‘ఫార్ములా’–4 చేదించాడు.. | Hyderabad Blackbird’s Aqil Alibhai Clinches F4 Championship with Dominant Show on the final day of Indian Racing Festival | Sakshi
Sakshi News home page

‘ఫార్ములా’–4 చేదించాడు..

Published Mon, Nov 18 2024 8:53 AM | Last Updated on Mon, Nov 18 2024 9:13 AM

Hyderabad Blackbird’s Aqil Alibhai Clinches F4 Championship with Dominant Show on the final day of Indian Racing Festival

ఎఫ్‌–4 ఛాంపియన్‌ అఖిల్‌ అలీ భాయ్‌ 

రేసింగ్‌లోనూ దూసుకుపోతున్న హైదరాబాద్‌

భవిష్యత్తులో సిటీలోనూ జరగాలి :  నాగచైతన్య  

సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ సత్తా చాటింది. టాలివుడ్‌ స్టార్‌ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ టీం రేసర్‌ అఖిల్‌ అలీ భాయ్‌ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్‌గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌ కరీ మోటార్‌ స్పీడ్‌వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్‌లో చాంపియన్‌గా నిలువగా, లీగ్‌ 2024లో గోవా ఏసెస్‌ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్‌ఎల్‌ రేసులో రౌల్‌ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు.  ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు.  

అభిమానులకు ధన్యవాదాలు.. 
హైదరాబాద్‌ రేసింగ్‌ లవర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్‌ లీగ్‌కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్‌ చేస్తాను. ఈ విజయం నా కెరియర్‌ను మలుపు తిప్పుతుంది.  
– అఖిల్‌ అలీ భాయ్‌

ఈ సీజన్‌ చాలా కఠినం.. 
ఈ సీజన్‌ రేసింగ్‌ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్‌కి ట్రోఫీ చేజింగ్‌ లా మారింది. నేను రేసర్‌గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్‌తో పనిలేదు.  
– లారా క్యామ్స్‌ టారస్, మోటార్స్‌ స్పోర్ట్స్‌ వుమెన్‌ డ్రైవర్‌  

రేసింగ్‌తో మంచి అనుబంధం.. 
నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్‌ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్‌ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ ఓనర్‌గా  మారినప్పటికీ మన టీం చాంపియన్‌ షిప్‌ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్‌లో రేసింగ్‌ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్‌ ఫెస్టివల్‌లో వుమెన్‌ డ్రైవర్స్‌ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్‌ రేసింగ్‌ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్‌ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్‌ రేసింగ్‌లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్‌గా మంచి క్యారెక్టర్‌ వస్తే కచి్చతంగా చేస్తాను.  
– అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ ఓనర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement