
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులిచి్చన నివేదికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నివేదికలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే అంశం ఏమీ కనిపించడం లేదని పేర్కొంది. ఒక తప్పుడు ప్రకటన రాజ్యాంగంలో 153ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని వివరించింది. దేశంలో ఎందరో జర్నలిస్టులు నిత్యం ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తుంటారు. వారందరిపైనా అభియోగాలు మోపుతారా అని పోలీసులను ప్రశ్నించింది.
ఈ కేసులో ఈజీఐకి చెందిన నలుగురు సభ్యులకు పోలీసు అరెస్ట్ నుంచి ఇచి్చన రక్షణను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఐ సభ్యులపై నమోదైన కేసును ఎందుకు కొట్టివేయరాదని మణిపూర్ పోలీసులను ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు. మణిపూర్ హింసపై నిజ నిర్థారణలో భాగంగా నలుగురు సభ్యుల ఈజీఐ అక్కడికి వెళ్లి సెప్టెంబర్ 2న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఘర్షణలను ప్రేరేపించేదిగా ఉందంటూ పోలీసులు ఈజీఐకి చెందిన నలుగురు స భ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment