికి చేరుకుంటుంది. -
రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం
సాక్షి, అమరావతి: ‘ఆట విడుపు, వాహ్యాళికి పార్కులు లేవు.. ఆహ్లాదానికి పచ్చదనం లేదు..’ అని చింతపడుతున్న పట్టణ ప్రజలకు ఊరట కలిగించేందుకు పురపాలకశాఖ సమాయత్తమైంది. కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో.. అమృత్ పథకంలో భాగంగా పార్కుల నిర్మాణం, పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణ చేపట్టింది. మొదటిదశలో లక్షలోపు జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో 125 పార్కుల నిర్మాణంతోపాటు పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పార్కుల నిర్మాణం, ఖాళీ ప్రదేశాల నిర్వహణ చేపడుతోంది. ప్రతి మునిసిపాలిటీలో కనీసం రెండు పార్కుల చొప్పున మొత్తం మీద 125 పార్కులు నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించారు. విశాలమైన పార్కు, వాటిలో వ్యాయామ ఉపకరణాలు, ఫౌంటేన్ నిర్మాణంతోపాటు ల్యాండ్ స్కేపింగ్ చేపడతారు. పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు పెంచుతారు. ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అర్బన్ ఫారెస్ట్రీ కింద దట్టంగా మొక్కలు పెంచుతారు. మొత్తం మీద పార్కులు, పచ్చదనం పెంపొందించేందుకు రూ.92.10 కోట్లతో 95 పనులు చేయనుంది. ఇప్పటికే 87 పనులు మొదలయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. పట్టణాల్లో పార్కుల నిర్మాణం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఖాళీ ప్రదేశాల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలకశాఖ అనుసరిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో పార్కులు 5 వేల చదరపు మీటర్లు, కమ్యూనిటీ పార్కులు 10 వేల నుంచి 15 వేల చ.మీ., జిల్లా కేంద్రంలోని ప్రధాన పార్కు 50 వేల నుంచి 2.50 లక్షల చదరపు మీటర్లలో నిర్మిస్తారు. ఇక మునిసిపాలిటీల్లో ప్రతి పౌరుడికి 10 నుంచి 12 చదరపు మీటర్ల వంతున ఖాళీ జాగా ఉండాలి. ఆ ప్రకారం పట్టణాలను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. పెద్ద మునిసిపాలిటీలు ఏ గ్రేడ్‌లో, చిన్న మునిసిపాలిటీలు బీ గ్రేడ్‌లో ఉండాలని నిర్దేశించారు. సీ గ్రేడ్‌లో ఒక్కటి కూడా ఉండకుండా చూడాలని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది. పార్కులు నిర్మించి పట్టణాల్లో పచ్చదనం పెంపొందిస్తామని ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. 17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు -
ఇక స్మార్ట్టౌన్లకు భూసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్టౌన్ల భూసేకరణకు పురపాలక శాఖ సమాయత్తమవుతోంది. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను మధ్యతరగతి వర్గాలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా స్మార్ట్టౌన్ల ప్రాజెక్టును చేపట్టేందుకు పురపాలక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నిర్వహిస్తున్న డిమాండ్ సర్వే అంచనాల ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో అవసరమైన మేర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో స్మార్ట్‌టౌన్లలో స్థలాల కోసం దరఖాస్తుదారుల అర్హతలు, భూసేకరణకు మార్గదర్శకాలతో పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించాకే ఆమోదం ► భూసేకరణకు జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెట్రోపాలిటన్ కమిషనర్/పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, సంబంధిత మునిసిపల్ కమిషనర్, ఎస్ఈ (ప్రజారోగ్య శాఖ), జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ► రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు. ఇందులో ఏపీ టిడ్కో ఎండీ, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, గృహనిర్మాణ సంస్థ వైస్ చైర్మన్ సభ్యులు. ► జిల్లాల్లో స్మార్ట్టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం జిల్లా కమిటీల బాధ్యత. ► జిల్లా కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీలో కనీసం ఇద్దరు సభ్యులు ఆ భూములను ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ భూములు ఉన్నాయో, లేదో నిర్ధారించాలి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించాకే జిల్లా కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియ చేపడతారు. మూడు కేటగిరీలుగా ప్లాట్లు ► డిమాండ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రాల్లో 150 ఎకరాలు/200 ఎకరాలు/250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేస్తారు. ► మునిసిపాలిటీల్లో 50 ఎకరాలు/100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేయాలని నిర్ణయించారు. ► ఇక స్మార్ట్‌టౌన్లలో మూడు కేటగిరీల ప్లాట్లతో లేఅవుట్లు వేస్తారు. 150 చ.గజాల్లో మధ్య ఆదాయ వర్గం (ఎంఐజీ), 200 చ.గజాల్లో ఎంఐజీ–1, 240 చ.గజాల్లో ఎంఐజీ–2 ప్లాట్ల డిజైన్ రూపొందించారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలు స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఒక కుటుంబం ఒక ప్లాట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భూసేకరణకు మార్గదర్శకాలు.. ► వివాదాస్పదంకాని భూములనే ఎంపిక చేయాలి. ► భూముల ఎంపికలో మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ► డిమాండ్ ఉన్న ప్రాంతంలో, తగినంత ఎత్తులో ఉన్న భూములకు ప్రాధాన్యమివ్వాలి. ► గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతాల్లోనే ఎంపిక చేయాలి. ► పాఠశాలలు, రవాణా, వైద్య వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. ► మునిసిపాలిటీల్లో అయితే గరిష్టంగా 3 కి.మీ., కార్పొరేషన్లలో అయితే గరిష్టంగా 5 కి.మీ. దూరంలో ఉన్న భూములను ఎంపిక చేయాలి. ► ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ప్రాంతాలకు సమీపంలో ఉంటే మంచిది. ► మౌలిక వసతుల కల్పన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ‘జగనన్న కాలనీ’లకు సమీపంలో ఉండేటట్టుగా చూడాలి. ► భవిష్యత్‌లో కూడా విస్తరణకు అవకాశం లేని ప్రాంతాలను ఎంపిక చేయకూడదు. ► ఆ భూములకు అప్రోచ్ రోడ్ తప్పనిసరిగా ఉండాలి. ► నిర్మాణాలకు అనువుగా లేని నేలలను ఎంపిక చేయకూడదు. ► చెరువులు, ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయొద్దు. ► భూగర్భ జలాలు తగినంతగా ఉండి, తాగునీటి వసతి ఉన్న ప్రాంతంలోని భూములనే ఎంపిక చేయాలి. -
‘స్మార్ట్ టౌన్ల’కు యమా క్రేజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరాలు, పట్టణాల్లో అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మిడిల్ ఇన్‌కం గ్రూప్(ఎంఐజీ) కేటగిరీలో 150 చదరపు గజాలు, 200 చదరపు గజాలు, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయించనున్న లే అవుట్లపట్ల పట్టణ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పురపాలక శాఖ సర్వే చేపట్టింది. వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి ఈ నెల 10లోగా సర్వే పూర్తి చేయాలని పేర్కొంది. ఇప్పటికే చాలావరకు పూర్తయిన సర్వేలో ప్రజల అభిప్రాయం ప్రస్ఫుటమైంది. మాకు ప్లాట్లు కావాలి అంటే మాకు కావాలంటూ ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతమున్న డిమాండ్‌కు అనుగుణంగా దాదాపు ఐదువేల ఎకరాల్లో లేఅవుట్లు వేయాల్సి ఉంటుందని పురపాలక శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. డిమాండే డిమాండ్ స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుపై ప్రస్తుతం మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 వేల కుటుంబాలు ఎంఐజీ ప్లాట్లు కొనుగోలుకు తమ సంసిద్ధతను తెలిపాయి. ఇందులో 150 చ.గజాల ప్లాట్లు కావాలని 16,200 కుటుంబాలు, 200 చ.గజాల ప్లాట్లు కోసం 14,200 కుటుంబాలు, 240 చ.గజాల ప్లాట్లు కావాలని 19,600 కుటుంబాలు కోరాయి. ఏప్రిల్ పది నాటికి ఈ సర్వే పూర్తి కానుండగా.. మరో పదివేల ప్లాట్ల వరకు డిమాండ్ వస్తుందని పురపాలక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఐదువేల ఎకరాలు అవసరం.. ఇంతవరకు నిర్వహించిన సర్వే ప్రకారం 50 వేల ప్లాట్లకు కనీసం 4,100 ఎకరాలు అవసరమవుతాయని పురపాలక శాఖ అధికారులు నిర్ధారించారు. ఏప్రిల్ 10 నాటికి మొత్తం పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే పూర్తి చేసేసరికి దాదాపు 60 వేల ప్లాట్ల వరకు డిమాండ్ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. ఆ ప్రకారమైతే ఐదువేల ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూ అన్ని వసతులతో లేఅవుట్లు వేయనున్న సంగతి తెలిసిందే. విశాలమైన రోడ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, గ్రీనరీ మొదలైన అన్ని వసతులు కల్పిస్తారు. సర్వే పూర్తయ్యాక మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వారీగా అవసరమైన భూసేకరణపై దృష్టి సారిస్తారు. దీనికోసం ఇప్పటికే జాయింట్ కలెక్టర్(రైతు భరోసా, రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను కూడా నియమించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులో ప్లాట్ల కొనుగోలుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. లిటిగేషన్లు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వం లే అవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు విక్రయించనుండటమే అందుకు కారణం. సర్వే పూర్తయ్యాక భూసేకరణ అంశంపై కార్యాచరణ చేపడతాం. –వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం, పురపాలక శాఖ -
పట్టణాల్లో నీటి ఎద్దడికి రూ.8,217 కోట్లతో చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం అమృత్, ఏఐఐబీ నిధులు, ప్లాన్ గ్రాంట్ నిధులు.. మొత్తం మీద రూ.8,216.95 కోట్లను వెచ్చిస్తోంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు కలిపి 125 ఉండగా.. 59 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 34 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయగలుగుతున్నారు. 13 పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల (ఎంఎల్) తాగునీరు అవసరం కాగా ప్రస్తుత తాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం రోజుకు 1,678 మిలియన్ లీటర్లు. 72 మిలియన్ లీటర్ల నీటిని ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2035 నాటికి రోజుకు 2,700 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని పురపాలకశాఖ అంచనా వేసింది. అంటే ప్రస్తుత వ్యవస్థీకృత సామర్థ్యం కంటే 1,022 మిలియన్ లీటర్లు ఎక్కువ అవసరం. ఆ మేరకు వ్యవస్థీకృత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 32 మునిసిపాలిటీల్లో ‘అమృత్’ధారలు లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో అమృత్ పథకం కింద తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1,056.62 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.436.97 కోట్లు, మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.180.77 కోట్లు సమకూరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లలో తాగునీటి సరఫరాకు రూ.2,526.33 కోట్లు వెచ్చించనున్నారు. ఆ 32 మునిసిపాలిటీల్లో అదనంగా రోజుకు 307 మిలియన్ లీటర్ల తాగునీరు అందించనున్నారు. దీనికోసం కొత్తగా 4,36,707 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తారు. ఏఐఐబీ నిధులతో 50 మునిసిపాలిటీలకు.. ఆసియన్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో మరో 50 మునిసిపాలిటీల్లో ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని మొత్తం వ్యయం రూ.5,350.62 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3,487.67 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,494.72 కోట్లు కాగా మునిసిపాలిటీల వాటా రూ.368.23 కోట్లు. మొదటిదశ కింద ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్లాన్ గ్రాంట్ నిధులతో రాయచోటిలో రోజుకు 35 మిలియన్ లీటర్ల తాగునీరు అందించడంతోపాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.340 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. -
కాలుష్య కాటుకు మియావాకి మందు!
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కాలుష్యానికి ‘మియావాకి’ అడవులతో చెక్ పెట్టాలని పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో తగినంత ఆక్సిజన్‌ను అందించడంతోపాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. ఇటీవల విశాఖపట్నంలో పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇతర నగరాలు, పట్టణాలకూ విస్తరించాలని నిర్ణయించింది. ఏమిటీ ‘మియావాకి’ అడవుల పెంపకం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం, పరిమిత వ్యయంతో దట్టమైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూపకల్పన చేసిన విధానమే ‘మియావాకి’ అడవుల పెంపకం. జపాన్‌కు చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ఈ విధానానికి రూపకల్పన చేశారు. నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మట్టిని సేంద్రియ విధానంలో ట్రీట్మెంట్ చేసి చుట్టూ ఫెన్సింగ్ నిరి్మస్తారు. అనంతరం మట్టి స్వభావానికి అనుగుణంగా స్థానిక జాతులకు చెందిన వివిధ రకాల మొక్కలనే అడుగుకు ఒకటి చొప్పున ఏడు వరుసలుగా రకరకాల మొక్కలను నాటుతారు. దాంతో మొక్కలు విశాలంగా విస్తరించకుండా పొడవుగా పెరుగుతాయి. పెరిగిన తరువాత మొక్కలు ఒకదానికి ఒకటి అడ్డురాకుండా వాటి ఎత్తు, విస్తరణలను పరిగణనలోకి తీసుకుని తగిన జాతులవే నాటుతారు. దాంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో దట్టమైన అడవులుగా రూపుదిద్దుకుంటాయి. ఈ విధానంతో దాదాపు 2.50 లక్షల వ్యయంతో ఒక ఎకరాలో 50 రోజుల్లోనే అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ ‘మియావాకి’ అడవుల పెంపకాన్ని పురపాలక శాఖ విశాఖపట్నంలో చేపట్టింది. గాజువాక, మధురవాడలలో 25 ప్రాంతాలను ఎంపిక చేసింది. మొక్కల వేర్ల వరకు నీరు సులభంగా వెళ్లేలా మట్టిని రీఫిల్లింగ్ చేశారు. మారేడు, నేరేడు, పనస, మోదుగు, ఇరిడి, మద్ది, వేప, శ్రీగంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు వంటి దాదాపు 40 రకాల మొక్కలను నాటారు. సేంద్రియ ఎరువులు వాడారు. రూ.50 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. త్వరలోనే విశాఖలోని 25 ప్రాంతాల్లో దట్టమైన ‘మియావాకి’ అడవులు కనువిందు చేయనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా.. ‘మియావాకి’ అడవుల పెంపకాన్ని రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. తొలుత మిగిలిన 16 మునిసిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఒక్కో కార్పొరేషన్లో 5 నుంచి 10 ప్రాంతాల్లో ఈ ‘మియావాకి’ అడవులను పెంచాలని భావిస్తున్నారు. అందుకోసం ఖాళీ ప్రదేశాలను గుర్తించడంతోపాటు స్థానిక మొక్కల జాతులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర మునిసిపాలిటీల్లోనూ కనీసం ఒకటి చొప్పున ‘మియావాకి’ అడవులను పెంచాలన్నది పురపాలక శాఖ ఉద్దేశం. ఉపయోగాలు ఇవీ.. ► ఇంతవరకు ‘అర్బన్ ఫారెస్ట్రీ’ విధానంలో చేపడుతున్న మొక్కల పెంపకం కంటే మియావాకి అడవులు పదిరెట్లు దట్టంగా ఉంటాయి. ► నగరాలు, పట్టణాల్లో విస్తారంగా ఆక్సిజన్‌ను అందిస్తాయి. ► కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. ► మట్టి కోతను నివారిస్తాయి. ► భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడతాయి. ► ఎన్నో వృక్ష జాతులతో ఉండే ఈ అడవులు పక్షులు, ఇతర జాతులకు నెలవుగా మారి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి. -
కొత్త మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 5 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ తాడిగడప (కృష్ణా)కు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, అల్లూరు నగర పంచాయతీ (నెల్లూరు జిల్లా)కు కావలి మునిసిపల్ కమిషనర్, బి.కొత్తకోట (చిత్తూరు)కు రాయచోటి మునిసిపల్ కమిషనర్, చింతలపూడి (పశ్చిమ గోదావరి)కి ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శి, పొదిలి (ప్రకాశం)కు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. -
స్మార్ట్ టౌన్ల ప్రాజెక్ట్ టేకాఫ్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులతో లే అవుట్లను లాభాపేక్ష లేకుండా అందించేందుకు ఉద్దేశించిన స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టు వేగంగా సిద్ధమవుతోంది. విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అనధికారిక, సరైన మౌలిక వసతులులేని లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట కలిగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పురపాలక శాఖ పూర్తి వసతులతో లే అవుట్లను అభివృద్ధి చేసిందుకు ‘స్మార్ట్ టౌన్ల’ ప్రాజెక్టును రూపొందించింది. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఒకటి చొప్పున స్మార్ట్ టౌన్ల లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. పట్టణ స్థానిక సంస్థ జనాభాను బట్టి ఒక్కో లే అవుట్ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని నిర్ణయించారు. ► విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో 200 ఎకరాలు చొప్పున లేఅవుట్లు వేస్తారు. ► మిగిలిన 14 కార్పొరేషన్లలో 100 ఎకరాల చొప్పున లేఅవుట్లు రూపొందిస్తారు. ► 13 స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. 63 గ్రేడ్ 1, గ్రేడ్ 2.. గ్రేడ్ 3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున లేఅవుట్లు వేస్తారు. ► 31 నగర పంచాయతీల్లో 25 ఎకరాల చొప్పున లేఅవుట్లు నిర్మిస్తారు. రెండు కేటగిరీల కింద స్థలాలు స్మార్ట్ టౌన్ లే అవుట్లలో రెండు కేటగిరీల కింద స్థలాలు కేటాయిస్తారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ)–1 కేటగిరీ కింద 200 చ.గజాలు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్(ఎంఐజీ)–2 కేటగిరీ కింద 240 చ.గజాల విస్తీర్ణంలో స్థలలతో లే అవుట్లు వేస్తారు. స్మార్ట్ టౌన్లలో కల్పించే వసతులు.. ► లే అవుట్లో రోడ్లకు 30 శాతం, ఓపెన్ స్పేస్‌కు 10 శాతం, మౌలిక వసతుల కల్పనకు 5 శాతం, యుటిలిటీస్‌కు 1 శా>తం, పేదల ప్లాట్ల కోసం 5 శాతం భూమిని కేటాయిస్తారు. ► కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలకు భూములు కేటాయిస్తారు. ► నీటి సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్, వీధి దీపాలు, డ్రైనేజ్, విద్యుత్ సబ్‌స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానళ్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. భూముల ఎంపికకు మార్గదర్శకాలు ఇవీ... ప్రజల అన్ని అవసరాలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోని భూములనే స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుకు ఎంపిక చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. భూ సేకరణ కోసం రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలకు నిర్దేశించిన మార్గదర్శకాలు ఇవీ... ► మున్సిపల్ కార్పొరేషన్లలో గరిష్టంగా 5 కి.మీ. పరిధిలోపు, మున్సిపాలిటీలలో గరిష్టంగా 3 కి.మీ. పరిధిలోపు ఉన్న భూములను ఎంపిక చేయాలి. ► ఉపాధి అవకాశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. ► పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో భూములను గుర్తించాలి. ► వివాదాస్పదం కాని భూములను ఎంపిక చేయాలి. ► ఎంపిక చేసిన భూములకు ఇప్పటికే అప్రోచ్ రోడ్డు ఉండాలి. ► సరైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి అనువుగా భూములను ఎంపిక చేయాలి. ► చెరువులు, నీటి వనరుల సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయకూడదు. ► భూగర్భ జలాలు తగినంతగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలి. ► జగనన్న కాలనీలకు సమీపంలో ఉండే ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. అన్ని వసతులతో స్మార్ట్ టౌన్లు – వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం ‘పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అనధికారిక లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. అన్ని వసతులతో కూడిన లే అవుట్లలో స్థలాలను లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందించనున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’ -
'పుర పోరు'కు సర్వం సిద్ధం
-
'పుర పోరు'కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు పురపాలక శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా.. మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. భారీగా ఏకగ్రీవాలు.. ఏలూరు సహా 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 2,123 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించింది. కాగా, ఈ సారి గణనీయంగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల్లో 89 డివిజన్లు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 490 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవం కావడం విశేషం. నగర పాలక సంస్థల పరిధిలో 582 డివిజన్లు, పురపాలక సంఘాల పరిధిలో 1,633 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అదృష్టం పరీక్షించుకోనున్న 7,552 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 7,552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో నగరపాలక సంస్థల పరిధిలో 2,571 మంది, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 4,981 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వారిలో పురుషులు 38,72,264 మంది కాగా.. మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో నగరపాలక సంస్థల పరిధిలో 48,31,133 మంది ఉండగా, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 30,40,139 మంది ఉన్నారు. 7,915 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 7,915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో నగరపాలక సంస్థల పరిధిలో 4,626 ఉండగా పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 3,289 ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 4,788 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,468 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించగా.. 2,320 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవిగా గుర్తించారు. 48,723 మంది పోలింగ్ సిబ్బంది ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1+4 చొప్పున పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. వారిలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇతర పోలింగ్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. వారితోపాటు రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం మీద 48,723 మంది ఉద్యోగులను పోలింగ్ నిర్వహణ కోసం కేటాయించారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలట్ పత్రాలు, ఇతర మెటీరియల్‌ను ఆయా పట్టణాల్లోని పంపిణీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బందికి వాటిని అందజేస్తారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. ‘ఏలూరు’ ఎన్నికపై నేడు స్పష్టత ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 వార్డులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. కోర్టు అనుమతిస్తే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏలూరు సహా 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్‌లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్‌లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
పట్టణాల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి.. బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. మేలో తొలిదశ ప్రారంభం ► సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్ చేస్తారు. ► మొదటి దశ సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో.. ► మొదటి దశలో అమృత్ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. ► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. ► ఒక్కో ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. ► మరుగుదొడ్ల అవుట్ లెట్లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. ► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. ► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు. -
100% పన్నులు వసూలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మార్చి 31వ తేదీలోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను, పన్నేతర ఆదాయం వసూలు అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను, రీజినల్ డైరెక్టర్లను ఆదేశించడంతో పాటు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, వ్యాపార లైసెన్స్‌ల జారీ.. ప్రధాన ఆదాయ మార్గాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వారి పేర్లు నోటీసు బోర్డుల్లో పెట్టండి ►అన్ని విభాగాల అధికారులను సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాలి. ►రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ►పన్నుల చెల్లింపులకు సంబంధించి భారీగా ప్రచారం నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటి యజమాని మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ►పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలి. ►ఎక్కువ మొత్తంలో పన్నులు ఎగవేసే వారి జాబితాను వెబ్‌సైట్‌తో పాటు, పురపాలక శాఖ నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శించాలి. ►భారీ మొత్తంలో పన్ను ఎగవేసే 500 మంది జాబితారూపొందించి ముందు వారినుంచి వసూలు చేయాలి. ►ప్రతి సోమ, బుధవారాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మేళాలు నిర్వహించాలి. ►పన్నులు సక్రమంగా చెల్లించని వారిని మున్సిపల్ కమిషనర్లు స్వయంగా కలసి వసూలు చేయాలి. -
ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రదేశాల్లో ఎవరింటికైనా వెళ్లాల్సి వస్తే అడ్రస్ వెదుక్కుంటూ వెళ్లడం పెద్ద ప్రహసనమే. అటువంటి యాతనకు త్వరలోనే తెరపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ డిజిటల్ నం బర్లు, క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్లు ఇవ్వనుంది. అంటే క్యూఆర్ కోడ్‌నే ఇక మీ ఇంటి అడ్రస్ కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా కోరుకున్న ఇళ్లు, ఆఫీసు, షాపుకు సులువుగా వెళ్లిపోవచ్చు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ డోర్ నంబర్లను ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు చేస్తోంది. తొలుత చిన్న పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారం భించడానికి పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్‌లో ఇంటి డోర్ నంబర్లు, వీధి, నగరం, రాష్ట్రం, పోస్టల్ పిన్‌కోడ్, గూగుల్ మ్యాప్ లొకేషన్ యూఆర్ఎల్ లింక్ వంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. -
మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు
లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే మధ్యతరగతి ప్రజల్లో ఆందోళనలు, భయాలు ఉండవు. వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలను ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయిస్తుంది. తద్వారా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి ప్రజలకు సైతం సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా తక్కువ ధరలకే క్లియర్ టైటిల్‌తో వివాదాల్లేని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. మధ్య తరగతి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఈ ఆలోచన వచ్చిందని స్పష్టం చేశారు. దీనిపై మేధోమథనం చేసి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి, తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాల్లో వైఎస్సార్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట ఓ కార్యక్రమం చేపట్టారని, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమం ఉద్దేశమని గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా.. క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు (స్థలాలు) ఇవ్వాలన్నది ఆలోచన అని తెలిపారు. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తుందన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు, సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. సరైన టైటిల్ ఉందా? అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమం వల్ల వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. 17 వేల కాలనీలు కడుతున్నాం ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టి పెట్టండని కలెక్టర్లకు చెప్పాం. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పాం. లే అవుట్ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయమన్నాం. ► బస్ బే తోపాటు సృజనాత్మకంగా బస్టాప్ కట్టండని చెప్పాం. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లే అవుట్స్ వచ్చాయి. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే.. మనం మరో 17 వేల కాలనీలు కడుతున్నాం. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నాం. ► పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్.. ఇవన్నీ కూడా ఈ కాలనీల్లో తీసుకువస్తాం. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలతో కార్పొరేషన్ ఏర్పాటు ► మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలతో మంగళగిరి– తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి 6 లేన్ల బీచ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన వంతెన నిర్మిస్తామన్నారు. ► ఇది విశాఖపట్నానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. శాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలని, పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ► ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్య నాథ్ దాస్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
నీటిచార్జీల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో టీడీపీ ప్రభుత్వం అహేతుకంగా నిర్ణయించిన నీటిచార్జీలను రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ప్రజ లు, వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు అధికభారం లేకుండా నీటిపన్నుల తగ్గింపు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కుళాయిలకు మీటర్లు ఏర్పాటు చేసి గృహ, (వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లకు వేర్వేరుగా), వాణిజ్య, పారిశ్రామిక కేట గిరీల కింద నీటిచాచార్జీలను అమాంతంగా పెంచింది. దీన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమీక్షించింది. పురపాలకశాఖ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్/డైరెక్టర్ అధ్యక్షుడిగా ఇంజినీర్ ఇన్ చీఫ్, సూపరింటెం డెంట్ ఇంజినీర్ (పబ్లిక్ హెల్త్) సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త నీటిచార్జీలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చార్జీలను ఏటా 5 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. సీవరేజీ చార్జీల హేతుబద్ధీకరణ నగరాలు, పట్టణాల్లో కొత్త చార్జీల అమలు రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో సీవరేజీ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ పుర పాలకశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 నగ రాలు, పట్టణాల్లో భూగర్భ మురుగునీటి పారుదలవ్యవస్థ (యూడీఎస్) ఉంది. ఆయా చోట్ల వేర్వేరు రీతుల్లో సీవరేజీ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. ఈ ప్రతిపాదనల మేరకు నగరాలు, పట్టణాలు సీవరేజీ చార్జీల ను నిర్ణయించాలని పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
మున్సిపల్ గ్రాంట్లు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. -
త్వరలో ఇళ్ల దరఖాస్తుదారులకు అర్హత ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో ద్వారా పట్టణ ప్రాంతాల్లో 365, 430 చదరపు గజాల్లో నిర్మిస్తున్న ఫ్లాట్ల దరఖాస్తుదారులకు 10 రోజుల్లో అర్హత ధ్రువీకరణ పత్రాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్‌రావు, టిడ్కో ఎండీ శ్రీధర్ తదితరులతో కలిసి మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెప్మా అధికారుల ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సులభంగా లభించేలా చూడాలని సూచించారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరద నీరు తగ్గుముఖం పట్టగానే.. పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలోనూ పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలన్నారు. అనధికారిక లే అవుట్లు, అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికారిక లే అవుట్లు, భవనాల గుర్తింపు, ఆన్లైన్లో నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. -
12లోగా ఆస్తుల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 12లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఏ ఒక్క ఆస్తిని వదిలిపెట్టవద్దని, ఆస్తుల నమోదు 100 శాతం పూర్తి అయినట్లు సంబంధిత వార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవీకరించిన వ్యవసాయేతర ఆస్తుల ముసాయిదా జాబితాను వార్డు కమిటీ ముందు వుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు/ సలహాలు స్వీకరించా లని ప్రభుత్వం నిర్దేశించింది. అభ్యంతరాల ను పరిష్కరించిన అనంతరం తుది జాబితా ను ప్రకటించాలని ఆదేశించింది. ఆస్తుల న మోదుకు సంబంధించిన వివరాలను వార్డు అధికారుల నుంచి పురపాలికలు సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఇంకా పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డులకు ఎక్కని ఆస్తుల నమోదును గడువులోగా పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, వారసత్వ బదిలీ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. అక్రమాలకు పాల్పడితే వేటే... ఆస్తుల నమోదు ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 95 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లను పురపాలక డైరెక్టర్ హెచ్చరించారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మున్సిపల్ ఉద్యోగు లు, అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల కు మెరూన్‌రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ అత్యం త కీలకంగా మారింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్‌ను దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణిలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా పురపాలికలు/ గ్రామ పంచాయతీల్లోని ఆస్తి పన్నుల రికార్డుల్లో సైతం కొత్త యజమాని పేరును నమోదు చేసి తక్షణ మ్యుటేషన్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఇందుకోసం ప్రతి ఆస్తికి సంబంధించిన యజమానికి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా యజమాని పేరు, కులం, వయసు, లింగం, ఫోన్ నంబర్, గుర్తింపు రుజువు, ఫొటో, ఆస్తి వివరాలు, వినియోగం, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆస్తి సంక్రమణ విధానం, విద్యుత్, కులాయి కనెక్షన్ నంబర్లు, కుటుంబీకుల వివరాలు, చిరునామా తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి యజమానులందరూ ఇకపై పన్ను చెల్లింపు పరిధిలోకి రానున్నారు. -
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రెడీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు. ⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. ⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . ⇒ 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ⇒ ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ⇒ 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ⇒ 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. ⇒ 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి. (చదవండి: ప్రైవేటు జలగలు..! ) -
పారిశుధ్య కార్మికులకు భరోసా
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుల వ్యక్తిగత రక్షణకు సర్కారు భరోసా ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యం లో పారిశుధ్య కార్మికులందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) అందజేయాలని అన్ని మున్సిపాలిటీలకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికులు 8 రకాల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా విధులకు తగ్గట్టు వారికి రక్షణ కల్పించే ప్రత్యేక పీపీఈలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ) అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. అస్కీ సిఫారసుల మేరకు కింద పేర్కొన్న పరికరాలను అందజేయాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 60 వేలమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పలువురు కార్మికులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి రక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏ ఏ విభాగాలవారికి ఏ ఏ పరికరాలంటే... మరుగుదొడ్ల నిర్వహణలో ఉన్నవారికి.. ► పాలికార్బోనెట్ లెన్స్, ఎన్–95 మాస్క్, రబ్బరు లాటెక్స్ గ్లౌవ్స్, ఉక్కు బొటనవేలు, చీలమండ కలిగిన పొడవాటి బూట్లు, యాప్రాన్లు మురికి కాల్వలు శుభ్రపరిచేవారికి... ► పాలిథిలిన్ హెల్మెట్, యాంటీ ఫాగింగ్ కంటి అద్దాలు, దూరం నుంచి కనిపించేలా భద్రతాదుస్తులు, ఉక్కు బొటన వేలు కలిగి మోకాలు వరకు ఉన్న పొడవైన బూట్లు, హాఫ్ మాస్క్ రెస్పిరేటర్లు, నైట్రైల్ గ్లౌవ్స్, మ్యాన్హోల్లోకి ప్రవేశిస్తే రక్షణ కోసం పాలీప్రొఫిలిన్తో తయారు చేసిన సూట్, దూరం నుంచి కనిపించేలా రేడియం ప్యాంట్, బుల్లెట్ ఆకారంలో చెవి ప్లగ్స్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసేవారికి... ► పాలిథిలిన్ హెల్మెట్, యాంటీఫాగింగ్ కళ్లద్దాలు, భద్రతాదుస్తులు, ఉక్కుబొట న వేలు కలిగి మోకాలి వరకుండే షూస్, హాఫ్మాస్క్ రెస్పిరేటర్స్, నైట్రైల్ గ్లౌవ్స్ వీధులు ఊడ్చేవారు/రోజూ చెత్తను సేకరించేవారు/ చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు, చెత్తను వేరుచేసే చోట పనిచేసేవారికి... ► నైట్రైల్ లైనింగ్ గల మందమైన గ్లౌవ్స్, ఎన్–95 మాస్కులు, దూరం నుంచి కనిపించేలా భద్రతాదుస్తులు, ఉక్కుబొటన వేలు కలిగిన చెప్పులు ఎఫ్ఎస్టీ ప్లాంటుల ఆపరేటర్లకు... ► నైట్రైల్ గ్లౌవ్స్, యాప్రాన్స్, ఉక్కు బొటనవేలు కలిగి మోకాలు వరకు ఉండే బూట్లు, ఎన్–95 మాస్క్ స్వయం సహాయకసభ్యులు/ఆశ వర్కర్లు ► పునర్వినియోగించదగిన అల్లిక కలిగిన చేతి తొడుగులు, పునర్వినియోగించదగిన ఎన్–95 మాస్కు, ► ఉక్కు బొటనవేలు కలిగి మోకాలు వరకు ఉండే బూట్లు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా 1న రూ.12,000 వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వాటాలను కార్మికుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేయాలని పేర్కొన్నారు. వారిని తొలగించండి.. 60 ఏళ్లకు పైబడిన మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను తొలగించి వారిస్థానంలో వారి కుటుంబంలో 25–40 ఏళ్ల ఔత్సాహికులుంటే నియమించుకోవాలని పురపాలక శాఖ డైరెక్టర్ సూచించారు. తొలగించిన కార్మికుల కుటుంబంలో అర్హులెవరూ లేకపోతే, స్థానికంగా పందుల పెంపకందారులకు ఆ ఉద్యోగావకాశాన్ని కల్పించాలని, పందుల పెంపకందారులు అందుబాటులో లేకపోతేస్కావెంజర్లను నియమించాలన్నారు. -
సంక్షోభమే అవకాశంగా..
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభాన్ని అవకాశంగా వాడుకుని పురపాలక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పురపాలికల్లో రూ.2 వేల కోట్ల విలువైన రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటి పనులను గడిచిన 60 రోజుల లాక్డౌన్ కాలంలో పూర్తి చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి పురపాలక శాఖ 24 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ప్రజలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను అందించిందన్నారు. లాక్డౌన్ సమయంలో లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించిందన్నారు. వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపేందుకు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని పురపాలక శాఖ పని చేసిందన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రగతి భవన్లో పురపాలక శాఖకు సంబంధించిన వార్షిక పురోగతి నివేదిక 2019–20ను విడుదల చేశారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టామని, ఈ క్రమంలో కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలు గల లివబుల్, లవబుల్ సిటీల రూపకల్పనకు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెట్టామన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... కొత్త మున్సిపల్ చట్టంతో పట్టణాల్లో నూతన శకం ప్రారంభమైంది. స్వీయ ధ్రువీకరణతో ఆన్లైన్లో ఆస్తి పన్నుల మదింపు, ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు వంటి విప్లవాత్మక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రతి పురపాలిక బడ్జెట్లో పది శాతం నిధులను హరిత బడ్జెట్‌గా ఉంచాలని, ప్రతి వార్డులో నాలుగు వార్డు స్థాయి కమిటీలను 15 మందితో ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలో కొత్తగా 61 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు. దీంతో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 139కి పెరిగింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించింది. టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో 110 పురపాలికల్లో రూ. 2వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నిధులతో అన్ని పురపాలికల్లో రోడ్ల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. భవన నిర్మాణ అనుమతులను మరింత సరళం చేసేందుకు టీఎస్–బీపాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి తేనున్నారు. రోడ్ల విస్తరణలో టీడీఆర్ పాలసీ కింద స్థలాలను సేకరించడం ద్వారా 2019– 20లో రూ.250 కోట్ల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్ల విక్రయాలు చేశారు. ప్రపంచంలోనే పొడవైన పీపీపీ మెట్రో రైల్ ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. 123 బస్తీ దవాఖానాలతోపాటు కొత్తగా 45 దవాఖానాలను తెరిచారు. ఏడాదిలోగా మరో 350 బస్తీ దవాఖానాలను తెరుస్తారు. ళమిషన్ భగీరథతో పట్టణాల్లో తాగునీటి సరఫరా సమస్య తీరిపోయింది. 24 పురపాలికలు, 18 గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ లోపల రూ.725 కోట్లతో జలమండలి నీటి సరఫరా ప్రాజెక్టును పూర్తి చేసింది. హైదరాబాద్‌కు తాగునీటి భరోసా కల్పించే 20 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
పట్టణాల్లో ‘పాదచారుల మార్కెట్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇక ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లు రానున్నాయి. అంటే పాదచారులకు మాత్రమే అనుమతిస్తూ కొన్ని మార్కెట్లను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. వీటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆమోదించిన పులివెందుల మోడల్ సిటీ ప్రణాళికలోనే ఈ ప్రతిపాదనను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ఏర్పాటు చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత పెరగడంతో ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే కార్యాచరణకు ఉపక్రమించింది. ఇదీ విధానం ► జనసాంద్రత, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాల్లో పాదచారులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా కొన్ని మార్కెట్లను గుర్తిస్తారు. ► ఆ మార్కెట్లలోకి ద్విచక్ర వాహనాలతోపాటు ఎలాంటి వాహనాలను అనుమతించరు. నడచుకుంటూనే వెళ్లి షాపింగ్ చేయాలి. ఇవీ లక్ష్యాలు ► ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. ► కొనుగోలుదారులు భౌతికదూరం పాటిస్తూ షాపింగ్ చేయొచ్చు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే ► అన్ని నగరాలు, పట్టణాల్లో పురపాలక శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలి. ► 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో కనీసం మూడు మార్కెట్లను, అంతకంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు పట్టణాల్లో కనీసం ఒక మార్కెట్‌ను ఏర్పాటు చేయలి. ► మార్కెట్లలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, గార్బేజ్ కలెక్షన్ పాయింట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ► ఈ మార్కెట్ల ప్రాథమిక ఎంపిక జూన్ 30కి పూర్తి చేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ప్రణాళిక ఖరారు చేసి నవంబర్ 30నాటికి ప్రారంభించాలి. ► చెన్నై, పూణేల్లోని పాదచారుల మార్కెట్లను మోడల్‌గా తీసుకోవాలి. ప్రభుత్వం ఇలా చేయనుంది... ► అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో మార్కెట్‌ను గుర్తించనున్నారు. హా విజయవాడలో బీసెంట్ రోడ్డును ‘పాదచారుల మార్కెట్’గా చేయాలని నిర్ణయించారు. ► విశాఖపట్నంలో పూర్ణా మార్కెట్‌తోపాటు మరొకటి, తిరుపతిలో కేటీ రోడ్డులో మార్కెట్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ► పులివెందుల మోడల్ సిటీపై రూపొందించిన ప్రణాళికలో ఈ ప్రతిపాదన చేర్చగా సీఎం ఆమోదముద్ర వేశారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు పాదచారుల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం.’ –విజయ్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ -
వస్త్ర, నగల దుకాణాలకు అనుమతి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా మూతపడ్డ వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలను పట్టణ ప్రాంతాల్లో తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లా కలెక్టర్లు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో మంగళవారం నుంచి దుకాణాలను తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతినిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీధుల్లో ఆహార పదార్థాల విక్రయ దుకాణాలకు కూడా అనుమతిని ఇచ్చింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాలు: పెద్ద దుకాణాలు, షోరూంలలో కొనుగోలుదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు ప్రోత్సహించాలి. దుకాణం/ షోరూంలోకి ప్రవేశించే కొనుగోలుదారుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. కొనుగోలుదారులకు థర్మల్ స్కానింగ్ చేసి, చేతులు శానిటైజ్ చేశాక లోపలికి అనుమతించాలి. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువ ఉన్నవారిని, కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని, మాస్కులు లేని వారిని అనుమతించకూడదు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న సిబ్బందిని విధుల్లో ఉంచకూడదు. ప్రతి కౌంటర్ వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లు ఉంచాలి. ► నగల దుకాణాల్లో కొనుగోలుదారులకు గ్లౌజులు ఇచ్చి.. వారు వాటిని ధరించాకే నగలను పరిశీలించేందుకు అనుమతించాలి. ► వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూంలకు అనుమతి లేదు. ► దుకాణాలు/ షోరూంలలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలి. ► పెద్ద దుకాణాలు/షోరూంలలో ప్రవేశ ద్వారాల వద్ద పాదరక్షలకు డిస్ ఇన్ఫెక్షన్ ఏర్పాటు చేయాలి. వ్యాలెట్ పార్కింగ్ సదుపాయం కల్పించాలి (లేదా) ఖాతాదారులకు పార్కింగ్ ప్రదేశం చూపించాలి. వాహనాల తాళాలను శానిటైజ్ చేయాలి. పార్కింగ్ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి తగినన్ని సబ్బులు, నాప్కిన్లు అందుబాటులో ఉంచాలి. ► షోరూం సిబ్బంది మాత్రమే లిఫ్టులను ఆపరేట్ చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి/కలసి వచ్చిన బృందాన్ని మాత్రమే అనుమతించాలి. ► దుకాణాలు, షోరూంలలో కొనుగోలుదారుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. అందుకోసం మార్కింగ్‌లు చేయాలి. ► వీలైనంతవరకూ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి. కార్డు చెల్లింపులకు ముందు, తరువాత క్యాషియర్ కార్డులను శానిటైజ్ చేయాలి. నగదు చెల్లింపులు అయితే ఒకరిని ఒకరు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► కొనుగోలుదారులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు చేతులకు గ్లౌజులు వేసుకున్న షోరూం సిబ్బంది ద్వారం తెరవాలి. ► పెద్ద దుకాణాలు/షోరూంలలో సిబ్బంది తమ దస్తులను ప్రత్యేకంగా భద్రపరచాలి. హెల్మెట్ వంటి వాటిని శానిటైజ్ చేసి ప్రత్యేకంగా భద్రపరచాలి. స్ట్రీట్‌ఫుడ్ విక్రయాలకు మార్గదర్శకాలు.. ► ఆహార పదార్థాలను ‘టేక్ అవే’ (పార్సిల్) విక్రయాలకు మాత్రమే అనుమతి. అక్కడే కూర్చొని తినేందుకు అనుమతి లేదు. ► మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే లైసెన్స్ పొందిన వారు మాత్రమే విక్రయించాలి. కొత్తగా లైసెన్సులు కావల్సిన వారు తమ పరిధిలోని వార్డు సెక్రటేరియట్‌కు వెళ్లి దరాఖాస్తు చేసుకోవాలి. ► ఆహార పదార్థాలు విక్రయించేవారు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. మాస్కులు ధరించని కొనుగోలుదారులకు విక్రయించకూడదు. ► దుకాణదారు తన వద్ద సబ్బు/శానిటైజర్, టవల్ తప్పనసరిగా ఉంచుకోవాలి. ప్రతి అరగంటకు ఓసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నవారు దుకాణాలు నిర్వహించకూడదు. ► వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న పానీపూరీ వంటి ఆహార పదార్థాల విక్రయాలకు అనుమతి లేదు. ► దుకాణం వద్ద ఐదుగురు కంటే ఎక్కువమంది ఉండకుండా చూడాలి. కొనుగోలుదారుల మధ్య తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా చూడాలి. ► మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని దుకాణదారులకు తగిన అవగాహన కల్పించాలి. -
‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి చుట్టూ పాతిన బండలను అధికారులు తొలగించారని చంద్రదండు నేత ప్రకాష్‌నాయుడు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి దౌర్జన్యకాండ సాగించాడు. విధులకు భంగం కలిగించడమే కాక నోటికొచ్చినట్లు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలో మారుతీనగర్ శివారులోని కేశవరెడ్డి స్కూల్ వెనుక వైపు మున్సిపల్ ఓపెన్ స్థలాన్ని చంద్రదండు ప్రకాష్‌నాయుడు ఆక్రమించాడు. అక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో ఉంది. గతంలో కూడా ఓసారి ఆక్రమించి నర్సరీ చేపట్టాలని చూడటంతో అధికారులు స్పందించి అడ్డుకోవడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. ఎలాగైనా ఆ విలువైన స్థలాన్ని చేజిక్కించుకోవడానికి ఈసారి చుట్టూ బండలతో ఫెన్సింగ్ వేయించాడు. స్థలం ఆక్రమణపై ఫిర్యాదు అందుకున్న నగర పాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఏప్రిల్ 29న అక్రమంగా పాతిన బండలను తొలగించారు. లాక్డౌన్ కారణంగా కొద్దిరోజులు పట్టించుకోని ప్రకాష్‌నాయుడు నిబంధనల సడలింపుల అనంతరం శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా టౌన్‌ప్లానింగ్ సెక్షన్లోకి చొచ్చుకుపోయిన అతను టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై నోరుపారేసుకున్నారు. ‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’ అంటూ బెదిరించాడు. అధికారిని దుర్భాషలాడుతుండటంతో నగరపాలక సంస్థ సిబ్బంది మొత్తం గుమిగూడారు. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హుటాహుటిన వచ్చి చంద్రదండు ప్రకాష్‌నాయుడును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
పారిశుధ్య యుద్ధం!
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు పారిశుధ్య నిర్వహణ, భౌతిక దూరం నిబంధన అమలుపై ప్రధానంగా దృష్టి సారించాయి. కరోనా కేసులు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం పురపాలక శాఖ రూ.31 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది. ► సాధారణ ప్రాంతాల్లో తరచూ బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రెడ్ జోన్లలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన వారి నివాసం నుంచి 3 కి.మీ. పరిధిలో రెడ్ జోన్‌గా ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి మరో 2 కి.మీ. మేర బఫర్ ప్రాంతంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 35,982 మంది పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. ► పారిశుధ్య నిర్వహణకు పురపాలక శాఖ 650 టన్నుల బ్లీచింగ్ పౌడర్, 500 టన్నుల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నెలల పాటు అవసరమైనవి కొనుగోలు చేసేందుకు కూడా సమాయత్తమవుతోంది. కార్మికుల కోసం 1.49లక్షల మాస్కులు, 59,390 గ్లౌజులు, 10 వేల జతల అప్రాన్లు/బూట్లు కొనుగోలు చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి మరో 35 వేల ఫుల్ సూట్లు, బూట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పక్కా ప్రణాళిక... ► గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించేందుకు పది లక్షల బస్తాల బ్లీచింగ్ పౌడర్, పది లక్షల లీటర్ల ఫినాయిల్, 20 లక్షల లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. ► రాష్ట్ర వ్యాప్తంగా 31,892 గ్రామీణ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పిచికారీ చేశారు. గత వారం రోజుల వ్యవధిలో 16,725 ప్రాంతాల్లో ఫాగింగ్ మిషన్ల ద్వారా పొగ వెదజల్లారు. మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రతి గ్రామంలో దుకాణాల వద్ద మీటరు దూరంతో మార్కింగ్ చేశారు. ► ఏఎన్ఎంలు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి, రెడ్‌జోన్‌గా ప్రకటించిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్నిస్ప్రే చేస్తున్న శానిటేషన్ సిబ్బంది కరోనా కట్టడికి పటిష్ట చర్యలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పురపాలక శాఖ అన్ని చర్యలు చేపడుతోంది. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత కూడా ఇదే రీతిలో చర్యలు చేపట్టి పట్టణాలు, నగరాలను ఆరోగ్యంగా ఉంచేలా ప్రణాళిక రూపొందించాం – జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ (పురపాలక శాఖ కమిషన్ డైరెక్టర్) ప్రతి రోజూ సమీక్ష గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలపై రోజూ సమీక్ష చేస్తున్నాం. పాజిటివ్, అనుమానిత కేసులు గుర్తించిన చోట తరచూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు సరిపడినన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారు – గోపాలకృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) -
మున్సిపల్ కార్మికులపై హరీష్‌రావు ఆగ్రహం
సాక్షి, సిద్ధిపేట : మున్సిపల్ కార్మికులపై ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు.. పొన్నాల నుంచి వస్తుండగా మాస్క్‌లు లేకుండా విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులను గమనించారు. దీంతో అక్కడే ఆగి.. కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి స్వయంగా పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌజులు అందజేశారు. (మందు బాబులను ఆగమాగం చేస్తోంది..) చదవండి: కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు -
ఏపీలో మరో కరోనా పాజిటివ్
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: విశాఖ జిల్లాలో సోమవారం మరో కరోనా కేసు నమోదైంది. జిల్లాలోని పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకుడు ఈ నెల 17న స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నెల 20న విశాఖ నగరంలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్ష కోసం పంపించగా.. సోమవారం కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో విశాఖ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు మూడుకు చేరాయి. ఏడుకు చేరిన పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ 181 మంది వైరస్ లక్షణాలున్న అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించామని, అందులో 7 మందికి పాజిటివ్ రాగా.. 166 మందికి కరోనా లేదని వెల్లడించింది. మరో 8 కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. విదేశీ ప్రయాణికులు 14 రోజులు ఇంట్లోనే ఉండాలి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజులు ఇంట్లోనే ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. సర్కారు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న వారు కనిపిస్తే 104కు కాల్చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తొలి కరోనా యువకుడి డిశ్చార్జి క్షేమంగా ఇళ్లకు చేరుకున్న మరో నలుగురు అనుమానితులు నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలోనే తొలి కరోనా వైరస్ (కోవిడ్–19) పాజిటివ్ కేసుగా నమోదైన యువకుడు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. నెల్లూరు నగరానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లి తిరిగి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని ఈ నెల 6న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ప్రత్యేక కరోనా వార్డులో చేర్చి ప్రత్యేక చికిత్సలు చేశారు. వైద్యం కొనసాగిస్తూనే.. రెండు దఫాలుగా అతడి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్ టెస్ట్ చేయించారు. రెండుసార్లూ నెగెటివ్ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు అతన్ని సోమవారం డిశ్చార్జి చేసి ఇంట్లో వదిలి పెట్టారు. మరో 14 రోజులు హోం ఐసోలేషన్ పాటించాలని సూచించారు. ఆ విద్యార్థితో పాటు ఇటలీ నుంచి వచ్చిన మరో విద్యార్థి కూడా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. అతడికి నెగెటివ్ వచ్చింది. ఇటీవల గమేషా పరిశ్రమ నుంచి ఒక ఉద్యోగి, పాజిటివ్ వచ్చిన విద్యార్థికి షేవింగ్ చేసిన బార్బర్‌ను ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఈ ముగ్గురికీ ప్రారంభ పరీక్షల్లోనే నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. అయినప్పటికీ ప్రత్యేక వార్డులోనే ఉంచి పరిశీలించారు. ఆ ముగ్గురూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో వారిని కూడా సోమవారం డిశ్చార్జి చేశారు. అనుమానంతో ప్రత్యేక వార్డులో ఉంచిన ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌ను కూడా డిశ్చార్జి చేశారు. ప్రభుత్వమే నన్ను కాపాడింది కరోనా వైరస్ సోకిన తనకు సత్వరం మెరుగైన చికిత్స అందించి ప్రభుత్వమే తన ప్రాణాలు కాపాడిందని రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న విద్యార్థి చెప్పాడు. అతడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాను ఇటలీ నుంచి వచ్చాక ప్రభుత్వ అధికారులు తనను కలిశారని, తనకు జాగ్రత్తలు తెలిపారని వీడియోలో పేర్కొన్నాడు. అప్పటికి తనకు ఎలాంటి లక్షణాలు లేవని, రెండు రోజుల తర్వాత దగ్గు రావడంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. వెంటనే స్పందించి పెద్దాస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించారన్నాడు. అప్పటి నుంచి తనకు ధైర్యం చెబుతూ తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపాడు. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుందన్నారు. ప్రభుత్వ రంగంలో తనకు మంచి వైద్యం లభించిందన్నారు. పారిశుద్ధ్యం కూడా చాలా బాగా చేశారన్నాడు. కరోనా కట్టడికి పురపాలక శాఖ కంట్రోల్ రూం అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 180059924365 కరోనా వైరస్ కట్టడికి సంబంధించి ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు పురపాలక శాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఈ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తారు. పారిశుధ్య నిర్వహణ, ఇతర అంశాలను పురపాలక శాఖ దృష్టికి తేవడానికిగానీ ఏమైనా సలహాలు, సూచనల కోసం ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. పన్నులు ఆన్లైన్లో చెల్లించండి పట్టణాలు, నగరాల్లోని ప్రజలు ఆస్తిపన్ను, ఇతర పన్నులను ఆన్లైన్ విధానంలో చెల్లించాలని పురపాలక శాఖ కోరింది. ప్రస్తుతం కరోనా కట్టడికి రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాలకు రాకుండా ఉండాలని పురపాలక శాఖ కోరింది. పన్నుల చెల్లింపునకు మార్చి 31తో తుది గడువు. కాగా పరిస్థితిని సమీక్షించిన మీదట పన్నుల చెల్లింపు గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఇక స్మార్ట్ వాష్ రూమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో జనాభా అవసరాలకు తగ్గట్టు సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ (అర్బన్) మార్గదర్శకాల మేరకు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర పద్ధతుల్లో టాయిలెట్లు, యూరినల్స్, హ్యాండ్‌వాష్‌ల సదుపాయంతో సమీకృత వాష్‌రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. టాయిలెట్, యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఒకే సముదాయంలో ఉండనున్నాయి. వీటికి అదనంగా ఏటీఎం, ఫొటో కాపీయింగ్ (జిరాక్స్), వైఫై, ఇంటర్నెట్, ప్రింటర్, మీ–సేవాలతో పాటు ఆహ్లాదకరమైన కేఫే సదుపాయాన్ని కల్పిస్తారు. స్మార్ట్ వాష్ రూమ్‌లో ఏర్పాటు చేసే ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు ప్రకటనలతో ఆదాయం వచ్చే మార్గాలుంటే వాష్‌రూమ్‌ల వినియోగానికి చార్జీలు వసూలు చేయరు. హైదరాబాద్‌లో పలు చోట్ల వాష్‌రూమ్స్, ఏటీఎం, కేఫేలతో నిర్మించిన ‘లూ కేఫే’లను ఆదర్శంగా తీసుకుని వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. జనాభాకు తగ్గట్టు.. పురుషుల కోసం 100 నుంచి 400 మందికి టాయిలెట్ సీట్ ఏర్పాటు చేయాలని, జన సంచారం 400 మందికి మించి ఉంటే, ఆపై 250 మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 50 మందికి ఒక యూరినల్ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఒక్క టాయిలెట్, యూరినల్‌కు ఒక హ్యాండ్‌వాష్‌ను ఏర్పాటు చేయనుంది. మహిళల కోసం 100 నుంచి 200 మందికి రెండు టాయిలెట్ సీట్లు, 200 మందికి మించితే ప్రతి 100 మందికి అదనంగా మరో ఒక టాయిలెట్ సీట్‌ను నిర్మించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఏర్పాటు చేయరు. సామూహిక మరుగుదొడ్ల విషయానికి వస్తే ప్రతి 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున టాయిలెట్లు నిర్మిస్తారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. పీపీపీ భాగస్వామ్యంతో.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో స్థానికంగా సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్, సామూహిక మరుగుదొడ్లకు ఉన్న అవసరాలను గుర్తించేందుకు అధ్యయనం చేసి అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఆదేశించారు. పీపీపీ విధానం లేదా ప్రైవేటు వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సుదీర్ఘ కాలం మన్నిక కలిగిన సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్లను కోరారు. పీపీపీ భాగస్వామ్యంతో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీ ఎఫ్‌వోటీ) విధానంలో పురపాలికల్లోని వాణిజ్యపర ప్రాంతాల్లో స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ కాంప్లెక్స్‌లను రిహాబిలేట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (ఆర్వోటీ) కింద స్మార్ట్ వాష్ రూమ్స్‌గా పునర్నిర్మించేందుకు ప్రైవేటు పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ వాష్ రూమ్స్‌ల ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, స్వయం సహాయక సంఘాలు తదితర వాటి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను (ఈవోఐ) ఆహ్వానించాలని కమిషనర్లను ఆదేశించారు. స్వచ్ఛ బారత్ మార్గదర్శకాల ప్రకారం ఒక స్మార్ట్ వాష్ రూమ్‌లో ఒక టాయిలెట్ నిర్మాణానికి రూ.98 వేలు, యూరినల్ ఏర్పాటుకు రూ.32 వేల వరకు వ్యయాన్ని అనుమతించనున్నారు. మూడు పద్ధతుల్లో నిర్మాణం.. ప్రైవేటు సంస్థల డిజైన్లకు అనుగుణంగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ల నిర్మాణాన్ని అనుమతించనున్నారు. అయితే, డిజైన్లను స్థానిక పురపాలిక/జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. పురపాలిక/జిల్లా కమిటీ రూపొందించిన డిజైన్ ప్రకారం స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవచ్చు. అయితే, స్థానిక లేఅవుట్‌కు తగ్గట్టు డిజైన్‌కు చిన్నచిన్న మార్పులు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ సముదాయాల స్థానంలో కొత్తగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ను నిర్మిస్తారు. సమయ పాలన.. సామూహిక టాయిలెట్లు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు బాగా వినియోగంలో ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, విమానాశ్రాయాల వద్ద ఉండే స్మార్ట్ వాష్‌రూమ్స్ 24 గంటలు వినియోగంలో ఉంటాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉండే వాటికి ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు డిమాండ్ ఉండనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాష్ రూమ్స్ నిర్వహించనున్నారు. -
ఏపీలో 103 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు
-
గ్రేటర్ ఎన్నికలకు వేళాయే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన పుర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది. కార్పొరేషన్లకు మళ్లీ కోత.. రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్‌కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. ఆలయాలకు రూ.400 కోట్లు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. -
‘పుర’ పదవుల్లో మహిళలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ పదవుల్లో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం 103 చైర్పర్సన్ల పదవుల్లో 51 మహిళలకే కేటాయించింది. రాష్ట్రంలో 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ల పదవులకు పురపాలక శాఖ ఆదివారం రిజర్వేషన్లను ఖరారు చేసింది. వాటిలో ఎస్టీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు 7, ఎస్సీ మహిళకు 7, బీసీ జనరల్‌కు 17, బీసీ మహిళకు 17, ఓసీ జనరల్‌కు 26, ఓసీ మహిళకు 26 చైర్పర్సన్ పదవులను రిజర్వ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. మిగిలిన మున్సిపాలిటీలకు కోర్టు కేసులు, సాంకేతిక కారణాలతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక వాటికి ఎన్నికలను నిర్వహిస్తారు. పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసిన 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలు.. ఎస్టీ – మహిళ: రేపల్లె ఎస్టీ – జనరల్: ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), శ్రీకాళహస్తి ఎస్సీ – మహిళ: కొవ్వూరు, నర్సీపట్నం, పొన్నూరు ఎస్సీ – జనరల్: నాయుడుపేట, పుత్తూరు, తాడేపల్లి బీసీ – మహిళ: ఆదోని, ఆమదాలవలస, భీమవరం, ధర్మవరం, మండపేట, మంగళగిరి, నరసాçపురం, పలమనేరు, పార్వతీపురం, పెడన, పెద్దాపురం, వెంకటగిరి, యలమంచిలి బీసీ – జనరల్: బొబ్బిలి, డోన్, జగ్గయ్యపేట, కల్యాణదుర్గం, కొండపల్లి, మాచర్ల, నగరి, పలాస–కాశీబుగ్గ, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయదుర్గం, వినుకొండ, ఎమ్మిగనూరు ఓసీ – మహిళ: అమలాపురం, బాపట్ల, గుత్తి, గుంతకల్లు, ఇచ్ఛాపురం, జంగారెడ్డిగూడెం, కదిరి, కందుకూరు, కావలి, మదనపల్లి, నంద్యాల, నూజివీడు, పిఠాపురం, రామచంద్రాపురం, సాలూరు, సామర్లకోట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తుని ఓసీ– జనరల్: ఆళ్లగడ్డ, బద్వేలు, చిలకలూరిపేట, చీరాల, గుడివాడ, గూడూరు (నెల్లూరు జిల్లా), హిందూపురం, కుప్పం, మార్కా పురం, మైదుకూరు, నందికొట్కూరు, నరసరావుపేట, నిడదవోలు, పాలకొల్లు, పిడుగురాళ్ల, పుంగ నూరు, రాజంపేట, రాయచోటి, సూళ్లూరుపేట, తాడిపత్రి -
మేం ఎలా చేయగలం?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దూకుడుతో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఈ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ మున్సిపల్ అధికారులు మెలికపెడుతుండటం, రిజిస్ట్రేషన్ చేయడం వరకే తమ పని అని, ఆ లేఅవుట్ అక్రమమో,సక్రమమో తామెలా తేలుస్తామని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇరు శాఖల మధ్య సమన్వయలోపం, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ల విషయంలో కఠినంగా ఉం డాలని నిబంధనలు చెబుతుండటం, రిజి స్ట్రేషన్ చేయకూడని లేఅవుట్లను మున్సిపల్ శాఖ సరిగా గుర్తించలేకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ మున్సిపల్ వర్గాల నుంచి లేఖలు వచ్చిన చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆ మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది. అయితే, ఈ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ శాఖను కోరినా మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పురపాలక శాఖ ఇంకా స్పందిచనట్లు తెలుస్తోంది. పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు 15–20 ఏళ్లుగా లే అవుట్ల వ్యాపారం రియల్ వ్యాపారులకు కాసులు కుమ్మరిస్తోంది. అయితే, వీరు అనుమతులు తీసుకోకపోవడం, నిబంధన లు పాటించకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తోంది. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి సంస్థల అనుమతుల్లేకుండానే అంతస్తుల మీద అంతస్తులు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కొత్త మున్సిపల్ చట్టంలో లేఅవుట్లపై కఠిన నిబంధనలు విధించారు. స్పష్టత ఇవ్వండి: ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో తామెలా ముందుకెళ్లాలన్న దానిపై చట్టపరంగా ఉన్న సానుకూలతలు తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కమి షనర్ల నుంచి లేఖలు రావడం ప్రారంభం కాగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఈ లేఖను పురపాలక శాఖకు పంపగా, మొన్నటివరకు ఎన్నికల హడావుడిలోనే ఉన్న మున్సిపల్ అధికారులు దీనిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 250 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆ వివరాలు ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నోటీస్ బోర్డుల్లో డిస్ప్లే చేయడంతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు 15 మందితో యాక్షన్ టీం కూడా తయారు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ వర్గాలు కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. కొత్త చట్టం ఏం చెబుతోందంటే! కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణాలు, నగరా ల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్మాలంటే నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక లేఅవుట్ ప్లాన్‌కు మున్సిపల్ అధికారులు 21 రోజుల్లోగా అనుమతిస్తారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి ప్రాధికార సంస్థలు అనుమతించిన లేఅవుట్లనే రిజిస్ట్రేషన్ అధికారు లు రిజిస్టర్ చేయాలి. ఈ విషయంలోనే మున్సిపల్ కమిషనర్ల పేరిట రిజిస్ట్రేషన్ల శాఖకు లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై లేఖలు వెళ్తున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి వెళ్తున్న లేఖల విషయంలో గందరగోళం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబు తున్నారు. కొన్ని మున్సిపాలిటీల నుంచి వస్తున్న ఇలాంటి లేఖలతో పాటు ఏ సర్వే నంబర్లో లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దో ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారని, కొన్నిచోట్ల లేఖ లురాసి వదిలేస్తున్నారని చెబుతున్నారు. లేఖలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఏ లేఅవుట్ అక్రమమో, ఏ లేఅవుట్ సక్రమమో తామెలా గుర్తిస్తామని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏదైనా స్థలం, భూమి లేదా భవనాన్ని రిజిస్టర్ చేయడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. ఒకవేళ డెవలపర్లను లేఅవుట్ అనుమతులు చూపెట్టా లని అడిగినా నకిలీ అనుమతులు చూపెడితే వాటిని గుర్తించలేమంటున్నారు. ఏదేమైనా తమ మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖలు వచ్చిన అన్ని మున్సిపాలిటీల్లో 10 రోజుల నుంచే పూర్తిగా కొత్త లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని వారు చెబుతున్నారు. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. -
అమరావతికి పంచాయతీ ఎన్నికలే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతాన్ని టీడీపీ హయాంలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించకపోవడంతో.. ఆ 29 గ్రామాల్లో ఈ సారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిని రాజధాని నగరంగా ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ 29 గ్రామాలను పట్టణ ప్రాంతంగానో, నగర ప్రాంతంగానో ప్రకటించడానికి ప్రభుత్వం తరఫున చిన్న ప్రయత్నం కూడా జరగలేదు. గ్రామ పంచాయతీని పట్టణ లేదా నగర ప్రాంతంగా అధికారికంగా గుర్తించాలంటే గరిష్టంగా మూడు నాలుగు నెలలకు మించి సమయం పట్టదు. అయితే నాలుగేళ్ల కాలంలో ఆ గ్రామాలన్నింటిని కలిపి నగర ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియను పూర్తిగా విస్మరించారు. పట్టణ లేదా నగర ప్రాంతంగా మార్చేందుకు సంబంధిత ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధి ద్వారా లేదా జిల్లా కలెక్టరు స్వయంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలి. తర్వాత నగర ప్రాంతంగా మార్చేందుకు అంగీకారం తీసుకునేందుకు 29 గ్రామ పంచాయతీల్లో వేర్వేరుగా తీర్మానాల ద్వారా ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే తర్వాత ఆ ప్రాంతాన్ని పంచాయతీరాజ్ శాఖ తమ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తుంది. మున్సిపల్ శాఖ పట్టణ ప్రాంతంగా గుర్తిస్తూ నోటిఫై చేయాలి. ఆ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. గ్రామ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసింది. -
మిగిలింది ‘రిజర్వేషన్లే’
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’కు న్యాయపరమైన అవరోధాలు దాదాపుగా తొలగిపోవడంతో త్వరలోనే పుర‘పోరు’కు నగారా మోగనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుపై పురపాలకశాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్ల జాబితా ఈసీకి అందిన మరుక్షణమే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అయితే రిజర్వేషన్ల ఖరారుపై మున్సిపల్‌శాఖ ఆచితూచి అడుగేస్తోంది. 65 మున్సిపాలిటీలపై స్టే.. ప్రధాన కేసు కొలిక్కి వచ్చినా.. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు స్థానిక నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి దాదాపు 65 మున్సిపాలిటీల పరిధిలో ఎన్ని కలను నిలుపుదల చేస్తూ స్టే విధించారు. ఈ ఉత్తర్వులు తొలగితేగానీ అడుగు వేసే పరిస్థితి లేదు. మున్సిపల్ అధికారులు మాత్రం హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులు తాజా పరిణామాలను చర్చించారు. రిజర్వేషన్ల కసరత్తును మొదలుపెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇది పూర్తి చేయడానికి 2, 3 రోజులు పడుతుందని, ఈలోగా స్టేలున్న మున్సిపాలిటీలపై స్పష్టత వస్తుందని మున్సిపల్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. స్టేలు ఉన్న మున్సిపాలిటీలపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ సింగిల్ బెంచ్‌లో కౌంటర్ దాఖలు చేయాలనే యోచనలో మున్సిపల్‌శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లే తరువాయి..! ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల ఖరారు, జాబితా తయారీ, వార్డుల విభజన పూర్తైనందున ప్రస్తుతం రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయనున్నారు. ఈ కసరత్తు పూర్తి చేశాక పురపాలకశాఖ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 నగర, పురపాలక సంఘాలకు ప్రస్తుతం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. అయితే వాటిలో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాల కాలపరిమితి ముగియలేదు. జడ్చర్ల, నకిరేకల్‌లలో ఇంకా గ్రామాల విలీనం పూర్తి కాలేదు. సాంకేతిక కారణాల వల్ల పాల్వంచ, మందమర్రి, మణుగూరు ఏజెన్సీ మున్సిపాలిటీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు. సీఎంతో అధికారుల భేటీ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పురపాలకశాఖ అధికారులు మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతిని సీఎం ముందుంచిన అధికారులు.. తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఎం సూచనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు, పుర‘పోరు’పై అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
రాజధాని అభివృద్ధి కమిటీ విధి విధానాలు ఖరారు
సాక్షి, అమరావతి: రాజధానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన, సమగ్రాభివృద్ధి కోసం ఇటీవల నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు, అధికారాలను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం మునిసిపల్ శాఖ కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో ఏ అధికారితోనైనా సంప్రదింపులు జరిపి చర్చించవచ్చు. అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించవచ్చు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించవచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల నుంచి, వివిధ వర్గాల సాధారణ ప్రజల నుంచి, ఆన్లైన్ ద్వారా సమాచారం పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లనైనా తెప్పించుకుని విశ్లేషించేలా ఈ కమిటీకి ప్రభుత్వం అధికారాలను కల్పించింది. కమిటీ కన్వీనర్, సభ్యులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చారు. వసతి, వాహన సౌకర్యం కల్పిస్తారు. కమిటీకి కార్యాలయం ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కేటాయింపు బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ ఈ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కమిటీ జిల్లాల పర్యటన సందర్భంగా కలెక్టర్లు సమన్వయ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైన నిధులు సీఆర్డీఏ నుంచి సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కార్యదర్శితో సంప్రదింపులు జరిపిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో నగర ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అధికారులకు సూచించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని.. ఎప్పటికీ పట్టా కూడా రాదని.. చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘ చర్చ.. నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలని.. ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాలిటీకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా.. వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై వివరాలు అడిగారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్మించే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని.. తాడేపల్లి మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చించిన సీఎం.. వారికి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు.. ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలన్నారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి సాధ్యమవుతాయని, మున్సిపల్ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలన్నారు. ఏ పౌరుడు, బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. (చదవండి: అక్టోబరు 4న వైఎస్సార్ వాహన మిత్ర ప్రారంభం) -
ఫోర్జరీ చేస్తే కేసు పెట్టరా?
సాక్షి, హైదరాబాద్ : ‘పార్లమెంటు సభ్యుడి సంతకాన్ని మున్సిపల్ అధికారులు ఫోర్జరీ చేస్తే సదరు ఎంపీ ఎందుకు పోలీసు కేసు పెట్టలేదు. వార్డుల విభజన ఇతర సమాచారాన్ని తెలియజేయకపోయినా, అరకొరగా తెలిపినా ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఎంపీలు తమ నిరసన ఎందుకు తెలియజేయలేదు. నియోజకవర్గంలో లేకపోయినా, ఢిల్లీ లేదా విదేశాల్లో ఉన్నా ఈ–మెయిల్ ద్వారా ఎంపీలు తమ అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉన్నా ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా రిట్ పిటిషన్లు దాఖలు చేసి హైకోర్టును ఎలక్షన్ ట్రిబ్యునల్‌గా మార్చేస్తే ఎలా..’అని హైకోర్టు ఐదుగురు ఎంపీల రిట్లపై ప్రశ్నలు సంధించింది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా చేశారని, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నామని అధికారులు చెప్పడం వాస్తవం కాదంటూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్(కరీంనగర్), ధర్మపురి అరవింద్(నిజామాబాద్), సోయం బాపూరావు(ఆదిలాబాద్), కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(భువనగిరి), ఎ.రేవంత్‌రెడ్డి(మల్కాజిగిరి)లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో ఎంపీలు తాము ఏ పార్టీనో పేర్కొనకపోవడాన్ని ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అభ్యంతరాలు తన నుంచి స్వీకరించినట్లు మున్సిపల్ అధికారులు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్ ఎన్ని కల ముందస్తు ప్రక్రియ తప్పులతడకగా జరిగిందని, వీటిని శాస్త్రీయంగా చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిర్మల్‌కు చెందిన కె.అన్జుకుమార్‌రెడ్డి, న్యాయవాది ఎస్.మల్లారెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. 29రోజుల్లో ఎలా సాధ్యం మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తి చేసేందుకు 150 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరితే సింగిల్ జడ్జి 109 రోజులు ఇచ్చారని, అయితే ప్రభుత్వం కేవలం 28 రోజుల్లోనే పూర్తి చేయడాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది నరేష్‌రెడ్డి తప్పుపట్టారు. ఇష్టానుసారంగా చేసి అంతా చట్ట ప్రకారం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చట్ట ప్రకారమే చర్యలు.. అభ్యంతరాలన్నింటినీ చట్ట ప్రకారం పరిష్కరించామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. ప్రజాప్రతినిధులకు అన్ని అవకాశాలు ఇవ్వడమే కాకుండా పత్రికల్లో ప్రకటనల్ని విడుదల చేశామన్నారు. వీటిపై అప్పుడు స్పందిం చని ఎంపీలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిం చడం సబబుకాదన్నారు. కోర్టు అనుమతి ఇస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. డైరెక్టర్‌కు పంపిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాల ప్రతులను అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. స్టే లేని చోట్ల సిద్ధం: ఎస్ఈసీ కోర్టు స్టే ఉత్తర్వులు లేని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ చెప్పారు. రాష్ట్రంలో 126 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని, అయితే 75 మున్సిపాలిటీలపై సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు జారీ చేశారని, మిగిలిన 51 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. -
యాదాద్రికి మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి పుర పాలక శాఖ బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రగతికి పెద్దపీట వేస్తోంది. తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దడానికి యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. 25,817 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఆలయ నిర్మాణం మొదలు, పునుల పురోగతి తదితర పనులను తరచూ సమీక్షిస్తున్న కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లు మున్సిపల్ శాఖ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేసింది. యాదాద్రి దేవాలయ ఆధునిక పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుందని అంచనా వేసిన పురపాలక శాఖ.. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యమిచి్చంది. పట్టణీకరణకు సగం.. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే యాదాద్రిలో వ్యవ సాయం కనుమరుగు కానుంది. ప్రస్తుతం 9,944.45 (38.52%) ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. మాస్టర్ ప్లాన్‌లో దీన్ని 3,339.5 (13.14%) ఎకరాల మేర పొందుపరిచారు. పట్టణీకరణకు 11,310.85 (43.81%) ఎకరాలు నిర్దేశించారు. యాదగిరిగుట్టలో కొండ లు, గుట్టలు కరిగిపోనున్నాయి. గతంలో కొండ లు, గుట్టలు, 3,667.23 (14.22%)ఎకరాల్లో ఉండగా.. మాస్టర్‌ప్లాన్‌లో 2,423.6 (9.39%) ఎకరాలకు పరిమితం చేసింది. వాణిజ్య అవసరాలకు పెద్దపీట యాదాద్రికి వచ్చే భక్తుల అవసరాలకు సరిపడా మౌలిక సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్‌లో 2,557.25 ఎకరాలను రెసిడెన్షియల్, 242.28 ఎకరాల మేర కమర్షియల్ జోన్‌కు నిర్దేశించింది. ప్రస్తుతం కమర్షియల్ జోన్ 43.63 ఎకరాల్లోనే ఉంది. ఇప్పటికే స్పెషల్ డెవలప్మెంట్ ప్రాంతానికి 1,698 ఎకరాలు కేటాయించింది. ఇలా వివిధ అవసరాలకు జోన్లను నిర్దేశించిన పురపాలక శాఖ.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపింది. దీనికి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే.. మాస్టర్‌ప్లాన్ కార్యరూపం దాల్చనుంది. -
పురపాలనలో పౌరుడే పాలకుడు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : పురపాలనలో పౌరుడే పాలకుడని, ఇదే నూతన పురపాలక చట్ట స్పూర్తి అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ రెండు రోజుల పాటు మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన నూతన పురపాలక చట్టం సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాత చట్టంతో పొల్చితే నూతన చట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, టౌన్ ప్లానింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించిందని కేటీఆర్ తెలిపారు. ప్రజలకోసం, పౌర సేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమయిన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకువచ్చారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ప్ సర్టిఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఇలాంటి స్పూర్తిలోంచి వచ్చినవేనని తెలిపారు. అందరం కలిసి నూతన పురపాలక చట్టం స్పూర్తిని కొనసాగిస్తూ దాన్ని అమలు చేద్దాం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్యం, గుడ్ గవర్నెన్స్, పారదర్శకమైన పాలనను అందించేందుకు కలిసి ముందుకు సాగుదామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మున్సిపల్ కమీషనర్లు తమ సిబ్బందితోనూ నూతన మున్సిపల్ చట్టంపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమీషనర్లు చట్టంలో లేని వినూత్నమైన పద్దతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాము మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యాపేట, పీర్జాదీగూడ మున్సిపాలీటీలు వివిధ అంశాల్లో జాతీయస్ధాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమీషనర్లను కోరారు. దీంతోపాటు జాతీయస్ధాయిలో పురపాలనలో విన్నూతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు మావంతు సహకారం అందజేస్తామన్నారు. పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పాదర్శకత మరింత పెరుగుతుందన్న మంత్రి, సామాజిక మాద్యమాలను సైతం వినియోగించుకుంటూ ప్రజల భాగసామ్యాన్ని పెంచాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ర్టస్థాయిలో మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన పురపాలక సంఘాల కమీషనర్లకు మంత్రి పురస్కారాలను అందించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కూమార్, తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : పురపాలకశాఖ మంత్రిగా కె. తారక రామారావు సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఆదివారం మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మసాబ్ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో సంబంధిత విభాగాధిపతులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. దీనితోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపైన విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతానని తెలిపిన మంత్రి.. శాఖ కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపై నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు విభాగాధిపతులు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ లైసెన్స్ రూల్స్ అమలు బాధ్యత మున్సిపల్ శాఖదే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ముప్పు కలిగించే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు, షీట్లు, ఫిలిమ్స్ వంటి వాటిని తయారీ స్థాయిలోనే ఉత్పత్తి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జీవో 79 జారీ చేశామని, దీనిని తొలిసారి ఉల్లంఘించిన ఉత్పత్తిదారులకు రూ.50 వేలు, రెండోసారి అదే తప్పు చేస్తే ఉత్పత్తికిచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తెలిపింది. లైసెన్స్ మంజూరుకు విధించిన కఠిన నిబంధనల్ని అమలు చేసే బాధ్యత మాత్రం మున్సిపల్ శాఖదేనని పీసీబీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. వినాయక విగ్రహాలకు నిషిద్ధ ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారని, వీటి వల్ల పర్యావరణానికి ముప్పు రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఎల్బీనగర్కు చెందిన వైవీ మురళీకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిల్ దాఖలు తర్వాత ఎల్బీనగర్, బోయినపల్లి, సుచిత్ర, గండిమైసమ్మ క్రాస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకూ, కొంపల్లి, మియాపూర్, ఉప్పల్, నాగోలు వంటి ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వర్షానికి తడవకుండా కప్పిన ప్లాస్టిక్ కవర్లను తొలగించామని, వాటిని పరీక్షలకు పంపామన్నారు. 40 తయారీ సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తే ఎనిమిది చోట్లే ప్రమాణాలకు విరుద్ధంగా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు యూనిట్లను మూసివేశామని, షాపుల నుంచి రూ.32 లక్షలకుపైగా జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారించనుంది. -
రాజధాని రైతులకు వార్షిక కౌలు విడుదల
సాక్షి, అమరావతి: రాజధాని భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు (యాన్యుటీ) మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రాజధాని రైతులకు ఐదో విడతగా 2019–20 సంవత్సరం కౌలు రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో 28,442 మంది రైతుల నుంచి 34,312 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు భూసమీకరణ ప్యాకేజీ కింద పదేళ్లపాటు వార్షిక కౌలు చెల్లించాల్సి వుంది. జరీబు భూములకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున ప్రతి సంవత్సరం పది శాతం పెంపుతో పదేళ్లపాటు ఈ కౌలు రైతులకు ఇవ్వాల్సి వుంది. గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఈ కౌలును చెల్లించగా ఐదో సంవత్సరం పది శాతం పెంపుతో ఇప్పటి ప్రభుత్వం రూ.187.40 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులుగా టీడీపీ నేతలు, మద్ధతుదారులు కౌలు చెల్లింపును నిలిపివేస్తున్నారని పుకార్లు సృష్టించారు. రాజధానిపై టీడీపీ నేతలు రకరకాల పుకార్లు వ్యాపింపజేసి రైతులు, స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తించారు. కానీ ప్రభుత్వం రాజధాని రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పది శాతం పెంపుతో వార్షిక కౌలును విడుదల చేసింది. -
కొత్తగా 40 వేల ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో, పారదర్శకంగా అందజేయడానికి మున్సిపల్‌శాఖ 4 వేల సచివాలయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో కొత్తగా మరో 40 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వార్డు సచివాలయం ఏర్పాటుకు కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా ఉండనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకు రావడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాల్సి ఉందని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బుధవారం మున్సిపల్ డైరెక్టర్ జి.విజయకుమార్ వార్డు సచివాలయాల పరిస్థితి, వాటి ప్రాధాన్యత, ఉద్యోగుల విద్యార్హతలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, మున్సిపల్‌శాఖ కార్యదర్శి శ్యామలరావు తదితరులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కొత్తగా నియమించనున్న ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండేలా విద్యార్హతలు నిర్ణయించనున్నట్టు చెప్పారు. వీరి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్జగన్ మోహన్‌రెడ్డి ఆశించిన రీతిలో సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కాగా, వీరి నియామకంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వారం రోజులలోపు నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం. 110 మున్సిపాల్టీల్లో కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలు.. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లో దాదాపు 81 వేల వలంటీర్లను నియమించనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న 4 వేల వార్డు సచివాలయాల్లో 40 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఒక్కో సచివాలయంలో 10మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం కొత్తగా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. -
ఏపీ వ్యాప్తంగా 4వేల వార్డు సచివాలయాలు
-
4,000 వార్డు సచివాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ ప్రాంతాల్లో 4,000 వార్డు సచివాలయాల ఏర్పాటుకు మున్సిపల్‌శాఖ కసరత్తు చేస్తోంది. మరో వారం నుంచి పది రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు 81 వేల మంది వార్డు వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటవుతాయి. వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. స్థానిక అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లోని గదుల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలి. ఇవి అందుబాటులో లేని చోట ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ప్రైవేట్ భవనంలో ఓ గదిని అద్దెకు తీసుకోవాలి. వార్డు సచివాలయానికి ఫర్నీచర్‌ను ప్రభుత్వమే సమకూరుస్తుంది. కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా.. జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. కనిష్టంగా 4 వేలు, గరిష్టంగా 6 వేలు జనాభా ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం సాలీనా 1.098 శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జనాభా ఐదు వేల కంటే అధికంగా ఉంటే అదనంగా మరో వార్డు సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి కంటే జనాభా తక్కువగా ఉంటే సమీప వార్డు సచివాలయానికి జత చేస్తారు. వార్డు సచివాలయాలను నిర్ణయించే సమయంలో మురికివాడల సరిహద్దులు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్డు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మున్సిపల్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ విభాగం సాయంతో మ్యాప్ రూపొందించి సీరియల్ నంబర్లు కేటాయిస్తారు. వార్డు వలంటీర్లు స్థానిక పరిస్థితులు, సమస్యలపై వార్డు సచివాలయానికి రోజూ నివేదిక ఇవ్వాలి. వార్డు కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ స్థాయికి తగ్గకుండా ఉండాలని నిర్దేశించారు. వీరిని మున్సిపల్ కమిషనర్ నియమిస్తారు. విధులు, బాధ్యతలు ఇవీ... ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చేలా వార్డు వలంటీర్లు కృషి చేయాలి. దీన్ని నిర్ధారించుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తారు. విధుల నిర్వహణలో అలక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సచివాలయాల్లోని కో–ఆర్డినేటర్ మున్సిపల్ కమిషనర్‌కు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా వలంటీర్‌పై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. 1.70 లక్షలకు చేరుకున్న దరఖాస్తులు పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్ల పోస్టులకు మంగళవారం సాయంత్రానికి 1.70 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం వీరి విద్యార్హతలను డిగ్రీ నుంచి ఇంటర్‌కు తగ్గించడంతోపాటు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వార్డు వలంటీర్, ఇతర ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించాలని నిర్ణయించడంతో వీరి సంఖ్య 81 వేలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వంద మార్కులకు ఇంటర్వూ్య వార్డు వలంటీర్ల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వూ్యల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 మార్కులు, బీసీ, ఓసీ అభ్యర్థులకు 40 మార్కులు చొప్పున వస్తే వారిని అర్హులుగా ప్రకటించనున్నారు. ఈమేరకు నియామక అర్హతలపై మున్సిపల్ శాఖ మంగళవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. వంద మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వూ్యలో ఒక్కో విభాగానికి 20 మార్కులు చొప్పున ఐదు విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. చైర్మన్‌తోపాటు మరో ఇద్దరు సభ్యులు ఇంటర్వూ్యలను నిర్వహిస్తారు. వేర్వేరుగా మార్కులు నిర్ణయించి అనంతరం ఎంపిక కమిటీ చైర్మన్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని అర్హులను ప్రకటిస్తారు. అభ్యర్థి ప్రధానంగా అదే వార్డుకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వర్తమాన రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. గతంలో ప్రభుత్వ సంస్థల్లో, ఎన్జీవోల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మున్సిపల్ కమిషనర్లు నోటీసు బోర్డులో పొందుపరచాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. -
‘రెరా’... బిల్డర్లు పట్టించుకోరా..?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) కార్యరూపం దాల్చడంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్టు, లేఅవుట్ విధిగా ‘రెరా’లో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా బిల్డర్లు/డెవలప ర్లు పట్టించుకోవడంలేదు. 2017లో ‘రెరా’చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2,500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు) ఆమోదముద్ర వేస్తే.. అందులో 2,500 ప్రాజెక్టులే పేర్లను నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాతో వెసులుబాటు! స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమో దు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గత నవంబర్ 30 వరకు ఆన్లైన్లో ‘రెరా’లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత రూ. 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ చైర్మన్ రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. అవగాహనాలోపం..! వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా ‘రెరా’ను పకడ్బందీగా అమలు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా ‘రెరా’లో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధన ఉండటంతో రియల్టర్లు ‘రెరా’లో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు భరో సా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండటం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది. ‘రెరా’లో నమోదు అనంతరమే.. స్థలాలు, ఫ్లాట్లు విక్రయాలకు చెందిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది. ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమా ల్లో ‘రెరా’రిజిస్టర్ నంబర్‌ను ప్రచురించాలని స్పష్టం చేసింది. బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా ‘రెరా’లో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ‘రెరా’కు తగినంత సిబ్బంది లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అం శంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం చేయడంలో పురపాలక శాఖ విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. భారీగా జరిమానాలు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బిల్డర్లపై రెరా సంస్థ భారీగానే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు 400 ప్రాజెక్టులపై రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు జరిమానాలు విధించి రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇవి కేవలం బడాసంస్థలకు సంబంధించినవి మాత్రమే కాగా, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ‘రెరా’అధికారులు మాత్రం మధ్యతరగతి రియల్ మోసాలు తమ వరకు రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘రెరా’లో నమోదు చేసుకోకుండానే వెంచర్లు చేసి అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే, 2017 జనవరి తర్వాత వెలిసిన లేఅవుట్ల విషయంలో ఇప్పటి నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తామని ‘రెరా’కార్యదర్శి విద్యాధర్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమ లేఅవుట్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాగానే సమాచారం తమకు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమన్వయం కుదుర్చుకునే పనిలో ఉన్నామని, సదరు డెవలపర్‌కు చెందిన సమస్త సమాచారాన్ని ఆ శాఖ నుంచి తీసుకుంటామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
99 మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలక వర్గాల పదవీ కాలం ముగియనున్న 99 పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. వచ్చే నెల 2వ తేదీతో వీటి పదవీ కాలం ముగియనుండటంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వీటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎన్నికలు జరిగే వరకు ఆయా పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న మున్సిపాల్టీల స్థాయికి అనుగుణంగా ప్రత్యేక అధికారుల నియామకాలు జరగనున్నాయి. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు– 2, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఇప్పటికే 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, మూడు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 94 మున్సిపాల్టీల్లో కులాల వారీ ఓటర్ల గణనను పూర్తి చేశారు. ఇందులో 85 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలన గడువు పొడిగింపు రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, 3 నగర పంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రత్యేక పాలన జూన్ 30న ముగియడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాల్టీ, రాజాం, నెల్లిమర్ల, రాజంపేట నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. -
మున్సి‘పోల్స్’పై సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చెప్పినట్టు జూలై నెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. వచ్చే జూలైతో పురపాలికల గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉం టుందని వారంటున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక కనీసం 151 రోజుల గడువు అవసరమని, వార్డులవిభజన, ఓటరు నమోదుకు నిర్ణీత గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వ్యవహారం సెప్టెంబర్ మాసాంతంకల్లా ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. కోర్టుకెళ్లిన ఎన్నికల సంఘం ఈ ఏడాది జూలై 2న రాష్ట్రంలోని 53 పురపాలక సంఘాలు, 3 నగర పాలక సంస్థల పాలకవర్గాలకు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు దగ్గరపడుతున్నా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో భాగంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ పురపాలక శాఖ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ ఆసక్తి కలిగిస్తోంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు 30 రోజులు, దాని తుది నోటిఫికేషన్‌కు మరో వారం రోజులు, వార్డులవారీగా ఓటర్ల నమోదుకు నెల రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు 60 రోజులు, వివిధ కేటగిరీలవారీగా వార్డుల విభజనకు వారం రోజులు, వార్డులు, చైర్పర్సన్ల రిజర్వేషన్ల ఖరారుకు మరో వారం .. ఇలా తమకు కనీ సం ఐదు నెలల సమయం పడుతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పేరిట దాఖ లు చేసిన కౌంటర్లో పేర్కొనడం గమనార్హం. కొత్తగా 68 మున్సిపాలిటీలు..! రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో 173 గ్రామపంచాయతీలను విలీనం చేసింది. 131 పంచాయతీలను పొరుగున ఉన్న నగర పాలకసంస్థల్లో కలిపింది. బాదేపల్లి మున్సిపాల్టీలో విలీనమైన జడ్చర్ల పంచాయతీ పదవీకాలం వచ్చే ఏడాది డిసెంబర్ 4తో ముగియనుంది. నకిరేకల్ ఈ ఏడాది డిసెంబర్ 15న మున్సిపాల్టీగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఏర్పడ్డ పురపాలికల్లో వార్డులవారీగా చేయాల్సిన కసరత్తు చాలా ఉండటంతో జాప్యం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ జూలై నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పగా, అధికారులు మాత్రం 151 రోజుల గడువు కావాలని కోర్టులో కౌంటర్ వేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది. -
‘నారాయణ’ దోపిడీ రూ.104 కోట్లు!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గత మూడేళ్లలో మున్సిపల్ స్కూళ్లలో అప్పటి మంత్రి పి.నారాయణ చేపట్టిన ప్రయోగాల పుణ్యమా అని రూ.104 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైంది. మున్సిపల్ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కెరీర్ ఫౌండేషన్ కోర్సులు, అకడమిక్ ఫౌండేషన్ కోర్సులు, స్పార్క్ బ్యాచులు, స్టార్ బ్యాచులతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారు తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో రకరకాల పేర్లతో బ్యాచులు ఉంటాయి. అలాంటి విధానాన్నే మున్సిపల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టారు. ఇందుకోసం నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భారీగా గౌరవ వేతనాలు చెల్లించారు. ఈ కోర్సులు బోధించేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, గైడ్లు, ఇతర మెటీరియల్ అంతా నారాయణ విద్యాసంస్థలకు చెందినదే. ఆయా పుస్తకాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా అర్బన్ లోకల్‌బాడీ కో–ఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు, ఏఎఫ్సీ టీచర్లు, సీఎఫ్‌సీ టీచర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది.. ఇలా వేలాది మందిని నియమించారు. వారికి రూ.వేలల్లో జీతాలు చెల్లించారు. దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత ఫౌండేషన్ కోర్సుల కోసం నారాయణ విద్యాసంస్థలకు చెందిన పాఠ్యపుస్తకాలనే వినియోగించారు. నేరుగా నారాయణ విద్యాసంస్థల మెటీరియల్‌గా చూపించకుండా వాటి అట్టలను మార్చేసి, వాటిని వేరే సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించారు. ఇందుకోసం ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. మున్సిపల్ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నో బ్యాగ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు మున్సిపల్ శాఖ నుంచి రూ.85.15 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులు స్కూళ్లకు చేరలేదని, టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిపోయాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సమాధాన పత్రాలను(ఓఎమ్మార్) స్కాన్ చేయడానికి స్కానింగ్ యంత్రాలు, నెట్ చార్జీలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ప్రతిఏటా రూ.54.51 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ నిధులన్నీ పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే... మున్సిపల్ స్కూళ్లలో చేపట్టిన ప్రయోగాత్మక బోధనకు భారీ ఎత్తున నిధులు చెల్లించేశారు. ప్రైమరీ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.38.25 లక్షల చొప్పున మూడేళ్ల పాటు డ్రా చేశారు. ప్రైమరీ కన్సల్టెంట్ల హానరోరియం కింద ఏడాదికి రూ.23.76 లక్షల చొప్పున చెల్లించారు. హైస్కూల్ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.4.64 కోట్లు, ఎఎఫ్సీ ఏవో టీచర్ల హానరోరియం కింద రూ.1.26 కోట్లు, సీఎఫ్‌సీ టీచర్ల హానరోరియం కింద రూ.10.90 లక్షలు, స్పార్క్ క్లాసుల కోసం రూ.5.83 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఏడాదికి రూ.34.85 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.104.55 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఎస్సీఈఆర్టీ నిబంధనలు బేఖాతర్ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పరిధిలో మున్సిపాల్టీల్లో 2,110 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 300 ఉన్నత పాఠశాలలు, 160 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘నారాయణ’ తరహా బోధనను ప్రయోగాత్మకంగా చేపట్టారు. వాస్తవానికి మున్సిపల్ స్కూళ్లలో నిర్వహణ బాధ్యతల వరకే మున్సిపల్ శాఖకు అధికారం ఉంటుంది. అకడమిక్ వ్యవహారాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే కొనసాగాలి. కానీ, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మున్సిపల్ స్కూళ్ల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా శాఖతో సంబంధం లేకుండానే అకడమిక్ వ్యవహారాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నిబంధనలతో సంబంధం లేకుండానే మున్సిపల్ స్కూళ్లలో నారాయణ తరహా సిలబస్, బోధనను అమల్లోకి తీసుకొచ్చారు. -
ఇల్లు లేని పేదలు ఎందరు?
సాక్షి, హైదరాబాద్: నీడ లేని పేదల లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడు లేని బడుగులను జూన్ 10 కల్లా గుర్తించాలని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించింది. మున్సిపాలిటీల్లో రహదారులు, చెట్లే అడ్డాగా జీవనం సాగిస్తున్న పేదల డేటా సేకరించాలని.. వారందరికీ కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించే వివరాల ఆధారంగా ఇల్లు లేని పేదలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పింఛన్, బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చొరవ చూపాలన్నారు. నీడ లేని వారందరినీ షెల్టర్లకు తరలించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్లు విధిగా షెల్టర్లను సందర్శించాలని, వారికి అందుతున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలుండగా.. ఇందులో 53 మున్సిపాలిటీల్లోనే షెల్టర్లు ఉన్నాయని, 11,389 మంది ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో 5,807 మందికి ఆధార్ కార్డులు, 787 మందికి ఓటరు గుర్తింపు కార్డులు, 1,555 మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. 3,497 మందికి రేషన్ కార్డులు కూడా ఉన్నాయని, 201 మందికి బీమా సౌకర్యం కూడా కల్పించినట్లు కమిషనర్లు వివరించారు. 694 మందిని అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నామని, 5,728 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,050 ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 129 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు వివరించారు. 1,541 మందికి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు. -
కలెక్టర్ల కనుసన్నల్లో పురపాలన
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఇష్టారాజ్యంగా పట్టణ ప్రణాళిక అమలుపరచడం కుదరదు. అయినవారికి అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేసే వీలుండదు. అవినీతిపరులకు కొత్తగా రాబోతున్న పురపాలక చట్టం ముకుతాడు వేయనుంది. ఈ చట్టం ప్రకారం కలెక్టర్ సారథ్యంలోని అధికారుల కమిటీకి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారం రానుంది. ప్రస్తుతం పురపాలికల్లో టౌన్‌ప్లానింగ్ అధికారి (టీపీవో), కమిషనర్ నిర్ణయాధికారం మేరకు అనుమతులు మంజూరవుతున్నాయి. వీటిలో పారదర్శకత లోపిస్తోంది. కాసులు సమర్పిస్తే ఎంతటి అడ్డగోలు నిర్మాణాకైనా అనుమతులు వస్తాయనే విమర్శలున్నాయి. మున్సిపల్ శాఖలో అవినీతి వేళ్లూనుకుందని, ప్రక్షాళన అవసరమని ఇటీవల సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం తరహాలో నయా పురపాలక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. పట్టణాలు, నగరాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని పట్టణ స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల చట్టాలను అధ్యయ నం చేస్తున్నారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలి క సదుపాయాల కల్పనకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త చట్టం ద్వారా అధికారాలు, బాధ్యతలు కల్పించే దిశగా చట్టానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రజా ప్రతినిధులకు బాధ్యత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు కాకుండా కొత్త చట్టం ద్వారా పూర్తిస్థాయిలో జవాబుదారీతనం సక్రమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుంటే వారిపైనా చర్యలు తీసుకునేలా కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నారు. ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టిన పురపాలికల చైర్మన్లు/మేయర్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు చట్టానికి లోబడి వ్యవహరించాలి. అంతేకాదు తమ హయాంలో జరిగిన పనులకు ఆ తర్వాత కూడా వారే బాధ్యులుగా ఉండేలా నిబంధనలు ఉండనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం వివిధ రాష్ట్రాల్లో మనుగడలో ఉన్న మున్సిపల్ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు అధికారుల బృందం ఇటీవల గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పర్యటించి చట్టాలను మదింపు చేసింది. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగడంలో టౌన్‌ప్లానింగ్ శాఖదే కీలక భూమిక. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు మినహాయిస్తే మున్సిపాలిటీల్లో టీపీవోలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే డీటీసీపీ విభాగం లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కొరత, పని భారం కారణంగా ఈ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో మాస్టర్ ప్లాన్/బిల్డింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండానే లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. అవినీతికి తెరలేస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సర్కారు భవిష్యత్తులో పట్టణాలు కాంక్రీట్ జంగిల్లా సమస్యాత్మకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇచ్చే అంశాన్ని కొత్త చట్టంలో జోడిస్తున్నారు. పన్నులు పీకాల్సిందే! మున్సిపాలిటీలు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా కొత్త చట్టంలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. స్థానిక సంస్థలకు రావాల్సిన పన్నులను పకడ్బందీగా వసూలు చేసుకునే అధికారాలు మున్సిపాలిటీలకు సక్రమించనున్నాయి. ఆస్తి, నీటి, లైబ్రరీ పన్నులను 100 శాతం వసూలు చేయడమే గాకుండా.. బకాయిలు రాబట్టడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ వినియోగించుకునే వెసులుబాటును పురపాలికలకు కట్టబెట్టే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కమిషనర్లకు న్యాయాధికారాలు కల్పించే అంశాన్ని పొందుపరుస్తున్నారు. జీహెచ్ఎంసీ, వ్యతిరేకంగా అక్రమ భవన నిర్మాణాలు, వివిధ రకాల వ్యాపారాల పర్యవేక్షణ, ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం న్యాయాధికారాలతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్న భూదందాలు, సర్కారీ భూముల ఆక్రమణల్లో కమిషనర్లు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని భూ వ్యవహారాలను పురపాలికల పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. -
చీరాల్లో టీడీపీ నేతల హల్చల్
చీరాల: చీరాల రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ టీడీపీ నేతలు హంగామా సృష్టిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ కూసే సమయంలో మీకేం కావాలో..అడగండి.. ఇచ్చేస్తామంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం వేటలో పడిన ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడితో చీరాలకు కొత్తగా వచ్చిన అధికారులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము చీరాల్లో పనిచేయలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా ఇప్పటికే అధికారులతో ఆ పార్టీ నాయకులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పథకాలన్నీ అక్రమాలని, వాటిపై విచారణ జరపాలంటూ స్వయంగా ఆ పార్టీ నేతలు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితిలు చీరాల్లో నెలకొన్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే తమకు ముఖ్యమంత్రి రాత పూర్వకంగా ఆదేశాలిచ్చారని, తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకూం జారీ చేస్తున్నారు. మరో వైపు ప్రజలను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం.. పింఛన్లు ఇప్పిస్తాం.. రేషన్ కార్డులు కావాలా.. కొత్త ఇళ్లు నిర్మించుకుంటారా..అంటూ ప్రజలతో దగ్గరుండి అర్జీలు ఇప్పిస్తున్నారు. ఇది సాద్యం కాదని ప్రతి ఒక్కరికి తెలిసినా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాం.. తమకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వాస్తవంగా నూతన పింఛన్లు, హౌసింగ్ అర్హత, సబ్సిడీ రుణాలకు సంబందచి ఆన్లైన్ నమోదు గడువు గత నెల 12శ తేదీనే ముగిసింది. టీడీపీ నాయకులు మాత్రం తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను నిలువునా మోసం చేస్తూ ఆన్లైన్ గడువు ముగిసిన పథకాలను తిరిగి ప్రారంభించి పథకాలు అందిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారంటే చీరాల టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేసేందుకు నూతన అధ్యాయానికి తెరలేపారని అర్థమవుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితుల్లో చీరాల్లో పెద్ద రాజకీయ డ్రామా జరుగుతుంది. ఎమ్మెల్యే ఆమంచి పార్టీని వీడటంతో టీడీపీ సీటును ఆశిస్తున్న పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలు తమ అనుచరులతో కలిసి చీరాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపారు. గత నాలుగు రోజుల నుంచి చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులను ఎమ్మెల్సీ పోతుల, మాజీ ఎమ్మెల్యే పాలేటిలు కలుస్తుండటంతో నాలుగేళ్లలో టీడీపీ హయాంలో చీరాల్లో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటుగా అధికారులతో కలిసి పనులను చూస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారంటే చీరాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న దందాను అర్థం చేసుకోవచ్చు. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు నియోజకవర్గాల్లోని ప్రజలను మోసం చేస్తున్నారు. చీరాల ఇరిగేషన్ డీఈ, పంచాయితీరాజ్ డీఈ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్అండ్బీ డీఈ, డ్రైనేజీ డీఈ, హౌసింగ్ డీఈలను కలవడంతో పాటు అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను వెలికితీయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతేగాక గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై టీడీపీ నేతలు చీరాల రూరల్, వేటపాలెం, టూటౌన్ పోలీసుస్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ‘చంద్రన్న పాలనలో ప్రజలే ముందు’ అనే నినాదంతో కొత్తగా టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేలా చర్యలు తీసుకుంటూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు మైకుల్లో పట్టణం, గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పాలేటి, పోతుల సునీతలు నియోజకవర్గంలో ప్రజలను నిలువునా మోసం చేసేలా ఉసిగొల్పుతున్నారు. ఇక్కడ పనిచేయలేమంటున్న అధికారులు ఎన్నికల బదిలీల్లో చీరాలకు వచ్చిన నూతన అధికారులు చీరాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో టీడీపీ నాయకుడు కార్యాలయాలకు వచ్చి ఈ పథకంలో అర్హులెవరు?ఎవరెవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించడంతో పాటు అక్రమాలను వెలికి తీయాలని ఫిర్యాదులు చేస్తుండటంతో నూతన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల వి«ధుల్లో భాగంగా తాము బదిలీపై వస్తే ఈ బాధలేందంటూ అధికారులు వాపోతున్నారు. ఏ హోదా లేకున్నా తమను ప్రశ్నిస్తున్నారని, ఎన్నికల విధులు నిర్వహించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఉన్నతాధికారుల గదుల్లోకి వెళ్లి మరీ తిష్ట వేసుకుని ప్రశ్నిస్తుండటంతో టీడీపీ నేతల ఆగడాలతో తాము ఇక్కడ పనిచేయలేమంటున్నారు. పోతుల, మున్సిపల్ చైర్మన్ వాగ్వాదం చీరాల మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య సోమవారం మున్సిపల్ కార్యాలయంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో తిట్ల పురాణాలు అందుకున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మున్సిపల్ కార్యాలయం బయట టెంటు వేయించి ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. అర్జీల అనంతరం ఆ అర్జీలను కమిషనర్ శివారెడ్డి చాంబర్‌కు సునీత వెళ్లగా అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌బాబు కూడా కమిషనర్ వద్దకు వచ్చాడు. మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పొదిలి ఐస్వామిలు మాట్లాడుతూ పింఛన్లు, గృహ నిర్మాణం, కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఆన్లైన్ నమోదు ప్రక్రియ గత నెల 12నే ముగిస్తే ఇప్పుడు ప్రజల నుంచి అర్జీలు తీసుకుని ప్రజలను మోసం చేస్తారా..అని ప్రశ్నించారు. సునీత, ఆమె అనుచరులు మున్సిపల్ చైర్మన్‌పై వాగ్వాదానికి దిగి ప్రభుత్వం తమది.. పథకాలు తాము తెప్పించి ఇస్తాం...నీకేం సంబంధం అంటూ చైర్మన్‌ను ఎదురు ప్రశ్నించి దురుసుగా వ్యవహరించారు. ఓ దశలో ఇరువర్గాల మధ్య తిట్ల పురాణం చోటుచేసుకుంది. కొందరు సర్ది చెప్పడంతో చైర్మన్ తన చాంబర్‌కు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. చీరాల నుంచి వెళ్లే యోచనలో కమిషనర్? మున్సిపల్ కమిషనర్‌గా విధుల్లో చేరి వారం రోజులు గడవకముందే కమిషనర్ శివారెడ్డి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చీరాల ఎంపీడీవోగా పోస్టింగ్ తీసుకున్న మహబూబ్ సుభానీ చీరాల్లో తాను పనిచేయనని ఉన్నతాధికారులకు చెప్పడంతో చేసేదేమిలేక చీరాల ఎంపీడీవో స్థానంలో చేబ్రోలు ఎంపీడీవోను నియమించారంటే చీరాల్లో ఎన్నికల విధులు కూడా సక్రమంగా టీడీపీ నేతలు పని చేసుకోవన్విడం లేదని అధికారులు వాపోతుండటం విశేషం. -
ఇల్లు కట్టి చూడు!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పట్టణం రెహ్మత్ నగర్లో సయ్యద్ షర్ఫోద్దీన్ (పేరుమార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తనకు 230 చదరపు మీటర్ల ప్లాట్ ఉంది. కష్టార్జితం నుంచి దాచిన డబ్బుతో పాటు కొంత బ్యాంకు లోన్ తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. అనుమతి కోసం డీపీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 14 రకాల ఫీజులు, పన్నులు కలిపి రూ.96,783 ఫీజు వసూలు చేశారు. డీపీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి లైసెన్స్డ్ ఇంజనీర్ రూ.10 వేలు తీసుకోగా, అధికారులు సంతకం పెట్టడానికి మామూళ్లు తీసుకుంటారని పేర్కొని మరో రూ.10 వేలు వసూలు చేశాడు. షర్ఫోద్దీన్లా సొంతిళ్లు కట్టుకోవాలని కలలు కనడం మధ్య తరగతి ప్రజలకు శాపమైంది. భవన నిర్మాణ అనుమతులు పెనుభారంగా తయారయ్యాయి. చక్కగా అనుమతి తీసుకుని పద్ధతి ప్రకారం ఇళ్లు కట్టుకుంటామని దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డజనుకు పైగా ఫీజులు వడ్డించి నడ్డి విరుస్తోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు కనీసం 200–250 చ.మీ. స్థలంలో సాదాసీదా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకుందా మనుకున్నా రూ.లక్షకు పైగా ఫీజు వసూలు చేస్తోంది. సంతకాల పేరుతో మునిసిపల్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వసూలు చేసే వేల రూపాయల మామూళ్లు దీనికి అదనం. సామాన్య కుటుంబాలు అప్పు చేసి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల బడ్జెట్‌తో ఓ మోస్తారు ఇంటి నిర్మాణానికి ప్రణాళిక వేసుకుంటే భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు, మామూళ్ల రూపంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 250 చ.మీ. ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేల నుంచి రూ.25 వేల ఫీజులు ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా రూ.లక్షకు చేరింది. భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన పేరుతో ఆన్లైన్ విధానంలో అనుమతుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ఇందుకు కారణమైంది. గతంలో రెండు మూడు రకాల ఫీజులు వసూలు చేసి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే వారు కాగా, డీపీఎంఎస్ వచ్చిన తర్వాత ఏకంగా 14 రకాల ఫీజులను వసూలు చేస్తుండటమే దీనికి కారణం. దరఖాస్తు చేసుకుంటే దొరికిపోయినట్లే.. ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ‘ఫీ’బకాసురులకు చిక్కినట్లే. ఇదే అవకాశం.. మళ్లీ దరఖాస్తుదారుడు తమ దగ్గరకు రాడని ప్రభుత్వం ఇంటి నిర్మాణ అనుమతులతో సంబంధం లేని ఫీజులు, పన్నులన్నింటినీ డీపీఎంఎస్ కింద ఆన్లైన్లో తప్పనిసరిగా చెల్లించాల్సిన ఫీజుల జాబితాలో చేర్చింది. ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్), డెవలప్మెంట్ చార్జీ (వేకెంట్ ల్యాండ్)ల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తోంది. వర్షపు నీటి సంరక్షణ చార్జీల పేరుతో రూ.3,680 వసూలు చేస్తున్న పురపాలక శాఖ.. తిరిగి ఆ నిధులతో దరఖాస్తుదారుల ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణానికి వినియోగించకుండా సొంత జేబుల్లో వేసుకుంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ ఇలాంటి గుంతలు నిర్మించినా, రాష్ట్రంలోని మిగిలిన మునిసిపాలిటీల్లో ఒక్క గుంతను సైతం నిర్మించలేదు. మునిసిపాలిటీల పరిధిలోని చాలా వరకు ఖాళీ స్థలాలకు లే అవుట్ అనుమతులు ఉండవు. మధ్య తరగతి ప్రజలు అవగాహన లేక ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ సైతం చేసుకోరు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ ఫీజుల పేరుతో రూ.వేలను వసూలు చేస్తున్నారు. పాత తేదీలతో అక్రమ అనుమతులు ... డీపీఎంఎస్ ద్వారా ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం రూ.లక్షల్లో ఫీజులు, పన్నులు చెల్లించాల్సి రావడం చాలా మునిసిపాలిటీల్లో కొత్త రకం అవినీతికి ఆజ్యం పోసింది. డీపీఎంఎస్‌లో కాకుండా పాత తేదీల (యాంటీ డేట్స్)తో చాలా మునిసిపాలిటీల్లో అక్రమ అనుమతులు జారీ చేస్తున్నారు. డీపీఎంఎస్ ద్వారా చెల్లించాల్సిన ఫీజులు, పన్నుల మొత్తంలో 25 శాతాన్ని లంచంగా తీసుకుని టౌన్‌ప్లానింగ్ అధికారులు పాత తేదీలతో అనుమతులు జారీ చేసేస్తున్నారు. చాలా మునిసిపాలిటీల్లో పాత ఫైళ్లు ధ్వంసం కావడంతో ఇలాంటి అనుమతులు జారీ చేయడం సులువుగా మారింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీగా మారిన చోట్లలో ఇలాంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మధ్య దళారులుగా లైసెన్స్డ్ ఇంజనీర్లు.. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతుల జారీకి డీపీఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినా దరఖాస్తుదారులు లంచాలు ఇవ్వకతప్పడం లేదు. ప్రైవేటు లైసెన్స్డ్ ఇంజనీర్ సాయం లేనిదే బిల్డింగ్ ప్లాన్ తయారీ, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దీంతో చాలా మునిసిపాలిటీల్లో మామూళ్ల వసూళ్లలో ఈ ఇంజనీర్లు దళారుల అవతారమెత్తారు. మునిసిపల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు/సూపర్వైజర్లు సంతకం చేయడానికి డబ్బులు తీసుకుంటారని చెప్పి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో సైట్ ఇన్స్పెక్షన్కు వచ్చే టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్వయంగా దరఖాస్తుదారుల నుంచి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సైట్ ఇన్స్పెక్షన్ నివేదికలో కొర్రీలు వేసి అనుమతుల జారీలో జాప్యం చేస్తున్నారు. కేవలం 21 రోజుల్లో డీపీఎంఎస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుండగా, అత్యధిక శాతం కేసుల్లో కొర్రీలతో జాప్యం జరుగుతుండటం గమనార్హం. -
భయం..భయంగా విధులు!
కర్నూలు, ఆదోని: ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారులపై టీడీపీ నేతల అనుచరుల దాడులు పెరుగుతున్నాయి. దీంతో భయం..భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మున్సిపల్ రెవెన్యూ విభాగాధిపతి లక్ష్మీనారాయణపై జరిగిన దాడి నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. బదిలీ చేయించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం మంచిదని పలువురు పేర్కొంటున్నారు. విధినిర్వహణలో ఉన్న అధికారిపై దాడి జరిగితే వెంటనే చర్యలు లేక పోవడం ఉద్యోగులను మరింత కలవరానికి గురి చేస్తోంది. శనివారం తన గదిలో ఉన్న ఆర్ఓ లక్ష్మీనారాయణ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ దాడి చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు ఆర్ఓ పశువుల సంతతో సహా పలు మార్కెట్లకు వెళ్లి కిస్తు బకాయిలపై కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పశువుల సంత కిస్తు బకాయి రూ.8లక్షల దాకా చెల్లించాల్సి ఉంది. వేలాల నిబంధన మేరకు కాంట్రాక్ట్ తీసుకున్న మూడు నెలలలోపు మొత్తం కిస్తు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో మూడు నెలలు మాత్రం గడువు ఉండడంతో ఆర్ఓ మార్కెట్ కాంట్రాక్టర్లపై కిస్తు బకాయి కోసం ఒత్తిడి పెంచారు. అయితే ఆర్ఓ హెచ్చరికను పశువుల సంత కాంట్రాక్టరు అనుచరుడొకరు సహించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగినట్లు సమాచారం. తన మాటకు ఆర్ఓ తలూపక పోవడాన్ని అవమానంగా భావించిన సదరు వ్యక్తి దాడి చేశాడు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తి పేరు తెలియదని, చూస్తే గుర్తించగలమని బాధితుడితో సహా ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. దాడి ఘటన కార్యాలయంలోని సీసీ పుటేజీల్లో కూడా రికార్డు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. అయితే శని,ఆది వరుస సెలవులు కావడంతో సీసీ పుటేజీలను పరిశీలించేందుకు అవకాశం లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉన్న ఓ స్థాయి అధికారిపైనే దాడి జరిగితే చిరు ఉద్యోగులను ఎవరు పట్టించుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి మున్సిపల్ రెవెన్యూ విభాగాధిపతి లక్ష్మీనారాయణ ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, కల్యాణ్ కుమార్, సభ్యులు నరసన్న, లెనిన్, మద్దిలేటి, పలువురు ఉద్యోగులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీ మద్దతు దారుడైనందుకేనా..? ఆర్ఓ లక్ష్మినారాయణపై దాడికి పాల్పడిన వ్యక్తి అధికార పార్టీ మద్దతు దారుడు. దీంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరలో ఇద్దరు చిరు ఉద్యోగులపై ప్రజా ప్రతినిధులు దాడులకు యత్నించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మున్సిపల్ ఉద్యోగ సంఘాల నాయకులు భారీ ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసి పోయింది. అయితే ఆర్ఓపై జరిగిన దాడిని తేలికగా తీసుకుంటే అధికార పార్టీ మద్దతు దారులు తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతోందని భావించే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
పార్కింగ్ లేకున్నా యథేచ్ఛగా పర్మిషన్లు
కరీంనగర్ కార్పొరేషన్: హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా జనసందోహం ఎక్కువగా వచ్చిపోయే వ్యాపారాలకు పార్కింగ్ స్థలాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులకు ఇవేమి కనిపించడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హడావిడి చేస్తున్న అధికారులు చిన్నా చితకా వ్యాపారులపై ప్రతాపం చూపెడుతూ బడా వ్యాపారులను వదిలేస్తున్నారు. దీంతో స్వామి కార్యం.. స్వకార్యం రెండూ సిద్ధిస్తున్నాయి. ఇలా చూసీచూడనట్లు వదిలేయడంతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలానెలా ఇంత అంటూ వసూళ్లు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్లు లేకపోయినా నడిరోడ్డుపై వాహనాలు నిలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దుకాణాలపై చర్యలు చేపట్టాల్సింది పోయి వారికే వత్తాసు పలుకడం చర్చనీయాంశంగా మారింది. పార్కింగ్‌లపై దృష్టేదీ.. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా అవతరించిన తర్వాత దేశంలో ఒక మంచి నగరంగా గుర్తింపు పొందేలా తయారు చేయాల్సిన అధికారులు ఆ వైపుగా ఆలోచించడం లేదు. రోడ్లు, డ్రెయినేజీ కడితేనే స్మార్ట్‌సిటీ అనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగించడం తమ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్ల ముందు చేసే పార్కింగ్‌లను ఒక ఆర్డర్లో పెట్టేందుకు కనీసం ఒక వాచ్మెన్ నియమించుకోవాలన్నా ఇంగిత జ్ఞానం కూడా ఆయా వ్యాపారులకు లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్షణ చర్యలు కరువు టిఫిన్ సెంటర్ల వద్దకు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్లు చేయాల్సి వస్తోంది. దీంతో వారి వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. వాహనాలు దొంగతనం జరగడం, ఒకరి వాహనాలు ఒకరు తీసుకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసినా రూంలో మాత్రమే పెట్టుకొని బయట వాహనాలను గాలికి వదిలేయడం వంటివి జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగినప్పటికీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో కనీసం తమ వాహనం దొంగతనం జరిగిందా.. ఎవరైనా తమ వాహనం అని మర్చిపోయి తీసుకెళ్లారా? అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనం ఇతరులు తీసుకెళ్తే వారు తెచ్చి ఇచ్చే వరకు టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు మానుకొని తమ వాహనం కోసం తిరగాల్సి వస్తోంది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం. అధికారుల నిర్లక్ష్యం.. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు పార్కింగ్‌ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్కింగ్లు లేకపోయినా.. రోడ్డుపై అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కమాన్‌చౌరస్తా, బస్టాండ్ వద్ద, తెలంగాణచౌక్‌లో, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఇలా ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ల సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మంది వ్యాపారులైతే పార్కింగ్లు క్రమపద్ధతిలో పెట్టుకునేందుకు సెక్యూరిటీని కూడా నియమించడం లేదు. పైగా కష్టమర్లయిన వాహనదారులపైనే దురుసుగా ప్రవర్థిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పార్కింగ్లు లేని వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అరగంటలో వస్తానని..అనంత లోకాలకు...
సెలవు రోజున నాన్నతో కాలక్షేపం చేద్దామనుకుంది ఆ కూతురు. ఆఫీసుకు బయల్దేరుతున్న తండ్రితో అదే మాట చెప్పింది. ‘లేదురా నాన్నా.. పని ఉంది. అది ముగించుకుని త్వరగానే వచ్చేస్తా’నంటూ ఆ బిడ్డను ఊరడించాడు. ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణమయ్యేసరికే ఆలస్యమైంది. చీకటి పడింది. భార్యకు ఫోన్ చేసి, ‘‘బాగా ఆకలేస్తోంది... రోటీలు తింటాను... రెడీ చేయి. దారిలో ఉన్నా.. అరగంటలో వస్తాను’’ అని ఫోన్ చేసి చెప్పాడు. అరగంట దాటింది. గంట.. రెండు గంటలు. ఆయన రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్. ఖమ్మం / రఘునాథపాలెం: మండలంలోని ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రోడ్డులో మంచుకొండ–శివాయిగూడెం మధ్యలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇల్లెందు మున్సిపల్ డీఈ వాంగుడోత్ భోజ్యా(46) మృతిచెందారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం గమనించారు. ఎస్ఐ ఎస్ క్రిష్ణ, భోజ్యా కుటుంబీకులు తెలిపిన వివరాలు... రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్ నివాస సముదాయంలో భోజ్యా కుటుంబం నివసిస్తోంది. ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి బైక్‌పై బయల్దేరారు. మంచుకొండ సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కంప చెట్లలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య పద్మ, పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితమే ఇల్లెందుకు... కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన భోజ్యా, ఏడాది క్రితమే ఆదిలాబాద్ నుంచి బదిలీపై ఇల్లెందు మున్సిపాలిటీకి వచ్చారు. తన ఇద్దరు కుమార్తెలను మంచి పాఠశాలలో చదివించాలనుకున్నారు. పాఠశాలకు, ఇల్లెందుకు అనువుగా ఉన్న రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్ నివాస సముదాయంలోని ఇంటిలో ఉంటున్నారు. ఆదివారం రోజున కూడా ఆఫీసుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో, గమ్యానికి చేరకుండానే అనంత లోకానికి వెళ్లిపోయారు. దారిలో ఉన్నా.. ఆకలేస్తోంది.. ‘‘దారిలో ఉన్నాను.. ఆకలేస్తోంది.. రోటీలు చేయి.. అని ఫోన్ చేశారు. అరగంటలో వస్తానన్నా రు. అరగంట దాటినా రాలేదు. చూసి.. చూసి.. ఫోన్ చేస్తే.. స్విచ్చాఫ్. మేమంతా భయపడ్డాం’’ అని, భోజ్యా భార్య చెప్పారు. భోజ్యా కుటుంబీ కులు, బంధువులు కలిసి ఆ రోజు రాత్రంతా ఇల్లెందు నుంచి రఘునాథపాలెం వరకు రహదారి వెంట వెతికారు. జాడ తెలియలేదు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన ముళ్ల చెట్ల చాటున విగతుడిగా కనిపించారు. భార్యాపిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. సెల్ ఫోన్ పగిలిపోయింది. భోజ్యా దేహంపై తీవ్ర గాయాలున్నాయి. బోర్ కొడుతోంది డాడీ అన్నా... ‘‘రాత్రి ఏడు గంటల ప్రాంతంలో డాడీ ఫోన్ చేశారు. అప్పుడు నేను మాట్లాడా. డాడీ వస్తున్నావా.. నాకు బోర్ కొడుతోంది.. అన్నాను. అరగంటలో ఇంట్లో ఉంటానన్నారు. మళ్లీ ఫోన్ చేస్తే మోగలేదు’’– ఏడుస్తూ చెప్పింది భోజ్యా కుమార్తె టీనా. కేసు నమోదు భోజ్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్ఐ క్రిష్ణ తరలించారు. కేసు నమోదు చేశారు. రాత్రివేళ, ఎదు రుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కకు బైక్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగుంటుందని ‘సాక్షి’తో ఎస్సై చెప్పారు. ఘన నివాళి డీఈ మృతదేహాన్ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, తోటి అధికారులు, ఉద్యోగులు, బంధువులు సందర్శించారు. ఘనం గా నివాళులర్పించారు. భోజ్యా తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు భోరున విలపించారు. -
ఏసీబీ వలలో సివిల్ ఇంజినీర్
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేపింది. సివిల్ ఇంజినీర్ జె.ఫణిశ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు పాలకొల్లు పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు 17దక్కించుకున్నారు. ఈ పనులను 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. వీటి బిల్లులు తయారు చేయాల్సిందిగా సివిల్ ఇంజినీర్ ఫణి శ్రీనివాస్‌ను కోరారు. ఆయన చుట్టూ 8 నెలలుగా తిరుగుతున్నారు. లంచం ఇస్తేనే బిల్లు సిద్ధంచేస్తానని శ్రీనివాస్ చెప్పడంతో చేసేది లేక ధర్మాజీరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వలపన్ని.. ధర్మాజీరావు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఫణిశ్రీనివాస్‌ను పట్టుకునేందుకు వలపన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ ధర్మాజీరావుకు రూ.50 వేలు ఇచ్చి ఇంజినీరింగ్ సెక్షన్లోకి పంపారు ఆ నగదును సివిల్ ఇంజినీర్ ఫణిశ్రీనివాస్కు ధర్మాజీరావు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఫణిశ్రీనివాస్ కవర్లో పెట్టుకున్నారు. వెంటనే అధికారులు ఫణిశ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ కె.శ్రీనివాసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది రెండో అవినీతి కేసు పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు వందేళ్లు పూర్తికావస్తోంది. ఇప్పటివరకూ మున్సిపాలిటీలో ఇది రెండో అవినీతి కేసు అని స్థానికులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం మున్సిపల్ మేనేజర్ ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వడం కోసం లంచం అడిగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో మేనేజర్‌తోపాటు మరో సహ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా ధర్మాజీరావు పనులు కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు నాలుగేళ్లుగా పాలకొల్లు పట్టణంలో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా రూ.6.72 కోట్ల విలువైన 17 పనులను దక్కించుకున్నారు. వీటిని 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. అప్పటి నుంచి బిల్లులు పెట్టాలని ఇంజినీర్ ఫణిశ్రీనివాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, డీఈ, ఎస్ఈ, ఎమ్మెల్యేలతో చెప్పించినా పెడచెవిన పెట్టి తనకు లంచం ఇస్తేనే గానీ చేయనని ఫణిశ్రీనివాస్ మొండికేశారు. ఇంకా సుమారు రూ.3 కోట్ల విలువైన పనులకు బిల్లులు రావలసి ఉంది. సబ్‌ప్లాన్ నిధులు సమయానికి బిల్లు చేయకపోతే ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరిలో ధర్మాజీరావు చేసిన సుమారు రూ.2 కోట్ల పనులకు బిల్లులు చేయడంలో ఇంజినీరు ఫణిశ్రీనివాస్ ఆలస్యం చేయడం వల్ల ఆ నిధులు ఏలూరు కార్పొరేషన్‌కు వెళ్లిపోయాయి. తరువాత బిల్లులు రావడంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిందని ధర్మాజీరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడూ ఇంజినీర్ ఆలస్యం చేయడం వల్ల నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే భయంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని ధర్మాజీరావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పాలకొల్లు మున్సిపాలిటీలో తప్ప ఎక్కడా నిల్వ లేవు. ఆలస్యం చేయడంవల్ల లోటు ఉన్న మున్సిపాలిటీలకు ఆ నిధులను మళ్లించే అవకాశం ఉంటుంది. పాలకొల్లులో సుమారు రూ.5 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నిల్వ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
రూ.కోట్ల భూమి క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.కోట్లు విలువచేసే వివాదాస్పద భూముల్లో నిర్మించిన దుకాణాలను మూకుమ్మడిగా క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నల్లగొండ పట్టణంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన ప్రకాశం బజార్లో సర్వే నెం.32లో 10.06 ఎకరాల వివాదాస్పద భూములున్నాయి. ఈ భూముల యాజమాన్య హక్కులు తమవేనని రెవెన్యూ శాఖ, నల్లగొండ మునిసిపాలిటీ, వక్ఫ్బోర్డుతోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు, కబ్జాదారులు గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కబ్జాదారుల నుంచి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూముల ధరలను వసూలు చేసి ఈ వివాదాస్పద భూముల్లో నిర్మించిన 234 వాణిజ్య దుకాణాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు తాజాగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈనెల 18న మెమో జారీ చేశారు. ఈ స్థల వివాదంపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గత జూన్‌లో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికతో పాటు, స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాల చిక్కుముడి! ప్రకాశంబజార్‌లోని భూముల వివాదం చిక్కుముడిగా మారడంతో గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టాయి. ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదిక ప్రకారం..సర్వే నం.32 పరిధిలోని 10.06 ఎకరాల భూమి 1944–81 మధ్యకాలానికి సంబంధించిన పçహాణీ రికార్డుల్లో ఖరీజ్ ఖాతాగా నమోదై ఉందని నల్లగొండ తహసీల్దార్ 1981లో నివేదిక సమర్పించారు. ఈ భూములను లీజుకు ఇవ్వాలని నల్లగొండ మునిసిపాలిటీ 1971లో తీర్మానం చేసింది. ఎకరాకు రూ.15 చొప్పున రూ.1,518ల ధర చెల్లించినందున ఈ భూములను స్థానిక మునిసిపాలిటీకి కేటాయిస్తూ 1963లో అప్పటి నల్లగొండ తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులుండడంతో ఈ భూములు తమవేనని సుదీర్ఘకాలంగా మునిసిపాలిటీ పోరాటం చేస్తోంది. 10.06 ఎకరాల నుంచి 2,262 చదరపు గజాల స్థలాన్ని గజానికి రూ.5 చొప్పున బస్‌స్టాండ్ ఏర్పాటుకోసం ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ 1964లో జీవో జారీ చేసింది. ఈ భూముల్లో కొంత భాగాన్ని బస్ స్టాండ్ ఏర్పాటుకు, మిగిలిన భాగాన్ని షాపుల నిర్మాణానికి మునిసిపాలిటీ లీజుకు ఇచ్చింది. ఇవి ప్రభుత్వ భూములైనందున లీజుకు ఇచ్చేందుకు మునిసిపాలిటీకి ఎలాంటి హక్కులు లేవని 1983లో నల్లగొండ తహసీల్దార్ మరో నివేదిక సమర్పించారు. ఈ భూముల్లో నిర్మించిన దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేయాలని అప్పట్లో నోటీసులు జారీ చేశారు. షాపుల యజమానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సర్వే నం.32లో ఉన్న 5 ఎకరాల పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులనుంచి కొనుగోలు చేశామని కొందరు షాపుల యజమానులు సైతం న్యాయ స్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో 2015లో జిల్లా కలెక్టర్, మునిసిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా, ఆ సర్వే నంబర్లో 10.06 ఎకరాలకు బదులు 15.06 ఎకరాలున్నట్టుగా తేలింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దుకాణాలు నిర్మించుకుని జీవనోపాధి పొందుతున్న వ్యాపారస్తులకు ఈ భూములు క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ తన నివేదికలో సిఫారసు చేశారు. -
యాచకుల పునరావాస కల్పనపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని యాచకుల పునరావాస కల్పనపై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో యాచకుల పునరావాసంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో ఎన్జీవో, ప్రభుత్వేతర సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి యాచకుల పునరావాసానికి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. యాచకులకు ఉచిత వైద్య సేవలతో పాటు, స్వయం ఉపాధిని కల్పిస్తామనిమున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. -
దోమల డెంగీయాత్ర
సాక్షి, అమరావతి: - గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సంజీవరావు అనే వ్యక్తి ఈనెల 25న తీవ్ర జ్వరంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ గంటలోపే పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. మూడు రోజులపాటు ఇన్‌పేషెంటుగా ఉంచి రూ.45 వేలు వసూలు చేశారు. - విశాఖపట్నం నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన లక్ష్మీదేవమ్మ జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. డెంగీ సోకిందని, ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయంటూ ఇన్‌పేషెంటుగా చేర్చారు. ప్లేట్లెట్స్ పేరుతో రెండ్రోజులు చికిత్స చేసి రూ.41వేలు బిల్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ వాసులను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయనడానికి పైరెండు కేసులు చక్కటి ఉదాహరణలు. గత ఏడాది గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువగా ఇవి నమోదు కాగా ఈ ఏడాది పట్ట ణాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో అత్యధిక డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. బాధితులు ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న కారణంగా ఇంకా ఆ కేసులు వెల్లడి కాలేదని, అవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. డెంగీ నివారణకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని అయినా నియంత్రణ కావడంలేదన్నారు. గతేడాది సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి ‘దోమలపై దండయాత్ర’ చేసినా అవి లొంగలేదని, ఈ ఏడాది మరిన్ని దోమకాటు జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. బెంబేలెత్తిస్తున్న కేసులు గుంటూరు, విశాఖలోని నగర పాలక సంస్థల్లో డెంగీ జ్వరాలు నియంత్రణలోకి రావడంలేదని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది గుంటూరు నగరంలో కేవలం 70 కేసులు మాత్రమే నమోదు కాగా.. గడిచిన రెండు మాసాల్లో 400 పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెల రోజుల్లో 550 డెంగీ కేసులు పైనే నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ తక్కువేమీ కాదు. గత కొంతకాలంగా ఒంగోలులోని రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు డెంగీతో వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 400కు పైగా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడ, కర్నూలు నగరాల్లో సైతం అనేక డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా, గడిచిన రెండు మాసాల్లోనే వివిధ మున్సిపాలిటీల పరిధిలో 3వేల డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్లేట్లెట్ల పేరిట దోపిడీ ప్రైవేటు ఆస్పత్రుల్లో, డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో ప్లేట్లెట్స్ పేరిట భారీ దోపిడీ మొదలైంది. ప్లేట్లెట్స్ ఎక్కించాలని.. లేదా పేషెంటు పరిస్థితి బాగోలేదంటూ రోగిని పిండేస్తున్నారు. జ్వరం లక్షణాలు పూర్తిగా తెలియకముందే ఇన్‌పేషెంటుగా చేర్చుకుని రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ బిల్లులు బాదేస్తున్నారు. వాస్తవానికి డెంగీ జ్వరం నిర్ధారించాలంటే రాపిడ్ టెస్ట్ కిట్ ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తిస్థాయిలో ఫలితం తేలుతుంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే డెంగీ అని భయపెట్టి దోచుకుంటున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయలోపం ఇదిలా ఉంటే.. పట్టణాల్లో ఎలాంటి కేసులు నమోదైనా దానికి ఆరోగ్యశాఖదే తప్పుగా చూపిస్తున్నారని, కానీ.. పురపాలక శాఖ ఈ విషయంలో తమకు సహకరించడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు నమోదైనప్పుడు కేవలం ఆరోగ్యశాఖ మాత్రమే స్పందిస్తోందని, కనీస నివారణ, నియంత్రణ చర్యలకు మున్సిపల్ శాఖ ముందుకు రావడంలేదన్నది ఆరోగ్యశాఖ భావన. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తమతో కలిసి రావడంలేదని, మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా ఉంటోంది. గిరిజన ప్రాంతాల్లో సరేసరి. వర్షం పడితే చాలు పట్టణాలు చెరువుల్లా మారిపోతున్నాయి. దీంతో నీటి నిల్వ కారణంగా డెంగీ జ్వరాలకు కారణమయ్యే ఈడిస్ దోమల వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో అయితే సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లకు ఇరువైపులా రకరకాల పనులకు తవ్విన గోతుల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో ఇవన్నీ దోమల వృద్ధికి నిలయాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు విజయవాడ నగరంలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనుల కారణంగా అనేక ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగానే జ్వరాలొస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి అనడానికి డెంగీ కేసులే ఉదాహరణ. అలాగే, గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నా చిన్నచిన్న అవసరాలకు కూడా వాటిని వినియోగించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనధికార ఆంక్షలు విధించిందని సర్పంచ్‌లు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగీ లక్షణాలు – ఈడిస్ రకం దోమ కుట్టిన 24 గంటల్లో విపరీతమైన తలనొప్పి వస్తుంది – జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతూంటాయి – మర్నాడు కండరాల నొప్పి తీవ్రమవుతుంది – అనంతరం కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో వస్తాయి – ఒళ్లంతా దద్దుర్లు మాదిరి మొదలై, అవి ఎర్రగా మారుతూ ఉంటాయి – ఏమీ తినాలనిపించదు. పైగా తీసుకున్నా వాంతులవుతాయి – జ్వర తీవ్ర ఎక్కువగా ఉంటే డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటారు. – ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. చికిత్సకు మార్గదర్శకాలు – డెంగీ వచ్చిందని నిర్ధారించగానే రోగిని ప్రత్యేక వార్డులో ఉంచాలి – ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి – ప్రస్తుత పరిస్థితుల్లో యాంటీవైరల్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఇవ్వచ్చు. – ముందుగా జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి – రోగికి నాలుగైదు రోజులపాటు పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి – రోగి పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి – రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి – నాలుగైదు రోజుల్లోనే జ్వరం నియంత్రణలోకి వస్తుంది. ఆ తర్వాత రోగిని డిశ్చార్జి చేయచ్చు – ముఖ్య విషయం.. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఉంటే.. వాటిల్లో నీళ్లు నిల్వ ఉండకుండా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే వాటి ద్వారా దోమలు వృద్ధిచెందే ప్రమాదముంది. ప్లేట్లెట్ల సమస్య లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డెంగీ జ్వరాలు ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్‌లెట్స్‌కు సమస్య లేదు. అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. అయినా, అనుకున్నంతగా డెంగీ కేసులేమీ బోధనాసుపత్రులకు రావడంలేదు. వైద్యానికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేవు. – డా. కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు -
15 రోజుల్లోగా ప్రతిపాదనలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఏవోసీ కంటోన్మెంట్ ఏరియాలో గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్ తదితర నిర్మాణాలకు 15 రోజుల్లోగా అలైన్మెంట్ ప్రతిపాదనలు తయారు చేయాలని సివిల్, డిఫెన్స్ అధికారుల కమిటీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. గఫ్ రోడ్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మిలిటరీ భూసమస్యలపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఐవోసీకి సంబంధించి ఆర్ అండ్ బీ ఎన్సీ రవీందర్రావు, జీహెచ్ఎంసీ సీఈ శ్రీధర్, కమెండింగ్ వర్క్స్ ఇంజనీర్ ఈశ్వర్‌దత్‌లతో కూడిన కమిటీ ప్రజలకు, మిలిటరీకి ఉపయోగపడేలా అలైన్మెంట్లు తయారు చేయాలని ఆదేశించారు. జవహర్ నగర్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కు సంబంధించి మేడ్చల్ జిల్లా జేసీ, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, హెచ్ఎండీఏ సీజీఎం ఆనంద్ మోహన్ తదితరులతో కూడిన కమిటీ ఓ.ఆర్.ఆర్ గైడ్ లైన్స్, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని లే అవుట్‌ను రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మిలిటరీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఇటువంటి సమావేశం నిర్వహించడం అభినందనీయమని సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..గఫ్ రోడ్డును సాధారణ ప్రజలు ఉపయోగించడం వలన భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పటికే పలుమార్లు మూసివేత గడువును పొడిగించామని, ఈ సమావేశం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ యం వీ రెడ్డి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ భారతి హొల్లికేరి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో యస్.వి.ఆర్ చంద్రశేఖర్, బ్రిగేడియర్ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ ప్రమోద్ కుమార్ శర్మలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
కోస్తా తీరం.. ఫలహారం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత సువిశాల సముద్ర తీర ప్రాంతం మన బలం... దాన్ని ఆలంబనగా చేసుకుని అపార అవకాశాలు సృష్టిస్తాం.. విశాఖ నగరాన్ని ఏపీలో ఐటీ సంస్థలు కొలువుదీరే కేంద్రంగా మారుస్తాం..’ అని తరచూ చెప్పే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడా సాగర తీరాన్ని ఫలహారంలా పంచిపెట్టేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా–గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని దాదాపు 200 కి.మీ. తీరప్రాంతాన్ని తమవారికి కట్టబెట్టేందుకు ముఖ్యనేత రంగంలోకి దిగారు. అందుకు అడ్డుగా ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్లను (సీఆర్‌జెడ్) మార్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహంతో తీరప్రాంతం విధ్వంసానికి గురై ప్రకృతి విపత్తులకు దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో మరో ఘోరం.. కోస్తా తీరంలో విస్తారంగా ఉన్న భూములపై దృష్టి సారించిన ప్రభుత్వ ముఖ్యనేత పర్యాటకాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రోత్సాహం పేరుతో అస్మదీయ సంస్థలకు స్టార్‌హోటళ్లు, రిస్టార్టులు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖలోని కైలాసగిరి– విజయనగరం జిల్లా పూసపాటిరేగ, కృష్ణా జిల్లా బందరుతోపాటు కావలి నుంచి తడ వరకు అంటే 200 కి.మీ. మేర తీరప్రాంతం అప్పగించేందుకు పథకం వేశారు. వాస్తవానికి ఆ ప్రాంతమంతా సీఆర్‌జెడ్–3 కేటగిరీ కిందకు రావటంతో నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. జోన్లు మార్చేస్తే సరి... తీరాన్ని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ముఖ్యనేత విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చాలని ఆదేశించారు. దీనివల్ల పరిమితస్థాయిలో నిర్మాణాలకు అవకాశం కలుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 200 కి.మీ. పొడవునా భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేసి పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టవచ్చనేది ముఖ్యనేత వ్యూహం. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చూసీచూడనట్టు ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వుడాకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వుడా, ముడా, నుడా... సరే విశాఖలోని కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ వరకు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2గా మార్చాలని మాస్టర్‌ప్లాన్‌లో వుడా ప్రతిపాదించింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా), నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా)లు కూడా తమ పరిధిలోని సీఆర్‌జెడ్–2 ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3గా మార్పులు చేయడానికి సన్నాహాలు చేపట్టాయి. పురపాలక శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. నిబంధనలకు విరుద్ధమే.. 200 కి.మీ. పొడవున తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. కేవలం తీరాన్ని ఆనుకుని నగరాలు, పట్టణాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే సీఆర్‌జెడ్–2 కేటగిరీ కిందకు చేర్చాలి. భూగర్భ డ్రైనేజీ, నీటిశుద్ధి ప్లాంటు తదితరాల కోసం ఆ వెసులుబాటు కల్పించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న చోట అవేవీ లేవు. పైగా విశాఖకు చేరువలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలున్నాయి. తీరప్రాంతంలో తుపాన్ల తీవ్రతను తగ్గించే మడ అడవులు కూడా ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా విలువైన తీరప్రాంతాన్ని అప్పనంగా పంచేస్తే తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీఆర్‌జెడ్’ చట్టం సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం తీరప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. తీరంలో ఇసుక ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–1గా ప్రకటించారు. ఈ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం జెట్టీలు, పోర్టులు, ఇతర మత్స్యకార సామాజిక కార్యక్రమాలే చేపట్టాలి. సముద్ర కెరటాలు అత్యంత ముందుకు వచ్చే ప్రాంతం (హైటైడ్ లైన్Œæ) నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్ ప్రాంతంగా ప్రకటించారు. సముద్రతీరంలో ఉండే నగరాలు, పట్టణాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. అందుకోసం 500 అడుగుల సీఆర్‌జెడ్ ప్రాంతాన్ని మళ్లీ రెండుగా విభజించారు. దీని ప్రకారం నగరాలు, పట్టణాలు ఉన్న చోట హైటైడ్ లైన్ నుంచి 200 అడుగుల వరకు సీఆర్‌జెడ్–2గా ప్రకటించారు. ఆ పరిధిలో నగరాల మురుగునీటి కాలువలు, నీటి శుద్ధి ప్లాంట్లు కోసం పరిమిత స్థాయిలో నిర్మాణాలను అనుమతించారు. హైటైడ్ లైన్‌కు 200 అడుగుల నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్–3గా ప్రకటించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. -
ఫోర్డ్‌తో హెచ్ఎండీఏ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రయాణికులకు అనువుగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ఫోర్డ్ కంపెనీతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఎంవోయూ కుదుర్చుకుంది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫోర్డ్ కంపెనీ డైరెక్టర్ ఆర్.మహదేవన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రవాణా సదుపాయాలను ఎంచుకోవటం, అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగనుంది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, మౌలిక వసతులు, రవాణా సదుపాయాల దృష్ట్యా హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉందని, సిటీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం మరింత మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటం సవాలుగా మారుతోందని, ఫోర్డ్ కంపెనీ ఈ దిశగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ కంపెనీ డైరెక్టర్ ఆర్.మహదేవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మెట్రో రైలు, దాదాపు ఎనిమిది వందల బస్సులు ప్రతిరోజు సిటీలో ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రయాణాన్ని మరింత సుగమం చేసే దిశగా రవాణా సదుపాయాలన్నింటా డిజిటల్ క్యాష్‌లెస్ వన్ టైమ్ పేమెంట్స్, మొబైల్ టికెటింగ్, స్మార్ట్ కార్డ్ పేమెంట్స్ జరిగే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రవాణాను అందుబాటులో ఉంచేందుకు ఫోర్డ్ కంపెనీ అధ్యయనం చేయనుంది. ఫోర్డ్ కంపెనీ ఇప్పటికే ఇండోర్, ముంబై సిటీల్లో రవాణా సేవలను అందిస్తోంది. -
వామ్మో... స్వైన్‌ఫ్లూ
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. నెల రోజుల క్రితమే జిల్లాలో తొలిసారిగా ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కావలి పట్టణానికి చెందిన మున్సిపల్ శాఖలో పనిచేసే ఒక వ్యక్తి మరణించాడు. వైద్య శాఖాధికారులు సరిగా స్పందించకపోవడంతో చాపకింద నీరులా జిల్లా అంతటా మళ్లీ స్వైన్‌ఫ్లూ కేసులు విస్తరిస్తున్నాయి. శుక్రవారం మనుబోలు మండలంలో ఒక మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించడంతో కలకలం రేగుతోంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు విస్తరిస్తున్నప్పటికీ వాటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వైన్ ఫ్లూ కేసు సోకినట్టు తెలిస్తే అప్పటికప్పుడు అక్కడ హడావుడి చేయడం, తరువాత మిన్నకుండిపోవడంతో రోగులు పెరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలోకి పోతున్నారు. స్వైన్‌ఫ్లూ బూచి చూపి వైద్యం పేరిట ప్రైవేటు ఆస్పత్రులు లక్షలకులక్షలు దోచుకుంటున్నాయి. రోగి బతికినా అప్పులపాలవుతున్నాడు. గుర్తించింది నాలుగు కేసులేనట! స్వైన్‌ఫ్లూ జిల్లాలో నలుగురికి మాత్రమే వచ్చినట్టు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం..పదహారు మందిని లక్షణాలు బట్టి గుర్తించినప్పటికీ వారిలో నలుగురికే పరీక్షలో పాజిటివ్ వచ్చిందని జిల్లావైద్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా పాజిటివ్ వచ్చిన ఆరు మందిని తాము గుర్తించడం లేదన్నారు. కాగా, తిరుపతిలో ఉండే ప్రభుత్వ లాబోరేటరీలో మాత్రమే పరీక్ష చేయించి పాజిటివ్ వస్తేనే గుర్తిస్తామనడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ కేసులు సోకుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. పెద్దాస్పత్రిలో మాత్రం స్వైన్‌ఫ్లూకి 8 బెడ్లతో ఒక వార్డును ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక్క కేసు కూడా చేరలేదు. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే... ► తడ మండలం పూడిì గ్రామంలో ఇద్దరు చిన్నారులకు స్వైన్ ఫ్లూ సోకగా చెన్నైలోని విజయా హాస్పిటల్ నందు చికిత్స తీసుకున్నారు. ► పెళ్లకూరు మండలానికి చెందిన ఒక డాక్టర్‌కి స్వైన్‌ఫ్లూ సోకగా రాయవేలూరు సిఎంసీలో చికిత్స పొందారు. ► వెంకటాచలం మండలానికి చెందిన మహిళకు స్వైన్‌ఫ్లూ సోకగా నెల్లూరులో చికిత్సపొందారు. ► 10 రోజుల క్రితం సైదాపురం మండలానికి చెందిన బాలుడికి స్వైన్ ఫ్లూ సోకగా నెల్లూరు నగరంలోని సిద్ధార్థ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ► పడుగుపాడుకి చెందిన ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించాడని తెలుస్తోంది. ► కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. ► కావలి పట్టణానికి చెందిన ఒక మహిళ గుంటూరులో చికిత్స పొందుతోంది. తేడా వస్తే మరణమే.. స్వైన్‌ఫ్లూపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరణం సంభవిస్తుంది. విపరీతమైన జలుబు, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. పందుల నుంచి నేరుగా మనుషులకు, స్వైన్‌ఫ్లూ సోకినవారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సులభంగా వ్యాపిస్తోంది. గాలి ప్రధాన వాహకం. అందువల్ల ప్రజలు మాస్క్ ధరించాలి. తుమ్మేటప్పుడు పక్కకు తిరిగి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని తుమ్మాలి. నలుగురు కలిసే చోట ఉండకూడదు. శుద్ధమైన నీరు, శుభ్రమైన పరిసరాలతో వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అప్రమత్తంగా ఉన్నాం స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేశాం. మా టీంను అప్రమత్తం చేశాం. జిల్లా మొత్తం సర్వేచేయించాం. తిరుపతిలో పాజిటివ్ వస్తేనే స్వైన్‌ఫ్లూగా గుర్తిస్తాం. అలా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మనుబోలుకు వెళ్లి వచ్చాను. అక్కడ స్వైన్‌ఫ్లూ కేసు నమోదైనట్టు మా దృష్టికి రాలేదు. అయినా విచారణ జరిపిస్తాం. – డా.వరసుందరం, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి -
ఆస్తి పన్నుకు ‘ఆధార్’ లింకు!
⇒ యజమాని ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో ఆస్తుల అనుసంధానం ⇒ తనఖా ఆస్తుల జాబితాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నులు, ఖాళీ స్థలంపై పన్నుల మదింపు సమాచారాన్ని సంబంధిత ఆస్తి యజమానుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో తక్షణమే అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు, స్థలాల జాబితాలను సైతం రూపొందించి, బహిర్గతం చేయాలని సూచించింది. రాష్ట్రంలో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పురపాలక డైరెక్టరేట్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాలన్నీ అందుబాటులో: అన్ని పుర పాలికలు అధికారిక వెబ్సైట్లను ఏర్పాటు చేసుకోవాలని పురపాలక డైరెక్టరేట్ సూచిం చింది. ఆస్తి పన్నుల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలతో పాటు సంబంధిత యజమాని పేరు, ఆధార్, పాన్, ఫోన్ నంబర్ల సమాచారాన్ని వాటిలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భవనాలు/ప్లాట్లు/ఖాళీ స్థలాల కు సంబంధించి అయితే.. ఆ ఆస్తి యజమాని పేరు, తనఖా పెట్టిన బ్యాంకు, బ్రాంచీ వివరాలను సైతం పేర్కొనాలని తెలిపింది. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమావేశమై తమ ప్రాంత పరిధిలో తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సేకరించాలని సూచించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాల్లో సంస్కరణల అమల్లో భాగంగా ఆస్తి పన్నుల మదింపు వివరాలను సంబంధిత పురపాలిక వెబ్సైట్లో ప్రదర్శించాలన్న నిబంధనలు న్నాయి. అదే తరహాలో అన్ని మున్సిపాలిటీ ల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి పన్నుల మదింపు వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసి, బహిర్గతం చేస్తే సంబంధిత యజ మానుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడి కానున్నాయి. వెబ్సైట్ నిర్వహణ తప్పనిసరి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 23 పురపాలికలు క్రియాశీలంగా వెబ్సైట్లను నిర్వహిస్తుండగా, మరో 45 పురపాలికలు వెబ్సైట్లు రూపొందించుకున్నా సరిగా నిర్వహించడంలేదు. నాలుగు పురపాలికలకు అధికారిక వెబ్సైట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పురపాలిక ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరిస్తూ (అప్డేట్ చేస్తూ) వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మ్యూటేషన్ రుసుము పెంపు అధికారం పురపాలికలకే.. స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే మ్యూటేషన్ రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్స్‌కు ఉందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మ్యూటేషన్ రుసుము పెంపుపై కౌన్సిల్లో చేసే తీర్మానాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌కు పంపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు స్పష్టతనిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
బడ్జెట్‌కు పూర్తి వివరాలివ్వండి
మున్సిపల్ శాఖ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధుల వివరాలు, ఇప్పటివరకు ఆర్థిక శాఖ నుంచి విడుదలైన నిధుల వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని పురపాలక శాఖ కార్యదర్శిని మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులపైన ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పన పనుల సన్నాహాలతో పాటు పలు అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి శివార్ల వరకు చేపట్టనున్న ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను, వాటికి అవసరం అయిన నిధుల సేకరణ అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి వివిధ ఏజెన్సీల నుంచి నిధుల సహకారానికి సూచనప్రాయంగా అంగీకారం లభించిందన్నారు. త్వరలో నాలాల పూడికతీత పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఈడీలతో లైట్ల బిగింపు ప్రక్రియ ఈ ఉగాది నాటికి పూర్తి కావాలని సీడీయంఏ శ్రీదేవికి అదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా తాగునీరు కార్యక్రమం మెట్రో వాటర్ వరక్స్ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రతి రోజు తాగు నీళ్లిచ్చే కార్యక్రమం ప్రణాళికలను మంత్రికి ఆ సంస్థ ఎండీ కిశోర్ వివరించారు. వారం పదిరోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. హెచ్ఎండీఏ తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్, మూసీ నది అథారిటీ ఏర్పాటుపైన మంత్రి సమీక్షించారు.ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ ,కమిషనర్లు, సీడీఎంఏ, మెట్రో వాటర్ వరక్స్ ఎం.డీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారులకూ ఆ బాధ్యతలు..
అభ్యంతరకర ప్రకటనల తొలగింపు అధికారాలిచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకర ప్రకటనల తొలగింపు బాధ్యతలను మున్సిపల్ శాఖ అధికారులకు ప్రభుత్వం కట్టబెట్టింది. బహిరంగ ప్రదేశాల వికృతీ కరణ నిర్మూలన, అభ్యంతరకర ప్రకటనల నిషేధ చట్టం ప్రకారం అభ్యంతరకర ప్రకటనలను తొలగించే అధికారం పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఉండగా.. మున్సిపల్ కమిషనర్లు, ఇతర మున్సిపల్ అధికారులకూ వర్తింపజేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్, డిçప్యూటీ కమిష నర్, చీఫ్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, సానిటరీ సూపర్వైజర్, సానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లకు ఈ ప్రకటనల తొలగింపు అధికారం ఉంటుందని తెలిపింది. ► మున్సిపాలిటీల్లో కమిషనర్‌తోపాటు టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, టైన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, సానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లకు ప్రకటనల తొలగింపు అధికారం ఉండనుంది. ► నగర పంచాయతీల్లో మున్సిపల్ కమిషనర్లకు మాత్రమే అధికారం ఉంటుంది. -
పురపాలికలకు ‘కొత్త’ కళ
► మార్చిలోగా మునిసిపాలిటీలు బహిరంగ మల, మూత్ర రహితం ► ఉగాదిలోగా అంతటా ఎల్ఈడీ వీధి దీపాలు: మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించు కొని పురపాలక శాఖ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జల మండలి, హైదరాబాద్ మెట్రో రైలు, పురపాలక శాఖ డైరెక్టరేట్(సీడీఎంఏ), టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాల అధిపతుల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. వచ్చే మే నెలలోగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉగాదిలోగా అన్ని మునిసిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చాలని అన్నారు. కొత్త సంవత్సరంలో చేపట్టా ల్సిన కార్యక్రమాలకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించుకుని అమలు చేయా లని సూచించారు. దీర్ఘకా లిక, మధ్యంతర, స్వల్పకాలిక కార్య క్రమాల అమలు కోసం నిర్ణీత కాలవ్యవధితో ప్రణాళి కలను రూపొందించి 15 రోజు ల్లోగా సమర్పించాలని కోరారు. రెండు న్నరేళ్లలో పురపాలనకు సంబంధించి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని మంత్రి కేటీఆర్ సం తృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యో గుల ఏకీకృత సర్వీసుల బిల్లు, బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చామని, ప్రతిపక్ష పార్టీలు సైతం అభినందించాయ న్నారు. గత ఏడాది తాగునీరు, పారిశుద్ధ్య రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజల ఇబ్బందులను దూరం చేశామని వివరించారు. మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
భవన యజమానులపై చర్యలేం తీసుకున్నారు?
పార్కింగ్‌కు అవకాశం లేకుండా చేయడంపై హైకోర్టు సీరియస్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక భవనాలను వాణిజ్య సము దాయాలుగా మార్చి, పార్కింగ్‌కు అవ కాశం లేకుండా చేస్తున్న భవన యజ మానులపై ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించాలని హైకోర్టు మంగళ వారం పురపాలకశాఖ, జీహెచ్ఎంసీలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణ ను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ ఉత్త ర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి లో పలు భవనాల్లోని పార్కింగ్ ప్రాంతా లను వాణిజ్య సముదాయాలుగా మార్చే శారని, దీంతో చాలామంది వాహనాల్ని రోడ్లపై పార్క్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయంటూ పత్రి కల్లో కథనాలు వచ్చాయి. హైకోర్టు, వీటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారిం చింది. పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
నేడు కేబినేట్ భేటీ
7 ఆర్డినెన్సులకు చట్టరూపు హస్తిన నుంచి రాష్ట్రానికి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్ లో సమావేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఏడు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా ఆమోద ముద్ర వేయనున్నారు. గతంలో ఇచ్చిన జీవో 123కు ప్రత్యామ్నాయంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భూ సేకరణ కోసం చట్టం , ఆర్థిక శాఖ ద్వారా పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల మంజూరు, మున్సిపల్ శాఖ ద్వారా హైదరాబాద్ నగరానికి కృష్ణానది నీటిని తరలించేందుకు రూ.1,800 కోట్ల మంజూరుకు ఆమోదం, తెలంగాణ బీసీ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్, 2016కు బిల్లు రూపం, కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట, రామగుండం (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీసు ఆర్డినెన్స్, 2016కు బిల్లుగా, తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) (సవరణ) ఆర్డినెన్స్, 2016కు బిల్లుగా ఆమోదం, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏపీ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకు బదిలీపై ఆర్డినెన్స్ నుంచి చట్టరూపం ఇవ్వనున్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. -
ఏకపక్షంగా ఉండం..
రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధి అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి.. అభివృద్ధి, సుందరీకరణల్లో వెనుకడుగు లేదు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: నగరాభివృద్ధే లక్ష్యంగా... రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గ్రేటర్‌లోని అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరానికి చెందిన మంత్రులతోపాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశం అనంతరం వివరాలను విలేకరులకు వెల్లడించారు. మొత్తం 390 కి.మీ.ల మేర నాలాలుండగా 216 కి.మీ.ల మేర సర్వే పూర్తరుుందని, ఇప్పటి వరకు 8239 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలిపారు. నాలాల ఆధునికీకరణలో రీ డిజైన్ చేయడం, నాలాల లోతు పెంచడం తదితర ప్రత్యామ్నాయలన్నీ పరిగణనలోకి తీసుకొని తొలగించాల్సిన ఇళ్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 169 చెరువుల్లో పూడికతీత తదితర పనులతో వాటిల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండుమూడు నెలలకోమారు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తదుపరి సమావేశాలు జనవరి 3 లేదా 4వ తేదీల్లో, తిరిగి ఫిబ్రవరిలో 25 లేదా 26 తేదీల్లో జరుగుతాయన్నారు. సంవత్సరం పొడవునా నాలాల్లో డీసిల్టింగ్ నిర్వహించే కార్యక్రమం జనవరి నుంచి మొదలవుతుందన్నారు. ఈ పనులకు ఎక్కువ లెస్తో కాంట్రాక్టు దక్కించుకుంటున్నవారు పనులు చేయడం లేరని, ఇకపై పారదర్శకంగా పనులు నిర్వహిస్తామన్నారు. నాలాల ఆధునికీకరణ తదితర నిర్మాణాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రీకాస్ట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. నిర్మాణ పనులు లేక కూలీలకు ఇబ్బందిగా ఉన్నందున రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. దాదాపు 15 వేల ఇళ్లకు టెండర్లను 7వ తేదీన తెరవనున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన దాదాపు 30 వేల జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇళ్లకు రూ. 300 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టనున్నట్లు తెలిపారు. శివార్లలో రూ. 2 వేల కోట్లతో 2700 కి.మీ.ల మేర తాగునీటి పథకానికి పైప్‌లైన్ పనులకు రోడ్లు తవ్వాల్సి ఉందని చెబుతూ, పునరుద్ధరణ పనులకు టెండర్లు పూర్తయ్యాకే రోడ్లుతవ్వుతామన్నారు.ఇళ్ల నిర్మాణానికి, బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితర పనులకు అన్నిపార్టీల వారూ తమ పూర్తి సహకారమందిస్తామన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు సైతం కేటారుుస్తామని ముందుకొచ్చారన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి సమన్వయంతో పనులు చేయాలని సూచించామని, ఆయా పనుల వద్ద వాటి వివరాలు తెలిపే బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. పెట్రోలు బంకులతో సహ నగరంలో 900 పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై విసృ్తతంగా చర్చించామన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ, ఎంఐఎంల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై విసృ్తతంగా చర్చించారు. ఇంకా.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాంతాల గురించి వివరాలివ్వాల్సిందిగా ఎమ్మెల్లేలను కోరారు. అవసరమైతే అదనపుఇళ్ల నిర్మాణం. హైదరాబాద్ యూనిట్‌గా కేటారుుంపులు. ఎస్సార్డీపీ, రోడ్ల విస్తరణకు సంబంధించి 489 పనులకు రూ. 75 కోట్లతో చేపట్టిన పనుల్లో 260 పనులు పూర్తి. ఈ వారంలో 105 పనులు ప్రారంభం.షామీర్పేట,జూబ్లీబస్‌స్టేషన్, ఉప్పల్, రోడ్డునెంబర్ 45లలో నాలుగు స్కైవేలు ఎస్సార్డీపీ మొదటిదశలో నిర్మాణం. 54 జంక్షన్లలో అభివృద్ధి పనులు. చార్మినార్ పాదచారుల పథకం ఏళ్లతరబడి పూర్తికాకపోవడంపై సమావేశంలో కేటీఆర్ అసహనం. విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మాట్లాడుతూ... డీఆర్సీ లేని కొరత ఈ సమావేశంతో తీరిందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నారుుని నరసింహారెడ్డి, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, అధికారులు నవీన్‌మిట్టల్, జనార్దన్‌రెడ్డి, దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. నిధులేవీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ రావాల్సిన నిధులు వృత్తిపన్ను వాటా, ఇతరత్రా గ్రాంట్లు రాకపోవడంపై సమావేశంలో ఎమ్మెల్సీజాఫ్రి ప్రశ్నించిన ట్లు తెలిసింది. తననియోజకవర్గంలో జరిగే పనుల్లో తనకు ఆహ్వానం లేకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వాదనకు దిగినట్లు తెలిసింది. -
‘పురసేవ’ యాప్ ఆవిష్కరించిన ఏపీ సీఎం
అమరావతి: ‘పురసేవ’ మొబైల్ యాప్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు, పురపాలశాఖకు మధ్య వారధిగా ‘పురసేవ’ యాప్ ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ యాప్‌తో మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. -
స్థిరాస్తి రంగం కుదేలు
పెద్ద నోట్ల రద్దుతో ఆగిన లావాదేవీలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అకస్మాత్తుగా కుప్పకూలింది. రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి లావాదేవీలు స్తంభించిపోయాయి. కొత్త లే అవుట్ల కోసం భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో రోజువారీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు 10 శాతానికి పడిపోయారుు. రూ.వేల కోట్ల పెట్టుబడితో రియల్టర్లు చేపట్టిన లే అవుట్లు, భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలపై ఆంక్షలు ఉండడంతో బిల్డర్లు, నిర్మాణరంగ కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు కూలీలకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు నెల కొన్నారుు. రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వేలాది మంది నిర్మాణరంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్థిరాస్తి రంగం తేరుకుని మళ్లీ పుంజుకోవడానికి కనీసం 9 నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుబాటు ధర (అఫర్డబుల్)కు లభించే 1000 చదరపు అడుగులు, 1500 చదరపు అడుగుల చిన్న గృహాలకు సైతం ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పడిపోరుుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ధరలు పతనమవుతాయని కొనుగోలుదారులు సైతం వేచి చూస్తున్నారు. ఫీజులపై మారటోరియం విధించండి... హెచ్ఎండీఏకు లే అవుట్ ఫీజుల వారుుదాల చెల్లింపులపై కనీసం మూడు నెలల మారటోరియం విధించాలని తెలంగాణ డెవలప్మెంట్ అసోసియేషన్ (టీడీఏ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అదే విధంగా జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన భవన నిర్మాణ ఫీజులను మూడు వారుుదాల రూపేణా 9 నెలల్లో చెల్లించేందుకు వెసులు బాటు కల్పించాలని కోరింది. టీడీఏ అధ్యక్షు డు జీవీ రావు శనివారం సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల స్థిరాస్తి రంగం భారీ ఒడిదుడుకులకు లోనైందన్నారు. దీంతో ఫీజుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం కోరామన్నారు. -
ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఆశ్రమాలకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖలను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆస్తి పన్ను మినహాయింపునకు వీలుగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలకశాఖ, పంచాయతీరాజ్‌శాఖలు చర్యలు చేపట్టాయి. చట్ట సవరణ జరిగి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
నైపుణ్యాభివృద్ధి విధానం తీసుకొస్తాం
- ప్రణాళిక శాఖ సమావేశంలో మంత్రి నాయిని - విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాలు గుర్తించి.. యువతకు శిక్షణ - కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు చర్యలు.. సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. వాటిలో ప్రాధాన్యమున్న రంగాలను గుర్తిస్తే రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి విధానాన్ని (స్కిల్ డెవలప్మెంట్ పాలసీ) అమల్లోకి తీసుకొస్తున్నాం’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. స్కిల్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంజీ గోపాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సాంకేతిక శాఖ సంచాలకులు వాణీప్రసాద్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కిషన్, పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగం లేకుండా చేస్తామని, ఈ విధానానికి కేంద్ర నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని నాయిని అన్నారు. పారిశ్రామిక సంస్థలు సీఎస్ఆర్ కింద నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నాయని, వీటిని ఒకే గొడుగు కిందకు చేర్చితే మంచి ఫలితాలు వస్తాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖలు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పాపారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్లలోపు వారు 2.2 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 1.51 కోట్ల మంది యువతేనని పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 50.9 లక్షల మ్యాన్‌పవర్ అవసరమని బీపీ ఆచార్య అన్నారు. -
నాలాకు దారి చూపిస్తాం!
పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు - ఓ నలుగురిని పట్టి లోపలేస్తే పరిస్థితి మారుతుంది - నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు.. - వరదల నివారణకు 390 కి.మీల మేర వరద కాల్వల అభివృద్ధి - రూ.10 వేల కోట్లతో నాలాల అభివృద్ధి, పునరావాసం కల్పిస్తాం సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రాజధానిలో కొత్తగా 390 కి.మీల వరద ప్రవాహ కాల్వలను విస్తరించి పునర్నిర్మించాలి. నాలాలపై 28 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని 2003-04లో వేసిన కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. వీళ్లందరికీ పునరావాసం కల్పించి ఈ కాల్వలను నిర్మించేందుకు రూ.10 వేల కోట్లు అవసరం’ అని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. చెరువులు, నాలాలను కబ్జా చేసి విచ్చలవిడిగా నిర్మించిన కట్టడాలు నీటి ప్రవాహానికి అడ్డుగా మారడంతోనే వరదలు వచ్చాయని పేర్కొన్నారు. కొంత మంది కబ్జాదారులను అరెస్టు చేసి జైళ్లో వేస్తే ఈ జాడ్యం తగ్గుతుందని చెప్పారు. నాలాల విస్తరణపై అధ్యయనం కోసం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో కమిటీ ఏర్పా టు చేశామన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. సాధ్యమైన చోట నాలాల లోతు పెంచుతామని, లేని చోట విస్తరణ తప్పదన్నారు. జాగ్రత్తగా డీల్ చేస్తాం.. ‘ప్రభుత్వం ముందు రెండు ప్రధాన సమస్యలున్నాయి. నాలాలపై నిర్మించిన శాశ్వత భవనాలు ఒకటైతే.. ఆ భూములకు కొందరు పట్టాలు సంపాదించి ఉండటం రెండోది. భూసేకరణ చట్టం-2013 వల్ల ఆ భూములను సేకరించడం ప్రభుత్వానికి తలకు మించిన భారం. కబ్జాదారులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటుండటంతో చర్యలు తీసుకోలేకపోతున్నాం. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఏం చేయగలం? ప్రభుత్వానికి ఉన్న విశిష్ట అధికారాలు ఏమిటన్న అంశాలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నాం. నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చాలని 2011లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 11లోని 405వ అధ్యయనం పేర్కొంటోంది. మున్సిపాలిటీల చట్టంలో కూడా ఈ నిబంధన ఉంది. అయితే, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలే అధికంగా ఉండటంతో జాగ్రత్తగా డీల్ చేస్తాం. అక్రమ భవనాలపై చర్యల కేసులను విచారించేందుకు టౌన్‌ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఈ నెల 26న జరిగే మంత్రివర్గ భేటీలో తీర్మానం చేస్తాం,’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 93 శాతం నీరు నేరుగా మూసీలో కలుస్తాయని, భారీ భవనాలు అడ్డురావడంతో కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు. పరిశీలనలో సాంకేతిక పరిజ్ఞానం... ‘ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఎంత వరద రానుంది.. ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.. ఏ మేరకు చర్యలు తీసుకోవాలన్న సమాచారం సేకరణకు ఐబీఎం, సీడాక్ సంస్థలు బ్రెజిల్‌లోని రియోలో నాలాలకు సెన్సార్లను బిగించి విజయవంతంగా పర్యవేక్షిస్తున్నాయి. అలాగే బార్సిలోనా నగరంలో 30 చోట్ల మూడంతస్తుల లోతు వరకు భూగర్భ నీటి జలాశయాలను నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సైతం ఈ రెండు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి చూస్తాం. సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువుతో భూగర్భ మురికి కాల్వ పైప్‌లైన్ కరిగిపోయి ట్యాంక్‌బండ్‌పై రోడ్డు కుంగిపోయింది. దీంతో నగరంలో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లపై అధ్యయనం కోసం ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ను రప్పిస్తున్నాం’ అని వివరించారు. కబ్జాలతోనే భండారి లే అవుట్ ముంపు దిగువన ఉన్న ప్రగతి నగర్ చెరువులోకి వరద నీరు వెళ్లకుండా మధ్యలో భారీ కట్టడాలు నిర్మించడంతోనే భండారి లే అవుట్ కాలనీ ముంపునకు గురైందని కేటీఆర్ పేర్కొన్నారు. రోజుకు 2 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని హైదరాబాద్ కలిగి ఉందని, గురువారం ఒక్కరోజే 16 సె.మీలు, నాలుగు రోజుల్లో 30 సె.మీ.లకు పైగా వర్షం కురవడంతోనే నగరం ముంపునకు గురైందని చెప్పారు. ప్రభుత్వం సమర్థంగా ముందస్తు చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. -
ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్!
హైదరాబాద్: ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం నుంచి పనిచేయడానికి ఇక పది రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని శాఖలు కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్‌ల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో మున్సిపల్. ఆర్థిక శాఖ ముందంజలో ఉన్నాయి. సచివాలయంలోని మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయంతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులకు చెందిన కంప్యూటర్లను ఇప్పటికే వెలగపూడికి తరలించేశారు. మరో పక్క కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫైళ్ల ప్యాకింగ్‌ను ఆర్థిక శాఖ శుక్రవారమే పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో కంప్యూటర్లను వెలగపూడి సచివాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫర్నీచర్‌తో పాటు కొన్ని రకాల ఫైళ్లను శాఖాధిపతులు కార్యాలయాలున్న ఇబ్రహీంపట్నం తరలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్ ప్రక్రియను స్వయంగా సెక్షన్లకు వెళ్లి పర్యవేక్షించారు. వెలగపూడిలో ఆర్థిక శాఖకు కేటాయించిన భవనాల్లో ఇంటర్నెట్ కనక్షన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తరలివెళ్లే కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను అక్కడ దింపుకుని, ఎవరి కంప్యూటర్లను వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఉద్యోగులకు అప్పగిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్లు వారీగా కంప్యూటర్లు వారి వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఆయా ఉద్యోగులకు అప్పగించారు. కంప్యూటర్లను, ఫర్నీచర్ ప్యాకింగ్ పూర్తి చేయడంతో ఆర్థిక శాఖకు చెందిన కార్యకలాపాలు శనివారం నుంచి హైదరాబాద్ సచివాలయంలో నిలిచిపోనున్నాయి. మరో పక్క ఉద్యోగులు, అధికారులు శనివారం నుంచి కుటంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు సెలవులు తీసుకోనున్నారు. ఈ తరలింపునకు ప్రత్యేకంగా సెలవులను పరిగణించనున్నారు. -
అలసత్వం వహిస్తే సహించం
మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ బాపట్ల: మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పురపాలకసంఘం అధికారులు, చైర్పర్సన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణం అసంతృప్తిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. స్లమ్‌లెవల్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్) సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డి స్థాయి అధికారి సమావేశం నిర్వహిస్తే కనీసం హాజరుకాలేని సిబ్బందిని ఎందుకు నియమించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని, అలా చేయలేని పక్షంలో పనిచేయని వారిని గుర్తించి కొత్తవాళ్లకు అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలో నరసరావుపేట, మంగళగిరి ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం, తెనాలి, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో 87 శాతం పూర్తి అయితే బాపట్లలో కేవలం 70 శాతం మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. వార్డుల్లో మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కౌన్సిలర్లకు తెలియజేయాలే కానీ, కౌన్సిలర్ల అనుమతి తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. బాపట్లలో ఇప్పటివరకు ప్రజాసాధికారిత సర్వే కేవలం 40 శాతం మాత్రమే అయ్యిందని, మిగిలిన 60 శాతం సెప్టెంబర్ 25లోగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తోట మల్లీశ్వరి, మున్సిపల్ డీఈ సీతారామరావు, ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ పోతురాజు ఉన్నారు.