హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది.
రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.
చదవండి: ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment