Army
-
కాంగోలో భీకర పోరు.. 700 మంది మృతి
గోమా: కాంగో సైన్యం, రువాండా మద్దతున్న ఎం23 తీవ్రవాదుల మధ్య భీకరపోరు సాగుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ పోరాటంలో కనీసం 700 మంది చనిపోగా మూడు వేల మంది వరకు గాయాలపాలయ్యారని పేర్కొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వా«దీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కివు ప్రావిన్స్‌లోకి శరవేగంగా చొచ్చుకు వస్తున్నారని వెల్లడించింది. ఈ క్రమంలో జరుగుతున్న పోరులో భారీగా ప్రాణనష్టం సంభవించిందని వివరించింది. తీవ్రవాదులు మరో విమానాశ్రయాన్ని సైతం స్వా«దీనం చేసుకునే ప్రమాదముందని పేర్కొంది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కొన్ని గ్రామాలను ఆర్మీ తిరిగి స్వా«దీనం చేసుకున్నారని ఐరాస పేర్కొంది. గోమా తీవ్రవాదుల వశం కావడంతో విదేశీ సాయుధ ముఠాలు లొంగుబాట పట్టడం, పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంతో కాంగో ఆర్మీ బలహీనపడిందని వివరించింది. కాంగోలోని సాయుధ గ్రూపుల్లో ఎం23యే అతిపెద్దది. -
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయస్ జగన్ సంతాపం
-
రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో రష్యా తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోవడంతో పాటు, ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో చిక్కుకుని యుద్ధంలో పోరాడుతున్న భారతీయ పౌరులందరినీ స్వదేశానికి రప్పించడం కోసం తాము రష్యన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.రష్యా తరఫున యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. 96 మంది సైన్యం నుంచి విడుదలయ్యారని పేర్కొంది. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారని.. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని జైశ్వాల్ తెలిపారు. వారిలో 16 మంది ఆచూకీ లేదని స్పష్టం చేశారు.తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.ఇదీ చదవండి: ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు -
‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..గత వారం రోజులుగా ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్ రీజియన్‌లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్‌తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Watch how Ukraine’s SOF repel North Korean troops assault in russia’s Kursk region.The special forces eliminated 17 DPRK soldiers. One North Korean soldier had set an unsuccessful trap for the rangers of the 6th Regiment and blew himself up with a grenade. pic.twitter.com/nObBOMnusI— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) January 13, 2025మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్యాంగ్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్‌లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్ వర్గాలు భావిస్తున్నాయి.‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్ రాయిటర్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్యాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్ తెలిపాడు.రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్ ఆరోపణ. ఇందులో 3 వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్‌కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.రష్యానే కాల్చిపారేస్తోందా?ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్ భద్రతా సర్వీస్.. ఎస్‌బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. Communication between captured North Korean soldiers and Ukrainian investigators continues. We are establishing the facts. We are verifying all the details. The world will learn the full truth about how Russia is exploiting such guys, who grew up in a complete information vacuum,… pic.twitter.com/CWcssQjr94— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 14, 2025‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది. -
మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్‌లోని బరోహ్ గ్రామ నివాసి.ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్‌లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు. ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక -
రక్షణ రంగంలో భారత్ అగ్రగామి: గవర్నర్
గోల్కొండ (హైదరాబాద్): రక్షణ రంగంలో భారత దేశం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ఆయన ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఆర్మీ’మేళాను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యం వాడే ఆయుధాలను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత గవర్నర్ ఒక్కో స్టాల్‌ను తిరిగి అక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆయుధాలను చూసి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడు తూ యుద్ధంలో వాడే వివిధ రకాల ఆయు« దాలను ఎక్కువ శాతం మన దేశమే సొంతంగా తయారు చేసుకుంటోందన్నారు. మన దేశం రక్షణ రంగంలో ప్రపంచంలోనే మేటి అని, అత్యాధునికమైన, ఖరీదైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటి సారి ఆర్మీవారు తమ ఆయుధాలను ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారని తెలిపారు. అనంతరం గవర్నర్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ‘నో యువర్ ఆర్మి’మేళా పర్యాటకులతో పాటు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.‘నో యువర్ ఆర్మీ’మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీ (11 ఎంఎల్ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.🚨 SAD NEWS! 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector. Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care.PRAYERS 🙏 pic.twitter.com/oltXwzFCIH— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024 -
మోసాల రమణ నిండా ముంచాడు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు సహకారంతోనే ఎదిగానని ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడు బసవ రమణ ప్రచారం చేసుకున్నాడు. ఆయనతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లోనూ పెట్టి తనకున్న అనుబంధాన్ని, సంబంధాలను అందరికీ తెలియజేశాడు. ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను రామ్మోహన్నాయుడు హాజరయ్యే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవాడు. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ కంచరాన అవినాష్ వంటి అధికారులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి వారితో విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దానికోసం ముందస్తుగా పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేశాడు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ మోసాలు తిలాపాపం..తలా పిడికెడు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏ మాత్రం పరిచయం ఏర్పడినా దాన్ని తన వ్యాపారాన్ని పెంచుకునే అస్త్రంగా రమణ వాడుకున్నాడు. కేంద్రమంత్రిని.. ‘అన్నా’ అని సంబోధిస్తూ, ఆయన అండతోనే ఎదిగానని చెబుతూ, ఆయన ఆశీస్సులుంటే మరింత ఎదుగుతానని ఫొటోలు, వీడియోలతో సహా చూ పించిన దృశాలు, రక్షణ రంగంలోని అధికారులతో నిర్వహించిన సమావేశాలు, కలెక్టర్లు, జేసీలతో చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే, వారి కుటుంబీకులతో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమాలు, నగరంలో జరిపిన పలు ఈవెంట్లతో రమణను పలుకుబడి గల వ్యక్తిగా నమ్మించాయి. ఇదే విద్యార్థుల కొంప ముంచింది. అసలు నిజం ఇదీ.. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలను చూపించి విద్యార్థులను నిలువునా ముంచేశాడు. మాజీ మేజర్ జనర ల్ తన సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారని నమ్మబలికి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. ఈ ప్రచారం చూసే విద్యార్థులు ఆకర్షితులై ఉద్యోగాల కోసం రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు ముట్ట చెప్పేశారు. అంతటితో ఆగకుండా శిక్షణ, వసతి అని చెప్పి రూ.లక్షల్లో గుంజేశాడు. మోసం బట్టబయలు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం కేంద్రంగానే కాదు జులుమూరు కేంద్రంగా కూడా మోసం చేశాడు. రోజూ ఆయన చేతిలో మోసపోయిన వారు బయటకి వస్తూనే ఉన్నారు. ఎంత మొత్తంలో వసూలు చేశాడో లెక్క కట్టడం కూడా కష్టమవుతోంది. జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహా్వనించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు. అధికారికంగా జరిగే ఈవెంట్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులను తన సైన్యంగా తీసుకెళ్లి బల నిరూపణ చేసేవాడు. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున శాఖల వారీగా, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సమీకరణ కూడా చేసేవాడు. ⇒ పలువురు జర్నలిస్టులతో కూడా వెంకటరమణ చేతులు కలిపారు. వారికున్న పత్రికల్లో స్పాన్సర్ కథనాలు వండి వార్చారు. అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసేందుకు ఓ జర్నలిస్టును రిఫరెన్స్‌గా వాడుకునే వాడు. పోలీసు శాఖలో పనిచేసిన కొందరు అధికారులు కూడా ఆయనకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులొస్తే పట్టించుకోకుండా వెంకటరమణకే వత్తాసు పలికిన ఉదంతాలున్నాయి. భారత రక్షణ వ్యవస్థ మేజర్‌గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్‌ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెపె్టన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీమణి జీ.స్వాతిని ఆహా్వనించి హడావిడి చేశాడు. అకృత్యాలు.. వికృత చేష్టలు.. ⇒ శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను హింసించాడు. ⇒ ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్‌తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు. ⇒ శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ⇒ రకరకాల మెసెజ్‌లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ⇒ అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్‌ల్లో, పరుపులు ఉన్న రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ⇒ ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ⇒ ∙సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు. ⇒ బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ⇒ రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది. -
ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు
సాక్షి,అనంతపురం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య (43) అంత్యక్రియలు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ.. ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియలు పాల్గొనేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు కుల, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో సైనిక అధికారులు అందజేశారు.కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లోని మినీ కాశ్మీర్‌గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతరకు మాత్రం తాను బలయ్యారు.ఎల్ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని చూసి భార్య లీల, తల్లి గాలెమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడి, తాను మాత్రం దాని బారిన పడి ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: అగ్నివీర్ల రిక్రూట్మెంట్ ర్యాలీని డిసెంబర్ 8 నుంచి 16 వరకు జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ విభాగాలకు.. పదో తరగతి ఉత్తీర్ణత, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కేటగిరీలుగా ర్యాలీ నిర్వహిస్తారని వివరించింది. మహిళా మిలిటరీ పోలీసు(డబ్ల్యూఎంపీ) పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్–యానాం) నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీ సైట్‌కు అన్ని పత్రాలు తీసుకురావాలని సూచించింది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఉత్తీర్ణత లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని ఎవరైనా పంపే ట్వీట్లు లేదా మోసగాళ్లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సందేహాలకు రిక్రూట్మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్లు 040–27740059, 27740205ను సంప్రదించాలని సూచించింది. -
హెజ్బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.‘‘దక్షిణ లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes. These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024 ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్‌లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.💔 pic.twitter.com/FGY2iDlvaA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024 సెప్టెంబరు 23 నుంచి లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి, లోయలో పడిపోయిన ఘటన వాయువ్య పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని ముష్కరులు రెండు వేర్వేరు భద్రతా దళాల కాన్వాయ్‌లపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో సహా 16 మంది సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని సర్వేకై ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని, 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారన్నారు. కరక్ జిల్లా నుంచి కాబూల్ ఖేల్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి కాన్వాయ్ తరలిస్తుండగా, లక్కీ మార్వాట్ జిల్లాలోని దర్రా తుంగ్ చెక్‌పోస్టు సమీపంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
మరో హెజ్బొల్లా టాప్ కమాండర్ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్
జెరూసలేం: మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హెజ్బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.‘దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్. 2023 నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు జరిగిన దాడుల్లో జాఫర్ ఖాదర్ ఫార్ కీలక పాత్రపోషించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్‌లోని గోలాన్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో 12మందికి పైగా మరణించారు. 30మంది గాయపడ్డారు. గత బుధవారం హెజ్బొల్లా మెటుల్లాపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు సూత్రదారి జాఫర్ ఖాదర్ ఫార్’ అని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ పేర్కొంది. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్బొల్లా ఆపరేటివ్ ఎవరనేది వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు. -
ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్ ఇచ్చింది.‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్‌కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ అన్నారు.North Korean Troops Who Enter Ukraine Will "Return In Body Bags", Warns US"Should DPRK's troops enter Ukraine in support of Russia, they will surely return in body bags," US deputy ambassador to the UN Robert Wood told the Security Council.https://t.co/HVoaV5LbYo— M. Rowland (@melrow74) October 31, 2024చదవండి: ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం -
'ఆ సమయంలో బాధను బయట పెట్టకూడదనుకున్నా': సాయిపల్లవి కామెంట్స్
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీనే రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అమరన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.పాత వీడియో వైరల్..అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ నెటిజన్స్ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.కావాలనే చేస్తున్నారు..అయితే సాయిపల్లవి కామెంట్స్‌పై బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్, రష్యా సైనికాధికారులు సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు.పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరుదేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. తమను బ్రిక్స్‌లో భాగం చేయాలని పాకిస్తాన్ రష్యాకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ఆహ్వానం రాకపోవడం గమనార్హం. భారత్ వ్యతిరేకత కారణంగా బ్రిక్స్‌లో పాకిస్తాన్‌కు సభ్యత్వం కల్పించలేదు.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి
సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్మార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.కశ్మీర్‌లోని గుల్మార్గ్లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
'ఆర్మీ జాబ్ కాదు.. నా లైఫ్'.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా అమరన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని గుగల్‌ధర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.గుగల్‌ధార్‌లో భారత సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తెలిపింది. చొరబాటుదారులను తిప్పికొడుతూ, భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. గుగల్ధార్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదికి జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా రాజౌరీ జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇన్పుట్ ఆధారంగా, థానమండిలోని మణియల్ గలి వద్ద భద్రతా బలగాలు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అని ఒక పోలీసు అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా? -
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్‌లో జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
మాటలు చెప్పడం కాదు.. ప్రధాని మోదీపై రాహుల్, ప్రియాంక ఆగ్రహం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు అధికార బీజేపీని విమర్శించారు.ఈ భయంకరమైన సంఘటన మొత్తం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. నేరస్థులు వరుస దారుణాలతో ప్రభుత్వంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ ఫలితమే ఈ దారుణాలు అని వ్యాఖ్యానించారు. मध्य प्रदेश में सेना के दो जवानों के साथ हिंसा और उनकी महिला साथी के साथ दुष्कर्म पूरे समाज को शर्मसार करने के लिए काफी है। भाजपा शासित राज्यों की कानून व्यवस्था लगभग अस्तित्वहीन है - और, महिलाओं के खिलाफ़ दिन प्रतिदिन बढ़ते अपराधों पर भाजपा सरकार का नकारात्मक रवैया अत्यंत…— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024 ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన దారుణం నా హృదయాన్ని ద్రవించి వేస్తుంది. మహిళల భద్రత గురించి ప్రధాని మోదీ ప్రసంగాలు చేస్తారు. మహిళలు మాత్రం రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ ఎప్పటికి ముగుస్తుంది? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రతిరోజూ 86 మంది మహిళలపై నిత్యం ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్వీట్లో పేర్కొన్నారు.मध्य प्रदेश में सेना के अधिकारियों को बंधक बनाकर महिला से गैंगरेप एवं उत्तर प्रदेश में हाईवे पर एक महिला का निर्वस्त्र शव मिलने की घटनाएं दिल दहलाने वाली हैं। देश में हर दिन 86 महिलाएं बलात्कार और बर्बरता का शिकार हो रही हैं। घर से लेकर बाहर तक, सड़क से लेकर दफ्तर तक, महिलाएं…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 12, 2024ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణంమధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై అర్థరాత్రి ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులతో దాడి చేశారు. అనంతరం వారిని బంధించి.. బాధితుల్లోని ఇద్దరిని రూ.10లక్షల తీసుకుని రావాలంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు స్నేహితులు జరిగిన దారుణాన్ని ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.ఇదీ చదవండి : గణపతి పూజపై రాజకీయ దుమారంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
చైనా ఆర్మీ జనరల్‌కు పాక్ అత్యున్నత పురస్కారం
పాక్-చైనాల దోస్తీ మరింత బలపడుతోంది. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్‌ను పాక్ ఘనంగా సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఈ-ఇమ్తియాజ్’ను లీ జియామింగ్‌కు అందజేసింది.ఇరు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే పాక్ లీ జియామింగ్‌కు పాక్ ఈ గౌరవం అందజేసింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్‌లు, పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గతంలో ఈ గౌరవాన్ని భారత్‌కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు.ఈ సందర్భంగా పాకిస్తానీ ప్రభుత్వ ఏజెన్సీ ఏపీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ పురస్కారం జనరల్ లీ జియోమింగ్ నాలుగు దశాబ్దాల కెరీర్‌కు ఇది తగిన గుర్తింపులాంటిదని అన్నారు. చైనా మిలిటరీకి అతను చేసిన గణనీయమైన సహకారం మరువలేనిదన్నారు. చైనాలోను, దాని వెలుపల శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో అతని సేవలు కీలకపాత్ర పోషించాయన్నారు. -
విశాఖతీరంలో ఆర్మీ అగ్నిపథ్ ర్యాలీ ప్రారంభం (ఫొటోలు)
-
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 36 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వరుస దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను ఇంకా ఆపడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఏకకాలంలో పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖాన్ యూనిస్ నగరంలో ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబంలోని 11 మంది సభ్యులు మృతిచెందారని నాసర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఖాన్ యునిస్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మూడు వేర్వేరు దాడుల్లో 33 మంది మృతిచెందారని, వారి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా ఉన్న రహదారిపై జరిగిన దాడిలో మరో పదిహేడు మంది మృతిచెందారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2023, అక్టోబర్ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌తో పాటు మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. నాటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు చేస్తూ వస్తోంది. -
హౌసింగ్ కుంభకోణం: పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్ అరెస్ట్
ఇస్లామాబాద్: మాజీ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫైజ్ హమీద్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్ స్కీమ్)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్‌పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్మెంట్ ఓనర్ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా.. బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్ఐ 24వ డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు. -
రష్యాలోకి ఉక్రెయిన్ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో పుతిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు. Ukraine has launched a major attack with Ukrainian troops into Russia in what appears to be its biggest and most serious incursion into the country since Moscow's full-scale invasion began in February 2022. https://t.co/2o5E3RAcIM— ABC News (@ABC) August 7, 2024 -
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం అణువణువునా గాలిస్తున్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఖనేడ్ అడవిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు ఇన్పుట్ అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, కాల్పులు ప్రారంభించాయి. అటవీప్రాంతంలో నలువైపులా ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులతో కూడిన జైషే గ్రూపు రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు చెట్లలో దాక్కొనగా, మరొక గ్రూపు తప్పించుకుంది. బసంత్‌గఢ్‌లోని ఖనేడ్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని డీఐజీ మహ్మద్ రైస్ భట్ తెలిపారు.దీనికిముందు అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్‌పోరా తవేలాకు చెందినవారు. -
Bangladesh: నిరసనకారులకు సైన్యం మద్దతు.. చిక్కుల్లో ప్రధాని హసీనా?
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చిక్కుల్లో పడబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు.. నిరసనకారులకు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆందోళనకారులకు, పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (సీఏఎస్) ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో సమావేశమైన దరిమిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు.కాగా నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నజ్ముల్ అహ్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఉద్యమం తీవ్రతరమైతే, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. -
‘సాహో సీత’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
కేరళ వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్ఫుల్ ఉమెన్ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. The WonderWoman of Wayanad. No need for DC Super Heroes. We have them in real life out here…💪🏽💪🏽💪🏽 pic.twitter.com/DWslH6nKln— anand mahindra (@anandmahindra) August 3, 2024 ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కో ఎవరు?భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్‌లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్‌లో ముందక్కై, చురాల్‌మల్‌లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. If possible, don’t destroy this bridge once a more permanent structure is restored. It should serve as a symbol of our pride in our army and the sense of security we derive from our soldiers. https://t.co/ZwNJZR4xbw— anand mahindra (@anandmahindra) August 4, 2024 -
Wayanad Landslides: ఎటు చూసినా వినాశనమే
వయనాడ్/తిరువనంతపురం: ప్రకృతి ప్రకోపానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాడ్ జిల్లా మారుమూల కుగ్రామాల వద్ద అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కుంభవృష్టి వర్షాలతో నానిన కొండచరియలు పడటంతో బురదలో కూరుకుపోయిన ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మీ, సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మరణాల సంఖ్య 167కి పెరిగింది. 191 మంది జాడ తెలియాల్సి ఉంది. 219 మంది గాయపడ్డారు. చిధ్రమైన చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వందలాది మందిని సమీప పట్టణాల ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ గ్రామస్థుల మరణాలతో వారి బంధువుల, ఆక్రందనలు, తమ వారి జాడ కోసం కుటుంబసభ్యుల వెతుకులాటతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద బ్రతికుంటే బాగుణ్ణు అని ఆశ, ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనన్న భయాలతో వందలాది మంది ఆత్మీయులు, మిత్రుల రాకతో ఆ ప్రాంతాల్లో విషాధం రాజ్యమేలింది. కొండపై నుంచి వచ్చిన వరద, బురద ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బుధవారం ఉదయం మాత్రమే పూర్తిస్తాయిలో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టగలిగారు. రెండ్రోజుల్లో 1,592 మందిని కాపాడినట్లు కేరళ సీఎం విజయన్ చెప్పారు.వేయి మందిని రక్షించిన ఆర్మీ: యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలతో రంగంలోకి దిగిన భారత సైన్యం దాదాపు 1,000 మందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, తీరగస్తీ దళాలు సంయుక్తంగా చేపడుతున్న రెస్క్యూ ఆప రేషన్లతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్లు, తాత్కాలిక వంతెనల సాయంతో ఘటనాస్థలి నుంచి వారికి జాగ్రత్తగా తీసు కొస్తున్నారు. కొందరు మానవహారంగా ఏర్పడి ఆ వలి ఒడ్డు నుంచి కొందరిని ఇటువైపునకు తీసు కొస్తూ సాహసంచేస్తున్నారు. డాగ్ స్క్వాడ్లతో పాటు స్థానికు తమ వంతు సాయం చేస్తున్నారు. శిబిరాలకు 8,017 మందిని తరలించారు.ఆదుకుంటున్న బెలీ వంతెనలు: 330 అడుగుల పొడవైన తాత్కాలిక బెలీ వంతెనలు నది ప్రవాహం ఆవలివైపు చిక్కుకున్న బాధితులను ఇటువైపు తీసు కొచ్చేందుకు ఎంతగానో ఉపయో గపడుతున్నాయి. 690 అడుగుల బెలీ వంతెనలను ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి తెప్పి స్తున్నారు. మేప్పడి–చూరల్మల వంతెన నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపడు తున్నారు. నిఘా హెలికాప్టర్లు కొండప్రాంతాలు, నదీ ప్రవాహం వెంట తిరుగుతూ బాధితుల జాడ కోసం అన్వేషణ కొనసా గిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీదిగ్భ్రాంతికర ఘటనలో సహాయక చర్యలు, పునరావాసం తదితర చర్యల పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. కేరళకు పూర్తిస్థాయిలో కేంద్రం మద్దతిస్తోందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఘటనాస్థలిని సందర్శించిన సందర్భంగా చెప్పారు.కుగ్రామాల్లో శ్మశాన వైరాగ్యంభారీ శిలలు పడి నేలమట్టమైన ఒక ఇంట్లో నాలుగైదు మంది కుటుంబసభ్యులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే బురదలో కూరుకుపోయిన విషాద దృశ్యం అక్కడి సహాయక బృందాలను సైతం కంటతడి పెట్టించింది. ముండక్కై జంక్షన్, చూరల్మల ప్రాంతాల్లో భీతావహ దృశ్యాలు అక్కడి ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టాయి. ‘‘ ముండక్కై గ్రామంలో ఘటన జరిగిన రోజు దాదాపు 860 మంది జనం ఉన్నారు. వాళ్లలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలీదు’ అని స్థానికులు వాపోయారు. ‘‘చెట్లను పట్టుకుని కొందరు, చెట్టు కింద పడి మరికొందరు, బురదలో కూరుకుపోయి ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. కురీ్చలో కూర్చుని, మంచాల మీద పడుకుని ఉన్న మృతదేహాలను గుర్తించాం’’ అని సహాయక బృందాలు వెల్లడించాయి. ‘‘అంతా కోల్పోయా. అందర్నీ కోల్పోయా. నాకు ఇక్కడ ఇంకా ఏమీ మిగల్లేదు’ అంటూ ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించారు. ‘‘బురదలో కాలు పెట్టలేకున్నాం. మావాళ్లు ఎక్కడున్నారో’’ అంటూ ఒకరు కంటతడి పెట్టుకున్నారు. 10 శాతం ఇళ్లు మిగిలాయి ముండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయని ఓ అంచనా. విధ్వంసం తర్వాత 450 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 49 ఇళ్లే మిగిలాయి. బాధితులు అంగన్వాడీ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.ముందుగానే హెచ్చరించాం: అమిత్ షాకుంభవృష్టిపై వారం క్రితమే ముందస్తు హెచ్చరికలు చేశామని రాజ్యసభలో వయనాడ్ విషాదంపై తాత్కాలిక చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘‘ ముందు జాగ్రత్తగా జూలై 23వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ నుంచి 9 బృందాలను కేరళకు పంపించాం. వయనాడ్‌లో విలయం మొదలవగానే జిల్లా కలెక్టర్ నుంచి ఈ బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే వాళ్లంతా రంగంలోకి దిగారు. అన్వేషణ, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కేరళకు పూర్తి స్థాయిలో మోదీ సర్కార్ అండగా నిలుస్తుంది. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి జనాన్ని వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25న రెండుసార్లు హెచ్చరికలు పంపాం. 20 సెం.మీ. భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. స్థానికులను ఎందుకు తరలించలేదు?’’ అని కేరళ సర్కార్‌ను అమిత్ ప్రశ్నించారు.పంపింది ఆరెంజ్ అలెర్ట్... అదీ 29న: విజయన్అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు తిరువనంతపురంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీవరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. వర్షాలొస్తాయని భారత వాతావరణ శాఖ వయనాడ్ జిల్లాకు సాధారణ ఆరెంజ్ అలర్ట్‌ను 29వ తేదీన మాత్రమే పంపింది. 20 సెంటీమీటర్లలోపు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్, 24 సెం.మీ.లోపు వర్షాలకు రెడ్ అలర్ట్ ఇస్తారు. కానీ వయనాడ్ జిల్లాలో అసాధారణంగా 572 మిల్లీమీటర్లకు మించి కుంభవృష్టి నమోదైంది. ఇంతటి భారీ వర్షసూచన వాతావరణశాఖ చేయలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం ఆరుగంటలకు రెడ్ అలర్ట్‌ను పంపించారు. వరదపై హెచ్చరించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదు. అయినా ఇది పరస్పర విమర్శలకు సమయం కాదు’’ అని అన్నారు. -
Pakistan: పాక్ సైనికులపై నిరసనకారుల దాడి.. ఒక జవాను మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆ దేశ సైన్యంపై నిరసనకారులు తిరగబడ్డారు. పాక్ సైన్యం కొనసాగిస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్‌లోని ఆందోళనకారులు దాడులకు దిగారు. ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో జాతీయవాద బలూచ్ ఉద్యమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.బలూచ్ యక్జేతి సమితికి చెందిన నిరసనకారులు ర్యాలీలో పాక్ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పాక్ ఆర్మీ జవాన్ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ నాయకుడు మెహ్రంగ్ బలోచ్ తెలిపారు.నిరసనకారుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మెహ్రాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ‘ఈ రోజు మీరంతా పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ సందేశం ఇచ్చారు. మీ ఆందోళనల ముందు తుపాకులు, అధికారం విలువలేనివని అన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం ముందు నిరసనకారులపై దాడి చేసి, 12 మంది మహిళలు, 50 మందికి పైగా పురుషులను తమతో పాటు తీసుకుపోయి నిర్బంధించాయి. -
Jammu: రాజౌరిలో ఉగ్రకుట్ర భగ్నం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసేందుకు తాజాగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ పోస్ట్ రాజౌరిలోని గుండా ఖవాస్ ప్రాంతంలో ఉంది.జమ్ము ప్రాంతంలో గత కొన్ని నెలలుగా తీవ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో చొరబాటు ఘటనలు కూడా పెరిగాయి. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా సంస్థలు ముమ్మరంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తాజాగా అత్యున్నత స్థాయి సంయుక్త భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చేవారిని అంతమొందించేందుకు అన్ని ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్నారు. చొరబాట్లను నిరోధించేందుకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సిన్హా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు
జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో కొందరు భారత ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తాజగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో పాక్ దుశ్చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతంలో పాక్ సైన్యం క్యాంపును ఏర్పాటు చేసి, అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని సమాచారం.జమ్ముకశ్మీర్‌లోని దోడాలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా పాఠశాలలో ఉన్న ఆర్మీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. -
జేకేలో ఎన్కౌంటర్.. అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన ఆధారాల దరిమిలా దోడాలోని ఉత్తర ప్రాంతంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులు సోమవారం రాత్రి 7.45కి దేశా అటవీ ప్రాంతంలో జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ అధికారి, నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని, చివరి నివేదిక వచ్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
పరిహారం తల్లిదండ్రులకే ఇవ్వాలి: కెప్టెన్ అన్షుమన్ పేరెంట్స్
లక్నో: సైన్యంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి డిపెండెంట్లు(నెక్స్ట్ ఆఫ్ కిన్) ఎవరనే విషయమై స్పష్టమైన మార్గదర్శాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటీవల కీర్తి చక్ర పతకం పొందిన దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్, మంజు సింగ్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ మాట్లాడామన్నారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని తమకు హామీ ఇచ్చారని చెప్పారు. Shocking words.. pic.twitter.com/UeiF0Ef4Mf— Gems of Politics (@GemsOf_Politics) July 11, 2024 ‘సైన్యంలో వీర మరణం పొందిన వారికి సంబంధించిన పరిహారం ఎవరికి దక్కాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నెక్ట్స్ ఆఫ్ కిన్(ఎన్‌ఓకే) మార్గదర్శకాలు సరిగా లేవు. ఈ విషయమై రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇప్పటికే మేం మాట్లాడాం. నా కుమారుడు అన్షుమన్సింగ్కు పెళ్లి జరిగి కేవలం అయిదు నెలలు మాత్రమే అయింది. నా కొడుక్కి పిల్లలు లేరు. అయినా మా కొడుకుకు వచ్చిన కీర్తి చక్ర పతాకం, ఇతర అన్ని పరిహారాలు కోడలికే దక్కాయి. ఆమె అన్ని అధికారిక డాక్యుమెంట్లలో తన చిరునామా మార్చుకుని వెళ్లిపోయింది.ఇందుకే ‘ఎన్‌ఓకే’ను మళ్లీ పునర్నిర్వచించాలని కోరుతున్నాం. కోడలి కంటే తల్లిదండ్రులే కొడుకుపై ఎక్కువగా ఆధారపడతారు. మేము బాధపడుతున్నట్లుగా ఇతర తల్లిదండ్రులెవరూ భవిష్యత్తులో బాధపడకూడదు’అని అన్షుమన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్,మంజుసింగ్ అన్నారు.గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కెప్టెన్ అన్షుమన్‌సింగ్ మృతి చెందారు. ఆ ప్రమాదంలో తన సహచరులను కాపాడి అన్షుమన్ మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.అన్షుమన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకుగాను భారత ప్రభుత్వం ఆయనకు కీర్తిచక్ర పతాకాన్ని ప్రకటించింది. ఈ పతకాన్ని జులై 5న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో అన్షుమన్ భార్య స్మృతి, మాతృమూర్తిలకు ఈ పతకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుకరించారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం ‘ఎన్‌ఓకే’ ఎవరు..సైన్యంలో ఒక వ్యక్తి చేరినపుడు తల్లిదండ్రులను నెక్ట్స్ ఆఫ్ కిన్గా పేర్కొంటారు. అయితే ఆ వ్యక్తికి వివాహం అయిన తర్వాత మాత్రం నెక్ట్స్ ఆఫ్ కిన్గా తల్లిదండ్రుల పేర్ల స్థానంలో జీవిత భాగస్వామి పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తారు. -
రాయ్‌బరేలీలో రాహుల్ పర్యటన
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం సొంత నియో జక వర్గం యూపీలోని రాయ్‌బరేలీలో పర్యటించారు. మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం పొందిన కెప్టెన్ అన్షుమన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం ఢిల్లీ నుంచి లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌బరేలీలోకి రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు.స్థానిక అతిథిగృహంలో రాహుల్ గాంధీ కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి మంజు సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంజు సింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబానికి సాధ్యమైనంత మేర సాయం అందేలా చూస్తామని రాహుల్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం రాహుల్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక నేతలతో ముచ్చటించారు. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్‌ను సందర్శించారు. రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..ఆర్మీని రెండు వర్గాలుగా విడగొట్టే అగ్నివీర్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. -
కొరత సృష్టించిన అగ్నిపథ్!
అయిదేళ్ల కాల పరిమితి తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, వారిపై స్పష్టమైన ఒత్తిడి ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు, అగ్నిపథ్ పథకం... సైన్యంలో తీవ్రమైన కొరతకు కూడా దారి తీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్యలో సగాని కంటే కాస్త మాత్రమే ఎక్కువగా అగ్నివీర్లను తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకొంటారు కనుక ఈ లోటు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించలేవనే భావన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.లోపాలను సరిదిద్దడానికి ‘ఫలితానంతర’ చర్యలపై ఆధారపడే వ్యవస్థీకృత మార్పు ఏదైనా సరే అంతర్గతంగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం అలాంటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫీసర్ ర్యాంకుకు కిందిస్థాయిలో ఉన్న సైనికుల నియామక ప్రక్రియను మార్చడానికి అంటూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిపోతున్న రిటైర్డ్ సైనికుల పెన్షన్ బిల్లును తగ్గించడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. సాయుధ దళాలలోని ఇతర ర్యాంకులు యువతతో నిండి వుండేలా ఇది దోహదపడుతుంది. అయితే ఈ పథకం సాయుధ దళాలలో చేరడానికి ఆసక్తి ఉన్న యువత నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష చేయాలంటూ రాజకీయవర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అగ్నిపథ్ ఆలోచన ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే భావన నుండి తీసుకోవటం జరిగింది. ఇది సైనిక సేవ కోసం ఎంపిక చేసేవారి కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశ సైన్యాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. అప్పటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మన సాయుధ దళాలలో ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సైనికులను చిన్న సంఖ్యలలో రిక్రూట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదనను పరీక్షించడం అసలు ఉద్దేశం. అయితే, ఈ పథకం ఏకపక్షంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో నివేదించిన అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకాన్ని సైనిక విభాగాలకు ‘పిడుగుపాటు’గా ఆయన ఈ పుస్తకంలో అభివర్ణించారు.ప్రస్తుతం ఈ పథకం కింద 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉండి 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ‘అగ్నివీర్’లుగా ఆరు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలానికి నియమించారు. వారిలో 25 శాతం మంది మాత్రమే పింఛను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో మరో 15 సంవత్సరాల కాలం కొనసాగేందుకు అర్హులు అవుతారు. దీనికోసం వారిని తిరిగి నమోదు చేసుకుంటారు. ఇక సైన్యం నుంచి విడుదలైన మిగతా 75 శాతం మందికి పరిహారంగా ‘సేవా నిధి’ కింద రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ప్రస్తుతం మొత్తం రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య దాదాపు 24.62 లక్షలు. వీరిలో సాయుధ దళాల సీనియర్లు దాదాపు 19 లక్షలు కాగా, పౌర విభాగ సిబ్బంది 5.62 లక్షల మంది ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లు. ఇందులో పింఛను ఖర్చు రూ.2,07,132 కోట్లు. రక్షణ సిబ్బంది వాటా రూ. 1,19,696 కోట్లు కాగా, పౌర విభాగం వాటా రూ. 87,436 కోట్లు. ఈ రెండో మొత్తం పెన్షనరీ బడ్జెట్లో 40 శాతం వాటాను కలిగి ఉంది.కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా సాయుధ దళాలలో గౌరవప్రదమైన వృత్తిని కోరుకునే వ్యక్తులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) అగ్ర ఎంపికగా ఉండటం వలన ఈ పథకంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఈ ధోరణిని నా సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో చూశాను. సైన్యం నుంచి విడుదలైన అగ్నివీరులలో తాము విస్మరించబడ్డామనే అపకీర్తిని మోస్తున్నట్లు, గర్వించ దగిన అనుభవజ్ఞులుగా తమను చూడరనే సాధారణ భావన కూడా వారిలో ఉన్నట్లు నేను గ్రహించాను. ఇటీవల, అగ్నివీరులు కార్యాచరణ ప్రాంతాల్లో మోహరించినప్పుడు వారు అత్యున్నత త్యాగం చేసిన రెండు సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తి పెన్షన్ కు అర్హులైన సాధారణ సైనికులకు భిన్నంగా వారి బంధువులు ఏకమొత్తంలో మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. ఈ వివక్ష తీవ్రమైన క్రమరాహిత్యంగా నిలుస్తోంది. ఈ రోజు సైనిక విభాగాల్లో రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు అనే రెండు వర్గాలు ఉన్నాయి. అయిదేళ్ల తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే వారి ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పష్టమైన ఒత్తిడి కనిపిస్తోంది. నిజానికి ఇది స్నేహబంధం, సైనికుల మధ్య పరస్పర సహకారం, యూనిట్ కల్చర్, రెజిమెంట్ పునాది వంటివాటికి హానికరమైనది. మెరుగైన ఆయుధాలతో సన్నద్ధమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మన సాయుధ దళాల అత్యాధునిక సామర్థ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికన్లు; గాజాలో ఇజ్రాయెలీలు; రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వైపుల సైనికులు – ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని నిష్ప్రయోజనమైనదిగా గుర్తించారు. మన విషయానికి వస్తే, నేటికీ కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రతిష్టంభన సమయంలో లద్దాఖ్‌లో చైనా సైన్యం కూడా పేలవంగా పని చేసింది.అగ్నిపథ్ పథకం సైనిక బలగంలో తీవ్రమైన కొరతకు కూడా దారితీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్య 70,000 అయితే, కేవలం 42,000 మంది అగ్నివీర్లను మాత్రమే తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకోవడంతో ఈ లోటు మరింత పెరగనుంది. 39 గూర్ఖా బెటాలియన్ లలోని 60 శాతం సైనికులు ‘నేపాల్ స్థానిక గూర్ఖా’ల నుండి వచ్చినందున గూర్ఖాల నియామకం గరిష్ఠంగా దెబ్బతింది. నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్‌ను తిరస్కరించడం వల్ల తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గూర్ఖాలను రిక్రూట్ చేయడానికి చైనీస్ సైన్యం చేసిన ప్రకటనలను తోసిపుచ్చలేము. భారతీయ యువత విదేశీ సైన్యంలో చేరడం ఆందోళన కలిగించే ధోరణి. రష్యా సైన్యంలో చేరేందుకు ఆకర్షితులవుతున్న కొంతమంది వ్యక్తుల గురించి వెలువడిన ఇటీవలి నివేదికలు దీనికి ఉదాహరణ.అగ్నిపథ్ పథకాన్ని పునస్సమీక్షిస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. వాటిని బట్టి అగ్నివీరులను నిలబెట్టుకోవడంతో పాటుగా, సేవా సంవత్సరాల పొడిగింపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించవు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, కఠినంగా ఉండేలా మునుపటి వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యం. ఫిట్నెస్ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి వయఃపరిమితిని 32 నుండి 26కి తగ్గించడంతో ఫలితం ఉండదు. సైనికుడిని సర్వతోముఖంగా తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది; వ్యక్తిగత దారుఢ్యం 20ల చివరలో, 30ల ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే వివాదాస్పద సరిహద్దులను 42 ఏళ్లు పైబడిన మధ్యస్థ వయస్సుతో కాపు కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఫిట్నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకపోవడం గమనార్హం. సాయుధ దళాలు, రక్షణ విభాగంలోని పౌర సంస్థల సంఖ్యను సరైన పరిమాణంలోకి తీసుకురావడం ద్వారా పెన్షన్ బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 10,000 మంది కాంట్రాక్టు కార్మికులను, సుమారు 50 పరిశోధన శాలలతో పాటు దాదాపు 30,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. డీఆర్డీఓని పునర్నిర్మించడం, కుదించటం కోసం విజయ్ రాఘవన్ కమిటీ ఇటీవలి సిఫార్సులు సరైన దిశలో ఒక అడుగు. దాదాపు 80,000 మంది కార్మికులు పనిచేస్తున్న 41 ఆర్డినెన్స్ కర్మాగారాలకు ఇదే విధమైన కసరత్తు అవసరం.ఒక వ్యవస్థ స్థితిస్థాపకత... తప్పును సరి చేయగల దాని సామర్థ్యంలో ఉంటుంది. సైనిక విభాగం పెద్దలు అన్ని ఇతర పరిగణనలను పక్కన పెట్టి భారీ సంస్థాగత ప్రయోజనార్థం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాను.జి.జి. ద్వివేది వ్యాసకర్త రిటైర్డ్ మేజర్ జనరల్ -
అగ్నిపథ్ వయోపరిమితి పెంచాలని కేంద్రానికి ఆర్మీ సూచన!
ఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లుకు పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని వల్ల త్రివిధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల పొందే అవకాశాలు అధికంగా ఉంటాయని శుక్రవారం సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు.అదే విధంగా నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మంది ఉద్యోగులను కొనసాగించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ మాత్రమే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము సూచించనట్లుగా 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించటం వల్ల కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మ్యాన్ పవర్ కొరత తగ్గించవచ్చని మరో సైనిక అధికారి అభిప్రాయపడ్డారు. శక్తిమంతమైన సైన్యం కోసం ఈ మార్పులు అవసరమని అన్నారు. రెండేళ్ల వయోపరిమితి పెంచటం మూలంగా త్రివిధ దళాల్లో గ్రాడ్యుయేషన్ పర్తైన అభ్యర్థులు అధిక సంఖ్యలో నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే అగ్నిపథ్ పథకం కింద త్రివిధ దళాల్లో నియామకానికి పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఇక నాలుగేళ్ల సర్వీస్ పూర్తి అయిన తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ సర్వీసు కింద మరో 15 ఏళ్లకు పొడిగించనున్న విషయం తెలిసిందే. -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు
Live Updates..👉 నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.👉కశ్మీర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.👉ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi leads Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/N34howYGzy— ANI (@ANI) June 21, 2024👉బషీర్‌బాగ్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. #WATCH | Telangana: Union Minister and state BJP chief G Kishan Reddy, and others participate in a Yoga session at Nizam College Grounds, Basheer Bagh in Hyderabad. #InternationalYogaDay pic.twitter.com/bSI3g11tQz— ANI (@ANI) June 21, 2024 #WATCH | Defence Minister Rajnath Singh, Army chief Gen Manoj Pande and others perform Yoga in Mathura, Uttar Pradesh on the occasion of International Day of Yoga. pic.twitter.com/ke7DgB80ld— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Pangong Tso in Leh, on the 10th International Yoga Day.(Video source - ITBP) pic.twitter.com/6LCV406hla— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Karzok in Leh, on the 10th International Yoga Day. pic.twitter.com/ZaLsW9Fldd— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Muguthang Sub Sector in North Sikkim at an altitude of more than 15,000 feet, on the 10th International Yoga Day.#InternationalYogaDay2024(Source: ITBP) pic.twitter.com/oBY9Xuznb8— ANI (@ANI) June 21, 2024 👉ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై యోగా డే సెలబ్రేషన్స్.. #WATCH | Yoga onboard aircraft carrier INS Vikramaditya #InternationalYogaDay pic.twitter.com/ROBw82yvph— ANI (@ANI) June 21, 2024 👉యోగా డే పాల్గొన్న జైశంకర్..#WATCH | EAM Dr S Jaishankar and other diplomats perform Yoga in Delhi, on the International Day of Yoga. pic.twitter.com/MSbucUs40x— ANI (@ANI) June 21, 2024 👉 యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. #WATCH | Gujarat CM Bhupendra Patel performs Yoga, along with others, in Nadabet, Banaskantha on International Day of Yoga. pic.twitter.com/Ick5HCm6By— ANI (@ANI) June 21, 2024 -
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
ఆర్మీ పోస్ట్‌పై ఉగ్ర దాడి.. మూడు రోజుల్లో మూడో ఘటన
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఉగ్ర దాడిలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.కథువా జిల్లాలోని చత్రగల ప్రాంతంలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు. -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
న్యూఢిల్లీ:రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్‌షిప్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్‌దీప్‌సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళుతున్న వీడియోను బ్రిగేడియర్ హర్దీప్సింగ్సోహి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో సోమవారం(మే27) పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీ ట్యాగ్‌ను జత చేశారు. ఈ విజయానికిగాను ట్యాంకు డ్రైవర్ మన్‌దీప్‌సింగ్‌పై అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. -
‘సీమా హైదర్ చాలా డేంజర్’
ప్రియుని కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్‌లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నాడు.సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్‌కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్‌కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్‌తో టచ్‌లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్‌తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్ పేర్కొన్నారు. -
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్‌లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. సైన్యంలోని డాగ్ యూనిట్లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్‌లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్‌కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. -
తండ్రి యూనిఫాంలోనే విధుల్లోకి లెఫ్టినెంట్ ఇనాయత్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్ ఇనాయత్ నాట్స్. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు. ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. “𝐀𝐥𝐥 𝐟𝐨𝐫 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞 𝐒𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐡𝐞𝐫 𝐟𝐚𝐭𝐡𝐞𝐫”#OTAChennai #PassingOutParade Inayat was barely three years, when she lost her father Major Navneet Vats in a counter insurgency operation. More than two decades later, she gets commissioned into… pic.twitter.com/AiIBUpfc1J — Army Training Command, Indian Army (@artrac_ia) March 9, 2024 కాగా ఛండిగఢ్కు చెందిన నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్‌నీత్ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్కు కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు. -
భయపెడుతున్న వలస కథలు
దుర్భర కష్టాల నుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్షతో అవకాశాలను అన్వేషిస్తూ ఎంత దూరమైనా పోవటానికి సిద్ధపడటం మనిషి నైజం. దీన్ని ఆసరాచేసుకుని మానవ వ్యాపారం చేస్తున్న మాయగాళ్ల ఆటకట్టించటం ప్రభుత్వాలకు అసాధ్యమా? గత కొన్ని నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎక్కడో ఉద్యోగమని, ఏదో చదువని నమ్మి అప్పులు చేసి, ఏజెంట్లకు లక్షలకు లక్షలు పోసి విమానాలు ఎక్కుతున్న యువకులు చివరకు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో తేలుతున్నారు. ఏ క్షిపణి దాడులకో, బాంబు పేలుళ్లకో బలవుతున్నారు. లేదా దుర్భ రమైన చాకిరీలో ఇరుక్కుని బయటపడే మార్గం దొరక్క అల్లాడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీనుంచి రష్యా వెళ్లిన యువకుడు కిరాయి సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ కన్ను మూశాడు. కేరళకు చెందిన మరో వ్యక్తి ఇజ్రాయెల్‌లో పనిచేస్తూ హమాస్ రాకెట్ దాడిలో చని పోయాడు. మరో ఏడెనిమిదిమంది యువకులు తమను కాపాడాలంటూ రష్యానుంచి వీడియో కాల్లో ప్రాధేయపడ్డారు. కిరాయి సైన్యాల్లో పనిచేసినవారు తిరిగొచ్చాక తగిన ఉపాధి చూపకపోతే సమస్యాత్మకంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. నిరుడు డిసెంబర్లో ఫ్రాన్స్‌లో మన దేశంనుంచి నికరాగువా, సోమాలియా వంటి దేశాలకు వెళ్లే 300 మందిని అనుమానం వచ్చి నిలువరిస్తే ఏజెంట్ల మాయ బయటపడింది. వీరిలో చిన్న పిల్లలు సైతం వున్నారు. చట్టవిరుద్ధ మార్గాల్లోనైనా అమెరికా పోయి డాలర్ల పంట పండించుకోవాలని ప్రయత్నించేవారూ పెరిగారు. 2022 అక్టోబర్– 2023 సెప్టెంబర్ మధ్య 96,917 మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించటానికి విఫలయత్నం చేసి పట్టుబడ్డారు. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా అయిదు రెట్లు అధికం. అమెరికా పోవా లంటే వీసా రావటం అంత తేలిక కాదు గనుక ఇతరేతర మార్గాలు వెదుక్కుంటున్నారు. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు టూరిస్టు వీసాలు లభించటం పెద్ద కష్టం కాదు. అక్కణ్ణించి వేర్వేరు చోట్లకు వెళ్తున్నారు. ఇలాంటివారు వెనకబడిన రాష్ట్రాలనుంచి కాదు, సంపన్న రాష్ట్రాలనుంచే అధికంగా వుండటం ఆందోళన కలిగించే అంశం. ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సీబీఐ సాగిస్తున్న దాడుల్లో ఢిల్లీ చుట్టుపక్కలా, దేశంలోని వివిధ నగరాల్లో దర్జాగాబ్రాంచీలు పెట్టుకుని మనుషుల్ని రవాణా చేస్తున్న ముఠాల ఆచూకీ బట్టబయలైంది. సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక ఏజెంట్ల ద్వారా యువకులకు వలవేసి ఈ ముఠాలు తీసుకు పోతున్నాయి. రష్యా వెళ్లేవారికి మంచి ఉద్యోగాలంటూ నమ్మించి తీరా ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రానికి బలవంతంగా తరలిస్తూ వారి ప్రాణాలను పణం పెడుతున్నారు. అనేకులు యుద్ధంలో తీవ్రంగా గాయపడి సాయం చేసే దిక్కులేక ఆసుపత్రుల్లో విలవిల్లాడుతున్నారు. ఇలా యువకులను తీసుకెళ్లిన ఉదంతాలు 35 వరకూ బయటపడ్డాయని సీబీఐ అంటున్నది. మరెందరు వీరివల్ల మోసపోయారో తేలాలి. హమాస్ నుంచి, హిజ్బుల్లా నుంచి నిరంతరం రాకెట్ దాడులు సాగుతున్న ఇజ్రాయెల్‌లో నిర్మాణరంగంలో తాత్కాలిక అవకాశాలున్నాయంటూ రిక్రూట్మెంట్ మొదలెడితే హిందీ భాషా రాష్ట్రాలనుంచి అత్యధికులు క్యూ కట్టారు. ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన ఈ రిక్రూట్మెంట్ కోసం వచ్చినవారిని మీడియా కదిలిస్తే ఆకలితో చచ్చేకన్నా పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవటం నయమన్న జవాబొచ్చింది. తమ ప్రాణాలు పోయినా కుటుంబాలకు ఎంతో కొంత అందుతుందన్న ధీమా వారిది. ఎంత విషాదకర స్థితి! మరో ఆరేళ్లలో మన దేశం ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వఅంచనాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనాను అధిగమించటం మరెంతో దూరంలో లేదని ఆర్థికరంగ నిపుణులు ఊరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వున్న 6.1 శాతం వృద్ధి రేటు ఈ ఏడాది చివరికల్లా 6.8 శాతానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. నిరుద్యోగిత తగ్గిందని, కొనుగోలు శక్తి బాగా పెరిగిందని, తయారీ రంగం పుంజుకుందని గణాంకాలు అంటున్నాయి. అయినా ఇంతమంది ఎందుకు వలసబాట పడుతు న్నారు? ఇబ్బందులుంటాయని తెలిసినా తప్పుడు మార్గాల్లో అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్థికవ్యవస్థ వెలుగులీనటం నిజమే అయినా అందులో సామాన్యులకు వాటా లేకపోతే సాధించిన అభివృద్ధికి అర్థమేముంటుంది? యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామంటే లోపం ఎక్కడుందో ఆత్మపరిశీలన చేసు కోవాల్సిన అవసరం లేదా? యుద్ధ క్షేత్రాలవైపు పోయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని మన విదేశాంగ శాఖ ఈమధ్య ఒక ప్రకటన చేసింది. మంచిదే. కానీ అదొక్కటే సరిపోతుందా?తమ విధానాలను విమర్శిస్తారనుకున్నవారిని దేశంలో అడుగుపెట్టకుండా విమానాశ్రయాల నుంచే వెనక్కిపంపుతున్నారు. పరాయిగడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారన్న శంకతో కొంద రిని బయటికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. కానీ మనుషుల్ని మోసపుచ్చి వారిని అక్రమంగా తరలి స్తున్న మాయదారి ముఠాలకు కళ్లెం వేయటం ఎందుకు సాధ్యపడదు? ఇది ఎన్నికల నామ సంవ త్సరం గనుక కనీసం ఇప్పుడైనా ఉపాధి కల్పనకూ, తయారీరంగ పరిశ్రమలు పుంజుకోవటానికీ, వ్యవసాయ అనుబంధరంగాల్లో పనులు పుష్కలంగా లభించటానికీ చర్యలు తీసుకోవాలి. గణాంకాలు కళ్లు చెదిరేలావుండొచ్చు. కానీ అవి కడుపు నింపవు. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: వివాహాన్ని సాకుగా చూపి మహిళను ఉద్యోగంలో నుంచి తొలగించడం లింగ వివక్షత చూపించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్షాపూరితంగా వ్యవహరించే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమంతించబోదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత మహిను ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు ఆమెకు రూ. 60లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసుపై జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వివాహం అనంతరం సెలినా జాన్ అనే నర్సును 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం సవాలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ఫిబ్రవరి 14 నాటి ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే బాధితురాలు ప్రైవేటుగా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. సదరు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ, వేతనాన్ని ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ .60లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. చదవండి: కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన -
ఇండొనేసియాలో కొత్త ఏలిక
సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టు బుధవారం జరిగిన ఇండొనేసియా దేశాధ్యక్ష ఎన్నికల్లో రక్షణమంత్రి, వివాదాస్పద మాజీ సైనికాధికారి జనరల్ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. అభ్యర్థుల్లో మిగిలినవారితో పోలిస్తే ఓటర్లకు బాగా పరిచయమున్న నేత గనుక తొలి రౌండులో ముందంజలో ఉంటాడని అందరూ అంచనా వేశారు. కానీ నెగ్గటానికి అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల వరకూ వెళ్లగలరని ఎవరూ అనుకోలేదు. ఇండొనేసియా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికీ కనీస ఓట్లు లభించకపోతే తిరిగి పోలింగ్ నిర్వహించకతప్పదు. గతంలో అధ్యక్ష పదవికి రెండు దఫాలు పోటీచేసి ఓడిన సుబియాంటోకు తాజా ఎన్నికల్లో సానుభూతితోపాటు యువత మద్దతు పుష్కలంగా దొరికింది. అందుకే ఆయనకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. సుబియాంటో చరిత్ర ఏమంత ఘనమైనది కాదు. దేశాన్ని దీర్ఘకాలం పాలించిన తన సొంత మామ, నియంత జనరల్ సుహార్తో ప్రాపకంతో సైన్యంలో ఉన్నత పదవులకు ఎగబాకి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. 1997 నాటి విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమ యంలో దాదాపు 20 మంది విద్యార్థి నేతల అపహరణలకు సుబియాంటోయే కారణమన్న ఆరోపణ లున్నాయి. వారందరూ సైన్యం చిత్రహింసలకు బలైవుంటారని మానవ హక్కుల సంఘాలు ఆరో పించాయి. చిత్రమేమంటే ఆ తర్వాత మరో ఏడాదికే సుహార్తోను గద్దెదించటానికి సుబియాంటో తోడ్పడ్డారు. ఆ తర్వాత తానే ఆ పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరినా అది సాధ్యపడలేదు. కనీసం సైనిక దళాల చీఫ్ కావాలని కలలుకన్నా సుహార్తో స్థానంలో అధ్యక్షుడైన బీజే హబీబి అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో ఆయనపై ఆగ్రహించి కొందరు సైనికులను వెంటబెట్టుకుని అధ్యక్ష భవనంపై దాడికి సిద్ధపడ్డారు. కానీ అది వికటించి సైన్యం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఆ తర్వాత జోర్డాన్ పరారై వ్యాపారవేత్తగా అవతరించారు. 2009 అధ్యక్ష ఎన్నికల నాటికి సొంతంగా ఒక పార్టీ స్థాపించి మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమికట్టి ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. కానీ ఆ కూటమి ఓటమి చవిచూసింది. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓటర్లు తిరస్కరించారు. ఆ తర్వాతే సుబియాంటోకు జ్ఞానోదయమైంది. రెండుసార్లూ తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో సంధి చేసుకుని రక్షణమంత్రి అయ్యారు. ఈసారి సైతం జోకోవియే పోటీచేసేవారు. కానీ అధ్యక్ష పదవికి వరసగా రెండుసార్లు మించి పోటీ చేయకూడదన్న నిబంధన కారణంగా ఆయన రంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఇండొనేసియా మూడో అతి పెద్ద ప్రజాతంత్ర దేశం. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా వున్న దేశం. ఆగ్నేయాసియాలో అతి పెద్ద పారిశ్రామిక దేశంగా ఒకప్పుడున్నా 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో దెబ్బతింది. ఆ తర్వాత క్రమేపీ వృద్ధి సాధిస్తూ 2012 నాటికి జీ–20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి వైపు దూసుకుపోతున్న నాలుగో అతి పెద్ద దేశంగా ఎదిగింది. 2020లో కోవిడ్ బారిన పడటమేకాక, ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నా నిరు ద్యోగం, అధిక ధరలు వేధిస్తూనే వున్నాయి. దానికితోడు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు తగాదాలున్నాయి. అయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకూ ఆ వివాదం అడ్డురాలేదు. అటు అమె రికా, భారత్‌లతో సాన్నిహిత్యం సాగిస్తూ ఇండొనేసియా ఆర్థికంగా పుంజుకుంటోంది. విదేశీ పెట్టు బడులను ఆకర్షిస్తోంది. అయితే దీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, ఉద్యమ చరిత్రగల ఇద్దరు నేతలను కాదని మాట నిలకడ, సిద్ధాంత నిబద్ధత లేని సుబియాంటోకు ఈ స్థాయిలో ప్రజలు నీరాజనాలు పట్టడం ఆశ్చర్యకరమే. యువతలో సుబియాంటో పేరు మారుమోగటానికి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. సర్వే నిర్వహించిన సంస్థలకు ఓటర్లు... మరీ ముఖ్యంగా యువ ఓటర్లు ఆయన గత చరిత్ర తమకు అనవసరమని చెప్పటం సుబియాంటోకున్న జనాకర్షణను తెలియజేస్తుంది. గతంలో దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన రెండుసార్లూ తన సైనిక గతాన్ని ఘనంగా చెప్పుకున్న సుబియాంటో ఈసారి ఆ జోలికి పోలేదు. సైనికాధికారిగా పనిచేసిన కాలంలో తూర్పు తైమూర్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారిని హతమార్చటం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యమించిన విద్యార్థి నేతలను మాయం చేసి వారి ప్రాణాలు తీయటంవంటి అంశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయనపై నిషేధం కూడా విధించాయి. మూడో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండొనేసియాలో క్రమేపీ వ్యవస్థలు బలహీనపడు తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సుబియాంటో తరఫున ఉపాధ్యక్ష పదవికి నిలబడిన 36 ఏళ్ల గిబ్రాన్ నేపథ్యమే ఈ సంగతి చెబుతుంది. కనీసం 40 ఏళ్లుంటే తప్ప ఉపాధ్యక్ష పదవికి పోటీచేయటానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా రాజ్యాంగ న్యాయ స్థానం చీఫ్ జస్టిస్‌గా వున్న గిబ్రాన్ మామ ఈ నిబంధనను సవరించి అతనికి సాయపడ్డాడు. దీనిపై ఆందోళన చెలరేగి చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాల్సివచ్చినా, ఆ తీర్పు మాత్రం రద్దుకాలేదు. 20 కోట్ల మంది ఓటర్లలో అత్యధికుల మనసు గెలుచుకున్న సుబియాంటో అంతంతమాత్రంగా వున్న వ్యవస్థలను మరింత బలహీనపరుస్తారని ఆయన ఎన్నికల ప్రసంగాలే చెబుతున్నాయి. మానవ హక్కుల చార్టర్, రాజ్యాంగ న్యాయస్థానం వంటివి కనుమరుగైతే ఇండొనేసియా తిరిగి నియంతృత్వంలోకి జారుకుంటుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజల అప్రమత్తతే ఆ ప్రమాదాన్ని నివారించాలి. -
ఆ మోటర్ సైకిల్‌కి నాటి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు!
రెండు దేశాల సైనిక నాయకుల మధ్య జరిగిన ఆసక్తికర ఘటన. ఇది భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్నప్పుడు చోటు చేసుకున్న రసవత్తర ఘటన. బ్రిటీష్ పాలనా కాలంలో భారత్‌కి చెందిన సామ్ మానెక్షా, పాక్‌కి చెందిన యాహ్యా ఖాన్ మధ్య చోటు చేసుకుంది ఈ ఘటన. నిజానికి ఈ ఇద్దరూ ఆంగ్లేయుల పాలన కాలంలో మిలటరీ లీడర్లుగా పనిచేయడంతో వీరి మధ్య కొద్దిపాటి స్నేహం ఏర్పడింది. ఆ టైంలో మానెక్షా లెఫ్టినెంట్ కల్నల్ పనిచేయగా, యాహ్యా ఖాన్ మేజర్. అయితే యహ్యా ఖాన్‌కి మానెక్షా వద్ద ఉండే ఎరుపు రంగు మోటార్ సైకిల్‌పై ఆశ ఉండేది. దీంతో ఒకరోజు యహ్యా ఖాన్ మానెక్షాని నాకు ఆ సైకిల్ ఇవ్వు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు. మానెక్ష ఆ వెయ్యి రూపాయాలకు ఆశపడి తన వద్ద ఉన్న ఎరుపు రంగు మోటార్ సైకిల్ని ఇచ్చేయడం జరిగింది. ఈలోగా బ్రిటీష్ వాళ్ల మనదేశాన్ని విడిచిపెట్టిపోవడం వెళ్తూ పాక్‌ని అంటగట్టడం జరిగింది. అదికాస్త 1947లో మన భారత్ నుంచి వేరుగా దేశంగా ఏర్పడటం అన్నీ చకచక జరిగిపోయాయి. దీంతో యహ్యా ఖాన్ ఆ సైకిల్ని తీసుకుని పాక్‌కి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే పాపం మన భారత ఆర్మీ నాయకుడు సామ్ మానెక్షాకి మాత్రం యహ్యా ఖాన్ డబ్బు చెల్లించ లేదు. ఆంగ్లేయులు వెళ్లిపోయిన అనంతరం మానెక్షా మన భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనుకోకుండా 1971లో భారత్‌కి పాక్‌కి మధ్య భయానక యుద్ధం జరిగింది. ఆ టైంలో మన మానెక్ష భారత ఆర్మీ ఛీప్‌గా సైన్యాని నిర్వహిస్తుండగా, యహ్యా ఖాన్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో మన మానెక్ష సారథ్యంలో భారత ఆర్మీ పాక్ సైన్యాన్ని మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. ఈ యుద్ధం కారణంగానే బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడటం కూడా జరిగింది. ఈ మేరకు ఓ పత్రిక ఇంటర్వ్యూలో మానెక్షా ఈ ఘటన గురించి చెబతూ తాను 24 ఏళ్లుగా తమన మోటర్ సైకిల్ డబ్బులు వెయ్యి రూపాయాలు ఎప్పుడు వస్తాయా? అని 24 ఏళ్లుగా ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే యహ్యా ఖాన్ ఇప్పుడూ తన దేశ ఓటమితో తనకు మూల్యం చెల్లించాడంటూ చమత్కరించారు మానెక్షా. అలాగే తాను యహ్యా ఖాన్ని ఎప్పుడూ ఆ వెయ్యి రూపాయల్ని వడ్డితో సహా చెల్లించమని అడగను కూడా అడలేదని చెప్పుకొచ్చారు. దీని గురించి 2008లో ఆంగ్ల పత్రికా కాలమిస్ట్ రాసుకొచ్చాడు. ఐతే ఇంటర్వ్యూలో మానెక్ష ఆ ఘటనను ఎన్నడూ మర్చిపోలేనని అన్నాడు. ఇద్దరూ వారి దేశాలకు సంబంధించిన అత్యున్నత హోదాలో సాగినా..స్నేహితులుగా ఉన్నప్పుడూ జరిగిన ఘటన మానెక్షని ఎన్నటికీ మర్చిపోనివ్ల లేదు. ఆ ఘటన మానెక్షా మనుసులో మర్చిపోలేని ఘటనగా ఉండిపోయింది. స్నేహం పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం భవిష్యత్తులో కాలం ఎలా బదులు తీర్చుతుంది అనేందుకు ఉదాహరణే ఈ గాథ. అదీగాక తనను మోసం చేసి తన వస్తువుని స్నేహితుడి పట్టుకుపోతే ఆ వ్యక్తి పట్ల సదరు స్నేహితుడి మనుసులో ఎలాంటి ముద్రపడుతుందనేందుకు ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఇక యుద్ధం గెలిచినప్పటికీ దీనివవల్ల మానవ నష్టం ఎంత ఉంటుందో గుర్తించాడు జనరల్ మానేక్షా. ఇక యహ్యాఖాన్ తర్వాత క్రమక్రమంగా రాజీకయ పతనాన్ని చవిచూశాడు. కాగా ఈ ఘట్టం 2003లో బాలీవుడ్లో తీసిన శ్యామ్ బహుదూర్ సినిమాలో కూడా ఉంది. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. (చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!) -
Preeti Rajak: సుబేదార్ ప్రీతి
ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్‌గా చేరిన ప్రీతి రజక్ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్‌లో ట్రాప్ షూటర్‌గా సిల్వర్ మెడల్ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతి రజక్ ఆర్మీలో ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్ నాయక్’, ‘నాయక్’, ‘హవల్దార్’, ‘నాయబ్ సుబేదార్’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్‌గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్ రికార్డును నమోదు చేసింది. ట్రాప్ షూటర్‌గా ఆసియన్ గేమ్స్‌లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు. ► లాండ్రీ ఓనరు కూతురు ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్ది మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్‌లోకి వచ్చింది. భోపాల్‌లోని స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో మిలటరీ పోలీస్ డివిజన్లో నేరుగా 2022లో హవల్దార్ ఉద్యోగం వచ్చింది. ► ఏ సాహసానికైనా సిద్ధమే ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్ గేమ్స్‌లో షార్ట్ పిస్టల్ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ► పారిస్ ఒలింపిక్స్‌కు ఈ సంవత్సరం జూలైలో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్‌మెన్‌షిప్ యూనిట్’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్ షూటింగ్లో విభాగంలో ఆరవ ర్యాంక్‌లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది. -
ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: ట్రాప్ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్ ప్రీతీ రజక్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్లో వెండి పతకం సాధించి ఛాంపియన్ ట్రాప్ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో హవాల్దార్‌గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే! ట్రాప్ విమెన్ ఈవెంట్ విభాగంలో ప్రీతి దేశంలో ఆరో ర్యాంకర్. పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్ యూనిట్లో శిక్షణ పొందుతున్నారు. -
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
ప్రాణం తీసిన చైనా మాంజా!
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్‌హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్‌గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
10 వేల మందికి క్షమాభిక్ష!
బ్యాంకాక్: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు -
2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి, సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
Gaza: ‘యూఎన్’ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు
గాజా: యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన పాలస్తీనా శరణార్థులకు సాయం చేసేందుకు వెళ్లిన ఐక్యరాజ్య సమితి(యునైటెడ్ నేషన్స్) బృందానికి చెందిన కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. కాన్వాయ్ గాజా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ మృతి చెందలేదని యూఎన్ అధికారులు తెలిపారు. ‘ఉత్తర గాజాలో సహాయక చర్యల కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మా కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిగింది. సైన్యం చెప్పిన రూట్లోనే మేం ప్రయాణిస్తున్నాం. ఈ కాల్పుల్లో మా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అయితే ఒక వాహనం మాత్రం డ్యామేజ్ అయింది’ అని యూఎన్ బృందం డైరెక్టర్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. గాజా ప్రజలకు, వారికి సాయం చేయాలనుకున్న వారికి అసాధ్యమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ఎక్స్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగినప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా గాజాలోని కొంత భాగాన్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదీచదవండి..చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా..? -
పూంచ్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్షించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ అధికారుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. అలాగే రాజౌరీ జిల్లాలో సైనికుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులను పరమర్శించారు. కాగా డిసెంబర్ 21న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సైనికులు ప్రతిదాడి చేయగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఉగ్రదాడిపై దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి వెళ్లింది. సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ములో పర్యటించారు. పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి ముందు పౌరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీకి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత పౌరులను బాధపెట్టే ఏ పొరపాట" ఆర్మీ చేయలేదని అన్నారు. ‘మీరు దేశ రక్షకులు. అయితే దేశ భద్రతతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ పౌరులను బాధపెట్టే తప్పులు మీరు చేయకూడదు’ అని తెలిపారు. -
ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి
ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్‌బీర్ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. Army Officer, Who Was In Coma For 8 Years After Gunshot Injuries, Dies https://t.co/9AaAfXz7Vy — NDTV (@ndtv) December 26, 2023 2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్‌బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు. 2023లో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్‌లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు. ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్‌లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్‌లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్‌తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్‌లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. డిసెంబరులో పూంచ్‌లోని తన్నమండి సూరంకోట్ రోడ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్కు విముక్తి? -
చైనాకు చుక్కలు చూపించిన మేజర్ షైతాన్ సింగ్
శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది. 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. అయితే 1962, నవంబరు 18న, అంటే యుద్ధం మధ్యలో మరొక చిన్న యుద్ధం జరిగింది. దీనిని రెజాంగ్ లా యుద్ధం అని చెబుతారు. ఈ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ విజయం సాధించి, అమరవీరుడు అయ్యాడు. మరణానంతరం పరమవీర చక్రను అందుకున్నాడు. 1962లో భారత్‌పై చైనా దాడి చేసింది. ఈ సమయంలో కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన 13వ బెటాలియన్ లేహ్-లడఖ్‌లోని చుషుల్ సెక్టార్లో మోహరించింది. దీనిలోని సీ కంపెనీ సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల (16 వేల అడుగులు) ఎత్తులో రెజాంగ్ లా వద్ద ఉన్న పోస్ట్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. 1962 నవంబరు 18న ఉదయం చైనా దళాలు ఈ పోస్ట్‌పై దాడి చేశాయి. తేలికపాటి మెషిన్ గన్లు, రైఫిల్స్, మోర్టార్లు, గ్రెనేడ్లతో దాడి జరిగింది. ఆ సమయంలో ఎముకలు కొరికే చలి సైనికులను చుట్టుముట్టింది దాదాపు 1300 మంది చైనా సైనికులతో 120 మంది భారత సైనికులు పోరాడుతున్నారు. మేజర్ షైతాన్ సింగ్.. రెజిమెంట్‌లోని చార్లీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధంలో పోరాడేందుకు తక్కువ సైనిక బలగం, తక్కువ ఆయుధాలు ఉన్నాయని గ్రహించిన ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించారు. సైనికులు ఫైరింగ్ పరిధిలోకి రాగానే శత్రువుపై కాల్పులు జరపాలని ఆదేశించారు. ఒక్క బుల్లెట్‌తో ఒక్కో చైనా సైనికుడిని చంపేయాలని కోరాడు. ఈ వ్యూహంతో భారత సైనికులు దాదాపు 18 గంటల పాటు శత్రువులను ఎదుర్కొని విజయం సాధించారు. అయితే అప్పటికే 114 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కుయుక్తులకు దిగి, దాడి చేయడంతో ఈ యుద్ధంలో గెలిచింది. భారత సైన్యానికి చెందిన మూడు బంకర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మేజర్ షైతాన్ సింగ్ శత్రువులతో పోరాడుతూనే ఉన్నాడు. కాలికి మెషిన్ గన్ కట్టుకుని, కాలి వేళ్లతో ట్రిగ్గర్ నొక్కుతూ బుల్లెట్లు కురిపించాడు. అయితే మేజర్ షైతాన్ సింగ్‌కు అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. సుబేదార్ రామచంద్ర యాదవ్ అతనిని తన వీపునకు కట్టుకుని చాలా దూరం వరకూ తీసుకెళ్లి, అక్కడ పడుకోబెట్టారు. కొద్దిసేపటికే మేజర్ షైతాన్ సింగ్ అమరుడయ్యాడు. ఈ ఘటన 1962 నవంబరు 18 జరిగింది. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! Major Shaitan Singh Param Vir Chakra Kumaon Regiment 18 November 1962 Major Shaitan Singh displayed undaunted courage and exemplary leadership in the face of the enemy. Awarded #ParamVirChakra (Posthumous). We pay our tribute. https://t.co/i8AOme3gYH pic.twitter.com/AGoSAKYD9e — ADG PI - INDIAN ARMY (@adgpi) November 18, 2023 -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
ఇజ్రాయెల్-గాజా: ఒక్కరోజులో 704 మంది బలి
రఫా/టెల్అవీవ్/న్యూఢిల్లీ: గాజారస్టిప్లో హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు మరింత ఉధృతం చేసింది. గత 24 గంటల వ్యవధిలో 400 వైమానిక దాడులు నిర్వహించామని మంగళవారం ప్రకటించింది. బాంబు దాడులతో హమాస్ స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు హమాస్ కమాండర్లు హతమయ్యారని వెల్లడించింది. కానీ, ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది. వీరిలో 305 మంది చిన్నారులు, 173 మంది మహిళలు ఉన్నారని వివరించింది. సోమవారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 32 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ భవనంలో 100 మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఉత్తర గాజా నుంచి వచ్చినవారే. గాజాలో 2,055 మంది చిన్నారులు మృతి ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. ఈ మారణహోమం ఆపేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే చొరవ చూపాలని కోరాయి. సామాన్య ప్రజల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, కాల్పుల విరమణ పాటించాలని, ఘర్షణకు తెరదించాలని ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం 18వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా గాజాలో 5,087 మంది మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 2,055 మంది చిన్నపిల్లలు ఉన్నారని పేర్కొంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా చనిపోయారు. మిలిటెంట్ల అదీనంలో 200 మందికిపైగా బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో సాధారణ నివాస గృహాలు, పాఠశాలలు, మసీదులు నేలమట్టయ్యాయి. ఎటుచూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. గాజాలో 10 లక్షల మందికిపైగా మైనర్లు నిర్బంధంలో చిక్కుకుపోయారని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో 27 మంది బాలలు మరణించారని వెల్లడించింది. ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు చేస్తోందని, చిన్నారుల్ని బలి తీసుకుంటోందని ఆరోపించింది. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సేవలు బంద్ ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల వల్ల గాజాలో క్షతగాత్రుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా, మరోవైపు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఎలాంటి సేవలు అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. 72 ఆరోగ్య కేంద్రాలకు గాను 46, 35 ఆసుపత్రులకు గాను 12 ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని మంగళవారం ప్రకటించింది. ఔషధాలు, విద్యుత్, ఇంధన కొరత కారణంగా క్షతగాత్రులకు సేవలందించలేకపోతున్నామని పాలస్తీనా అరోగ్య శాఖ అంటోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కొన్ని ఆరోగ్య కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత అధ్వాన స్థితికి చేరుకుందని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. బందీల సమాచారం ఇవ్వండి గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రస్తుతానికి వైమానిక దాడులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూతల దాడులు ప్రారంభమైతే గాజాలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లకి హమాస్ మిలిటెంట్లు స్పందిస్తున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను ఇప్పటికే విడుదల చేయగా, సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేశారు. బందీల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచిస్తూ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కరపత్రాలు జారవిడిచింది. సమాచారం అందజేసేవారికి ఆపద రాకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది. నిండిపోయిన శ్మశాన వాటికలు ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ ప్రారంభమైన తర్వాత గాజాలో 14 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. వీరిలో దాదాపు 5.80 లక్షల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోకి ఆహారం, ఇతర సహాయక సామాగ్రిని అనుమతిస్తున్న ఇజ్రాయెల్ పెట్రోల్, డీజిల్‌ను మాత్రం అనుమతించడం లేదు. గాజాలో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఒకే సమాధిలో ఐదు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. పాత సమాధులను తవ్వేసి, కొత్త మృతదేహాలను సమాధి చేస్తున్నారు. -
మోహరించిన ఇజ్రాయెల్ సేనలు
జెరూసలేం/గాజా స్ట్రిప్/రఫా: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్ల అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. పదాతి దళాలు పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. 3 లక్షలకుపైగా ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాజా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయినట్లు అంచనా. ఇజ్రాయెల్‌కు సాయంగా మిత్రదేశం అమెరికా పంపించిన అత్యాధునిక యుద్ధవిమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజాను గుప్పిట్లో పెట్టుకొని తమ భద్రతకు ముప్పుగా పరిణమించిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపాల్లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఇజ్రాయెల్ సైన్యం తేలి్చచెబుతోంది. గాజాలో ప్రజల కష్టాలకు తెరపడడం లేదు. ఆహారం, నీరు, ఇంధనం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో వారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. చికిత్సలు ఆగిపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లు కూడా లేవని వాపోతున్నారు. హమాస్ చేతిలో బందీలు 199 మంది గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 199 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ సోమవారం వెల్లడించారు. దాదాపు 150 మంది బందీలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావించామని, కానీ, 199 మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. బందీల్లో చాలామంది ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, బందీల్లో విదేశీయులు ఉన్నారో లేదో ఆయన బహిర్గతం చేయలేదు. వైమానిక దాడులు నిలిపివేస్తే బందీలు విడుదల గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం తెలియజేసింది. కానీ, దీనిపై హమాస్ స్పందించలేదు. తమపై దాడులు ఆపడంతోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్ ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో.... లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న యూ దులంతా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయా లని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లెబనాన్ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ ప్రభుత్వ మద్దతున్న షియా తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా సభ్యుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాల్లోని నిఘా కెమెరాలను హెజ్బొల్లా సభ్యులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ కదలికలను ఇజ్రాయెల్ గుర్తించకుండా ఉండేందుకు వారు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య జరిగిన తాజా ఘర్షణలో ఒక ఇజ్రాయెల్ సైనికుడు, ఒక పౌరుడు మరణించారు. లెబనాన్‌లో ఒక జర్నలిస్టు సహా ముగ్గురు పౌరులు మృతిచెందారు. వచ్చేవారం ఇజ్రాయెల్‌కు జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారని తెలిసింది. ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతోపాటు అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. గాజాపై ఆధిపత్యం పొరపాటే అవుతుంది: బైడెన్ ఇజ్రాయెల్ సేనలు గాజాలో సుదీర్ఘకాలంపాటు ఉండడం పెద్ద పొరపాటుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజాపై యుద్ధం వద్దంటూ ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. గాజాలో పాలస్తీనియన్ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగాలని తాను ఆశిస్తున్నట్లు బైడెన్ తాజాగా స్పష్టం చేశారు. మొత్తం పాలస్తీనియన్లకు హమాస్ మిలిటెంట్లు ప్రతినిధులు కాదని తేల్చిచెప్పారు. గాజాను ఇజ్రాయెల్ ఎక్కువ కాలం అ«దీనంలో ఉంచుకుంటుందని తాను భావించడం లేదన్నారు. మమ్మల్ని పరీక్షించొద్దు: నెతన్యాహూ తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆయన సోమవారం ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో ప్రసంగించారు. హమాస్‌ను ఓడించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఈ యుద్ధం మీ యుద్ధం’ అని అన్నారు. హమాస్ మిలిటెంట్లు నాజీ ముష్కరుల్లాంటివారేనని నెతన్యాహూ తేలి్చచెప్పారు. దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే: ఇరాన్ గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దురాక్రమణ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రాంతంలో అందరూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ స్పష్టం చేశారు. గాజాపై దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని, ఇజ్రాయెల్‌కు గుణపాఠం తప్పదని తేలి్చచెప్పారు. గాజాలో సాధారణ పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను వెంటనే ఆపాలని అమెరికాకు ఇరాన్ సూచించింది. గాజాపై వైమానిక దాడులు ఆపకపోతే తాము ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బందీలను వెంటనే విడుదల చేయాలి: ఐరాస బందీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హితవు పలికారు. అలాగే గాజా స్ట్రిప్‌కు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం ఇజ్రాయెల్‌కు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దులు తెరవాలని అన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హర్షించదగ్గ పరిణామం కాదని చెప్పారు. ఈజిప్టు, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు నుంచి నిత్యావసరాలు పాలస్తీనియన్లకు అందేలా ఇజ్రాయెల్ చొరవ తీసుకోవాలని కోరారు. ఘర్షణ ఆగిపోవాలి: రిషి సునాక్ ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు. రిషి సునాక్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో లండన్‌లో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై వారితో చర్చించారు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు రిషి సునాక్ సూచించారు.