Women Commission
-
కాలేజీలా.. మురికి కూపాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్‌రూమ్‌లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా... రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్‌రూమ్‌లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్‌ను విద్యారి్థనులకు ఇచ్చారు. -
ఏపీ హైకోర్టుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్స్‌గా తన నియామకాన్ని రద్దు చేయటాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికి, రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు తెలిపారు.2023లో సడలించిన చట్టం ప్రకారం అయిదు సంవత్సరాల కాల పరిమితి నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితికి పరిమితం చేయటంతో పిటిషనర్ కాల పరిమితి ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే గజ్జల లక్ష్మీని చైర్ పర్సన్గాతొలగించారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా తొలగించటం నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గత చైర్పర్సన్ పదవి కాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డార,ని రెండు సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు ఆమెకు లేదని చెప్పారు. ఇరువురి వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. -
చంద్రబాబు సర్కార్‌పై న్యాయ పోరాటం చేస్తా: గజ్జల లక్ష్మి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మీని తొలగిస్తూ సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీకాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీకాలం ఉన్నా ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మోమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని గజ్జల లక్ష్మీ తెలిపారు.మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది -
దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు, కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులుఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
విచారణకు వెళ్తున్న కేటీఆర్.. అడ్డుకున్న కాంగ్రెస్ మహిళలు
-
ఇవాళ తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు కేటీఆర్
-
నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16వ తేదీనే క్షమాపణ చెప్పారు. ‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. కాగా మహిళా కమిషన్ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లాపూర్, షాద్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు అందజేస్తానని ప్రకటించారు. -
మహిళా కమిషన్ సీరియస్.. కేటీఆర్ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు..
-
తూతూమంత్రంగా కాదు.. కఠినంగా వ్యవహరించండి: ఏపీ మహిళా కమిషన్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు బాధిత బాలికను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన నాలుగేళ్ల బాలిక పై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి యత్నించిన సంగతి తెలిసిందే. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. అలాగే.. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూస్తామని హామీచ్చారామె.‘‘ఊయలలో వేసిన నెలల బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తూతూ మంత్రంగా కేసులు పెట్టడం వల్ల నిందితులు నెలరోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వరకట్న వేధింపులు , అత్యాచారాలు, దాడులు, ఫోక్సో కేసులు పెరిగిపోయాయి. మహిళలు బతకాలంటేనే భయపడిపోతున్నారు‘‘ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.‘‘ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. దిశ ద్వారా వచ్చిన కేసుల్లో కూడా త్వరగా శిక్ష పడేలా చేశాం. రమ్య హత్య కేసులో వేగంగా ఛార్జిషీట్ వేయించి.. నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగాం. నెల్లూరులో విదేశీ యువతిని వేధించిన కేసులో దిశా యాప్ ద్వారా రక్షించగలిగాం. రాజకీయాలకు అతీతంగా ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది.. .. ఎస్పీలకు యాక్షన్ టేకెన్ కోసం పంపిస్తున్నాము. పోలీసులకు ఏం ఇబ్బందులున్నాయో తెలియడం లేదు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మహిళా కమిషన్ ప్రతీ మహిళకు భద్రత కల్పించేందుకు పనిచేస్తుంది. దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించాం‘‘ అని గజ్జల వెంకటలక్ష్మి చెప్పారు. -
టీడీపీ నేతలపై మహిళా కమిషన్ ఫైర్
-
పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?
సాక్షి, అమరావతి/మాచవరం: రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై టీడీపీ నేతలు చేసిన దాడులపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన చైర్పర్సన్ వెంకటలక్ష్మి తక్షణం బాధితులకు రక్షణ కలి్పంచి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గమన్నారు.ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటలపాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తంచేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వారు స్వేచ్ఛగా నచి్చన వారికి ఓటు వేసే హక్కు లేదా అని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లేసినంత మాత్రాన అదే పాపమని చంపేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల చిన్నచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళలకు ఏపీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. -
నిజాయతీ నిరూపించుకోండి!
సాక్షాత్తూ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఓ మహిళపై దాడి జరుగుతుందని ఊహించగలమా? అదీ స్వయంగా సీఎంకు కుడిభుజం లాంటి సహాయకుడే ఆ దురాగతానికి పాల్పడ్డాడంటే నమ్మగలమా? అందులోనూ తనపై అలా దాడి జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అధికార పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యురాలు కూడా అయితే, అవాక్కవకుండా ఉండగలమా? ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సొంత పార్టీ వారిపైనే గత వారంగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నది అందుకే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళితే ఆయన పీఏ విభవ్ కుమార్ అమానవీయంగా దాడి చేసి, కొట్టరాని చోటల్లా కొట్టి బయటకు గెంటించారన్న ఆరోపణలు ఏ రకంగా చూసినా అసాధారణమైనవే. అందులోనూ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టయిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన వెసులుబాటు ఆసరాగా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చీ రాగానే ఈ పరిణామం సంభవించడం ఆయననూ, ఆయన పార్టీనీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విభవ్ అరెస్ట్, స్వాతి కథను బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ యత్నాలతో వ్యవహారం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌కు విభవ్ నమ్మినబంటు. పార్టీ విస్తరణ సహా అనేక బాధ్యతలను అతనికి అప్పగించారు. కేజ్రీవాల్ ఇంటిలోని క్యాంప్ ఆఫీస్ మొదలు ఢిల్లీ సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీస్ వ్యవహారాల దాకా రోజువారీ కార్యకలాపాలన్నీ అతని చేతుల మీదే నడుస్తుంటాయి. ఈ క్రమంలో స్వాతికీ, అతనికీ మధ్య గతంలో ఏం జరిగింది, దాడి ఘటన రోజున అసలేమైంది లాంటి అనేక ప్రశ్నలకింకా స్పష్టమైన సమాధానాలు దొరకాల్సి ఉంది. ఆరోపణలు వచ్చిన మొదట్లో పెదవి విప్పకుండా ‘ఆప్’ ఆలసించింది. ఆనక స్వాతిపై దాడి జరిగిందని గతవారం అంగీకరించింది. తీరా ఇప్పుడేమో ఇదంతా రాజకీయ కుట్రంటోంది. అదీ విడ్డూరం. అలాగని స్వాతి గత చరిత్ర సైతం గొప్పదేమీ కాదు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్‌కు సారథ్యం వహించిన ఆమె ఆ పదవిలో ఉండగా నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు నిందలొచ్చాయి. ఆ వ్యవహారంలో అరెస్టు తప్పదంటూ కాషాయపార్టీ బ్లాక్మెయిల్ చేసిందంటున్నారు. ఆ భయంతోనే ఆమె ఈ దాడి కథ వినిపిస్తోందనేది ‘ఆప్’ వాదన. నిజానికి, స్వాతి కూడా కేజ్రీవాల్‌కు సన్నిహితురాలే. ఆమె రాజకీయంగా ఎదిగి, రాజ్యసభ సభ్యురాలు కావడమే అందుకు ఉదాహరణ. మరి ఎక్కడ కథ అడ్డం తిరిగిందన్నది ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. దాడి జరిగిందని చెప్పిన స్వాతి పోలీసు ఫిర్యాదుకు ఆలస్యం చేయడం, తీరా దర్యాప్తు మొదలయ్యాక రోజుకో రకం వీడియోలు, కథనాలు బయటకు రావడం చూస్తుంటే, విషయం పైకి కనిపిస్తున్నంత పారదర్శకంగా లేదన్న అనుమానమూ వస్తోంది. పోలీసులు నిష్పాక్షికంగా, లోతైన దర్యాప్తు చేసి, నిజాలు నిగ్గుతేల్చాలి. అనుమానాలు ఏమైనా, కారణాలు ఎలాంటివైనా ఒక మహిళపై భౌతిక దాడికి దిగి గాయపరచడం, దుర్భాషలాడడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అలాగే, ఈ కేసులో సాక్షాత్తూ సీఎం ఇంటిలోని సీసీటీవీ దృశ్యాలు సహా సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందంటూ వస్తున్న వార్తలు సైతం పాలక వ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకానికి గొడ్డలిపెట్టు. మరోపక్క విదేశాల నుంచి విరాళాలపై నిషేధం ఉన్నప్పటికీ ‘ఆప్’కు విదేశీ నిధులు వచ్చాయనీ, దాతల పేర్లను ఆ పార్టీ మరుగున పెట్టిందనీ, విదేశీమారకద్రవ్య నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనల్ని ఉల్లంఘించిందనీ తాజా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాచారం అందించినట్లు సోమవారం బయటకొచ్చిన వార్తలు కేజ్రీవాల్‌నూ, ఆయన పార్టీనీ మరింత ఇరుకునపెట్టేవే. పైగా, దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలా ఒకదాని వెంట మరొకటిగా వివాదాలు రేగి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలోకి నెట్టడం ఏ రాజకీయ పార్టీ విశ్వసనీయతకైనా ఇబ్బంది తెస్తాయి. తాజా పరిణామాలు ‘ఆప్’నే కాక, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని సైతం ఇరుకున పెట్టాయి. మద్యం పాలసీ మొదలు స్వాతి ఆరోపణలు, తాజా ఈడీ వెల్లడింపు వార్తల దాకా వేటి మీదా కాంగ్రెస్ సహా కూటమి పార్టీలేవీ గొంతు విప్పట్లేదు. తమ వైఖరి చెప్పట్లేదు. దేశంలో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసి, మోదీని గద్దె దించడానికి తగిన సమయమని భావిస్తున్న వేళ ఇది ఆ పార్టీలేవీ ఊహించని దుఃస్థితి. ‘ఆప్’, బీజేపీల మాటల యుద్ధం మాత్రం రాజకీయ వాతావరణాన్ని రోజురోజుకూ వేడెక్కిస్తోంది. అయితే, ఈ నెల 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ... ఈ వరుస వివాదాలు ఆకస్మికమనీ, పూర్తి యాదృచ్ఛికమనీ అనుకోవడం అమాయకత్వమే. నిజాయతీకి తాము నిలువుటద్దమని ‘ఆప్’, అలాగే అవినీతి చీడను తాము ఏరేస్తున్నామని బీజేపీ... దేనికది డప్పు కొట్టుకుంటున్నా, వాస్తవాలు అందుకు దూరంగా ఉన్నాయని ప్రజలకు అర్థమవుతూనే ఉంది. బీజేపీ రాజకీయ ప్రతీకారాన్ని బయటపెడతామంటూ కేజ్రీవాల్ గర్జిస్తున్నా, అది ప్రతిధ్వనిస్తున్న దాఖలాలు పెద్దగా కనబడట్లేదు. పదమూడేళ్ళ క్రితం 2011లో అవినీతిపై అన్నాహజారే ఉద్యమం నుంచి ఊపిరిపోసుకున్న ‘ఆప్’ ఇవాళ లక్ష్యం మరిచి, దారి తప్పిన బాటసారిగా మారిపోవడం సమకాలీన చారిత్రక విషాదం. హజారే ఉద్యమంలో బాసటగా నిలిచిన స్పూర్తిదాయకమైన స్వతంత్ర వ్యక్తులు ఇవాళ ‘ఆప్’లో లేకపోవడం, కేజ్రీవాల్ భజనపరులదే పార్టీలో రాజ్యం కావడం లాంటివే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. స్వాతి ఆరోపణల పర్వంలో లోతుపాతులు ఏమైనా, ‘ఆప్’ ప్రస్థానంలో లోటుపాట్లు అనేకం. తప్పులు దిద్దుకొని, నిజాయతీ నిరూపించుకోవడమే ప్రజాక్షేత్రంలో శ్రీరామరక్ష. -
పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
ఎన్నికల కమిషన్‌కు ఏపీ మహిళా కమిషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు (గర్భిణులు, బాలింతల) పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఏపీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలని, బాలింతల కోసం ఫీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచాలని కోరారు. గర్భిణులకు అత్యవసర పరిస్థితిలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్లు ఏర్పాటుచేయాలని, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దాడులు, లైంగికదాడులు, వేధింపులకు గురైన మహిళలకు తగిన న్యాయం చేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వాలని కోరారు. గిరిజన మహిళలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్‌కు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై చర్చించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా ఉద్యోగుల సూచనలను మహిళా కమిషన్ తీసుకుంది. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సెక్రెటరియేట్‌లోని మహిళా అధికారులు, ఉద్యోగిణీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం జరుపుకుందామని తెలిపారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మహిళలను గౌరవించలేని సమాజం అభివృద్ధి సాధించలేదని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్ తీసుకవచ్చిందని తెలిపారు. పవన్‌కు మహిళా కమిషన్‌ను గౌరవించడంలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళా కమిషన్ నోటీసులను ఆయన లైట్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలంటీర్లపై దారుణమైన ఆరోపణలు చేశారు కనుకే ఆధారాలు చూపమన్నామని, వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. తమ పైనా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని, మరి మీ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని నిలదీశారు. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై అసభ్యకర పోస్టులు ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు. యూకేలో ఉన్న ఓ మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వారిని సమర్థించడం సరికాదు టీడీపీ కార్యకర్త శ్వేతా చౌదరి దారుణంగా మాట్లాడుతోందని, ఆమెకు చంద్రబాబు మద్దతు తెలపడం సరికాదని హితవుపలికారు. సీఎం ఇంట్లో మహిళలను కించపరిస్తే ప్రతిపక్షనేత ప్రోత్సహిత్సారా? అని మండిపడ్డారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడతం చంద్రబాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు. చదవండి: సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ సోషల్ మీడియా కట్టడి అవసరం సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జులై 5న సెమినార్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఓ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెపుతూ తమ కమిషన్‌కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు, ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. -
కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే వాడనని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే మహిళా కమిషన్ ముందు హాజరయ్యానని తెలిపారు. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తనెవరినీ కించపరచలేదని అన్నారు. కేసులోని నిందుతురాలు రేణుక కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలేనని బండి సంజయ్ ఆరోపించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. కాగా బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీజీపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇదిలా ఉండగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఇందుకు కమిషన్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన కమిషన్ ఎదుట హాజరయ్యారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై కేసీఆర్ సీరియస్.. ఉన్నతస్థాయి సమీక్ష.. -
మహిళా కమిషన్ నోటీసులకు బండి సంజయ్ స్పందన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కి బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆయన.. ఇవాళ లేఖ ద్వారా స్పందించారు. మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందాయని తెలిపిన బండి సంజయ్.. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే.. బదులుగా ఈ నెల 18వ తేదీన కమిషన్ ఛైర్మన్ సూచించిన టైంకి హాజరుకాగలనని చెప్పారు. అలాగే తాను కమిషన్ ఎదుట హాజరయ్యే అంశంపై పూర్తి సమాచారం అందించగలిగితే.. తాను విచారణ సమయానికి పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంటానని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్
-
బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి వ్యాఖ్యల్ని సుమోటాగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేశారుు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. చదవండి: బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ -
కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మహిళలంటే అసలు గౌరవమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళల పట్ల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆమె తెలంగాణ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని, మహిళల్ని జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులపై బీఆర్ఎస్ మహిళ నేతలు కనీసం మాట్లాడరని మండిపడ్డారు. గవర్నర్ తమిళి సైను సైతం అసభ్య పదజాలంతో దూషించారని, కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తే తనను నానా మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దూషణలు చేసిన వ్యక్తుల పేర్లతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తననే కాదు.. ఓ ఐఏఎస్ మహిళా అధికారి చెయ్యి పట్టుకున్నారని, అలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఇక్కడ న్యాయం జరక్కపోతే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే
►ఓ అబ్బాయి, అమ్మాయి ఒకే కంపెనీలో పనిచేస్తారు. పరిచయం పెరిగి సహజీవనం వరకూ వచ్చింది. అతన్నే పెళ్లి చేసుకుందామని యువతి అనుకుంది. కానీ ఇంట్లో మంచి సంబంధాన్ని చూశారని, వారు చెప్పినట్లే చేస్తానని అబ్బాయి చెప్పడంతో ఆమె హతాశురాలైంది. ఇప్పుడు న్యాయం కావాలని అర్థిస్తోంది. ►ఆన్లైన్లో పరిచయమైన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఓ ఫ్లాటులో కాపురం స్టార్ట్ చేశారు. కొన్ని నెలలు పాటు బాగానే సాగింది. అయితే భాగస్వామి అనుమానిస్తూ వేధిస్తుండడంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ►ఆధునిక జీవనశైలి కలిగిన సిలికాన్ సిటీలో ఇలాంటి కథలు ఎన్నో. ఆకు– ముల్లు సామెత మాదిరిగా చివరకు అతివలే బాధితులు అవుతున్నారు. సాక్షి, బెంగళూరు(బనశంకరి): ఉద్యాన నగరిలో లివింగ్ టుగెదర్ (సహజీవనం)తో అమాయక యువతులు, మహిళలు వంచనకు గురవుతున్న కేసులు తీవ్రతరమౌతున్నాయి. మోసపోయామంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. అత్యాచారం, కుటుంబ దౌర్జన్యాలు, వరకట్న వేధింపులు, వివాహం చేసుకుంటామని నమ్మించి వంచనకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడం పెరిగింది. ఇటువంటి కేసులు ఎక్కువ మహిళా కమిషన్ వద్దకు చేరడం విశేషం. గతం నుంచి ఉన్నదే, ఇప్పుడు తీవ్రమైంది విద్యాలయాలు, ఆఫీసుల్లో పరిచయమై లివింగ్ టుగెదర్ నిర్ణయం తీసుకుని ఒకే ఇంట్లో పెళ్లి కాకుండానే జీవించడం బెంగళూరులో ఎప్పటినుంచో ఉన్న ధోరణే. దీనిపై గతంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఈ పాశ్చాత్య పెడ ధోరణి కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇప్పుడు గొడవలు పెరిగాయి. సహజీవనం చేపట్టి ఏడాది గడిచేలోపు గొడవలు పడి ఆడపిల్లలు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌కు మొర పెట్టుకుంటున్నారు. భవిష్యత్ నాశనం చేసుకోవద్దు లివింగ్ టుగెదర్ వ్యవస్థతో ఆడపిల్లలు తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా సాయం కోసం వస్తున్నారని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విద్యార్థినులు, మహిళలు విధులు నిర్వహించే స్థలాల్లో ఇప్పటికే లివింగ్ టు గెదర్ మోసాల పట్ల జాగృతం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోసపోయి న్యాయం కోసం ఆశ్రయించే బదులు మోసపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. జీవితాన్ని నిర్మించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. నెలకు సుమారు 8 నుంచి 10 లివింగ్ టు గెదర్ గొడవల కేసులు వస్తున్నాయి. ఏడాది కాలంగా ఫిర్యాదులు రెట్టింపు అయినట్లు ఆమె చెప్పారు. ఈ పెడ ధోరణులకు నష్టపోయేది యువతులే కాబట్టి వారిని తల్లిదండ్రులు జాగృతం చేయాలని తెలిపారు. -
స్కూల్ టాయిలెట్లోకి లాక్కెళ్లి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో జూనియర్‌పై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్ రూమ్‌లోకి 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం సైతం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జులైలోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు సీనియర్లు. సీనియర్ల దుశ్చర్య ఢిల్లీ మహిళా కమిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ ప్రోత్సాహంతో బాధిత కుటుంబం గత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ‘ఢిల్లీ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చాలా తీవ్రమైన కేసు గురించి తెలిసింది. ఈ విషయాన్ని స్కూల్ టీచర్ దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దేశ రాజధానిలో పిల్లలకు స్కూల్స్ కూడా సురక్షితం కాకపోవటం దురదృష్టకరం. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలు క్లాస్ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అడ్డుకున్నారు. టాయిలెట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని టీచర్‌కు తెలపగా.. దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ’ అని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. ఇదీ చదవండి: మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్ సహా 18 మంది మృతి -
టీడీపీ నేత లైంగిక వేధింపులు.. మహిళా కమిషన్ సీరియస్
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల లైంగిక వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ వినోద్ జైన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే.