
కంటోన్మెంట్: ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 77ఏళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించారు. ట్రయథ్లాన్ చాంపియన్‌గా పేరొందిన ఆయన ఇటీవల మహరాష్ట్ర లోనావాలాలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 1.5 కిలో మీటర్ల దూరం ఈది సరికొత్త ఘనత సాధించారు. యువతకు స్ఫూర్తి కలిగించాలన్న లక్ష్యంతోనే తాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వెటరన్ స్పోర్ట్స్ జరిగినా హాజరవుతానని అన్నారు.
ఇప్పటికీ నిరంతరం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని అన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరీరంపై పట్టు సాధిస్తే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసమూ కలుగుతుందన్నారు.
(చదవండి: టు లెట్.. టేక్ కేర్)