
సోలాపూర్, భివండీ: సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈద్ ఉల్ ఫిత్ర్(రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హోటగి రోడ్డు వైపునున్న అలంగీర్ ఈద్గా మైదానం, జూని మిల్ కాంపౌండ్ హాల్‌లోని అదిల్ శాయి ఈద్గా మైదానం, అసర్ మైదానంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అందరూ ఒకరికొకరిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
భివండీలో...
భివండీలోని పలుప్రాంతాల్లో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ఈద్గా మైదానం సహా పట్టణంలో 113 మసీదులలో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ సందర్భంగా కోటర్ గేట్ వద్ద డీసీపీ మోహన్ దహికర్, ఏసీపీ దీపక్ దేశ్‌ముఖ్ ముస్లిం సోదరులకు గులాబీలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ స్వాగతం, వేడుకలు