Three Including Father Son Duo Gunned Down In Their Sleep After Fresh Escalation In Manipur - Sakshi
Sakshi News home page

Manipur Violence; మణిపూర్‌లో ఆగని కార్చిచ్చు.. నిద్రలోనే తండ్రీ కొడుకులు.. 

Published Sat, Aug 5 2023 2:00 PM | Last Updated on Sat, Aug 5 2023 4:25 PM

Father Son Duo Gunned Down In Their Sleep In Manipur - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తాజాగా హింసాకాండ చెలరేగింది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించి ఉంటారని స్థానిక పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరణించిన వారిలో తండ్రికొడుకులు కూడా ఉన్నారని వారిని నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా పట్టణంలోని ఫౌగక్చావో ఇఖాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటలకు మిలిటెంట్లు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఒక ఇంటి వద్ద నిద్రిస్తున్న తండ్రీకొడుకులను ఆగంతకులు మొదట కాల్చి చంపారు. తరవాత కత్తులతో నిర్దాక్షిణ్యంగా నరికారు. మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను మళ్ళీ ఉలిక్కిపడేలా చేసింది. 

ఆ తండ్రీకొడుకులు ఇన్నాళ్లు సహాయక శిబిరంలో ఆశ్రయం పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. పాపం చాలాకాలం తర్వాత ఇంటి వద్ద సేదదీరుతున్నందునో ఏమో ఆదమరచి నిద్రించారు. వస్తోన్న విపత్తును గ్రహించలేక శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. తెల్లవారాక  ఈ ఘోరాన్ని చూసిన వారంతా మూడు నెలల నుండి సాగుతున్న ఈ మారణకాండ చల్లారేదెన్నడంటూ.. తాము ప్రశాంతంగా కునుకు తీసేదెన్నడంటూ వాపోతున్నారు.   

ఇది కూడా చదవండి: పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement