
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి వ్యాఖ్యల్ని సుమోటాగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
సంజయ్ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేశారుు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు.
చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment