Violations
-
డబ్బు ఇవ్వడం చట్టవిరుద్ధం
వాషింగ్టన్: భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు ధ రించే హక్కుకు మద్దతు పలుకుతూ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకం చేస్తే రోజులో ఒకరికి 10 లక్షల డాల ర్లు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రక టించడాన్ని అమెరికా ప్రభుత్వం తప్పుబట్టింది. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేస్తూ మస్క్ ను అమెరికా న్యాయశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎన్నికల చట్ట ఉల్లంఘనలపై న్యాయశాఖలోని పబ్లిక్ ఇంటిగ్రిటీ విభాగం మస్క్ కు చెందిన సూపర్ పీఏసీ కంపెనీకి హెచ్చరిక లేఖ ను పంపింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఆయుధా లు ధరించే హక్కుకు మద్దతుగా పిటిషన్‌పై సంతకం చేస్తే ఎన్నికల తేదీదాకా ప్రతి రోజూ ఒక విజే తకు 10 లక్షల డాలర్లు ఇస్తానని మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం విదితమే. ట్రంప్‌కు మద్దతుగా పలువురు టెక్ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన సూపర్ పీఏసీ అనే సంస్థ తమ వెబ్సైట్లో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నెవడా, అరిజోనా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆన్లైన్ పిటిషన్ కార్యక్రమం దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సంతకం చేయాలంటే నిర్దిష్ట రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ ఓటరు అయి ఉండాలనే షరతు విధించారు. ఈ షరతుకు లోబడి ఇప్పటివరకు గెలిచిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల డాలర్ల చెక్కులను అందజేశారు. శనివారం హారిస్బర్గ్లో ఒకరు, ఆది వారం పిట్స్‌బర్గ్‌లో మరొకరు ఈ చెక్కులను అందుకున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై అమెరికాలో నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్బు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ హెచ్చరిక లేఖను జారీ చేశారు. అయితే, ప్రభుత్వం పంపిన లేఖపై సంస్థగానీ, ఎలాన్ మస్క్ గానీ ఇంకా స్పందించలేదు. అయితే ఓటు వేసే వాళ్లు మాత్రమే ఈ ఆన్లైన్ పిటిషన్లో సంతకం చేయాలనే నిబంధన లేదని, ఏ పారీ్టకి చెందినా, చెందకపోయినా, ఎన్నికల్లో ఓటువేసే ఉద్దేశంలేకపోయినా ర్యాండమ్‌గా విజేతను ఎంపికచేస్తామని మస్క్ మరో పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం. -
యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) చర్యలు చేపట్టింది. అనుమానాస్పద లావాదేవీలను నివేదించడంలో విఫలమైనందుకు, ముంబై శాఖలలోని కొన్ని ఖాతాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు రూ.54 లక్షల జరిమానా విధించింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 13 కింద అక్టోబరు 1న యూనియన్ బ్యాంక్‌కు పెనాల్టీ నోటీసును జారీ చేసిన ఎఫ్ఐయూ బ్యాంక్ చేసిన రాతపూర్వక, మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్‌పై అభియోగాలు నిరూపితమైనవిగా గుర్తించింది.ఎఫ్ఐయూ ఈ మేరకు బ్యాంక్ కార్యకలాపాల సమగ్ర సమీక్ష చేపట్టబడింది. కేవైసీ/ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్)కి సంబంధించిన కొన్ని "వైఫల్యాలను" వెలికితీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై హిల్ రోడ్ బ్రాంచ్‌లో నిర్దిష్ట కరెంట్ ఖాతాలపై చేసిన స్వతంత్ర పరిశీలనలో ఒక ఎన్బీఎఫ్సీ దాని అనుబంధ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు వెల్లడైందని పబ్లిక్ ఆర్డర్ సారాంశంలో ఎఫ్ఐయూ పేర్కొంది. -
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్‌కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
Bengaluru: డీకే శివకుమార్‌పై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
బెంగళూరు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని డీకే శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ‘విధాన సౌధలోని తన ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసులా డీకే శివకుమార్ భావిస్తున్నారు. శనివారం(మార్చ్ 30) ఆయన తన విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే’ అని డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో డీకే శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకుని గట్టి సందేశం పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఈ సందర్భంగా సురేష్ కుమార్ కోరారు. ఇదీ చదవండి.. ఇండియా ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన -
టీడీపీ నేతల బరితెగింపు
ఉదయగిరి/గుడివాడ టౌన్/కడప సెవెన్‌రోడ్స్ /ఎర్రగుంట్ల/ జంగారెడ్డిగూడెం: టీడీపీ నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా అనుమతులు లేకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెళ్లి అభ్యంతరం తెలిపితే దాడులకు సైతం తెగపడుతున్నారు. ఎంపీడీవోపై దౌర్జన్యం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు ఆవరణలో బుధవారం సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అనుమతులు లేకుండా అనుచరులతో సమావేశం నిర్వహించారు. దుత్తలూరు ఎంపీడీవో కె.సురేష్‌బాబు సమావేశ ప్రాంతానికి వెళ్లి అనుమతులు తీసుకోనందున సమావేశం ఆపివేయాలని నేతలకు తెలిపారు. కానీ వారు పట్టించుకోకుండా సమావేశం కొనసాగించడంతో ఆ దృశ్యాలను తన సెల్లో ఎంపీడీవో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న టీడీపీ నేతలు, కొంతమంది కార్యకర్తలు ఎంపీడీవోపై దౌర్జన్యం చేస్తూ నానా దుర్భాషలాడుతూ సెల్ఫొన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అక్కడున్న కార్యకర్తలు కారును చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా కొందరు కార్యకర్తలకు సర్దిచెప్పి కారును అక్కడి నుంచి పంపించారు. ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చేజర్ల మల్లికార్జునపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రెండ్రోజుల క్రితం వింజమూరులోని కాకర్ల క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడానికి ప్రయత్నించిన అధికారులను కూడా అడ్డుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు అధికారులు ఆ ఫ్లెక్సీలు తొలగించారు. కడప టీడీపీ అభ్యర్థి అభ్యంతరకర పోస్టు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి, రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఆమె బుధవారం ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసును జారీ చేశామన్నారు. అనుమతులు లేకుండా టీడీపీ కార్యాలయం అనధికారికంగా ఓ భవనంలో టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో జంగారెడ్డిగూడెం ఎంపీడీవో, ఎంసీసీ నోడల్ అధికారి కేవీప్రసాద్ మున్సిపల్ కమిషనర్, ఎంసీసీ నోడల్ అధికారి నరేంద్రకుమార్, పోలీస్ సిబ్బంది, ప్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారి కేవీ రమణ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు అక్కడికి వచ్చేలోపే పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించారు. అక్కడికి చేరుకున్న అధికారులకు ఇది పార్టీ కార్యాలయం కాదని.. ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇల్లు అని, తమ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అనుమతులు లేకుండా ఎటువంటి పార్టీ కార్యకలాపాలు ఆ భవనంలో చేయకూడదని హెచ్చరించి అధికారులు వెనుతిరిగారు. కాగా, ఈనెల 16న దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజే సాయంత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికులను కార్యాలయానికి రప్పించి ప్రలోబాలకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల వీరంగంగుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను గురువారం తొలగించే ప్రయత్నం చేసిన మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ నాయకులు వీరంగం చేశారు. తాము అనుమతుల కోసం దరఖాస్తు చేశామని అవి వచ్చేవరకు తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ కార్యాలయంలో బ్యానర్లు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో గురువారం నాటికి కూడా టీడీపీ కార్యాలయంలో బ్యానర్లపై పేర్లు తొలగించలేదు. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీ పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం. టీడీపీ నేత వాహనం సీజ్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కారులో సామగ్రి కడప అర్బన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తిరుగుతున్న టీడీపీ నేత వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ వాహనాన్ని రెవెన్యూ, పోలీసు బృందం గురువారం సీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేసే క్రమంలో కడప డిప్యూటీ తహసీల్దార్ రోనాల్డ్ శామ్యూల్ ఆధ్వర్యంలో డబ్ల్యూఆర్డీ ఏఈ రమణ, హెడ్‌కానిస్టేబుల్ జె.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ ఎం.వి శేషారెడ్డి వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో స్కార్పియో వాహనం (ఏపీ39 క్యూఎఫ్ 3838) కోడ్‌కు విరుద్ధంగా ఉండటాన్ని గుర్తించారు. కారు వెనుక అద్దం మొత్తం ‘మన భూపేష్ అన్న మన జమ్మలమడుగు’ అని ఫొటో అతికించడంతో పాటు వాహనంలో పార్టీ కండువాలు, ప్లాస్టిక్ జెండా పైపులు, క్యాలెండర్లు, కరపత్రాలు ఉన్నాయి. దీంతో ఆ సామగ్రితో పాటు వాహనాన్ని అధికారుల బృందం స్వా«దీనం చేసుకుంది. దీనిపై కడప వన్‌టౌన్ సీఐ సి.భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు. -
24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్ కుమార్‌మీనా స్పష్టం చేశారు. -
ఈడీ ముందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు
ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ నేడు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఆగస్టులో జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని పలు ప్రదేశాలలో మూడు రోజుల పాటు ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్ ఆధారిత హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా వర్ధ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ తదితరులపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. వైభవ్ గెహ్లాట్‌తో వ్యాపారవేత్త రతన్ కాంత్ శర్మకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పరిణామాల అనంతరం వైభవ్ గహ్లోత్‌కు కూడా సమన్లు జారీ చేసింది. కాగా.. గతంలో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ కంపెనీలో వైభవ్ గెహ్లోత్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. రాజస్థాన్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైభవ్ గహ్లోత్‌పై ఈడీ దాడులు చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?
ఆధునిక కాలంలో యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు సుమారు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను తొలగించినట్లు తెలిసింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల (64 లక్షల కంటే ఎక్కువ) వీడియోలను తీసివేసింది. ఇదీ చదవండి: ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో (1.9 మిలియన్స్) మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో 654968, రష్యాలో 491933, బ్రెజిల్లో 449759 వీడియోలను తొలగించినట్లు సమాచారం. -
ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి జరిమానాలు కట్.. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆటకట్టు!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు బెంగళూరు పోలీసులు సూపర్ ఐడియా వేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనదారులకు వారి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను ఉపయోగించి జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అతివేగం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, వాహనం నడుపుతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? ఇక టూవీలర్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాటిని ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లకుండా నిషేధించారు. తాజాగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓవర్‌స్పీడ్‌కు కళ్లెం వేయడానికి వాహనాల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి ఆలోచనను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే జరిమానా వసూలు సులభతరంగా మారుతుంది. వాహనాలను మాన్యువల్‌గా ఆపి జరిమానాలు విధించే అవసరం ఉండదు. అయితే నేరుగా ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా ద్వారా జరిమానాలను వసూలు చేయడం అనేది ప్రధాన గోప్యతా సమస్యను లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల మొత్తం ఎన్హెచ్ఏఐకి వెళుతోందని, అలా కాకుండా ప్రభుత్వానికి జమ చేయాలనేది తమ ప్రణాళిక అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. -
శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కాదు.. కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు... -
స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి పొందండి... ‘ఇదేం బాలేదు’
న్యూఢిల్లీ: కొన్ని బీమా బ్రోకింగ్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడంపై పౌర సేవా సంస్థ ‘ప్రహర్’ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో పాలసీలను విక్రయించే కొన్ని నూతన తరం బీమా బ్రోకింగ్ కంపెనీలు.. కేవలం కొన్నేళ్ల పాటు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి మొత్తాన్ని పొందొచ్చంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో వివరించింది. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) గత ఆర్థిక ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పనితీరును పాలసీదారులకు వెల్లడించరాదని బీమా రంగ ప్రకటనల చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నట్టు గుర్తు చేసింది. అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా సంబంధిత బీమా బ్రోకింగ్ సంస్థలను ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ, బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)ను కోరింది. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) లేదంటే అలాంటి ప్రకటనలు బీమా పాలసీలను వక్రమార్గంలో విక్రయించడానికి దారితీస్తాయని, పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీబజార్, ఇన్సూర్‌దేఖో మార్గదర్శకాలను ఉల్లంఘంచినట్టు ప్రహర్ తన లేఖలో ప్రస్తావించింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. నియంత్రణ సంస్థలు ఏవైనా లోపాలను గుర్తిస్తే, వాటి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రకటించాయి. -
సెలెబ్రిటీలపై ఫిర్యాదుల వెల్లువ.. లిస్ట్‌లో ఎంఎస్ ధోనీ టాప్!
ముంబై: వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆయా ఉత్పత్తుల మంచీ, చెడుల గురించి మదింపు చేయడంలో చాలా మటుకు సెలబ్రిటీలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అడ్వర్టైజింగ్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఏఎస్సీఐ తెలిపింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! 2022 ఆర్థిక సంవత్సరంలో 55 ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలపై ఫిర్యాదులు రాగా గత ఆర్థిక సంవత్సరం ఇది ఏకంగా 803 శాతం పెరిగి 503 యాడ్లకు చేరింది. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెలబ్రిటీలు తాము నటించే యాడ్ల గురించి ముందస్తుగా మదింపు చేయాలి. కానీ ఏఎస్సీఐ పరిశీలించిన 97 శాతం కేసుల్లో సెలబ్రిటీలు ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఎంఎస్ ధోనీ టాప్ పది ఉల్లంఘనలతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సెలబ్రిటీల లిస్టులో అగ్రస్థానంలో ఉండగా, ఏడు ఉల్లంఘనలతో యాక్టర్ కమెడియన్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. గేమింగ్, క్లాసికల్ విద్య, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అత్యధికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వివిధ మీడియా ఫార్మాట్లలో ఏఎస్‌సీఐకి 8,951 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 7,928 కంప్లైంట్లను సమీక్షించింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
అమెజాన్ పేపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది. (చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో! ) -
రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నారా లోకేష్
సాక్షి, తిరుపతి: రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను నారా లోకేష్ ఉల్లంఘించారు. పార్టీ జెండాలను తొలగిస్తున్న వీఆర్వో, వీఆర్ఏ, డిప్యూటీ తహశీల్దార్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఐడీ కార్డులు చూపించాలంటూ అధికారులపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. సీఐ ఆరోహణరావును అసభ్య పదజాలంతో లోకేష్ దూషించారు. పాదయాత్రలో బయట నుంచి వచ్చిన గూండాలతో దౌర్జన్యానికి తెర తీశారు. కాగా, నారా లోకేశ్ బుధవారం కూడా బెదిరింపులకు దిగారు. ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ లోకేష్ నోరు పారేసుకున్నారు. చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ -
‘అది కుదరదు’.. గూగుల్‌కు ఊహించని ఎదురుదెబ్బ!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించిన కేసులో టెక్ దిగ్గజం గూగుల్‌కు ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో ఎదురుదెబ్బ తగిలింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించేందుకు ఎన్సీఎల్ఏటీ బుధవారం నిరాకరించింది. అలాగే జరిమానాలో 10 శాతాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అటు సీసీఐకి నోటీసులు ఇవ్వడంతో పాటు మధ్యంతర స్టేపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి దేశీయంగా గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలపై సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసేందుకు, తమకు కావాల్సిన సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పించాలని గతేడాది అక్టోబర్‌లో సూచించింది. సీసీఐ ఆదేశాలు జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, వీటిపై తక్షణం స్టే విధించాలంటూ ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించింది. భారతీయ యూజర్లు, డెవలపర్లు, తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్‌తో గణనీయంగా ప్రయోజనాలు చేకూరాయని, భారత్ డిజిటల్‌కు మారడంలో ఇది తోడ్పడిందని పిటిషన్లో వివరించింది. బుధవారం జరిగిన విచారణలో గూగుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. గూగుల్ గుత్తాధిపత్య దుర్వినియోగానికి పాల్పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ
సాక్షి, బెంగళూరు: ప్రజలు ఎవరైనా బైక్ మీద హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకుని వేలకు వేల జరిమానా విధించి బండిని సీజ్ చేస్తారు. కానీ చట్టాన్ని కాపాడే పోలీసులే అతిక్రమిస్తే.. ఏమిటిది? అని ఓ మహిళ నిలదీసిన ఘటన వైరల్ అయ్యింది. నగరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, అది కూడా ఇద్దరు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు. వీరిని గమనించిన ఒక మహిళ రూల్స్ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్ సమాధానమిచ్చారు. మీరు ఏం చేశారో చూసుకోండి, దయచేసి స్కూటీలో నుంచి దిగి హెల్మెట్ ధరించండి అని వారికి మహిళ హితబోధ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: (మతాంతర ప్రేమ పెళ్లి కలకలం) -
ఆటోమొబైల్ కంపెనీలపై సర్వే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ప్రతి రంగంలోనూ కంపెనీలు పాటించాల్సిన రూల్స్, చట్టాలు బోలెడు ఉంటాయి. సంస్థలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కార్యక్రమాలు జరపాలన్నా వీటిని తప్పక పాటించాలి. అయితే ప్రస్తుత దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ అంశం టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. చదవండి: ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
బాబోయ్ చలాన్ల బాదుడు.. అలా చేస్తే 2వేలు, 10వేల వరకు జరిమానా
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మోటారు వెహికల్ యాక్ట్‌లో తాజాగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జరిమానాల మోత మోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సాక్షి, చెన్నై: రాజధాని చెన్నై సహా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం సిటీ దాటేందుకే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనూ కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అనేక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారిని, త్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లే కుర్ర కారును, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారిని, బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారిని ఇకపై ఊపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఫలితంగా జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలు కూడా మరింత కఠినమయ్యాయి. ఇందుకు తగ్గట్లు చెన్నైలో అనేక మార్గాల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నేరగాళ్లను, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టనున్నారు. అమల్లోకి కొత్త జరిమానాలు.. ఇకపై అతివేగంగా వాహనం నడిపే వారికి తొలిసారి రూ. 1000, మళ్లీ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేల విధించనున్నారు. మానసికంగా, ఆరోగ్య రీత్యా సామర్థ్యం లేని వారు వాహనాలు నడిపితే తొలిసారి రూ. 1000, రెండోసారి రూ. 2 వేలు వసూలు చేస్తారు. అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వకుండా వ్యవహరించే వాహనదారులకు విధించి ఫైన్‌ను రూ. 10 వేలుకు పెంచారు. నిషేధిత ప్రాంతాల్లో హారన్ ఉపయోగిస్తే రూ. 1000, రిజిస్ట్రేషన్లు సక్రమంగా లేని వాహనాలకు తొలిసారి రూ. 2,500, తర్వాత రూ. 5,000 , అధిక పొగ వెలువడే వాహనాలకు రూ. 10 వేలు, బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారి నుంచి రూ. 10 వేల వరకు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి రూ. 1000, సిగ్నల్ దాటితే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకూ ఆ అధికారం.. ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇకపై లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ, ఆ పైస్థాయి అధికారుల కూడా వాహనాలు తనిఖీ చేసేందుకు, జరిమానా విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మోటారు వెహికల్ యాక్ట్‌లో మార్పులు చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులు మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు జరిమానా విధించే నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. -
ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్నాథ్ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ సాగే చార్ధామ్ యాత్ర సీజన్లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్నాథ్. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్ అనిల్ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్నాథ్ వంటిచోట్ల సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్ ప్రభుత్వ బాధ్యత. -
బ్రిక్వర్క్స్పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియాపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. సంస్థ లైసెన్సును రద్దు చేసింది. ఆరు నెలల్లోగా కార్యకలాపాలాన్నీ నిలిపివేయాలని ఆదేశించింది. కొత్తగా క్లయింట్లను తీసుకోరాదంటూ నిషేధం విధించింది. ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీపై సెబీ ఇంత తీవ్ర చర్యలు తీసుకోవడం బహుశా ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేటింగ్స్ ఇచ్చే క్రమంలో నిర్దేశిత ప్రక్రియలు పాటించడంలోనూ, మదింపు విషయంలో సరిగ్గా వ్యవహరించడంలోనూ బ్రిక్‌వర్క్ విఫలమైందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతే కాకుండా కంపెనీలకు తాను ఇచ్చిన రేటింగ్స్‌ను సమర్ధించుకునేందుకు అవసరమైన రికార్డులను భద్రపర్చుకోవడంలోనూ సంస్థ విఫలమైందని వ్యాఖ్యానించింది. ‘ఒక సీఆర్ఏగా బ్రిక్‌వర్క్ తన విధులను నిర్వర్తించడానికి సంబంధించి నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలోనూ, జాగ్రత్తలు తీసుకోవడంలోను విఫలమైంది. ఇన్వెస్టర్లకు భద్రత కల్పించడంతో పాటు క్రమబద్ధంగా సెక్యూరిటీల మార్కెట్లను అభివృద్ధి చేయాలన్న నిబంధనల లక్ష్యాలకు తూట్లు పొడించింది‘ అని సెబీ ఆక్షేపించింది. అనేక దఫాలుగా తనిఖీలు చేసి, దిద్దుబాటు చర్యలను సూచిస్తూ, జరిమానాలు విధిస్తూ ఉన్నప్పటికీ బ్రిక్‌వర్క్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదని పేర్కొంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ వ్యవస్థను కాపాడేందుకు నియంత్రణ సంస్థపరంగా కఠినమైన చర్యలు అవసరమని భావిస్తున్నాను‘ అని ఉత్తర్వుల్లో సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా పేర్కొన్నారు. పదే పదే ఉల్లంఘనలు .. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్, 2017 ఏప్రిల్–2018 సెప్టెంబర్ మధ్య బ్రిక్వర్క్లో సెబీ తనిఖీలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వాటిపై విడిగా విచారణ జరిపింది. ఆ తర్వాత 2020 జనవరిలో ఆర్బీఐతో కలిసి 2018 అక్టోబర్–2019 నవంబర్ మధ్యకాలానికి సంబంధించి బ్రిక్‌వర్క్ రికార్డులను తనిఖీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆర్బీఐతో కలిసి 2019 డిసెంబర్–2022 జనవరి మధ్య కాలానికి సంబంధించిన రికార్డులు, పత్రాలను తనిఖీ చేసింది. వీటన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా ఉల్లంఘనలు బైటపడ్డాయి. -
చైనా కంపెనీల సీఏలపై నియంత్రణ సంస్థల కన్ను
న్యూఢిల్లీ: నిర్దిష్ట చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు భారత్‌లో నమోదు చేసుకోవడంలో జరిగిన ఉల్లంఘనలపై నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకు సహకరించిన అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లకు చర్యలకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)కి కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి 400 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉల్లంఘనలకు పాల్పడిన సభ్యుల వివరాలను ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చిందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నాయి. దీంతో ఐసీఏఐ, ఐసీఎస్ఐలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా తమ తమ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. కంపెనీల చట్టం నిబంధనలను వారు ఉల్లంఘించారని నిర్ధారణ అయిన పక్షంలో వారిపై తగు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ తమకు 200 కేసుల వివరాలు వచ్చినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాషీస్ మిత్రా తెలిపారు. ఆయా సంస్థలు నిబంధనల ప్రకారమే రిజిస్టర్ అయ్యాయా, చిరునామాలను సరిగ్గానే ధృవీకరించుకున్నారా లేదా వంటి అంశాలు వీటిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఏఐలో 3.50 లక్షల మంది పైగా, ఐసీఎస్ఐలో 68,000 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్‌లో 90,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఈ మూడు సంస్థలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ఈ మేరకు ముంబై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ కంప్లయింట్ చేశాడు. ఉద్దవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. బుధవారం నాటి రాజకీయపరిణామాల అనంతరం రాత్రి.. ఆయన సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్ ప్రోటోకాల్స్‌ను ఉద్దవ్ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్ ఆరోపణ. ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. #WATCH Maharashtra CM Uddhav Thackeray greets hundreds of Shiv Sena supporters gathered outside his family home 'Matoshree' in Mumbai pic.twitter.com/XBG0uYqYXu — ANI (@ANI) June 22, 2022 -
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కస్టడీలో ఉన్న వ్యక్తిని చితకబాదిన పోలీసులు
లక్నో: పశువులను దొంగిలించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు చితకబాదారు. నేరం ఒప్పుకోవాలంటూ యువకుడిని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో నొప్పులు తాళలేక ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పశువులను దొంగిలించాడనే కోసులో బడాయున్ పోలీసులు రెహాన్ అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. దినసరి కూలీ అయిన రెహాన్‌ను మే 2న పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి, మిగతా పోలీసులు అతన్ని వేధింపులకు గురిచేశారు. కస్టడీలో లాఠీలతో కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు దెబ్బలతో ఒళ్లంతా పుండు అయిపోయింది. అంతటితో ఆగకుండాప్రేవేటు భాగాల్లో గాయాలయ్యేలా కొట్టారు. అయితే ఇదంతా బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు వెలుగులోనికి వచ్చింది. అయితే రెహాన్‌ను విడిచిపెట్టాలంటే పోలీసులు రూ.5 వేలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేగాక రూ. 100 ఇచ్చి చికిత్స చేసుకోవాలని చెప్పి అవమానపరిచారని పేర్కొన్నారు. చేసేదేం లేక అడిగినంత డబ్బులు ఇచ్చి తమ కొడుకుని ఇంటికి తీసుకొచ్చామని రెహాన్ తల్లిదండ్రులు వాపోయారు. రెహాన్‌ను తీవ్రంగా గాయపరిచారని, నడవలేక, మాట్లాడలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం ఈ దారుణం గురించి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు స్టేషన్ ఇంచార్జితో సహా అయిదుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురిని సస్పెండ్ చేశారు. కాగా రెహాన్ ప్రస్తుతం బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
18 లక్షల వాట్సాప్ అకౌంట్లపై వేటు!
నిబంధనలకు అతిక్రమిస్తున్న యూజర్లపై వాట్సాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సొంత మెకానిజం ద్వారా నిబంధనలు అతిక్రమిస్తున్న ఖాతాలపై వేటు వేస్తోంది. తాజాగా 2022 మార్చిలో 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఐటీ చట్టాల ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ గ్రీవెన్స్‌ను స్వీకరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాల్సి ఉంది. కాగా 2022 మార్చిలో ఏకంగా 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. అంతుకు ముందు ఫిబ్రవరిలో 14.26 లక్షల ఖాతాలపై కొరడా ఝులిపించింది. రెచ్చగొట్టేలా, విద్వేషాలు ఉసిగొల్పేలా, ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించే ఖాతాలపై నిఘా పెట్టామని వాట్సాప్ తెలిపింది. ఇటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. చదవండి: 23 ఏళ్లకే స్టార్టప్.. త్వరలో యూనికార్న్ హోదా.. ఇంతలో.. -
ఐదేళ్ల తర్వాత.. నార్త్ కొరియా అధ్యక్షుడి ఆనందతాండవం
ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడితే.. ఉత్తర కొరియా మాత్రం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. చివరికి తిండి దొరక్కపోవడంతో తినడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు ఆ దేశ నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక సందేశం ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన సంబురాల్లో మునిగిపోయాడు. చిందులేశాడు. అందుకు కారణం జనాల సంతోషం ఏమాత్రం కాదు. ఆర్థిక సంక్షోభం ఏమాత్రం పట్టన్నట్లు.. ఉత్తర కొరియా ఈమధ్యకాలంలో వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళలోనూ.. నార్త్ కొరియా మాత్రం తన ఆయుధ సంపత్తికి మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిందని, అందుకే కిమ్ అంత సంతోషంగా ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఒక ప్రకటన వెలువరించగా.. జపాన్ సైతం ఈ మిస్సైల్ టెస్ట్‌ను నిర్ధారించింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందో అనే సమాచారం లేదు. కానీ, సదరు ఖండాతర క్షిపణి సుమారు 1,100 కిలోమీటర్లు, గంటకు పైగా ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయిందని తెలుస్తోంది. ఈ క్షిపణి ప్రయోగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత ఉత్తర కొరియా ఇప్పుడే ప్రయోగించింది. అది సక్సెస్ కావడంతోనే కిమ్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మునుపెన్నడూ చూడని జోష్‌తో ఆయన అంతా కలియదిరిగారట. పైగా ఈ నెల 16వ తేదీన ఉత్తర కొరియా ఒక భారీ క్షిపణిని ప్రయోగించగా, అది రాజధాని ప్యాంగ్ యాంగ్ గగనతలంలోనే పేలిపోయి తునాతునకలైంది. ఈ ఫెయిల్యూర్‌ను అధిగమించేలా.. ప్రస్తుత క్షిపణి సక్సెస్ కావడంతో అధికార వర్గాలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. కిమ్ మాట తప్పాడు లాంగ్ రేంజి మిస్సైళ్లను పరీక్షంచబోమని, అణు పరీక్షలు జరపబోమని 2018లో కిమ్ జాంగ్ ఉన్ మారటోరియం విధించుకున్నారు. అయితే అది 2020లో పటాపంచలైంది. మారటోరియంను తాము ఎక్కువకాలం అమలు చేయలేమని స్పష్టం చేసిన ఉత్తరకొరియా అధినేత మళ్లీ అమెరికాకు, ప్రపంచదేశాలకు సవాళ్లు విసరడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి నిషేధిత జాబితాలో ఉందని, తద్వారా కిమ్ జోంగ్-ఉన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను తప్పాడని విమర్శిస్తోంది దక్షిణ కొరియా. ఇంతకు మించే.. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా హాసంగ్-14 లాంగ్ రేంజి క్షిపణులను రూపొందించింది. ఇవి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. వీటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కానీ, ఈ తరహా భూతల క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే ఇంతకు మించిన రాక్షస మిస్సైల్‌ను 2017లోనే ఉత్తర కొరియా ప్రయోగించింది. సుమారు 13,000 కిలోమీటర్లకు పైగా రేంజ్లో ప్రయాణించగల ఆ మిస్సైల్స్ గనుక ప్రయోగిస్తే గురి తప్పకుండా అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్థ్యం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
సీఎం కోడ్ ఉల్లంఘన? ఆయన భార్య ఏమన్నారంటే..
పోలింగ్ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలు తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన భార్య వెనకేసుకొచ్చిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి తన నియోజకవర్గం ఖతిమాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వేయడానికి వెళ్లిన టైంలో.. బీజేపీ కాషాయపు కండువాలు మెడలో ధరించి ఉన్నారు. అంతేకాదు దుస్తులపై కమలం గుర్తులు కూడా ఉన్నాయి. అనంతరం ఓటు వేశాక.. వాళ్లు గుర్తులను ప్రదర్శించడం ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం.. మాన్యువల్ పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, మరేదైనా ప్రచార సామగ్రిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రదర్శించకూడదు. కానీ, పుష్కర్, ఆయన భార్య పార్టీ కండువాలు, గుర్తులు ధరించడమే కాదూ.. కార్యకర్తలతో పోలింగ్ టైంలోనూ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై పుష్కర్ భార్య గీతను ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా.. ‘ఇది ప్రచారం అని ఎవరన్నారు?. ప్రతీ ఎన్నికల్లోలాగే.. ఈసారి ఎంత ఓటింగ్ నమోదు అవుతుందో చూడడానికే వచ్చాం. ప్రతీ పార్టీకి చెందిన వాళ్లూ ఇలా పార్టీ సింబల్స్‌ను ధరించే ఉన్నారు. అయినా ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధమై వస్తారు. ఇలాంటివి వాళ్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? అని బదులిచ్చారు ఆమె. మరోవైపు ఆ సమయంలో బీజేపీ హడావిడి తప్ప అక్కడేం కనిపించలేదు. అయినా పోలింగ్ సిబ్బంది, ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసులు వాళ్లను అడ్డుకోలేదన్న పలువురు ఓట్లర్లు చెప్పడం గమనార్హం. खटीमा में ये क्या हो रहा है?@pushkardhami चुनाव प्रचार खत्म होने के बाद खुलेआम पैसे बाँट रहे हैं। खटीमा से आम आदमी पार्टी के प्रत्याशी @sskaleraap ने खुद धामी को रंगे हाथों पकड़ा तो धामी ने कैमेरा बंद कराने की कोशिश की।@ECISVEEP व @UttarakhandCEO जल्द इसका संज्ञान लें। pic.twitter.com/oLpuKV7UkX — Aam Aadmi Party Uttarakhand (@AAPUttarakhand) February 13, 2022 ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల ప్రచారం పేరిట డబ్బులు పంచారంటూ ఆప్ ఏకంగా ఉత్తరాఖండ్ సీఎంపైనే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆప్ యూనిట్ ట్విటర్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేయగా...ఈసీ చర్యలేవంటూ? పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. -
సుందర్ పిచాయ్‌పై పోలీస్ కేసు
Police Complaint Against Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై బుధవారం పోలీస్ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీరైట్ యాక్ట్ వయొలేషన్ కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్ ఓనర్ కంపెనీ అయిన ‘గూగుల్’ ప్రతినిధుల పేర్లతో(సుందర్ పిచాయ్ ఇతరులు) ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్ చెప్తున్నారు. ఇల్లీగల్ అప్లోడింగ్ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా 2017లో రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా ప్రమోట్ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అదొక బీ గ్రేడ్ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే. -
ఏపీలో పలు థియేటర్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. -
బండి అమ్మేసినా.. ఆ చలాన్లు కట్టడానికి సరిపోదేమో..
సాక్షి, గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఒకే ద్విచక్ర వాహనంపై ఒకటికాదు రెండుకాదు ఏకంగా.. 117 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం సదరు వాహనాన్ని అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హోండా యాక్టివా(ఏసీ09ఏయూ1727)నంబర్ యాక్టివాను ఆపి తనిఖీ చేశారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 117 చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అవాక్కయ్యారు. హెల్మెట్,మాస్క్, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్ చేశారు. -
మానవహక్కులు–భాష్యాలు
మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్‌లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్‌లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే. ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్‌లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు మానవహక్కుల చట్టం సెక్షన్ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ పని చేసింది. సెక్షన్ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. -
సెకండ్ డోస్‌లో వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: పండుగలు, శుభకార్యాల పేరుతో జనం సాధారణ జీవనంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ వెళ్లిపోయిందన్న భ్రమలో ఉండిపోయారు. దీంతో కరోనా జాగ్రత్తలను చాలామంది పక్కనపెట్టేశారు. మాస్క్‌లను ధరించడానికి అయిష్టత చూపుతున్నారు. భౌతికదూరం మరిచిపోయారు. కరోనా థర్డ్‌వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్నిచోట్ల సాగదీత ధోరణిలో కొనసాగుతోంది. మొదటి డోస్ వేసుకున్నవారితో పోలిస్తే, రెండో డోస్ వేసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. నారాయణపేటలో సెకండ్ డోస్ 14 శాతమే... తెలంగాణలో ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 110 శాతం ( ఇతర రాష్ట్రాలవారితో కలిపి) జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్ టీకా పొందారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు. ఇంత తక్కువ శాతం మొదటి డోస్ టీకా వేశారంటే అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 46 శాతం, నాగర్‌కర్నూలు 50 శాతం మంది అర్హులు టీకా పొందినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలావుంటే సెకండ్ డోస్ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్ డోస్ తీసుకున్నవారు హైదరాబాద్‌లో 51శాతం ఉండగా, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా14 శాతమే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 19 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. చదవండి: బీసీ కులాలవారీగా జనగణన -
నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు
పట్నా: బిహర్లో ఒక వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జెహనాబాద్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా.. రోడ్డు మధ్యలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు వాహనాన్ని తీసేయాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి మరీ దాడి చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతడిని వారించారు. ఆ తర్వాత నిందితుడు బైక్‌ను రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాం కేసు: డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
ఒక్క మాస్క్‌తో రూ.7.5 కోట్లు వసూళ్లు
గురుగ్రామ్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్‌ఫోన్ లేకున్నా పర్లేదు కానీ మాస్క్ మాత్రం తప్పనిసరి. మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే కొందరు నిర్లక్ష్యంతో మాస్క్‌లు ధరించడం లేదు. వారి నిర్లక్ష్యం వారి కుటుంబంతో పాటు సమాజంలో మరికొందరికి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మాస్క్ విధిగా ధరించాలనే నిబంధన అమల్లో ఉంది. ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాస్క్ ధరించకుండా ఉల్లంఘించిన వారికి బుద్ధి వచ్చేలా పలు వింత శిక్షలు విధించారు. అయితే తాజాగా గురుగ్రామ్ ఒక్క ఏడాదిన్నరలోనే రూ.ఏడున్నర కోట్ల ఆదాయం ఒక్క మాస్క్ ద్వారానే చేకూరింది. కరోనా మొదటి దశ వ్యాప్తి నుంచి భౌతిక దూరంతో పాటు శానిటైజర్ వాడకం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం మనం చేస్తున్నాం. అయితే కొందరి నష్టంతో రెండో దశ తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే హరియాణా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో మాస్క్ లేని వారికి పెద్ద ఎత్తున జరిమానా విధించడం మొదలుపెట్టారు. గతేడాది జనవరి 23వ తేదీన మొదలుపెట్టిన జరిమానాలు ఇప్పటివరకు కొనసాగుతోంది. ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఈ ఏడాదిన్నర వ్యవధిలో మాస్క్ లేకుండా తిరిగిన వారు లక్షన్నర మందికిపైగా ఉన్నారని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కేకే రావు తెలిపారు. మాస్క్ ధరించకపోవడంతో రూ.500 జరిమానా విధించారు. ఈ జరిమానాలతో ఏకంగా రూ.7.5 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఇంత ఆదాయం వచ్చిందంటే ఎంతలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారికంగా ఇంతమంది ప్రజలను గుర్తించామంటే తమకు తెలియకుండా ఎంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారో అని పోలీసులు పేర్కొంటున్నారు. ఎంతమందికి అని జరిమానాలు వేస్తాం.. ప్రజలకు స్పృహ.. బాధ్యత అనేది ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క గురుగ్రామ్‌లోనే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే అర కోటి మందికి పైగా మాస్క్ లేకుండా తిరిగి ఉండవచ్చు అని నిఘా వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని.. కరోనాను పారదోలేందుకు కృషి చేయాలని ప్రజలకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. -
High Court: మండపాల వద్ద జనం గుమిగూడకుండా చూడాలి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాగా, వినాయక చవితి ఉత్సవాల్లో జనం ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా.. వీలైనంత త్వరగా మండపాల వద్ద పాటించాల్సిన ఆంక్షలు, మార్గదర్శకాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపింది. థర్డ్‌వేవ్ ప్రభావం నేపథ్యంలో... వైరస్‌ను ఎదుర్కొనేందుకు కచ్ఛితమైన ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. -
Corona Virus: పెరుగుతున్నకొత్త కేసులు..
సాక్షి, కరీంనగర్: కరోనా మహమ్మారి నిన్నమొన్నటి వరకు తగ్గినట్లే తగ్గి మరోమారి ఆందోళనలో పడేస్తోంది. ప్రజలు కరోనాను మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నా ఇదంతా తాత్కాలికమే అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని సంబరపడే లోపే థర్డ్ వేవ్ ఆనవాళ్లు అప్పుడే కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు మరో మారు ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగవచ్చని వైద్యారోగ్యశాఖ నిపుణులు హెచ్చరిన్నారు. జిల్లాలో థర్డ్‌వేవ్ ప్రమాదం కనిపించకపోయినప్పటికీ రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కరోనా ముప్పు తొలగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూలై నెల మొదటి వారం నుంచి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టగా మళ్లీ విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు ఇష్టానుసారంగా తిరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, అంత్యక్రియలు, బోనాలు తదితర కార్యక్రమాలకు వెళ్తుండడం, మాస్కులు ధరించకపోవడం వంటి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తగ్గిన కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్బజార్లు, జ్యూవెల్లరీ, వస్త్ర దుకాణాలు, కిరాణ దుకాణాల వద్ద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా తిరగడం వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. నిర్ధారణ పరీక్షల పెంపుతో.. జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంపుతో కేసుల సంఖ్య బయటపడుతోంది. జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో అరకొరగా ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేయగా నిర్ధారణ పరీక్షల కోసం జనం రెండు మూడు రోజులపాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎక్కడికక్కడ నిర్ధారణ పరీక్షలు పెంచారు. అవసరమైతే కేసులు ఎక్కువ ఉన్న చోట క్షేత్రస్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేస్తూ పాజిటివ్లను గుర్తిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. స్వీయ నియంత్రణ కరువు కరోనా ప్రారంభంలో ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ వ్యాప్తిని కొంత మేర అడ్డుకున్నారు. సెకండ్‌వేవ్ ప్రారంభంలో కూడా నియంత్రణ చర్యలు పాటించగా.. కరోనా తగ్గిందనే భావనతో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సాధారణ రోజుల మాదిరిగానే వ్యవహరిస్తుండడంతో కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. టెస్టులు చేయించుకోవాలి.. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒకే జ్వరం వచ్చి తగ్గిందనే నిర్లక్ష్యంగా ఉండకుండా కరోనా టెస్టు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌లో ఉండి ఇతరులకు పాజిటివ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ జువేరియా, డీఎంహెచ్‌వో -
Covid Fourth Wave: ఫ్రాన్స్‌లో కఠిన ఆంక్షలు..
పారిస్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ సెకండ్‌వేవ్, థర్డ్వేవ్ల బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. వైరస్ ఉధృతిమాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా, ఫ్రాన్స్‌లో వైరస్ నాలుగవ దశ ప్రారంభమైందని ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించాలనుకునే వారు తప్పకుండా కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అదే విధంగా, కరోనా నెగెటివ్ రిపోర్టు కూడా నివేదించాలని అట్టల్ పేర్కొన్నారు. టీకాలను ప్రజలందరు వేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆగస్టు ఆరంభం నుంచి, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించడానికి, రైళ్లలో ప్రయాణించడానికి హెల్త్‌పాస్ ను తప్పినిసరిచేస్తున్నట్లు తెలిపారు. టీకా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే హెల్త్‌పాస్‌ను జారీచేస్తారని ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు. ఈ సందర్భంగా, టీకావేగాన్ని పెంచాలని.. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నామని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా, హెల్త్‌పాస్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానతోపాటు జైలు శిక్షను కూడా విధిస్తామని జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మంగళవారానికి గాను 18,000 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
బస్సులో యువకుల హంగామా.. మాస్క్‌లేకుండా.. ఉమ్ముతూ..
బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన, కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్‌ను చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్ గేట్ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్‌ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్ వారిని మాస్క్ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. -
పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజె క్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా లేదా.. అనే అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం నివేదిక కోరింది. ఈ మేరకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టులో పర్యా వరణ ఉల్లంఘనలు జరిగాయని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ విచారించింది. ఉదండా పూర్ రిజర్వాయర్ కోసం 16 కిలోమీటర్ల అడ్డుకట్ట (బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతు న్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మా ణంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. కాగా, 2016లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడితే ఇప్పుడు కేసు వేయడం నిర్ధేశిత లిమిటే షన్ సమయానికి విరుద్ధమని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు ధర్మాసనానికి నివేదించారు. అయితే పిటిషనర్.. ప్రాజెక్టును సవాలు చేయడం లేదని, పర్యావరణ ఉల్లంఘనలపై కేసు దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ విచారణ చేపడతా మని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా అసి స్టెంట్ డైరెక్టర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసిం ది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరి గాయో.. లేవో.. తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆగస్టు 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. -
మాజీ ప్రియుడిపై ప్రతీకారం, పక్కా ప్లాన్.. అందుకు 50 సార్లు..
ప్రేమలో ఉన్నప్పుడు బంగారం, బుజ్జి, బేబీ అని ముద్దుగా పిలుచుకునే ప్రేమికులు అదే వారి బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తన మాజీ ప్రియుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం ఆమె.. అతని కారుని అతడికే తెలియకుండా అద్దెకు తీసుకుంది. ఆ కారుతో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు 2 రోజుల్లోని 50 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. దీని కారణంగా అతను భారీగా ఫైన్లు కట్టలాని ప్లాన్ వేసింది. కాకపోతే ఈ తరహా ఉల్లంఘన వింతగా ఉండడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో సులువుగానే స్థానిక పోలీసులు ఆ కారును గుర్తించారు. చివరకు అసలు విషయం బయటపడడంతో పాటు ఆ యువతిని అరెస్ట్ చేశారు. పాపం ఆ యువతి ప్లాన్ అయితే వేసింది గానీ చివర్లో అది ఫైయిల్ కావడమే గాకా కటకటాలపాలైంది. -
మాస్క్ లేదా అన్నందుకు.. అంగీ, ప్యాంటు విప్పి.. ఆపై
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వాలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలన్న నియమాలను తప్పనిసరిచేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ఒక యువకుడు మాస్క్ వేసుకోమన్నందుకు వింత చేష్టలతో అక్కడి వారిని ఇబ్బందులకు గురిచేశాడు. కాగా, మాస్క్ లేదా అని పాలికె మార్షల్స్ అడగడంతో ఓ యువకుడు అంగీ, ప్యాంటు విప్పి గలాటా చేశాడు. కే.ఆర్.మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. టీ ఫ్లాస్క్ పట్టుకొని వ్యాపారం చేసే యువకుడు మాస్క్ వేసుకోలేదు. మాస్క్ లేదా, జరిమానా కట్టు అని మార్షల్స్ గద్దించడంతో అతడు వెంటనే షర్ట్, ప్యాంట్ విప్పివేసి అర్ధనగ్నంగా నిలబడ్డాడు. బిత్తరపోయిన మార్షల్స్ అతన్ని పంపించివేశారు. ఎవ్వరూ మాస్క్‌లు వేసుకోవద్దు, ఏం చేస్తారో చూస్తామని యువకుడు చెప్పడం గమనార్హం. -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు.. ఇద్దరిపై కేసు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన ఇద్దరిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి పోస్టింగ్‌లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలు సింగ్ హిందీలో, మహ్మద్ కలీం ఉర్దులో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్ ఆడర్ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. -
వివాహ వేడుకలో ఎంపీ డ్యాన్స్.. వివాదం.. వైరల్
జైపూర్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీంతో, ఇప్పటికీ అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తేసినా.. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించాయి. అయితే, కరోనా కాలంలో జరిగిన చాలా వివాహాలు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా నిబంధనలను పాటించాలని చెప్పాల్సిన నాయకులే ప్రస్తుతం ఈ నియమాలను ఉల్లంఘించి వివాదస్పదమవుతున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో జరిగిన ఒక వివాహవేడుకలో పాల్గోన్నఒక ఎంపీ, ఎమ్మెల్యే కోవిడ్ నిబంధనలను అతిక్రమించి వార్తల్లో నిలిచారు. వివరాలు.. సవాయు మాధోపూర్ జిల్లాలోని బదిలా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ఎంపీ కిరోడీలాల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఇందిరా మీనా హజరయ్యారు. ఈ క్రమంలో, పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన బరాత్‌లో బంధువులతో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే, దీంట్లో ఎంపీ మాస్క్ వేసుకున్నప్పటికీ.. ఆయన చుట్టు ఉన్న కొంత మంది మాస్క్ ధరించలేదు. ఈ వేడుకలో.. సామాజిక దూరం కూడా పాటించలేదు. దీంతో ఈ సంఘటన కాస్త వివాదస్పదమయ్యింది. కాగా, ప్రజలకు మంచి చెప్పాల్సిన నాయకులే కోవిడ్ నిబంధనలు పాటించకుంటే.. సామాన్య ప్రజలు ఇంకేం చేప్తారని.. ప్రతిపక్షాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్ కిషోర్ -
డీజే బంద్ చేయమన్నందుకు పోలీసులపైనే దాడి..
సాక్షి, డిండి(నల్లగొండ) : ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్‌ను బంద్ చేయాలని చెప్పినందుకు పలువురు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మండలంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చెర్కుపల్లి సమీపంలోనున్న గ్రామాలకు పోలీసులు పర్యవేక్షణకు వెళ్తున్న క్రమంలో డీప్‌కట్ సమీపంలోకి వెళ్లగానే డీజే సాంగ్స్, కేరింతలు వినిపించాయి. బురాన్‌పూర్‌తండాకు చెందిన కట్రావత్ శ్రీకాంత్ వివాహ వేడుకల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను డీజే సౌండ్ బాక్స్, ఆంప్లిఫైర్‌ను పోలీసు వాహనంలో వేశారు. దీంతో ఆగ్రహించిన మూడావత్ మల్లేష్, మూడావత్ బాలు, కాట్రావత్ భాస్కర్‌మూడావత్ జగన్, వడ్త్య రాము, కట్రావత్ బుజ్జి పోలీసులపై దాడికి దిగారు. పోలీసు వాహనం ధ్వంసం కావడంతోపాటు పీఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. మంగళవారం డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ.శోభన్‌బాబు, పోలీసులు బురాన్‌పూర్‌కు చేరుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు వారిని నల్లగొండకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: వాహనదారులకు చుక్కలే, మరోసారి పెరిగిన పెట్రోల్ ధర -
Telangana: రద్దీ ఎప్పటిలాగే..
సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. వ్యాపారులకు ఊరట లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. భౌతికదూరం మరిచారు ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
Sri Lanka: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్
కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా వెల్లడించారు. మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
Lockdown: ఐదు నిమిషాలు ఆలస్యం.. రూ.వెయ్యి ఫైన్!
సాక్షి, భువనగిరి: అయిదు నిమిషాలు ఆలస్యం కావడంతో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద ఓ యువకుడికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. దీంతో తనకు అన్యాయంగా పోలీసులు అన్యాయంగా జరిమానా విధించారని శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆర్బీనగర్కు చెందిన నరేశ్ హైదరాబాద్ నుంచి భువనగిరికి వచ్చాడు. ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరిట రూ.వెయ్యి జరిమానా విధించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైతే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాక్డౌన్ ఉల్లంఘన కింద రూ.1000 జరిమానాతో పాటు రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు 341, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. చదవండి: గుండెపోటుతో కుప్పకూలిన వధువు; శవాన్ని పక్కనే ఉంచి.. చెల్లెలితో పెళ్లి -
బయటకొస్తే బైకు మాకు.. పువ్వు మీకు
సాక్షి, బెంగళూరు (బనశంకరి): కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లోనూ బెంగళూరు ప్రజలు మామూలుగానే సంచరిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రోజూ ఉదయం 10 గంటల అనంతరం నగర ప్రముఖ రోడ్లలో బ్యారికేడ్లు అమర్చి తనిఖీ చేయడం, అకారణంగా బయటకు వచ్చారని తేలితే వాహనం సీజ్ చేసి జరిమానా, కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల లాక్డౌన్ ఉల్లంఘనులకు బస్కీలు, గుంజీలు తీయడం, లాఠీలతో పోలీసులు పాఠం చెబుతుంటే కొన్నిచోట్ల మర్యాదగా బైక్ సీజ్ చేయడం జరుగుతోంది. బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగేవారికి గులాబీ పువ్వు అందించి బైక్ స్వాధీనం చేసుకుంటున్నారు. జరిమానాల వల్ల సర్కారుకు రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఫైన్లపై పలుచోట్ల ప్రజలు– పోలీసులతో గొడవలకు దిగడం వల్ల ఉద్రిక్తతలూ చోటు చేసుకుంటున్నాయి. మాగడిరోడ్డు, నాగరబావి, మైసూరురోడ్డు, యశవంతపుర, హెబ్బాల, తుమకూరురోడ్డు, శివాజీనగర, శాంతినగర, కార్పొరేషన్ సర్కిల్, కేఆర్.మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వాహనాల సంచారం అధికంగా ఉంటోంది. ఏదో కారణంతో బయటకు.. యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు సడలింపు ఉంటోంది. ఆ తరువాత కూడా రద్దీ తగ్గడం లేదు. ఎక్కువమంది మెడికల్ షాపులు, వ్యాక్సినేషన్ అనే కారణాలు చెబుతున్నారు. లేదా.. కరోనా టెస్టుకు, ఆసుపత్రికి, వంటగ్యాస్ తీసుకురావడానికి వెళుతున్నాము అని చెబుతారు. అయినప్పటికీ పోలీసులు వాహనాల సీజ్ చేస్తుండడంతో వాహనదారులు లబోదిబోమనడం పరిపాటైంది. 31 వేల వాహనాలు సీజ్.. ఇప్పటివరకు నగర పరిధిలో 31,515 వాహనాలను జప్తుచేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇందులో బైకులు 25,658, ఆటోలు 1,308, కార్లు తదితరాలు 1,549 ఉన్నాయి. చదవండి: చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు -
పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు
భోఫాల్: లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని జరిగింది. వివరాల ప్రకారం.. ఉమరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను రావడాన్ని గమనించి చాలామంది పారిపోయారు గానీ అందులో 17 మంది మాత్రం దొరికిపోయారు. ఇక పోలీసులకు దొరికిన వారికి శిక్షగా నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు పూర్తి అయ్యే వరకు ఇటువంటి ఉల్లంఘన చేయకూడదని వాళ్లని హెచ్చరించి వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌వీడియోలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు In Bhind "Baaratis" were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021 -
Lockdown Violation in Hyderabad: వీళ్లింతేనా.. మారరా..?
లాక్డౌన్ సడలింపు సమయం దాటాక పౌరులెవరూ బయటకు రావొద్దని ఇటు పోలీసులు, అటు అధికారులు ఎంతగా మొత్తుకుని చెబుతున్నా మనోళ్లు మారడం లేదు. ఓ వైపు జరిమానాలు విధిస్తూ.. ఎక్కడిక్కడ అడ్డుకుంటూ పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నా చాలా మంది వాహనదారులు ఉదయం 10 గంటల తర్వాత కూడా బయట తిరుగుతూనే ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జనంలో మార్పు రావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ లాక్డౌన్ సడలింపు సమయం ముగిశాక ముషీరాబాద్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు చదవండి: ఓ వైపు దండం.. మరోవైపు దండన! బండెనక బండి.. ధాన్యం లెండి -
‘రిజర్వేషన్’ తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రివ్యూ పిటిషన్‌పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్లో కోరింది. -
సెకండ్ వేవ్ కల్లోలం: బయట తిరుగుతున్న పాజిటివ్ వ్యక్తులు..
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వైరస్ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. మరణాల రేటు సైతం పెరుగుతోంది. కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించకపోవడంతోనే దీనికి కారణమని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. కోవిడ్ బారిన పడకుండా కనీస నిబంధనలు పాటించకపోవడం, లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడం, కోవిడ్ నిర్ధారణ అయినా స్వీయ నిర్బంధ నియమాలను నిర్లక్ష్యం చేయడం కోవిడ్ కేసులు పెరగడానికి కారణమవుతోంది. పరీక్షలకు మొగ్గుచూపని ప్రజానీకం... జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల్లాంటి లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాసన తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం లాంటి తీవ్ర లక్షణాలు కనిపించినప్పుడే కోవిడ్‌గా అనుమానించి పరీక్షలకు వెళ్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు, ఎలాంటి లక్షణాలు లేని వారిలోనూ ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ అవుతోంది. అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోనివారు, వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే రెండు వారాల పాటు ఎక్కడికీ వెళ్లే అవకాశం ఉండదని, ఉపాధి పోతుందని, ఎవరూ దగ్గరకు రారని, ఇతర వ్యక్తిగత కారణాలతో చాలా మంది పరీక్షలకు ముందుకు రావడం లేదు. బయటకు వస్తున్న పాజిటివ్ వ్యక్తులు... లక్షణాలు ఉన్నవారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులకు పరీక్షల కోసం వెళ్తున్నారు. కోవిడ్ ఉందని నిర్ధారణ అయితే అక్కడే వైద్యులు అందించే ఐసోలేషన్ కిట్‌ను తీసుకుని బస్సుల్లోనో.. ఆటోల్లో ఇంటికి వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరే సమయంలో కలిసిన వారందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉన్నా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వాహనాలపై ఒంటరిగా వచ్చిన వారు అదే వాహనంపై ఒంటరిగా తిరిగి వెళ్తున్నారు. బస్సుల్లో, ఆటోల్లో వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరకూ వారికి వ్యాధి సోకిందనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఇంటి వద్దే రక్షణ.. కోవిడ్ బారిన పడిన వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులను సైతం కలవకూడదు. కానీ అయిదారు రోజులు ఇంట్లో గడిపి లక్షణాలు తగ్గగానే బయటకు తిరుగుతున్నారు. కానీ కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తర్వాత కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ వస్తేనే బయట తిరగాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని విస్తృత ప్రచారం చేసినా కనీసం పట్టించుకోడం లేదు. సమూహాల్లో కలిసి, ఎక్కువ సమయం గడిపి తిరిగి వచ్చిన వారిలోనే పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో అసలు కర్ఫ్యూ ఉందా? ఓ యువతి ట్వీట్
సాక్షి, బంజారాహిల్స్: ఎమ్మెల్యే కాలనీ వీధి నంబర్.4తో పాటు స్థానికంగా రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, కర్ఫ్యూ అమలులో ఉందా.. లేదా.. అంటూ రుహి రిజ్వి అనే యువతి హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే కాలనీలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు చూస్తున్నామని ఇదెక్కడి కర్ఫ్యూ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. కాగా, ఇప్పటికే అనేక చోట్ల కోవిడ్ నిబంధనలు ప్రజలు సరిగ్గా పాటించడంలేదు. ఇందుకే కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. -
ఊపిరిపీల్చుకున్న లంక
శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా ఆ దేశంకంటే మనకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం రివాజుగా మారింది. ఈసారి కూడా అదే అయింది. శ్రీలంక తీరును నిరసిస్తూ బ్రిటన్ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన తీర్మానానికి 47మంది సభ్య దేశాలుండే మండలిలో మంగళవారం రాత్రి ఓటింగ్ జరిగింది. తీర్మానాన్ని 22 దేశాలు సమర్థించగా, 11 దేశాలు వ్యతిరేకించాయి. 25 ఓట్లతో తీర్మానం గెలిచివుంటే లంకకు సమస్యలెదురయ్యేవి. కానీ భారత్‌తోపాటు 14 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. తీర్మానం గెలిచితీరాలని బ్రిటన్, దాని మిత్ర దేశాలు శతవిధాల ప్రయత్నించగా, ఇది వీగిపోవాలని శ్రీలంక బలంగా కోరుకుంది. ఏ స్థాయిలో అంటే... లంక ప్రధాని మహిందా రాజపక్స కరోనా భయాన్ని కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్ సందర్శించి ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆ దేశ ప్రధాని హసీనాను కోరారు. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)ను లంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స సంప్రదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా గోతబయ మాట్లాడారు. తమిళ టైగర్లను అణిచే పేరిట మహిందా రాజపక్స ప్రభుత్వం 2009–10 మధ్య నరమేథం సాగించింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతోపాటు ఆ సంస్థలోని వారందరినీ మట్టుబెట్టింది. ఆ నరమేథంలో 40,000మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ తేల్చినా...వాస్తవానికి లక్షకు మించి ప్రాణనష్టం జరిగిందని అనధికార గణాంకాలు చెబుతున్నాయి. ఎల్టీటీఈ మహిళా విభాగం కార్యకర్తలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు జరిగాయని, సజీవంగా దహనం చేసిన ఘటనలు కూడా వున్నాయని ఆరోపణలొచ్చాయి. లక్షలాది తమిళ కుటుంబాలు ప్రాణభయంతో వలస బాటపట్టాయి. ఇందుకు బాధ్యులెవరో గుర్తించి శిక్షించాలని కోరినా శ్రీలంక పెడచెవిన పెట్టడంతో మానవ హక్కుల మండలి పదే పదే ఆ దేశాన్ని అభిశంసిస్తోంది. 2009 మొదలుకొని ఇప్పటివరకూ 8 దఫాలు తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలపై ఓటింగ్ జరిగిన ప్రతిసారీ ఒకే మాదిరి ఫలితం వుంటుంది. చైనా, పాకిస్తాన్, రష్యాలు వాటిని వ్యతిరేకిస్తాయి. లంక సార్వభౌమత్వాన్ని ఈ తీర్మానాలు దెబ్బతీస్తాయని, వీటి వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆ దేశాలు ఆరోపిస్తాయి. సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానంపై రాజకీయ పక్షాలు స్పందిస్తాయి. విమర్శించటమో, సమర్థించటమో చేస్తాయి. రాష్ట్రాలు దాని జోలికిపోవు. కానీ శ్రీలంక విషయంలో తమిళనాడు స్పందిస్తుంది. అక్కడున్న తమిళులకు ఏం జరిగినా తల్లడిల్లుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని, ఆ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అది మరింత చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఎవరో కాదు...బీజేపీ మిత్ర పక్షమైన అన్నాడీఎంకే ఆ తీర్మానాన్ని సమర్థించాలని కోరింది. డీఎంకే, ఇతర తమిళ పక్షాలు సైతం ఈ రకమైన డిమాండే చేశాయి. లంక తమిళుల ప్రయోజనాలు కాపాడతామన్న హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ జీరో అవర్‌లో కూడా అన్నా డీఎంకే విజ్ఞప్తి చేసింది. కానీ అందుకు భిన్నంగా మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరు కావటంతో తాజా ఎన్నికల్లో అది చర్చనీయాంశమవుతుంది. ఆ సంగతెలావున్నా శ్రీలంక విషయంలో దూకుడుగా పోరాదని మొదటినుంచీ మన దేశం భావిస్తోంది. 2009–13 మధ్య మూడు సందర్భాల్లో ఓటింగ్ జరగ్గా, ఆ మూడుసార్లూ మన దేశం లంక వ్యతిరేక తీర్మానాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో యూపీఏలో భాగస్వామిగా వున్న డీఎంకే పట్టుబట్టేది. అది తప్పుకుంటే ప్రభుత్వానికి సమస్యలెదురవుతాయన్న భయంతో చివరివరకూ ఊగిసలాడి, చివరకు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. 2014లో ఎన్డీఏ సర్కారు వచ్చాక మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు మన దేశం గైర్హాజరైంది. అటుపై మూడుసార్లు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేంద్రం ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి కావాలన్న శ్రీలంక తమిళులను సమర్థిస్తున్నామని... అదే సమయంలో లంక సమైక్యత, సుస్థిరత, దాని ప్రాదేశిక సమగ్రత కోరుకుంటున్నామని మన దేశం తెలిపింది. ఈ రెండింటినీ పరిగణించే ఓటింగ్‌కు దూరంగా వున్నట్టు వివరించింది. అయితే మన పొరుగు దేశంగా వున్న లంకతో లౌక్యంగా వ్యవహరించకతప్పదన్న ఆలోచనే తాజా నిర్ణయానికి కారణమని చెప్పాలి. ఇప్పటికే రాజపక్స సోదరుల ఏలుబడిలో లంక చైనాకు దగ్గరైంది. మన దేశం ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. అక్కడ చైనా పలుకుబడి మరింత పెరగటం భద్రత కోణంలో కూడా మంచిది కాదన్న అభిప్రాయం మన ప్రభుత్వానికుంది. తమిళుల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగ సవరణలను అమలు చేయాలని, లంక ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు జరిపి అధికారాలు వికేంద్రీకరించాలని మన దేశం కోరుతోంది. ఆ విషయంలో లంక సర్కారు అనుకూలంగానే వున్న సూచనలు వచ్చాయి. హక్కుల మండలి వంటి సంస్థల పాక్షిక ధోరణులపై విమర్శలున్నా నరమేథంపై ఇన్నేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్టున్న లంక తీరు కూడా సమంజసం కాదు. అంతిమంగా అక్కడి తమిళులకు న్యాయం జరిగేలా, వారు ప్రశాంతంగా జీవనం సాగించేలా రాజపక్స ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
సర్పంచ్ ఒకరు.. అనుమతులిచ్చేది మరొకరు
సాక్షి, కాటారం: సర్పంచ్ల అమాయకత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ఆసరగా చేసుకుంటున్నారు. ప్రజల ఓట్లతో గెలిచింది ఒకరైతే.. పాలన మాత్రం వారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే కొనసాగుతున్నదని అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధి పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల కంటే వారి పతులు, కూమారులదే పెత్తనం కొనసాగుతోంది. గ్రామపంచాయతీ పాలనా పరమైన.. అలాగే ఎలాంటి అనుమతులైనా వారి నుంచి రావాల్సిదే. మండలంలోని ఓ గ్రామపంచాయతీ నుంచి మరో ప్రాంతానికి దుక్కిటెద్దులు తీసుకెళ్లడానికి ఆ జీపీ సర్పంచ్ కుమారుడు ఇచ్చిన అనుమతి పత్రం వివాదాస్పదంగా మారింది. దుక్కిటెద్దులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ కార్యదర్శికి మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ సదరు సర్పంచ్ కుమారుడు నిబంధనలను తుంగలో తొక్కి సర్పంచ్, గ్రామపంచాయతీ పేరిట ఉండే లెటర్ ప్యాడ్‌పై అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా సర్పంచ్‌కు బదులుగా సర్పంచ్ కుమారుడే తన సంతకం చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇలా సర్పంచ్‌లను పక్కన పెట్టి కుటుంబ సభ్యులు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డిని “సాక్షి’ వివరణ కోరగా అనుమతి ఇచ్చే అధికారం సర్పంచ్‌కు ఉండదన్నారు. గ్రామపంచాయతీకి లెటర్ ప్యాడ్ లాంటివి ఉండవని, సర్పంచ్ పేరితో ఇచ్చిన అనుమతి లేఖతో జీపీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. -
మే నుంచే మోహరింపు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ ప్రెస్మీట్లో తేల్చిచెప్పారు. ‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. భారత్ పైనే బాధ్యత గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్‌పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు
సాక్షి, కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా షాపులను తెరిచిన దుకాణదారులు, ఇతర వ్యక్తులపై 28 కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై 800 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి అపరాధ రుసుములు విధించడంతో పాటు, 13 వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.8,160 నగదు, లిక్కర్ బాటిళ్లు, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లైసెన్సుల ‘లొల్లి’
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో రాష్ట్రంలోని 30 వైన్ (ఏ4) షాపుల లైసెన్సుల రద్దు అంశం చర్చనీయాంశం అవుతోంది. లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవొద్దన్న ప్రభుత్వ నిబంధనలను పాటించని కారణంగా ఈ షాపులపై కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతుంటే, తమపై కక్ష సాధింపు ధోరణితోనే అధికారులు తమ లైసెన్సులు రద్దు చేశారని లైసెన్సీలు వాపోతున్నారు. కరోనా ప్రత్యేక సెస్‌పై వడ్డీ చెల్లింపును సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళ్లిన కారణంగానే ఎలాంటి తప్పు చేయకుండానే తమ లైసెన్సులు రద్దు చేయించారని, దీనిపైనా న్యాయ పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు. అసలేం జరిగింది? ఈ ఏడాది మార్చి 22 నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులను ప్రభుత్వం మూయించి వేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి మే 6 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు మూసేశారు. మే 6న మళ్లీ నిబంధనలు సడలించి మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే సమయంలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. కరోనా ప్రత్యేక సెస్ పేరుతో 16 శాతం మేర ధరలను సవరించింది. ఈ మేరకు పెంచిన ధరలకు మద్యం అమ్మాలని లైసెన్సీలను నిర్దేశించింది. అయితే, మే 6కు ముందు రోజు ఎక్సైజ్ యంత్రాంగం రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులను జల్లెడ పట్టింది. షాపులను మూసివేసే ముందు రోజు వరకు షాపుల్లో ఉన్న సరుకు వివరాలను స్టాక్ రిజిస్టర్ ద్వారా తెలుసుకుంది. మే 6న షాపులు తెరిచిన తర్వాత గతంలో ఉన్న స్టాకును కూడా పెరిగిన ధరలకు అమ్ముతున్నందున పెరిగిన ధరల మేరకు ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు కరోనా సెస్ చెల్లించాలని అంతర్గతంగా ఉత్తర్వులిచ్చింది. దీంతో కొందరు వైన్స్ యజమానులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సెస్ చెల్లించగా, మరికొందరు చెల్లించలేదు. దీంతో ఈ ఫీజును వసూలు చేయాలనే ఆలోచనతో ప్రత్యేక సెస్ సకాలంలో చెల్లించని పక్షంలో వడ్డీతో పాటు వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని 21 మంది వైన్స్ యజమానులు హైకోర్టులో సవాల్ చేశారు. లాక్డౌన్ సమయంలో షాపులు తెరవక, వ్యాపారం నడపక తాము ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక సెస్ చెల్లించాలని, అందుకు వడ్డీ చెల్లించాలని కోరడం భావ్యం కాదని, ఆ ఉత్తర్వులను నిలిపేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు 4 వారాల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయడానికి వీల్లేదని, తమ తుది తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు తమపై కక్ష తీర్చుకునేందుకు లైసెన్సులు రద్దు చేశారని కోర్టుకెళ్లిన 21 మంది లైసెన్సీలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం వారి వాదనను కొట్టిపారేస్తున్నారు. కోర్టుకు వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, కోర్టు వారి పిటిషన్‌పై స్టే ఇవ్వలేదని, న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే కోర్టుకు ఏం చెప్పాలో, ఎందుకు సెస్ వసూలు చేయాల్సి వచ్చిందో చెబుతామని అంటున్నారు. ఆ 21 మందిపైనే చర్యలు తీసుకోలేదని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మరో 9 మందిని కూడా గుర్తించి, ఎక్సైజ్ రూల్స్ ప్రకారం చట్టానికి అనుగుణంగా నడుచుకున్నామని పేర్కొంటున్నారు. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సాయంత్రం(గురువారం) నుంచి నేటి సాయంత్రం(శుక్రవారం) ఆరు గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 929 కేసులు నమోదు చేశామని తెలిపారు. 8 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 54 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ.3,34,355 అపరాధ రుసుం విధించామని పేర్కొన్నారు. కచ్చితంగా లాక్డౌన్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని.. ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. (రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న) -
మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..!
సాక్షి, హైదరాబాద్: మాస్క్ లేకుండా అడుగు బయటపెట్టాలంటే ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిని ఇట్టే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాజధానిలోని మూడు కమిషనరేట్లలో మాస్క్ వైలేషన్ ఎన్ఫోర్స్మెంట్ (ఎఫ్‌ఎంవీఈ) అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని, అవి లేకుండా బయటకు వస్తే రూ.1,000 జరిమానా అని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ సాంకేతికత సాయంతో చర్యలు చేపట్టింది. మరో మూడు రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎఫ్‌ఎంవీఐ అందుబాటులోకి రానుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో మార్పులు వివిధ నేరాలకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన పాత నేరస్తుల్ని నగరంలో పట్టుకోవడానికి రూపొందించిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)లో పోలీసు విభాగం సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పుచేర్పులు చేస్తోంది. రాజధానిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లోని ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థతో కూడిన సర్వర్‌కు అనుసంధానించి ఉన్నాయి. ఇందులో 2012 నుంచి రాష్ట్రంలో అరెస్టయిన నేరగాళ్లలో కరుడుగట్టిన వారిని ఎంపిక చేసి 50వేల మంది ఫొటోలతో ఏర్పాటు చేసిన డేటాబేస్‌ను నిక్షిప్తం చేశారు. వీరిలో ఎవరైనా ఆ కెమెరాల ముందుకు వస్తే తక్షణమే సీసీసీలోని సిబ్బందిని ఎఫ్ఆర్ఎస్ అప్రమత్తం చేస్తుంది. వెంటనే ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో గుర్తించి, ఆ విషయాన్ని సమీపంలోని క్షేత్రస్థాయి పోలీసులకు చేరవేస్తుంది. ఇలా రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటివరకు దాదాపు 150 మంది నేరగాళ్లు పట్టుబడ్డారు. ఏ ప్రాంతంలో ఉన్నారో చూసి.. దేశంలోని మరే ఇతర కమిషనరేట్‌లోనూ లేని ఈ ఎఫ్ఆర్ఎస్ పరిజ్ఞానాన్ని ఇప్పుడు కరోనా నిరోధానికి అనువుగా మార్చి వాడుతున్నారు. ఎఫ్‌ఎంవీఈ పేరుతో రూపొందే ఈ సాఫ్ట్వేర్ సైతం సీసీసీలోని సర్వర్‌లో నిక్షిప్తం అవుతోంది. ఫలితంగా నగరంలో కాలినడకన సంచరించే, వివిధ క్యూలైన్లలో నిల్చునే ఏ వారిలో ఎవరైనా ఫేస్‌మాస్క్ ధరించకపోతే ఆ విషయాన్ని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా ఎఫ్‌ఎంవీఐ గుర్తించి, కంట్రోల్ రూమ్ సిబ్బందికి సమాచారం ఇస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసులకు చేరవేసి వారు ఈ ఉల్లంఘనులున్న ప్రాంతానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఎఫ్‌ఎంవీఈ పరిజ్ఞానం గరిష్టంగా మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. ‘వాహనంపై వెళ్తున్న వాళ్ళు, పాదచారులు ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండరు. వీరు మాస్క్ ధరించలేదనే విషయం ఎఫ్‌ఎంవీఈ గుర్తించినా.. దానిపై క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అందించి అక్కడకు పంపేలోపు వారు వేరే చోటుకు వెళ్లిపోవచ్చు. అయితే దుకాణాల వద్ద, ఇతర సంస్థల వద్ద క్యూలో ఉన్న వారిపై మాత్రం కచ్చితంగా చర్య తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో భౌతిక దూరం పాటించకుండా క్యూల్లో ఉన్న వారినీ గుర్తించే విధంగా ఈ టెక్నాలజీలో మార్పుచేర్పులు చేయాలని భావిస్తున్నాం’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
నిమిషానికి 5 వేల ప్రకటనలు తొలగించాం
సాక్షి, న్యూఢిల్లీ: 2019లో మొత్తం 270 కోట్ల (2.7 బిలియన్లు) తప్పుడు ప్రకటనలను నిషేధించామని సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. తమ నిబంధనలు ఉల్లంఘించిన తప్పుడు ప్రకటనలను (నిమిషానికి 5,000 పై చిలుకు) తొలగించడం లేదా బ్లాక్ చేసినట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అలాగే దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ 1.2 మిలియన్లకు పైగా ఖాతాలను రద్దు చేసింది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన 21 మిలియన్ వెబ్ పేజీల నుండి ప్రకటనలను తొలగించినట్టు వెల్లడించింది. ఇటీవల వెల్లడించిన 'గూగుల్: బాడ్ యాడ్స్ రిపోర్ట్' లో ఈ వివరాలను గూగుల్ పొందుపర్చింది. యూజర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఫేస్ మాస్క్‌లు, నివారణ మందులు వంటి వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. అలాగే అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019 లో 35 మిలియన్లకు పైగా ఫిషింగ్ ప్రకటనలను తొలగించాం. 19 మిలియన్ల ట్రిక్-టు-క్లిక్ ప్రకటనలు తొలగించాం. ఈ బెడద సుమారు 50 శాతం తగ్గిందని పేర్కొంది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటినుంచి ఈ వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారం, ప్రకటనలతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించే ప్రకటనలు, ప్రకటనకర్తలపై ఓ కన్నేసి ఉంచినట్లు వివరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ టీమ్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తోందని గూగుల్ పేర్కొంది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించే ప్రకటనకర్తల ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్పెన్సర్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు. ‘కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు గూగుల్‌ను ప్రజలు విశ్వసిస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. కరోనా సమయంలో కూడా దాన్ని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. -
అసలు సమస్య ఆ 6%
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఉల్లంఘనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో ప్రజలు నూటికి నూరు పాళ్లు సహకరిస్తుంటే.. పట్టణాల్లో మాత్రం లాక్డౌన్ ఆశయాన్ని నీరుగార్చేలా.. పోలీసుల ప్రయత్నాలను అపహాస్యం చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్ ఎంతకాలం కొనసాగించాలి? అన్న అంశంపై ఆన్లైన్లో తెలంగాణ పోలీసులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. అందులో లాక్‌డౌన్‌ను సమర్థిస్తూ దాదాపుగా 94 శాతం మంది మద్దతు తెలిపారు. కానీ, కేవలం 6 శాతం మంది మాత్రం లాక్డౌన్ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అన్న విషయాలపై అస్సలు తమకు ఐడియానే లేదని సమాధానమిచ్చారు. వీరితోనే అసలు సమస్య అని పోలీసులు పేర్కొంటున్నారు. వీరికి కనీసం లాక్డౌన్ సమయాలపై కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. అందుకే, ఇష్టానుసారంగా వేళాపాళా లేకుండా బయటికి వస్తున్నారు. వీరు వైరస్ క్యారియర్లుగా మారితే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముం దని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. వీరే ప్రమాదం.. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న వారిలో జిల్లాల వాసులు, గ్రామీణులు ముందున్నా.. నగరాలు, పట్టణాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ పోకడలు గ్రేటర్ పరిధిలో మరీ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన లక్షకుపైగా వాహనాలు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కావడం విశేషం. వీరికి నిబంధనల పట్ల ఏమాత్రం లెక్కలేదన్న విషయం దీనితో తేటతెల్లమవుతోంది. ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే కావడం గమనార్హం. ఉల్లంఘనల శాతం జిల్లాల్లో 30 శాతంగా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం 50 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాతబస్తీలో లాక్డౌన్ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. లాక్డౌన్ అంటే అస్సలు ఐడియాలేని వారిలో ఇక్కడే అధికంగా ఉన్నారు. ఈ ఆరుశాతం మంది కరోనా వైరస్‌ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట సడలింపుతో.. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. కానీ, ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది భౌతికదూరాన్ని పాటించడం లేదు. అసలే కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ మొదటిస్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుంటే.. ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అసలు లాక్డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇసుక తరలిస్తే ఖబడ్దార్
సాక్షి, కర్నూలు: ప్రభుత్వం తాత్కాలికంగా ఇసుక తరలింపును నిలిపివేసిందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. బుధవారం ఆయన వెల్దుర్తి , కృష్ణగిరి పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్ఐలు పులిశేఖర్, విజయభాస్కర్‌లకు సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. అసాంఘిక చర్యలు అరికట్టేందుకు తన ఆధ్వర్యంలో క్రైం పార్టీని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా ప్రజలు తమకు సమాచారం ఇస్తే, క్రైం పార్టీ ఆధ్వర్యంలో వెంటనే చర్యలకు దిగుతామన్నారు. వెల్దుర్తి హైవేలో గత నెల జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని, బాధితులకు నష్టపరిహారం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలు ప్రభుత్వానికి పంపామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రయాణికులకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన పోలీసులను బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. భార్య, భర్తలిద్దరూ ఉద్యోగులైతే మెడికల్ గ్రౌండ్ కింద వారికి మరో అవకాశమివ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు ఎస్పీ తెలిపారు. బాధితులమైన తమపైనే కేసు బనాయించారని గత నెల 23న చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుడు మంగంపల్లె హరిచంద్రుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. మరమ్మతులు, నిర్మాణాలకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయన వెంట డోన్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఉన్నారు. -
‘గురి’తప్పినందుకే గురివింద నీతి
తాను పదవినుంచి దిగిపోతాననే భావన ఏపీ సీఎం చంద్రబాబులో రోజు రోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇష్టులైన అధికారులను తెచ్చుకోవడం, ఈసీపై దాడులకు ముందే సిద్ధం కావడం, ప్రభుత్వ డబ్బును ఎన్నికల తరుణంలో పంచేయడం.. ఇవేవీ పనిచేయకపోవడంతో చంద్రబాబు విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో బట్టబయలవుతున్న అన్ని అరిష్టాలకూ మలివిడత ఎన్నికల సంస్కరణలే పరిష్కారమా? ‘ఆరిపోయే దీపానికి వెలుగులెక్కువ, ఆపద్దర్మ ముఖ్యమంత్రికి అరుపులెక్కువ’ఇదొక కొత్త పేరడీ! సామాజిక మాధ్యమాల విస్తృతి, ప్రభావం వల్ల వ్యక్తుల సృజన, వ్యక్తీకరణ సామర్థ్యాలూ పెరిగాయి. అందుకు కొత్తగా పుట్టుకొచ్చే ఇటువంటి పేరడీ సామెతలే నిదర్శనం. ఇది వినగానే చాలామందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడే గుర్తుకు వస్తారు. ఎందుకంటే, పలు విషయాల్లో ఆయ నిప్పుడు పెద్ద గొంతుతో అరుస్తున్నారు. కానీ, ఆయన ఆపద్దర్మ ముఖ్య మంత్రి కాదు. పూర్తిస్థాయి ముఖ్యమంత్రే! కాకపోతే, ఎన్నికల కోడ్ ఆమల్లో ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం చేయకూడని పనులన్నీ చేసే స్తున్నారు. వాటిని యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైగా నెపాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)పై నెడుతున్నారు. తాను దిగిపోయే ముఖ్యమంత్రినని ఇతరుల కన్నా ఈయనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే, ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిన’ని ఒకమారు, ‘..రేపు ఫలితాలొచ్చాక కూడా జగన్మోహన్రెడ్డి లోటస్‌పాండ్ నుంచే పాలన సాగిస్తారా?’ అని మరో మారు... ఇలా మాట్లాడటం అంటే, తెలియకుండానే తన మనోభావాల్ని వెల్లడించడమే! తన ఓటమిని అంగీకరించడమే! దిగిపోతాననే భావన లోలోపల రోజురోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందో ళనకు, గగుర్పాటుకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆయనేదో చాణక్యం చేస్తారని కొద్దో గొప్పో విశ్వాసమున్న వారి నమ్మకమూ క్రమంగా సడలిపోతోంది. ‘ఏమిటీ! ఈయన ఇలా తయారయ్యారు..?’ అని వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఆయనలో నైపుణ్యాల కన్నా వ్యవహార దక్షత ఎక్కువని భావించే వారు మాత్రం, ‘ఇప్పుడేమిటి? ఆయనెప్పుడూ అంతే!’ అని పెదవి విరు స్తున్నారు. వారి వాదనకు, తన తాజా చర్యల ద్వారా చంద్రబాబు మరింత బలం చేకూరుస్తున్నారు. ఎవరి వాదనెలా ఉన్నా.. ఈ ఎన్నికల ప్రకటనకు ముందు, తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులకు జుగుప్స కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు. చాలా నిబంధనలు కాగితాలకే పరిమిత మౌతున్నాయి. ఎటు చూసినా ఉల్లంఘనలే! ఉన్న నిబంధనల పటిష్ట అమలుతోపాటు మరో విడత ఎన్నికల సంస్కరణల అవసరం కొట్టొ చ్చినట్టు కనిపిస్తోంది. వీటిని మరో దశకు తీసుకువెళ్లాల్సి ఉంది. మలి విడత ఎన్నికల సంస్కరణ ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపాదనల్ని ఓ సమగ్ర ఎజెండా రూపంలో 2004 జూలైలో నే నాటి ఎన్నికల సంఘం ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. పోలింగ్‌కు ముందే ఓటమి జాడ పసిగట్టారు ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న అల్లరంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల పైన, ఈసీపైన. ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. సంక్షేమ పథకాలకు మెరుగులు దిద్దడమైనా, వాటి నీడలో నగదు బదిలీ అయినా, అందుకు సరిపడేలా శాఖాపరమైన ఆర్థిక సర్దుబాట్లయినా... వ్యూహాత్మకంగా చేసు కున్నవే. ఎన్నికల ప్రకటనకు కొద్ది కాలం ముందే, తమ అభీష్టం ప్రకారం జిల్లాల కలెక్టర్లను నియమించుకున్నారు. మూడు సంవత్సరాలకు పైబడి ఒకే చోట ఉన్న కొందరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చారే తప్ప ఎన్నికల విధులకు దూరం చేయలేదు. 175 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులనూ, ‘చెబితే వింటార’నే అనుకూలురినే నియ మించు కున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపుల మేరకే జాబి తా రూపొందింది. మరో వైపు సాంకేతిక పూర్వ రంగాన్నీ సిద్ధ్దం చేసు కున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమని, చేసి చూపిస్తామని దేశ మంతా ప్రచారం చేసిన వేమూరి హరిప్రసాద్ చౌదరి అనే నిపుణుడి సేవ ల్ని చాలా ముందుగానే ఖరారు చేసుకున్నారు. అంటే, ‘దొంగకు తాళా లిచ్చార’నే సామెత చందంగా ఆయనకు ప్రభుత్వ ఐటీ సలహాదారుగా స్థానం కల్పించారు. కలెక్టర్ల సమావేశంలోనూ కూర్చోబెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లా కలెక్టరుతో ఆయన నేరుగా సంభాషించడం, ఈవీఎం పనితీరుపై ఫిర్యాదు, కలెక్టరు వివరణ, ‘ఈసీ’ ప్రస్తా్తవనే లేకుండా... కావాలంటే ఈవీఎం మారుస్తాననడం ఇదే ధృవపరుస్తోంది. ఇక్కడే ఏదో వ్యూహం జరిగింది. తమ లోపాయికారి వ్యవహారాల్ని నిఘా విభాగం ఉన్నతాధికారి కనుసన్నల్లో గోప్యంగా జరిపించుకోవచ్చని మరో పక్క పథకం వేశారు. కానీ, పరిస్థితులు వికటించి ఎన్నికల సంఘం కొన్ని బదిలీలు జరిపేసరికి ఉక్రోషం తారాస్థాయికి చేరింది. కోడ్ అమల్లోకి వచ్చిననాటి నుంచి పాలనా వ్యవస్థ మొత్తం ఈసీ ప్రత్యక్ష అజమాయిషీలోకి వస్తుందని అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీ ఆదేశాలు బేఖాతరంటూ, సీఎం చెప్పినట్టే నడు చుకున్నారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఇంత జరిగినా ఆయన్ని బదిలీ చేయొద్దన్నది బాబు వాదన. ఏ బదిలీలూ చేయొద్దం టారాయన. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని రాష్ట్రంలోని ముఖ్య ఎన్నికల అధికారి అమలు చేయొద్దంటూ ఆయన్నే గదమాయించారు. నా సంగతి చూపిస్తానని టీవీ కెమెరాల ముందే బెదిరించారు. మీ వ్యూహం వికటిస్తే... ఈసీపై ధుమధుమలా? ఎన్నికల అధికారుల నియామకాల నుంచి కింది స్థాయి సిబ్బందిని సమ కూర్చడం వరకు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏ పోలింగ్ కేంద్రానికి ఏ ఈవీఎం వెళ్లాలన్నదీ ప్రణాళిక రూపొందించినట్టు సమా చారం! వందల సంఖ్యలో ప్రభుత్వ అధికారుల్ని రిజర్వులో పెట్టి, ఆశా వర్కర్లతో, ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బందితో ఎన్నికల పనులు చేయి ంచాలని ఎవరు నిర్ణయించారు? బెంగళూరు నుంచి వచ్చిన వందల మంది సాంకేతిక సిబ్బంది సహకారాన్ని, ఈవీఎంలు మొరాయించిన చోట ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైచిలుకు ఈవీఎంలు(మొత్తం 92 వేలకు గాను) మొరాయిస్తే, మూడో వంతు పనిచేయలేదనే ప్రచారం ప్రారంభించారు. అనుకూల మీడియా దానికి ‘తందానా’ అంది. తానూ, ఈ తందానా బ్యాచ్ కలిసి పోలింగ్ శాతాల్ని రమారమి తగ్గించేందుకు విశ్వయత్నం చేశారు. ఇంకోవైపు నోరుపెంచి, ఇదంతా ఈసీ వైఫల్యమన్నారు. నానా యాగీ చేశారు. ‘... షామియానాలు లేవు, మంచినీళ్లు లేవు, తెల్లవార్లూ పోలింగ్ జరిపారు...’ ఇలా నోటికొచ్చిన విమర్శలు చేశారు. ఎన్నికల సంఘానికి తమ కార్యాలయం బయట ఒక బంట్రోతు కూడా ఉండరు. మరెలా? తగు ఆదేశాలు, అజమాయిషీతో వారు పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. వారి ఆదేశాల్ని అమలుపరుస్తూ, ఎన్నికల ప్రక్రియను నిర్వహించవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే! స్థూలంగా ఈసీ ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ యంత్రాంగమే పనులు నిర్వహించాలి. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం, ప్రక్రియ ప్రారంభంలోనే, తాను స్వచ్ఛందంగా తప్పుకొని రాష్ట్రపతి పాలన కోరిన పెద్దమనిషేం కాదు ఈ ముఖ్యమంత్రి! ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిని’ అని ఇప్పటికీ బల్ల గుద్ది చెబుతున్నారు. వద్దంటే శాఖల వారీ సమీక్షలు జరుపుతున్నారు. పెద్ద మొత్తంలో పాత బిల్లులు ఆమోదిస్తున్నారు. మరి, ఎన్నికల నిర్వహణ వైఫల్యాన్ని ఎవరికి అంటగట్టాలని చూస్తున్నారు? ఈ వైఫల్యాలూ ముందస్తు పథకం ప్రకారమే జరిగాయా? అనుమానం సహజం. ఎందుకంటే, ప్రభుత్వ పెద్దలకు అధికారులపై పట్టున్న కొన్ని జిల్లాల్లోనే ఈ వైఫల్యాలు తలెత్తాయి. ‘ఈసీ వైఫల్యమని ఎత్తిచూపే ఎజెండా నేను భుజానికెత్తుకున్నాను, కనుక, మీరెవరూ ఈసీకి సహకరించకండి’ అని మాటవినే యంత్రాంగానికి ముందే ప్రభుత్వ పెద్ద ‘సైగ’ చేశారేమో? మూడు వందల పై చిలుకు ఈవీఎంలు మొరాయిస్తే, అందులో మూడింట రెండొంతుల ఈవీఎంలు ఒకటి రెండు గంటల్లోనే సర్దుకున్నాయి. ఉదయం ఎక్కువ జాప్యం జరిగిన చోట సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అలా సాయంత్రం పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 131 బూత్‌లలో జరిగితే, మూడు జిల్లాల్లోనే (కృష్ణా–37, గుంటూరు–21, ప్రకాశం–25) 83 చోట్ల జరిగిందంటే అనుమానం రాదా? ఈసీ ఏర్పాటు చేసిన ‘ఈవీఎం చాలెంజ్’ సమయంలోనూ కిమ్మనని వారు, వ్యూహం బెడిసికొట్టినందుకే వాటిపై ‘ట్యాంపరింగ్’ అల్లరి పెంచినట్టు స్పష్టమౌతోంది. ఈసీ కోరలు ఇంకా పదునెక్కాలి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే నిబంధనల్ని ఉల్లంఘించినా చర్యలు లేని పరిస్థితి నెలకొంది. పది రూపాయలు ఖర్చు పెడదామంటే ఐటీ దాడులు చేపిస్తున్నారు... అందుకే నేనొక ప్లాన్ చేశా, ప్రభుత్వ పథ కాల డబ్బులే ఇటు మళ్లించి మీకందేలా చేస్తున్నాను, మొన్న ఆ పథకం కింద అంతిచ్చాను, ఇంకో పథకం కింది ఇంత ఇప్పించాను. రేపు మరో పథకం కింద మరింత రాబోతోంది. శుబ్బరంగా ఖర్చు పెట్టేస్తున్నాను, అందుకే, తమ్ముళ్లూ నాకే ఓటేయండి... ఇదీ వరస! ఇది ఓటర్లను ప్రలో భ పెట్టడం కాదా? అదీ సొంత డబ్బుతో కాదు, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో! ప్రజాధనాన్ని విచ్ఛల విడిగా ఓట్లు దండుకునేందుకు వెచ్చి స్తున్నానని ఒక పాలకుడు ఇంత పచ్చిగా అంగీకరించడం బహుశా... ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాల్లోనూ ఉండదేమో! వీటన్నిటికీ విరు గుడు మలి విడత ఎన్నికల సంస్కరణలే! ఎన్నికల్లో పాలకపక్షాల అధి కార దుర్వినియోగాల్ని అడ్డుకోవాలి. ఎన్నికల ప్రకటనతోనే దేశంలో, రాష్ట్రాల్లో అప్పటివరకున్న ప్రభుత్వాలు తప్పించి రాష్ట్రపతి పాలన తేవాలి. పాలక–విపక్షాల మధ్య క్షేత్ర సమస్థితి నెలకొల్పాలి. విచ్చలవిడి డబ్బు వ్యయం, మద్యం ఖర్చును ఇంకేవైనా పటిష్ట చర్యల ద్వారా అరి కట్టాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాన్నీ సవరించాలి. ‘నియోజకవర్గ అభివృద్ధి్ద’ సాకుతో పార్టీలు మారి, ‘అధికారం’ చంకన చేరే ప్రజాప్రతినిధుల సభ్య త్వాలు రద్దయ్యే సంస్కరణలు రావాలి. పార్టీ మార్పిళ్ల నియంత్రణ చట్టాన్ని సవరించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర పతి–గవర్నర్లకో, ఎన్నికల సంఘానికో అప్పగించాలి. అంతే తప్ప, స్పీకర్ పదవి ప్రతిష్టను మంటగలిపే ఫక్తు రాజకీయ తాబేదారుల చేతుల్లో పెట్టొద్దు. గత ఎన్నికల్లో గెలవడానికి 11 కోట్లు ఖర్చుపెట్టానని బహిరంగంగా ప్రకటించినా చర్యలు లేకుంటే, వారు తర్వాతి ఎన్నికల్లో బూత్ రిగ్గింగులకైనా తలపడతారన్నదే ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. పాఠం నేరిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్ష! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఎన్నికల కోడ్‌ను ‘పీఎంవో’నే ఉల్లంఘిస్తే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కేంద్ర పాలిత ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, సంస్కతి, స్థానిక హీరోలు, ఆర్థిక, మతపరమైన ప్రాముఖ్య అంశాలు, అక్కడ పండే ప్రధాన పంటలు, ముఖ్య పరిశ్రమల తదితర వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించండి’ అంటూ ‘నీతి ఆయోగ్’కు చెందిన పింకీ కపూర్ అనే అధికారి ఏప్రిల్ 8వ తేదీన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్‌కు, ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఈ మెయిల్ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్యటన నేపథ్యంలో ఆయన ఈ మెయిల్‌ను పంపారు. అంటే ప్రధాని ఎన్నికల ప్రసంగంలో ప్రస్తావించేందుకు ఈ వివరాలు అడిగినట్లు సులభంగానే అర్థం అవుతోంది. అంతకుముందు ‘నీతి ఆయోగ్’ నుంచి బీజేపీ పాలిత మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు మార్చి 31వ తేదీన ఇలాంటి ఈ మెయిలే వెళ్లింది. అలాగే మహారాష్ట్రలోని వార్ధా, లాథూర్ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇలాంటి ఈ మెయిల్స్ వెళ్లాయని వారి నుంచి వచ్చిన లేఖల ద్వారా స్పష్టం అవుతోంది. గోండియా సంక్షిప్త చరిత్ర, భౌగోళిక స్వరూపం, మతాల ప్రాతిపదికన జనాభా శాతం తదితర విరాలతో ‘ప్రధాన మంత్రి కార్యాలయానికి గోండియా జిల్లా సంక్షిప్త సమాచారం’ అనే శీర్షికతో అక్కడి జిల్లా కలెక్టర్ పంపించారు. లాథూర్‌కు సంబంధించిన చరిత్ర, చారిత్రిక కట్టడాలు, ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల వివరాలను తెలియజేస్తూ అక్కడి కలెక్టర్ కూడా లేఖను పంపించారు. వార్ధా జిల్లా కలెక్టర్ నుంచి అలాంటి సమాచారమే అందింది. ‘వార్ధా డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఫర్ పీఎంవో’ అనే శీర్షికతో పంపిన ఆ లేఖలో ఆ ప్రాంతాన్ని భారత స్వాతంత్య్ర సమర యోధులు మహాత్మా గాంధీ, వినోబాభావే లాంటి వారు సందర్శించి కొంతకాలం అక్కడ గడిపనట్లుగా వివరాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ ఒకటవ తేదీన వార్ధా, మూడవ తేదీన గోండియాలో, ఏప్రిల్ 9వ తేదీన లాథూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని ఆయన అక్కడక్కడ సందర్బోచితంగా ప్రస్తావించారు. మార్చి 10వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ మార్చి పదవ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అంటే ఆ నాటి నుంచి ప్రధాన మంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారెవరూ కూడా అధికారిక కార్యక్రమాలతో పార్టీ ప్రచార కార్యక్రమాలను ముడిపెట్ట రాదు. ఎన్నికల ప్రచారం కోసం అధికార యంత్రాంగం సేవలను ఏమాత్రం ఉపయోగించుకోరాదు. అలాంటప్పుడు ప్రధాని కార్యాలయానికి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ సమాచారం కోసం జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడం ఏమిటీ ? ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ అధికారులుగా కీలక బాధ్యతలు నిర్వహించే కలెక్టర్లు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం ఏమిటీ? వారి చర్య ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కాదా ? ఇదే విషయమై మహారాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి దిలీప్ షిండేను మీడియా ప్రశ్నించగా, ఈ విషయాలేవి తన దష్టికి రాలేదని తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ స్ఫూర్తి ఏమిటంటే! ‘పదవుల్లో ఉన్న వారు ఎవరైనా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షించాలి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను అందులో పోటీచేసేవాళ్లు శంకించేలా, లేదా సందేహించేలా ఎవరు ప్రవర్తించకూడదు, ప్రవర్తించారన్న సందేహం కలిగేలా కూడా వ్యవహరించరాదు’ అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నరేంద్ర బుటోలియా స్పష్టం చేశారు. అధికార హోదాలో ఉండి రాహుల్ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్ యోజన’ పథకాన్ని విమర్శించినందుకు ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో నరేంద్ర బుటోలియా ఇలా స్పందించారు. అనేక ఆరోపణలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఇప్పటి వరకు పాలకపక్ష బీజేపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కోడ్ అమల్లోకి వచ్చాక ‘నమో టీవీ’ ప్రసారాలను ప్రారంభించడం అందులో ఒకటి. ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ లేకుండా ఆ టీవీ ప్రసారాలు కొనసాగడం అశ్చర్యం. రాహుల్ గాంధీని విమర్శించే విషయంలో మత పరమైన అంశాలను ప్రస్తావించి కోడ్ ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ పలు రాష్ట్రాల గవర్నర్లపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెల్సిందే. (చదవండి : ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?) -
ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రమాదకరంగా మారే అవకాశమున్న ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) వ్యవస్థలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) డేటాలతో ఆన్లైన్ అనుసంధానం ఏర్పాటు చేసుకోనున్నారు. దీంతో తీవ్రమైన ఉల్లంఘనలకు వచ్చే ఈ–చలాన్లు ‘భారీ’గా ఉండనున్నాయి. నగరంలో ప్రమాదాలు, మరణాలు తగ్గింపుతో పాటు వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ‘కంటి’కి చిక్కగానే అన్నీ తనిఖీ... ఇటీవల కాలంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల గుర్తింపు కోసం కెమెరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాయింట్ డ్యూటీలో ఉండే వారి చేతిలోని కెమెరాలు, కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది సర్వైలెన్స్ కెమెరాలను వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వీరికి ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఇకపై కంట్రోల్ రూమ్ సిబ్బంది పై ‘ఆరింటికి’సంబంధించిన ఉల్లంఘనల ఫొటోలు వచ్చిన వెంటనే... ఆ వాహనం నంబర్‌ను తీసుకుంటారు. ఫొటో ఆధారంగా ఎన్ని రకాలైన ఉల్లంఘనల్ని గుర్తించవచ్చో అన్నింటినీ గుర్తిస్తారు. ఆపై వాహన నంబర్ ఆధారంగా ఆర్టీఏ డేటాబేస్‌లో వివిధ సర్టిఫికెట్ల వివరాలూ తనిఖీ చేస్తారు. అవి సక్రమంగా లేకుంటే ఫొటోలో ఉన్న ఉల్లంఘనలకు తోడు వీటినీ కలుపుతారు. మరోపక్క ఫొటో ఆధారంగా చోదకుడు హెల్మెట్ పెట్టుకున్నాడా? లేదా?, నంబర్ ప్లేట్ సక్రమంగా ఉందా? లేదా? అనేవీ పరిశీలించి ఆ ఉల్లంఘనల జరిమానానూ కలుపుతూ ఈ–చలాన్ పంపిస్తారు. ఆరింటిపై ప్రధాన దృష్టి... ట్రాఫిక్ ఉల్లంఘనల్ని అధికారులు ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనం నడిపే వారికి ప్రమాదకరమైనవి, ఎదుటి వారికి ప్రమాదకరమైనవి, ఇద్దరికీ ప్రమాదకరమైనవి. నగర పోలీసులు ప్రాథమికంగా మూడో అంశంపై దృష్టి పెట్టారు. ఇందులోనూ ఆరు రకాల ఉల్లంఘనలు నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు వీటిని ‘జైలుకు తీసుకువెళ్లే’వాటి జాబితాలో చేర్చారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, పరిమితికి మించి రవాణా, అతి వేగం, లైసెన్సు లేకుండా డ్రైవింగ్, నో ఎంట్రీ/రాంగ్ రూట్లో డ్రైవింగ్ ఈ జాబితాలో ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. మేజిస్ట్రేట్ ముందు వాహనంతో సహా హాజరుపరుస్తారు. అలా కాకుండా కెమెరాకు చిక్కితే ‘భారీగా వడ్డించా’లని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండింటితోనూ అనుసంధానం... అనేక మంది వాహనచోదకులు ఆర్సీపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్ప.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ టెస్ట్ వంటివి పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టుకున్నప్పుడు ‘ఫైన్’గా వెళ్లిపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ విభాగం ఆర్టీఏ, ఐఐబీలతో అనుసంధానంగా ఆన్లైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న కాలుష్య తనిఖీ యంత్రాలను ఆర్టీఏతో ఆన్లైన్లో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే తనిఖీ చేయించుకున్న ప్రతి వాహనం వివరాలు ఆర్టీఏ డేటాబేస్‌లోకి చేరుతుంది. మరోపక్క రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ తమ సమాచారాన్ని గచ్చిబౌలిలో ఉన్న ఐఐబీకి సమర్పిస్తాయి. ఈ డేటా ఆధారంగా వాహన బీమా వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ డేటాల అనుసంధానంతో భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాల వడ్డనకు ఆస్కారం ఏర్పడనుంది. క్రమశిక్షణ పెంపొందించేందుకే.. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెరిగితే ట్రాఫిక్ పోలీసులతో సంబంధం లేకుండా అంతా ఎవరికి వారే నిబంధనలు పాటిస్తారు. దీంతో ప్రమాదాలు, మరణాలే కాకుండా ట్రాఫిక్ అంతరాయాలూ తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన ఉల్లంఘ నలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయోగాత్మక వినియోగం జరుగుతోంది. గరిష్టంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం. – ట్రాఫిక్ అధికారులు -
ఉల్లంఘనలెన్ని?
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జీఓ 111 అమలులో ఉన్న ప్రాం తంలో 83 గ్రామాలున్నాయి. అయితే ఈ జీఓను కాలరాస్తూ కొందరు భారీ కట్టడాలు, నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించారు. దీంతో జలాశయాలు కుంచించుకుపోతుండగా.. వాటి మనుగడ క్రమంగా ప్రశ్నార్థకమవుతోం ది. ఈక్రమంలో కొందరు పర్యావరణ కార్యకర్తలు జీఓ 111 ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయిం చారు. దీంతో స్పందించిన ఎన్జీటీ అక్ర మ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా యం త్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు 83 గ్రామాల్లో ప్ర త్యేక బృందాలను నియమించారు. ప్రతి బృందంలో గ్రామ రెవె న్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ సహాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలను మం డల తహసీల్దార్, ఉప తహసీల్దార్, విస్తరణ అధికారి (ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ) సమన్వయపరుస్తారు. మొత్తం గా ఈ బృందాలు ఈనెల 12లోపు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి నివేదిక సమర్పిం చాల్సి ఉంటుంది. మూడు నమూనాల్లో వివరాల సేకరణ.. నిబంధనల ఉల్లంఘనలను క్షేత్రస్థాయిలో సమీక్షించి వివరాలను ఎన్జీటీకి అందించేందుకు జిల్లా యంత్రాంగం మూడు ప్రొఫార్మాలను రూపొం దించింది. మొదటి నమూనాలో నిర్మాణాల తీరు, రెండో నమూనాలో అక్రమ, అనధికారిక లేఅవుట్లు, మూడో నమూనాలో అక్రమ, అనధికారిక నిర్మాణాలున్న లేఅవుట్ల వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రతి నమూనాలో ఎనిమిది కాలాలకు సంబంధించి సమాచారం తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జీఓ 111 పరిధిలోకి వచ్చే మండలాల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఈఓ పీఆర్డీలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం సమాచారాన్ని సేకరించి ఈనెల 12లోగా సమర్పించాలని ఆయన సూచించారు. -
ఉల్లంఘనులు యువతే టాప్
♦ తీరు మార్చుకోని మందుబాబులు ♦ 57 రోజుల్లో 303 మందికి జైలు శిక్ష ♦ 3,112 కేసుల నమోదు ♦ పట్టుబడిన వారిలో యువతే ఎక్కువ సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగాక వాహనం నడపొద్దని అంటే మందు బాబులు చిరాకు పడుతుంటారు. కచ్చితంగా నడిపి తీరాల్సిందేనని ఉబలాటపడుతుంటారు. వాహనాలపై రయ్యిమని దూసుకెళ్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కుతున్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉండటం గమనార్హం. జరిమానాలు విధిస్తున్నా, జైలు పాలవుతున్నా వారిలో కొంతైనా మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభమై రెండు నెలలు గడవక ముందే 3,112 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో మందు బాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నా వరిలో పరివర్తన రాకపోవడం గమనార్హం. 57 రోజుల్లో 303 మందికి జైలు శిక్ష డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు 470 కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారి నుంచి రూ. 4,16,300 జరిమానా వసూలు చేశారు. ఇందులో భాగంగా 13 మందికి జైలు శిక్ష పడింది. జనవరి ఒకటి నుంచి ఈ నెల 26 వరకు 3,112 కేసులు నమోదుకాగా, వీరి నుంచి రూ.44,40,250 జరిమానా వసూలు చేయగా, 303 మందికి జైలు పాలయ్యారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 70 శాతానికి పైగా యువకులే కావడం గమనార్హం. గీత దాటుతున్నారు... అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) మార్గంలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనుల సంఖ్య భారీగానే పెరిగింది. జనవరి ఒకటి నుంచి ఈ నెల 26 వరకు 2,819 కేసులు నమోదయ్యాయి. పెద్దంబర్పేట నుంచి శామీర్‌పేట, శంషాబాద్ మార్గంలో రాంగ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ నుంచి ఎంట్రీ, అతివేగంతో డ్రైవింగ్, లేన్ అతిక్రమణలు ఎక్కువగా నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రచారం చేసినా వాహన చోదకుల్లో మార్పు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. -
పాలమూరు, డిండిలో ఉల్లంఘనలు లేవు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టులను అర్థవంతంగా పూర్తి చేసే కసరత్తు మొదలుపెట్టామని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయనకు ఈ రెండు ప్రాజెక్టులపై స్పష్టతనిస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు. కృష్ణాలో 70 టీఎంసీల నీటి వినియోగంకోసం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72ను, అలాగే 30 టీఎంసీల నీటి వినియోగంకోసం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న ఇచ్చిన జీవో 159లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతలు, ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సురక్షిత నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టును తలపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పరిపాలనా అనుమతులు మంజూరైన ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు నీరిచ్చే స్వేచ్ఛ తమకుందని స్పష్టం చేశారు. బచావత్ అవార్డు ప్రకారం నికర, మిగులు జలాలను ఉపయోగించుకొనే స్వేచ్ఛ సైతం తమకుందని లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టులకు చట్టబద్ధమైన వ్యవస్థల నుంచి అవసరమైనప్పుడు తగిన సమయంలో అన్ని రకాల అనుమతులు తీసుకుంటామని వివరించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చట్టంలోని 84(8)ఏ నిబంధన ప్రకారం బోర్డు కేవలం నీటి సరఫరాను నియంత్రిస్తుంది తప్పితే, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించింది కాదన్నారు. ట్రిబ్యునట్ చేసిన కేటాయింపులు, ప్రస్తుతం చేసుకున్న అంత ర్రాష్ట్ర ఒప్పందాలను గౌరవించాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేస్తూ, నికర, మిగులు జలాల్లో ఉన్న హక్కుల మేరకే నీటిని వాడుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు. పాలమూరుపై మంత్రి సమీక్ష.. కాగా ఇదే విషయమై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఏపీకి పాలమూరు -రంగారెడ్డి విషయమై లేఖ రాసిన విధంగానే కేంద్రానికి అన్ని రకాల ఆధారాలతో లేఖ పంపాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పాక్‌కు బుద్ధి చెప్పాలంటే కాల్పులకు దిగాల్సిందే..
ముంబై: పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటే భారత్ కూడా కాల్పులతో రంగంలోకి దిగాలని శివసేన తెగేసి చెపుతోంది. తాజాగా పాకిస్థాన్ కాల్పులపై మండిపడిన శివసేన... తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తప్పేమీ లేదనీ పేర్కొంది. పాకిస్థాన్ 2013లో 347, 2014 లో 562 సార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ లెక్కలు చెప్పుకొచ్చింది. పొరుగుదేశం చేస్తున్న ఈ దుశ్చర్యల మూలంగా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 3 2,000 ప్రజలు తమ నివాసాలను వీడి పోవాల్సి వస్తోందని మండిపడింది. పాక్ కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు కాల్పుల విరమణ నిబంధనలను పక్కన పెట్టయినా సరే తగిన బుద్ధి చెప్పాలని తన సంపాదకీయంలో పేర్కొంది. పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్న దశలో ఉందని అయితే కేవలం అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే మనగలుగుతోందని పేర్కొంది. కాగా జమ్ము కశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో ఎల్వోసీలో సోమవారం పాక్ దళాలు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. -
మేల్కొంటున్నారు!
నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు వాహనదారుల్ల పెరిగిన అవగాహన జరిమాన పెంపు, చార్జీషీట్లే కారణం సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి. సిగ్నల్ జంప్‌లు, రాంగ్‌రూట్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ చేసేందుకు వాహనదారులు జంకుతున్నారు. ఒకపక్క జరిమానాలు పెంపు, మరోపక్క పెండింగ్ చలానా దారులపై చార్జిషీటు దాఖలు చేసి, కోర్టులో హాజరుపర్చడమే ఇందుకు ప్రధాన కారణం. వాహనదారుల్లో అవగాహన పెరగడం వల్లనే ఉల్లంఘనలు తగ్గాయని అధికారులు భావిస్తున్నారు.గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 8,79,251 నమోదుకాగా ఈ ఏడాది మూడు నెలల్లో 7,17,528 కేసులు నమోదు అయ్యాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 1,61,723 కేసులు తగ్గాయి. ఒకపక్క నగరంలో వాహనాల సంఖ్య పెరిగినా..ఉల్లంఘన కేసులు తగ్గడం గమనార్హం. మూడు నెలల నుంచి పెండింగ్ చలానాలు వసూలుపై ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, ఎస్.కె.చౌహాన్లు దృష్టి సారించి చార్జిషీట్ విధానాలకు తెరలేపడం మూలంగా 5,15,643 చలానాలను వాహనదారులు క్లియర్ చేశారు. తద్వారా ప్రభుత్వానికి జరిమానాల రూపంలో రూ.9,86,44,160 వచ్చాయి. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరగడంతో వాహనదారుల్లో ట్రాఫిక్‌పై అవగాహన పెంచగలిగారు. ప్రధాన కారణాలు ఇవే... నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల బకాయిలు వసూలు చేసే ప్రక్రియ ప్రారంభం మూడు కన్న ఎక్కువ చలానాలు ఉన్నవారిని కోర్టులో హాజరుపర్చడం కూడళ్లలో మైక్‌ల ద్వారా ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనుల భరతం పట్టడం త్వరలో ఉల్లంఘనులపై డేగకన్న పెట్టేందుకు ఇంటర్‌సెప్టర్ వాహనాలు రంగంలోకి దిగనున్నాయి. -
విదేశీ మారక అక్రమాలపై ఈడీ దర్యాప్తు
‘నల్లధన’ సిట్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్బీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోరింది. రూ. 100 కోట్లకుపైగా ఎగుమతి బకాయిల వివరాలను ఈడీకి అందజేసింది. సాధారణంగా బ్యాంకులు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని డీఆర్ఐ, కస్టమ్స్ సంస్థలకే ఇచ్చేవి. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే వారు తమకు రావలసిన బకాయిల సమాచారాన్ని 9 నెలల్లోగా ఆర్బీఐకి ఇవ్వాలి. లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తారు. వీటిని విదేశీ మారకం నిబంధనల ఉల్లంఘన, హవాలా కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు సిట్ గుర్తించింది.