manipur violence
-
జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్ సీఎం
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్(Biren Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, హింసాత్మక ఘటనలకుగానూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనైనా శాంతి స్థాపనకు ముందుకు రావాలంటూ తెగలన్నింటికి ఆయన పిలుపు ఇచ్చారు.‘‘గతేడాది మే 3వ తేదీ నుంచి ఇవాళ్టిదాకా జరిగిన పరిణామాలపై నేను క్షమాపణలు చెప్పదల్చుకుంటున్నా. గడిచిన ఏడాది అంతా చాలా దురదృష్టకరమైంది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయారు. మరెంతో మంది తమ ఇళ్లను వదిలి వలసలు వెళ్లారు. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు. అయితే..గత మూడు, నాలుగు నెలల నుంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోయే సమయంలో.. 2025 రాష్ట్రంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా.. అయ్యిందేదో అయ్యింది. గతంలో జరిగిన తప్పులను మరిచిపోయి.. కొత్త ఏడాదిలో అందరం కొత్త జీవితాల్ని ప్రారంభిద్దాం. మణిపూర్(Manipur)ను శాంతి వనంగా మార్చుకుందాం. ఇదే అన్ని ఉన్న 35 తెగలకు నేను చేసే ఏకైక విజ్ఞప్తి అని సందేశం అని అన్నారాయన. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపుర్ అట్టుడుకుతోంది. తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతుండడంతో.. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతల అదుపు విషయంలో అక్కడి పోలీస్ శాఖ చేతులు ఎత్తేయడంతో.. 19 నెలలుగా కేంద్ర బలగాలే అక్కడ పహారా కాస్తున్నాయి. తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో.. ఇంటర్నెట్పై సైతం చాలాకాలం ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.ఒకవైపు.. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపడం, భార్యభర్తలను తగలబెట్టడం, అన్నాచెల్లెళ్లను పైశాచికంగా హతమార్చడం.. తరహా ఘటనలు మణిపూర్ గడ్డ నుంచి వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. మరోవైపు.. రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. ఇంకోవైపు.. సుప్రీం కోర్టు(Supreme Court) జోక్యంతోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే.. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయితీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. వాస్తవానికి మెయితీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయితీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయితీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయితీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.అదే సమయంలో.. మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది అక్కడి ప్రజలు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయితీలు ఆరోపిస్తున్నారు. -
మణిపూర్ హింస.. రాష్ట్రపతి జోక్యంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఇంఫాల్: మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనేలోగా కథ మొదటి కొచ్చింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రం మళ్లీ దాడులు మొదలయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కాయి.ఈ క్రమంలో మణిపూర్ హింసను అణచివేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ, ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే గురువారం రాత్రి లేఖ రాశారు.రాష్ట్రపతికి రాసిన రెండు పేజీల లేఖలో.. కేంద్ర మరియు మణిపూర్ ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోయిందని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు, హింసాత్మక రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నిరాకరిస్తున్నారనేది ఎవరికి అర్థం కాని విషయమని అన్నారు.‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. చట్టబద్దమైన పాలన లేకపోవడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఇది జాతీయ భద్రతకు రాజీ, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను అణిచివేతకు దారితీస్తుంది. .లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత 18 నెలల్లో మూడుసార్లు మణిపూర్‌ను సందర్శించారు నేను కూడా స్వయంగా రాష్ట్రాన్ని సందర్శించాను’ అని ఖర్గే అన్నారు.దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. ఖర్గే ఆరోపణలను తిప్పికొడుతూ.. మైతేయి, కుకీ వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండపై కాంగ్రెస్ నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శలు గుప్పించారు. గతంలో కేంద్రంలో, మణిపూర్‌లో ఇలాంటి సమస్యలను వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీని పర్యవసానాలు నేటికీ అనుభవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను మీ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా, అప్పటి హోం మంత్రి పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మరచిపోయినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. -
మణిపూర్ మంటలు: ప్రభుత్వానికి మైతేయి సంఘాల అల్టిమేటం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణలు మరోసారి చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇందుకు జిరిబామ్ జిల్లాలో మైతేయి వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు హత్యకు గురవ్వడమే కారణం. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తుండటంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి. వీరి హత్యను నిరసిస్తూ నిరసనకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అయితే శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే గైర్హాజరు అయ్యారు.మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానం డిమాండ్ చేస్తుంది. అయితే మూడు కీలక హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ చేయాలని శాసనసభ్యులు డిమాండ్ చేశారు. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.పై తీర్మానాలను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయకుంటే ఎన్డీయే శాసనసభ్యులందరూ రాష్ట్ర ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి సచివాలయం విడుదల చేసిన తీర్మానంలో పేర్కొంది.అయితే ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మైతేయి పౌర సమాజ సంస్థలు తిరస్కరించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొకొమి (కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) అధికార ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు. ‘ ఈ తీర్మానాలతో మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందలేదు. జిరిబామ్‌లో ఆరుగురు అమాయక మహిళలు, పిల్లలను చంపిన కుకీ మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇది కేవలం జిరిబామ్‌లో మాత్రమే జరగలేదు. 2023 నుంచి మణిపూర్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో జరుగుతున్నాయి. కాబట్టి కుకీ మిలిటెంట్ల చెందిన గ్రూపులపై (SoO groups) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ్యులను మణిపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు’ అని తెలిపారు.అన్ని SoO సమూహాలను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని, కుకీ తిరుగుబాటుదారులతో కార్యకలాపాల సస్పెన్షన్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయాలని మైతేయి పౌర సమాజ సంఘం డిమాండ్ చేసింది. ‘ప్రభుత్వం లేదా శాసనసభ్యులు మళ్లీ ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. వచ్చే 24 గంటల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సమీక్షించి మంచి తీర్మానంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. వారు అలా చేయకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంతా ముందుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తాం’ కొకొమి ప్రతినిధి పేర్కొన్నారు.మరోవైపు అల్లర్లను అదుపు చేయలేకపోవడం, హింసాకాండ ఎక్కువడంతో ఇప్పటికే ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) తన మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటి వరకు 220 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
మణిపూర్‌లో అలర్ట్.. ప్రభుత్వానికి మైటీల 24 గంటల డెడ్‌లైన్
ఇంపాల్: మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైథీ వర్గానికి చెందిన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో పీక్ స్టేజ్‌కు మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైథీ వర్గం డిమాండ్ చేస్తున్నారు.తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని హత్య చేసి ఓ నది వద్ద పడేశారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం.. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు నినాదాలు చేశారు. రోడ్లపై ఫర్నీచర్లను తగులబెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించారు.PM आज जब अपने 8000 करोड़ के आलीशान हवाईजहाज में सवार हुए तो लगा Manipur जाएंगे,लेकिन वो U-turn लेकिन Nigeria चले गए। pic.twitter.com/54fizO5bia— Srinivas BV (@srinivasiyc) November 16, 2024ఈ సందర్భంగా మైథీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా మాట్లాడుతూ.. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందేంత వరకు వారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల అసంతృప్తిని చవిచూడాల్సి వస్తుంది. అన్ని సాయుధ సమూహాలపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు, సైనిక అణిచివేత చర్యలు తీసుకోవాలని మేము భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిలిటెంట్లపై వెంటనే సైనిక చర్య తీసుకోవాలని, AFSPAని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లోగా మా డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్రం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.People stage a protest after bodies of three people from the Meitei community were found, days after they were taken hostage by suspected insurgents from Manipur’s Jiribam district, in Imphal. pic.twitter.com/drpsT9B0iX— Rajan Chaudhary (@EditorRajan) November 17, 2024 -
మణిపూర్‌లో మళ్లీ హింస... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది. ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్‌ను తిడ్డిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.కాగా ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలు శనివారం ఉదయం గుర్తించారు. -
Manipur: కుకీల అరాచకం!.. ఆరుగురి మృతదేహాలు లభ్యం
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. ఈ క్రమంలో జిరిబామ్‌లో సోమవారం కుకీ ఉగ్రవాదులు మైతీ వర్గానికి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయం విదితమే. కిడ్నాప్‌కు గురైన ఆరుగురి మృతదేహాలను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బందీలుగా చేసిన అయిదు రోజులకు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ముందుగా శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ ముగ్గురు మహిళల మృతుదేహాలు లభ్యమవ్వగా.. నేడు మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మృతదేహాలు కొంత కుళ్లిపోవడంతో ఉబ్బిపోయాయని, అందరూ మైతీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.కాగా జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బోకోబెరా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్‌పై సాయుధ కుకీలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్కౌంటర్లో అనుమానిత కుకీ ఉగ్రవాదుల్లో పది మందిని పోలీసులు కాల్చిచంపారు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వీరిని కుకీలు కిడ్నాప్ చేశారు. -
అల్లర్లకు చెక్!.. మణిపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని ఆర్మీ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలను పట్టుకున్నారు.మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో 21 సెప్టెంబర్ 2024న భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా రెండు జాయింట్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఆయుధాలను, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్‌లో, చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్జింగ్ రిడ్జ్‌లోని దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు 9 ఎంఎం పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఒక సింగిల్ బ్యారెల్ రైఫిల్, రెండు స్థానికంగా తయారు చేసిన రాకెట్లు, ఒక లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 6.2 కిలోల గ్రేడ్-2 పేలుడు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.రెండో ఆపరేషన్‌లో భాగంగా తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చాంగ్బీ గ్రామంలో సోదాలు నిర్వహించగా.. రెండు కార్బైన్ మెషిన్ గన్లు, రెండు పిస్టల్స్, సింగిల్ బ్యారెల్ గన్, 9 గ్రెనేడ్లు, చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.ఇదిలా ఉండగా..గత ఏడాది మే నుంచి మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మందికి పౌరులు మృత్యువాత పడ్డారు. వేలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. ఇక, తాజాగా మిలిటెంట్లు ఇప్పుడు ప్రత్యర్థి వర్గానికి చెందిన గ్రామాలను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు, అధునాతన రాకెట్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజులు క్రితమే విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు -
మణిపూర్‌లో హై టెన్షన్.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. मणिपुर में प्रदर्शनकारियों ने राज्यपाल के घर पर किया पथराव. मोदी जी अभी रूस और यूक्रेन के बीच युद्ध रुकवाने में व्यस्त हैं!#ManipurVoilence #Manipur pic.twitter.com/t2E3honaQn— Newswala (@Newswalahindi) September 10, 2024 ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.Imphal under CurfewIt seems to be the shortcut to maintaining law and order. @NBirenSingh @narendramodi @AmitShah After 16th months of #Manipurcrisis this is what you can come severely affecting the small-time business and unorganised workforce.#ManipurFightsBack… pic.twitter.com/2pDPUKTKrs— khaba (@krishnankh) September 10, 2024 ఏడాది నుంచి ఘర్షణలు..ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. The condition in Manipur has become very critical now…#Manipur #ManipurConflict #ManipurCrisis #ManipurFightsBack pic.twitter.com/R8GKNFUOGg— Anindya Das (@AnindyaDas1) September 10, 2024 మరోవైపు.. మణిపూర్ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంMatinee show for #ManipurCrisis. When #Meities have to stage a protest this is the precautions the state security forces react,in #Churachandpur and #Kangpokpi, #Kukis_Zo are allowed to march with guns. #ManipurConflict #iPhone16Plus #Kuki_ZoEngineeredManipurViolence #iPhone pic.twitter.com/28FPjkl4JH— Adu-Oirasu. (@themeiteitweets) September 10, 2024 Students are protesting in Manipur after the death of 9 People.The condition in Manipur is getting worse everyday.Godi media is busy in Hindu-Muslim Propaganda….they won’t show these things 👇pic.twitter.com/DHMUUwGilj— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) September 9, 2024 -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు. -
Rahul Gandhi: మోదీజీ.. మణిపూర్‌కు రండి
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో కొన్ని నెలల క్రితం రావణకాష్టంగా రగిలిపోయిన మణిపూర్‌కు ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి ఇక్కడి వారి కష్టాలను అర్థంచేసుకోవాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఘర్షణల్లో సర్వస్వ కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. బీజేపీపాలిత రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఓదార్చారు. వారి బాగోగులను అడిగి తెల్సుకున్నారు. ‘‘ సోదరుడిగా ఇక్కడికొచ్చా. మీ బాధలు, కష్టాలు వింటా. ఇక్కడ శాంతి నెలకొనాల్సిన సమయం వచి్చంది. హింస ప్రతిఒక్కరినీ బాధిస్తోంది. వేల కుటుంబాలు కష్టాలబారిన పడ్డాయి. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. అమాయక జనం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. దేశంలో మరెక్కడా ఇంతటి దారుణాలు చోటుచేసుకోలేదు. మణిపూర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు, మీకు బాసటగా నిలిచేందుకు, మీ సోదరుడిగా వచ్చా’’ అని బాధిత కుటుంబాలతో రాహుల్ అన్నారు. బాధితులను కలిశాక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ మణిపూర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మోదీకి తెలియాలి. అందుకోసం ఇక్కడికి రండి. ఇక్కడ ఏం జరుగుతోందో తెల్సుకోండి. ప్రజల కష్టాలు వినండి’’ అని పరోక్షంగా మోదీకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేను సైతం రాహుల్ కలిశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా సద్దుమణకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. -
PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శల నేపథ్యంలో మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ప్రధాని బదులిచ్చారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో మణిపూర్ అంశంపై వివరంగా మాట్లాడారు. అక్కడ హింస క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ‘‘మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యా సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు కూడా దాదాపుగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను సంపూర్ణంగా పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అన్నివిధాలా కలిసి పని చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పలు రోజుల పాటు ఉండి మరీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 500 మందికి పైగా అరెస్టయ్యారు. 11 వేల పై చిలుకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’’ అని వివరించారు. మణిపూర్ హింసపై గత సమావేశాల సందర్భంగా రాజ్యసభలో తాను సుదీర్ఘంగా మాట్లాడానని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మణిపూర్ ఇప్పుడు వరదలతో సతమతమవుతోంది. కనుక ఈ అంశంపై విపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మాతో కలిసి రావాలి’’ అని కోరారు. కానీ మోదీ వ్యాఖ్యలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. మణిపూర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందన్నాయి. అక్కడ గత మేలో హింస చెలరేగితే ఏడాదైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మోదీకి తీరిక చిక్కలేదా అంటూ మండిపడ్డాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. అందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ నిరాకరించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. విపక్షాలు సభనే గాక రాజ్యాంగాన్ని కూడా అవమానించాయంటూ ఆగ్రహించారు. ‘‘మీరు వీడింది సభను కాదు, మర్యాదను’’ అంటూ దుయ్యబట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మణిపూర్ జాతుల సంఘర్షణలకు మూలం దాని చరిత్రలోనే ఉందన్నారు. స్వాతంత్య్రానంతరం అక్కడ 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచి్చందని గుర్తు చేశారు. 1993 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో భారీ స్థాయిలో సామాజిక సంఘర్షణ చోటుచేసుకుందన్నారు. ‘‘కనుక మణిపూర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఓపికగా, ఆచితూచి వ్యవహరించాలి’’ అన్నారు. నీట్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. రాజ్యాంగాన్ని కాలరాసిందే కాంగ్రెస్! అంతకు ముందు సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మరోసారి తూర్పరాబట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన వారినుంచి ఇలాంటి మాటలు విడ్డూరం! ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. ఆ ఎన్నికల్లో మాత్రమే ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటేశారు. కాంగ్రెస్ సర్కారును సాగనంపారు’’ అంటూ దుయ్యబట్టారు. దాంతో మోదీ అబద్ధాలకోరంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. వారి నినాదాల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగించారు. దర్యాప్తు సంస్థలకు మరింత స్వేచ్ఛ అవినీతి, నల్లధనంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపుతామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘అవినీతిపరులెవరినీ వదలబోం. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు. రాజ్యసభ నిరవధిక వాయిదా రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించగానే చైర్మన్ ఈ మేరకు ప్రకటించారు. లోక్‌సభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడటం తెలిసిందే. దీంతో పార్లమెంటు సమావేశాలకు తెర పడింది. -
మణిపూర్‌పై రాజకీయాలు ఆపండి: విపక్షాలకు మోదీ చురకలు
న్యూఢిల్లీ: నీట్ వివాదం, మణిపూర్ హింసపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రం తరపున ఆయన సమాధానమిచ్చారు.మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మణిపూర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.‘మణిపూర్‌లో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను ప్రస్తావిస్తూ.. మణిపూర్ చరిత్ర తెలిసిన వారికి మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ సామాజిక సంఘర్షణ మూలం చాలా లోతైనదని ఎవరూ కాదనలేరు. ఇంత చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు మర్చిపోకూడదు.ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. అక్కడి ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారు’. అని పేర్కొన్నారు. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
Manipur: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి జవాన్ ఆత్మహత్య
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్‌లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్‌పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్‌కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: రాహుల్ భద్రతపై అమిత్‌షాకు ఖర్గే లేఖ -
మణిపూర్ హింసాకాండ.. మేం 4 రోజుల్లో ఆపేవాళ్లం: రాహుల్
కలియబోర్: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్‌లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్‌స్టాప్ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్‌లోని నగావ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు. కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్ పేర్కొన్నారు. జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లు... నగావ్ జిల్లాలో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్ తెలిపారు. -
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
మణిపుర్ హింసకు పరిష్కార మార్గం
ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో నూతన సంవత్సర ప్రారంభంలోనే తిరిగి హింసాకాండ చెలరేగింది. రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో సమూహాల మధ్య విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అక్కడి ప్రధాన తెగలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ... వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు చేసుకున్నారు. నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. ముందుగా మణిపుర్ కొండలు, లోయలలో కాల్పుల శబ్దాలు ఆగవలసి ఉంటుంది. ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సుందర మైన ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో తాజా దశ హింసాకాండ చెలరేగింది. మొదటి దశలో నమోదైన జాతిపర మైన ఉన్మాదం, ఇప్పుడు సాయుధ సమూహాల మధ్య క్రూరమైన పాశ్చాత్య తరహా తుపాకీ కాల్పుల స్థాయికి దిగజారింది. మొదటి కొన్ని నెలల హింస ఫలితంగా అక్కడ కనిపించని జాతిపరమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. మైతేయిలు ఎల్లప్పుడూ ఆధిపత్యం వహించే ఇంఫాల్ లోయ నుండి కుకీలు, జోలు, ఇతర గిరిజనులు నిష్క్రమించారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడిచే కొండ జిల్లాలను మైతేయిలు ఖాళీ చేశారు. 1947లో పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలనా కాండను ఇది తలపిస్తోంది. అస్సాం రైఫిల్స్, ఆర్మీ రెజిమెంట్లు మైతేయి ప్రాంతాలు, కుకీలు, పైతీలు వంటి ఇతర గిరిజనులు నివసించే ప్రాంతాలకు మధ్య తటస్థ జోన్ లను సృష్టించాయి. దీనివల్ల తమ ఆధిపత్య ప్రాంతాన్ని విస్తరించడానికి కొన్ని సమయాల్లో ఏదో ఒక వర్గం చేసే ప్రయత్నాల వల్ల అస్థిరమైన శాంతి కొనసాగుతోంది. కాంగ్లీపాక్ తిరుగుబాటు వర్గాలకు చెందిన విçస్తృతమైన నెట్వర్క్ ఒకప్పుడు ఇంఫాల్ లోయను పీడించింది. గత రెండు దశాబ్దాల కాలంలో దాన్ని అణచిపెట్టారు. అది ఇప్పుడు పునరుజ్జీవితమైందనీ, రాష్ట్ర పోలీసు దళం నుండి ‘దోచు కున్న’ ఆయుధాలతో కొందరు సాయుధులయ్యారనీ తెలుస్తోంది. లొంగిపోయి, అస్సాం రైఫిల్స్ నిఘా కళ్ల నీడన, శిబిరాల్లో నివసిస్తున్న కొంతమంది కుకీ మిలిటెంట్లు కూడా ఇదే విధమైన కక్షతో తప్పించుకుని ఉండవచ్చు. కొండ జిల్లాల్లోని సాయుధ గ్రామ అప్రమత్త కమిటీలలో చేరి ఉండవచ్చు కూడా. యుద్ధంలో యుద్ధం సమూహాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రాష్ట్రంలో ‘యుద్ధంలో యుద్ధం’ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదే సమయంలో సాధారణ శాంతిభద్రతలను సద్వినియోగం చేసు కుంటూ దోపిడీ, తుపాకుల సేకరణ, మాదక ద్రవ్యాల వ్యాపారంలో కూడా మునిగిపోతున్నారు. చారిత్రకంగా ఇది వారికి అలవాటైన విద్యే. వీటి సాయంతోనే సాధారణ ప్రజలను లూటీ చేసేవారు. మణి పుర్లోని చిన్న మైతేయి ముస్లిం సమాజమైన పంగల్‌లను మైతేయి మిలిటెంట్ గ్రూప్ లక్ష్యం చేసుకోవడం పరిస్థితుల పతనానికి పరా కాష్టగా కనబడుతోంది. అయితే, జాతుల మధ్య సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు శాంతి కమిటీల ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ, రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. హింసను, సంక్షోభాన్ని పరిష్కరించ డంలో ప్రభుత్వ యంత్రాంగ అసమర్థత ఇప్పటికే కనీసం 180 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 40,000 మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. మయన్మార్ నుండి కుకీలు వెల్లువలా వచ్చి చేరడం, ఆ పొరుగు దేశంలో సంఘర్షణ ఫలితంగా ప్రవేశిస్తున్న శరణార్థులు కూడా మైతేయిల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా) తమ ఏకైక పోరాటం మయన్మార్ రాజ్యా నికి వ్యతిరేకంగానేననీ, మణిపుర్లో తాము ఎటువంటి కాల్పులకు పాల్పడలేదనీ పదేపదే ప్రకటనలు జారీ చేస్తూ వచ్చాయి. అయినా వారి సిబ్బందిలో కొందరు స్వతంత్ర పద్ధతిలో వ్యవహరించడాన్ని తోసిపుచ్చలేము. కుకీ కొండ ప్రాంతాలలో దాదాపు పూర్తిగా మైతేయిలకు చెందిన రాష్ట్ర పోలీసు కమాండోలను ఉంచడాన్ని మణిపుర్ ప్రభుత్వం బలపరుస్తున్నందుకు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లను, అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను స్థానిక వార్తాపత్రికలకు చెందిన ఇద్దరు సంపాద కులను అరెస్టు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దశలోనే హింసాకాండ జరిగింది. తరచుగా ఇంటర్నెట్ నిషేధాలు, ఇతర అవ రోధాల కారణంగా రిపోర్టింగ్ తీవ్రంగా నిరోధించబడిన రాష్ట్రంలో, తాజా అరెస్టులు ఏమాత్రం మంచివి కావు. సంఘర్షణ – స్నేహ చరిత్ర మణిపుర్లో సంఘర్షణలతో పాటు వర్గాల మధ్య స్నేహానికి కూడా సుదీర్ఘ చరిత్రే ఉంది. రాజులు ఇంఫాల్ లోయను పాలించినప్పుడు, నాగాలు, కుకీలు, ఇతర గిరిజనులు నివసించే కొండలపై వారి పట్టు చాలా తక్కువగా ఉండేది. గిరిజనులు కొండలను ‘సొంతం’ చేసుకున్నారు, తమ సొంత ఆచారాల ప్రకారం వారి జీవితాలను గడి పారు. రాజులు కూడా దానిని అంగీకరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మణిపుర్‌లోని మూడు ప్రధాన కమ్యూనిటీలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు కూడా సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ, వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు కూడా చేసుకున్నారు. తద్వారా సయోధ్యకు, శాంతికి అవకాశం ఏర్పడింది. 1944లో మూడు వర్గా లకు చెందిన యువకులు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. అది బర్మా నుండి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ వెనుకంజ వేయడంతో చాలామంది తిరిగి రంగూన్ కు వెళ్లారు. స్వాతంత్య్రం కోసం యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిలో మణిపుర్ మొదటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. పరిష్కారమేంటి? క్రైస్తవ మిషనరీలు కొండలపైకి తీసుకువచ్చిన విద్య మణిపుర్ గిరిజనుల సాధారణ శ్రేయస్సు స్థాయిని పెంచింది. షెడ్యూల్డ్ తెగ లుగా వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మరోవైపు, రాష్ట్రంలోనే అత్యుత్తమ సాగు భూమి ఇంఫాల్ లోయలో ఉంది. ఇది చారిత్రకంగా మైతేయిలు ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. గిరిజనులు తొమ్మిది రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్న కొండ ప్రాంతాలలో ఉన్నారు. కానీ వీటిలో సాగు యోగ్యమైనవి తక్కువ. జనాభాలో 53 శాతం ఉన్న మైతేయిలు వ్యవసాయం, పరిశ్ర మల్లో ముందంజలో ఉన్నారు. 2022లో ఎన్నికైన బీజేపీ నేతృత్వంలోని మణిపుర్ ప్రభుత్వం, కుకీ–జో ప్రజలు సాంప్రదాయ గిరిజన భూములుగా పిలిచే వాటిని రిజర్వుడ్ ఫారెస్టులుగా చెబుతూ వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసింది. అలా ఉద్రిక్తతకు అవకాశం ఏర్ప డింది. ఇక, గతేడాది మే ప్రారంభంలో మెజారిటీగా ఉన్న మైతేయి లకు షెడ్యూల్డ్ తెగ హోదాను కల్పించే చర్యకు పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా గిరిజన సమూహాలు చేసిన ప్రదర్శనల ద్వారా హింసకు నాంది పడింది. అయితే, ఈ చర్యలను ప్రభుత్వం విరమించుకుంది. కుకీ–జో ప్రజలు మయన్మార్ నుండి తమ బంధువులను తీసుకు వస్తున్నారనీ, రాష్ట్రాన్ని ముంచెత్తడం ద్వారా రాష్ట్ర జనాభా నిష్పత్తుల రీతిని మార్చుతున్నారనీ మైతేయిల ఆందోళన. మాదక ద్రవ్యాలు, తుపాకీల సేకరణతో మాదక ద్రవ్యాల వ్యాపారానికి గేట్లు ఎత్తారనీ వీరి ఆరోపణ. (వాస్తవానికి ఇరు వర్గాలకు చెందిన సాయుధ మిలిటెంట్లు ఈ లాభదాయక ‘వ్యాపారం’లో పాల్గొంటున్నారు.) నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. కాకపోతే దానికి మణిపూర్ కొండలు, లోయలలో కాల్పులు నిశ్శబ్దం కావలసి ఉంటుంది. రాష్ట్ర పోలీసులు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు కాబట్టి, ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఈశాన్య ప్రాంత మాజీ హెడ్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫొటోలు దిగడానికి ఉన్న సమయం.. హింస చెలరేగిన మణిపూర్‌లో పర్యటించడానికి లేదుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. శనివారం ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధానిమోదీ లక్ష్యదీప్ పర్యటనపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఒకవైపు మణిపూర్‌లో దురదృష్టవశాత్తు రెండు వర్గాల మధ్య హింస చెలరేగితే, మరోవైపు ప్రధాని మోదీ మాత్రం బీచ్‌లో సాహస క్రీడ ఆడుతూ.. ఫొటో సెషన్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ముందు ఫొటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ముందు దేవుడి దర్శనంలా ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ ఫొటోలే కనిపిస్తాయని మండిపడ్డారు. ఇటువంటి పెద్దమనిషి.. ఎందుకు మణిపూర్‌కు వెళ్లడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీవాళ్లు మణిపూర్‌కు కేవలం రాజకీయ విహారయాత్రకు మాత్రమే వెళ్లారని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్ ఆవిష్కరణ -
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
‘మణిపూర్’పై ఏం చర్యలు తీసుకున్నారు: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రార్థనా స్థలాల రక్షణకు తీసుకున్న చర్యలను తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మణిపూర్‌లో ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వర్గ హింసలో దెబ్బతిన్న, ధ్వంసమైన మత సంబంధ నిర్మాణాలపై రెండు వారాల్లోగా కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
మణిపూర్ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :మణిపూర్ హింసలో మృతి చెంది ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్చురీల్లో మగ్గుతున్న 175 మృతదేహాల్లో 169 మృతదేహాల వివరాలను గుర్తిచారు. ఆరు అన్‌ఐడెంటిఫైడ్‌గా మిగిలిపోయాయి.169 గుర్తించిన మృతదేహాల్లో 81 బాడీలను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయగా 88 ఎవరూ క్లెయిమ్ చేయలేదు. మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాల పరిస్థితిపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదక ఇచ్చింది.దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది.క్లెయిమ్ చేయని మృతదేహాలను మార్చురీలో నిరవధికంగా ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. మృతదేహాలను ఖననం లేదా దహనం చేయడానికిగాను మణిపూర్ ప్రభుత్వం 9 ప్రదేశాలను ఎంపిక చేసిందని కోర్టు తెలిపింది.క్లెయిమ్ చేసిన మృతదేహాలకు సంబంధించి అంత్యకక్రియలను వారి బంధువులు ఈ 9 ప్రదేశాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చని పేర్కొంది.ఇక గుర్తించి క్లెయిమ్ చేయని మృతదేహాల అంత్యక్రియల సమాచారాన్ని వారి బంధువులకు తెలపాలని ఆదేశించింది. వారం రోజుల్లోపు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు చేయొచ్చని తెలిపింది. షెడ్యల్ తెగల జాబితాలో గిరిజనులు కాని మైతేయి సామాజిక వర్గాన్ని కలిపే విషయాన్ని పరిశీలించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఏడాది మేలో మణిపూర్‌లో భారీ ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో మొత్తం 170 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. ఇదీచదవండి..నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
మణిపూర్ హింస: తొమ్మిది మైతీ సంస్థలపై నిషేధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తొమ్మిది మైతీ తీవ్రవాద గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థలపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాద, విధ్వంసక, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మణిపూర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు సహా, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికరమైన కార్యకలాపాలను చేపడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపలు, భద్రతా బలగాలపై ప్రాణాంతకమైన దాడులకు పాల్పడుతున్నారంటూ పీఎల్ఏ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ )తోపాటు దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సహా తొమ్మిది సంస్థలు, అనుబంధ విభాగాలపై ఐదేళ్లపాటు నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాని రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్)తో పాటు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) దాని సాయుధ విభాగం, మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపీఏ), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఎకే), రెడ్ ఆర్మీ అని పిలవబడే దాని సాయుధ విభాగం కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ(కేసీపీ), రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్ కాన్బలుప్ (కేవైకేఎల్), కోఆర్డినేషన్ కమిటీ (కేఓఆర్కామ్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ (ఎఎస్యూకే)లను చట్టవిరుద్దమైన సంఘాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సంస్థలపై విధించిన నిషేధం సోమవారం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్ ను భారతదేశం నుండి వేరు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజలను ప్రేరేపించడమే ఈ సమూహాల లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ఈ ఏడాది మే 3నుంచి మణిపూర్ మైతీ గిరిజన కుకీ కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు. -
మిజోరాంలో రాహుల్ పర్యటన.. మోదీ టార్గెట్‌గా విమర్శలు..
ఐజ్వాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్, మిజోరాం రాష్ట్రాలకు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిన్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, సభలు, పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో పర్యటించారు. ఈ సందర్భంగా మరో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింస సమస్యను లేవనెత్తుతూ కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీకి ముఖ్యమైనది కాదేమో! ఈ మేరకు రాహుల్ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం మణిపూర్‌లో పర్యటించారు. రాష్ట్ర రూపాన్ని బీజేపీ నాశనం చేసింది. మణిపూర్ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు. రెండు విడిపోతుంది. అక్కడ ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులను చంపేస్తున్నారు. కానీ అక్కడికి(మణిపూర్) వెళ్లడం ప్రధాని మోదీకి ముఖ్యమైనదిగా కనిపించడం లేదు’ అని రాహుల్ మండిపడ్డారు. రెండు రోజుల పర్యటన రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన (సోమవారం, మంగళవారం) నిమిత్తం మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం ఐజ్వాల్‌లోని చన్మారి జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు (4,5 కి.మీ) పాదయాత్ర చేపట్టారు. అనంతరం గవర్నర్ నిలయం సమీపంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. నేడు సాయంత్రం విద్యార్థులతో రాహుల్ ముచ్చటించనున్నారు. మంగళవారం ఐజ్వాల్‌లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. దక్షిణ ప్రాంతంలోని లుంగ్లీ పట్టణంలో కూడా ఆయన పర్యటించి అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత లుంగ్లీ నుంచి ప్రత్యేక విమానంలో అగర్తలా మీదుగా ఢిల్లీకి బయలుదేరుతారు. అభ్యర్థుల ప్రకటన 40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా కాంగ్రెస్ నేడు విడుదల చేసింది. -
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్ట్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో జరిగిన దారుణ సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో మరోసారి ఆ రాష్ట్రం భగ్గుమంది. కనిపించకుండా పోయిన ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐ చేతికి అప్పగించింది. మణిపూర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా కేసులో దర్యాప్తు చేయగా నిందితులు ఇంఫాల్‌కు 51 కి.మీ. దూరంలో అత్యధిక సంఖ్యలో కుకీలు నివాసముండే చురాచంద్పూర్లో ఉన్నట్లు కనుగొన్నారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిని పావోమిన్లామ్ హవోకిప్, మల్సాన్ హవోకిప్, లింగ్నేచొంగ బైటే, తిన్నీఖోల్‌లుగా గుర్తించారు. మే 3న అల్లర్లకు బీజం పడింది ఈ చురాచంద్‌పూర్‌లోనే. దీంతో భద్రతా దళాలు అప్పట్లోనే ఇక్కడి తిరుగుబాటు వర్గాలతో ఎటువంటి అల్లర్లకు పాల్పడమని హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో నిందితులను పట్టుకున్న భద్రతా దళాలు అక్కడి నుండి వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారని తెలుసుకుని భారీ సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టును చుట్టుముట్టారు. అప్పటికే అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించడంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టు నుండి 5.45 కి ఆఖరి ఫ్లైట్‌లో అసోంలోని గువహతికి తరలించింది సీబీఐ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ఇద్దరు విద్యార్థులు హిజామ్ లువాంబి, హేమంజిత్ హత్య కేసులో ప్రధాన నిందితులను చురాచంద్పూర్లో అరెస్టు చేయడం జరిగింది. నేరం చేసిన వ్యక్తి అందరి కళ్లుగప్పి తప్పించుకోవచ్చేమో కానీ చట్టం చేతుల్లో నుంచి మాత్రం తప్పించుకోలేరు. వారు చేసిన తప్పుకు తగిన శిక్ష పడి తీరుతుందని రాశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కుకీ తిరుగుబాటు గ్రూపులు మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపి మణిపూర్ అల్లర్లకు కారణమయ్యారని.. దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఉగ్రవాదులతో పోరాడుతోందని అన్నారు. హత్య కేసులో నిందితులు దొరికారు కానీ చనిపోయినవారి మృతదేహాల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. I’m pleased to share that some of the main culprits responsible for the abduction and murder of Phijam Hemanjit and Hijam Linthoingambi have been arrested from Churachandpur today. As the saying goes, one may abscond after committing the crime, but they cannot escape the long… — N.Biren Singh (@NBirenSingh) October 1, 2023 ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ హత్య