ఎలాన్ మస్క్ కు అమెరికా న్యాయశాఖ నోటీసులు
వాషింగ్టన్: భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు ధ రించే హక్కుకు మద్దతు పలుకుతూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేస్తే రోజులో ఒకరికి 10 లక్షల డాల ర్లు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రక టించడాన్ని అమెరికా ప్రభుత్వం తప్పుబట్టింది. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేస్తూ మస్క్ ను అమెరికా న్యాయశాఖ హెచ్చరించింది.
ఈ మేరకు ఎన్నికల చట్ట ఉల్లంఘనలపై న్యాయశాఖలోని పబ్లిక్ ఇంటిగ్రిటీ విభాగం మస్క్ కు చెందిన సూపర్ పీఏసీ కంపెనీకి హెచ్చరిక లేఖ ను పంపింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఆయుధా లు ధరించే హక్కుకు మద్దతుగా పిటిషన్‌పై సంతకం చేస్తే ఎన్నికల తేదీదాకా ప్రతి రోజూ ఒక విజే తకు 10 లక్షల డాలర్లు ఇస్తానని మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం విదితమే.
ట్రంప్‌కు మద్దతుగా పలువురు టెక్ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన సూపర్ పీఏసీ అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నెవడా, అరిజోనా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆన్‌లైన్ పిటిషన్ కార్యక్రమం దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సంతకం చేయాలంటే నిర్దిష్ట రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ ఓటరు అయి ఉండాలనే షరతు విధించారు.
ఈ షరతుకు లోబడి ఇప్పటివరకు గెలిచిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల డాలర్ల చెక్కులను అందజేశారు. శనివారం హారిస్‌బర్గ్‌లో ఒకరు, ఆది వారం పిట్స్‌బర్గ్‌లో మరొకరు ఈ చెక్కులను అందుకున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై అమెరికాలో నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్బు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ హెచ్చరిక లేఖను జారీ చేశారు. అయితే, ప్రభుత్వం పంపిన లేఖపై సంస్థగానీ, ఎలాన్ మస్క్ గానీ ఇంకా స్పందించలేదు. అయితే ఓటు వేసే వాళ్లు మాత్రమే ఈ ఆన్‌లైన్ పిటిషన్‌లో సంతకం చేయాలనే నిబంధన లేదని, ఏ పారీ్టకి చెందినా, చెందకపోయినా, ఎన్నికల్లో ఓటువేసే ఉద్దేశంలేకపోయినా ర్యాండమ్‌గా విజేతను ఎంపికచేస్తామని మస్క్ మరో పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment