ఏదీ నాటి రంజాన్ సందడి?: ఈద్–ఉల్–ఫితర్ పండుగ సందర్భంగా ఆదివారం ఏమాత్రం షాపింగ్ సందడి కానరాని చార్మినార్ ప్రాంతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రలో మరోసారి ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి.. అప్పుడెప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ వరదలు వెల్లువెత్తినప్పుడూ ఇటువంటి పరిస్థితే.. అప్పట్లో ఈద్గాలు, మసీదు లు తెరుచుకున్నా.. ముస్లింలు మాత్రం ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని హంగూ ఆర్భాటం లేకుం డా పండుగ జరుపుకున్నారు. ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో అదే తరహాలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో సోమవారం ఉదయం ఎవరిళ్లలో వారు ఈద్–ఉల్–ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకోనున్నారు.
సందడి లేని రంజాన్
రంజాన్ వచ్చిందంటే నగరంలో ఎంత సందడి?.. రాత్రంతా మేల్కొని వెలిగిపోతుండే నగరం ఇప్పుడు బోసిపోయింది. ప్రధాన మార్కెట్లు కళతప్పాయి. బట్టలు కొనేవారు లేరు. చిరు వ్యాపారం చతికిలపడింది. హలీమ్ బట్టీల్లో నిప్పు రాజుకోలేదు. పండుగ షాపింగ్‌కు అంతా స్వస్తి చెప్పారు. మొత్తమ్మీద అక్షరాలా పన్నెండు వందల కోట్ల రూపాయల రంజాన్ సీజన్ బిజినెస్‌ను లాక్‌డౌన్ మిగేసింది. ప్రధానంగా వస్త్ర వ్యాపారం బాగా దెబ్బతింది. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని తెప్పించిన స్టాక్ గోదాములు దాటి షాపుల్లోకి చేరలేదు. హైదరాబాద్ నగరంలో కేవలం ఈ సీజన్‌లోనే రూ.500 కోట్ల మేర వ్యాపారం సాగేది. మరోవైపు ఈ బట్టల దుకాణాలపై ఆధారపడి ఉపాధిపొందే వేలాది మంది చిరుద్యోగుల పొట్టకొట్టినట్టయింది. ప్రస్తుతం లాక్‌డౌన్ మినహాయింపుతో దుకాణాలు తెరుచుకున్నా షాపింగ్‌కు వినియోగదారులు ఆసక్తి చూపలేదు.
బోసిపోయిన మార్కెట్లు..
చార్మినార్ – మక్కామసీదు ప్రాంతం సడీచప్పు డు లేకుండాపోయింది. గాజుల తళుకులతో మె రిసే లాడ్‌బజార్ కళతప్పింది. సాధారణ రోజు ల్లోనే రద్దీగా ఉండే మదీనా మార్కెట్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌస్, లాడ్‌బజార్, శాలిబండ, చార్మినా ర్, సుల్తాన్‌బజార్, టోలిచౌకి, నాంపల్లి, మల్లేపల్లి, సికింద్రాబాద్ మార్కెట్లలో సందడి లేదు.
కనిపించని హలీమ్..
రంజాన్ మాసంలో అందరి నోరూరించేది– హ లీమ్. ఈసారి దీని రుచి చూపకుండానే రంజాన్ వెళ్లిపోతోంది. లాక్‌డౌన్ ప్రభావం హోటల్ రం గంపై తీవ్రంగా పడింది. ఏటా ఈ సీజన్లో రూ. 500 కోట్ల వ్యాపారం సాగేది. ఈసారి ‘జీరో’గా మారింది. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరుం దో హలీమ్‌కు అదేస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్ మహా నగరం మొత్తమ్మీద ప్రతి రంజాన్ మాసంలో సుమారు 12 వేలకుపైగా హలీమ్ బట్టీలు వెలిసేవి. నగరం నుంచి దేశ, విదేశాలకు సైతం హలీమ్ ఎగుమతయ్యేది. ఈ వ్యాపారంపై సుమారు 50 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందేవి. వీరందరిపై కరోనా, లాక్‌డౌన్ దారుణంగా ప్రభావం చూపాయి.
నాడలా.. నేడిలా..
హైదరాబాద్‌లోని మూసీ నదికి 1908 సెప్టెంబర్ 26 – 28 తేదీల మధ్య భారీగా వరదలు వచ్చాయి. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల మేర నమోదైన వర్షపాతంతో దాదాపు 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యా యి. అప్పటో నగరంలో ఉన్న 3 వంతెన లు (అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్) తెగిపోయాయి. ఆ సమయంలో నే రంజాన్ పర్వ మాసం ప్రారంభమైంది. అది ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు. హైదరాబాదీలకు ఉపాధి కరువైంది. దీంతో ముస్లింలు పండుగ సంబరాల్ని పక్కనపెట్టి ఆ డబ్బును వరద బాధితుల సహాయార్ధం వెచ్చించారు. ఇది జరిగిన 112 ఏళ్ల తర్వా త, ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దె బ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడ ప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి.. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. అప్పుడు మసీదులు, ఈద్గాలు తెరుచుకుంటే ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా ముస్లింలు అప్ప ట్లో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండుగను సాదాసీదాగా జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment