Freedom of expression
-
డబ్బు ఇవ్వడం చట్టవిరుద్ధం
వాషింగ్టన్: భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు ధ రించే హక్కుకు మద్దతు పలుకుతూ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకం చేస్తే రోజులో ఒకరికి 10 లక్షల డాల ర్లు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రక టించడాన్ని అమెరికా ప్రభుత్వం తప్పుబట్టింది. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేస్తూ మస్క్ ను అమెరికా న్యాయశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎన్నికల చట్ట ఉల్లంఘనలపై న్యాయశాఖలోని పబ్లిక్ ఇంటిగ్రిటీ విభాగం మస్క్ కు చెందిన సూపర్ పీఏసీ కంపెనీకి హెచ్చరిక లేఖ ను పంపింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఆయుధా లు ధరించే హక్కుకు మద్దతుగా పిటిషన్‌పై సంతకం చేస్తే ఎన్నికల తేదీదాకా ప్రతి రోజూ ఒక విజే తకు 10 లక్షల డాలర్లు ఇస్తానని మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం విదితమే. ట్రంప్‌కు మద్దతుగా పలువురు టెక్ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన సూపర్ పీఏసీ అనే సంస్థ తమ వెబ్సైట్లో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నెవడా, అరిజోనా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆన్లైన్ పిటిషన్ కార్యక్రమం దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సంతకం చేయాలంటే నిర్దిష్ట రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ ఓటరు అయి ఉండాలనే షరతు విధించారు. ఈ షరతుకు లోబడి ఇప్పటివరకు గెలిచిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల డాలర్ల చెక్కులను అందజేశారు. శనివారం హారిస్బర్గ్లో ఒకరు, ఆది వారం పిట్స్‌బర్గ్‌లో మరొకరు ఈ చెక్కులను అందుకున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై అమెరికాలో నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్బు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ హెచ్చరిక లేఖను జారీ చేశారు. అయితే, ప్రభుత్వం పంపిన లేఖపై సంస్థగానీ, ఎలాన్ మస్క్ గానీ ఇంకా స్పందించలేదు. అయితే ఓటు వేసే వాళ్లు మాత్రమే ఈ ఆన్లైన్ పిటిషన్లో సంతకం చేయాలనే నిబంధన లేదని, ఏ పారీ్టకి చెందినా, చెందకపోయినా, ఎన్నికల్లో ఓటువేసే ఉద్దేశంలేకపోయినా ర్యాండమ్‌గా విజేతను ఎంపికచేస్తామని మస్క్ మరో పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం. -
మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
పత్రికల హక్కులేమిటో తెలుసా?
ఔషధం చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం తీసుకోక తప్పదు. నిజం కూడా చేదుగా ఉంటుంది. కానీ సమాజ ఆరోగ్యం కోసం భరించక తప్పదు. నిజంలో ఉన్న చేదును విస్మరించి, ఆ నిజం చెప్పడమే తప్పంటే? నిజం చెప్పేవాళ్ల మీద పగబడితే? నిజాలు వినడం చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పాలకులకు, అధికార పీఠాల్లో ఉన్నవాళ్లకు, నిజాలు బయటికి రావొద్దనుకునేవాళ్లకు. కానీ నిజాలు చెప్పడం పత్రికల ముఖ్య కర్తవ్యమనీ, నిజాల మీద మాత్రమే సమాజం పురోగమిస్తుందనీ చాలాసార్లు మరిచిపోతుంటారు. కేసులు వేస్తామని బెదిరిస్తుంటారు. కానీ పత్రికలకు ప్రచురించే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.భారతదేశంలో పత్రికా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం నుండి ఉద్భవించాయి. మే 3 లేదా ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’... పత్రికల స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు గుర్తు చేస్తుంది.సాంకేతిక విప్లవపు పురోగతి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్య మాల ద్వారా లక్షలాది మందికి సమాచార వ్యాప్తిని సులభతరంచేసింది. ఇది ఒక వ్యక్తి పరువునష్టం ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం అది నేరం.ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం; టెక్స్›్ట, ఇమేజ్, కార్టూన్లు, క్యారికేచర్లు లేదా దిష్టిబొమ్మల ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. సాధారణంగా వ్యక్తులను విమర్శించినందుకు వార్తాపత్రికలు, పత్రికా సభ్యు లపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. విమర్శ సదుద్దేశంతో చేసినా, తీవ్రమైన ప్రజాప్రయోజనాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛపత్రికలు, మీడియాకు ఒకే హక్కులు ఉన్నాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి మరియు ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది. ఈ స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, హుందాతనం, నైతికత, లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి సహేతుకమైన ఆంక్షలను కలిగి ఉన్న ఆర్టికల్ 19(2) కింద రాజ్యాంగం ప్రకారం ఈ హక్కుపై విధించగల పరిమితులు మాత్రమే ఉన్నాయి.‘రోమేశ్ థాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం’ (1950) సహా అనేక కేసుల్లోని తీర్పులు ప్రచురణ స్వేచ్ఛ ఎంత అవసరమో, చలామణి స్వేచ్ఛ కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డాయి. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో వార్తాపత్రికలు, వాటి పేజీలు, వాటి సర్క్యులేషన్ నిర్ణయాధికారాన్ని వాటికే వదిలేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే సూత్రాన్ని ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1962) కేసులోనూ సమర్థించింది. రాజ్యాంగం ప్రసాదించిన వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించే చట్టాలను రాష్ట్రాలు చేయలేవని పేర్కొంది. పత్రికల చలామణి హక్కులో చలామణి పరిమాణాన్ని నిర్ణయించే స్వేచ్ఛ కూడా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో రాష్ట్ర భద్రత, ప్రజాభద్రత తదితర అంశాల్లో ఇచ్చిన సహేతుకమైన ఆంక్షలకు విరుద్ధంగా ఉంటేనే ఈ హక్కును పరిమితం చేయవచ్చు.అసమ్మతి హక్కురాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)... వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుతో పాటు ప్రజాదరణ లేని లేదా అసాధారణ అభిప్రాయాలను కలిగి ఉండే హక్కును కూడా కవర్ చేస్తుంది. ఇటువంటి విమర్శలను తగ్గించడానికి సాధారణంగా ఉప యోగించే చట్టాన్ని భారత శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 124–ఎ ప్రకారం రాజద్రోహ చట్టం అంటారు. సాధారణంగా పత్రికలపై రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించి ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినప్పటికీ, ప్రభుత్వ చర్యలపై లేదా దానిసంస్థలపై బలమైన పదజాలంతో వ్యాఖ్యానించడం ప్రభుత్వ నమ్మక ద్రోహంతో సమానం కాదని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ఒక వ్యక్తి వాడిన పదాలు ప్రభుత్వం పట్ల శత్రుత్వానికి, నమ్మకద్రోహానికి, ప్రజా అశాంతికి లేదా హింసకు ఉపయోగించడానికి దారితీయ నంత కాలం, అది రాజద్రోహ చర్య కాదు.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో సమాచారాన్ని వ్యక్తీకరించే, ప్రచురించే, ప్రచారం చేసే హక్కు మాత్రమే కాదు, సమా చారాన్ని స్వీకరించే హక్కు కూడా ఉంటుంది. సమాచార హక్కు చట్టం, 2005 ద్వారా పత్రికలతో సహా భారతీయ పౌరులకు ప్రజా సంస్థల నుండి సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. పత్రికలతో సహా ఏ పౌరుడైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ బడ్జెట్ల వివరాలు, అమలు స్థితి, ఏదైనా ప్రభుత్వ సంస్థకు చేసిన ఫిర్యాదు / దరఖాస్తు స్థితి వంటి సమాచారాన్ని పొందవచ్చు. ఇటువంటి దర ఖాస్తును సాధారణంగా ఆర్టీఐ లేదా ఆర్టీఐ దరఖాస్తుగా సూచిస్తారు. ఎన్నికల అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే ఓటర్ల హక్కు, క్రికెట్ చూసే క్రీడాభిమానుల హక్కు, ప్రాణాలను కాపాడే మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందే హక్కు తదితర అంశాలపై సుప్రీంకోర్టు వివిధ కేసుల ద్వారా చర్చించింది.ఇంటర్వ్యూలు నిర్వహించే హక్కు పత్రికల పరిమిత హక్కు. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి నుండి ఇష్టపూర్వక సమ్మతి ఉంటేనే దీనిని ఉపయోగించవచ్చు. దోషులను లేదా విచారణ ఖైదీలను ఇంటర్వ్యూ చేసే మీడియా హక్కును పరిశీలించిన అనేక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో, పత్రికలకు సంపూర్ణమైన లేదా అపరిమితమైన సమాచార హక్కు లేదనీ, ఖైదీలు సమ్మతి తెలిపితేనే ఇంటర్వ్యూ నిర్వహించవచ్చనీ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘స్టేట్ వర్సెస్ చారులతా జోషి’ (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు, ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.కోర్టు ప్రొసీడింగ్స్ రిపోర్ట్ చేసే హక్కుపాత్రికేయులు కోర్టులో విచారణకు హాజరయ్యే హక్కును కలిగి ఉంటారు. న్యాయస్థానంలో చూసిన, విన్న ప్రొసీడింగ్స్‌ను ప్రచురించే హక్కును కలిగి ఉంటారు. అయితే న్యాయప్రయోజనాల దృష్ట్యా విచారణల ప్రచారాన్ని పరిమితం చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సుప్రీంకోర్టు ‘నరేష్ శ్రీధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ (1967) కేసులో దీనిని మరింత స్పష్టం చేసింది. ‘సహారా రియల్ ఎస్టేట్ వర్సెస్ సెబీ’ (2012) కేసులో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా పత్రికలు ప్రచురించే కథనాలను పరిమిత కాలానికి వాయిదా వేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని పేర్కొంది. ప్రచురణలో దురు ద్దేశం లేనంత కాలం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల శాసన కార్య కలాపాలను నివేదించే హక్కు కూడా పత్రికలకు ఉంది. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రచురణ పరిరక్షణ) చట్టం 1977లోనూ ఈ హక్కుంది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో ప్రకటనలు చేసే హక్కు లేదా వాణిజ్య వాక్ హక్కు కూడా ఉన్నాయి. ‘టాటా ప్రెస్ లిమిటెడ్ వర్సెస్ ఎంటీఎన్ఎల్’ (1995) కేసు విషయంలో ఈ హక్కును సమర్థించారు. ‘హిందుస్థాన్ టైమ్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’(2003) కేసులో ఆదాయాన్ని సృష్టించడంలో ప్రకటనలు పోషించే ముఖ్యమైన పాత్ర, అవి చలామణిపై ప్రత్యక్ష ప్రభావాన్ని ఎలా చూపుతాయో సుప్రీంకోర్టు చర్చించింది. తద్వారా వార్తాపత్రిక లలో ప్రకటనల హక్కును పునరుద్ఘాటించింది. ప్రకటనలను కుదించడం భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేననీ, ఇది వార్తాపత్రి కల సర్క్యులేషన్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందనీ ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో (1962) అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- పి. విజయబాబు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
న్యూఢిల్లీ: ఉధృతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ సంబంధ ‘ఎక్స్’ఖాతాలను స్తంభింపజేయాలంటూ ‘ఎక్స్’ సంస్థకు మోదీ సర్కార్ నుంచి ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ కన్నెర్రజేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న దేశంలో 177 సామాజికమాధ్యమాల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. కేంద్ర హోం శాఖ సిఫార్సుమేరకు ఈ ఆదేశాలొచ్చాయి. దీనిపై తొలుత ‘ఎక్స్’ స్పందించింది. ‘‘ పెనాల్టీలు, జరిమానాలు, నిర్బంధాలకు వీలయ్యేలా 177 ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులొచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆ ఆదేశాలను పాటించాం. కానీ ఇలా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం సబబు కాదు. ఈ అంశంలో పారదర్శకత కోసం ఆయా ఉత్తర్వుల కాపీలను బహిర్గతంచేయాల్సింది. అయితే చట్టంలోని నిబంధనల కారణంగా మేం ఆ పనిచేయలేకపోతున్నాం. పారదర్శకత లేనంత కాలం, బహిర్గతం చేయనంతకాలం ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేనట్లే’’ అని ‘ఎక్స్’ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక ప్రకటన విడుదలచేసింది. -
Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కలి్పంచిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం, కొనుగోలుదారులు, స్వీకర్తల పేర్లు తదితరాల వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ‘‘ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లూ ఉండరాదు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాక ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ప్రభుత్వాల ప్రజాస్వామిక స్ఫూర్తికి అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగం కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యమిచి్చంది. కార్పొరేట్ల నుంచి పారీ్టలకందే ఆర్థిక విరాళాలకు రెండు కారణాలుంటాయి. తద్వారా తమ మద్దతును వ్యక్తీకరించడం. లేదా సదరు విరాళాలు క్విడ్ ప్రొ కో తరహావి కావడం. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలను, అపరిమితమైన కార్పొరేట్ విరాళాలను ఒకే గాటన కట్టలేం. కార్పొరేట్ విరాళాలు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాయి. కనుక సంస్థలు, కంపెనీల నుంచి పార్టీలకు అందే భారీ విరాళాలకు కారణాలను గోప్యంగా ఉంచడాన్ని అనుమతించరాదు’’అని స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఆది, అంతం కావంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రెండు విడి తీర్పులు రాశారు. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ తీర్పుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ హర్షం వెలిబుచ్చాయి. పలువురు మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా తీర్పును సమరి్థంచడం విశేషం. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. తనతో పాటు జస్టిస్ గవాయ్ తరఫున సీజేఐ 152 పేజీల తీర్పు, తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మిశ్రాల తరఫున జస్టిస్ ఖన్నా 74 పేజీల తీర్పు వెలువరించారు. చాలా లోపాలున్నాయి... ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై ధర్మాసనం 2023 అక్టోబర్ నుంచి వాదనలు ఆలకిస్తూ వస్తోంది. ఈ పథకం రహస్య బ్యాలెట్ విధానం వంటిదేనని, విరాళాలిచ్చేవారి గోపనీయతను కాపాడుతుందని కేంద్రం చేసిన వాదన లోపభూయిష్టమని తాజా తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లను కొనుగోలు చేసేలా వ్యక్తులను, సంస్థలను ఈ పథకం ద్వారా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంది. బాండ్‌పై దాత పేరుండదు గనుక అవి ఎవరి నుంచి వచ్చాయన్న ఆ విరాళాన్ని అందుకునే పారీ్టకి కూడా తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదననూ తోసిపుచి్చంది. ‘‘ఈ పథకం లోపరహితం కాదు. విరాళాలు ఇచి్చందెవరో పార్టీలు తెలుసుకునేందుకు అవకాశం కలి్పంచే లోపాలెన్నో ఇందులో ఉన్నాయి’’అని స్పష్టం చేసింది. ‘‘పౌరులు రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వారి రాజకీయ వ్యక్తీకరణలో తొలి దశ. అందుకే పౌరుల రాజకీయ విశ్వాసాలకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఎ) రక్షణ కలి్పస్తోంది. కానీ ఈ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల కొనుగోలుదారుల వివరాలను ఓటర్లకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ఇది కలి్పస్తున్న రాజ్యాంగం కలి్పస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే’’అంటూ తప్పుబట్టింది. అంతేగాక కార్పొరేట్ సంస్థలు పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేసేందుకు వీలు కలి్పంచేలా కంపెనీల చట్టంలోని నిబంధనను తొలగించడం ఆరి్టకల్ 14 ద్వారా రాజ్యాంగం కలి్పస్తున్న సమానత్వపు హక్కుకు విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటిదాకా దీనికింద కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 6కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని బాండ్ల జారీ అ«దీకృత సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రతి బాండ్ ముఖ విలువ, కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, తద్వారా పారీ్టలవారీగా అందుకున్న విరాళాలు వంటి అన్ని వివరాలనూ పొందుపరచాలని పేర్కొంది. వాటన్నింటినీ మార్చి 13 కల్లా ఈసీ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇంకా నగదుగా మార్చుకోని బాండ్లను సంబంధిత పారీ్టలు తిరిగి ఎస్బీఐలో జమ చేయాలని, సదరు మొత్తాలను కొనుగోలుదారు ఖాతాకు బ్యాంకు జమ చేయాలని ఆదేశించింది. పార్టీలు బాండ్ల ద్వారా తమకందిన విరాళాల పూర్తి వివరాలను ఈసీకి సీల్డ్ కవర్లో సమరి్పంచాలని 2019 ఏప్రిల్ 12న ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించడం తెలిసిందే. గోప్యత కీలకం: సీజేఐ రాజకీయ పారీ్టకి అందే విరాళాల గురించిన సమాచారం ఓటరుకు తెలియడం తప్పనిసరని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. అప్పుడే ఓటు హక్కును ప్రభావవంతంగా వినియోగించుకోగలడన్నారు. ‘‘ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదు. దీనితో పోలిస్తే సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలనూ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేం. చట్టసభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని పారీ్టలకు కూడా విరాళాలందుతున్నాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు, విధానాలను ప్రభావితం చేసేందుకు డబ్బు ఎంతో అవసరం. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పాల్గొనేందుకు కూడా డబ్బు కావాల్సిందే’’అన్నారు. అయితే, ‘‘వ్యక్తుల రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే ఆస్కారముంది. అంతేగాక సదరు వ్యక్తులకు ఉద్యోగావకాశాల వంటివాటిని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అంతేగాక అవి మెజారిటీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే పక్షంలో వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే పౌరులకు తమ రాజకీయ విశ్వాసాలను గోప్యంగా ఉంచుకునే హక్కు చాలా ముఖ్యం’’అని సీజేఐ అన్నారు. గోప్యత హక్కుకు రాజ్యంగపరమైన రక్షణ ఉంటుందంటూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ఓటు ఎవరికేస్తున్నదీ గోప్యంగా ఉంచే హక్కు లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తమకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లను తొలగించేందుకు వాడుకునే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గాలను కూడా ఓటర్ల రాజకీయ మొగ్గుదల ఆధారంగా విభజించే ఆస్కారముంది. అప్పుడు ఎన్నికల వ్యవస్థకే అర్థం లేకుండా పోతుంది’’అని ఆందోళన వెలిబుచ్చారు. కాకపోతే ఈ గోప్యత హక్కును పారీ్టలకు అందే విరాళాలకు కూడా వర్తింపజేయవచ్చా అన్నదే ప్రశ్న అని సీజేఐ చెప్పారు. పారీ్టలకు ఆర్థిక విరాళాలకు కూడా రాజ్యంగపరమైన రక్షణ ఉందా అన్న అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. క్విడ్ ప్రొ కోకు ఆస్కారం పారీ్టలకు భారీగా ఆర్థిక విరాళాలిచ్చే వారి ఉద్దేశమేమిటన్నది బహిరంగ రహస్యమేనని సీజేఐ అన్నారు. సాధారణంగా కార్పొరేట్ విరాళాల ఉద్దేశం క్విడ్ ప్రొ కో ప్రయోజనాలేనన్న వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విభేదించలేదని గుర్తు చేశారు. రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానత కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో వ్యక్తుల సామర్థ్యంలో అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతలే అందుకు కారణం. పారీ్టలకందే ఆర్థిక సాయాన్ని కూడా ఈ అసమానతలు నియంత్రిస్తున్నాయి. సంపన్నులకు పారీ్టలకు భారీ ఆర్థిక విరాళమిచ్చే సామర్థ్యముంటుంది. తద్వారా ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశముంటుంది. ఇది వారికి కావాల్సిన లైసెన్సులివ్వడమో, వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకోవడమో జరగే ఆస్కారముంది. ఇలా క్విడ్ ప్రొ కో జరిగే అవకాశముంది’’అన్నారు. రాజకీయ సమానత్వాన్ని పాటించే సమాజంలో పౌరులందరికీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయంలో సమానంగా గళమెత్తే అవకాశం చాలా కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి జస్టిస్ ఖన్నా తన తీర్పులో పలు కారణాలను ఉటంకించారు. స్పందనలు ‘‘ఈ తీర్పు ద్వారా నల్లధన మారి్పడి వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేంద్రం ఇప్పటికైనా ఇలాంటి మతిలేని ఆలోచనలు కట్టిపెడుతుందని ఆశిస్తున్నా. ఎన్నికల బాండ్ల పథకం కింద 95 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘‘మోదీ ప్రభుత్వ అవినీతి విధానాలకు ఇది మరో నిదర్శనం. ఎన్నికల బాండ్లను లంచాలు, కమిషన్లు తీసుకునే మార్గంగా బీజేపీ మార్చుకుంది. దీనికి సుప్రీంకోర్టు తెర దించింది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఎన్నికల బాండ్లు సదుద్దేశంతో తెచి్చన పథకం. విపక్షాలు దీన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం’’ – బీజేపీ ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తెచ్చేందుకు ఇదెంతగానో దోహదపడుతుంది’’ – ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘పాలక పార్టీ లబ్ధి కోసం తీసుకొచి్చన అక్రమ పథకానికి సుప్రీంకోర్టు తీర్పు తెర దించింది’’ – సీపీఎం ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం’’ – సీపీఐ (ఎంఎల్) ‘‘ఇది గత ఆరేడేళ్లలో వెలువడ్డ అత్యంత చరిత్రాత్మక తీర్పు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పునరుద్ధరిస్తుంది. – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ‘‘తీర్పు స్వాగతించదగ్గదే. అయితే ఎన్నికల నిధుల వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలా ఉంది’’ – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి. -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
నివేదిక ఇవ్వడం నేరం కాదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులిచి్చన నివేదికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నివేదికలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే అంశం ఏమీ కనిపించడం లేదని పేర్కొంది. ఒక తప్పుడు ప్రకటన రాజ్యాంగంలో 153ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని వివరించింది. దేశంలో ఎందరో జర్నలిస్టులు నిత్యం ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తుంటారు. వారందరిపైనా అభియోగాలు మోపుతారా అని పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో ఈజీఐకి చెందిన నలుగురు సభ్యులకు పోలీసు అరెస్ట్ నుంచి ఇచి్చన రక్షణను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఐ సభ్యులపై నమోదైన కేసును ఎందుకు కొట్టివేయరాదని మణిపూర్ పోలీసులను ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు. మణిపూర్ హింసపై నిజ నిర్థారణలో భాగంగా నలుగురు సభ్యుల ఈజీఐ అక్కడికి వెళ్లి సెప్టెంబర్ 2న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఘర్షణలను ప్రేరేపించేదిగా ఉందంటూ పోలీసులు ఈజీఐకి చెందిన నలుగురు స భ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
చిన్న మాటలే.. ఛిన్నాభిన్నం చేసేస్తాయి
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు. బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు. అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు. ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం. అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్!
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది. గతవారమే ట్విట్టర్, యూట్యూబ్‌లో ఈ వీడియో లింక్స్‌ను బ్లాక్ చేసింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తాజాగా దీనిపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తామని, ప్రాజాస్వామ్య విలువలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఇదే విషయంపై మాట్లాడిన ప్రైస్.. మోదీపై బీబీసీ రూపొందించన డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని, భారత్-అమెరికా బంధం ప్రత్యేకమన్నారు. రెండు దేశాల ప్రజాస్వామ్య విలువలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరిగిన విషయాల గురించి గతంలోనే తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు. కానీ ఒక్కరోజులోనే యూ టర్న్ తీసుకుని బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో నిషేధించడాన్ని పరోక్షంగా తప్పుబట్టారు. 2002లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. కరసేవకులు ప్రయాణించిన రైలుకు దుండగుడు నిప్పుపెట్టిన ఘటనలో 50మందికిపైగా చనిపోయిన తర్వాత ఈ హింస మొదలైంది. ఈ ఘర్షణల్లో 1000 మందికిపైగా చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీకి 2012లోనే క్లీన్చిట్ ఇచ్చింది. కానీ బీబీసీ గుజరాత్ అల్లర్లపై ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వీడియోల రూపంలో డాక్యుమెంటరీ రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. ఇందులో విషయమేమీ లేదని, పూర్తింగా దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది. చదవండి: దారుణమైన పరిస్థితులు.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్! జీతాల్లో 10 శాతం కోత -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్‌ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్‌కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్‌ను ట్రయల్ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్ కావాలని షరతులు విధించింది. ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు. -
మా గొంతు నొక్కేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్‌ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ సైనియడ్ మెక్‌స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు. కేంద్రమే కారణం తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్‌గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది. -
బీట్ కానిస్టేబుల్‌దే కీలక పాత్ర
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్య్రం, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీస్ వ్యవస్థకు వీటితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఉండే బీట్ కానిస్టేబుల్ ప్రజలను రక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు. శనివారం బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్‌డీ) 51వ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం అనేది మనకు సహజసిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ నేరుగా శాంతి భద్రతలతో ముడిపడి ఉంటుందన్నారు. -
‘భావ వ్యక్తీకరణ’ను అడ్డుకోవడమే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, ఒక ట్వీట్‌ను తొలగించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ట్విట్టర్ సంస్థ హరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ సర్కార్ ఆదేశాలకు తలొగ్గి ట్విట్టర్ సంస్థ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్విట్టర్ వైఖరిని మరింతగా ఎండగట్టేందుకు సిద్ధంకావాలని పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. -
అది బెదిరింపు చర్య
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లోని తమ కార్యాలయాలకు వచ్చి నోటీసులు జారీ చేయడంపై ట్విట్టర్ స్పందించింది. అది ఒకరకంగా తమను బెదిరించే చర్య అని భావిస్తున్నట్లు పేర్కొంది. తమ ఉద్యోగుల గురించి, భావ వ్యక్తీకరణకు ఎదురయ్యే ముప్పు గురించి ఆందోళన చెందుతున్నామంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ విపక్షం సర్క్యులేట్ చేసినట్లు భావిస్తున్న డాక్యుమెంట్‌ను విమర్శిస్తూ.. అధికార బీజేపీ నేతలు చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ఇటీవల ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ ట్యాగ్‌ను తగిలించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయాలకు వెళ్లి సంస్థ బారత విభాగం ఎండీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై గురువారం ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. పారదర్శకతతో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్ తమకు అత్యంత ప్రధానమైన మార్కెట్ అని, భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలను గౌరవిస్తామని పేర్కొంది. అయితే, స్వేచ్చాయుత ప్రజాభిప్రాయానికి భంగం కలిగించే నిబంధనలను మార్చాలని కోరుతామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనల్లోని కీలకమైన మౌలిక అంశాలపై, సంస్థ ఉద్యోగుల కార్యకలాపాలను అడ్డుకునే పోలీసుల బెదిరింపు చర్యలపై తమతో పాటు, భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొంది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని ట్విట్టర్ పేర్కొంది. ప్రజాప్రయోజన పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, పౌరసమాజం కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందని సూచించింది. అభ్యంతరకర పోస్ట్‌లకు తమ కంప్లయన్స్ ఆఫీసర్‌ను బాధ్యుడిని చేసి, క్రిమినల్ చర్యలకు అవకాశం కల్పించడాన్ని ట్విట్టర్ తప్పుబట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ, వినియోగదారుల సమాచారాన్ని గంపగుత్తగా కోరడం కూడా తమకు ఆమోదనీయం కాదని పేర్కొంది. ఇవి స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపింది. నిరాధార ఆరోపణలు పోలీసులు తమ కార్యాలయాలకు రావడం బెదిరింపు చర్య అన్న ట్విట్టర్ ఆరోపణలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. అవి భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించింది. ట్విట్టర్ లేదా, మరే ఇతర సోషల్‌మీడియాకు చెందిన ప్రతినిధులకు కానీ భారత్ సురక్షిత దేశమని స్పష్టం చేసింది. వారి భద్రతకు, వ్యక్తిగత రక్షణకు ఎలాంటి ప్రమాదం కలగబోదని కేంద్ర ఐటీ శాఖ గురువారం తెలిపింది. చర్యలు, ఉద్దేశపూర్వక సమర్ధనలతో భారత చట్ట వ్యవస్థను తక్కువ చేయాలని ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. -
3 నెలలు వాయిదా వేయండి: కేంద్రానికి ట్విటర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలపై ట్విటర్ స్పందించింది. కొత్త ఐటీ నిబంధనల అమలుకు 3 నెలలు గడువును ట్విటర్ కోరింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనలపై సోషల్ మీడియా సంస్థలకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రం, వాట్సప్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త నిబంధనల్లో మార్పుల కోసం న్యాయపరంగా వెళ్తామని ట్విటర్ పేర్కొంది. మే 26వ తేదీ నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ వాదిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ నిబంధనలపై ట్విటర్ స్పందించింది. భారత చట్టాలను అమలు చేసేందుకు పాటిస్తామని పేర్కొంటూనే ఆ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్ కింది విధంగా స్పందించింది. ‘మేము భారత ప్రజల సేవకు కట్టుబడి ఉన్నాం. ప్రజల సమాచార గోప్యతకు భంగం కలిగించం. కరోనా సమయంలో ట్విటర్ ప్రజలకు ఉన్నదని అందరికీ తెలిసిందే. అలాంటి సేవలను అందుబాటులో ఉంచేందుకు మేం భారత న్యాయసూత్రాలకు అనుగుణంగా పని చేసేందుకు ప్రయత్నిస్తాం. గోప్యత.. పారదర్శకత విషయంలో మేం కచ్చితంగా పాటిస్తాం. ఈ విషయంలో ప్రపంచమంతటా ఒకే నిబద్ధతతో ఉన్నాం. మేం ఇదే కొనసాగిస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూనే చట్టాలకు లోబడి ఉంటాం’ అని ట్విటర్ ప్రతినిధి తెలిపారు. ‘అయితే భారత కొత్త చట్టాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కొంతకాలంలో భారత్‌లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయని మా ఆందోళన. ఇలాంటి చట్టాలు రావడం బాధాకరం. సోషల్ మీడియాలో ప్రశాంత చర్చలకు భంగం కలగకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. దీనిపై భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదే’ అని ట్విటర్ స్పష్టం చేసింది. చదవండి: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
డిజిటల్ మీడియాకు వాక్ స్వేచ్ఛ వద్దా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, వారి సంభాషణలను శాశ్వతంగా భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది మీడియా వాక్ స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు కూడా సంబంధించిన సమస్య. ప్రతి యూజర్ సందేశాన్ని ఇలా నిలవ చేయటం ద్వారా నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ వాటిలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. కానీ, రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించే తరహా నిబంధనలు విఫలమవుతాయన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు వాక్ స్వేచ్ఛ అనే భావనకే వ్యతిరేకంగా ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం కలుగుతోంది. సాధారణంగా మితభాషిగా ఉండే ఎడిటర్స్ గిల్డ్ సైతం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ ఈ కొత్త నియమాలు దేశంలో మీడియా స్వతంత్రతకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. సాధారణ ప్రజానీకం కోసం కోడ్ రచన, సంకేత నిక్షిప్త సందేశాల టెక్నాలజీ ప్రాప్యతను పరిమితం చేయడానికి 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జాతీయ ప్రభుత్వాల ట్రెండ్కీ కేంద్రప్రభుత్వ మధ్యస్థపు మార్గదర్శకాలకు సమాన ప్రాధాన్యత ఉంది. అమెరికా 1990ల చివరలో క్రిప్టోగ్రఫీని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంపై పరిమితి విధించడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సైఫర్‌పంక్స్ (సామాజిక, రాజకీయ మార్పుకోసం ప్రైవసీ పొడిగింపు టెక్నాలజీలను, క్రిప్టోగ్రఫీని విస్తృతంగా ఉపయోగించాలని ప్రబోధించే వారు) ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. క్రిప్టోగ్రఫిక్ కోడ్ రచనను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని అనుమతించకుండా ఆంక్షలు విధించినప్పుడు, టీ షర్ట్‌లపై ఈ కోడ్‌ను సైఫర్పంక్లు ముద్రించి సంచలనం రేకెత్తించారు.ఈరోజు మనందరం ఆధారపడిన ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ (పంపిన సందేశాలను సంబంధిత యూజర్లు మాత్రమే చదవగలిగేలా చేసే కమ్యూనికేషన్ సిస్టమ్) సైఫర్పంక్లు ప్రారంభించిన 50 ఏళ్ల ప్రతిఘటనా ఉద్యమ ఫలితం మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, ప్రతి యూజర్ గోప్యతా సంభాషణను శాశ్వత రికార్డు రూపంలో భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమస్య మీడియా వాక్ స్వేచ్ఛకు సంబంధించింది మాత్రమే కాదు. అంతకు మించి ఇది సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ప్రాథమిక స్థాయిలో చూస్తే కోడ్‌ను రాసి దాన్ని ప్రచురించడానికి, అభిప్రాయాలను రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. కానీ మెసేజింగ్ యాప్‌లు కోడ్ రచనను ఎలా చేయాలనే విషయమై, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు ఆదేశిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. ఇది సాంకేతిక రంగానికి వర్తించే వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రూపమే తప్ప మరేమీ కాదు.ఈ ప్రత్యేక సమస్య కేంద్ర బిందువు ఏదంటే సిగ్నల్ ప్రొటోకాల్. ఇది సైబర్ రంగంలో అభిప్రాయాలను వెలువరించే కోడ్ వ్యక్తీకరణ. ఇది భౌతిక రంగంలో వాక్ స్వేచ్ఛ పరవళ్లు తొక్కడాన్ని అనుమతిస్తుంది. దీన్ని ‘ఓపెన్ విస్పర్ సిస్టమ్స్’ అనే పేరు కలిగిన లాభేతర కంపెనీ వృద్ధి చేసింది. ఇతరుల కంటబడకుండా, వినకుండా యూజర్లు చేసే గోప్య సంభాషణలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదనే ప్రగాఢ విశ్వాసం ఈ కంపెనీకి ఊపిరిగా ఉంటోంది. మద్రాస్ హైకోర్టులో ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌పై చర్చ జంతు పరిరక్షణా కార్యకర్త ఆంథోనీ క్లెమెంట్ రూబిన్ మద్రాస్ హైకోర్టు ముందు దాఖలు చేసిన ప్రజావ్యాజ్య ప్రయోజన దావాతో యూజర్ల గోప్యతపై చర్చ భారత్‌లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. న్యాయస్థానంలో ఈ అంశంపై జరిగిన చర్చ.. నిక్షిప్త సందేశాలను విచ్ఛిన్నపర్చకుండానే యూజర్ల మాటల సందేశాన్ని వాట్సాప్ ట్రాక్ చేయవచ్చా అనే అంశంపైకి మళ్లింది. అప్పుడు సైతం పేరుచెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు కొందరు ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ (డేటాను గుర్తించి, ట్రాక్ చేసేందుకు నెట్వర్క్ డేటా నష్ట నివారణ సంస్థలు చేపట్టే డేటా లేదా డాక్యుమెంట్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్) వేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా ప్రతిపాదించారు. ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ అమలు అసాధ్యమని వాట్సాప్ తోసిపుచ్చినందున ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ అవసరమే లేదని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ వాదించారు కూడా.అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను ప్రకటించి ఉన్నందున ఫింగర్‌ప్రింటింగ్ సొల్యూషన్ని అమలుపర్చేందుకు అధి కార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అయితే యూజర్ల గోప్యత సందేశాలను తాను వెల్లడి చేయబోననే తప్పుడు ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొస్తోంది. ఫింగర్ ప్రింటింగ్ సొల్యూషన్ యూజర్ల గోప్యత సందేశాలను ఎలా బహిర్గతం చేస్తుందో అర్థం కావాలంటే ఫార్వార్డ్ సీక్రెసీ భావనను ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఫార్వార్డ్ సీక్రెసీ అంటే మీ ప్రస్తుత ఎన్క్రిప్షన్ కీని ఎవరైనా సైబర్ అటాకర్ దొంగిలించినా, మీ మునుపటి సందేశాలను ఇప్పటికీ సురక్షితంగానే ఉంచే సిగ్నల్ ప్రొటోకాల్. ఈ ఫార్వర్డ్ సీక్రెసీ అనేది చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విచ్ఛిన్నపర్చడం ద్వారా మీ సందేశాలన్నింటిని అడ్డుకోవడమే కాకుండా, మీ ఫోన్ నుండి మీ ప్రమేయం లేకుండా బలవంతంగా సందేశాలను గుంజుకోవడానికి ఇలాంటి దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. మన ప్రత్యర్థి దేశాలు ఆత్యాధునిక సైబర్ ఆపరేషన్లను కలిగి ఉంటున్నప్పుడు బలహీనమైన ఎన్క్రిప్షన్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మునుపటి సందేశాలు కొంత కాలం తర్వాత ఆటోమేటిక్‌గా తొలిగిపోతున్నప్పుడు ఫార్వర్ట్ సీక్రెసీ అనేది మరింతగా ఆచరణ సాధ్యంగా మారుతుంది. కాబట్టి మీ ఫోన్‌ని మీరు కోల్పోయినా లేక ఎవరైనా తీసుకుపోయినా సరే వాటిలోని పాత సందేశాలని ఎవరూ ఇకపై చూడలేరు. సంగ్రహించలేరు. కాబట్టి, సిగ్నల్ మెసెంజర్, వాట్సాప్ రెండింటిలో సందేశాలు మాయమవడం అనేది ఒక ప్రామాణిక ఫీచర్‌గా ఉంటుంది. అంటే ఇతరుల చెవిలో మాత్రమే మనం వినిపించే గుసగుసలు ఎలా రహస్యంగా ఉంటాయో, అవి గాల్లో ఎలా కలిసిపోతాయో ఆ రకంగా ఇకపై మొబైల్ సందేశాలు కనిపించకుండా పోతాయి. మీరు ఒక గ్రూప్‌లో సందేశాలను పంపించినప్పుడు, ఇతర డివైస్ల నుంచి సందేశాలను తొలగించే సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మీ గోప్యత మరింత విస్తృతమవడమే కాకుండా స్వేచ్ఛగా మీకు మీరుగా గానీ, లేక గ్రూప్‌లో కానీ మాట్లాడవచ్చు.అభిప్రాయాలను పంచిపెడుతూ, ప్రజలను ప్రభావితం చేసేం దుకు ఒక పబ్లిక్ రంగాన్ని రూపొందించి ఉంచే ట్విట్టర్, ఫేస్బుక్ మాదిరి కాకుండా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు అనేవి వ్యక్తులు లేదా గ్రూపుల వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసమే ప్రాథమికంగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు లేదా సంభాషణ కర్తలు నేరస్వభావంతో ఉండవచ్చు. ఒక మూసివుంచిన గదిలో నేరాలు ఎలా చేయాలో మాట్లాడుకునే భావసారూప్యత కలిగిన వ్యక్తులకు, ఇలాంటి యూజర్ల గ్రూపుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి గ్రూప్లలోకి చొరబడటం ద్వారా లేక ఇలాంటి గ్రూప్‌ల ఆధారాన్ని సేకరించి వారు చేస్తున్న నేరాలను పసిగట్టి దర్యాప్తు చేయడం నిఘా సంస్థల పని. ఒక సందేశాన్ని మొట్టమొదటగా ఎవరు పంపించారో కనుగొనడానికి మెసేజింగ్ అప్లికేషన్లు తమ నిక్షిప్త సందేశాల టెక్నాలజీని మార్చుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రతి సందేశాన్ని, ప్రతి యూజర్ వివరాలకు సంబంధించిన హ్యాష్ విలువలను తప్పకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి సందేశాన్ని ఇలా నిలవ చేయటం అంటే నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ ఈ సందేశాలలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. ఇటీవలే దిశారవి అరెస్టు సందర్భంగా ఢిల్లీ కోర్టు వాక్ స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను కోరుకునే హక్కును కలిగి ఉంటుందని, కమ్యూనికేషన్లో అలాంటి భౌగోళిక అడ్డుగోడలు ఉండవని వ్యాఖ్యానించడాన్ని గుర్తుంచుకోవాలి. రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించడానికి తీసుకొచ్చే నిబంధనలు తప్పక విఫలమవుతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయడాన్ని నియంత్రించడం ఎలా అనే అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ కొడాలి వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు డేటా, ఇంటర్నెట్ గవర్నెన్స్ (ది వైర్ సౌజన్యంతో) -
సోషల్ మీడియాపై అణచివేతలొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు ఓకే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి 10వ తేదీన పునాది రాయి వేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సర్కారు హామీ ఇవ్వడంతో శంకుస్థాపన విషయంలో సానుకూలంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన సముదాయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిల్లు చేశారు. వీటిపై తాజాగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ం హామీని పరిగణనలోకి తీసుకుని శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది. -
వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ నిలయాలుగా ఎప్పుడు మారుతాయని ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం కోరిక మేరకు కుటుంబసభ్యులు ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసిరినందుకు సంతోషం. ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా.. బోధన, రచన, పత్రిక రంగాల్లో స్వేచ్ఛ ప్రజల సహజ, ఉన్నత వికాసానికి పునాది వంటివి’. అయితే, మన వర్సిటీలు అటువంటి వాస్తవమైన స్వేచ్ఛా నిలయాలుగా ఎప్పుడు మారతాయి?’అని పేర్కొన్నారు. -
‘ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా ఓటు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము ఓటర్లలో సగం. దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా మేము ఈ సారి ఓటు వేస్తాం. పట్టపగలు, పలువురు చూస్తుండగా ఈ హత్యలు జరుగుతుండడం దారణం. మా రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయి. మా భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నారు’ అని 58 ఏళ్ల మంజూ శర్మ వ్యాఖ్యానించారు. ఆమె ఓ సామాజిక కార్యకర్త. గురువారం నాడు ఢిల్లీ మండి హౌజ్ నుంచి జంతర్ మంతర్‌కు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మహిళల్లో ఆమె ఒకరు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, రైతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులకు సంబంధించిన పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మహిళలకు పిలుపు ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగిందని ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారని ఆమె చెప్పారు. పితృస్వామిక వ్యవస్థ, ఫాసిజం, కులతత్వం నశించాలంటూ ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు నినదించారు. సోమాసేన్, సుధా భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా వారు ప్లే కార్డులను ప్రదర్శించారు. పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌లో సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మందితోపాటు ఈ ఇరువురిని జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసకాండకు ఆ సమావేశమే కారణం అంటూ వారిపై కేసులు నమోదు చేశారు. దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయి విధ్వంసం, హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరవైందని, మరోపక్క నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో ప్రధానాంశం నిరుద్యోగమేనని 50 ఏళ్ల అఫ్రోజ్ గుల్జార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు ఆరోపించారు. -
సెక్షన్ రద్దు చేసినా ఇప్పటికీ అరెస్టులా?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో భావప్రకటనా స్వేచ్ఛపై గతంలో సెక్షన్ 66ఏపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై కేంద్రాన్ని సోమవారం వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఈ సెక్షన్‌ను ఉపయోగించి అరెస్టులు జరుగుతున్నాయన్న పిల్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 2015 మార్చి 24న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులను అరెస్టుచేసి జైలుకు పంపాలని, జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. 2015లో సుప్రీంకోర్టు రద్దుచేసిన ఈ సెక్షన్ ఆధారంగా ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారని, పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది సంజయ్ పారిఖ్ న్యాయస్థానానికి తెలిపారు. -
భావ ప్రకటనా స్వేచ్ఛే ఓ జోక్!
సాక్షి, న్యూఢిల్లీ : ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంపైనున్న శిల్పాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రక్షణ శాఖ విశ్లేషకుడు అభిజిత్ ఐయ్యర్ మిత్రాపై ఒడిశా అసెంబ్లీలో పెద్ద దుమారం రేగడం, ఆయనపై రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల నోటీసు జారీ చేయడం, రాష్ట్ర పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేయడం, తక్షణమే అభిజిత్‌కు బెయిల్ మంజూరవడం గురువారం ఒక్క రోజే వేగంగా జరిగిన పరిణామాలు. ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ నుంచి ఇటీవలనే బయటకు వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బైజయంత్ జైపాండేకు చెందిన హెలికాప్టర్లో అభిజిత్ ఐయ్యర్ మిత్రా, జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ కొణార్క్ పర్యటనకు వెళ్లారు. బుధవారం కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించిన అభిజిత్ ఐయ్యర్, అక్కడి ఆలయ గోడలపై అసభ్య భంగిమల్లో ఉన్న దేవతా విగ్రహాలను చూసి ‘ఇదేమీ విగ్రహాలు! హిందువులను అవమానించేందుకే ముస్లింలు ఈ విగ్రహాలను ఇలా చెక్కించారేమో (అసభ్య పదాలను మినహాయించాం). రేపు కట్టబోయే మా రామమందిరంలో ఇలాంటి విగ్రహాలు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఒడిశా అసెంబ్లీ, ఒడిశా పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయగా, పోలీసులు భిన్న మతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ సెక్షన్ కింద, వ్యక్తుల మత విశ్వాసాలను కించపరిచారంటూ 295ఏ, 298 సెక్షన్ల కింద అభిజిత్‌పై కేసులు నమోదు చేశారు. సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కళాకారుల సృజనాత్మక చర్యలను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎక్కువగా 295ఏ, 298 సెక్షన్లను ఉపయోగిస్తాయి. ఇక ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే 12ఏ సెక్షన్ కింద ఏకంగా దేశద్రోహం కేసులనే పెడతాయి. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్న ఈ సెక్షన్లు బ్రిటీష్ కాలం నాటివి. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ప్రభుత్వాలు ఈ సెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాయి. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన బైజయంత్ జయ్ పాండే అతిథిగా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఒడిశా ప్రభుత్వానికి ఎక్కువ కోపం వచ్చినట్లుంది. చిలికీ సరస్సు మీదుగా వెళ్లిందన్న కారణంగా పాండే హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరన పరిస్థితుల పరిరక్షణలో భాగంగా చిలికీ సరస్సు మీదుగా హెలికాప్టర్‌ను అనుమతించమని ప్రభుత్వం చెబుతోంది. తన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించరాదని, జోక్ చేశానని అభిజిత్ సమర్థించుకునేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఆయన్ని వదిలి పెట్టడం లేదు. ఈ నెల 28వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సిందే. నిజంగా అభిజిత్ వ్యాఖ్యల్లో జోక్ లేదుగానీ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనుకోవడం మాత్రం పెద్ద జోకే! -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
స్వేచ్ఛగా మాట్లాడటం నేడు ఒక పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : నేడు సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడటం ఒక పరీక్ష లాంటిదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం ఇక్కడి రవీంద్రభారతిలో తెలంగాణ ఎడ్యుకేషనల్, సోషల్, కల్చరల్ లిటరరీ సొసైటీ ఆధ్వర్యంలో సెక్టోరియల్ సెమినార్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ వాస్తవాలను సేకరించడం, వ్యాఖ్యలను ప్రచురించడానికే పరిమిత మైన పత్రికలు ప్రభుత్వాల నిఘాలో ఉన్న ట్లు తెలుస్తోందన్నారు. పత్రికలకు గతంలో ఉన్న స్వేచ్ఛ నేడు లేదన్న విషయం ప్రజలకూ తెలుసన్నారు. గతంలో ఇంతకంటే మంచిగా పరిశోధనాత్మక కథనాలు వచ్చేవన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన మీటింగ్ వార్తను పత్రికల్లో సింగిల్ కాలంలోనూ, మరుసటిరోజు మంత్రి హరీశ్‌రావు చేసిన ఖండనలను పతాక శీర్షికలోన్లూ వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరంపై చర్చలేకపోవడం ఆశ్చర్యకరం... రూ.84 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని రామచంద్రమూర్తి అన్నారు. ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సీఎం సమీక్ష సమావేశాలు, పర్యటనల సమాచారాన్ని సీఎం కార్యాలయంలో పని చేసోన్న బృందం పంపించే సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని, సొంతంగా ఎటువంటి అదనపు విషయాలను ప్రచురించవద్దనే సందేశాన్ని సైతం పంపడం బాధాకరమన్నారు. నేడు మీడియా సీఎం అధీనంలోకి వెళ్లడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఇటీవల పని ఒత్తిడితో 250 మంది జర్నలిస్టులు చనిపోయారని, తెలంగాణలో విలేకరుల పరిస్థితి అనే అంశంపై నివేదిక తయారు చేసి త్వరలో దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల్లో వచ్చిన వార్తల కంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకే స్పందన ఎక్కువగా ఉందన్నారు. ఆయా అంశాలపై సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఉ మా సుధీర్, పాశం యాదగిరి, కారంచేడు గోపాలం, సుమనాస్పతిరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండల్రావు, కన్వీనర్ సీహెచ్ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కత్తి మహేశ్‌ను హీరో చేసిందెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు. పైగా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా విశ్లేషకుడు కత్తి మహేశ్, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పాద యాత్ర జరుపుతానంటూ హెచ్చరిక చేసిన పరపూర్ణానంద స్వామి పట్ల పరస్పరం భిన్నంగా వ్యవహరించడం కూడా తెలంగాణ పోలీసులకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కత్తి మహేశ్‌కు ఎలాంటి న్యాయపరమైన నోటీసులు ఇవ్వని పోలీసులు (పిలిపించి మాట్లాడారే తప్ప), మత మార్పిడిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తొలుత స్వామిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, కత్తి మహేశ్‌ను మాత్రం నగర బహిష్కారం చేశారు. పోలీసుల నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడమే కాకుండా ప్రతిపాదిత నిరసన పాద యాత్రను మానుకోనని మొండికేయడంతోనే స్వామినీ కూడా నగర బహిష్కారం చేశారు. సమన్యాయం చాటుకునేందుకే అలాచేసి ఉండవచ్చు. కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు నిక్కచ్చిగా ఆయన తన సొంత అభిప్రాయంగానే చెప్పారు. అది ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆయన అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శించవచ్చు. అంతేగానీ శిక్షించే అధికారం చట్టానికే లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు ఇంకెక్కడిది? ఆ మాటకొస్తే రామాయణంపై అందులోని పాత్రలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఎంతో మంది సాహిత్యవేత్తలు, మేథావులు రామాయణాన్ని విమర్శించారు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రముఖ తెలుగు మహిళా సాహితీవేత్త రంగనాయకమ్మ ‘రామాయణం ఓ విష వృక్షం’ అని ఓ గ్రంధమే రాశారు. దక్షిణాదిలో ద్రావిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్ ఈవీ రామస్వామి రామాయణంలోని అన్ని పాత్రలను విశ్లేషిస్తూ దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్యా.. తదితర పాత్రలన్నింటిని విమర్శించారు. రాముడు, లక్ష్మణుడు శూర్పనకను అవమానించిన కారణంగానే అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతనుఎత్తుకు పోయాడని, అమెను కనీసం ముట్టుకోలేదంటూ రావణాసురుడిని సమర్థించారు. రామాయణాన్ని ఆయన విశ్లేషిస్తూ పెరియార్ రామస్వామి రాసిన ‘ఈవీ రామస్వామీస్ రీడింగ్ ఆఫ్ ది రామాయణ’ అనే పుస్తకాన్ని తమిళయన్లు పవిత్ర గ్రంధంగా పూజిస్తున్నారు. పెరియార్ రామస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన ప్రారంభించిన ద్రావిడ ఉద్యమం పేరు దాదాపు అన్ని రాజకీయ పార్టీల పేర్లలో మిలితమై ఉంటుంది. ఇటు పెరియార్ రామస్వామి పుస్తకాన్నిగానీ, తెలుగునాట రంగనాయకమ్మ రాసిన ‘రామాయణం విషవృక్షం’ పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు? ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్‌బ్యాక్స్ ప్రచురించిన ‘మెనీ రామయాణాస్’ చదివితే ఇంకేమైనా ఉందా? ఇంకా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిషేధించలేదు కనుక, ఈ పుస్తకాలను కూడా నిషేధించలేదు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్‌కు నగర బహిష్కార శిక్ష సబబా, కాదా? అన్న చర్చ వస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కత్తి మహేశ్‌కు వచ్చిన పబ్లిసిటీ ఏమోగానీ నగర బహిష్కరణ శిక్ష ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. మహేశ్ వర్సెస్ పరిపూర్ణానంద స్వామి ఎపిసోడ్లో స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు మాట వరుసకు కూడా కత్తి బహిష్కారాన్ని ఖండించలేదు. కేంద్రంలో ఇటీవల అస్తమానం భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం ఈ ఎపిసోడ్‌పై స్పందించడం లేదు. అదే నెట్‌ఫిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. గాంధీ, నెహ్రూలు వారికి దేవుళ్లతో సమానం కనుక వారికి కోపం వచ్చి ఉంటుంది. హిందువులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ సాక్రెడ్ గేమ్స్‌పై ఆరెస్సెస్ వారు కూడా కోర్టుకెళ్లారు. అది వేరే విషయం. -
హైదరాబాద్ నుంచి ‘కత్తి’ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్రంగా స్పందిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భావ వ్యక్తీకరణ పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఆరు మాసాలపాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాయని, వారికి తామెంత మాత్రం అవకాశం ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ‘భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలే తప్ప ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్, హాజర్డష్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 కింద ఆరు నెలల పాటు కత్తి మహేశ్‌ను రాజధాని నుంచి బహిష్కరిస్తున్నాం. మహేశ్‌ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లా కు తరలించాం. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, సమాజాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు. న్యూస్ చానల్‌పై చర్యలు కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసి ప్రజ ల్లో అశాంతి కలిగేలా వ్యవహరించిన ఓ న్యూస్ చాన ల్‌పై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. సంబంధిత చానల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు చానల్‌పై కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నంబర్–7 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చానల్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చ రించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా, తీసుకునేలా ప్రేరేపించినా కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపిస్తామన్నారు. నగర బహిష్కరణ ఉత్తర్వులను ఉల్లంఘించి కత్తి మహేశ్ మళ్లీ నగరంలోకి అడుగుపెడితే మూడేళ్లపాటు జైలు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. సరైన చర్యలు తీసుకునేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. కత్తి మహేశ్ బహిష్కరణ ప్రస్తుతం హైదరాబాద్ వరకే పరిమితమని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ విధిస్తామన్నారు. ఏపీలో మీడియాతో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. కత్తి మహేశ్‌పై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయన్నారు. ధార్మిక సంఘాలు, ఇతరులు చట్టాలను చేతుల్లోకి తీసు కుని అశాంతికి కారణం కావద్దని, ఏదైనా సమస్య తలె త్తితే దాన్ని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో నగర కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై కేసు నమోదు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా, సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టీవీ చర్చా వేదికలో రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ సంబంధిత ఆధారాలతో రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కత్తి మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీని కలసిన బీజేపీ ఎమ్మెల్యేలు కత్తి మహేశ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్.. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీని కలిశారు. స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతోపాటు ఆయనను గృహ నిర్బంధం చేయడం, ఆయన ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేశారు. మహేశ్ నగర బహిష్కరణపై రాజాసింగ్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. యాదాద్రి సందర్శనకు పరిపూర్ణానందకు అనుమతివ్వాలని కోరినట్టు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. -
భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో విఫలం
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తి వైఫల్యం చెందారని ప్రముఖ పాత్రికేయులు, డీఎన్ఏ పత్రిక న్యూఢిల్లీ సంపాదకులు ఇఫ్తెఖార్ గిలానీ అన్నారు. ఈ పరిస్థితులపై ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల ఉద్యమకారులు స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కశ్మీర్లో మీడియా పరిస్థితి భయంకరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో సీనియర్ పాత్రికేయులు షుజాత్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసినానంతరం కశ్మీర్లో నెలకొన్న మీడియా పరిస్థితులపై శనివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. ఆర్మీ, తీవ్రవాదులు, ప్రభు త్వ అనుకూల ముఠాలు, పోలీసులు మీడియాను శత్రువుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. షుజాత్ బుఖారీ హత్యపై భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్య అనంతరం మీడియాపై బెదిరింపులు తీవ్రస్థాయికి చేరాయన్నారు. పాత్రికేయులు ధైర్యంగా, నిర్భయంగా వార్తలు రాస్తూ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేని పత్రికలకు భారత ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వటం లేదని, ఈ ప్రస్తుత పరిణామాలకు జాతీయ మీడియా కూడా బాధ్యత వహించాలన్నారు. జాతీయ మీడియా నెగటివ్ వార్తలు ప్రచారం చేస్తోందని తెలిపారు. కశ్మీర్ అందాలు, భక్తి భావాల గురించి చెప్పడం మరచి హింస గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్రం తమ విధానం మార్చుకొని ప్రేమపూర్వకంగా నడవాలన్నారు. కశ్మీర్లో జరుగు తున్న మీడియాపై దాడుల విషయం ప్రభుత్వానికి, గవర్నర్‌కు చెప్పిన ప్రయోజనం లేదన్నారు. వార్తలు రాసే పరిస్థితులు కశ్మీర్లో లేవన్నారు. ఇక నార్త్ కశ్మీర్లో వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి అసలే లేదన్నారు. కశ్మీర్లో 13 మంది జర్నలిస్టులు చనిపోతే విచారణలో పురోగతి లేదన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జర్నలిస్టులు చేపట్టే కార్యక్రమాలకు అన్ని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు అండగా నిలబడాలని తెలిపారు. జర్నలిస్టులపై అక్కడ జరిగే దాడుల గురించి మానవ హక్కుల సంఘాలు కానీ ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించటంలేదన్నారు. ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా మాట్లాడుతూ కశ్మీర్లో జరిగే పాత్రికేయుల హత్యలపై జాతీయ మీడియా దృష్టి సారించాలని, కశ్మీర్ పరిణామాలను వాస్తవిక దృక్పథంతో చూడటం లేదని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వ్యతిరేక ప్రచారం చేయడం దారుణమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్టులు కలసి పోరాడినప్పుడే ఇలాంటి ఘటనలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల గొంతు నొక్కడమం టే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని అన్నారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం కశ్మీర్‌ను సందర్శించి నివేదికను తయారు చేస్తే దానిని కేంద్రానికి అందజేస్తామన్నారు. -
పరుష పదజాలం అంటే..
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కామెంట్ పెట్టిన అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరుష పదజాలం అంటే కొలమానం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో చేసే ఇలాంటి చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌పై రాజకీయ కక్షతో కేసులు పెట్టారని తెలిపారు. ఐపీసీలోని 506, 507 సెక్షన్లను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరుష పదజాలంతో దూషించడాన్ని కోర్టు అనుమతి లేకుండా విచారించదగిన నేరంగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంను అమల్లోకి తెచ్చిన రోజున ఇలాంటి చట్ట సవరణలు తేవడాన్ని ఆయన వ్యతిరేకించారు. మనుషుల అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో లోపం లేదని, పాలకుల్లో ఉందని.. అందుకే మారుస్తాం అన్న ప్రతిసారి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వివరించారు. రాజకీయాల్లో ఉండాల్సిన అవసరంపై చర్చిస్తున్నామని తెలిపారు. రాజకీయాలు మారకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి నెలలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. -
పాకిస్థాన్ కు అమెరికా సూచన
వాషింగ్టన్: హింసను ప్రోత్సహించవద్దని పాకిస్థాన్ లోని అన్ని రాజకీయ పార్టీలను అమెరికా కోరింది. భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. హింసాత్మక విధానాలకు దూరంగా ఉండాలని సూచింది. 'సమూహ స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. తదనుగుణంగా మెలగుతుంటాం. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు అందరికీ ఉంద'ని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఆందోళన నిర్వహించే రాజకీయ పార్టీలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని, సంయమనంతో వ్యవరించాలని సూచించారు. పాకిస్థాన్ లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. అయితే పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని సైన్యం నియంత్రింస్తోందన్న ఆరోపణలపై స్పందించేందుకు కిర్బీ నిరాకరించారు. ఇది పాకిస్థాన్ అంతర్గత విషయమని, దీనిపై కామెంట్ చేయబోనని చెప్పారు. పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను కనిపెట్టి చూస్తున్నామని వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించేందుకు పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘ఇస్లామాబాద్ ముట్టడి’కి మంగళవారం పిలుపుయిచ్చారు. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో ఇమ్రాన్ ఖాన్ తన ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. -
ప్రశ్నిస్తే రాజద్రోహమా?
సాక్షి, సిటీబ్యూరో: ఉరిశిక్షలు వద్దన్నందుకు.. భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలన్నందుకు... హింసను ఖండించినందుకు... మతోన్మాదాన్ని ప్రశ్నించినందుకు దేశంలో రాజద్రోహ నేరం మోపుతున్నారని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజద్రోహ నేరం కింద ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుంటున్న వారిని చేయాలన్నారు. ‘రాజకీయ ఖైదీల హక్కుల దినం’ సందర్భంగా కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్’ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. బ్రిటిష్ వారు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తెచ్చిన చట్టాలను ఈనాడు మన దేశ ప్రజలపైనే ప్రయోగించడం అన్యాయమన్నారు. సీఆర్పీపీ కార్యదర్శి బల్ల రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.వై.రత్నం మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛకు, మేథో వికాసానికీ పునాదిగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు మతోన్మాద శక్తుల చేతిలో బందీలుగా మారాయన్నారు. ఫాసిస్టు శక్తులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి అధ్యాపకులు, విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలిని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న హింస బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు ఎన్కౌంటర్ల పేరుతో‡కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. గ్రీన్‌హంట్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నదంతా ఇదేనని అన్నారు. విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైళ్లలోనూ.. బయట జరుగుతున్న ఉద్యమాలను పాలకులు ఎంతోకాలం అణచలేరని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మౌలానా నసీరుద్దీన్, సిఎల్సి నారాయణ, చైతన్య మహిళా సంఘం సావిత్రి తదితరులు మాట్లాడారు. -
'జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషనైపోయింది'
బెంగళూరు: ‘ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. నేను ఈ పవిత్ర వేదిక నుంచి అటువంటి వారికి ఒకటే చెప్పదలుచుకున్నా... జాతీయ సమగ్రత లేకపోతే రాజ్యాంగమే ఉండదు. ప్రజలు కూడా అటువంటి వారిని దూరంగా ఉంచాలి’ అని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. మంగళూరులో ఆదివారం జరిగిన తిరంగయాత్రలో పాల్గొన్న అనంతరం మంగళూరు వర్శిటీలో జరిగిన సభలో ప్రసంగించారు. మునుపెన్నడూ లేనంతగా భారత దేశం రెండేళ్ల కాలంలో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుండడాన్ని ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాయన్నారు. ఇందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న విధానాలే కారణమన్నారు. దేశ భద్రత విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీ పడదన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాటుదారులను ఎదుర్కొనేందుకు గతంలోలాగా ఢిల్లీ నుంచి ఆదేశాలు అందే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. నిరసనల స్వాగతం... తిరంగ యాత్రలో పాల్గొనడానికి మంగళూరు వచ్చిన అమిత్‌షాకు నిరసనల స్వాగతం లభించింది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు ఆయన రాకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లటి జెండాలు పట్టుకుని నగర వీధుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. -
అది భావప్రకటన స్వేచ్ఛపై దాడే
కోదండరాంపై మంత్రుల ఎదురుదాడిని ఖండించిన ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రులు ఎదురుదాడికి దిగడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని, దీనిని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల పక్షాన గొంతెత్తుతున్నందుకు ప్రొఫెసర్ కోదండరాంపై ప్రభుత్వ యంత్రాంగమంతా దాడి చేయడాన్ని ప్రజా, హక్కుల సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత, హక్కు కోదండారాంకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోగ్యకర మైన విమర్శలు లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదన్నారు. సమాజంలో భిన్నరంగాల వ్యక్తులు ఉంటారని, వారి విమర్శలను ప్రభుత్వం పాఠాలుగా తీసుకుని సవరించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను చెప్పిందే నడవాలనే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి పనికిరాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేసీఆర్, కోదండరాం మాట్లాడవద్దంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
భావస్వేచ్ఛకు రక్షణ ‘ఫుల్‌బెంచ్’
రెండో మాట విద్వత్ సంపన్నులైన పతంజలి శాస్త్రి, వివన్ బోస్, ఎస్.ఆర్.దాస్, హిదయతుల్లా, కృష్ణయ్యర్, పి.ఎన్. భగవతి లాంటి హేమాహేమీలు గొప్ప న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన కాలంతో పోల్చుకుంటే మన ప్రస్తుత దశ మరింత ప్రగతిశీలం కావాలని కోరుకోవడం తప్పుకాదు! ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఇటీవల కొన్ని కేసుల విచారణ సందర్భంగా వేస్తున్న విజ్ఞానదాయకమైన ప్రశ్నలు గమనిస్తుంటే జమ్ము-కశ్మీర్లో ఆయన నెలకొల్పిన కీర్తిప్రతిష్టలు గుర్తుకురాక మానవు! ‘పరువు నష్టం కేసులలో సత్యం/వాస్తవం అనేది డిఫెన్స్ కాజాలదు’ (ఇండియన్ పీనల్ కోడ్ 499-500 సెక్షన్ల ప్రకారం) ‘పరువు నష్టం కేసులలో సత్యం లేదా వాస్తవం అనేది డిఫెన్స్ కాకపోతే మరేదీ డిఫెన్స్?’ (ఈ వ్యాసకర్త ఒక దినపత్రిక సంపాదకునిగా ఉన్నకాలంలో, వేరొక పత్రిక యాజమాన్యం కళాఖండాల తరలింపు వివాదం మీద సుప్రీంకోర్టులో వేసిన రిట్పిటిషన్ను అనుమతించిన సందర్భంగా-ఎస్ఎల్పి సివిల్ సూట్ 13568 /2003- గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య) ఈ రిట్‌ను ఈ వ్యాసకర్త తరఫున దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది 499 సెక్షన్ భాషను గౌరవ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కేసులో ‘సత్యం’ (ట్రూత్ ఈజ్ నాట్ డిఫెన్స్) డిఫెన్స్ కాకుంటే, మరేదట? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అప్పుడు సీనియర్ న్యాయవాది న్యాయమూర్తి ఆసనం మీద ముద్రించి ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తిని గురించి గుర్తు చేశారు. వెంటనే రిట్‌ను స్వీకరించారు. కానీ ఆ రిట్‌ను దాఖలు చేసిన 13 ఏళ్ల తరు వాత కూడా ఇప్పటికీ అది విచారణకు రాకపోవడం ఆశ్చర్యకరం. కానీ ఐదేళ్ల తరువాత ఇదే పరువు నష్టం వివాదంలో ‘ది హిందూ’ దినపత్రిక కేసు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. కేసు కొట్టివే శారు కూడా. ఏది ఏమైనా కేసుల విచారణలో అసాధారణ జాప్యం ఒక వాస్తవం. ఇందుకు కారణాలను ప్రధాని మోదీ హాజరైన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రస్తుత గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆవేదనతో ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల నియామకాలు జరగాలని సూచించారు. వలసవాదుల ఉచ్ఛిష్టమే పరువునష్టం ఈ ప్రస్తావన ఇక్కడ తేవడానికి కారణం ఉంది. రాజకీయ, పత్రికారంగాలలో వ్యక్తమయ్యే భావ ప్రకటనా స్వేచ్ఛలో, భిన్నాభిప్రాయాల ప్రకటనలను అదుపు చేసే పరువు నష్టం కేసులలో క్రిమినల్ డిఫమేషన్ చట్టాన్ని సమర్ధిస్తూ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు చెప్పింది. వలసపాలనా వశేషంగా సంక్రమించిన శిక్షా స్మృతిలోని ఈ క్రిమినల్ సెక్షన్‌ను రద్దు చేయా లని కోరుతూ పలువురు ప్రసిద్ధులు (ఒక బీజేపీ నేత సహా) దాఖలు చేసిన పిటిషన్ల మీద ఆ ఇద్దరు సభ్యుల బెంచ్ తీర్పు చెప్పింది. అవినీతి, ప్రజా వ్యతిరేకత వంటి అంశాల మీద పత్రికలు, విలేకరులు, సంపాదకులు ఎవరూ వార్తలు వంటివి ప్రచురించకుండా, ఉద్యమాలు చేపట్టకుండా బ్రిటిష్ పాల కులు క్రిమినల్ డిఫమేషన్ క్లాజులను చేర్చుకున్నారు. ఆ ఉచ్చిష్టాన్నే స్వతంత్ర భారత పాలకులు అందిపుచ్చుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి, ఈ రోజు దాకా చేసిన చట్టాలు 5000 అని అంచనా. వీటి మూలాలన్నీ వలస పాలన నుంచి సంక్రమించిన చట్టాలలోనివే. వాటి చాటునే కాంగ్రెస్, బీజేపీ పాలకులు తమ ప్రయోజనాలకు అనుకూలంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలు గ్రహించకుండా, గ్రహించినా నిరసనకు అవ కాశం లేకుండా చేసేందుకు పత్రికలను, ఇతర ప్రసార మాధ్యమాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను పాలకులు ఎప్పుడైతే ‘సెడిషన్’పేరుతో ప్రకటించడానికి సాహసించారో, అప్పుడే సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు, కొందరు న్యాయ మూర్తులు కూడా ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పని పరిస్థితి వచ్చింది. గూఢచారి సంస్థలు, ఆర్థిక సంస్థలు ఏలికల ప్రయోజనాల కోసం రాజ్యాంగం నిర్దేశించిన తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేని దురదృష్టకర పరిణామం ఎమర్జెన్సీ కాలం నుంచే ప్రారంభమైంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి హెచ్ఆర్ ఖన్నా, మరో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులు మినహా మిగిలిన ధర్మాసన శాఖలు నిరంకుశ పాలనా వ్యవస్థకు లొంగి తీర్పులు ఇవ్వడం ప్రారం భించాయి. అన్ని ప్రాథమిక హక్కులు కుప్పకూలి, హెబియస్ కార్పస్ రిట్‌ను సయితం సమర్పించడానికీ, కోర్టులు స్వీకరించడానికీ వీలులేని ‘ఎమ ర్జెన్సీ’లో సాహసించి రిట్‌ను స్వీకరించి వందలాది మంది డిటెన్యూలను విడు దల చేస్తూ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోగల చర్య తీసుకున్నవారు జస్టిస్ ఖన్నా. చట్టంలోని క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్‌ను ఇద్దరు సభ్యుల బెంచ్ సమర్థిస్తూనే, మరో వైపున ‘భిన్నాభిప్రాయ ప్రకటన ఉండరాద’ని తీర్పు ఉద్దేశం కాదని, ఎదుటి వ్యక్తి గౌరవానికి భంగం లేకుండా సౌభ్రాతృత్వ భావాన్ని పెంపొందించాలన్నదే తీర్పు భావన అనీ ప్రకటించింది. కానీ ఆ లక్ష్యాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల పరిధిలో సాధించి పెట్టే లక్ష్యంతో ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు దేశ సంపదను ప్రజా బాహుళ్యం అనుభవించకుండా చేసే కొలది మంది దగాకోరుల చర్యలను, భూబకా సురుల చర్యలను కార్పొరేట్ వర్గాల దుశ్చర్యలను మీడియా బహిర్గతం చేయడాన్ని ఏమని పిలుద్దాం? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రక్షణ అధ్యాయానికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని సామాన్యుల జీవితాలను సుఖ మయం చేయడానికి దోహదం చేసే ఆదేశిక సూత్రాల(డెరైక్టివ్ ప్రిన్సిపుల్స్) అధ్యాయానికి పాలకులు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి. అలాగే ఒక అధ్యా యాన్ని (ప్రాథమిక హక్కు - ఆస్తి హక్కులను) కోర్టులను ఆశ్రయించి అమలు చేయించుకోడానికి అవకాశం కల్పించి, మరో రాజ్యాంగ ఆదేశాల అధ్యాయాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారో కూడా న్యాయస్థానాలు సమా దానం చెప్పాల్సి ఉంటుంది! ‘2-జి’ స్కాముల తర్వాత, న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకాల నిర్ధారణకు జ్యుడీషియరీ స్థానే జాతీయ స్థాయి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పరచాలన్న (అనుకూలుర నియామకాల కోసం) మోదీ పట్టుబట్టినప్పుడు సుప్రీం నిరాకరించినప్పటి నుంచీ రాజ్యాంగ సంస్థల మధ్య ఘర్షణ వస్తూనే ఉంది. బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన వేధింపును ప్రశ్నించి, పార్టీల బలాబలాల నిరూపణకు శాసనసభ మాత్రమే వేదికని జస్టిస్ జీవన్‌రెడ్డి ప్రభృతులతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయినా మోదీ ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనను కూల్చడానికి రాష్ట్రపతిని చాటు చేసుకుంది. సుప్రీం జోక్యంతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దయింది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వానికి చుక్కెదురే. ఇక ఊరట ఎక్కడ లభించిందంటే - భావ ప్రకటనా స్వేచ్ఛను ‘దేశద్రో హం’గా భావిస్తున్న బీజీపీ పాలకులకు తాజాగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం పత్రికా స్వేచ్ఛకు విధించిన షరతులు ‘వ్యక్తి పరువునష్టం సమాజం మీదనే ఎక్కుపెట్టిన నేరం’గా ప్రకటించింది. అది కూడా ఏ సమయంలో? సివిల్ డిఫమేషన్‌ను ఉంచి, చట్టంలోని ‘క్రిమినల్ డిఫమేషన్’ సెక్షన్‌ను రద్దు చేయా లని ప్రపంచ వ్యాప్తంగా కోరుతున్న దశలో ఈ ప్రకటన వచ్చింది. ఇటీవల కాలంలో ఎన్నో విషయాలలో ధర్మాసన చైతన్యాన్ని ఆచరణలో చూపగలుగు తున్న సుప్రీంకోర్టు ఈ విషయంలోనూ ముందంజ వేయాలి. ద్విసభ్య ధర్మాసనం ధృవపరచిన క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్‌ను సుప్రీం ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం తక్షణం సమావేశమై కొట్టివేయాలి. ఎందుకంటే, ‘న్యాయ వ్యవస్థ ఒక్కో అడుగు చొప్పున ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ శాసన వ్యవస్థనే ఆక్రమిస్తోంద’ని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (11-5-2016) హెచ్చరికగానే ప్రకటించారు. ‘మా మంత్రి పదవులను కోరుకునే పక్షంలో జడ్జీలు తమ హోదాలను వదులుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు’నని అదే రోజున మరో కేంద్రమంత్రి గడ్కారీ సవాలు విసిరాడు! అమెరికాలో పెట్టు బడి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రగతి భావాల వ్యాప్తి ఉధృతంగా సాగు తున్న రోజుల్లో కొందరు అమెరికన్ జడ్జీలు మార్క్సిజం లేదా కమ్యూనిజం, సోషలిజం అన్న పదాలు వినడానికి, వాడడానికి భీతిల్లి పోతున్న ఘడియలలో జస్టిస్ బ్రాండీస్, హోమ్స్ లాంటి ఉద్దండులైన అమెరికన్ న్యాయమూర్తులు (విట్నీ ఁ కాలిఫోర్నియా కేసు) ఎలాంటి చైత న్యంతో స్పందించారో వినడం ఒక సుకృతం: ‘‘అమెరికా విమోచనోద్యమకారుల, స్వాతంత్య్రప్రదాతల, ప్రజల సంతోషానికి, ధైర్య సాహసాలకి వెనకనున్న రహస్యం వారు స్వేచ్ఛ, స్వాతం త్య్రాలని విశ్వసించారు. వ్యక్తి స్థాయిలో ఎవరో పిడుగులా వచ్చి తన వ్యక్తి త్వాన్ని భంగపరుస్తారన్న భయం, భీతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛనూ, సమావేశ స్వేచ్ఛనూ అణచి వేయడానికి సాకు కారాదు. చేతబడులు చేసే మంత్రగత్తెలున్నారన్న భయంకొద్దీ మనుషులు స్త్రీలను వెంటాడి తగలబెట్టే వారు. ఇలాంటి హేతు విరుద్ధమైన భయాల బంధనాల బానిసత్వం నుంచి మనుషుల్ని బయట పడవేయడమే భావస్వేచ్ఛ బాధ్యత, కార్యాచరణం. భావ స్వేచ్ఛను, భావ ప్రకటననూ అణచివేయాలంటే, భావ స్వేచ్ఛను అనుమతించడంవల్ల ఏదో తీవ్రమైన చెడు వాటిల్లబోతుందన్న భయానికి హేతుబద్ధమైన పునాది ఉండితీరాలి’’! ఈ భావ స్వేచ్ఛ గురించిన చర్చ వాదోపవాదాలు జరిగిన తర్వాతనే మన సుప్రీంకోర్టు అనేక కేసులలో రాజ్యాంగంలోని 19(2) అధికరణలో భావప్రకటనా స్వేచ్ఛ పూర్వరంగంలో ‘హేతుబద్ధమైన అదుపాజ్ఞలు’ అన్న క్లాజును చొప్పించింది. సత్యవార్త నుంచి రక్షణ లేకుంటే... సుప్రీం ద్విసభ్య ధర్మాసనం చెప్పిన తీర్పు ప్రకారం పత్రికలుగానీ, ఇతర మాధ్యమాలుగానీ ఒక దురన్యాయాన్ని లేదా దుర్మార్గాన్ని వార్తలుగా రాయకూడని పరిస్థితిని రుద్దినట్టవుతోంది. ఎందుకని? పీనల్ కోడ్ 499 సెక్షన్ కింద ‘సత్యవార్త’ అనేది వార్త రాసిన వాడికి రక్షణ (డిఫెన్స్) కాకుండా పోతుంది కదా! ఈ సెక్షన్ కిందనే బ్రిటిష్ వలస పాలకులు మనల్ని నానా కోర్టులకూ తిప్పి వేధించిన విషయం న్యాయమూర్తులు సహా మనందరికి ‘పరగడుపు’ అయిపోతే ఎలా?! పైగా ‘‘నక్కీరన్’’ పత్రికపై నడిచిన కేసులో సీనియర్ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి ఫుల్‌బెంచ్ తీర్పు చెబుతూ సమాచార సాంకేతిక వ్యవస్థ శరవేగాన దూసుకువచ్చి వార్తా మాధ్యమాల రంగాన్ని భారీస్థాయిలో రోజుకొక తీరున ప్రభావితం చేస్తున్న ఈ దశలో ‘‘క్రిమినల్ డిఫమేషన్’’ సెక్షన్‌ను ఎత్తివేసి సివిల్ డిఫమేషన్ కింద వాదోపవాదాలు జరిగి తీర్పులు వెలువరించడం శ్రేయస్కరమని (1994 - రాజగోపాలన్ ఁ తమిళ నాడు కేసు) తీర్పు చెప్పారని గుర్తించాలి! విద్వత్ సంపన్నులైన పతంజలి శాస్త్రి, వివన్ బోస్, ఎస్.ఆర్.దాస్, హిదయతుల్లా, కృష్ణయ్యర్, పి.ఎన్. భగవతి లాంటి హేమాహేమీలు గొప్ప న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయ మూర్తులుగా పనిచేసిన కాలంతో పోల్చుకుంటే మన ప్రస్తుత దశ మరింత ప్రగతిశీలం కావాలని కోరుకోవడం తప్పుకాదు! ప్రస్తుత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఠాకూర్ ఇటీవల కొన్ని కేసుల విచారణ సందర్భంగా వేస్తున్న విజ్ఞానదాయకమైన ప్రశ్నలు గమనిస్తుంటే జమ్ము-కశ్మీర్లో ఆయన నెల కొల్పిన కీర్తి ప్రతిష్టలు గుర్తుకురాక మానవు! ‘సత్యాన్ని’ వధించేది ధర్మమూ కాదు, న్యాయమూ కాదు, మరోసారి జడ్జిగారి సీటుపై ధర్మాసన ముద్రను - ‘సత్యమేవజయతే’ ను తలచుకుంటూ, సెలవు! సెలవు! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎఫ్ఐఆర్ కింగ్ అయ్యాను!
జైపూర్: వ్యక్తిగత జీవితాల గురించి హద్దులు దాటి మాట్లాడుతున్నందున భారత్ లో పరిస్థితులు చాలా కష్టమని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యానించాడు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న అసహనం లాంటి వివాదాలపై తాను పోరాడదలుచుకోలేదన్నట్లు తెలిపాడు. ఎవరి గురించైనా మాట్లాడితే జైలులో పెడతారని చెప్పాడు. జైపూర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న కరణ్ ఈ విధంగా స్పందించాడు. స్వలింగసంపర్కుల కాన్సెప్ట్ మీద 'దోస్తానా', భార్యాభర్తల అనుబంధాల తీరుపై 'కబి అల్విదా నా కెహనా' లాంటి చిత్రాలను కరణ్ తీశాడు. వాక్ స్వాతంత్ర్యం ఉందనుకోవడం ప్రపంచంలోనే ఓ పెద్ద జోక్ అని, ప్రజాస్వామ్యం అనేది రెండో పెద్ద జోక్ అవుతుందంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. ప్రతి విషయంలో కొన్ని హద్దులుంటాయని, సినిమాలలో తాను ప్రస్తావించిన విషయాలపై, సభలలో తాను మాట్లాడిన అంశాలపై లీగల్ నోటిసులు అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతానన్నాడు. ఎక్కడికి వెళ్లినా తాను భయపడాల్సి వస్తుందని.. ప్రస్తుతం జైపూర్‌లో ఏం మాట్లాడిన ఇంటికి వెళ్లేలోగా తనపై కేసు నమోదు అవుతుందోనంటూ వ్యాఖ్యానించాడు. ఓ విధంగా చెప్పాలంటే తాను ఎఫ్ఐఆర్ కింగ్ మాదిరిగా తయారయ్యనంటూ చమత్కరించాడు. గతేడాది ముంబైలో వెస్ట్రన్ మూవీ కమెడీని అపహాస్యం చేశాడన్న ఆరోపణలతో తనపై కేసు నమోదు విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. అయితే, బాంబే హైకోర్టు నుంచి కరణ్ కు ఊరట లభించింది. తనపై ఎటువంటి చార్జిషీట్ దాఖలు చేయవద్దని ముంబై పోలీసులకు సూచించినట్లు కరణ్ జోహర్ వివరించాడు. -
భావ ప్రకటనకూ పరిమితులున్నాయి: సుప్రీం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ నిరపేక్షమేం కాదని, దానికీ పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛను విశాల కోణంలో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దానికి అంతర్గతంగా స్వతఃసిద్ధ పరిమితులు కూడా ఉండాలి. అవి రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని 19(1) అధికరణ అందించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నిరపేక్షమేం కాదని, దానికీ అదే అధికరణంలోని రెండవ భాగం 19(2) కింద పరిమితులుంటాయని మేం ఇదివరకే స్పష్టమైన వివరణ ఇచ్చాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌ల ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. మహాత్మాగాంధీపై అనుచిత రీతిలో, అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ వసంత్ దత్తాత్రేయ గుర్జార్ అనే మరాఠీ కవి రాసిన కవితను 1994లో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ వారి ఇన్‌హౌజ్ జర్నల్‌లో ప్రచురించిన ప్రచురణ కర్త దేవీదాస్ రామచంద్ర తుల్జాపుర్కర్పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. -
'మోడీ వస్తే కలానికి తాళం'
'మోడీ రాజ్యం వస్తే గుండాలు, రౌడీల రాజ్యం మొదలైనట్టే. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు మొదలైనట్టే. మోడీ రాజ్యం వస్తూందంటే నాకు ఆందోళన కలుగుతోంది.' సటానిక్ వెర్సెస్ అన్న పుస్తకంతో మతమౌఢ్య శక్తుల దాడులకు గురై ఏళ్ళ తరబడి అజ్ఞాత వాసంలో ఉన్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ అన్న మాటలివి. న్యూయార్క్ లో రచయితల భావప్రకటన స్వేచ్ఛ పై జరుగుతున్న పెన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఒక వార్తాసంస్థకు ఇంటర్ వ్యూ ఇచ్చారు. మోడీ మార్కు రాజకీయాల పట్ల ఆయన తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే మోడీ రాజ్యంలో రచయితలు, జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా మంది రచయితలు తమ కలంపై తామే అదుపు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రజల్లో విభాదాలు సృష్టించే ఛాందసవాద నేత అని ఆయన అన్నారు. మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని దేశవాసులకు పిలుపునిస్తూ లేఖ రాసిన మేధావుల్లో భారతీయ మూలానికి చెందిన ఎన్ ఆర్ ఐ సల్మాన్ రష్దీ కూడా ఉన్నారు. -
తెలుసుకోదగ్గ పుస్తకం: కాండీడ్
మేధావి అన్నవాడు విశ్వాసి కాడు. ‘ఎందుకు?’ అని అడగడం వాడి జాతి లక్షణం. అహంభావులను తొడగొట్టి సవాలు చెయ్యటం వాడికి నిత్య వినోదం. విప్లవాత్మకమైన తన ఆలోచనాధోరణితో ప్రభుత్వాలను ధిక్కరించి, ఎద్దేవా చేసి, రెచ్చగొట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు పర్యాయపదంగా మారిన ఫ్రెంచి రచయిత వోల్టేర్. అసలు పేరు ఫ్రాంస్వా మారీ ఆరూ (1694-1778). ‘కుండెడు తేనెలో నీటిబొట్టులాగ ఒక్క అనవసర మాట మంచి పుస్తకాన్ని నేలబారు రచనగా మారుస్తుంది’ అంటాడు. ఈయన వ్యంగ్యాన్ని భరించలేక, నిషేధించలేక గిలగిలా కొట్టుకున్నారు సమకాలీన ప్రభువులు. జనజీవితాన్ని చిత్రించేదే నిజమైన రచన అని వోల్టేర్ విశ్వాసం. ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న తాత్విక ధోరణులను ఎద్దేవా చేయడం కోసం ఈయన పేల్చిన సీమ టపాకాయ ‘కాండీడ్’. ఇది జెనీవాలో అచ్చయినప్పుడు సిటీ కౌన్సిల్‌లోని పెద్దలకు కోపం తెప్పించింది. కాని ఎవరెంత విమర్శించినా రచయిత జీవిత కాలంలోనే నలభైసార్లు అచ్చయింది. లీబ్నిట్జ్ (తత్వవేత్త) సిద్ధాంతాలను వ్యంగ్యంగా విమర్శిస్తూ మత ఛాందసతనూ, మత మౌఢ్యాన్నీ నిరసించిన నవలిక కాండీడ్. మానవ సంబంధాలలో ఏదో వైరుధ్యమున్నది. అందుకే నిత్య సంఘర్షణలు. యుద్ధాలు. భగవంతుడు నిజంగా దయాళువైతే లోకం ఎందుకలా ఉన్నది అని ప్రశ్నిస్తాడు రచయిత. ప్రపంచ సాహిత్యంలో ఒక మైలురాయి కాండీడ్. గలివర్స్ ట్రావెల్స్ పంచతంత్రం, ఈసప్ కథలు బాలసాహిత్యం కాదు. రాజరికపు బాధ్యతలు నిర్వర్తించాలంటే లోకరీతిని అర్థం చేసుకోవటం అత్యవసరం. రాజకుమారులకు విష్ణుశర్మ కథల రూపంలో బోధించింది అదే. లిడియా మహారాజుగారి ఆజ్ఞ మేరకు, గ్రీసులోని వివిధ ప్రాంతాలు పర్యటించి, రకరకాల కథల ద్వారా నీతిబోధ చేసి సామంత రాజుల మధ్య తగవులు తీర్చాడు ఈసప్. ఐరిష్ రచయిత్ జానతన్ స్విఫ్ట్ (1667-1745) మానవ బలహీనతల మీద సంధించిన వ్యంగ్యాస్త్రమే గలివర్స్ ట్రావెల్స్. మర్యాదస్తులను చికాకు పర్చటానికే తాను ఈ నవల రాశానని ప్రకటించాడు రచయిత. బడా భూస్వాముల ప్రజాస్వామ్యంలో అవినీతి రాజ్యమేలింది. డబ్బు సంపాదన తప్ప మనిషికి మరో ఆశయం లేకుండా పోయింది. మత గురువులు అధికారం కోసమే ప్రాకులాడారు. పద్దెనిమిదవ శతాబ్దంలోని ఇంగ్లండు వాతావరణమిది. సమకాలీన సమాజాన్ని అత్యంత ఘాటుగా అన్యాపదేశంగా, తన సోషియో ఫాంటసీ నవలలో ఎండగట్టాడు స్విఫ్ట్. కెప్టెన్ లెమూర్ తన నాలుగు సముద్ర యాత్రల్లో- లిల్లిపుట్ యాత్ర, బ్రాబ్డింగ్నాగ్ యాత్ర, లాపూటా యాత్ర, హూన్మ్ దేశ యాత్ర- చిత్ర విచిత్ర అనుభవాలను ఎదుర్కొంటాడు. నిజానికి అవి అంత చిత్రమైనవేమీ కావు. లెన్సుకు మరోవైపు నుండి చూస్తే కనిపించే మనకు సుపరిచితమైన లోకమే అది. పిల్లలనూ పెద్దలనూ ఏకకాలంలో అలరించగల అద్భుత కావ్యం గలివర్స్ ట్రావెల్స్. - ముక్తవరం పార్థసారథి డైరీ.... మార్చి 15 శనివారం సాయంత్రం విజయవాడ రోటరీ ఆడిటోరియంలో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి’ ఆత్మీయ సమావేశం. వేమూరి బలరామ్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు పాల్గొంటారు. మార్చి 16 ఆదివారం బొగ్గులకుంట ఆంధ్రసారస్వత పరిషత్ హాలులో ఉ.10 నుంచి సా. 5 వరకు అరసం డెబ్బయ్ వసంతోత్సవాల ముగింపు సభ. కవిత ‘నువ్వు’ అనే ఆ లిపి! అంత దీర్ఘమైన నిద్రలో ఆ వొక్క శకలమే ఎందుకు ఎందుకు ఎందుకని తవ్వుకుంటూ వెళ్తావ్ నీ ముఖమ్మీద ఎండ పొడ చిన్ని కిటికీ రెక్క తోసుకొని వాలిపోతుంది నువ్వింకా ఆ చీకట్లో ఆ నిద్రలో ఆ కలలో రెప్పలు వాల్చుకునే వున్నావని తెలీక. నీకు తెలుసు ఇక్కడ ఇప్పుడీ క్షణాన నువ్వు సగం దేహమే ఉన్నావని యింకో సగం కొన్ని గ్రహాలకు ఆవల ఏమేం చేస్తూ ఉందో నీకు తెలీదు- కల నీ భాష- నిన్ను పది అద్దాలలో చూపిస్తుంది చిత్రంగా ఉంటావ్ నువ్వు ఆ దేశంలో అచ్చంగా నీదైన నీ లోకంలో వున్నట్టు శరీరాన్ని పిట్టలాగా ఎగరేస్తూ వుంటావ్ గాయపడిందో జ్వరపడిందో కాని మనసంతా తడిమి తడిమి చూసుకుంటావ్ పేచీల్లేకుండా ఎంత అందంగా బిగువుగా కౌగిళ్లు ఇస్తావో నువ్వూ నేనూ రాసుకునే వాక్యాలకు వొకే వొక్క అర్థం ఇక్కడ మాత్రం! ఎండ నీ దేహపు గదిలోకి నిండా పరుచుకుంటుంది నీ లోపల ఇంకా వొక రాత్రి మిగిలే వుందని తెలీక- నువ్వు యింకా యింకా కొన్ని తలుపులు తెరుచుకుంటూ ఎటు వెళ్తున్నావో తేలక. ఇంతకీ ఆ వొకే ఒక శకలం అన్నావే అది ఏ లిపిలో వుందో నీకుగానీ తెలుసా? - అఫ్సర్ -
ఫారో మార్కు ప్రజాస్వామ్యం
ఈజిప్ట్ సైనిక నియంత అల్ సిసీ అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నారు. ప్రత్యర్థులే లేని ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యం. ప్రజాస్వామ్య పరివర్తనకు నాంది పలుకుతానంటున్న సిసీ భావప్రకటనా స్వేచ్ఛపై పంజా విసిరారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా ఎంత? దుస్తులు మార్చుకున్నంత. ఈజిప్టు ‘దుస్తులు’ మార్చుకోబోతోంది. సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అబ్దెల్ అల్ ఫతా అల్ సిసీ ఏప్రిల్‌లో పౌర దుస్తులు ధరించడంతో ఈజిప్టు ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుంది. సంశయజీవులు మయన్మార్ నిన్నగాక మొన్న దుస్తులు మార్చి ప్రజాస్వామ్య పరివర్తనను సాధించిన వైనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరి. నాటకీయత లేని రాజకీయాలు రక్తి కట్టవు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ప్రజాభీష్టాన్ని తిరస్కరించజాలను’ అని సిసీ బుధవారం కువైట్ పత్రిక ‘అల్ సియాసా’తో అన్నారు. అలా అయన అన్నా, దాని అర్థం ఆ పత్రిక ప్రచారం చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పినట్టు కాదని ఆయన ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనరని చెప్పలేదు. ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో సిసీ పోటీ చేయాలని అత్యున్నత సైనిక మండలి గత నెల 27న తీర్మానించింది. దాన్ని ఆయన శిరసావహించక తప్పదు. మండలి అధిపతి ఆయనే. రాజకీయ ప్రవేశానికి మొదటి అర్హత... అన్నది అనలేదంటూ పాత్రికేయులను అబ ద్దాలకోర్లుగా రుజువు చేయడం. సిసీ ఆ అర్హతను సాధించారు. గత నెల 19న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిసీ మార్కు రాజ్యాంగం 98.1 శాతం ఓట్లతో ఆమోదం పొందింది. మూడు కోట్లకు పైబడిన ఓటర్లలో 38.6 శాతమే ఓటింగ్‌లో పాల్గొన్నారనేది, 60 శాతం ఓటర్లయిన 18-40ల మధ్య వయస్కులు పోలింగ్ బూత్‌ల మొహం చూడలేదనేది వాస్తవమే. అంత మాత్రాన అది ‘ప్రజామోదం’ కాకపోదు. ఆ రాజ్యాంగం ప్రకారం సిసీ సైనిక మండలి అధ్యక్ష పదవిని, రక్షణమంత్రి పదవిని వదులుకోకుండానే సింహాసనం ఎక్కేయవచ్చు. ప్రజాస్వామ్యం దుస్తులు మార్చడం అయిన చోట ఎన్నికలు తప్పనిసరి తద్ధినం కాక మరేమవుతాయి? ఇదంతా ఒక ప్రహసనమని నిషిద్ధ ‘ఉగ్రవాద సంస్థ’ ముస్లిం బ్రదర్ హుడ్ హేళన చేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాకుండా పోదు. బ్రదర్హుడ్ నేత, మాజీ అధ్యక్షుడు, తాజా ‘ఉగ్రవాది’ మొహ్మద్ ముర్సీ 2012లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 33 శాతం ఓటర్లే పాల్గొన్నారు. వారిలో 64 శాతం మాత్రమే ఆయన రాజ్యాంగానికి అవునన్నారు! అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడు విప్లవం మొదట్లోనే హోస్నీ ముబారక్ పాలనను ‘అరబ్బు తరహా ప్రజాస్వామ్యం’గా అభివర్ణించారు. సరిగ్గా మూడేళ్లకు ఈజిప్ట్ అక్కడికే చేరిందంటే అది ఆయన చాణక్యమే. నాటి విప్లవంలో ప్రజాస్వామ్య యువత, వామపక్ష ట్రేడ్యూనియన్లతో భుజం కలిపి సాగిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను వారి నుంచి వేరు చేసినది అమెరికాయే. అధికారం ఆశజూపి లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన పార్లమెంటు ఎన్నికల్లో ముర్సీ పాల్గొనేలా చేశారు. సైనిక మండలికి అధికారాలను కట్టబెట్టి అమెరికా నాడు మొహ్మద్ హుస్సేన్ తంత్వానీకి పగ్గాలను అప్పగించింది. నామమాత్రపు అధికారాలే ఉన్న ముర్సీ తంత్వానీని తొలగించి, ఏరికోరి (2012) సిసీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఓటర్లలో మూడింట ఒక వంతు మద్దతే ఉన్న బ్రదర్‌హుడ్‌కు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. సిసీనే నమ్ముకున్నారు. ‘బ్రదర్హుడ్ ఫీల్డ్ మార్షల్’ సిసీ... ముర్సీనే కటకటాల పాలుచేసి, బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 20 వేల మందిని నిర్బంధించారు. అమెరికా మిత్రభేదం ఫలించింది. ఇతర పక్షాలేవీ మాట్లాడలేదు. పైగా నాడు సిసీని ‘హీరో’గా భావించాయి. నాటి లౌకికవాద హీరో ఇప్పుడు ‘ఉగ్రవాద వ్యతిరేక హీరో’గా రూపాంతరం చెందారు. అల్ సియాసాతో మాట్లాడుతూ ఆయన... గల్ఫ్ సహకార మండలి ఉగ్రవాదాన్ని (బ్లాక్ టై) నిర్మూలించడానికి సహకరించాలని కోరారు. ఆయన అడగకుండానే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల కోట్ల నిధులను కుమ్మరించాయి. ‘ఉగ్రవాదం’పై పోరుకు ముందు షరతు ఎప్పుడూ ‘పంచమాంగ దళమే’... అంటే పత్రికలే. సిసీ అధికారంలోకి వచ్చినవెంటనే తమకు తామే కళ్లూ, చెవులు, నోళ్లు మూసేసుకోవడం స్థానిక పత్రికలు అలవరుచుకున్నాయి. ‘అల్‌జజీరా’కు ఆ ఇంగితం లేకపోయింది. ఫలితం అనుభవిస్తోంది. నలుగురు విదేశీయులు సహా 20 మంది పాత్రికేయులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘అన్సర్ అల్ మక్దిన్’ అనే అల్‌కాయిదా అనుబంధ సంస్థ గత పదిహేను రోజుల్లోనే కైరోలో కారుబాంబు పేలుడుకు, సినాయ్‌లో ఒక సైనిక హెలికాప్టర్ కూల్చివేతకు, ఒక పోలీస్ జనరల్ హత్యకు పాల్పడింది. ఆ సంస్థకు సౌదీ మద్దతున్నది కాబట్టి అది ఉగ్రవాద సంస్థ కాదు, దానిది ఉగ్రవాదం కాదు. అభినవ ఫారో ప్రజాస్వామ్యంతో పీనుగుల పిరమిడ్లను నిర్మించనున్నారు. - పి. గౌతమ్