సాక్షి, ఒంగోలు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...‘ భువనేశ్వరి మృతిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. మృతి చెందిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి దారుణమైన సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించబోదు. ( 'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం' )
భువనేశ్వరి కేసు విచారణను వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. కాగా, దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు- ఎనిమిది గంటల ప్రాంతంలో భువనేశ్వరి ట్రై సైకిల్ పైనే సజీవ దహనమైన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా కొర్రపాడులో వేధింపులకు బలైన 10 వ తరగతి విద్యార్థి సౌమ్య కుటుంబాన్ని , ఒంగోలులో అనుమానాస్పద స్ధితిలో సజీవదహనమైన భువనేశ్వరి కుటుంబాన్ని పరామర్శించి , విచారణ వేగవంతం చెయ్యాలని ఎస్పి లను కోరటం జరిగింది. pic.twitter.com/XNaX6hkGJz
— Vasireddy Padma (@padma_vasireddy) December 20, 2020
Comments
Please login to add a commentAdd a comment