champion
-
సింధు నిరీక్షణ ముగిసె...
లక్నో: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు చాంపియన్‌గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్‌లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్లో ఈ ఏడాది సింధుకిదే తొలి టైటిల్‌కాగా... ఓవరాల్‌గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్ టోర్నిలో సింధు ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ‘ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండటమే. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్‌గా ఉంటే వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది. లక్ష్య సేన్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కే టైటిల్ లభించింది. 31 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–6, 21–7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై గెలిచాడు. లక్ష్య సేన్‌కు 15,570 డాలర్ల (రూ. 13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్‌కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నిలు ఆడగా... ఈ టోర్నిలోనే ఫైనల్‌కు చేరుకొని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ–సాయిప్రతీక్ (భారత్).. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీలు రన్నరప్‌గా నిలిచాయి. గాయత్రి–ట్రెసా జోడీ అదుర్స్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గాయత్రి–ట్రెసా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 21–11తో బావో లి జింగ్–లి కియాన్ (చైనా) జంటను ఓడించింది. ఈ ఏడాది ఓవరాల్‌గా గాయత్రి–ట్రెసా జోడీ 20 టోర్నిలు ఆడి ఎట్టకేలకు తొలి టైటిల్‌ను దక్కించుకుంది. గాయత్రి–ట్రెసా జంటకు 16,590 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సంవత్సరం నిలకడగా రాణించిన గాయత్రి–ట్రెసా ద్వయం ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. -
‘ఫార్ములా’–4 చేదించాడు..
సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సత్తా చాటింది. టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీం రేసర్ అఖిల్ అలీ భాయ్ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్‌గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కరీ మోటార్ స్పీడ్వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్‌లో చాంపియన్‌గా నిలువగా, లీగ్ 2024లో గోవా ఏసెస్ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్ఎల్ రేసులో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. అభిమానులకు ధన్యవాదాలు.. హైదరాబాద్ రేసింగ్ లవర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్ లీగ్‌కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విజయం నా కెరియర్ను మలుపు తిప్పుతుంది. – అఖిల్ అలీ భాయ్ఈ సీజన్ చాలా కఠినం.. ఈ సీజన్ రేసింగ్ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్‌కి ట్రోఫీ చేజింగ్ లా మారింది. నేను రేసర్‌గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్‌తో పనిలేదు. – లారా క్యామ్స్ టారస్, మోటార్స్ స్పోర్ట్స్ వుమెన్ డ్రైవర్ రేసింగ్‌తో మంచి అనుబంధం.. నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఓనర్‌గా మారినప్పటికీ మన టీం చాంపియన్ షిప్ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్‌లో రేసింగ్ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్ ఫెస్టివల్లో వుమెన్ డ్రైవర్స్ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్ రేసింగ్ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్ రేసింగ్‌లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్‌గా మంచి క్యారెక్టర్ వస్తే కచి్చతంగా చేస్తాను. – అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్ -
మాగ్నస్ కార్ల్సన్ ‘డబుల్’
ప్రపంచ నంబర్‌వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు. శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చేతిలో కంగుతిన్న కార్ల్సన్ ఆదివారం జరిగిన ‘రిటర్న్’ ఎనిమిదో రౌండ్లో అర్జున్నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్ రేసులో అతనొక్కడే నిలిచాడు. చివరకు ఆఖరి రౌండ్ (9వ)లోనూ కార్ల్సన్... భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. -
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్‌కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
‘ఫ్రెంచ్ కింగ్’ అల్కరాజ్
మట్టి కోర్టులపై కొత్త యువరాజు వచ్చాడు. ఇప్పటికే పచ్చిక కోర్టులపై, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రెండోసారీ నిరాశే ఎదురైంది. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఐదు సెట్ల సమరంలో పరాజయం చవిచూశాడు.పారిస్: అంచనాలకు అనుగుణంగా ఆద్యంతం పట్టుదల కోల్పోకుండా ఆడిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 21 ఏళ్ల అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 24 లక్షల యూరోలు (రూ. 21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన సమరం హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో అల్కరాజ్ పైచేయి సాధించగా... రెండో సెట్లో జ్వెరెవ్ పుంజుకున్నాడు. మూడో సెట్లో ఒకదశలో జ్వెరెవ్ 2–5తో వెనుకబడ్డాడు. అయితే జ్వెరెవ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని టైటిల్ దిశగా అడుగు వేశాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్ మళ్లీ చెలరేగాడు.జ్వెరెవ్‌కు కేవలం ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ అల్కరాజ్ తన జోరు కొనసాగించాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసి తన సర్విస్లను నిలబెట్టుకొని ఈ స్పెయిన్ స్టార్ విజయకేతనం ఎగురవేశాడు. » ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది.హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. » టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు. » కెరీర్లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు. » నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
సక్సెస్‌కి ఏజ్‌తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్..
చెస్ స్టార్ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్ ఛాంపియన్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్ సమాఖ్య రేటింగ్‌ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్ జర్నీ ఎలా సాగిందంటే..జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్ రెటింగ్ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్ రేటింగ్ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె చెస్ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్ బన్సాల్ పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్ చెస్ అసోసీయేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన నవీన్ బన్సాల్ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్ నేర్పించడానికి చాలా సంకోచించాడు. ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ డ్వాన్స్‌డ్ బ్యాచ్‌లో పదోన్నతి పొందింది. "తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్‌లో ఉంచి మరీ కోచింగ్ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్‌పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.జియానా చెస్ విజయాలు..జియానా గార్గ్ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే, రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్లలో పాల్గొంది. ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది.(చదవండి: 'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!) -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
ఓరి బాబోయ్ ఇది మాములు ర్యాగింగ్ కాదు...నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు..
-
‘మీ కోసం మళ్లీ ఆడతా’
అహ్మదాబాద్: మూడేళ్ల క్రితం ఐపీఎల్లో ఇదే ప్రశ్న...రెండేళ్ల క్రితం టైటిల్ గెలిచాక ఇదే ప్రశ్న...గత ఏడాది టీమ్ ఘోరంగా విఫలమైనప్పుడు మళ్లీ అదే ప్రశ్న...ఇప్పుడు ఐదో సారి చాంపియన్‌గా నిలిచాక పాత సందేహమే కొత్తగా..! మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడా, ఈ సారి అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపిన తర్వాత తప్పుకుంటున్నాడా అని అభిమానుల్లో ఉత్సుకత. చెన్నై సూపర్ కింగ్స్ 2023 చాంపియన్‌గా నిలిచిన తీరును చూస్తే ధోనికి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు ఉండదనిపిస్తోంది. కానీ అతని మాట చూస్తే మళ్లీ వచ్చి ఆడతాడనిపిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్మెంట్ను ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఒక్క మాటలో థ్యాంక్యూ అని చెప్పి నేను తప్పుకోవచ్చు. కానీ వచ్చే 9 నెలల పాటు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటం మాత్రం అంత సులువు కాదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తే మరో సీజన్ ఆడటం వారికి కానుక అందించినట్లవుతుంది. వాళ్ల అభిమానం, భావోద్వేగాలు చూస్తే వారి కోసం ఇదంతా చేయాలనిపిస్తోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. తాను కెరీర్ చివరి రోజుల్లో ఉన్నాననే విషయం వారికీ తెలుసని, అందుకే ఎక్కడకు వెళ్లినా తనకు ప్రేక్షకులనుంచి భారీ మద్దతు లభించిందని ధోని గుర్తు చేసుకున్నాడు. ‘ఇదే మైదానంలో సీజన్లో తొలి మ్యాచ్ ఆడాను. అంతా నా పేరును మైదానంలో మారుమోగించారు. చెన్నైలో మాత్రమే కాకుండా ఇలా అన్ని చోట్లా స్పందన చూస్తే నేను ఆడగలిగినంత ఆడాలనిపించింది’ అని మహి పేర్కొన్నాడు. కెపె్టన్‌గా తన ఐదు ఐపీఎల్ ట్రోఫీ విజయాల్లో ప్రతీది భిన్నమైందని, ఒకదాంతో మరోదానికి పోలిక లేదని, పరిస్థితులను బట్టి అన్ని మారతాయని ధోని అభిప్రాయ పడ్డాడు. ‘ప్రతీ ట్రోఫీ గెలుపు, ప్రతీ ద్వైపాక్షిక సిరీస్ విజయానికి వేర్వేరు సవాళ్లు ఉంటాయి. ఏదీ ఒకే తరహాలో మూసగా ఉండదు. అందుకే ఆందోళన చెందకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటా. ఇలాంటి టోరీ్నల్లో కీలక క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటామనేదే కీలకం. ఈ విషయంలో అందరూ భిన్నంగా ఉంటారు. రహానేలాంటి అనుభవజు్ఞలకు సమస్య రాదు కానీ కుర్రాళ్లను సరైన విధంగా నడిపించాల్సి ఉంటుంది’ అంటూ తన శైలిని వెల్లడించాడు. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
77 ఏళ్ల వయసులో 1.5 కి.మీ. స్విమ్మింగ్
కంటోన్మెంట్: ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 77ఏళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించారు. ట్రయథ్లాన్ చాంపియన్‌గా పేరొందిన ఆయన ఇటీవల మహరాష్ట్ర లోనావాలాలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 1.5 కిలో మీటర్ల దూరం ఈది సరికొత్త ఘనత సాధించారు. యువతకు స్ఫూర్తి కలిగించాలన్న లక్ష్యంతోనే తాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వెటరన్ స్పోర్ట్స్ జరిగినా హాజరవుతానని అన్నారు. ఇప్పటికీ నిరంతరం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని అన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరీరంపై పట్టు సాధిస్తే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసమూ కలుగుతుందన్నారు. (చదవండి: టు లెట్.. టేక్ కేర్) -
సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా కార్తీక్ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ తెలిపారు. తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. -
Ultimate Kho Kho 2022: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
పుణే: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ పైచేయి సాధించి అల్టిమేట్ ఖో–ఖో లీగ్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ 46–45తో ఒక్క పాయింట్ తేడాతో తెలుగు యోధాస్ జట్టును ఓడించింది. మ్యాచ్ ముగియడానికి 14 సెకన్లు ఉన్నాయనగా తెలుగు యోధాస్ 45–43తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ దశలో ఒడిశా ప్లేయర్ సూరజ్ అద్భుతమైన డైవ్ చేసి తెలుగు యోధాస్ ప్లేయర్ అవధూత్ పాటిల్‌ను అవుట్ చేసి మూడు పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో ఒడిశాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది. విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 5 లక్షలు).. ‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అభినందన్ పాటిల్ (గుజరాత్; రూ. 2 లక్షలు)... ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీపక్ మాధవ్ (తెలుగు యోధాస్; రూ. 2 లక్షలు)... ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు మదన్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు. -
అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్‌మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం. -
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్‌లో భారత్ తొలిసారి చాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్‌తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
Netherlands International Open Chess Tournament: చాంపియన్ హర్ష
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి తన కెరీర్లో మరో టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన హెచ్‌జెడ్ యూనివర్సిటీ అప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హర్ష మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. తొలి రౌండ్లో క్లీన్ జోరిక్ (నెదర్లాండ్స్)పై 35 ఎత్తుల్లో... రెండో రౌండ్లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్స్)పై 28 ఎత్తుల్లో... ఎస్పెర్ వాన్ బార్ (నెదర్లాండ్స్)పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 25 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో తేరుకున్న హర్ష కేవలం 14 ఎత్తుల్లో రెనీ డచెన్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. ఆరో రౌండ్లో హర్ష 61 ఎత్తుల్లో రొలాండ్ ఒలెన్బర్గర్ (జర్మనీ)పై, ఏడో రౌండ్లో 63 ఎత్తుల్లో విలియమ్ షక్వర్డియాన్ (నెదర్లాండ్స్)పై, ఎనిమిదో రౌండ్లో 53 ఎత్తుల్లో థామస్ బీర్డ్సెన్ (నెదర్లాండ్స్)పై, చివరిదైన తొమ్మిదో రౌండ్లో 33 ఎత్తుల్లో లలిత్ బాబు (భారత్)పై గెలుపొందాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు, అంతర్జాతీయ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర 6.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా లలిత్ బాబు తొమ్మిదో ర్యాంక్‌లో, బాలచంద్ర 11వ ర్యాంక్‌లో నిలిచారు. ఏడు పాయింట్లతో రుస్లాన్ పొనొమరియోవ్ (ఉక్రెయిన్), లియామ్ వ్రోలిక్ (నెదర్లాండ్స్), థామస్ బీర్డ్సెన్, వ్లాదిమిర్ బాక్లాన్ (ఉక్రెయిన్), టిమ్ గ్రుటెర్ (నెదర్లాండ్స్), వ్యాచెస్లావ్, ఖోయ్ ఫామ్ (నెదర్లాండ్స్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా పొనొమరియోవ్ రన్నరప్‌గా నిలువగా, లియామ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. -
ఏడోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
మహిళల క్రికెట్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి ఆద్యంతం దూకుడును కొనసాగించిన ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో విజయంతో ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించింది. క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియా జోరు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ నిలబడలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి ఏడోసారి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీతెర్ నైట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేన్స్ ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ముఖ్యంగా అలీసా హీలీ (138 బంతుల్లో 26 ఫోర్లతో 170) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. రాచెల్ హేన్స్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద... అలీసా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో రాచెల్ హేన్స్ (93 బంతుల్లో 68; 7 ఫోర్లు) అవుటవ్వడంతో 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాచెల్ అవుటయ్యాక వచ్చిన బెత్ మూనీ (47 బంతుల్లో 62; 8 ఫోర్లు) కూడా కదంతొక్కడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగెత్తింది. అలీసా, బెత్ మూనీ రెండో వికెట్‌కు 156 పరుగులు జత చేయడంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది. అలీసా ‘డబుల్ సెంచరీ’ ఖాయమనుకుంటున్న దశలో ష్రుబ్షోల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నటాలీ సివెర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత ఆటతో అజేయ సెంచరీ సాధించినా ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. టామీ బీమోంట్ (27; 5 ఫోర్లు), హీతెర్ నైట్ (26; 4 ఫోర్లు), సోఫీ డంక్లే (22; 1 ఫోర్) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో ఇంగ్లండ్ లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ (3/64), జెస్ జొనాసెన్ (3/57) రాణించారు. టోర్నీ మొత్తంలో 509 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచిన అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డులు లభించాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ ఇంగ్లండ్‌కు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► ఒకే ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో (సెమీఫైనల్, ఫైనల్) సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ అలీసా. గతంలో పురుషుల క్రికెట్లో పాంటింగ్ (ఆస్ట్రేలియా; 2003 ఫైనల్, 2011 క్వార్టర్ ఫైనల్), జయవర్ధనే (శ్రీలంక; 2007 సెమీఫైనల్, 2011 ఫైనల్) వేర్వేరు ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు. ► పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అలీసా హీలీ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో 2007 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (149) స్కోరును అలీసా అధిగమించింది. ► ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్ టోర్నీలు జరగ్గా... ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ► ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచకప్ టైటిల్స్. గతంలో ఆసీస్ 1978, 1982, 1988, 1997, 2005, 2013లలో కూడా విజేతగా నిలిచింది. -
పీవీఎల్ చాంప్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవా ర్డును దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో కోల్‌కతా ఆటగాళ్లు పాయింట్లు గెలిచి వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు. వినీత్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ గా... ఎస్వీ గురుప్రశాంత్ (హైదరాబాద్ బ్లాక్‌హాక్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా... అంగముత్తు (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘బెస్ట్ స్పైకర్ ఆఫ్ ద సీజన్’గా... జాన్ జోసెఫ్ (హైదరాబాద్ బ్లాక్ హాక్స్) ‘బెస్ట్ బ్లాకర్ ఆఫ్ ద సీజన్’గా... షాన్ జాన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
‘కింగ్’ అర్జున్
కోల్‌కతా: పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ అద్భుతం చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రోజు జరిగిన మూడు గేమ్‌లను అర్జున్ ‘డ్రా’గా ముగించాడు. ఆధిబన్ (భారత్)తో జరిగిన ఏడో గేమ్‌ను అర్జున్ 45 ఎత్తుల్లో... విదిత్ (భారత్)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 12 ఎత్తుల్లో... లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
4 సార్లు చాంపియన్.. సెకండ్ల వ్యవధిలో మిస్సయ్యాడు
ఒలంపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి ఒక్క అథ్లెట్ కల. అందుకోసం వాళ్లు ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం, ప్రతిష్టాత్మక టోర్నికి 19 సెకన్ల ఆలస్యం వల్ల అర్హత కోల్పోతే ఆ బాధ వర్ణించలేం. అది కూడా మొదటి సారి ఒలంపిక్స్‌లో అడుగుపెడుతున్న అథ్లెట్ కాదు ఏకంగా 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి ఇలా చేజార్చుకున్నాడంటే నమ్మలేం కదా ? కానీ ఇది నిజం. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మో ఫారా. శుక్రవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన 10వేల మీటర్ల ఒలంపిక్స్ అర్హత పోటీల్లో.. అతను కొద్దిలో గమ్యాన్ని చేరలేకపోయాడు. 27 నిమిషాల 28 సెకన్లలో టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉండగా, మో ఫారా 27నిమిషాల 47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. దీంతో అతను మరో సారి ఒలంపిక్స్‌లో ఐదో సారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. Not to be for @Mo_Farah tonight but this man is and always will be a champion 🥇🥇🥇🥇 pic.twitter.com/CK3BnTSB9t — Team GB (@TeamGB) June 25, 2021 చదవండి: టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకి అరుదైన గౌరవం.. -
Alexander Zverev: జ్వెరెవ్ అదరహో...
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి. -
షా విధ్వంసం.. తారే సూపర్ సెంచరీ.. ముంబై చాంపియన్
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి ఎగురేసుకుపోయింది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుత శతకం తోడవ్వడంతో పాటు శివం దూబే(42 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (39 బంతుల్లో 73 పరుగులు), ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), షమ్స్ ములాని (43 బంతుల్లో 36; 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో ముంబై 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ బౌలర్లు తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు. -
3500 మంది 7500 గంటలు...
సాక్షి, సిటీబ్యూరో: శరవేగంగా అన్ని లావాదేవీలూ డిజిటల్ మయంగా మారిపోతున్న పరిస్థితుల్లో... సంబంధిత అంశాలపై శిక్షణా అవగాహన తరగతులు కూడా ఊపందుకున్నాయి. ఔత్సాహికుల కోసం నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాల్లోనూ పోటీ పెరిగింది. అదే క్రమంలో అలాంటి వాటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడమూ ప్రాధాన్యత కలిగిన అంశమైంది. ఈ తరహా సేవలు అందిస్తున్న సంస్థల శిక్షణా సామర్ధ్యానికి గుర్తింపునిచ్చే పురస్కారాలూ షురూ అయ్యాయి. అదే క్రమంలో ఐటి, సొల్యూషన్స్, డిజిటల్ వినియోగంలో అవసరమైన సేవలు, అందించే వర్చ్యుసా కార్పొరేషన్... ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్ గుర్తింపును సాధించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ (ఎటిడి) నుంచి వర్చ్యుసా ఈ గుర్తింపును అందుకుంది. 3500 మంది 7500 గంటలు... లెర్నర్స్‌వీక్..విశేషాలివీ... గత డిసెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఈ లెర్నర్స్ వీక్ నిర్వహించారు. వరుసగా నాలుగో ఏడాది ఈ గుర్తింపును తమ సంస్థ దక్కించుకుందని తమ సంస్థ నిర్వహిస్తున్న లెర్నర్స్ వీక్ వంటి వార్షిక కార్యక్రమాలతో పాటు, ఈ ఏడాది అందించిన 240కిపైగా కోర్సులు వంటివి ఈ గుర్తింపునకు అర్హత సాధించిపెట్టాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఏడాది టెక్నికల్, ప్రాసెస్, డొమైన్, బిహేవియరల్, కమ్యూనికేషన్ డిసిప్లైన్స్... తదితర అంశాలను తాము అందించామన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,500కిపైగా అభ్యర్ధులు లాగిన్ అయ్యారని, 7,500 గంటలకు పైగా శిక్షణ కొనసాగిందని వివరించారు. సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, ఆడియోబుక్స్, వెబ్–సిరీస్, హ్యాండ్స్ ఆన్ అప్లికేషన్ సిమ్యులేషన్స్, డెవ్‌ఓప్స్, డేటా అనలిటిక్స్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయన్నారు. -
తక ధిమి థీమ్...
అనుభవం అద్భుతం చేసింది. నమ్మకం ముందుకు నడిపించింది. ఓటమి అంచుల నుంచి గట్టెక్కించింది. చివరకు విజేత హోదాలో ట్రోఫీని ముద్దాడేలా చేసింది. చరిత్ర పుటల్లోనూ స్థానం కల్పించింది. కెరీర్లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి మూడుసార్లూ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న ఆస్ట్రియా యోధుడు డొమినిక్ థీమ్ ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయ్యాడు. కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తన మిత్రుడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సుదీర్ఘంగా సాగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో థీమ్ పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లు ఓడిపోయి... మూడో సెట్లో ఆరంభంలోనే సర్వీస్ కోల్పోయి వెనుకబడిన థీమ్ ఆ తర్వాత అనూహ్య ఆటతీరుతో మ్యాచ్ గతిని మార్చేశాడు. చివరకు నిర్ణాయక సెట్లో ఒకదశలో 3–5తో ఓటమి అంచుల్లో నిలిచి ఆ వెంటనే కోలుకొని స్కోరును సమం చేసి చివరకు టైబ్రేక్‌లో విజయాన్ని అందుకున్నాడు. తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. న్యూయార్క్: ఒకదశలో నాలుగోసారి అందివచ్చిన ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం డొమినిక్ థీమ్ నుంచి చేజారిపోతుందా అనిపించింది. కానీ గత మూడు ‘గ్రాండ్’ ఫైనల్స్‌లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న థీమ్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా పైకి వచ్చాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి... ఐదో సెట్లో 3–5తో వెనుకబడి... పరాజయం ముంగిట నిలిచిన ఈ ఆస్ట్రియా ఆటగాడు తన స్వశక్తిపై, తన ఆటతీరుపై నమ్మకం కోల్పోకుండా ఆఖరి పాయింట్ వరకు పోరాడితే పోయేదేమీ లేదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. చివరకు చిరస్మరణీయ విజయంతో చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ డొమినిక్ థీమ్ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల థీమ్ 1949 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్ (అమెరికా) తన సహచరుడు టెడ్ ష్రోడెర్పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలైంది. శుభారంభం లభించినా... కెరీర్లో తొలి ‘గ్రాండ్’ ఫైనల్ ఆడుతున్న జ్వెరెవ్ తొలి గేమ్ నుంచే ఆకట్టుకున్నాడు. మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ తొలి సెట్ గెలిచేశాడు. రెండో సెట్లో మూడు, ఐదో గేముల్లో మళ్లీ థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన 23 ఏళ్ల జ్వెరెవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్ మూడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి జ్వెరెవ్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఆధిక్యాన్ని కాపాడుకొని ఉంటే చాంపియన్ అయ్యేవాడు. కానీ థీమ్ నెమ్మదిగా తేరుకున్నాడు. మూడో సెట్‌ను, నాలుగో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తాను సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెట్‌ను 6–3తో నెగ్గి విజేతగా నిలిచేవాడు. కానీ జ్వెరెవ్ తొమ్మిదో గేమ్‌ను థీమ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్కోరు 6–6తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో థీమ్‌దే పైచేయిగా నిలిచింది. ► 5 ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా థీమ్ నిలిచాడు. గతంలో గాస్టన్ గాడియో (గిలెర్మో కొరియాపై 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో); అగస్సీ (ఆండ్రీ మెద్వెదేవ్పై 1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో); ఇవాన్ లెండిల్ (మెకన్రోపై 1984 ఫ్రెంచ్ ఓపెన్‌లో); జాన్ బోర్గ్ (మాన్యుయెల్ ఒరాన్టెస్పై 1974 ఫ్రెంచ్ ఓపెన్‌లో) ఈ ఘనత సాధించారు. ► 1 1990 తర్వాత జన్మించి పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ థీమ్. ► 1 పురుషుల టెన్నిస్‌లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ల ఫైనల్ ఫలితాలు ఐదు సెట్లపాటు (2019 వింబుల్డన్; 2019 యూఎస్ ఓపెన్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) సాగిన మ్యాచ్‌ల ద్వారా వచ్చాయి. ► 2 థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ నిలిచాడు. ► 2 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఫైనల్లో టైబ్రేక్ ద్వారా ఫలితం రావడం ఇది రెండోసారి మాత్రమే. 2019 వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్‌పై జొకోవిచ్ టైబ్రేక్‌లో గెలిచాడు. వింబుల్డన్‌లో గతేడాదే చివరి సెట్లో స్కోరు 12–12 వద్ద సమం అయ్యాక ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. ► 6 ఆరేళ్ల వ్యవధి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించాడు. చివరిసారి 2014 యూఎస్ ఓపెన్‌లో మారిన్ సిలిచ్ రూపంలో కొత్త విజేత వచ్చాడు. 2015 నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ముందు వరకు జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో జొకోవిచ్, నాదల్, ఫెడరర్, ఆండీ ముర్రే, వావ్రింకాలలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తూ వచ్చారు. ► 1 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ తొలిసారి తొలి రెండు సెట్లు గెలిచి ఆ తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలి సారి. గతంలో అతను తొలి రెండు సెట్లు గెలిచాక 24 సార్లు మ్యాచ్‌ల్లో నెగ్గాడు. ఎలాగైతేనేం గట్టెక్కాను. ఫైనల్లో నా శరీరం ఒకదశలో అలసిపోయినా గెలుస్తానన్న నా నమ్మకమే చివరి వరకు నడిపించింది. తుది ఫలితంతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. 2014 నుంచి జ్వెరెవ్‌తో పరిచయం ఉంది. ఆ తర్వాత ఇద్దరం మంచి మిత్రులయ్యాం. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం. వాస్తవానికి ఫైనల్లో ఇద్దరు విజేతలు ఉండాల్సింది. మా ఇద్దరికీ టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా కెరీర్ కూడా ఫైనల్ మాదిరిగానే ఎత్తుపల్లాలతో సాగుతోంది. అయితే అంతిమ ఫలితం మాత్రం నాకు నచ్చింది. –డొమినిక్ థీమ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన థీమ్‌కు అభినందనలు. అతను మరిన్ని తప్పిదాలు చేసి ఉంటే నా చేతిలో విన్నర్స్ ట్రోఫీ ఉండేది. కానీ నేను రన్నరప్ ట్రోఫీతో ప్రసంగిస్తున్నాను. టోర్నీ ప్రారంభానికి ముందు నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారు నా వెంట రాలేకపోయారు. అయితే వారు కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషంగా ఉన్నాను. తొలి రెండు సెట్లు గెలిచాక కూడా ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నాకింకా 23 ఏళ్లే కాబట్టి భవిష్యత్‌లో తప్పకుండా నేను కూడా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఎత్తుకుంటానన్న నమ్మకం ఉంది. –అలెగ్జాండర్ జ్వెరెవ్ -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్ ప్రొ టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ప్రాంజల 6–3, 6–3తో డబుల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ డెసిరే క్రాజిక్ (అమెరికా)పై నెగ్గింది. 78 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల ఏడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. అంతకుముందు తన గ్రూప్‌లోని లీగ్ మ్యాచ్‌ల్లో ప్రాంజల 6–4, 6–3తో స్టెఫీ వెబ్ (ఆస్ట్రేలియా)పై, 6–2, 6–3తో అమీ స్టీవెన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఫైనల్ చేరింది. వెన్ను నొప్పితో ప్రాంజల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాంజల అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ పాల్ నెస్ మార్గనిర్దేశంలో చికిత్స తీసుకొని, కోలుకొని మళ్లీ బరిలోకి దిగింది. ‘ఒక టోర్నమెంట్ ఆడి మూడు రోజుల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా వ్యక్తిగత కోచ్ స్టీఫెన్ కూన్, గో స్పోర్ట్స్ ఫౌండేషన్, పాల్ నెస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ప్రాంజల వ్యాఖ్యానించింది. -
ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం
కటక్: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్ జిందాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్ 21–16, 21–19తో అభిషేక్ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–కృష్ణప్రసాద్ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్ జిందాల్–హార్దిక్ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
జూనియర్ ప్రపంచ గోల్ఫ్ చాంప్ అర్జున్
న్యూఢిల్లీ: ఎఫ్‌సీజీ కల్లావే జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అర్జున్ భాటి విజేతగా నిలిచాడు. అమెరికాలోని కాలిఫోర్నియా పామ్ డెజర్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో అర్జున్ 199 స్ట్రోక్స్‌తో ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా తైవాన్ ఆటగాడు జెరేమీ చెన్(202 స్ట్రోక్స్), న్యూజిలాండ్ ఆటగాడు జోషువా బై(207) నిలిచారు. ఈ టోర్నీలో 40 దేశాల నుంచి మొత్తం 637 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. కాగా, నోయిడాకు చెందిన అర్జున్ భాటి ఇప్పటివరకు 150 టోర్నమెంట్లలో పాల్గొని 110 టైటిళ్లు గెలిచాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనేది అర్జున్ లక్ష్యం. -
అజేయ భారత్
భువనేశ్వర్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 25వ నిమిషాల్లో), వరుణ్ కుమార్ (2వ, 49వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించగా... వివేక్ ప్రసాద్ (35వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిచర్డ్ పౌట్జ్ (53వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. తుది ఫలితంతో సంబంధం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4–2తో అమెరికాను ఓడించింది. అదే జోరు... లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్... సెమీఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను చిత్తుగా ఓడించింది. అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 3–0కి పెరిగింది. ఆ తర్వాత భారత్ అదే దూకుడు కొనసాగించగా... దక్షిణాఫ్రికా డీలా పడింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత్ 35 గోల్స్ సాధించి, కేవలం నాలుగు గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. -
చేతుల్లేని చిన్నారి.. చేతిరాతలో ఛాంపియన్!
మేరీల్యాండ్ : చేతులు సక్రమంగా ఉన్నా.. అందమైన చేతి రాతను సొంతం చేసుకోవడమనేది గగనమే. అలాంటిది ఆ చిన్నారికి పుట్టుక నుంచి చేతులు లేవు. కానీ, చేతి రాతలో మాత్రం ఆమెది అందేవేసిన ‘చేయి’. సారా హినెస్లే అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల అమెరికాలో జరిగిన జాతీయ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం చేతి రాతే కాదు.. ఈ చిన్నారి అందమైన పెయింటింగులు, చిత్రలేఖనాలు, శిల్పాలను కూడా తయారు చేయగలదు. ఇటీవల ఆమె ఇంగ్లీషులో కర్సీవ్ రైటింగ్ కూడా నేర్చుకుంది. సారా ఫ్రెడెరిక్‌లో సెయింట్ జాన్స్ రీజనల్ క్యాథలిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. చేతులు లేకపోవడం వల్ల రెండు చేతుల మణికట్టుతో పెన్సిల్ పట్టుకుని రాస్తోంది. సారా కుటుంబం 2015లో చైనా నుంచి అమెరికాకు వలస వచ్చారు. దీంతో ఆమెకు మొదట్లో ఇంగ్లీషు వచ్చేది కాదు. అయితే సారా పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా చేతి రాతలో కూడా ప్రావీణ్యం సాధించడం విశేషం. ఈ పోటీలో విజయం సాధించినందుకు సారాకు రూ.35 వేలు నగదు బహుమతి లభించనుంది. –సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
చాంప్ బెంగళూరు బుల్స్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో నయా చాంపియన్ అవతరించింది. గత ఐదు సీజన్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ఎట్టకేలకు బెంగళూరు బుల్స్ ఒడిలో వాలింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చివరి క్షణాల్లో ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో బెంగళూరు 38–33తో గుజరాత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరామ సమయానికి 16–9తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గుజరాత్ రెండో అర్ధభాగంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బెంగళూరు కెప్టెన్ రోహిత్ (1 పాయింట్) ఘోరంగా విఫలమైనా... పవన్ షెరావత్ 22 పాయింట్లతో దుమ్మురే పాడు. జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయ శిఖరాలకు చేర్చాడు. జట్టులో 3 పాయింట్లే రెండో అత్యధికం అంటే... పవన్ ఏ స్థాయిలో విజృంభించాడో అర్థమవుతోంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున సచిన్ కుమార్ 10, ప్రపంజన్, రోహిత్ గులియా చెరో 5 పాయింట్లు సాధించారు. విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. -
ఫిఫా ప్రపంచకప్ ఫ్రాన్స్ వశం
మాస్కో: పసికూనపై పెద్దన్నదే పైచేయి. ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను రెండో సారి ముద్దాడింది. 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో తొలి సారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్.. మరోసారి లోరిస్ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడుగా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించింది. క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలి గోల్ నమోదయింది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్(28వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ ఉపయోగించుకుంది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్ గ్రీజ్మన్ లెఫ్ట్ కార్నర్ నుంచి అద్బుతంగా గోల్ చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-1తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. రెండో భాగంలో గోల్ చేయడానికి ఇరు జట్లు కష్టపడినా మరో గోల్ నమోదు కాలేదు. పోగ్బా 59వ నిమిషంలో మరో గోల్ నమోదు చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడు గోల్స్ నమోదయ్యాయి. క్రొయేషియాను అయోమయంలోకి నెట్టుతూ ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె 65వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టువేసేందుకు క్రోయేషియా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మన్జుకిచ్ గోల్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. -
అఫ్గానిస్తాన్ అద్భుతం
హరారే: సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని అఫ్గానిస్తాన్ జట్టు నిరూపించింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ... తొలిసారి క్వాలిఫయింగ్ టోర్నీ చాంపియన్‌గా అవతరించింది. వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో అఫ్గాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట విండీస్ 46.5 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. గేల్ (10) మళ్లీ విఫలంకాగా... పావెల్ (44; ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (38; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ముజీబ్ 4, నైబ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన అఫ్గాన్ 40.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షహజాద్ (84; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), రెహ్మత్ షా (51; 4 ఫోర్లు) రాణించారు. రషీద్ ఖాన్ రికార్డు ఈ మ్యాచ్‌లో హోప్ వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో, అతి పిన్న వయసులో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్గాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల 186 రోజుల రషీద్ 44వ వన్డేలో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (52 వన్డేలు) పేరిట ఈ రికార్డు ఉంది. -
తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
ఫెడరర్ ఖాతాలో 97వ టైటిల్
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో అతను మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. సోమ వారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న ఫెడరర్ తాజా విజయంతో అతని ర్యాంక్ నాలుగు వారాలపాటు పదిలంగా ఉంటుంది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బ్యాడ్మింటన్ ఛాంపియన్ వీడియో కలకలం
కౌలాలంపూర్ : బ్యాడ్మింటన్ ఛాంపియన్ ‘లీ చోంగ్ వీ’ పేరిట సోషల్ మీడియాలో ఓ పోర్న్ క్లిప్ వైరల్ అవుతోంది. మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారటంతో ఎట్టకేలకు చోంగ్ వీ స్పందించాడు. అందులో ఉంది తాను కాదని.. దానిని వైరల్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరును చెడగొట్టేందుకే కొందరు ఈ పని చేసి ఉంటారని అతను చెబుతున్నాడు. మలేసియా ఎయిర్ న్యూస్ కథనం ప్రకారం... సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఉంది ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంక్ 2 ఆటగాడు అయిన లీ చోంగ్ వీ(35) అని కొందరు వైరల్ చేశారు .‘అదొక ఫేక్ వీడియో. అందులో ఉంది నేను కాదు. నా పరువును బజారుకీడ్చేందుకు కొందరు పని గట్టుకుని ఈ పని చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. దయచేసి ఈ వీడియోను వైరల్ చెయ్యకండి. కష్టాలను కొని తెచ్చుకోకండి’ అంటూ చోంగ్ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు ఉంచాడు. చోంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. కాగా, చోంగ్.. మలేసియన్ షట్లర్(మాజీ) వోంగ్ మ్యూ చూను వివాహం చేసుకోగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సార్లు ఒలంపిక్ సిల్వర్ పతక విజేత అయిన చోంగ్.. ఆ మధ్య డోపింగ్ ఆరోపణలతో కూడా వార్తల్లో నిలిచాడు. వచ్చే నెలలో అతగాడి బయోపిక్ ‘లీ చోంగ్ వీ : రైజ్ ఆఫ్ ది లెజెండ్’ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పోర్న్ వీడియో కలకలం రేగటం గమనార్హం. -
ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
ముంబై: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 5–11, 6–11, 11–7, 12–10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో సౌరవ్ 3–7తో, 5–8 తో, 8–10తో వెనుకబడి... ఆ తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 12–10తో ఐదో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
అఫ్ఘానిస్తాన్ అద్భుతం
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్లో అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలిసారి ఆసియా కప్ అండర్–19 టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్‌పై అఫ్ఘానిస్తాన్ ఏకంగా 185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట అఫ్ఘాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఇక్రామ్ ఫైజీ (107; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, రహ్మాన్ గుల్ 40 పరుగులు చేశాడు. మూసా 3, షాహిన్ 2 వికెట్లు తీశారు. తర్వాత పాక్ 22.1 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. తాహ (19) టాప్‌స్కోరర్ కాగా, అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 5, ఖైస్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. -
‘ఆసియా’ మనదే...
పదమూడేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత మహిళల జట్టు రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. కొన్నాళ్లుగా భారత పురుషుల జట్టు సాధిస్తున్న విజయాలకు దీటుగా మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆసియా కప్‌లో అజేయంగా నిలవడమేకాకుండా సగర్వంగా కప్‌ను హస్తగతం చేసుకుంది. రెండు వారాల క్రితం ఢాకాలో జరిగిన పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టు టైటిల్ సొంతం చేసుకోగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా విజేతగా నిలువడంతో హాకీ ఇండియా ‘డబుల్’ ధమాకా సృష్టించింది. కకమిగహర (జపాన్): కొత్త కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో భారత మహిళల జట్టు అద్భుత ఫలితం సాధించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాణి రాంపాల్ నాయకత్వంలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున 25వ నిమిషంలో నవ్‌జ్యోత్ కౌర్ గోల్ చేయగా... చైనా జట్టుకు తియాన్‌తియాన్ లియో గోల్ సాధించింది. స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో చైనా క్రీడాకారిణుల రెండు షాట్లను భారత గోల్‌కీపర్ సవిత అడ్డుకొని జట్టుకు విజయం ఖాయం చేసింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా చాంపియన్ కావడం విశేషం. టోర్నీ మొత్తంలో కేవలం ఐదు గోల్స్ మాత్రమే సమర్పించుకున్న సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డును గెల్చుకుంది. ఈ విజయంతో ఆసియా చాంపియన్ హోదాలో భారత్ వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. 2010 తర్వాత భారత్ ప్రపంచకప్‌కు అర్హత పొందింది. ఫైనల్ చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత్‌కు తుది పోరులో చైనా నుంచి గట్టిపోటీనే లభించింది. రెండో నిమిషంలోనే చైనాకు పెనాల్టీ కార్నర్ వచ్చింది. అయితే గోల్‌కీపర్ సవిత దానిని అడ్డుకోగా... తిరిగి వచ్చిన బంతిని దీప్ గ్రేస్ ఎక్కా బయటకు పంపించింది. ఆ తర్వాత నవ్‌నీత్ కౌర్, వందన కటారియా చక్కని సమన్వయంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోనికి చొచ్చుకు వెళ్లారు. కానీ చైనా రక్షణ పంక్తిని బోల్తా కొట్టించలేకపోయారు. తొలి క్వార్టర్ చివరి క్షణాల్లో చైనాకు రెండో పెనాల్టీ కార్నర్ వచ్చింది. దీనిని కూడా భారత గోల్‌కీపర్ సవిత నిర్వీర్యం చేసింది. దాంతో తొలి క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్లో భారత్ తమ దాడుల్లో పదును పెంచింది. 17వ నిమిషంలో నవ్‌జ్యోత్ డైవ్ చేస్తూ కొట్టిన షాట్... కెప్టెన్ రాణి రాంపాల్ షాట్లు లక్ష్యానికి దూరంగా వెళ్లాయి. ఎనిమిది నిమిషాల తర్వాత రాణి రాంపాల్ అందించిన పాస్‌ను నవ్‌జ్యోత్ గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లోనూ భారత్ ఆధిక్యంలో ఉండగా... చివరి క్వార్టర్లోని 47వ నిమిషంలో చైనా గోల్ సాధించి స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేసేందుకు విశ్వప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయాయి. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 1–0తో జపాన్‌పై విజయం సాధించింది. ప్రశంసల వెల్లువ... ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు మహిళల జట్టును అభినందించారు. ‘ఆసియా కప్ నెగ్గిన భారత మహిళల జట్టుకు అభినందనలు. ఇదే ప్రదర్శనను వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్లో పేర్కొన్నారు. పెనాల్టీ షూటౌట్ సాగిందిలా.. చైనా స్కోరు భారత్ 4 లియాంగ్ మియు 11 4 రాణి రాంపాల్ 4 జు వెన్యు 22 4 మోనిక 4 వాంగ్ నా 33 4 నవ్‌జ్యోత్ కౌర్ 4 చెన్ యి 44 4 లిలిమా మింజ్ 7కియుజియా క్యూ 44 7నవ్‌నీత్ కౌర్ 7లియాంగ్ మియు 45 4 రాణి రాంపాల్ భారత్ జైత్రయాత్ర సాగిందిలా.. తొలి లీగ్ మ్యాచ్ : సింగపూర్‌పై 10–0తో గెలుపు రెండో లీగ్ మ్యాచ్ : చైనాపై 4–1తో విజయం మూడో లీగ్ మ్యాచ్ : మలేసియాపై 2–0తో గెలుపు క్వార్టర్ ఫైనల్ : కజకిస్తాన్‌పై 7–1తో ఘనవిజయం సెమీఫైనల్ : జపాన్‌పై 4–2తో గెలుపు ఫైనల్ : చైనాపై 5–4తో విజయం ఆసియా కప్ విజేతగా నిలువడం భారత్‌కిది రెండోసారి. తొలిసారి 2004లో టీమిండియా ఈ టైటిల్‌ను సాధించింది. మరో రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), రెండుసార్లు మూడో స్థానంలో (1994, 2013), మరో రెండుసార్లు నాలుగో స్థానంలో (1989, 2007)నిలిచింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా ప్రదర్శన ద్వారా, ఆసియా చాంపియన్ హోదాలో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందినందుకు గర్వంగా ఉంది. మా జట్టులో చాలా మంది యువ క్రీడాకారిణులున్నారు. వారందరూ చివరి క్షణం వరకు అద్భుతంగా పోరాడారు. చైనాతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. ఏ దశలోనూ మేము నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఆడాం. సడెన్‌డెత్‌లో చైనా క్రీడాకారిణి షాట్‌ను గోల్‌కీపర్ సవిత అడ్డుకోవడం... తర్వాతి షాట్‌ను నేను గోల్‌గా మలచడంతో చాలా ఆనందంగా ఉంది. మాకు అత్యుత్తమ సౌకర్యాలు అందిస్తున్న హాకీ ఇండియాకు, భారత స్పోర్ట్స్ అథారిటీకి జట్టు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఇదే జోరును కొనసాగించి పతకాలు గెలవాలని పట్టుదలతో ఉన్నాం. – రాణి రాంపాల్, భారత కెప్టెన్ -
శభాష్..తేజేశ్వరరెడ్డి
– 35వ సీనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్‌షిప్ ఆఫ్ ఇండియాలో బంగారు పతకం కైవసం – ఆటల్లో మరోసారి జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన వైనం కర్నూలు(కొండారెడ్డిఫోర్ట్) : జిల్లా పోలీసు క్రీడాకారిగా గుర్తింపు పొందిన తేజేశ్వర్‌రెడ్డి ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. ఇప్పటికే ఏషియన్ చాంపియన్‌షిప్‌తో పాటు పలు పోటీల్లో పాల్గొని జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టతను పెంచారు. ఈ నేపథ్యంలో 35వ సీనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణతో బుధవారం అభినందనలు అందుకున్నారు. తేజేశ్వర్‌రెడ్డి సాధించిన పతకాలు: జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 35వ సీనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్‌షిప్ ఆఫ్ ఇండియాలో తేజేశ్వరరెడ్డి బంగారు పతకం సాధించాడు. 22 రాష్ట్రాల నుంచి పోలీసు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు పాల్గొనగా మెన్స్ సింగిల్స్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో తేజేశ్వర్‌రెడ్డి బంగారు పతకాన్ని సాధించారు. గతంలోనూ థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించారు. 34వ సీనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో ఒక కాంస్యపతకాన్ని సాధించారు. కుటుంబ నేపథ్యం.. ఓర్వకల్లు గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, కృష్ణవేణమ్మల రైతు దంపతుల కుమారుడైన తేజేశ్వర్‌రెడ్డి 2013లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. విద్యాభ్యాసం పదోతరగతి వరకు ఓర్వకల్లులో, ఇంటర్, డిగ్రీ సెయింట్ జోషఫ్ కళాశాలలో పూర్తి చేశారు. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకమే లక్ష్యం: 2018లో జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను. నా విజయాలకు కోచ్, తల్లిదండ్రులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సహకారం మరువలేనిది -
బాస్కెట్‌బాల్ చాంపియన్ ఎస్వీకేపీ
భానుగుడి (కాకినాడ): ఆదికవి నన్నయ వర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ జట్టు చాంపియన్‌గా పెనుగొండకు చెందిన ఎస్వీకేపీ కళాశాల నిలిచింది. పలు కళాశాల జట్లతో పోటీపడి నాకౌట్లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచి విజేతగా నిలిచింది. అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలలో పాల్గొనే నన్నయవర్సిటీ జట్టు ఎంపికకు గాను ఈ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన అంతర కళాశాలల బాస్కెట్ బాల్ కన్వీనర్ బీఈవీఎల్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీ తరఫున ఎంపికయిన మహిళా బాస్కెట్ బాల్జట్టు సౌత్‌జోన్ చాంపియన్ లుగా నిలవాలని కాంక్షించారు. కేరళలోని కాలికట్ వర్సిటీలో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో ప్రస్తుతం ఎంపికయిన బృందం ఆడుతుందని నన్నయ వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ .శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ .సుగుణారెడ్డి, రంగరాయ మెడికల్ కళాశాల పీడీ స్పర్జన్ రాజు పాల్గొన్నారు. విజేతలు వీరే : నన్నయ వర్సిటీ పరిధిలోని అంతర కళాశాలల మహిళా బాస్కెట్‌బాల్ చాంపియ¯ŒSషిప్ పోటీలలో పెనుగొండ ఎస్‌కేవీపీ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, ఏలూరుకు చెందిన సెయింట్ థెరిసా కళాశాల ద్వితీయ స్థానం, తణుకుకు చెందిన ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల తృతీయస్థానం సాధించాయి. కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల జట్టు నాలుగోస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ జట్టు సభ్యులు వీరే 2016–17 విద్యాసంవత్సరంలో నన్నయ వర్సిటీ తరఫున సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నీకి 12మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో బి.పూర్ణసాయిజ్యోతి, ఎస్కే హాఫిజున్నీషా, ఎస్కే అనిషా, సీహెచ్.కారుణ్య, కే.నాగశిరీష, సీహెచ్.శ్రావణి, ఎం.సాయికుమారి, కే శ్యామల, ఎన్ .సాయిభవానీ, జి.లలిత, జి.బేబీ సరోజినీ, ఎస్కే.షహనాజ్‌లు ఎంపికయ్యారు. ఎన్ .తేజసాయి సత్య, టి.పావని, సీహెచ్ వల్లివైష్ణవి, పి.రాణి, డి.వాణి, సత్యలక్ష్మి, కేవీఆర్రాజ్యలక్ష్మి స్టాండ్‌బైగా ఎంపికయ్యారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి -
ఫెన్సింగ్‌లో కర్నూలుకు ఓవరాల్ చాంపియన్‌షిప్
నంద్యాల: నెల్లూరులో నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కర్నూలు జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుందని ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ తెలిపారు. స్థానిక పద్మావతినగర్ స్టేడియంలో మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో అనిల్‌కుమార్, (ఈపీ) లేకజ్ (ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ (సాబ్రా) బాలిక విభాగంలో సౌమ్య(ఈపీ), వైష్ణవి(ఫయిల్), ప్రసన్న(సాబ్రా) వ్యక్తిగత బంగారు పతకాలు సాధించారన్నారు. బృందాలుగా జరిగిన విభాగంలో సౌమ్య, సుచరిత, లలిత, బేబిప్రియ(ఈపీ), వైష్ణవి, సమన్విత, ప్రసన్న (ఫయిల్), లావణ్యరాయల్, శ్వేత, లక్ష్మి, మేరి(సాబ్రా)లకు, బాలుర విభాగంలో అనిల్‌కుమార్, నాగయ్య, వంశీకృష్ణ, సాయిశైలేంద్ర (ఈపీ), లేఖచ్, సమీర్, విజయ్‌కుమార్, సన్ని, సునీల్(ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ, బషీర్‌బాబు, హుసేన్‌వలి(సాబ్రా) విభాగాల్లో పసిడి పతకాలను సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపతిరావు, కోచ్‌లు లక్ష్మణ్, రవీంద్రనాథ్, పూర్ణచంద్రప్రసాద్, రాఘవకార్తీక్ పాల్గొన్నారు. -
రెజ్లింగ్ చాంపియన్స్.. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం
నాయుడుపేటటౌన్: రాష్ట్ర స్థాయి 3వ సీనియర్ పురుషులు, మహిళల రెజ్లింగ్ చాంపియన్ షిప్ ట్రోఫీ శ్రీకాకులం, నెల్లూరు జట్లు కైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో విశాఖపట్నం జట్టు నిలిచింది. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు ఆశక్తికరంగా జరిగాయి. నెల్లూరు రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన ఫైనల్స్‌లో ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, నాయకులు కట్టా వెంకటరమణారెడ్డిలు పాల్గొని విజేతలకు పథకాలను బహుకరించారు.రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్ర స్థాయిలో 3వ రెజ్లింగ్ పోటీలను నాయుడుపేటలో నిర్వహించినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కేఎంవీ కళాచంద్, రాష్ట్ర రెజ్లింగ్ అబజర్వర్ కే నర్సింగ్ రావు, సంయుక్త కార్యదర్శి భూషణం, ఉపాధ్యక్షుడు రామయ్య, జిల్లా అధ్యక్షుడు కే వెంకటకృష్ణయ్య, కార్యదర్శి మంగళపూరి శివయ్య, ట్రెజరర్ ఎం ఉదయ్ కుమార్, 13 జిల్లాలకు చెందిన కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిధులతో పాటు సీనియర్ క్రీడాకారులకు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి ఉన్న క్రీడాకారులకు ఈ సందర్భంగా జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ నాయకులు శాలువలు కప్పి పూలమాలలతో సత్కరించారు. -
సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి
– వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ మహబూబ్‌నగర్ క్రీడలు : రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అ««దl్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాలలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 వాలీబాల్ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను శాంతికుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఓడిపోతే నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. జిల్లాలో ప్రతిభ కనబరుస్తున్న వాలీబాల్ క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాంచందర్, పీడీ పాపిరెడ్డి, రిటైర్డ్ పీడీ చెన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు. అండర్–19 బాలుర జట్టు : వెంకటేశ్, రాజేశ్, రమేశ్, ఆకాశ్ (మహబూబ్‌నగర్), రాజేందర్, గులాంమహ్మద్ (నారాయణపేట), రియాజ్ (మద్దూర్), శ్రీకాంత్, శ్రీశైలం (కడ్తాల్), కృష్ణయ్య (కోస్గి), రఘు (ఆత్మకూర్), పవన్‌కుమార్ (ఖిల్లాఘనపురం). బాలికలు : నీలమ్మ, దీప, రజిత (కల్వకుర్తి), అమృత, అనిత (కోయిలకొండ), మహేశ్వరి, నందిని, పద్మ, శాంతి (మహబూబ్‌నగర్). -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్ రౌండ్ ఛాంపియన్ అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్‌రౌండ్ ఛాంపియన్ గా అనంత జట్టు నిలిచిందని రాష్ట్ర కార్యదర్శి మురళీ తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో సోమవారం క్రీడా పోటీలు ముగిశాయి. ఇందులో జిల్లా జట్టు జయకేతనం ఎగరేసింది. -
ఖోఖో విజేత పాలమూరు
మహబూబ్‌నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఖోఖో టోర్నీ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 4–2 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది. జిల్లా జట్టు విజేతగా నిలవడంపై ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్, సత్యనారాయణ, విజేందర్, యాదయ్య, మొగులాల్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయికి క్రీడాకారులు ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నందిని (వెల్జాల), కృష్ణమ్మ (సూరారం), కృష్ణవేణి (కల్వకుర్తి), సికిందర్ (కల్వకుర్తి) టోర్నీలో రాణించి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిని పలువురు అభినందించారు. -
స్వచ్చభారత్ చాంపియన్‌లో కలెక్టర్
ముకరంపుర : స్వచ్చభారత్‌లో భాగంగా మరుగుదోడ్ల నిర్మాణంలో విశేషకృషి చేసిన కలెక్టర్లకు గురువారం ఢిల్లీలో జరిగిన స్వచ్చభారత్ చాంపియన్‌కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 20 మంది కలెక్టర్లకు ఆహ్వానం అందగా అందులో తెలంగాణ నుంచి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఉన్నారు. మరుగుదోడ్ల నిర్మాణం ప్రగతి సాధనలో కలెక్టర్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్ 31లోగా స్వచ్చ కరీంనగర్ డిక్లేర్ చేసేందుకు కలెక్టర్ కృషి చేసేందుకు ముందుకు పోతున్నారు. -
బీచ్ వాలీబాల్ చాంపియన్ ‘అనంత’
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీచ్ వాలీబాల్‌లో రాష్ట్ర చాంపియన్ షిప్‌ను అనంతపురం జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. మొట్ట మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు అత్యంత ప్రతిభను కనబరచి చాంపియన్‌గా నిలిచిందన్నారు. ఈ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకూ జరిగాయని, ఇందులో 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర చాంపియన్‌గా ‘అనంత’ నిలవడంపై వైస్ ప్రెసిడెంట్ సాయిప్రసాద్, విష్ణువర్ధన్, చంద్ర, శీనా, సుబ్రమణ్యం, దేవమ్మ, బలరాంలు హర్షం వ్యక్తం చేశారు. -
క్రికెట్ టోర్నీ చాంపియన్ ఆర్ఎంసీ
కాకినాడ సిటీ : రంగరాయ మెడికల్ కళాశాల క్రికెట్ జట్టు ఆలిండియా మెడికల్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచింది. ఈనెల 17 నుంచి 25 వరకు తమిళనాడు లోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో జరిగిన టోర్నీ ఫైనల్లో ఆర్ఎంసీ జట్టు పుదుచ్చేరి జట్టుపై విజయం సాధించింది. ట్రోఫీతో కళాశాలకు చేరుకున్న జట్టు సభ్యులను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంసీ జట్టు పీడీ స్పర్జన్‌రాజు అభినందించారు. ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ప్రాధాన్యతనిస్తూనే క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఆలిండియా స్థాయిలో 2010లో విజేతగా, 2012లో ద్వితీయస్థానంలో నిలిచిందని, ఇప్పుడు మళ్లీ విజ యం సాధించడం అభినందనీయమని అన్నారు. -
'ఆమె' ప్రపంచాన్ని జయించింది!
ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని జయించింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ టెలివిజన్ సర్వీస్ తీస్తున్న డాక్యుమెంటరీకి కథగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న లింగ వివక్షపై సానుకూల మార్పులను ప్రోత్సహించే నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రానికి కథాంశమైంది. కోల్ కత్తా మురికివాడలనుంచి పుట్టిన ముత్యంలా.. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా పేరు తెచ్చుకోవడమే కాక... డాక్యుమెంటరీకి ఎంపికైన ఏకైక భారతీయురాలుగా అయేషా నూర్ గుర్తింపు పొందింది. మూర్ఛరోగం, పేదరికంతో పోరాడుతూనే తన లక్ష్యాన్ని సాధించింది కోల్ కత్తా మురికి వాడకు చెందిన 19ఏళ్ళ యువతి అయేషా నూర్. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మరణించినా.. ఆమె వెనుకంజ వేయలేదు. తన కరాటే కోచ్ ప్రోత్సాహంతో ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్ బెల్ట్ ను సాధించింది. ఐదు దేశాలకు చెందిన ఐదుగురు యువతుల వ్యక్తిగత గాధలను ఐటీవీ సర్వీసెస్ తెరకెక్కించింది. ఐదుగురి కథాంశం ఒకేలా ఉన్నా... ఒక్కో యువతీ ఇతర యువతులకు ఒక్కో రకంగా సహాయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు నెదర్లాండ్ కు చెందిన చిత్ర నిర్మాత కోయెన్ సూయిడ్ గీస్ట్. కోల్ కత్తాలోని మురికివాడకు చెందిన మాఫిడల్ ఇస్లాం లైన్ లోని రెండు బిర్యానీ దుకాణాల మధ్య ఉన్న ఒకే ఒక్క గదిలో అయేషా కుటుంబం నివసిస్తోంది. థాయ్ పిఛాయ్ ఇంటర్నేషనల్ యూత్ కరాటే ఛాంపియన్ షిప్ కు సారధ్యాన్ని వహించిన అయేషా... పన్నెండు మంది సభ్యులున్న భారత జట్టులో ఒకే ఒక్క యువతి. 2012 లో రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలను కూడ సాధించింది. రాజ్ బజార్ సైన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రతి ఆదివారం సాయంత్రం బాలికలు, యువతులు ఆత్మ రక్షణకోసం అయేషా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో తర్ఫీదునిస్తోంది. ''తండ్రి మరణంతో కుటుంబాన్ని ఈడ్చేందుకు, కడుపు నింపుకునేందుకు నా తల్లి కుట్టుపని చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కరువే. నా కోచ్ ఎం. ఎ. అలీ. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా నాకేదీ సాధ్యమయ్యేది కాదు'' అంటుంది అయేషా. 1988 లో ఓ ప్రముఖ కరాటే టోర్నమెంట్ లో స్వర్ణం సాధించారు అలీ... కుటుంబాన్ని నెట్టేందుకు తాత్కాలిక షూ వ్యాపారం చేసే అయేషా సోదరుడు తన్వీర్.. ఆమె పట్టుబట్టడంతో.. అలీవద్ద శిక్షణకు చేర్పించాడు. ఆమె పట్టుదలే.. అనుకున్నది సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచానికే లింగ వివక్షపై అవగాహన కల్పించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ..లక్ష్య సాధనే ధ్యేయంగా గుర్తింపు పొందిన అయేషా నూర్ కథ... ఇప్పుడు ఓ అసాధారణ గాధగా తెరకెక్కింది. జోర్ధాన్, కెన్యా, పెరు, బంగ్లాదేశ్ లకు చెందిన మరో నలుగురు మహిళల కథలతోపాటు అయేషా నూర్ జీవిత కథ చిత్రంగా రూపొందింది. లాభాపేక్ష లేని సంస్థగా ఐ టీ వీ సర్వీస్... పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రాజెక్లులకు నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. యూఎస్ కాంగ్రెస్ ఆదేశంతో 1988 లో ఈ సంస్థ స్థాపించారు. అయితే డాక్యుమెంటరీ విషయం కోల్ కత్తా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో, మైనారిటీ వ్యవహారాల శాఖ అయేషా నూర్ కు సాహాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే అయేషా దాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించింది. -
ఆసియా యూత్ చెస్ చాంప్ కృష్ణతేజ
సువన్ (దక్షిణ కొరియా): ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎన్. కృష్ణతేజ (అండర్-18 ఓపెన్) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జి.లాస్య (అండర్-18 బాలి కలు) రజతం... జి.హర్షిత (అండర్-16 బాలికలు) కాంస్యం సాధించారు. కృష్ణతేజ (తాడేపల్లిగూడెం) అజేయంగా నిలిచి 5.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. లాస్య (విజయవాడ) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, హర్షిత (రాజ మండ్రి) ఆరు పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. తాజా ప్రదర్శనతో కృష్ణతేజకు ఇంటర్నే షనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఖాయమైంది. -
చాంపియన్ భారత్
ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండోనేసియాలో ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించి 33 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పురుషుల విభాగంలో రాకేశ్ కుమార్ (69 కేజీలు), హర్పాల్ సింగ్ (75 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... మనీశ్ కుమార్ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు. ఆదివారం మహిళల విభాగంలో సర్జూబాల (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు) కూడా పసిడి పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. ‘ప్రెసిడెంట్స్ కప్‌లో తొలిసారి భారత్ చాంపియన్‌గా నిలి చింది. ఈ ప్రదర్శన భారత బాక్సింగ్ పురోగతికి నిదర్శనం’ అని చీఫ్ కోచ్ జీఎస్ సంధూ తెలిపారు. ఈ టోర్నీలో 30 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొన్నారు. -
అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ
ట్వీటర్లో స్వయంగా వెల్లడి వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పదవికి తాను మరోసారి పోటీపడబోతున్నానని అమెరికా మాజీ మంత్రి, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్లో పేర్కొనడంతో పాటు తన మద్దతుదారులకు ఈ మెయిల్ సందేశమిచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. ‘అధ్యక్ష పదవికి పోటీపడబోతున్నాను. ఒక చాంపియన్ కావాలని ప్రతిరోజూ అమెరికన్లు కోరుకుంటున్నారు. నేను ఆ చాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని ట్వీటర్లో తెలిపారు. 2008లో డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి బరాక్ ఒబామాతో పోటీ పడి నెగ్గలేకపోయిన ఆమె రంగంలోకి దూకడం ఇది రెండోసారి. 2001-2009 వరకు ఆమె సెనేట్‌కు న్యూయార్క్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాగా, హిల్లరీ శక్తిమంతమైన ప్రెసిడెంట్ కాగలరని రెండు రోజుల క్రితం అధ్యక్షుడు ఒబామా కూడా ప్రశంసించారు. మంత్రిగా ఆమె ఆద్భుతమైన సేవలందించారని కితాబిచ్చారు. 2009-13 మధ్య మంత్రిగా పనిచేసిన ఆమె.. పలు సందర్భాల్లో భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారు. -
ఓవరాల్ చాంపియన్ 8 ఇన్‌క్లైన్ జట్టు
ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కరీంనగర్ జిల్లా 8 ఇన్‌క్లైన్ సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో జరుగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. 8 ఇన్‌క్లైన్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. -
టాప్ ర్యాంకూ పోయింది
రెండో స్థానానికి భారత్ కోహ్లీ, అశ్విన్‌ల ర్యాంకులు పైకి ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ దుబాయ్: టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో భారత జట్టు టైటిల్‌తోపాటు టాప్‌ర్యాంకునూ చేజార్చుకుంది. భారత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక మూడు రేటింగ్ పాయింట్ల తేడాతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీలంక 133 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో ఉండగా, భారత్ 130 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు కోహ్లి, అశ్విన్‌లు తమ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ప్రపంచకప్‌లో 106.33 సగటుతో 319 పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కోహ్లి.. బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో ర్యాంకుకు ఎగబాకాడు. కోహ్లి తరువాత భారత్ తరపున టాప్-10లో నిలిచింది రైనా (10వ) ఒక్కడే. కాగా, టోర్నీలో 11 వికెట్లతో విశేషంగా రాణించిన ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ బౌలర్ల జాబితాలో మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వరుసగా ఆరోన్ ఫించ్ (ఆసే్ర్టలియా), శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. మిథాలీ ఐదోర్యాంకు పదిలం మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఐదోర్యాంకును నిలబెట్టుకుంది. మిథాలీపాటు పూనమ్ రౌత్ (8వ), హర్మన్‌ప్రీత్ కౌర్ (9వ)లు టాప్-10లో నిలిచారు. బౌలర్ల జాబితాలో జులన్ గోస్వామి రెండు స్థానాలు దిగజారి 19వ ర్యాంకులో నిలిచింది. -
డ్రగ్స్ + మందు + మగువ = మైక్ టైసన్
20 ఏళ్ల కుర్రాడతడు.. మహా అయితే అప్పుడే కెరీర్లో ఎదిగే వయస్సది.. కానీ అంత చిన్న వయస్సులోనే అతడు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను అందుకుని పెను సంచలనమే సృష్టించాడు.. ఇంకేముంది..లెక్కలేనంత డబ్బు ఒళ్లో వచ్చి వాలింది.. దీంతో జీవితం కట్టు తప్పింది.. చెప్పే వారు లేక.. వినే ఓపిక లేక.. విచ్చలవిడి వ్యవహార శైలితో అధోగతి పాలయ్యాడు. ఎంతలా అంటే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపి డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టిన చేతులతోనే జైలు ఊచలు లెక్కపెట్టాడు.. ఇంతకీ ఈ దురదృష్టవంతుడెవరో కాదు.. ది గ్రేట్ మహ్మద్ అలీ తర్వాత అంతటి మొనగాడు తనే అని ప్రపంచమంతా చెప్పుకున్న మైక్ టైసన్. - రంగోల నరేందర్ గౌడ్ చిన్ననాటి జీవితం బాధాకరం.. టైసన్ జీవితాన్ని గమనిస్తే మనకు ఓ సినిమా కథకు కావాల్సినంత సరంజామా దొరుకుతుంది. మైదానంలోనూ, బయట ఇంత హింసాత్మకంగా ప్రవర్తించడానికి కారణం అతడి బాధాకరమైన బాల్యమే. అందరూ ఉన్నా అనాథలాగే పెరిగాడు. తల్లి మద్యానికి బానిస.. దీనికి తోడు స్వేచ్ఛా జీవితం. వ్యభిచార గృహాన్ని నిర్వహించే తండ్రయితే టైసన్‌తో పాటు అతడి తోబుట్టువులకు ఎప్పుడో కానీ కనిపించే వాడు కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన టైసన్ సహజంగానే ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. దాదాపు రౌడీలా పెరిగాడు. పదేళ్లు రాకముందే స్కూల్‌కు డుమ్మా కొట్టి దొంగతనాలు చే యడం అలవాటు చేసుకున్నాడు. ఈ కారణంగా పలుమార్లు పోలీసులకూ పట్టుబడ్డాడు. చాలాసార్లు వారు ఇతడిని నిర్బంధ శిక్షణ కేంద్రాలకు పంపించారు. మహ్మద్ అలీ రాకతో.. ఓసారి టైసన్ ఉంటున్న సెంటర్‌ను బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ సందర్శించారు. ఆయన గురించి తెలుసుకున్న టైసన్.. తానూ బాక్సర్‌ను కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమైతే జరిగింది కానీ బాక్సింగ్ గురించి టైసన్‌కు తెలిసింది శూన్యం. అప్పుడు తనతోపాటు అక్కడే ఉంటున్న ఓ బాక్సర్ మార్గదర్శకంగా నిలిచాడు. బయటికి వెళ్లాక వెటరన్ కోచ్ కస్ డి అమటోను కలవమని సలహా ఇచ్చాడు. టైసన్ పంచ్ పవర్‌ను గమనించిన కోచ్ మరో మాట లేకుండా తనతో చేర్చుకున్నాడు. చాంపియన్ అవతారం.. కోచ్ జిమ్‌లోనే తన శరీరాన్ని ఓ బాక్సర్‌గా మలుచుకున్నాడు. ఓసారి తన ఆటతీరును రింగ్‌లో ప్రదర్శించి బయటకు వస్తున్నప్పుడు కోచ్ అమటో పక్కనున్నతడితో ఓ మాటన్నాడు.. ‘అదిగో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్’ అని. దీనికితోడు 14 ఏళ్ల వయస్సులో ‘నీవో అద్భుత ఫైటర్‌వి’ అని కోచ్ పదేపదే చెప్పే మాటలతో యువ టైసన్ ఎంతగానో ఉత్తేజితుడయ్యేవాడు. అప్పటిదాకా అతడి గురించి ఏ ఒక్కరూ ఒక మంచి మాటైనా చెప్పింది లేదు. కోచ్ మాటల ప్రభావం టైసన్‌పై విశేషంగా పడింది. బాక్సర్ల గురించి పుస్తకాలను టైసన్‌తో అమటో చదివించాడు. ఎనిమిది సెకన్లలోనే.. 1981 జూనియర్ ఒలింపిక్స్ తనకు తొలి మేజర్ టోర్నమెంట్. ఇక్కడే తనపై తనకు ఎంతగానో నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే 15 ఏళ్ల వయస్సులో.. కేవలం ఎనిమిది సెకన్లలో.. ఒకే ఒక్క పంచ్‌కు ప్రత్యర్థిని మట్టి కరిపించి స్వర్ణం సాధించాడు. అయితే అప్పటికే తను విపరీతంగా తాగడం కాకుండా డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. దీనికి తోడు ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ డిగో మారడోనాతో సమానంగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉండడంతో ఆ ‘మత్తు’లో మెల్లగా జీవితం కట్టు తప్పసాగింది. టైసన్ శకం... టైసన్ కెరీర్లో అతి పెద్ద సంచలనం 1986లో నమోదైంది. 20 ఏళ్ల వయస్సులో డిఫెండింగ్ చాంపియన్ ట్రెవర్ బెర్బిక్ను మట్టికరిపించి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యుబీసీ)ను గెలుచుకున్నాడు. ఇది బాక్సింగ్ చరిత్రలో అతిపెద్ద విజయంగా విమర్శకులు పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఆరాధ్యుడు మహ్మద్ అలీని ఓడించిన బెర్బిక్పై విజయం ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యిందని టైసన్ భావించాడు. ఇక్కడి నుంచి టైసన్ శకం ప్రారంభమైంది. ఎక్కడికెళ్లినా నీరాజనాలు.. లెక్కలేనంత డబ్బుతో టైసన్ పెద్ద సెలబ్రిటీగా మారాడు. కానీ టైసన్ భవిష్యత్‌ను ముందుగానే ఊహించిన కోచ్ డి అమటో మాత్రం తన శిష్యుడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇది టైసన్‌ను కూడా తీవ్రంగా బాధించింది. 1990లో షాక్.. ఐరన్ మైక్ టైసన్‌గా పేరుతెచ్చుకున్న తనకు 1990లో జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. టోక్యోలో జేమ్స్ డగ్లస్‌తో పోటీ అది. మహామహులనే ఓడించిన టైసన్‌కు ఇతడొక లెక్కా.. అనే అనుకున్నారంతా. పంటర్లంతా పెద్ద ఎత్తున టైసన్‌పై పందాలు కాసారు. అప్పటికే విందు వినోదాల్లో కూరుకుపోయిన టైసన్ సరైన ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాడు. బౌట్ అనంతర వెలువడిన ఫలితం చూసి ఓ రకంగా ప్రపంచం నిర్ఘాంత పోయింది. జరిగింది నిజమా? కలా? నమ్మలేకపోయారు. ఓటమనేది తెలీని టైసన్‌కు తొలిసారి పరాజయం. ఇక అక్కడి నుంచి జారిపడిన టైసన్ మళ్లీ లేవలేకపోయాడు. ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన ఫైట్‌లో ఓటమి తట్టుకోలేక చెవి కొరికాడు. బాక్సింగ్ లోపల పని లేకపోవడంతో బయట తన ‘ప్రతాపం’ చూపసాగాడు. వీధి గొడవలు, భార్యతో విడాకులు, రేప్ కేసులు చివరికి జైలుపాలు. జైల్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే అదీ లేదు. అక్కడ విచ్చలవిడి శృంగారంతో భ్రష్టు పట్టిపోయాడు. ఎంతలా అంటే మామూలు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా సరైన శక్తి లేనంతగా.. జైల్లోనే ఇస్లాం స్వీకరించాడు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దివాలా తీశాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడాయి. కూతురు మరణం తట్టుకోలేకపోయాడు. పశ్చాత్తాపం మొదలు... ఇప్పుడు తన జీవితంపై 47 ఏళ్ల వయస్సులో పశ్చాత్తాపపడుతున్నాడు. అందుకే 2011లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టైసన్‌ను చేర్చినప్పుడు తన జీవితంపై ఆశ్చర్యపోయాడు. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించింది నేనేనా అని అనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ‘ది అన్డిస్ప్యూటెడ్ ట్రూత్’ అనే పేరిట ఈ దుర (అ)దృష్టవంతుడు జీవిత చరిత్ర రాస్తున్నాడు. పతనం ఆరంభం... టైసన్ ఒక్కో బౌట్లో ప్రత్యర్థిపై పిడిగుద్దులు విసురుతూ బాక్సింగ్ రింగ్‌లో అజేయుడుగా నిలుస్తున్నాడు. అప్పటికి దిగ్గజాలుగా పెరుతెచ్చుకున్న జేమ్స్ స్మిత్, మైకేల్ స్పింక్స్, లారీ హోమ్స్, పింక్లోన్ థామస్, టోరీ టక్కర్‌లను అత్యంత సులువుగా ఓడించి ఔరా అనిపించుకున్నాడు. దీంతో విపరీతంగా డబ్బు వచ్చిపడుతోంది. దాన్ని సరైన రీతిలో ఎలా ఖర్చు చేయాలో తెలీకపోవడంతో పాటు ఎక్కడికి వెళుతున్నావు.. ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదా? అని అడిగేవారు లేకపోవడంతో తెగిన గాలిపటంలా మారిపోయాడు. విచ్చలవిడిగా పార్టీలు ఇచ్చేవాడు. ఒక్కోసారి అవి నాన్‌స్టాప్‌గా సాగేవి. ఒక్కో క్లబ్ నుంచి మరో క్లబ్‌కు.. ఒక్కో నగరం నుంచి మరో నగరానికి ఇలా సాగేవి. -
సుష్మాయే తెలంగాణ చాంపియన్: నాగం
సాక్షి, హైదరాబాద్: సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ వ్యాఖ్యను బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి తోసిపుచ్చారు. బీజేపీ మద్దతు లేకుంటే బిల్లు వచ్చేదే కాదన్నారు. సోనియమ్మనే కాకుండా చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌నూ గుర్తించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నిజమైన చాంపియన్ సుష్మా అని చెప్పారు. తెలంగాణ బిల్లు పాసయినందుకు వెంకయ్యనాయుడుకు తప్ప మిగతా జాతీయ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, దాసరి మల్లేశం, సాగర్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాకు నిజంగానే తెలంగాణపై ప్రేముంటే 2004, 2009లో ఎందుకివ్వలేదు? 2009లో వెనక్కుపోకుండా ఉంటే వేయి మంది ప్రాణాలు నిలిచేవి కావా..? అని ప్రశ్నించారు. -
విజేత మెరైన్ ట్రాన్స్
జింఖానా, న్యూస్‌లైన్: సీవేస్ గ్రూప్ కార్పొరేట్ టి20 క్రికెట్ టోర్నీలో మెరైన్ ట్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో మెరైన్ ట్రాన్స్ 39 పరుగుల తేడాతో సీవేస్ లెజెండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెరైన్ ట్రాన్స్ 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సీవేస్ లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను మెరైన్ ట్రాన్స్ ఆటగాడు ప్రమోద్ దక్కించుకోగా... మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను ప్రతాప్ హెల్త్ కేర్ క్రీడాకారుడు వెంకట్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్ టైటిల్‌ను హెచ్వైసీఏఏ ఆటగాడు జతిన్, బెస్ట్ బౌలర్ టైటిల్‌ను సీవేస్ లెజెండ్స్ క్రీడాకారుడు రియాజ్ ఖురేషి సాధించారు. విజేతలకు సీవేస్ గ్రూప్ చైర్మన్ కెప్టెన్ పీవీకే మెహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీవేస్ డెరైక్టర్లు వివేక్ ఆనంద్, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య చాంపియన్ జగనే
వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావంలో వక్తలు కిరణ్ , చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సమైక్యం కోసం శాయశక్తులా కృషిచేస్తున్నది వైఎస్ జగనేనని... ఆయనే సమైక్య చాంపియన్ అని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావం సభ బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు. ఈ సభకు జిల్లా విద్యార్థి జేఏసీ నాయకుడు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ముసుగులో సమైక్యం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజన వాదమా? సమైక్యమా? అనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఒక్కరే సమైక్యం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. 1969లో చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని ఇందిర ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. వేర్పాటువాదాన్ని ఆమె ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఏనాడూ విభజన కోరలేదని, కేవలం కన్నతండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే సూచించిందని వివరించారు. సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అవకాశాలు... పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అందరికీ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. సమైక్యం కోసం జగన్మోహన్రెడ్డి దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చింది వైఎస్సేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విభజనకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. చిన్న రాష్ట్రాలుంటే కేంద్రం లెక్కచేయదన్నారు. సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, పడమటి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులతోనే రాజకీయాల్లో మార్పులు వస్తాయన్నారు. జగన్మోహన్రెడ్డితో విద్యార్థులు కలిసి రావాలన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. నగర మాజీ మేయర్ తాడి శకుంతల, వాణిజ్య విభాగం నాయకుడు కొణిజేటి రమేష్, డాక్టర్ల విభాగం కన్వీనర్ మహబూబ్, నాయకులు కాకర్ల వెంకటరత్నం, రామలింగమూర్తి, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, టి.హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్ సరూర్‌నగర్
వరంగల్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణస్థాయి ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ క్లబ్ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆతిథ్య వరంగల్ జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఎస్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్తర తెలంగాణ స్థాయి ఆఫీసర్స్ ఇంటర్ క్లబ్ బ్యా డ్మింటన్ పోటీల్లో ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో నాలుగు జిల్లాల నుంచి 48 జట్లు పా ల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో కృష్ణమోహన్, అలీమ్ జోడి (సరూర్‌నగర్ క్లబ్ జట్టు) 21-19, 21-15 తేడాతో సతీష్, దిలీప్ జంట(వరంగల్ క్లబ్)పై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సరూర్‌నగర్ జట్టు 21-13, 22-24, 21-14 తేడాతో ఖమ్మంపై, వరంగల్ క్లబ్ 21-13, 21-12 తేడాతో కరీంనగర్ క్లబ్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగగా సరూర్‌నగర్ జోడి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. జనాభాలో ముందున్నా క్రీడల్లో వెనుకపడ్డాం : అర్బన్ ఎస్పీ ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో పోటీ పడుతున్నప్పటీకీ క్రీడల్లో ఎంతో వెనుకపడ్డామని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. ఉత్తర తెలంగాణ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మన ప్రభుత్వాలు క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఒలిం పిక్స్‌లో ఎంతో వెనకపడ్డామన్నారు. ప్రభుత్వా ల ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా పి ల్లల తల్లిదండ్రులు చదువుపాటు క్రీడల్లో ముం దుండేలా చూడాలని కోరారు. అనంతరం ఎస్ఆర్ విద్యాసంస్థల డెరైక్టర్ ఎనగందుల సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాలుగు జిల్లాల బ్యాడ్మింట న్ పోటీలను నిర్వహించామన్నారు. ఓఎస్డీ కిషోర్, డీఎస్పీ శోభన్‌కుమార్, వరంగల్ క్లబ్ సెక్రటరీ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, జాయింట్ సెక్రట రీ భూపాల్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రమేష్‌రెడ్డి, క్లబ్ సభ్యులు వీటీ ప్రసాద్, సురేష్, పూర్ణ, నాగకిషన్, వెంకట్, సీ ఐలు వెంకట్రావ్, జితేందర్‌రెడ్డి,శ్యాంకుమార్, కొమ్ము రాజేందర్ యాదవ్, హన్మంతారావు, కిషోర్, శ్యాంప్రసాద్, శ్రీధర్ పాల్గొన్నారు. -
విజయవంతమైన అపజయాలు..!
వారి జీవితాలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. ఉక్కిరిబిక్కిరి చేసే కష్టాల్లో కూడా వారి వ్యక్తిత్వాలు ఊరటనిస్తాయి. ‘నేటి పరాజయమే రేపటి విజయానికి సూచిక’ అనే స్ఫూర్తిని పంచుతాయి. ఓటమి ఎన్నడూ జీవితానికి ముగింపు కాదు... అన్న సత్యాన్ని చాటి చెబుతాయి. విజయం కోసం కసితో ప్రయత్నించాలనే సందేశాన్ని ఇస్తాయి. వారి తొలి ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పలువురి హేళనకు గురయ్యాయి. అయితే ఆ అపజయాల బాటే అంతిమంగా విజయం ముంగిటకు చేర్చింది. ఈ ప్రస్థానాన్ని బట్టి వారి వైఫల్యాలను ఫెయిల్యూర్స్ గా చూడలేం. ఆ అపజయాలను విజయానికి సోపానాలుగా భావిస్తే, యువత వాటినుంచే స్ఫూర్తిని అలవరచుకోవచ్చు! అసమర్థుడే... విజేత అయ్యాడు! సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యమే కానీ.. చర్చిల్ వ్యక్తిగత జీవితంలో అసమర్థుడనే పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో వైఫల్యాల మధ్య 62 యేళ్ల వయసుకు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక గానీ చర్చిల్ సమర్థత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఆరో తరగతి ఫెయిలైన ఆయనే నోబెల్ బహుతి స్థాయికి ఎదిగాడంటే ఆశ్చర్యం కలగమానదు. దీనికంతటికీ ఆయన పట్టుదల, కృషే కారణం. అందుకే ఆయన జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. పరాజయం అతడి పుట్టినిల్లు! అమెరికా అధ్యక్షపీఠం అనే అంతిమ విజయం సాధించేంత వరకూ ప్రతి అధ్యాయంలోనూ లింకన్ జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని రకాలుగా ఎదురుదెబ్బలు తినగలడో అన్నిరకాలుగానూ విధి లింకన్ జీవితంలో ఆడుకుంది. అయితే వాటన్నింటికీ ఎదురునిలిచి అత్యున్నత స్థాయికి చేరగలడమే అబ్రహం లింకన్‌ను ఒక చెక్కుచెదరని ధీశాలిగా ప్రపంచం ముందు నిలిపింది. చీకటి నుంచి పుట్టిన దివ్వె... ఇప్పుడంటే.. ఆమెను అంతా ‘నల్లకలువ’గా కీర్తిస్తున్నారు, ఆమె సంపాదనను చూసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర మీద ఆమెను టాక్ షోల రాణిగా చూస్తున్నారు కానీ.. బాల్యం నుంచి ఒక నీగ్రోగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ తట్టుకొని ఈ స్థాయికి ఎదిగిందంటే.. ఓప్రా ఓరిమికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ప్రపంచం తక్కువ అంచనా వేసింది... సినిమా మేకింగ్‌కు సంబంధించి స్పీల్బర్గ్ సినిమాలు ఇప్పుడు ఎంతోమందికి అత్యుత్తమ గ్రంథాలు. సినిమా సక్సెస్‌కు అవి సిలబస్ లాంటివి. అదంతా ఇప్పుడు... దర్శకుడు కాక ముందు స్పీల్బర్గ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ థియేటర్లో బీఏ చదవడానికి దరఖాస్తు చేసుకుంటే... తిరస్కరణకు గురయ్యింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు... మూడుసార్లు! ఈ దిగ్దర్శకుడికి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి కూడా అర్హత లేదని డిసైడ్ చేసింది యూనివర్సిటీ. తనకు ఇంత అవమానాన్ని మిగిల్చిన డిగ్రీని మాత్రం ిస్పీల్బర్గ్ అంత తేలికగా వదల లేదు. దర్శకుడిగా మారిన ఎన్నో ఏళ్ల తర్వాత... 2002లో గ్రాడ్యుయేషన్ మీద తన కసి తీర్చుకున్నాడు. ఒంటరిగా అడ్డంకులు దాటిన వండర్... హ్యారీ పోటర్ సిరీస్‌తో ప్రపంచానికి ఒక మాయ ప్రపంచాన్ని పరిచయం చేసిన రౌలింగ్ ఘనతను ప్రపంచం అంత సులువుగా గుర్తించలేదు. ఈ రచనలను అచ్చొత్తించడానికి ఒక్క పబ్లిషర్ కూడా ముందుకు రాలేదు. వ్యక్తిగతంగా కూడా అనేక కష్టాలు. వైవాహికజీవితం విఫలమైంది. పిల్లలు కూడా ఆమెకు భారమే అయ్యారు. అలా డిపెండెంట్ హోదాలో ఉన్న రౌలింగ్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల్లో ఒకరిగా నిలిచారు. - జీవన్‌రెడ్డి