Eid-ul-Fitr festival
-
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
హైదరాబాద్‌లో బక్రీద్ కోలాహలం (ఫొటోలు)
-
ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్ర మాసంగా పాటించే రంజాన్ నెల చివరి రోజైన ‘ఈద్ ఉల్ ఫితర్’పండుగ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నివాసంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందరికీ కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ ఆతిథ్యాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి కేసీఆర్ స్వీకరించారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, క్షమాగుణం, కరుణ తదితర ఆధ్యాతి్మక భావనలు తదితర అంశాలపై కేసీఆర్ తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, ఇతరులను పేరుపేరునా పలకరించి అలాయ్ బలాయ్ తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ తదితరులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించిన సీఎంకు మహమూద్ అలీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపికను బహూకరించారు. -
సమతా మమతల పర్వం రమజాన్.. ప్రాముఖ్యత ఇదే..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. అనాదిగా ఇవి చలామణిలో ఉన్నవే. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ (ఈద్ ) అలాంటిదే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిధ్ధి గాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. ఇకపోతే, వెయ్యి నెలలకంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా రమజాన్‌లోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆ రోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్ ’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే, అలాంటి వారిని దైవం తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని, సన్మార్గం వైపుకు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా, దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్ఠలతో గడిపారో ఇకముందు కూడా ఇదే çస్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రధ్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటారు. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి, స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు చేస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరులాంటి సువాసనలు వినియోగిస్తారు. ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ (వేడుకోలు) చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువు బారినుంచి, దుష్టపాలకుల బారినుంచి, కరవుకాటకాల నుంచి, దారిద్య్రం నుంచి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, విశ్వమానవాళినంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది. ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... – యండి. ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ప్రారంభంలో రెండు రకతుల ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, ‘అల్లాహు అక్బర్’ అని రెండు చేతులూ పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’ పఠించి, మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్న సూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతు కోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి, మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ మూడుసార్లూ చేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాలుగోసారి ‘అల్లాహు అక్బర్’ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో వెనుక బారులు తీరిన భక్తులంతా ఇమాంను అనుసరిస్తారు. ఈద్ నమాజులో అజాన్ , అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థిలను అన్వయిస్తూ సమాజానికి మార్గదర్శక సందేశం ఇస్తాడు. తరువాత దుఆతో ఈద్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ‘ఫిత్రా’ పరమార్థం పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక సత్కార్యాల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్ ’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుంచే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశించారు.మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ , ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది! అల్లాహ్ అందరికీ రమజాన్‌ను సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -
నైట్ బజార్.. ఫుల్ హుషార్.
చార్మినార్: పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో నిత్యం సందడి కనిపిస్తోంది. వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. రంజాన్ మాసంలోని చివరి ఘట్టమైన జుమ్మత్ ఉల్ విదా పూర్తి కావడంతో ముస్లింలు ఇక ఈద్–ఉల్–ఫితర్ పండగ కోసం సిద్ధమవుతున్నారు. పండగకు ఇంకా ఒకరోజే మిగిలి ఉండటంతో పాతబస్తీలో ఎటుచూసినా రంజాన్ పండగ సంతోషం కనిపిస్తోంది. నైట్ బజార్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2–3 గంటల వరకు కూడా కొనసాగుతోంది. (చదవండి: ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! ) -
ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని మరింత పెంపొందించేలా కృషి చేద్దామని కోరారు. ‘ఈద్ ఉల్ పితర్ సందర్భంగా ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి ముందుకు వెళ్లేలా కృషి చ్దేదాం' అంటూ మోదీ ట్వీట్ చేశారు. Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare. Eid Mubarak! — Narendra Modi (@narendramodi) May 14, 2021 -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘మటన్ బిర్యానీ, పాయసం పంపించా తీసుకోండి’
హైదరాబాద్: ముస్లింలు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకున్నారు. ఇక రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీమ్, బిర్యానీ, సేమియా పాయసం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం సోదరులు తమ ఆత్మీయులను ఇంటికి పిలిచి రంజాన్ ప్రత్యేక వంటకాలను వడ్డించే వీలులేకుండా పోయింది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన ఆత్మీయులకు కోసం వినూత్నంగా ఆలోచించాడు. మటన్ బిర్యానీ, సేమియా పాయసం, డెజర్ట్స్‌ను టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి షమీ ప్రత్యేకంగా పంపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పేర్కొంటూ, తను పంపించిన ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించిన ఫోటోను కూడా జత చేశాడు. ‘రవి భాయ్.. సేమియా పాయసం, మటన్ బిర్యానీ, డెజర్ట్స్‌లను ప్యాక్ చేసి పంపించాను. కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తుంది. స్వీకరించండి’ అంటూ షమీ ట్వీట్ చేశాడు. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. Ravi bhai app ki Seviyan ,kheer ,or Mutton biryani maine courier kardia hey Kucch time main pahunch jaega dekhlo app @RaviShastriOfc pic.twitter.com/MZSshUpz3O— Mohammad Shami (@MdShami11) May 25, 2020 Eid Mubarak! May Allah fulfill your all dreams and hopes. pic.twitter.com/KHHfgNjTr1— Mohammad Shami (@MdShami11) May 25, 2020 చదవండి: ఐపీఎల్-2020 విజేత ఆర్సీబీ: సంబరంలో ఫ్యాన్స్ హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్ -
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని ఆయన కోరారు. ‘ఈద్ ఉల్ పితర్ సందర్భంగా ఈద్ ముబారక్. ఈ పర్వదినం కరుణ, సోదర భావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ఆశిసస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. Eid Mubarak! Greetings on Eid-ul-Fitr. May this special occasion further the spirit of compassion, brotherhood and harmony. May everyone be healthy and prosperous. — Narendra Modi (@narendramodi) May 25, 2020 కరోనా కారణంగా ప్రజలు సామాజిక దూరం, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన ముస్లిం మత పెద్దలు ప్రజలను కోరారు. కరోనా సంక్షోభ సమయంలో ముస్లిం సోదరులు పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని.. పేద ప్రజలకు, ఇరుగపొరుగు వారికి సహాయం చేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏడాది ముసస్లిం సోదరులతో కిక్కిరిసి ఉండే జామా మసీదు లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది బోసి పోయింది. -
ఇళ్లలోనే ఈద్–ఉల్–ఫితర్ ప్రార్థనలు
-
112ఏళ్ల తర్వాత మళ్లీ ఇళ్లలోనే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రలో మరోసారి ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి.. అప్పుడెప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ వరదలు వెల్లువెత్తినప్పుడూ ఇటువంటి పరిస్థితే.. అప్పట్లో ఈద్గాలు, మసీదు లు తెరుచుకున్నా.. ముస్లింలు మాత్రం ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని హంగూ ఆర్భాటం లేకుం డా పండుగ జరుపుకున్నారు. ఇప్పుడు కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో అదే తరహాలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో సోమవారం ఉదయం ఎవరిళ్లలో వారు ఈద్–ఉల్–ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకోనున్నారు. సందడి లేని రంజాన్ రంజాన్ వచ్చిందంటే నగరంలో ఎంత సందడి?.. రాత్రంతా మేల్కొని వెలిగిపోతుండే నగరం ఇప్పుడు బోసిపోయింది. ప్రధాన మార్కెట్లు కళతప్పాయి. బట్టలు కొనేవారు లేరు. చిరు వ్యాపారం చతికిలపడింది. హలీమ్ బట్టీల్లో నిప్పు రాజుకోలేదు. పండుగ షాపింగ్‌కు అంతా స్వస్తి చెప్పారు. మొత్తమ్మీద అక్షరాలా పన్నెండు వందల కోట్ల రూపాయల రంజాన్ సీజన్ బిజినెస్‌ను లాక్డౌన్ మిగేసింది. ప్రధానంగా వస్త్ర వ్యాపారం బాగా దెబ్బతింది. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని తెప్పించిన స్టాక్ గోదాములు దాటి షాపుల్లోకి చేరలేదు. హైదరాబాద్ నగరంలో కేవలం ఈ సీజన్లోనే రూ.500 కోట్ల మేర వ్యాపారం సాగేది. మరోవైపు ఈ బట్టల దుకాణాలపై ఆధారపడి ఉపాధిపొందే వేలాది మంది చిరుద్యోగుల పొట్టకొట్టినట్టయింది. ప్రస్తుతం లాక్డౌన్ మినహాయింపుతో దుకాణాలు తెరుచుకున్నా షాపింగ్‌కు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. బోసిపోయిన మార్కెట్లు.. చార్మినార్ – మక్కామసీదు ప్రాంతం సడీచప్పు డు లేకుండాపోయింది. గాజుల తళుకులతో మె రిసే లాడ్‌బజార్ కళతప్పింది. సాధారణ రోజు ల్లోనే రద్దీగా ఉండే మదీనా మార్కెట్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌస్, లాడ్‌బజార్, శాలిబండ, చార్మినా ర్, సుల్తాన్‌బజార్, టోలిచౌకి, నాంపల్లి, మల్లేపల్లి, సికింద్రాబాద్ మార్కెట్లలో సందడి లేదు. కనిపించని హలీమ్.. రంజాన్ మాసంలో అందరి నోరూరించేది– హ లీమ్. ఈసారి దీని రుచి చూపకుండానే రంజాన్ వెళ్లిపోతోంది. లాక్డౌన్ ప్రభావం హోటల్ రం గంపై తీవ్రంగా పడింది. ఏటా ఈ సీజన్లో రూ. 500 కోట్ల వ్యాపారం సాగేది. ఈసారి ‘జీరో’గా మారింది. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరుం దో హలీమ్‌కు అదేస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్ మహా నగరం మొత్తమ్మీద ప్రతి రంజాన్ మాసంలో సుమారు 12 వేలకుపైగా హలీమ్ బట్టీలు వెలిసేవి. నగరం నుంచి దేశ, విదేశాలకు సైతం హలీమ్ ఎగుమతయ్యేది. ఈ వ్యాపారంపై సుమారు 50 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందేవి. వీరందరిపై కరోనా, లాక్డౌన్ దారుణంగా ప్రభావం చూపాయి. నాడలా.. నేడిలా.. హైదరాబాద్‌లోని మూసీ నదికి 1908 సెప్టెంబర్ 26 – 28 తేదీల మధ్య భారీగా వరదలు వచ్చాయి. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల మేర నమోదైన వర్షపాతంతో దాదాపు 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యా యి. అప్పటో నగరంలో ఉన్న 3 వంతెన లు (అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్) తెగిపోయాయి. ఆ సమయంలో నే రంజాన్ పర్వ మాసం ప్రారంభమైంది. అది ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు. హైదరాబాదీలకు ఉపాధి కరువైంది. దీంతో ముస్లింలు పండుగ సంబరాల్ని పక్కనపెట్టి ఆ డబ్బును వరద బాధితుల సహాయార్ధం వెచ్చించారు. ఇది జరిగిన 112 ఏళ్ల తర్వా త, ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దె బ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడ ప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి.. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. అప్పుడు మసీదులు, ఈద్గాలు తెరుచుకుంటే ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా ముస్లింలు అప్ప ట్లో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండుగను సాదాసీదాగా జరుపుకున్నారు. -
మార్కెట్లకు సెలవు
సాక్షి,. ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు సెలవు. బక్రీద్ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. సాక్షి పాఠకులకు బక్రీద్ పర్వదినంగా సందర్భంగా ఈద్ శుభాకాంక్షలు. అలాగే ఈ వారం మార్కెట్లలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. దీంతో వారంలో ట్రేడింగ్ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గత వారంలో తొలి మూడు రోజులూ దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. దేశీయంగా రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పటికీ , సెంటిమెంటు బలహీనంగా ఉందనీ, అప్రమత్తత అవసరంమని నిపుణులు చెబుతున్నారు. -
కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!
శ్రీనగర్: కశ్మీర్లో ఈద్ పండుగ సంబరాలపై లేదా స్వాతంత్య్ర దినోత్సవాలపై భారీ దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారనీ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత ప్రభుత్వంపై నిందను మోపేందుకు మసీదుల్లో ప్రార్థనలపై ఈ దాడులు జరగొచ్చని తెలిపాయి. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూర్ అజార్ ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. ఉగ్రవాద దాడి జరిపి వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) జైషే మహ్మద్‌కు సూచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం సరిగ్గా వారం క్రితం సంచలన, చారిత్రక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా పాక్‌కు ముస్లిం దేశాలు సహా ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో, తాజాగా ఉగ్రవాద దాడికి దిగి, భారత్‌కు చెడ్డపేరు తీసుకురావాలని అనుకుంటోందని నిఘా వర్గాలు తెలిపాయి. బనిహల్, పిర్ పంజాల్ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనీ, రాజౌరీ లేదా పూంచ్ జిల్లాల్లోకి వాళ్లు చొరబడి ఉంటారని చెప్పాయి. వ్యాపారులకు వెయ్యి కోట్ల నష్టం.. శ్రీనగర్‌లో ఆంక్షల కారణంగా వారం రోజుల్లో వ్యాపారులు రూ. వెయ్యి కోట్లు నష్టపోయుంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆంక్షల కారణంగా ప్రజలెవ్వరూ బటయకు రాకపోవడంతో రోజుకు రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యుడొకరు చెప్పారు. పండుగ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లు ఆదివారం తెరిచే ఉన్నాయి. -
బక్రీద్ : జోరుగా పొట్టేళ్ల వ్యాపారం
-
ఘనంగా రంజాన్