killed
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి, లోయలో పడిపోయిన ఘటన వాయువ్య పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని ముష్కరులు రెండు వేర్వేరు భద్రతా దళాల కాన్వాయ్‌లపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో సహా 16 మంది సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని సర్వేకై ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని, 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారన్నారు. కరక్ జిల్లా నుంచి కాబూల్ ఖేల్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి కాన్వాయ్ తరలిస్తుండగా, లక్కీ మార్వాట్ జిల్లాలోని దర్రా తుంగ్ చెక్‌పోస్టు సమీపంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
AP: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం
సాక్షి,తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో శుక్రవారం(నవంబర్ 1) సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ‘ఏఎం పురంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిని చాక్లెట్లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. నిందితుడు సుశాంత్ చాలా నమ్మకంగా ఆడించినట్లు నటించి చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. చట్ట పరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం’అని తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం తాము ఇంటి నుంచి పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి పాప కనిపించలేదని తల్లదండ్రులు మమత,మధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ అనే అతను తాము బయటికి వెళ్లేటపుడు పాపతో ఆడుకుంటున్నాడని పోలీసులకు వారు చెప్పారు. దీంతో పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుత్తూరు ఆస్పత్రిలో పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్ -
ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం(అక్టోబర్ 26) దాడులు జరిపింది.కొన్ని నెలలుగా తమ దేశంపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు సమాధానంగానే తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ధీటుగా స్పందిస్తామని ఇరాన్ తెలిపింది.ఇదీ చదవండి: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
ఫైరింగ్ శిక్షణలో అపశ్రుతి.. ఇద్దరు ‘హైదరాబాద్’ అగ్నివీరుల మృతి
నాసిక్: మహారాష్ట్రలోని దేవ్లాలీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో శిక్షణ సమయంలో చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు అగ్నివీర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ ఫైరింగ్ రేంజ్లో శుక్రవారం అగ్నివీర్లకు ఫీల్డ్ గన్ ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నారు. అనుకోకుండా పేలి తూటాలు తగలడంతో గన్నర్ గోహిల్ విశ్వరాజ్ సిన్హ్(20), గన్నర్ సైకత్(21) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని దేవ్‌లాలీలోని ఆస్పత్రికి తరలించారు. వారు అప్పటికే చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు హవల్దార్ అజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణాలుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవ్లాలీ క్యాంప్ పోలీసులు తెలిపారు. ఘటనపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్‌కు గురయ్యారు. కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
అత్యాచార నిందితునిపై మూక దాడి.. హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య నిందితునిపై కొందరు దాడి చేసి హత్య చేశారు.అక్టోబరు 4న బాధితురాలు పొలాల్లో ఆవులు, మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో అత్యాచార ఘటన జరిగిందని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పొలాల నుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లారని, ఆ తర్వాత మహిళ వివస్త్రగా కనిపించిందని, ఆమెకు విషం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నిందితుని ఇంటిపై దాడి చేసి, అతడిని బయటకు తీసుకుచ్చి దాడి చేశారు. మహిళలు, పురుషులు నిందితునిపై వెదురు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేలోపే నిందితుడిని స్థానికులు చావబాదారు. పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు బాధితుడు అప్పటికే మరణించాడని తేల్చిచెప్పారు.ఇది కూడా చదవండి: HYD: బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి -
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య
రేపల్లె రూరల్/నగరం: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా అయిన రేపల్లె నియోజకవర్గం.. నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నున్నా భూషయ్య (47)పై అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన భూషయ్య మృతిచెందాడు. దాసరిపాలేనికి చెందిన భూషయ్యను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డ్రింక్ తాగుదామంటూ నిజాంపట్నం ఆముదాలపల్లి పంట పొలాల సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. వీరి కదలికలు గమనించిన దాసరిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మంత్రి అనగాని ప్రధాన అనుచరులు నున్నా బాలశంకర్, నున్నా మణికంఠలతో పాటు మరికొందరు సరివిబాదులతో భూషయ్యపై ఒక్కసారిగా దాడిచేశారు. తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భూషయ్యను రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భూషయ్యకు భార్య వెంకట లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాసరిపాలేనికి చెందిన నున్నా భూషయ్య గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటాడు. భూషయ్యను హతమార్చితే గ్రామంలో టీడీపీకి తిరుగులేదని భావించిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పథకం ప్రకారం హత్యకు పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.కాగా, భూషయ్య హత్యను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించి కేసు నీరుగార్చేందుకు పోలీసులు పడరానిపాట్లు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిడితో కేసు నీరుగార్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ముఖ్యనేత హతం
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్ ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల క్యాంపుపై ఇజ్రాయెల్ తాజాగా వైమానిక దాడులు జరిపింది.ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ లో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందాడు. దాడుల్లో అతల్లాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాలను వెల్లడించింది.ఇక,లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.ఇందులో 250 మంది హెజ్బొల్లాకు చెందినవారున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు ఇజ్రాయెల్ జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందాడు. ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్ -
ఎన్సీపీ నేత దారుణ హత్య
ముంబయి:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్ కుర్మీన్ను దుండగులు పొడిచి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్ కుర్మిన్ను హత్య చేశారని పోలీసులు తెలిపారు.ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం(అక్టోబర్4) అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్ -
కత్తితో దాడి.. ముగ్గురు మృతి
షాంఘై: చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురు హతమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ వివరాలను షాంఘై పోలీసులు మీడియాకు తెలిపారు.చైనా 75వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షాంఘై నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల లిన్ అనే వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని పట్టుకున్నారు. కాగా సూపర్మార్కెట్లో కత్తి పట్టుకుని తిరుగుతున్న లిన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.దాడికి పాల్పడిన లిన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తితో దాడులు జరుగుతున్న ఘటనలు అధికమయ్యాయి. గత మే నెలలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కత్తి దాడికి గురైన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.ఇది కూడా చదవండి: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి -
పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి -
హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్య నేత హతం
జెరూసలెం:లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది.ఇజ్రాయెల్ ఆదివారం(సెప్టెంబర్29) జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా మరో ముఖ్యనేత నబిల్కౌక్ మరణించాడు.తమ రాకెట్ దాడుల్లో హెజ్బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై హెజ్బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (64) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది.నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు.నబిల్పై 2020లో అమెరికా ఆంక్షలు విధించింది. ఇదీచదవండి: బంకర్బాంబు దాడిలో నస్రల్లా మృతి -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
పాక్‌లో షియా, సున్నీ పోరు.. 25 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం జిల్లాలో గత వారం చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు కొంతమేరకు తగ్గాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.కుర్రం ప్రాంతం ఇటీవలి కాలంలో మత హింసకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ తలెత్తిన భూవివాదం హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడి గిరిజన పెద్దల సహాయంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ సైఫ్ అలీ తెలిపారు. కుర్రంలో శాంతి చర్చల అనంతరం ఇకపై ఎలాంటి హింసాకాండకు పాల్పడకుండా ఉండేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు.సున్నీ ఆధిపత్య పాకిస్తాన్ జనాభాలో 15 శాతం మంది షియా ముస్లింలున్నారు. చాలా కాలంగా ఈ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. షియా వర్గం ఆధిపత్యం ఉన్న కుర్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇరు వర్గాల మధ్య మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన భూ వివాద ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతిచెందారు.కాగా కుర్రం జిల్లాలో హింసను ముగించేందుకు శాంతి ఒప్పందంపై ఇరు వర్గాల పెద్దలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఏ వర్గమైనా ఉల్లంఘించిన పక్షంలో వారు రూ.12 కోట్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు -
పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే. ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. -
వణికించిన పిడుగులు!
నాగర్‌కర్నూల్ (బిజినేపల్లి)/వనపర్తి రూరల్/ న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్రంలో పిడుగుల ధాటికి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు నక్క నీలమ్మ (40) తన అక్క నాగేంద్రమ్మతో కలిసి గేదెలను మేత కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడుతుండటంతో నీలమ్మ చెట్టు కిందికి వెళ్లగా.. పిడుగుపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. నీలమ్మ అక్క నాగేంద్రమ్మ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయింది.మరో ఘటనలో వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన పద్మమ్మ (40) ఆదివారం ఉదయం గొర్లను మేతకు తీసుకొని నల్లగుట్టకు వెళ్లింది. సాయంత్రం పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామానికి చెందిన ఏసప్ప భార్య బూచినెల్లి నాగమ్మ (42) శనివారం పొలానికి వెళ్లింది. సాయంత్రం గాలి వాన రావడంతో ఇంటికి బయలుదేరగా, గ్రామ సమీపంలో పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో నాగమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బీదర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఇద్దరు టాప్ కమాండర్ల మృతి
బీరుట్: బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర క్షిపణి దాడిలో హెజ్బొల్లా విభాగం ఎలైట్ రద్వాన్ ఫోర్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్ మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో సీనియర్ కమాండర్ అహ్మద్ వహబీ కూడా చనిపోయినట్లు ప్రకటించింది. ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుందని తెలిపింది. వీరిలో ఏడుగు రు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నట్లు వివరించింది. క్షతగాత్రులైన 68 మందిలో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియడ్ శనివారం చెప్పారు. మరో 23 మంది జాడ తెలియడం లేదన్నారు. నేలమట్టమైన అపార్టుమెంట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని మంత్రి పేర్కొ న్నారు. కాగా, శుక్రవారం తమ దాడిలో హెజ్బొల్లాకు చెందిన 16 మంది హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హెజ్బొల్లా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.శనివారం హెజ్బొల్లా మీడియా విభాగం జర్నలిస్టులను ఘటనాస్థలికి తీసుకెళ్లింది. మొత్తం 16 అపార్టుమెంట్లున్న ఆ సముదాయంలో క్షిపణి దాడి తీవ్రతకు మిలిటెంట్ల సమావేశం జరిగిన పక్క అపార్టుమెంట్ కూడా దెబ్బతింది. క్షిపణి భవనాన్ని చీల్చుకుంటూ నేరుగా బేస్మెంట్లోకి దూసుకుపోయిందని ఏఎఫ్‌పీ తెలిపింది. ఆ సమీపంలోని పలు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిన ఘటనల్లో గాయపడిన వారితో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని ఆరోగ్య మంత్రి ఫిరాస్ చెప్పారు.అకీల్‌పైనే ఎందుకు గురి?ఇబ్రహీం అకీల్ ప్రధాన లక్ష్యంగా శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. బీరుట్‌లోని తమ ఎంబసీపై 1983లో జరిగిన దాడికి అకీలే సూత్రధారి అని అమెరికా అనుమానం. అప్పటి నుంచి అతడిని హిట్‌లిస్టులో ఉంచింది. పట్టిచ్చిన/ జాడ తెలిపిన వారికి 70 లక్షల డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. బీరుట్‌లోని జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోని ఆ అపార్టుమెంట్ సముదాయం బేస్మెంట్లో అకీల్ మిలిటెంట్లతో సమావేశమైనట్లు తమ కు ముందుగానే సమాచారం అందిందని శుక్రవారం ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు దాడి చేపట్టామని వెల్లడించింది. కాగా, హెజ్బొల్లా కార్యకలాపాల్లో దశాబ్దాలుగా మహ్మద్ వహబీ కీలకంగా ఉన్నాడు. ఇతడిని ఇజ్రాయెల్ 1984లో బంధించి జైలులో ఉంచింది. 1997లో దక్షిణ లెబనాన్‌లో 12 మంది ఇజ్రాయెల్ సైనికులను చంపిన ఫీల్డ్ కమాండర్లలో వహబీ ఒకరని చెబుతారు. లెబనాన్‌పై మరిన్ని దాడులులెబనాన్ దక్షిణ ప్రాంతంపై శనివారం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగించింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపింది. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. వాటితో వాటిల్లిన నష్టమెంతో తెలియాల్సి ఉంది. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
మిన్నెపొలిస్: అమెరికాలోని మిన్నెపొలిస్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. డౌన్‌టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు యువతులున్నారని, వీరెవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో హెన్నెపిన్ కౌంటీ, మెట్రో ట్రాన్సిట్ పోలీసులతో కలిసి గస్తీ పెంచినట్లు చెప్పారు. -
Uttar Pradesh: నక్కను తోడేలు అనుకొని..
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం తోడేళ్ల వేటలో పడింది. తాజాగా రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఓ యువకుడు నక్కను తోడేలుగా భావించి చంపేశాడు. ఈ ఘటన సిధౌలీ తహసీల్‌లోని అసోధన్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ యువకుడిపై నక్క దాడి చేసింది. ఆ యువకుడు దానితో పెనుగులాడాడు. ఈ దాడిలో ఆయువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ నక్కను తోడేలుగా భావించిన యువకుడు దానిని కాళ్లతో తన్నిచంపేశాడు.యువకుని కేకలు విన్న గ్రామస్తులు కర్రలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు టార్చ్ లైట్ వెలుగులో దానిని చూసి, అది తోడేలు కాదని, నక్క అని గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడిని ఇంటికి పంపించారు. -
బంగ్లాదేశ్ నుంచి తల్లీకూతుర్ల చొరబాటు.. బీఎస్ఎఫ్ కాల్పులు.. బాలిక మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్ఎఫ్ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు.ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
Pakistan: జెండాలు విక్రయిస్తున్న దుకాణంపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
పాకిస్తాన్ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్‌లో విషాదం చోటుచేసుకుంది. కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్ జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి.