volunteer
-
చందాలేసుకుని విద్యా వలంటీర్ నియామకం!
గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బులు పోగు చేసుకుని చదువుకున్న ఒక యువకుడిని వలంటీర్‌గా నియమించుకున్నారు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
9న వలంటీర్ల ఆవేదనా సదస్సు
సాక్షి, విజయవాడ: ఈ నెల 9న వలంటీర్ల ఆవేదనా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఎనిమిది కేబినెట్ మీటింగ్‌లు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న క్యాబినెట్లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిపడ్డ ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. -
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
చంద్రబాబు మార్క్ వెన్నుపోటు
-
మహిళా వలంటీర్‌పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్‌గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్‌కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్‌లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
సాక్షి, అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున జూలై నెల పింఛన్‌తో కలిపి వృద్ధులు, వితంతు మహిళలకు జూలై ఒకటో తేదీ ఉదయాన్నే ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. అదే విధంగా దివ్యాంగులకు సైతం పెంచిన పింఛన్లను అరియర్స్‌తో ఇస్తామన్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలను ఆ పార్టీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో సైతం అమలు చేయడం లేదని, అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము వ్యతిరేకించినట్లు వివరించారు. గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని, ఈసీఐ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అయితే పలువురు వలంటీర్లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వంటి కీలక పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రంలో నిర్విర్యమైన యువతలో నైపుణ్యాలు పెంపునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని మరో మంత్రి డోలా తెలిపారు. ఒక్క చాన్స్ అని మాజీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మంత్రి ఎస్.సవిత విమర్శించారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
వాలంటీర్ గా పని చేయడం గర్వంగా ఉంది
-
ఓటుకు 5-10 వేలు.. టీడీపీ ఎరను తిప్పికొట్టిన వాలంటీర్..
-
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
‘పచ్చ’కుట్రలు పటాపంచలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి ఐదేళ్లుగా పింఛను అందిస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘పచ్చ’కుట్రలు పటాపంచలయ్యాయని వైఎస్సార్సీపీ డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డకున్నా సామాజిక పింఛన్లను సకాలంలో అందించి సచివాలయ వ్యవస్థ విజయం సాధించిందని ప్రశంసించారు. ‘వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛనుగా అందిస్తూ వస్తోంది. వారి జీవనానికి ఒక భరోసా కల్పించింది. ఈ విధానం అనేక దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందాలొచ్చి అధ్యయనం చేశాయి. ఇదెక్కడ జగన్మోహన్రెడ్డికి పేరొస్తుందోనన్న అసూయతో చంద్రబాబు కుతంత్రాలకు ఆదిలోనే తెరలేపారు. వలంటీర్ల వ్యవస్థపై బురదజల్లారు. కించపరిచేలా దుర్భాషలాడారు. ఇవేవీ పట్టించుకోకుండా వలంటీర్లు సేవాదృక్ఫథంతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేయడానికి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఇదే చంద్రబాబు హైదరాబాద్ ప్యాలెస్‌లో తాళాలేసుకొని కూర్చుంటే వలంటీర్లు ఇక్కడ ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా నిలిచారు. వైద్యసేవలు సత్వరమే అందించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రినని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సృష్టించిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ సేవలందించే ముసుగులో తమ ప్రాణాలు ఎలా తోడేశాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 2019 సంవత్సరంలో టీడీపీని తరిమికొట్టారు. జన్మభూమి కమిటీలకు ఎంతో భిన్నంగా ఉన్న వలంటీర్లను చూసి చంద్రబాబు కక్ష కట్టారు. నిమ్మగడ్డ రమేష్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను అందించకుండా వలంటీర్లను దూరం చేశారు. ఇలా ఒక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రకు తెరలేపారు. ఇది దురదృష్టకరం. చంద్రబాబు చేష్టలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కచ్చితంగా బుద్ధి చెబుతారు. జగన్ విజన్‌కు నిదర్శనం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌కు నిదర్శనం. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను పెట్టారు. ప్రభుత్వ సేవలను, పథకాలను పైసా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అందించిన వ్యవస్థగా పేరొందింది. దీన్ని చెడగొట్టడానికి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. వృద్ధులు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛను ఇంటివద్దనే అందుకోకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు. మండుటెండల్లో రోడ్లపైకి లాగి చంద్రబాబు తనలోనున్న సైకో మనస్తత్వత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదిఏమైనా సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం హర్షణీయం. సచివాలయ ఉద్యోగులకు అభినందనలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల్లో కల్పించిన దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను ఇన్నాళ్లూ గుర్తించని చంద్రబాబే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలన్నారంటేనే ప్రజాసేవ పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చాటిచెబుతోంది. వలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్న చంద్రబాబే తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఖజానాలో డబ్బుల్లేవని, అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని దుష్ప్రచారం చేశారు. కానీ లబ్ధిదారులందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేసి జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. -
వెన్నులో వణుకు చంద్రబాబుకు అన్నీ రివర్స్
-
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్‌షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్‌కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్‌పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
సైంధవుడుచంద్రబాబే..
సాక్షి, నెట్వర్క్: పింఛన్‌కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సచివాలయానికి ఎలా వెళ్లాలి ? నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా చంద్రబాబు చూపు పడితే కష్టాలే నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్మోహన్రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా మా ఉసురు తగులుతుంది రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి. టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్‌ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్‌తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా నిస్సహాయులను శిక్షించడమేమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్‌ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా, -
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌న్‌పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మా ఉసురు తగులుద్ది..
మూడుచక్రాల సైకిల్‌పై ఉన్న ఈ దివ్యాంగుడి పేరు షేక్ పాచ్ఛా. పొదిలికి చెందిన ఇతను టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వికలాంగ పింఛన్ మంజూరైంది. ఠంఛనుగా ప్రతినెలా వలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కుట్రలతో వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఎండలో సచివాలయాలకు వెళ్లి క్యూలో ఉండి అధికారుల కోసం పడిగాపులు కాసి పింఛను తీసుకోవాల్సిన దుస్థితి కలి్పంచారు.. మా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా అడ్డుకున్న వారు బాగుపడరు. మాలాంటి వృద్ధులు, వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది’’ అంటూ మండిపడ్డాడు. ఈ వృద్ధురాలి పేరు అల్లు తిరుపతమ్మ. వయస్సు 80 సంవత్సరాలు. తర్లుపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు వలంటీరే ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ అందించేవారు. చంద్రబాబు కుతంత్రంతో ఇప్పుడు వలంటీర్లు పింఛను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి సచివాలయం దగ్గర పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ‘‘1వ తేదీ అయినా వలంటీరు రాకపోవడంతో వాకబుచేస్తే వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదంటూ టీడీపీ నేతలు కేసులు వేశారని.. అందుకే వారు రాలేదని తెలిసింది. ఎండలు మండిపోతున్నాయి. సచివాలయం దాకా నడిచి వెళ్లి పింఛను తీసుకోలేను. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంచి చేసే వాళ్ల మీద కేసులు పెట్టడం ఏందయ్యా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందేవి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అందరి ఇళ్ల ముందు సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. ఏమవ్వా బాగున్నావా... ఏం తాతా ఎలా ఉన్నావంటూ కుశల సమాచారాలు అడిగి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు వారి చేతుల్లో పెట్టేవారు. అవి అందుకున్న వాళ్ల కళ్లల్లో మెరుపులు చూసి వలంటీరు సంతృప్తి పడేవారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అవ్వా తాతలకు పింఛన్లు అందజేసేవారు. ఒకవేళ ఏదైనా పనిమీద వేరే ఊర్లకు వెళ్లి ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా అక్కడికి వెళ్లి అందజేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా అభాగ్యులకు అండగా ఉండే వలంటీరుపై పచ్చదండు కక్ష గట్టింది. రోజుకో రకమైన కథనాలు పచ్చమీడియా వండివార్చేది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తూ వస్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి నాయకులు ఇళ్లకు పరిమితమైతే తన ప్రాణాలకు లెక్కచేయకుండా వలంటీరు సాయం అందించాడు. ఎన్నో మంచి పనులు చేసిన వారి సేవలు ఎల్లో మీడియాకు పట్టలేదు. ఎన్నికల పేరు చెప్పి వారిని అభాసుపాలు చేసేలా రోజుకో రకంగా అసత్య కథనాలు వండివార్చింది. కోర్టులకు ఎక్కింది. తాజాగా ఎన్నికల పేరు చెప్పి కొత్త కుట్రలకు తెరతీసింది. తన అనుకూలుర ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేయించింది. ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించింది. ఫలితంగా వలంటీరు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వరాదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణమైన పచ్చదండుపై అవ్వాతాతలు, అభాగ్యులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఏమన్యాయం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం, అధికార పారీ్టపై ఆ అపవాదు తోసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పత్రికా ప్రకటన. చేసిన తప్పును ఇలా కప్పిపుచ్చుకునేలా ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 95 వేల మందిపై ప్రభావం తెలుగుదేశం పార్టీ దుష్ట కూటమి కుట్రలతో జిల్లాలో 2 లక్షల 95 వేల మంది పింఛన్‌దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీరందరికీ ప్రతి నెలా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మరీ పెన్షన్లు ఇచ్చేవారు వలంటీర్లు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేది. ఇందుకోసం నెలకు రూ.88.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెలుగుదేశం చేసిన కుట్రల వలన ఈ నెల చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చింది. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటు¯ంటారు. ఇందులో ఎంతో మంది ప్రతినెలా వచ్చే పెన్షన్ డబ్బులు చేతికి అందగానే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతుంటారు. అవసరమైన ఔషధాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతినెలా వచ్చే పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్లు రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోయేకాలం దాపురించిందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో నరకయాతన చంద్రబాబు పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే నరకయాతన లాగా ఉండేది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ కోసం పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఉండేది. పైగా జన్మభూమి కమిటీలకు లంచాలు ముట్టచెప్పిన వాళ్లకు త్వరగా పెన్షన్లు అందేవి. ఒకరు చనిపోతే గానీ కొత్తవి వచ్చేవి కావు. ఇంతటి దారుణ పరిస్థితులు చవిచూసిన అభాగ్యులు నేడు ఎలాంటి కష్టం లేకుండా ఇంటికే డబ్బులు వస్తుండడంతో ఆనందంగా ఉన్నారు. రూ.3 వేల వరకు పింఛన్ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది అవ్వాతాతలను కలిశారు. స్వయంగా వారి ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయారు. తాను అధికారంలోకి వచ్చాక రూ.2 వేల వరకూ ఇస్తానని ప్రకటించారు. అప్పటి వరకు కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఎన్నికలకు ముందు రూ.2 వేలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది కూడా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలు ఉన్న దానిని పెంచుకుంటూ రూ.3 వేలు చేశారు సీఎం జగన్. అర్హులందరికీ కొత్త పింఛన్లు సైతం అందేలా చేశారు. మంచంలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు శగబండి మస్తానమ్మ. కురిచేడుకు చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. వలంటీరు ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపేయడంతో ఆ వృద్ధురాలికి కష్టం వచ్చిపడింది. ఈనెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకోవాలని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. ‘‘ఉద్యోగులు లాగే మా ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చేవాళ్లు. ఏ దిక్కూ లేని మాకు జగన్‌బాబే దిక్కయ్యాడు. ఆయన ఇస్తున్న పింఛన్‌కు అడ్డుపడుతున్న వాళ్లు మా ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తారా.. మంచి చేయడం చేతకాకపోయినా చేసేవాళ్లను చెడగొట్టడం నీచమైన పని’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి
హిందూపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని 28వ వార్డు వలంటీరు సంధ్యపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడిచేశారు. స్థానిక సూరççప్ప కట్టకింద (బోయపేట) ప్రాంతంలోని వలంటీర్ సంధ్య ఇంటివద్దకు సోమవారం రాత్రి కొందరు అవ్వాతాతలు వచ్చి పింఛన్ విషయమై ఆరాతీశారు. ఈ నెల 3వ తేదీ నుంచి వార్డు సచివాలయంలో ఇస్తారని ఆమె చెబుతుండగా.. సమీపంలోనే ఉన్న టీడీపీ నాయకులు నవీన్, అనిల్, అశోక్, విజి తదితరులు ఆమెపై దాడిచేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేయడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. టీడీపీ వర్గీయులు అక్కడికి కూడా వెళ్లి గొడవ చేశారు. తరువాత సంధ్య స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారిస్తున్నామని సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. -
కుట్ర కనిపింఛన్
టీడీపీ కుట్ర బయటపడింది.. అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.. ఇంటి వద్దనే పింఛన్ అందుకోవాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే! వలంటీర్ వ్యవస్థతో వైఎస్సార్సీపీకి మంచి పేరొస్తుందని తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు పాల్పడింది.. తన అనుబంధ సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్లు ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వైపు చెబుతూనే మరో వైపు కుతంత్రాలకు పాల్పడటంపై పింఛన్‌దారులు మండిపడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో నేడు గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4.73 లక్షల మంది వివిధ కేటగిరీ పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. డయాలసిస్, కిడ్నీ రోగులు... ఇలా వేలాది మంది అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటువంటి వారందరూ ఏప్రిల్ నుంచి జూన్ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకోవాల్సిందే. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీరందరూ నరకం చూడాల్సిందే! వేలాది మందిని సచివాలయాలకు ఎత్తుకొని రావాల్సి ఉంది. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ తన అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేది. లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించింది. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికార పార్టీకి మంచి పేరొస్తాందనే టీడీపీ కుట్రపన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు. మళ్లీ కష్టాలు మొదలు.. టీడీపీ హయాంలో పింఛన్ పొందడంలో అవ్వాతాతలు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాసేవారు. డబ్బులు రాలేదు.. రేపు..మాపు అంటూ తిప్పుకునేవారు. ఎంత మంది అర్హులు ఉన్నా మండలానికి ఇన్నే పింఛన్లు అని కోటా పెట్టేవారు. ఒక్కో గ్రామానికి 10–15 వరకు పింఛన్లు మాత్రమే వచ్చేవి. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు. ఇందుకోసం నాలుగైదు నెలల పింఛన్ మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చేది. ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌లోనూ రూ.100, 200 కోత పెట్టేవారు. మరణించిన వారిస్థానంలోనే కొత్త పింఛన్ వచ్చేది. వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్‌దారుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. అర్హతే ప్రామాణికంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు గ్రామ, వర్డు వలంటీర్లను నియమించి... వారి ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ పంపే ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ పండుగ ఉన్నా.. సెలవైనా... వానొచ్చినా.. ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టాలు తొలగిపోయాయి. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుంటే అక్కడికే వెళ్లి పింఛన్ అందచేస్తున్నారు. వలంటీర్లు కేవలం సేవాభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలతో అవ్వాతాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఇంటిదగ్గరే పించన్ పంపిణీ చేస్తున్న వలంటీరు(పైల్) ఇందుకే కక్ష.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీల్చివేశాయి. జన్మభూమి కమిటీలకు చంద్రబాబు అపారమైన అధికారాలు ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకొని జన్మభూమి కమిటీలోని సభ్యులు చెలరేగిపోయాయి. అవినీతి అక్రమాలతో లక్షాధికారులయ్యారు. జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు పిండకపోయినప్పటికీ వలంటీర్ల పట్ల అపారమైన ద్వేషం పెరగడానికి వారి వల్ల అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తు వస్తుండటమే కారణమని తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఇవీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. లబ్ధిదారులు ఏప్రిల్ నెల గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి వేలిముద్ర వేసి పింఛన్లు పొందాల్సి ఉంది. ఇందుకు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు సెర్ప్ ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకులకు సెలవు. 2వ తేదీన పింఛన్ల సంబంధించిన మొత్తం ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తారు. మూడో నుంచి 5 రోజుల పాటు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు, ఆర్బీకే ఇన్చార్జీలందరి దగ్గర ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉంటాయి. అనుకున్నట్టే చేశారు.. వలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో టీడీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏదో విధంగా వలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్నేళ్లుగా ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అనేక రకాల అభాండాలు వేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లపై కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లను పక్కన పేట్టే విధంగా చేయగలిగారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లపై ఇంత దారుణంగా పగపట్టడంపై అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధి చెబుతాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతి రోజూ కన్నీళ్లు వచ్చేవి. ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. ప్రతి రోజూ పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలు తొలగిపోయాయి. వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. – రమావత్ నాగమ్మ, మీటేతాండ, తుగ్గలి మండలం మళ్లీ ఎదురు చూపులే టీడీపీ హయాంలో పింఛన్ పొందాలంటే నానా యాతన పడేవాళ్లం. అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఠంఛన్‌గా 1వ తేదీనే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆసుపత్రికి, సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడేవి. టీడీపీ కుట్రలు పన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించింది. మళ్లీ పింఛన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో! – మాబున్నిసా, గడివేముల ఇబ్బందులు తప్పవు వలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి మా అమ్మాయి తని్వకకు పింఛన్ సొమ్ము ఇచ్చి వెళ్లేవారు. వికలాంగురాలైన చిన్నారిని తీసుకొని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ సమయానికి సి బ్బంది పింఛన్ ఇస్తారో తెలియని పరిస్థితి. వలంటీర్ వ్యవస్థ లేకపోతే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిందే. – చిన్నారి తని్వకతో తల్లి, నూనెపల్లె టీడీపీ హయాంలో అన్నీ కష్టాలే మోకాళ్ల నొప్పులతో ఎక్కడికి తిరగలేని పరిస్థితిలో ఉన్నా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే పింఛన్ తీసుకుంటున్నా. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల నుంచి పక్కనబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికో వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులో టీడీపీ హయాంలో చూశాను. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – రత్నమ్మ, మిట్నాల గ్రామం -
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
శభాష్...రేణుక!
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్‌పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్‌తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు. -
మీ సేవకు నా సెల్యూట్ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
మీరే భావి లీడర్లు .. మీరే నా యువ సైన్యం.. : సీఎం జగన్
మన జెండా, అజెండాపై మమకారంతో, మన మేనిఫెస్టోపై నమ్మకంతో, నవరత్నాల పథకాలు – పాలనా సంస్కరణలను ప్రజలకు చేరువచేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ. ప్రతి నిరుపేద బతుకులు మారాలని, భావి తరం పేదరికం సంకెళ్లు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన విప్లవాత్మక పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వలంటీర్లు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తన నోటి నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ కలగాలి. ఆ విశ్వసనీయతను ఏ రోజైతే కల్పించగలుగుతాడో అప్పుడు అతడిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, అభిమాని కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్.. ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని, రాబోయే రోజుల్లో మీరు లీడర్లు కాబోతున్నారని తాను మొట్ట మొదటిరోజే చెప్పానని వలంటీర్లనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ దగ్గర నుంచి మొదలుపెడితే తన వరకూ 58 నెలలుగా అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. ఇంకా రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. 2.60 లక్షల మంది నా సైన్యం.. నా వలంటీర్ల సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ సైన్యం గుండెలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ గుండెలు కావని, ఇవి సేవా హృదయాలని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్లకు వందనం’లో భాగంగా వరుసగా నాలుగో ఏడాదీ పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నాడు దోపిడీ వ్యవస్థ.. నేడు సేవా సైన్యం చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రజలు టీడీపీని అధికారం నుంచి దించేందుకు కారణమైతే మీ అన్న తెచ్చిన సేవా సైన్యం సచివాలయాల వ్యవస్థతో అనుసంధానమై పేదలకు ప్రతి అవసరంలోనూ వారధిగా మారింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ మీ బిడ్డ ప్రభుత్వం ఘన విజయానికి వలంటీర్లు కారకులయ్యాయని గర్వంగా చెబుతున్నా. పరిపాలనను మార్చిన ఈ ప్రజా వ్యవస్థలే 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు వేస్తాయి. మన వ్యవస్థలు , మన ప్రభుత్వం, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన అజెండా ప్రకారం సేవ చేయడానికి పుట్టాయి. ప్రతి గ్రామంలో బడి, ఆసుపత్రి పరిస్థితులను సమూలంగా మార్చాయి. పౌర సేవలను ఇంటివద్దే అందిస్తున్నాం. కళ్లకు కట్టినట్టుగా మీరు గమనిస్తున్న ఈ తేడాను ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియచేయాలి. 2019 కంటే ముందు ఏ సేవ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు, నెలల తరబడి కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే కానీ అడుగు ముందుకు పడని పరిస్థితి. అవ్వాతాతలు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులు ఎరువులు కావాలన్నా ఎండనకా వాననకా చాంతాడంత క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు నాయుడు దాకా లంచాల పాలనే సాగింది. ఇప్పుడు మీ అన్న ప్రభుత్వంలో నెలకు రూ.3 వేలు చొప్పున 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే గత ప్రభుత్వ పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కేవలం రూ.వెయ్యి ముష్టి వేసినట్లు పెన్షన్ ఇచ్చేవారు. నాడు వివక్ష కారణంగా లక్షల మందికి పెన్షన్ అందలేదు. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు, బటన్లూ లేవు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివైతే మన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివి. చంద్రబాబు పాలన ఓ విష వృక్షమైతే మన పాలన కల్పవృక్షం లాంటిది. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గౌరవ వేతనంతో మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వలంటీర్ల సేవాభావానికి మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు. డీబీటీ, నాన్ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనైనా ఇలాంటి లంచాలు లేని, వివక్షలేని వ్యవస్థను ఎక్కడైనా చూశారా? ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. ప్రతి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలకు చెప్పండి. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పటివరకూ రూ.2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాం. వీటికి తోడు ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, ట్యాబ్‌లు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలు కూడా తీసుకుంటే మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువ కూడా తీసుకుంటే అది రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది. ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా వెళ్లింది కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాలను కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా తట్టుకోగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ అప్పటి కన్నా మన ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు చాలా తక్కువ. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించకపోవటానికి కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కాపీ కొట్టి కిచిడీ మేనిఫెస్టో.. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చుని వేరే రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలు కాపీ కొట్టి కిచిడీ రూపంలో తెచ్చారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుడితే చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. తానిచ్చి న హామీలన్నీ నిజంగా అమలు చేసే పరిస్థితి, అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అన్న ఆలోచన కూడా చంద్రబాబుకి ఉండదు. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి అబద్ధాలు ఆడటంలో భావదారిద్య్రం ఎందుకనే ధోరణి ఆయనది. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడనే తత్వం చంద్రబాబుది. ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరని పసిగట్టి చంద్రబాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారు. మొన్నటివరకు జగన్లాగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి ఇప్పుడు అదే నోటితో ఆరు వాగ్దానాలంటున్నారు. పైగా ఇది శాంపిల్ మాత్రమే, దీనికి మరో ఆరు జమ అవుతాయని చెబుతున్నారు. వాటిని టచ్ కూడా చేయలేరు... మీ బిడ్డ కష్టపడి ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాడు. ఇందులో కొన్ని కార్యక్రమాలను టచ్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోదు. నెలకు రూ.3 వేల చొప్పున సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇచ్చే విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం లాంటి ఎనిమిది పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది. వీటిని ఎవరైనా రద్దు చేయాలనుకున్నా చెయ్యి కూడా వేయటానికి సాహసించలేని పథకాలు అవి. మరి రూ.52,700 కోట్లు వెచ్చి ంచాల్సిన ఈ తప్పనిసరి పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే మొత్తంగా రూ.1,26,140 కోట్లు వరకు లెక్క తేలుతోంది. గతంలో ఏమీ చేయకుండా మోసాలకే పరిమితమైన ఆ వ్యక్తి ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఇస్తానని నమ్మబలుకుతున్నాడంటే అంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబు మేనిఫెస్టో.. రంగుల మాయాజాలం 1994, 1999, 2014.. చంద్రబాబు పాలనను ఎప్పుడు తీసుకున్నా అధికారంలోకి రాక ముందు మేనిఫెస్టో రంగురంగులతో ఉంటుంది. 650 పేజీలు.. 650 హామీలంటూ , ఎన్నికలు ముగిశాక చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్సైట్లో కూడా మేనిఫెస్టోను మాయం చేస్తారు. ప్రజలు మోసపోకుండా బాబు రంగుల మాయలను ప్రజలకు వివరించాలి. చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. వారం పాటు ఉత్సవాలు వలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా అభినందించే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవాల మాదిరిగా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం. మీరంతా గత ప్రభుత్వ హయాంలోని లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థను బద్ధలుగొట్టి త్రికరణశుద్ధితో నిజాయితీ చాటుకున్నందుకు గుర్తింపుగా బహుమతిని పెంచుతున్నాం. సేవావజ్రాలకు రూ.45 వేలు, సేవారత్నాలకు రూ.30 వేలు, సేవా మిత్రలకు రూ.15 వేలు చొప్పున అందచేస్తాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను సేవావజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాల్టీ పరిధి నుంచి కనీసం ఐదు మంది, ప్రతి కార్పొరేషన్ పరిధి నుంచి పదిమంది చొప్పున 4,150 మంది వలంటీర్లను సేవారత్న అవార్డులతో గౌరవిస్తున్నాం. ఇలా 2,55,464 మంది వలంటీర్లను అభినందిస్తూ నగదు బహుమతిగా రూ.392 కోట్లను అందచేస్తున్నాం. చొక్కా మడతబెడదాం.. ఇక అబద్ధాలను మట్టి కరిపించేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చి ంది. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకురావాలి. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పెత్తందార్ల మీద చేస్తున్న యుద్ధంలో చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మీకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలపడమేనని ప్రజలకు తెలియచేయాలి. 2004లో చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. నాడు వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీ, రూ.2 వేల నిరుద్యోగ భృతి లాంటి హామీలను ఎగ్గొట్టడం, కోటయ్య కమిటీ అంటూ కోతల కమిటీని నియమించిన వైనాన్ని మరోసారి వివరించాలి. బాబును నమ్మడమంటే... చంద్రబాబును నమ్మడం అంటే ఇంగ్లిషు మీడియం బడుల్ని, సీబీఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, పిల్లలకిచ్చే ట్యాబులు, ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ పెడుతున్న మన స్కూళ్లను, మన క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చేసి మన పిల్లల బంగారు భవిష్యత్‌ను తాకట్టు పెట్టడమేనని ప్రజలకు తెలియచేయాలి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా? అని అడగండి. బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ వ్యవస్థను కాదనుకుని జన్మభూమి కమిటీలను ఆహా్వనించడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. చంద్రముఖిని తెచ్చుకోవడమే.. చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పాలి. బాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయి. వలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమేనని ఎలుగెత్తాలి. దడ పుట్టిస్తున్నాం.. వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. దత్తపుత్రుడి నోటి నుంచి కించపరిచే వ్యాఖ్యలు వినిపిస్తాయి. మహిళల అదృశ్యానికి వలంటీర్లు కారణమని ఒకడంటాడు. వలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతానంటాడు. తాము అధికారంలోకి వచ్చి న తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు. ఇంత మందికి మనం దడ ఎలా పుట్టిస్తున్నామో తెలుసా? ఈరోజు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ సంక్షేమాన్ని డెలివర్ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. విపక్షాల కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు కాకుండా పేదవాడి కడుపులు నిండుతున్నాయి కాబట్టే. విపక్షాల కడుపు నింపేది అవినీతి ఆకలి మాత్రమే. ఇలాంటి విషవృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. 58 నెలలు దాటాం. మీ బిడ్డ ఇంకో 10–15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేదవాడి ఇంట్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడతాడు. పేదల తలరాతలు శాశ్వతంగా మారిపోతాయి. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు పింఛన్ ‘‘తాడికొండ, మంగళగిరి రాజధాని ప్రాంతంలో భూమిలేని 17 వేల మంది నిరుపేదలకు జీవనభృతి పింఛన్ రూ.2,500 నుంచి రూ.ఐదు వేలు చేయాలని ఎమ్మెల్యే సుచరిత కోరారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేస్తాం. ఫిరంగిపురంలోని కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్డు కోసం రూ.39 కోట్లు మంజూరు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ ప్రకటించారు. సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీలు నందిగం సురేష్, ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, కాసు మహేష్ రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, సమన్వయకర్తలు ఉమ్మారెడ్డి వెంకటరమణ, నూరీ ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు. ఉద్యోగ విప్లవం సీఎం జగన్ దాదాపు 2,55,000 మందికిపైగా వలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి తుంగలోకి తొక్కారు. వలంటీర్ వ్యవస్థ తెచ్చి నప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు పొగుడుతున్నారు. మన దేశం హరిత విప్లవం, శ్వేత విప్లవం చూసింది. సీఎం జగన్ ఉద్యోగ విప్లవం తెచ్చారు. ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ ఉద్యోగాలిచ్చారు. – మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు,తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం.. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో అర్హులను గుర్తించి పథకాలు అందిస్తున్నప్పుడు వారి చిరునవ్వు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు దీవెనలు ఉంటాయంటూ మా చేతులను తాకినప్పుడు ఆ అనుభూతిని మరిచిపోలేం. ఆసుపత్రిలో ఉన్న ఓ తాతకు ఒకటో తారీఖు రాత్రి 12 గంటలకు పింఛన్ ఇచ్చా. దురదృష్టవశాత్తూ తరువాత కొద్దిసేపటికే ఆయన చనిపోయారు. ఆయన భార్య నన్ను హత్తుకుంటే ఇది కదా సేవ అని అనిపించింది. తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు? మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నా. ప్రజలు మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. మళ్లీ మీ పాలన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. – దాసరి జ్యోత్సా్న దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మీ చిరునవ్వుతో ఆత్మస్థైర్యం నా క్లస్టర్ లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీ ఆశయాలను నిలబెట్టేలా పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. ఇప్పుడు ప్రతి గడపనూ పలుకరిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లిన 22 ఏళ్ల యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల ఉచిత వైద్యం సంజీవనిలా పని చేసింది. ఆ కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలకు రూ. 10 వేలు ఇచ్చాం. వలంటీర్ వ్యవస్థను మొదట్లో చాలా మంది కించపరిచారు. మీరు అండగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. మీ చిరునవ్వు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నా. మీరు నా వలంటీర్లు అని ఆప్యాయంగా పలుకరిస్తుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవాగుణాన్ని గుర్తించి మాకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని పెంచడం చాలా సంతోషంగా ఉందన్నా. –షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం