ఢిల్లీ: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. హమాస్‌ను ఉగ్రదాడిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోబోమని నౌర్ గిలోన్ అన్నారు.
తమకు మద్దతు తెలుపుతున్న వాలంటీర్లతో మరో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను తయారు చేయవచ్చని నౌర్ గిలోన్ అన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమకు మద్దతుగా మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాను చూడండి. మద్దతు తెలుపుతున్న భారత వాలంటీర్లతో మరో రక్షణ దళాన్ని తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ తరుపున పోరాడటానికి మేమంతా ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు.' అని నౌర్ గిలోన్ తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ స్నేహసంబంధాలు ఎంత ప్రత్యేకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని అన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
Comments
Please login to add a commentAdd a comment