పోలీసులతో యువకుడి వాగ్వాదం
సాక్షి, భువనగిరి: అయిదు నిమిషాలు ఆలస్యం కావడంతో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద ఓ యువకుడికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. దీంతో తనకు అన్యాయంగా పోలీసులు అన్యాయంగా జరిమానా విధించారని శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆర్బీనగర్‌కు చెందిన నరేశ్ హైదరాబాద్ నుంచి భువనగిరికి వచ్చాడు.
ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరిట రూ.వెయ్యి జరిమానా విధించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైతే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాక్‌డౌన్ ఉల్లంఘన కింద రూ.1000 జరిమానాతో పాటు రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు 341, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు.
చదవండి: గుండెపోటుతో కుప్పకూలిన వధువు; శవాన్ని పక్కనే ఉంచి.. చెల్లెలితో పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment