racing
-
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్‌లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్‌కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్‌లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్‌లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్‌లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్‌లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు. -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ FIR నమోదు
-
సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
-
Dog racing: దౌడు తీస్తుంటే ‘భౌ’గుంది
గట్టు (జోగుళాంబ గద్వాల జిల్లా): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని భవానీమాత జాతర సందర్భంగా శుక్రవారం శునకాలకు పరుగు పందెం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 20 శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి. కుచినేర్లకు చెందిన వెల్డింగ్ రాముడి శునకం మొదటిస్థానంలో నిలిచి రూ.10 వేలు దక్కించుకుంది. బల్గెరకు చెందిన మల్లయ్య శునకం రెండోస్థానంలో నిలిచి రూ.6 వేలు, కర్ణాటకలోని కడ్లురుకు చెందిన గౌరేశ్ శునకం మూడో స్థానంలో నిలిచి రూ.4 వేలు, పులికల్ రాజాపురానికి చెందిన మల్లయ్య శునకం నాలుగో స్థానంలో నిలిచి, రూ.2 వేలు దక్కించుకున్నాయి. విజేతలకు పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, బజారి, సుదర్శన్‌రెడ్డి, ప్రాణేశ్లు బహుమతులు అందజేశారు. -
‘ఫార్ములా’–4 చేదించాడు..
సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సత్తా చాటింది. టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీం రేసర్ అఖిల్ అలీ భాయ్ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్‌గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కరీ మోటార్ స్పీడ్వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్‌లో చాంపియన్‌గా నిలువగా, లీగ్ 2024లో గోవా ఏసెస్ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్ఎల్ రేసులో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. అభిమానులకు ధన్యవాదాలు.. హైదరాబాద్ రేసింగ్ లవర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్ లీగ్‌కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విజయం నా కెరియర్ను మలుపు తిప్పుతుంది. – అఖిల్ అలీ భాయ్ఈ సీజన్ చాలా కఠినం.. ఈ సీజన్ రేసింగ్ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్‌కి ట్రోఫీ చేజింగ్ లా మారింది. నేను రేసర్‌గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్‌తో పనిలేదు. – లారా క్యామ్స్ టారస్, మోటార్స్ స్పోర్ట్స్ వుమెన్ డ్రైవర్ రేసింగ్‌తో మంచి అనుబంధం.. నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఓనర్‌గా మారినప్పటికీ మన టీం చాంపియన్ షిప్ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్‌లో రేసింగ్ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్ ఫెస్టివల్లో వుమెన్ డ్రైవర్స్ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్ రేసింగ్ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్ రేసింగ్‌లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్‌గా మంచి క్యారెక్టర్ వస్తే కచి్చతంగా చేస్తాను. – అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్ -
మళ్లీ తెరపైకి ఈ-కార్ రేస్ వ్యవహారం.. ఏసీబీకి ఫిర్యాదు
హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.చదవండి: ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్ -
రేసింగ్‌లో అక్కినేని నాగ చైతన్య టీమ్.. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ హీరో అక్కినేని నాగ చైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ‘ఫార్ములా 4’లో భాగమయ్యాడు. ఈ సీజన్‌కు సంబంధించిన రేసులు ఈ నెల 24న మొదలవనున్నాయి. యూత్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరో నాగ చైతన్యకు ఫార్ములావన్ అంటే క్రేజీ! బుల్లెట్లా దూసుకెళ్లే ఈ కారు రేసింగ్‌ను కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా టీవీల్లో చూస్తుంటారు. ఈ ఆసక్తితోనే ఆయన సూపర్ కార్స్, కొత్తకొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను కొని తన గ్యారేజీలో పెట్టుకుంటారు.సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్‌లో భాగం కావడంతో లీగ్‌పై ప్రేక్షకాదరణ కూడా అంతకంతకు పెరుగుతుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచే రేసింగ్ అంటే ఇష్టం. ఫార్ములావన్ అంటే పిచ్చి. హైస్పీడ్ డ్రామాను ఎంజాయ్ చేస్తాను. ఈ ఫార్ములావన్ క్రేజీతోనే నేను సూపర్ కార్స్, బైక్స్ కొనేలా చేశాయి. నాకు తెలిసి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ కేవలం ఈవెంట్ మాత్రమే కాదు. అంతకు మించిన ఆడ్వెంచర్ కూడా! అందుకే నేను నా అభిరుచి ఉన్న రేసింగ్ క్రీడలో భాగమయ్యాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ మా అంచనాలకు అనుగుణంగా రేసింగ్‌లో దూసుకెళ్తుంది’ అని అన్నారు. నిజానికి రేసింగ్ అంటే అక్కినేని ఇంటికి కొత్తేం కాదు. స్టార్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య రేసింగ్ ప్రేమికుడైతే... ఆయన సోదరుడు ఆదిత్య (అక్కినేని వెంకట్ కుమారుడు) స్వయంగా రేసర్. కొన్నేళ్ల క్రితం ఆదిత్య మోటార్ రేసింగ్ ట్రాక్‌పై పలు రేసుల్లో పాల్గొన్నారు. -
రేసింగ్‌కు ప్రత్యేక ఇంధనం.. అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియన్ ఫ్యుయల్
దేశంలో రేసింగ్ కోసం ప్రత్యేక ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ తయారు చేసింది. ఎఫ్ఐఎం ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ (ARRC) 2024 సీజన్ కోసం స్టోర్మ్ (STORM) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక రేసింగ్ ఇంధనాన్ని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు. రేసింగ్ సర్క్యూట్‌లోని ప్రీమియం సూపర్‌బైక్‌ల కోసం ఈ హై-ఆక్టేన్ అల్టిమేట్ రేసింగ్ ఫ్యూయల్‌ను ఇండియన్ఆయిల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేసింగ్ ఈవెంట్లలో ఛాంపియన్లకు ఇది ఇంధనంగా నిలుస్తుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, డైరెక్టర్ (మార్కెటింగ్) సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ మొదటిసారిగా గుజరాత్ రిఫైనరీ నుంచి స్టోర్మ్ పేరుతో కేటగిరీ 2 రేస్ ఇంధనం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. ఈ రేస్ ఇంధనం, ఏవీ గ్యాస్ 100 LL, రిఫరెన్స్ ఫ్యూయెల్స్ మొదలైనవాటితో పాటు కఠినమైన అంతర్జాతీయ స్పెసిఫికేషన్లకు కట్టుబడి స్వీయ-సమృద్ధి దిశగా భారత్ ప్రయత్నానికి అనుగుణంగా ఉంటుందన్నారు. పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్న ‘స్టోర్మ్’ ఇంధన ఆవిష్కరణ.. స్వావలంబన స్ఫూర్తికి, 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే XP100, XP95 వంటి అధిక-ఆక్టేన్ ఇంధనాలను, అలాగే రిఫరెన్స్ గ్యాసోలిన్, డీజిల్ వంటి అధిక ఖచ్చితత్వ సముచిత ఇంధనాలను, ఏవియేషన్ ఇంధనం ఏవీ గ్యాస్ 100 LLలను విక్రయిస్తోంది. -
ఎఫ్ఐఎం ఇ–ఎక్స్ప్లోరర్లో భారత జట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మోటార్ సైక్లింగ్ సమాఖ్య (ఎఫ్ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఇ–ఎక్స్‌ప్లోరర్ ఈవెంట్లో తొలిసారి భారత జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. 2024 సీజన్లో భారత్‌కు చెందిన ‘ఇండి రేసింగ్’ టీమ్ బరిలోకి దిగుతుంది. అధికారికంగా ఎఫ్ఐఎం అనుమతించిన రేసింగ్ పోటీల్లో పాల్గొనే తొలి టీమ్ ‘ఇండి రేసింగ్’ అవుతుంది. ఈ జట్టు యజమాని కంకణాల అభిశేక్ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. తాజా సీజన్ రేస్‌లు జపాన్‌లో వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతాయి. నవంబర్‌లో హైదరాబాద్‌లోనే రేసింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇండి రేసింగ్ టీమ్ తరఫున ఐశ్వర్య పిస్సే, స్పెన్సర్ విల్టన్, సాండ్రా గోమెజ్ పోటీ పడతారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఇటీవల చాలా పెరిగిందని, అయితే పోటీల్లోకి వచ్చేసరికి మన టీమ్‌కు ప్రాతినిధ్యం లేదని కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిశేక్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తమ జట్టు ఇండి రేసింగ్ ఆ అవకాశం కలి్పస్తుందని, ఎక్కువ మంది దీనివైపు మళ్లేలా తమ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ నుంచి రేసింగ్ పోటీలు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా నగరంలో జరగాల్సిన రెండు రేసింగ్ పోటీలు రద్దయ్యాయి. ఈ నెల 4, 5 తేదీల్లో నెక్లెస్ రోడ్ వేదికగా ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ నిబంధనలతో వీటిని ఇక్కడ జరపడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండు రేస్‌లను హైదరాబాద్‌నుంచి తరలిస్తున్నామని, ప్రకటించిన ఆ రెండు తేదీల్లోనే చెన్నైలో నిర్వహిస్తామని వారు వెల్లడించారు. రేస్‌ల కోసం ఇప్పటికే టికెట్లు కొన్నవారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. -
మొదటిసారి ఈ-రేసింగ్ ఛాంపియన్షిప్ - టీవీఎస్ మోటార్స్
బెంగళూరు: టీవీఎస్ మోటార్స్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు(టీవీఎస్ ఎలక్ట్రిక్ వన్ మేకింగ్ చాంపియన్‌షిప్) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఈ రేస్ మోటార్‌సైకిళ్లతో ఈ పోటీలు జరగనున్నాయి. ఈవీ మోటార్ రేసింగ్ ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించిన మొట్ట మొదటి భారత కంపెనీ తమదేనని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. భారత్‌లో మోటార్స్పోర్ట్స్లను ప్రోత్సహించడం, సుస్థిర రవాణా పరిష్కారాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్‌కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
ఫార్ములా ఇ రేసింగ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్,కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి 12, న FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్‌ద ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించోబోతోంది. దీనిపై పారిశశ్రామిక వేత్త ఆనంద్‌మహీంద్ర ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేశారు. FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత, దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రేసింగ్ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా ఆనంద్ మహీంద్రకు ధన్య వాదాలు తెలిపారు. మాతృ సంస్థలో మహీంద్రా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ తమలో విలీనమైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం లభించిందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి విలీనం చేసినట్టు మహీంద్రా స్పష్టం చేసింది. Welcome to Hyderabad Anand Ji 🏎️ https://t.co/b2IFjMpmBg — KTR (@KTRBRS) February 3, 2023 -
హైదరాబాద్ లో మరోసారి ఫార్ములా ఈ రేసింగ్
-
రేస్ లేకుండానే ముగిసిన లీగ్.. ‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్... గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో చర్చగా మారిన స్పోర్ట్స్ ఈవెంట్! శనివారమే లీగ్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌తోపాటు ఒక ప్రధాన రేసు జరగాల్సి ఉన్నా... వేర్వేరు కారణాలతో అన్నింటినీ ఆదివారానికి వాయిదా వేశారు. వీకెండ్లో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చి ‘స్ట్రీట్ సర్క్యూట్’లో రేసింగ్ పోటీలను తిలకించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన ఒక ఘటన తొలి అంచెలో మూడు రేసులను ముగించింది. అప్పటికి ఇంకా క్వాలిఫయింగ్ రేస్‌లు ప్రారంభమే కాలేదు. ప్రాక్టీస్ మాత్రమే సాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై జట్టుకు చెందిన డ్రైవర్ విష్ణు ప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. దాంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్రేక్‌ల సమస్యే ఇందుకు కారణమని తేలింది. ఎల్జీబీ ఫార్ములా 4లో పోటీపడుతున్న కార్లు ప్రాక్టీస్ సమయంలో వుల్ఫ్ జీబీ08 థండర్స్ కారు బ్రేక్‌లు ఆశించిన రీతిలో సరిగా పని చేయడం లేదని అప్పటికే డ్రైవర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో మలుపుల వద్ద హెవీ బ్రేకింగ్ జోన్లో అవి ప్రభావం చూపలేకపోయాయి. ప్రమాదం జరిగాక ఆ కారును సర్క్యూట్ నుంచి తప్పించిన నిర్వాహకులు తర్జనభర్జనల అనంతరం ప్రధాన రేస్‌లను ప్రారంభించరాదని నిర్ణయించారు.‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్ఎంఎస్సీఐ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా రేస్‌లను రద్దు చేశాం. ఘటనపై విచారణ జరిపిస్తాం’అని ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారులు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్‌లో భాగంగా తర్వాతి రెండు అంచెలు చెన్నైలో, ఆపై చివరి అంచె డిసెంబర్ 10, 11లో మళ్లీ హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. అయితే తాజా ఘటన అనంతరం వాయిదా పడిన తొలి అంచెలోని మూడు రేస్‌లను ఎప్పుడు నిర్వహిస్తారో? మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసినా వీక్షకులకు మరో రూపంలో కాస్త ఊరట లభించింది. అదే ట్రాక్‌పై ఆదివారం సమాంతరంగా జరగాల్సిన జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ (ఎల్జీబీ ఫార్ములా 4)ను మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘ఓపెన్ వీల్‘కార్లతో సాగిన మూడు రేస్‌లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. -
హుస్సేన్ సాగర్ తీరాన ప్రధాన కారు రేస్ ..
-
బీజేపీలో చేరిన భారత తొలి మహిళా రేసర్
భారత తొలి మహిళా రేసింగ్ నేషనల్ ఛాంపియన్ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన అలీషా.. శనివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. బీజేపీ కుటుంబంలో చేరినందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర బీజేపీ బాస్ అన్నామలై కుప్పుస్వామి, అమర్ ప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు తాను పార్టీలో చేరానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. I’m happy to be apart of @BJP4TamilNadu family The reason I wanted to be apart of BJP is because of the recognition and respect @annamalai_kuppusamy sir and @amarprasadreddyofficial has 4me. I promise to do my best to uplift more women❤️🙏🏻 pic.twitter.com/ZP73A0So5p — Alisha abdullah (@alishaabdullah) September 3, 2022 తమ పిలుపు మేరకు అలీషా పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని కలిగించిందని.. అలీషా చేరిక తమిళనాడు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నామలై, అమర్ ప్రసాద్ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అలీషా.. పురుషాధిపత్యం కలిగిన రేసింగ్ క్రీడలో విశేషంగా రాణించి భారత తొలి నేషనల్ రేసింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. Very happy to welcome a true sporting icon & fabulous competitive racer, Selvi @alishaabdullah to @BJP4TamilNadu today. An inspiring woman who had broken barriers in a sport dominated by men, she has left an indelible mark in her chosen racing career. (1/2) pic.twitter.com/TpNSjompVm — K.Annamalai (@annamalai_k) September 3, 2022 చదవండి: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం -
ఫార్ములా రేసింగ్ కారును ఆవిష్కరించిన సినీ నటి నివేదా (ఫొటోలు)
-
'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు'
ఫార్ములావన్ ఫాలో అయ్యేవారికి క్రిస్టియన్ హార్నర్.. పరిచయం అక్కర్లేని పేరు. 2005 నుంచి రేసింగ్‌లో ఉన్న క్రిస్టియన్ హార్నర్ ఖాతాలో తొమ్మిది వరల్డ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో నాలుగు వరల్డ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్స్.. మిగతా ఐదు వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ టీమ్ రెడ్‌బుల్ ఫార్ములావన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ హార్నర్ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫార్ములా వన్ చూసేందుకు అమ్మాయిలు ఎగబడుతున్నారని.. అయితే అది ఆటపై ఇష్టంతో కాదని.. అందమైన ఫార్ములా వన్ డ్రైవర్లను చూసేందుకే వస్తున్నారంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. టాక్స్పోర్ట్స్కు చెందిన న్యూజ్ ప్రెజంటేటర్ లారా వుడ్స్‌కు క్రిస్టియన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. '' ఫార్ములావన్ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్న యువకులను ప్రోత్సహిస్తుంది. యంగ్ జనరేషన్‌పై ఫోకస్ పెట్టింది. కానీ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులు మాత్రం డ్రైవర్లపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడొస్తున్న యంగ్ డ్రైవర్లు మంచి లుక్‌తో కనిపిస్తున్నారు. కేవలం వారిని చూసేందుకు పార్ములా వన్‌కు ఎగబడుతున్నారు.. ఆటపై ఇష్టంతో మాత్రం కాదు'' అంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ సమాధానం విన్న లారా వుడ్స్ అతనికి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ''ఫార్ములా వన్ను యువతులు ఎక్కువగా చూస్తున్నారని మీరన్న మాట నిజమే.. కానీ డ్రైవర్లపై మోజుతో మాత్రం కాదు.. ఆటను చూసి యువతులు కూడా గొప్ప రేసర్లుగా మారాలని అనుకుంటున్నారు.'' అంటూ పేర్కొంది. కాగా క్రిస్టియన్ వ్యాఖ్యలపై అన్ని వైపలు నుంచి విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాడు. చదవండి: 423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. “A lot of young girls watch F1 because all these great-looking young drivers” says Horner. #F1 Listening to the Christian Horner’s opinion : pic.twitter.com/MfpeifwvsV — 𝐑𝐀𝐘 | 𝐒𝐭𝐢𝐥𝐥 𝐈 𝐑𝐢𝐬𝐞 💜 (@RayyLH44) February 22, 2022 Dear Christian Horner, On behalf of the women that watch and love f1 I wanna say something: WE. WATCH. F1. BECAUSE. WE. LIKE. THE. SPORT. WE. DON'T. WATCH. F1. BECAUSE. WE. THINK. THAT. THE. DRIVERS. ARE. HOT. Stop saying such bullshit. Thank you. Yours sincerely Lara — lara || Charles Leclerc wdc year || essereFerrari (@scuderialara) February 22, 2022 christian horner is genuinely a cunt pic.twitter.com/MNAtxeVI3R — cess ⁺✧. 。 (@pogkazuha) February 21, 2022 -
రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి..
నాయుడుపేటటౌన్ (నెల్లూరు జిల్లా): తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళిక వేసుకుని సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో పావురాల రేస్‌కు తెరతీశారు. తాజాగా నాయుడుపేటలో రేస్ నిర్వహించేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు హాజరుపరిచామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ అవీన్ ఫిలిప్స్ తిరుచ్చి, చెన్నై తదితర ప్రాంతాల్లో పందెం పావురాళ్లతో రేస్‌లు నిర్వహిస్తుంటాడు. రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తుంటారు. ఈక్రమంలో అతను అధిక లాభాలను గడించాడు. తర్ఫీదు పొందిన పందెం పావురాల కాళ్లకు నంబర్లతో కూడిన ట్యాగ్‌ను కడతారు. వాటిని వాహనాల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాలకు తీసుకొచ్చి వదులుతారు. తమిళనాడులోని గమ్యస్థానానికి ముందుగా వెళ్లే పావురాలను విజేతలు ప్రకటించి పందెం కాసిన వారికి నగదు బహుమతులిస్తారు. హార్స్ రేస్‌లాగే పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దఎత్తున పందెం పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నామని నిందితులు విచారణలో చెప్పారు. పందెం పావురాలతో బెట్టింగ్ రెస్ నిర్వహించేందుకు తమకు చెన్నైలో పోలీసులు, అటవీ ఇతర శాఖల అధికారులు అనుమతి ఇచ్చారని నకిలీ పత్రాలు తమ వద్ద ఉంచుకుని నాయుడుపేటకు ఫిలిప్స్ వచ్చినట్లుగా గుర్తించారు. మినీ లారీలో 521 పందెం పావురాలను 27 ప్లాస్టిక్ బాక్సులో ఉంచి తిరుచ్చి ప్రాంతానికి చెందిన మరో ఆరుగురు సహాయకులను వెంట తీసుకుని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్దకు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నాడు. అక్కడ పావురాలను వదిలి పెడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు టీవీ కృష్ణయ్య, కె.బాలకృష్ణయ్య సిబ్బంది వెళ్లి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 521 పావురాలను నెల్లూరులోని ఫౌండేషన్ ఆఫ్ యానిమల్స్ కేంద్రానికి తరలించారు. మినీ లారీని సీజ్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ కేసులో ఏడుగురిని చాకచాక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన ఇద్దరు ఎస్సైలతోపాటు ఏఎస్సై విజయభాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజు, టి.బాలసుబ్రహ్మణ్యం తదితరులను సీఐ అభినందించారు. -
ఒక పావురం రూ.10 కోట్లు, మరొకటి రూ.14 కోట్లు.. సరిపోలేదా ఇంకా ఇస్తాం!
ఎక్కడున్నా వాలిపోతాయి.. ఎక్కడికి వెళ్లినా ఇంటికి చేరిపోతాయి. ప్రేమకు..శాంతికి సంకేతాలు ఈ పావురాలు. ఏ వేడుకలో అయినా ఏ పోటీలో అయినా విజేతగా నిలిచే ఈ పక్షుల కథ అద్యంతం ఆసక్తికరం.. ఆకాశం ఏనాటిదో వీటి అనురాగం కూడా ఆనాటిదే అని మురిసిపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు.. గగనపు వీధులలో తిరుగాడుతూ ఊసులు ఊహలు మోసుకువచ్చి విశాఖ వీధులలో నడయాడే ఈ ప్రేమ జీవులపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: బెల్జియంలో ఒక పావురం రూ.14 కోట్లు పలికింది. ఇంకొక పావురాన్ని చైనా వాళ్లు రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. పావురాలకు ఇంత ధర ఉందా అని హా..శ్చర్యపోతున్నారా? ఔనండీ అవే రేస్ పావురాలు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ధర ఉంది. ఇటువంటివాటిని హోమింగ్ రేస్ పావురాలంటారు. అటువంటి పావురాలతో బుక్కాసింగ్కు విడదీయరాని బంధం ఏర్పడింది. బుక్కాసింగ్ హైదరాబాద్‌లో ఉండేవాడు. అక్కడే పావురాలను మచ్చిక చేసుకున్నాడు. వాటికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు. ( చదవండి: కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే! ) బుక్కాసింగ్ చెప్పినట్టే పావురాలు నడుచుకునేవి. సుమారు 40 ఏళ్ల క్రితం ఆ కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం విశాఖ వలస వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేవారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం కొమ్మాది సమీపంలోని సేవానగర్‌లో కాలనీ కట్టి పేదలకు ఇళ్లు ఇచ్చింది. దీంతో సేవానగర్‌లో స్థిరపడ్డారు. 2016 వరకు రకరకాల రేస్ పావురాలు ఇతని వద్ద ఉండేవి. బుక్కాసింగ్ మృతి చెందిన తరువాత ఆ బాధ్యతను టాంక్ శ్యామ్ సింగ్, హరదీప్ సింగ్ (బుక్కాసింగ్ కుమారులు), రాజ్‌దీప్ సింగ్ (బుక్కా సింగ్ మనుమడు) కంటికి రెప్పలా కాపాడుతూ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో విడిచిపెట్టినా విశాఖ వచ్చేస్తాయి పూనే, ముంబై, చైన్నై వంటి ప్రాంతాలలో వీటిని వదిలి వైజాగ్ వచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఒకరోజు ఆర్థిక ఇబ్బందులు కారణంగా రెండు జతల పావురాలు వేరే వాళ్లకు అమ్మాల్సి వచ్చింది. రెండు నెలలు తరువాత అవి తిరిగి వచ్చేశాయి. దాంతో ఇంకెప్పుడూ వీటిని అమ్మకూడదని, ఎంత కష్టమొచ్చినా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దూరాన్ని బట్టీ వర్గీకరణ ఈ పక్షులు ప్రయాణం చేసే దూరాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో షార్ట్, మిడిల్గా ఉంటాయి. 600 కిమీటర్లు ప్రయాణం చేసేది షార్ట్, 1000 కిలో మీటర్లు ప్రయాణం చేసేవి మిడిల్, 1500 నుంచి 3వే కిలో మీటర్లు ప్రయాణం చేసేవి లాంగ్ అని వర్గీకరించారు. డిసెంబర్లో పోటీలు ఈసారి డిసెంబర్లో కోల్‌కతా, బంగ్లాదేశ్‌లు పావురాల పోటీలు ఉంటాయి. అక్కడ వేళ్లేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈసారి కచ్చితంగా విజేతలుగా విశాఖ తిరిగివస్తామని సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన సాయం మర్చిపోలేం మా నాన్నకు పావురాలు అంటే చాలా ఇష్టం. ఆయనకు మిత్రుడైన చక్రవర్తి (పెందుర్తి దగ్గర గుర్రంపాలెం) 2010లో బెల్జియం నుంచి సుమారు రూ.3 లక్షలు వెచ్చించి రేసు పావురాలు బహుమతిగా ఇచ్చారు. వీటి సంతానం తమ వద్ద ఉందని సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉదయం 20–24 రకాల ధాన్యాలు, పప్పులతో తయారు చేసిన ఆల్ మిక్చర్ ఆహారంగా అందిస్తారు. వాతావరణం మార్పులకు అనుగుణంగా ఇవి కూడా అప్పడప్పుడు మారుతాయి. తిన్నాక సుమారు 3గంటలు, ఒక్కోసారి చాలా ఎక్కువ సమయమే కొండలు, కోనలు చూసి వస్తాయి. ముఖ్యంగా కంబాలు కొండ రిజర్వ్ ఫారెస్టు, అప్పుడప్పుడు జూ పార్కు, సీతకొండ, కంబాలు కొండ, విశాఖ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు తదితర ప్రాంతాలు చుట్టి వస్తాయి. మధ్యాహ్నం ఇంటికి చేరుకుంటాయి. కాసిన్ని నీరు తాగి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ సాయంత్రం ఆహారం పెట్టాక మళ్లీ అలా సిటీని చుట్టుముట్టివస్తాయి. మా దగ్గర ఉన్న హోమింగ్ రేస్ పావురాలు 600కిలో మీటర్లు 7గంటల్లో ప్రయాణిస్తాయి. ఇంచు మించి గంటకి 90 కిలో మీటర్లు ప్రయాణం చెయ్యగలవు. ఇటీవల పూనేలో వీటిని వదిలితే 3రోజుల్లో ఇంటికి చేరాయి. బెంగళూరు, రాయపూర్, హైదరాబాద్, రాయపూర్, రాజమండ్రి, విజయవాడ, కోల్‌కతా, షొలాపూర్ తదితర ప్రాంతాలలో వదిలిన పావురాలు క్షేమంగా అనుకున్న సమయానికి విశాఖ వచ్చాయి. ( చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. ) నాన్న కల నెరవేరుస్తా వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నాన్నకు చాలా ఇష్టం. పాదయాత్ర చేసేటప్పుడు కలవాలనుకున్నారు. సాధ్యం కాలేదు. మా పావురానికి చీటి కట్టించి ఆయన చేతులు మీదుగా వదలాలి అనుకున్నారు. ఆయన కోరిక తీరకుండానే కాలం చేశారు. నాన్న కల నెరవేర్చేందుకు స్థానిక నాయకుల సాయంతో త్వరలో కలుస్తా. –టాంక్ శ్యామ్ సింగ్ (బుక్కాసింగ్ పెద్ద కుమారుడు) పావురాలు మా ఇంట్లో సభ్యులు మాది మొదటి నుంచి పేద కుటుంబం.. అయినా పావురాలను ఎప్పుడూ వలదలేదు. ఏ లోటు వచ్చినా వాటికి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. నాన్న చనిపోయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయినా వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. –హరదీప్ సింగ్ వీటితో గడపడం చాలా ఆనందం పావురాలతో గడపడం అంటే చాలా ఇష్టం. నాకు స్నేహితులు లేరు. ఇవే నాకు అన్నీ...వాటికి గింజలు వేస్తూ ఆడుకుంటూ ఉంటా. అవి చేసే విన్యాసాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాటితో గడపడానికే ఎక్కువ ఇష్ట పడతా.. –రాజ్‌దీప్ సింగ్, బుక్కా సింగ్ మనుమడు చదవండి: లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్ -
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘మైనర్ విద్యార్థులు ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తున్నారు.. ఇవి అత్యంత ప్రమాదకరం. గత ఏప్రిల్‌లో ఐదుగురు విద్యార్థులును పట్టుకున్నాం. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్సై స్టంట్లు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం) ‘‘ఇద్దరు యువకులు స్టంట్లు చేసినట్టు గుర్తించాం. యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విజువల్స్ చూశాం. ఇప్పుడు వచ్చిన విజువల్స్‌లో ఉన్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకుంటాం. రేసింగ్, స్టంట్లు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇక నుంచి ఖాళీ రోడ్లు, ఫ్లై ఓవర్లపై నిఘా పెడతాం. యువకుల చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్‌గా నిర్ధారించాం’’ అన్నారు. చదవండి: Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు -
రియల్ లైఫ్‌లో హీరోయిన్ సాహసం: రేసులో లెవల్ వన్
ఫార్ములా రేసింగ్ నేర్చుకుంటున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇది సినిమా కోసం కాదు. రియల్ లైఫ్‌లో తన కలను నిజం చేసుకోవడానికి రేసింగ్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఓ స్కూల్ నుంచి ‘ఫార్ములా రేసింగ్ లెవల్ 1 రేసర్’గా సర్టిఫికేట్ కూడా పొందారు. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘‘స్కూల్ డేస్ నుంచే ఫార్ములా రేసింగ్ అంటే నాకు ఆసక్తి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దాంతో స్పోర్ట్స్ కార్లంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 2015లో ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను. యూఏఈలో అప్పట్లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళను నేనే. ఈ కారు వి6 ఇంజిన్ ఫాస్ట్ రేసింగ్‌కు సంబంధించినది. కానీ నేను బాగానే డ్రైవ్ చేశాను. చెన్నై వచ్చాక కొన్ని మోటార్ ట్రాక్స్‌ను చూసి, ఈ ట్రాక్స్‌పై డ్రైవ్ చేయగలనా? అనిపించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ అడ్వాన్డ్స్ రేసింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. లెవల్ వన్ కంప్లీట్ చేశాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిష్స్ మహిళా పోటీలు లేవు. ఉంటే ప్రోత్సాహంగా ఉంటుందని నా అభిప్రాయం. అయినా రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం రేసింగ్‌లోని నెక్ట్స్ లెవల్స్‌ను పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం
చెన్నై: చెన్నైలోని తాంబరంలో ఆన్లైన్ నిర్వహకులు చేపట్టిన ఆటో రేసింగ్ ఆలస్యంగా వెలుగుచూసింది.ఆదివారం తాంబరం- పోరూర్ ప్రాంతంలో జరిగిన రేసింగ్ మొత్తం ప్రాణంతకంగా కనిపించింది. రోడ్డుపై వాహనాల బిజీగా వెళ్తున్న సమయంలోనే రేసింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కాగా వీడియోలో ముందు బైక్‌లపై కొందరు యువకులు ఆటోవాలాలకు సూచనలు ఇస్తుండగా.. ఆటోడ్రైవర్లు తమ రేసింగ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రేసింగ్ నిర్వాహకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఆన్లైన్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఇలాంటి రేస్‌లకు పాల్పడుతున్నాయి. గెలిచిన వ్యక్తికి రూ. 10 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తారు. డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో 2019లో బిజీగా ఉన్న రోడ్లపై బైక్ రేసింగ్‌లో బస్‌ను గుద్దడంతో ఒక వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. -
సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు
నెదర్లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్వంటెకి చెందిన విద్యార్ధి బృందం ఏడాది పాటు శ్రమించి ఫోర్త్ జనరేషన్ కు చెందిన డెల్టా ఈఎక్స్ అనే ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ ను డిజైన్ చేసింది. విద్యార్ధులు తయారు చేసిన ఈ బైక్ డిజైన్ తో పాటు ఫీచర్స్ ఆకట్టుకోవడంతో రేసింగ్ ప్రియులు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డెల్టా ఇఎక్స్ మోడల్ రేస్ బైక్ చూడడానికి సుటర్ MMX 500ను పోలి ఉంటుంది. కానీ వాస్తవానికి బైక్ ఎత్తు పల్లాల్లో దాని వేగాన్నిపెంచేందుకు వన్ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంటారు. దీనికి మాత్రం టూ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ఉపయోగించారు. అంతేకాదు దాని డిజైన్ ను ( స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్) సైతం 1970ల నుంచి వెహికల్ రంగంలో అగ్రగామిగా ఉన్న బక్కర్ ఫ్రేమ్బౌవ్ కంపెనీ ఆధ్వర్యంలో డిజైన్ చేయించారు. ఇక దాని వేగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సెకన్ల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల టార్గెట్ ను ఛేదిస్తోంది.170 కిలోవాట్ల పిఎమ్ఐసి (పర్మనెంట్ మాగ్నెట్ ఎసి) మోటారుతో పనిచేసే డెల్టా ఈఎక్స్ 300 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది సెకన్లలో రీచ్ అవుతుంది. అంటే మూడు సెకన్లకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దాని బాడీ పార్ట్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా బైక్ టైర్ వేగాన్ని అదుపు చేసేలా సిరామిక్ రెయిన్ ఫోర్స్ డ్ కార్బన్ ట్యూబ్స్‌తో ఓహ్లిన్స్ ఫోర్క్, బైక్ అప్ అండ్ డౌన్ ను కంట్రోల్ చేసే ఓహెలిన్స్ టీటీఎక్స్ జీపీ మోనో షాక్ స్ప్రింగ్స్, బ్రేక్ వేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా రక్షించేలా యూకేకు చెందిన హెల్ కంపెనీ ఫోర్ పిస్టోన్ ర్యాడైల్ క్లిప్పర్, ఫోర్జెడ్ అల్యూమినియంతో ఫ్రంట్ వీల్.. పీవీఎం మెగ్నీషియం వెనుక చక్రంతో అమర్చారు. కాగా, ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ 70కి పైగా భాగస్వామి కంపెనీల సహాయంతో తయారు చేసింది విద్యార్ధుల బృందం.ప్రస్తుతం మోటోజిపి రేసర్ బైక్ తరహాలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది. చదవండి : హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్! -
నువ్వా.. నేనా?
తమిళ నటుడు అజిత్ బైక్, కార్ రేసింగ్స్ పట్ల భలే ఇంట్రెస్ట్‌గా ఉంటారు. కొన్నిసార్లు ఆయన రేసింగ్ పోటీలో పాల్గొన్నారు కూడా. ఈ రేసింగ్ మజాను ఆయన వెండితెరపైకి తేచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. తన తర్వాతి సినిమాలోఅజిత్ కార్ రేసర్‌గా కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. సౌతాఫ్రికా, మిడిల్ ఈస్ట్, బుడాపెస్ట్ లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. దాదాపు 18ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నారు అజిత్. 2001లో షారుక్‌ఖాన్ నటించిన ‘అశోక’ సినిమాలో అజిత్ ఓ చితన్న పాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు రేస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మాణంలో అజిత్ నటించిన ‘నెర్కొండ పరవై’ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
రేసింగ్‌కు కళ్లెం
♦ ఈసీఆర్‌లో మాటు ♦ లగ్జరీ కార్ల భరతం ♦ వంద మందికి జరిమానా ♦ ఐదు కార్లు సీజ్ ఈసీఆర్ రోడ్డులో అతివేగంగా దూసుకెళ్లే కార్ల భరతం పట్టే రీతిలో ఆర్టీవో వర్గాలురంగంలోకి దిగారు. సంపన్నుల పిల్లలతో పాటు అతివేగంగా దూసుకొచ్చిన కార్లను టార్గెట్ చేసి నిఘా వేశారు. వందకార్లను పట్టుకున్నారు. యాభై కార్లకు సుమారు లక్షన్నర రూపాయల మేరకు జరిమానాలు విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు ఈసీఆర్ రోడ్డులో పయనం ఆహ్లాదకరమే. సముద్ర తీరం వెంబడి సాగే ఈ పయనంలో తళ తళమని రోడ్లు మెరుస్తుంటాయి. ఈ రోడ్డులో నిత్యం వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటాయి. రాత్రుల్లో అయితే, మోటార్‌సైకిల్, కార్ల రేసింగ్ జోరుగానే సాగుతుంటాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం స్పందించే పోలీసులు, తదుపరి యథారాజా తథా ప్రజా అని వ్యవహరించడం జరుగుతోంది. ఈ మార్గంలో నిత్యం సాగే ప్రమాదాల్లో విగత జీవులయ్యే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం అయితే, ఏకంగా అత్యంత ఖరీదైన పదిహేను కార్లు చెన్నై నుంచి ఈసీఆర్ రోడ్డులో పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతివేగంగా దూసుకెళ్తున్న ఈ కార్లతో ఇతర వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలకు ఏదేని ప్రమాదాలు తప్పదేమో అన్న ఆందోళన బయలు దేరింది. ఈ కార్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఒక్కో కారు లక్షలు విలువ చే యడంతో పాటు అందులో ఉన్న వాళ్లు సంపన్నుల పిల్లలు కావడమే. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తొలుత తీసుకున్నా, తదుపరి చడీచప్పుడు కాకుండా వదలిపెట్టారు. అయినా, రేషింగ్ జోరుగానే సాగుతుండడంతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. దీంతో అధికారులు ముందస్తుగా మేల్కొన్నట్టున్నారు. ఈసీఆర్‌లో మాటు: ఆర్టీఏ అధికారులు యువరాజ్, విజయకుమార్, నెల్లయ్యన్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది ఈసీఆర్ రోడ్డులో అక్కడక్కడ మాటు వేశారు. ముందుస్తుగా సిద్ధం చేసుకున్న పరికరాల మేరకు అతివేగంగా దూసుకొచ్చే వాహనాలను పసిగట్టారు. ఓ చోట తప్పించుకున్నా, మరోచోట ఆ కార్లు తమ వాళ్లకు చిక్కే రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే అతి వేగంగా కార్లు దూసుకు రావడంతో వాటి వేగానికి కళ్లెం వేస్తూ ముందుకు సాగారు. అతి వేగంగా వచ్చిన కార్లను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సంపన్నులు, అధికారుల పిల్లలు అన్న తేడా లేకుండా జరిమానా మోత మోగించారు. 50 లగ్జరీ కార్లకు అయితే, ఏకంగా లక్షన్నర జరిమానా విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, మరో వంద వాహనాలకు లక్ష వరకు జరిమానా విధించారు. ఐదు కార్లను సీజ్ చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలను గురువారం ఆర్టీఏ అ«ధికారులు ప్రకటించనున్నారు. ఇక, ఏదో మొక్కుబడిగా... మమా అనిపించడం కన్నా, ఈ ప్రక్రియ నిరంతర కొనసాగాలని, అప్పుడే నిర్భయంగా రోడ్డు మీదకు రాగలమని ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. ఈ తనిఖీలు ఓ వైపు సాగితే, మరో వైపు నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జోరుగా సాగుతోందో పసిగట్టి, అందుకు తగ్గ చర్యలు తీసుకునే విధంగా నగర పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులు పరుగులు తీశారు. ఆదివారం ప్రమాదరహిత చెన్నై నినాదంతో ముందుకు సాగిన పోలీసులు, ఇక, నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగతుండడం గమనార్హం. -
లగ్జరీ రేసింగ్!
ఈసీఆర్‌లో హల్చల్ పోలీసులకు ముచ్చెమటలు తొమ్మిది కార్ల పట్టివేత చెన్నై: ఈసీఆర్ రోడ్డులో లగ్జరీ కార్లు రేసింగ్‌లో దూసుకెళ్లాయి. సంపన్నుల పిల్లలు హల్చల్ సృష్టిస్తూ సాగించిన ఈ రేసింగ్ పోలీసులకే ముచ్చెమటలు పట్టించాయి. చివరకు పోలీసులు కన్నెర్ర చేయడంతో తొమ్మిది లగ్జరీ కార్లు, అందులో ఉన్న పదిహేను మంది చిక్కారు. మరో ఆరు కార్లు తప్పించుకున్నాయి. చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు ఈసీఆర్ రోడ్డులో పయనం ఆహ్లాదకరమే. సముద్ర తీరం వెంబడి సాగే ఈ పయనంలో తళతళమని రోడ్లు మెరుస్తుంటాయి. ఈ రోడ్డులో నిత్యం వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటాయి. రాత్రుల్లో అయితే, మోటార్ సైకి ల్, కార్ల రేసింగ్ జోరుగానే సాగుతుంటాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం స్పందించే పోలీసులు, తదుపరి యథారాజా తథా ప్రజా అని వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అత్యంత ఖరీదైన పదిహేను కార్లు చెన్నై నుంచి ఈసీఆర్ రోడ్డులో పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతి వేగంగా దూసుకెళ్తున్న ఈ కార్లతో ఇతర వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలకు ప్రమాదాలు తప్పవేమో అనే ఆందోళన కలిగింది. తక్షణం ట్రాఫిక్ పోలీసులు వైర్‌లస్ ఫోనుల్లో నీలాం కరై ఏసీ ఏకే పాండియన్, ఇన్స్పెక్టర్ రమేష్‌లకు సమాచారం ఇచ్చారు. కానాత్తూరు వద్ద రేసింగ్‌లో దూసుకెళుతున్న కార్లను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే, వారికి ముచ్చెమటలు పట్టిస్తూ, ఆ కార్లు దూసుకెళ్లాయి. తక్షణం ఉత్తండి టోల్గేట్ వద్ద ఆ వాహనాలను అడ్డుకునేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. టోల్‌గేట్‌కు ఆ కార్లు సమీపించగానే, గేట్లు మూత వేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పటికే ఐదు కార్లు టోల్ గేట్‌ను దాటడంతో, పది కార్లును చుట్టుముట్టారు. తమను పోలీసులు చుట్టుముట్టడంతో ఆగ్రహించిన అందులో ఉన్న సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లాలు తమ వీరంగాన్ని ప్రదర్శించే యత్నం చేశారు. కాసేపు హల్చల్ సృష్టించారు. పోలీసులకే ముచ్చెమటలు పట్టించే విధంగా బెదిరింపులు, హెచ్చరికలు ఇచ్చారు. చివరకు ఓ కారును పోలీసు వలయాన్ని ఛేదించి, సౌందర పాండియన్ అనే పోలీసును ఢీకొట్టి అందులో ఉన్నవారు ముందుకు నడిపారు. ఆ కారును అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల్లో ఒక్కసారిగా ఆగ్రహం బయలు దేరింది. మిగిలిన తొమ్మిది కార్లను అందులో ఉన్న పదిహేను మందిని అదుపులోకి తీసుకుని కానాత్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడ్డ వాళ్లను వదలిపెట్టాలని పలు చోట్ల నుంచి ఫోన్లు వచ్చినా, పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు కారణం తమ పోలీసు గాయపడడమే. పట్టుబడ్డ కార్లు ఒక్కొక్కటి కొన్ని లక్షలు విలువ చేస్తాయి. ఈ కార్లను చూడడానికి జనం ఎగబడ్డారు. -
రేసింగ్ చాంప్ అనిందిత్
సాక్షి, హైదరాబాద్: జేకే టైర్ ఎఫ్ఎంఎస్సీఐ జాతీయ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. ఢిల్లీలోని బుధ్ సర్క్యూట్లో జరిగిన ఈ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో యూరో జేకే-16 విభాగంలో విజేతగా నిలిచాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన అనిందిత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరి వరకు తన దూకుడును కొనసాగిస్తూ 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో అనంత్ షణ్ముగమ్ (99 పాయింట్లు), నయన్ చటర్జీ (90 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఎల్జీబీ-4 రేసు విభాగంలో చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్ (96 పాయింట్లు) విజేతగా నిలవగా... రాహుల్ రంగస్వామి (75 పాయింట్లు), శరణ్ (54 పాయింట్లు) తర్వాతి స్థానాల్ని దక్కించుకున్నారు. -
భీమవరం ఇ–బైక్స్ అద్వితీయం
భీమవరం: భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో నాలుగు రోజులగా నిర్వహించిన విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్–2016 ఇ–బైక్ రేసింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. కర్నాటకుకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా నిలిచి రూ.80 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు నిలిచి రూ.40 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఎండ్యూరెన్స్ విభాగం విజేతగా కర్నాటకకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు నిలిచి రూ.10 వేలు, రన్నరప్‌గా భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నిలిచి రూ.5 వేలు బహుమతులు అందుకున్నారు. పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు నుంచి సుమారు 500 మంది విద్యార్థులు 25 బృందాలుగా తలపడ్డారు. తయారీ రంగంపై దృష్టి సారించాలి ప్రపంచ ఇంజినీరింగ్‌లో నవీన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న తరుణంలో యువత తయారీ రంగం, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలపై దృష్టిసారించాలనిభీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ అన్నారు. బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు. టెక్‌మహీంద్రా డెలివరీ మేనేజర్ దండు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థి దశలో నూతన ఆవిష్కరణలు రూపొందించడం ఎలక్ట్రికల్ బైక్‌ల తయారీ, ప్రదర్శన, రేసుల్లో పాల్గొనడం ద్వారా విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్ పోటీలు పారిశ్రామిక, తయారీ రంగాల దృష్టిని ఆకర్షించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు వికాస్, సాగర్, మనోనీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో పావురాలతో పందేలు
-
బైక్ రేసింగ్‌లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
బైక్ రేసింగ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి నేతృత్వంలో రెండు ప్లటూన్ల పోలీసు బలగాలు, 20 మంది పోలీసులు పది పికెట్లు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు వరకు బైక్ రేసింగ్‌లపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతున్న 35 స్పోర్ట్స్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులందరికీ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా పబ్‌లలో, కాఫీ షాప్‌లలో మద్యం సేవించి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్లమీద పందెం కాస్తూ బైక్‌లపై దూసుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. -
వందేళ్ళ వయసులో '100 మీటర్ల' రికార్డు
వందేళ్ళ వయసులో వంద మీటర్ల పరుగు... ఊహించడానికే కష్టంగా కనిపిస్తుంది కదూ... కానీ ఆ పోటీల్లో పాల్గొని ఏకంగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇడా కీలింగ్. వందేళ్ళు జీవించడమే ఓ రికార్డుగా మారుతున్న ఈ కాలంలో వందేళ్ళ వయసులో వందమీటర్ల రేసులో పాల్గొని ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. 80 ఏళ్ళ ఇతర పోటీదారుతో రేసులో కేవలం అత్యంత తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసి ఇంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది. ఇడా కీలింగ్... వందేళ్ళ వయసులోనూ వంద మీటర్ల రేసులో పాల్గొనేందుకు వెనుకాడలేదు. పాల్గోవడమే కాదు ఏకంగా ఇంతకు ముందున్నజమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.56 సెకన్లలో 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాసింది. కేవలం 1 నిమిషం17.33 సెకన్లలో వంద మీటర్ల రేస్ ను అవలీలగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పెన్ రిలే కార్నివాల్ గా పిలిచే పెన్ రిలే పోటీలు అమెరికాలో నిర్వహించే అత్యంత పురాతన, అతి పెద్ద ట్రాక్, ఫీల్డ్ పోటీలు. ఇవి ప్రతి యేటా ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తుంటారు. ఫిలడెల్ఫియా ఫ్రాంక్లిన్ ఫీల్డ్ లోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1895 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి పోటీల్లో పాల్గొని రికార్డును సాధించిన ఇడా కీలింగ్... రుచికోసం తినొద్దని, పోషక పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, రోజుకోసారైనా వ్యాయామం చేయాలని క్రీడాకారులతోపాటు, సాధారణ ప్రజలకూ సలహా ఇచ్చింది. అంతేకాదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని, మనమేం చేయాలనుకుంటున్నామో అది చేయాలని, మనకోసం ఎవ్వరూ ఏమీ చేయరంటూ సూచించింది. పౌర హక్కుల ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న కీలింగ్ కు నలుగురు కొడుకులుండేవారు. దశాబ్దాల క్రితమే భర్త మరణించగా.. ఇద్దరు కొడుకులు తీవ్ర మాదక ద్రవ్యాల అలవాటుతో మృతి చెందినట్లు ఓ పత్రిక అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. వయసు మీరుతుంటే ఒంటిపై పడే రోగాలకు పరుగే తన ప్రధాన చికిత్సగా మార్చుకున్న కీలింగ్... మొదటిసారి 67 ఏళ్ళ వయసులో రేసింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత తన పరుగును ఎప్పుడూ ఆపలేదని ఓహియో బీకన్ జర్నల్ లో నివేదించిన వివరాలను బట్టి తెలుస్తోంది. -
సై.. సై.. బసవన్నా!
-
కోడిపందేల బరులకు... రేట్లు ఫిక్స్
విజయవాడ : న్యాయస్థానం ఆంక్షలు విధించినా, పోలీసులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నా.. కోడిపందేల నిర్వాహకులు ఏమాత్రం తగ్గటం లేదు. పందేల నిర్వహణకు బరుల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క వారికి భరోసా ఇస్తూ పందేల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు బరుల ఏర్పాటుకు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ మొత్తాలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా ఒప్పందాలు చేసుకుని అడ్వాన్స్‌లు ఇచ్చినవారికే ఈ రేట్లు ఉంటాయని, పండుగ దగ్గరకు వచ్చిన తరువాత రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా నేతల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ రేట్లు ఇస్తే నాలుగైదు ఊళ్లలో బరి లేకుండా ఒకేచోట జరిగేటట్లు చేస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులకు ఈ వసూళ్ల బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాలో ఓ కీలక మంత్రి ఈ విషయంలో తన పేరు బయటకు రాకుండా వ్యవహారం నడపమని ఆదేశించినట్లు పార్టీ వర్గాల భోగట్టా. పోలీసు శాఖపై పట్టున్న అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నేత ఈ రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేయటంలో ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందే బరులు ఏర్పాటు చేయిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చిన ఆ నేత రెండు రోజుల క్రితం సిద్ధం చేయించారు. కోడిపందేలు వేసే సమయానికి పోలీసులు తెలిసి అడ్డుకోవటంతో ఒకట్రెండు రోజుల్లో పూర్తి అనుమతులు తీసుకొస్తానని ఆయన సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క పోలీసుల కోసం కూడా బరి నిర్వాహకులు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాల్‌మనీ కేసుల భయంతో... కాల్‌మనీ కేసులో అభాసుపాలైన ఓ ఎమ్మెల్యే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది తన నియోజకవర్గ పరిధిలో పందేలు దగ్గరుండి మరీ నిర్వహించిన ఆ నేత ఈసారి ఒకటి రెండు రోజులు వేచిచూడమని అనుచరులకు చెబుతున్నట్లు సమాచారం. అంతర్గతంగా రేట్లు మాట్లాడి డబ్బులు చేతులు మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా తన పేరు వాడవద్దని సూచించినట్లు సమాచారం. అంపాపుర ంలో పేకాటకు ఏసీ గదులు మచిలీపట్నం : పందేల నిర్వహణ ఈసారి కొత్త పుంతలు తొక్కనుంది. గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌ల మధ్య ఉన్న అంపాపురంలోని ఓ వెంచర్లో పేకాట ఆడేందుకు ఏసీ గదులను ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సినిమా సెట్టింగ్ పరికరాలు తీసుకొచ్చి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోడిపందేల కోసం ప్రత్యేక గ్యాలరీ ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కైకలూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు ఆదివారం కొల్లేటికోటలో సమావేశం నిర్వహించి భారీ ఎత్తున బరులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ నాయకులు కోడిపందేలను ప్రారంభించేందుకు గుర్తుగా కోడిపందేలను ప్రారంభించి పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు. గుడివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, నందివాడ మండలాల్లో మండలానికి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఉంటాయని, పేరుకే కోడిపందేలైనా కోత ముక్క తదితరాలు ఉంటాయని, ఆడేందుకు అనుమతులుంటాయని సమాచారాన్ని పంపుతున్నారు. -
రయ్ రయ్
గాలిని గేలి చేసే వేగం.. ట్రాక్‌పై దుమ్మురేపే సాహసం.. విజయం కోసం దూసుకెళ్లే నైజం.. మోటార్ స్పోర్ట్స్‌లో కనిపిస్తుంటాయి. విదేశీ ట్రాక్స్‌పై హల్చల్ చేస్తున్న రేసింగ్.. ఇప్పుడిప్పుడే సిటీలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక రేసర్లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. రేసింగ్ మెళకువలు నేర్పిస్తోంది హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్. బైక్ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారందరినీ ఈ క్లబ్లో చేర్చుకొని.. అనుభవజ్ఞులతో ‘స్పీడ్ ఆన్ ట్రాక్’ రేసింగ్ పాఠాలు నేర్పి బెస్ట్ రేసర్లుగా తీర్చిదిద్దుతోంది. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో జరిగే మోటార్ స్పోర్ట్స్ బైక్ ఈవెంట్లలో పాల్గొనేలా రేసర్లను ప్రోత్సహిస్తోంది. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీలో శనివారం హెచ్ఎంసీ సభ్యులు స్టంట్లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇటీవల గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్-2015లో కొల్లగొట్టిన అవార్డులను ప్రదర్శించారు. ..:: వాంకె శ్రీనివాస్ లియాఖత్ అలీ జునైద్‌కు బైక్ రేసింగ్ అంటే మహా సరదా. పదో తరగతిలోనే వాళ్ల నాన్న బైక్ తీసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. వాయువేగంతో దూసుకెళ్తూ అదిరిపోయే స్టంట్లు చేసేవాడు. కట్ చేస్తే.. చదువు పూర్తయింది. జూట్ 24 ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కెరీర్ జర్నీ హ్యాపీగా ఉన్నా.. మనోడి మనసు మాత్రం బైక్ చుట్టూనే షికార్లు కొట్టేది. ఆ ఇష్టమే అతగాడిని మళ్లీ బైక్ రేసింగ్ వైపు మళ్లించింది. అదే ఊపులో పలు నగరాల్లో జరిగే రేస్ ఈవెంట్లలో రయ్‌మని దూసుకెళ్లాడు. మోటార్ స్పోర్ట్స్‌కు విదేశాల్లో ఉన్నంత ఆదరణ ఇక్కడ ఎందుకు లేదో ఆలోచించాడు. రేసింగ్‌పై ఇక్కడి యువతకు క్రేజ్ ఉన్నా.. సరైన వేదిక లేదని గ్రహించాడు. రేసింగ్‌లో ఆసక్తి ఉన్నవారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాడు. 2014 నవంబర్‌లో హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్‌కు నాంది పలికాడు. మెగాస్పీడ్.. స్పోర్ట్స్ క్లబ్ విస్తరణలో భాగంగా యమహా ఆర్డీ 350 బైక్ రేసింగ్‌తో జావేద్ 350గా పేరు తెచ్చుకున్న జావేద్ఖాన్ను కలిశాడు అలీ. ఆయనతో పాటు హైదరాబాద్ షూమేకర్‌గా పేరున్న జహంగీర్‌ను కూడా తన టీమ్‌లో చేరమని కోరాడు. ఇలా ఒక్క అలీతో మొదలైన హెచ్ఎంసీ క్లబ్లో నేడు 25 మంది రేసర్లు ఉన్నారు. లోనవాలలోని అంబీవల్లి దగ్గర జనవరిలో జరిగిన ‘ద వల్లీ రన్-2015’లో హెచ్ఎంసీ టీమ్ సభ్యులు ఎనిమిది మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఐదు ట్రోఫీలు గెలుచుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరిలో గోవాలో జరిగిన ‘ఇండియా బైక్ ఈవెంట్’లో 15 కేటగిరిల్లో తొమ్మిదింట్లో విజయం సాధించి హైదరాబాద్ సత్తా చాటారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియా తరఫున దూసుకెళ్తామని చెబుతున్నారు హెచ్ఎంసీ సభ్యులు. మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి మా క్లబ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందంటున్నారు. ‘మన సిటీలో బైక్ రేసింగ్ ప్రాక్టీస్ చేసేందుకు మౌలిక వసతులు లేవు. ప్రభుత్వం చొరవ తీసుకుని కావాల్సిన సౌకర్యాలు కల్పించాల’ని కోరుతున్నాడు మరో బైకర్ జావేద్ ఖాన్. ఆ నలుగురు.. యువతలో ఉన్న ప్రతిభకి సానబెట్టి బెస్ట్ రైడర్లుగా మారుస్తున్న హెచ్ఎంసీ జట్టు.. మోటార్ స్పోర్ట్స్‌లో కప్పు కొట్టడమే లక్ష్యం అని చెబుతోంది. ఈ క్రమంలో రేసర్‌గా తానేంటో నిరూపించుకున్న జునైద్ అలీ.. యువ రైడర్లకు గురువుగా కూడా పాఠాలు చెబుతున్నాడు. నేషనల్ లెవల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో రైడర్లకు జావేద్ ఖాన్ మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ రేంజ్ ఈవెంట్లలో పాల్గొనదలచిన వారికి మీర్జా జహంగీర్, ఇండియన్ క్రూజర్ ప్లస్ రైడర్లకు మరో రేసర్ హసన్ రైడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. సామాజిక బాధ్యత... ట్రాక్ ఎక్కితే వాయువేగంతో దూసుకెళ్లే ఈ క్లబ్ మెంబర్స్.. సిటీ రోడ్లపై మాత్రం కామన్ స్పీడ్‌లోనే వెళ్తామని చెబుతున్నారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. రేసింగ్‌పై ఆసక్తి ఉన్నవారు అనుభవజ్ఞులైన రైడర్ల దగ్గర మెళకువలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రేసింగ్ పోటీలను కాలక్షేపానికే కాకుండా.. సామాజిక బాధ్యతలు పంచుకునే వేదికగా మలుచుకుంది హెచ్ఎంసీ. మెన్ అగెనైస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (మర్డ్)పై రేసింగ్ ఈవెంట్లలో అవగాహన కల్పిస్తోంది. మగవాళ్లతో ఆడవాళ్లను సమానంగా గౌరవించాలన్న థీమ్‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. -
ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్
కొద్ది రోజులుగా ‘ఖాకీ’తో జరిగిన పోరులో చివరికి కోడే గెలిచింది. అత్యున్నత న్యాయస్థానాల సూచనలను, పోలీసుల ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. సంప్రదాయం ముసుగులో.. తెరవెనుక నేతలు ఇచ్చిన మద్దతుతో.. కోడి కత్తుల సమరానికి నిర్వాహకులు ఊహించినట్టుగానే ‘బరి’ తెగించారు. పందెగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసులు ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లావ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. అమలాపురం టౌన్ :సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలో ఎక్కడ చూసినా కోడిపందేల సందడే కనిపించింది. మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలీదు కానీ.. భోగి పండగనాటి ఉదయం వరకూ బరుల వద్ద కాపలా కాసిన ఖాకీలు.. చివరకు పత్తా లేకుండా పోయారు. దీంతో పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. వేలాదిగా తరలివచ్చిన జనాలు.. ఖరీదైన కార్లు, బైకులతో గ్రామాలు జాతర్లను తలపించాయి. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి తోటల్లోని నల్లరేగడి మట్టి.. కోళ్ల ఎర్రని రక్తంతో తడిసింది. పచ్చని చేలు, కొబ్బరితోటల దారులన్నీ జనంతో కిక్కిరిశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో దాదాపు 45 చోట్ల భారీ పందెంబరులు.. 50 చోట్లకు పైగా ఓ మాదిరి బరులు వెలిశాయి. మొత్తం రూ.25 కోట్ల మేర సొమ్ము పందెంగాళ్ల చేతులు మారిందని అంచనా. ముమ్మిడివరం నియోజకవర్గం ఎదుర్లంక, కేశనకుర్రు, రాజుపాలెం; అమలాపురం నియోజకవర్గం గోడిలంక, గుండెపూడి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి; పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు; రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంక, వీవీ మెరక; ఇంకా పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లో పలుచోట్ల కోడిపందేల జోరుగా జరిగాయి. పందేలకు తోడు గుండాట, మద్యం పేరుతో కోట్లలో వ్యాపారం జరిగింది. రూ.10 లక్షల వరకూ పందెం కొట్టిన పుంజులు కొన్నిచోట్ల పందెంకోళ్లు వీరపోరాటం చేసి పందెగాళ్లకు రూ.లక్షల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎదుర్లంక బరిలో ఓ పుంజు పలు పందేల్లో ప్రత్యర్థి పుంజులను మట్టి కరిపించి రూ.10 లక్షల వరకూ పందేలు కొట్టింది. గోడిలంక బరిలో కూడా ఓ పుంజు రూ.5 లక్షల దాకా పందేలను కొట్టింది. ఇంకా వేట్లపాలెం, పల్లిపాలెం, సఖినేటిపల్లి తదితర బరుల్లో కొన్ని పుంజులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పందేలు కొట్టాయి. రూ.కోట్లలో మద్యం, జూదం వ్యాపారాలు పలు బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు, గుండాట, పేకాట స్థావరాల ద్వారా కూడా రూ.కోట్ల వ్యాపారం సాగింది. మద్యం అక్రమంగా అమ్మితే కేసులు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు బరుల్లో అనధికారికంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. జిల్లాలో పందేల బరుల వద్ద ఏర్పాటు చేసిన మద్యం, జూదాల వల్ల రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ వ్యాపారం సాగిందని అంచనా. పలుచోట్ల రూ.500, రూ.1000 నోట్లే చెలామణి అయ్యాయి. బరులవద్ద మాంసపు పకోడీలు, మిరపకాయ బజ్జీల దుకాణాలు కూడా రూ.లక్షల్లో వ్యాపారం చేశాయంటే పందేలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. కోసకు యమగిరాకీ పందేల్లో మరణించిన కోడి మాంసాన్ని ‘కోస’ అంటారు. గత మూడు రోజుల్లో నాలుగు వేలకు పైగా కోళ్లు బరిలో తలపడితే దాదాపు మూడు వేల కోళ్లు నేలకొరిగినట్టు ఒక అంచనా. ఇలాంటి కోళ్ల కోసం కోస మాంసం ప్రియులు వేలాదిగా కాచుకుని ఉంటారు. ఇటువంటి కోళ్లు బరి సమీపంలో.. కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతాయి. ఈ విధంగా ఒక్కో కోడి రూ.మూడు వేల నుంచి రూ.ఆరు వేల వరకూ ధర పలికింది. ఈవిధంగా గత మూడు రోజుల్లో సుమారు రూ.కోటి మేర ‘కోస’ వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. కోనసీమలోని ఎదుర్లంక, గోడిలంక వంటి ప్రధాన బరుల్లోనే కోస మాంసం వ్యాపారం గత మూడు రోజుల్లో రూ.20 లక్షలకు పైగా సాగినట్టు సమాచారం. కొన్ని బరులవద్ద పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోళ్లను కాల్చి.. మాంసంగా మార్చి కిలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు విక్రయించారు. పందెంలో విజేతగా నిలిచి కత్తి వేట్లకు పందెం తర్వాత చనిపోయిన కోడికి మరింత డిమాండు ఏర్పడింది. ఇటువంటి కోడి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ పలికింది. ప్రజాప్రతినిధులు సాక్షిగా.. పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సాక్షిగా కోడిపందేలు సాగాయి. పిఠాపురం, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు తొలి రోజు తమ తమ నియోజకవర్గాల్లో పందేలను లాంఛనంగా ప్రారంభించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పండగ మూడు రోజులూ ఎదుర్లంక బరిలో ఉండి ఆద్యంతం పందేలను తిలకించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పుట్టిన రోజు వేడుకలను అభిమానులు వేట్లపాలెంలోని కోడిపందేల బరిలోనే నిర్వహించారు. ఆయన కూడా పందేలను వీక్షించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వాడ్రేవుపల్లిలో శుక్రవారం జరిగిన కోడిపందేల్లో పాల్గొన్నారు. కొద్దిసేపు దగ్గరుండిమరీ పందేలు ఆడించారు. ఈ సందర్భంగా జరిగిన ఆర్కెస్ట్రాలో గాయకులు పాడిన పాటలకు ఆయన స్టెప్పులు కూడా వేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అనేకమంది దగ్గరుండి మరీ పందేలను పర్యవేక్షించారు. -
వెటరన్ వేల్
సామువేల్ వయసు 56. ఆయన సాధించిన పతకాలు 439. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ కైవండూరు గ్రామానికి చెందిన ఈ క్రీడాకారుని గొప్పతనానికి నిదర్శనంగా ఇది మనం చెప్పుకుంటున్న సంఖ్య కాదు. ఆ మాట కొస్తే సామువేల్ ఒక్క పతకం సాధించడం కూడా విశేషమే. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ నాటికీ ఆయన క్రీడల్లో రాణిస్తున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు కోయంబత్తూరులో రాష్ట్రస్థాయి పరుగు పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది సామువేల్కు. పరుగున వెళ్లి తల్లికి చెప్పాడు. ‘‘బుద్ధిగా చదువుకో. లేదంటే పశువులు తోలుకో. ఎందుకూ పనికి రాని ఆ ఆటల వెంట పరుగెత్తి జీవితాన్ని పాడు చేసుకోకు’’ అని గట్టిగా చెప్పింది ఆమె. బిడ్డ చదువు విషయంలో తల్లి ఎంత స్థిరంగా ఉందంటే, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించుకు వచ్చినా కూడా ఆమె సంతోషించలేదు. ‘‘ఈ తెలివితేటలు చదువులో చూపించు’’ అంది. సామువేల్ కంటతడి పెట్టుకున్నాడు. ఆటలంటే బిడ్డకు ఎంత ఇష్టమో తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఏం చేయగలరు. ఆ కుటుంబానికి కావలసింది పతకాలు కాదు. తినడానికిన్ని మెతుకులు. తల్లిదండ్రుల మాటలు తనను నిరాశపరచలేదు. రకరకాల పరుగు పందేలలో ఎన్నో పతకాలు సాధించాడు సామువేల్. అర్ధాంగి అండగా నిలిచింది తల్లిదండ్రులు చనిపోయాక సామువేల్కి లలితతో వివాహం అయింది. ఆ వెంటనే.. కుటుంబ పోషణ కోసం ఆటలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన మెడల్స్ చూసుకుని బోరున ఏడ్చేవాడు. ఓ రోజు అలా ఏడుస్తుండగా భార్య అతడిని చూసింది. ‘‘ప్రతిభ ఉండి నువ్వెందుకు ఆటలు మానేయాలి?’’ అని అడిగింది. నీ వెనుక నేనున్నానంది. ఇక సామువేల్ ఆగలేదు. తనకు ప్రాణపదమైన ఆటల్లోకి మళ్లీ అడుగుపెట్టాడు. ఒక వైపు కూలి పనులు, గోడ ల మీద రాత పనులు చేసుకుంటూనే ప్రాక్టీస్ మొదలు పెట్టి ఎన్నో పతకాలు సాధించాడు. తన సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలో ఇంతవరకు సింగపూర్, మలేషియా, టాంజానియా, లండన్ కూడా వెళ్లి రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్‌లలో పాల్గొనివచ్చాడు! చాంపియన్‌గా, వెటరన్ క్రీడాకారునిగా సామువేల్ ఇప్పటి వరకు సాధించిన నాలుగు వందలకు పైగా పతకాలలో 18 అంతర్జాతీయ మెడల్స్ కూడా ఉన్నాయి. తను క్రీడాకారునిగా ఎదిగే క్రమంలో గ్రామస్థుల ప్రశంసలు ఎంతో మనోబలాన్నిచ్చాయని సామువేల్ అంటారు. ఎప్పటికీ మరచిపోలేను మావారికి 1989లో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పటికి నేను ఎనిమిది నెలల గర్భిణిని. నా మెడికల్ చెకప్ కోసం దాచిన 80 రూపాయలను ఆయన చేతికిచ్చి తూత్తుకుడి పంపా. విషయం తెలిసి బంధువులు తిట్టారు. నేను పట్టించుకోలేదు. ఆయన పోటీలకు వెళ్లారు. బంగారు పతకంతో తిరిగివచ్చి ‘‘లలిత లేకుంటే నాకు ఈ పతకం వచ్చేదే కాదు’’ అంటూ గ్రామంలో జరిగిన సన్మాన సభలో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. - లలిత, సామువేల్ భార్య -
భరిస్తే... చాలు బహుమతులు!
వినూత్నం పందాలు బోలెడు రకాలు...ఒంటరిగా, జంటగా, జట్టుగా పాల్గొనే రకరకాల పందాల పోటీలుంటాయి. కానీ, ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న పందెం మాత్రం అన్నింటికీ భిన్నమైంది. ఈ పందెంలో భార్యను మోస్తూ పరుగెత్తాలి. కుటుంబభారాన్ని మోసే భర్తకు భార్యను మోయడం పెద్ద విషయం కాకపోవచ్చు. గుంతలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ ఎవరు ముందుకు పరుగెడితే వారికి మొదటి బహుమతన్నమాట. బహుమతేమిటంటారా! భర్త బరువు బీరు, భార్య బరువు డబ్బుని ఇస్తారు. ఉత్తర అమెరికాలో సండే రివర్ దగ్గర ఏటా అక్టోబర్‌లో జరిగే ‘వైఫ్ క్యారీయింగ్ ఛాంపియన్షిప్’ చాలా పాపులర్ అయింది. గత పద్నాలుగేళ్లుగా అక్కడ ఈ పరుగు పందెం పోటీలు జరుగుతున్నాయి. ఫిన్లాండ్లో మొదలై... ఫిన్లాండ్కి చెందిన సొంకజార్వి అనే వ్యక్తి ఈ పందాన్ని కనిపెట్టారు. ఈ పరుగుపందాల్లో క్యాలిఫోర్నియా, హవాయ్, మారిలాండ్, పెన్సిల్వేనియా, న్యూయార్క్, ఇంగ్లండ్‌ల నుంచి వచ్చే జంటలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఏటా యాభై జంటల వరకూ పాల్గొనే ఈ పందాలను తిలకించడానికి జనం వేల సంఖ్యలో వస్తారు. భార్యను భుజాలపై మోస్తూ 278 అడుగులు ఎవరు ముందుగా పరుగెడతారో వారే విజేతలన్నమాట. నిరుటి పోటీల్లో టైస్టో మైటినెన్ అనే వ్యక్తి ఛాంిపియన్షిప్ గెలుచుకున్నాడు. భార్య క్రిస్టియానా హాపనెన్ని భుజాలపై ఎక్కించుకుని 278 అడుగుల దూరాన్ని 45 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. అడ్డంకులను దాటుతూ... అయితే ఈ పరుగు పందెం...నున్నటి రోడ్డుపై రన్నింగ్ కాదు సుమా! రాళ్లు, బురద గుంటలు, మధ్యలో అడ్డుగా చెట్ల కొమ్మలు, ఇసుక కుప్పలు....ఇలాంటి అడ్డంకుల్ని దాటుతూ భార్య కింద పడిపోకుండా పరుగెత్తాలి. చాలామంది హడావిడిగా పరుగులు తీయడంవల్ల మధ్యలోనే భార్యలు కిందపడిపోతుంటారు. భర్త వంతు పరుగెత్తడం అయితే, భార్య పని జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండడం. భర్త వీపుపై తల్లకిందులుగా వేలాడుతూ కాళ్లతో అతని మెడను చుట్టి కిందపడిపోకుండా పట్టుకోవాలి. ‘ఈ పరుగుపందాల్లో గెలవాలంటే మంచి ఫిట్నెస్ ఉండాలి. అలాగే భార్యపై ప్రేమ కూడా ఉండాలి(నవ్వుతూ...) గెలిచాక బోలెడంత బీరు, డబ్బు వస్తాయి కదా’’ అని అంటాడు టైస్టో మైటినెన్. ‘‘అవును మరి. భార్యని జాగ్రత్తగా మోస్తూ అదే సమయంలో వేగంగా పరుగెత్తి.. అందరికంటే ముందే గమ్యాన్ని చేరుకోవడం నిజంగా గొప్ప విషయమే కదా! ఇలాగే జీవితంలో కూడా భార్య బాధ్యతలు మోస్తూ గెలుపు కోసం పరుగెడితే ఏ భార్య అయినా ఇంతకంటే గొప్ప బహుమతులే ఇస్తుంది’’ అంటూ కొంచెం వ్యంగ్యం జోడించి చెప్పింది క్రిస్టియానా. ఇలాంటి భార్యాభర్తలతో ప్రతి ఏటా సండే రివర్ దగ్గర జరిగే పరుగుపందాలను మీరు కూడా వీక్షించాలనుకుంటే ఉత్తర అమెరికా వెళ్లాల్సిందే. -
జెట్స్పీడ్తో దూసుకుపోతున్న కుర్రకారు