పెషావర్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి, లోయలో పడిపోయిన ఘటన వాయువ్య పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని ముష్కరులు రెండు వేర్వేరు భద్రతా దళాల కాన్వాయ్‌లపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో సహా 16 మంది సైనికులు గాయపడ్డారు.
క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని సర్వేకై ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని, 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారన్నారు. కరక్ జిల్లా నుంచి కాబూల్ ఖేల్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి కాన్వాయ్ తరలిస్తుండగా, లక్కీ మార్వాట్ జిల్లాలోని దర్రా తుంగ్ చెక్‌పోస్టు సమీపంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు
Comments
Please login to add a commentAdd a comment