KALVAKUNTLA Kavitha
-
‘ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ పాత్ర ఏమీ లేదు’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయి. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు... ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు.వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంగా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారు. దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారుఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలి. ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను డిమాండ్ చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలి. ఎస్సీలకు బడ్జెట్ లో 33 వేల కోట్లు కేటాయించి... కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారు. ముందుచూపుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేసీఆర్ చట్టబద్ధత కల్పించాలి. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం లేదు. రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నది ... చూపు పెద్దవాళ్లపైనే ఉంది. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. అంబేద్కర్ ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు. అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్ ను గౌరవించుకుంటాం. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? , అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటున్నారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఎన్నికల కోసం... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది’ అని కవిత స్పష్టం చేశారు. -
సూర్యాపేట : పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత (ఫొటోలు)
-
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. -
పింక్ బుక్‌లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. -
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కులగణన అంతా కాకి లెక్కలే: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా కాకి లెక్కలే ఉన్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతీచోటా వినిపిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా? అని ప్రశ్నించారు. మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నారని అంటారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘మేము చేసిన ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ, బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోటా వినిపించింది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా?. నిన్న ఆగమాగం లెక్కలు పెట్టారు. రేపు అసెంబ్లీలో పెడుతున్నారంట. పెడితే బిల్లు పెట్టండి. .. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకుని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టీ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. బీసీలకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు, బీహార్‌లో చేశారు. అదే మోసం తెలంగాణాలో చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే. మేము ఏమైనా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నామని అంటున్నారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తోంది. ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలలో వ్యత్యాసం తీవ్రంగా ఉంది. కాబట్టి 15 రోజులు రివ్యూకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో మేము అందరం పెద్దలను కలుస్తాము. పోరాటాలకు మేము ఎప్పుడు సిద్ధమే. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం అన్నారు. ఇప్పుడు మైనార్టీలతో కలుపుకుని 56.3% బీసీలు అని మీరే అంటున్నారు. 56.3% రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోవాలి’ అని కవిత డిమాండ్ చేశారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
తులం బంగారం ఇచ్చారా?.. కాంగ్రెస్ నేతలను నిలదీయండి: కవిత
సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. కవిత కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్:రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్19) కవిత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు.సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి.మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది.మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయి.పోరాటం మాకు కొత్త కాదు.అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరు’అని కవిత పేర్కొన్నారు. -
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం పచ్చిఅబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మూ సీ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌కు సెపె్టంబర్లో పంపించిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని, కానీ, శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు సమాధానం చెప్పారని విమర్శించారు.ప్రపంచ బ్యాంకుకు మూసీ కోసం ఋణం అడిగిన సాక్ష్యాధారాల నివేదికల ప్రతులను ఆమె విడుదల చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి భవంతులు కడతామని స్పష్టంగా పేర్కొందని కవిత విమర్శించారు. -
‘ఉద్యమ’ కాల తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఆరాధిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామాన ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ అస్తిత్వంపై దాడి– చర్చ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అందరం కలిస్తేనే అందమైన బతుకమ్మ అవుతుంది.. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది?’ అని ప్రశ్నించారు. బతుకమ్మను సీఎం అవమానించిన విషయం తెలియదా? అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని డిమాండ్ చేశారు. బతుకమ్మ పూర్తిగా బహు జన కులాల పండుగ అని, అగ్రవర్గాల పండుగ కానేకాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను దెబ్బ తీసే కుట్ర చేస్తుందని మరో ఎమ్మెల్సీ వాణిదేవి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత వీ ప్రకాశ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కవయిత్రి గోగు శ్యామల, బ్రాహ్మణ పరిషత్తు మాజీ చైర్మన్ కేవీ రమణాచారి, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బీవీఆర్ చారి, జమాతే ఇస్లామీ హింద్ అధినేత హమీద్ మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు. -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
రేవంత్.. మీ గురువులకే చుక్కలు చూపించిన వ్యక్తి కేసీఆర్: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్ చేశారు.కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ ఒక వేగుచుక్క.రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. గత కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి.. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై లేని పన్నులు.. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మాత్రం జీఎస్టీ రూపంలో విధించడం మన దౌర్భాగ్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. -
బీసీలకు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా ఎప్పుడు?
దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేతి వృత్తుల, కుల వృత్తులపై బతికే బీసీల అభ్యు న్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది. దేశా నికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. అయినా బీసీలు, ఎంబీసీలు తమకు న్యాయమైన వాటా దక్కాలనిఇంకా పోరాటం చేస్తూ ఉండాల్సి రావడం నిజంగా బాధా కరం. వారు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అట్ట డుగున ఉండడం మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోడానికి ముందుకు రావడం కొంత ఆశాజనక అంశమే. అయితే అవి తమ చిత్త శుద్ధిని అమలులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా; విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన... బీసీ లకు ఆ యా రంగాలలో సరైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ నివే దిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వారిసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పదవుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే. దానితో పాటుగా బీసీ లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం గొర్రెల పంపిణీ చేయడం, చేపల పెంపకానికి కృషి చేయడం, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం, వందల సంఖ్యలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ‘జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్’ను అందించడం, బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయడం... వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ వర్గాలకు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కూడా ఎన్నో విమర్శలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎందుకంటే సర్వే పత్రాలు రోడ్లపై ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బీసీల జనాభా లెక్కలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ కానీ, కాంగ్రెస్ పార్టీగా తాను తెలంగాణ ప్రజ లకు ఇచ్చిన హామీలను కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అధికారంలో ఉన్న వారికి బడుగుల పట్ల ప్రేమ ఉండాలి. ఎన్నికల నినాదాలు ప్రభుత్వ విధానా లుగా మారాలి. హడావిడిగా జనాభా లెక్కలను సేకరించి చేతులు దులుపుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు. రాజకీయ అధికారంతో సామాజిక, ఆర్థిక అసమా నతలు తొలగిపోతాయన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలకు, వారి ఉప కులా లకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు ఉండా లని డిమాండ్ చేస్తున్నాం.కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు జరుగు తున్న, జరిగిన బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా తీసుకొని, అదే స్థాయిలో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కే విధంగా రిజర్వే షన్లను ఖరారు చేసి అమలు చేయాలి. ఒక నెల కాల పరి మితికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ స్వల్ప సమయం సరిపోకపోవచ్చు. బీసీ, బీసీ ఉప కులాల్లో కచ్చితమైన జనాభా గణాంకాలను వెలికి తీయడానికి కమిషన్‌కు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితిని మరికొంత కాలం పాటు పొడిగించి, బీసీ కులాల కచ్చితమైన డేటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.డెడికేటెడ్ కమిషన్ కూడా అంతే చిత్తశుద్ధితో సమగ్రంగా అధ్యయనం చేసి ఎటువంటి లోపాలకూ తావు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా తమ నివేది కను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు సరైన న్యాయం జరగాలనే ఆకాంక్ష, చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ డెడికేటెడ్ కమిషన్‌కు ‘తెలంగాణ జాగృతి సంస్థ’ తరఫున నివేదికను అందజేశాం. అన్ని కులాలు, తరగతులు, వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వా లను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.తమ శ్రమను, మేధస్సును మానవ నాగరికతా వికా సానికి ధారపోసిన కులవృత్తుల వారు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా పొందాలి. ఈ సమాజ నిర్మాణానికి తమ రక్త మాంసాలను కరిగించి వందల వేల సంవత్సరాలుగారంగులద్దిన చేతి వృత్తుల వారికి ఇప్పటికైనా చట్ట సభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలి. ఊరికి నాలుగు దిక్కులా మన తాత ముత్తాతల కథాగానం చేసిన సంచార జాతులు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అయినా కాలేకపోతే స్వరాజ్యానికి అర్థమేముంది? ఇకనైనా మార్పు రావాలి. -కల్వకుంట్ల కవిత వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు -
అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’’ అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024 కాగా, లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27న సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది.ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా, కొన్ని రోజుల విరామం అనంతరం తొలిసారిగా బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. -
ఉన్నత స్థానాల్లోని వారు బాధ్యతగా ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన పోస్టులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉన్నత స్థానాల్లో ఉండేవారు బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోకి న్యాయమూర్తు లు, న్యాయవాదులను ఎందుకు లాగుతారని సీఎం రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రాలను ప్రశ్నించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులపై పోస్టులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ‘ఓటుకు కోట్లు’ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి ‘ఓటుకు కోట్లు’ కేసును హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, కవిత బెయిల్ సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్లు చేశారని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.సుందరం వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏసీబీకి ఇన్చార్జిగా ఉన్నారని, ఆయన నిందితుడిగా ఉన్న ‘ఓటుకు కోట్లు’ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. వేరే రాష్ట్రానికి బదిలీ చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందేమో అని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొనగా.. ఏసీబీ అధికారులు సీఎంకు నివేదిక ఇస్తారని, ఎవరిని విచారించాలనేది హోంశాఖ నిర్ణయిస్తుందని, వేరే రాష్ట్రంలో అయితే రేవంత్‌రెడ్డి ఇన్చార్జిగా ఉండరని వివరించారు. అయితే.. ఏసీబీ అధికారులు ఓటుకు కోట్లు కేసులో 25 మంది సాక్షులను విచారించి, అన్ని వివరాలు సేకరించారని సీఎం రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది రోహత్గి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌కు బాధ్యత ఉండదా? ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో గందరగోళం సృష్టించేలా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సుందరం కోర్టుకు వివరించారు. కోర్టు ఆర్డర్ కాపీని, కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి చిత్రాలతో పోస్టుచేశారని.. ‘ల్యాండ్ గ్రాబర్స్‌కు ఒక రూల్.. ప్రభుత్వానికి ఒక రూలా? వాట్ ఈజ్ దిస్ మై లార్డ్?’ అంటూ పెట్టిన మరో పోస్టును ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. అయితే.. ఇందులో రేవంత్‌రెడ్డి పాత్ర లేదని ముకుల్ రోహత్గి పేర్కొనగా.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యత ఉంటుందని సుందరం ధర్మాసనానికి వివరించారు. దీనిపై ఇటీవల రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పారని, న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని వెలిబుచ్చారని రోహత్గి పేర్కొన్నారు. ఈ దశలో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకుని.. ‘అత్యున్నత పాలనాధికారం కలిగి ఉన్నవారు బాధ్యతగా మెలగాలి. కోర్టులు, న్యాయమూర్తులను రాజకీయాల్లోకి లాగడం సబబు కాదు..’ అని స్పష్టం చేశారు. అయితే ఇరుపక్షాల వివరణలు పూర్తయ్యాయని.. బదిలీ పిటిషన్ విచారణను ముగించాలని న్యాయవాది రోహత్గి పేర్కొన్నారు. దీంతో జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకుని తెలంగాణలో వరదలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఆ పనుల్లో నిమగ్నమై ఉంటుందని, తాము అన్ని సున్నిత అంశాలనూ పరిశీలిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంలో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, సండ్ర వెంకట వీరయ్యలను ఆదేశించారు. ఇస్తున్నామని తెలిపారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. పార్టీ శ్రేణులు, అనుచరులతో కలిసి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారామె. కవితను చూడగానే కేసీఆర్ ఒక్కసారిగా భాద్వేగానికి గురయ్యారు.పది రోజుల పాటు ఫాంహౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. ఈ సమయంలో తనను కలవడానికి ఎవరూ రావొద్దని.. అంతా సహకరించాలని అభిమానులు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. పది రోజుల తర్వాత తానే అందరికీ అందుబాటులోకి వస్తానని అన్నారామె. అక్కడే విశ్రాంతి తీసుకుంటూనే ఆమె రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఐదున్నర నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత మంగళవారం సాయంత్రం బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. Kavitha meets her father KCR at Erravelli residence pic.twitter.com/FhTnEbRSBi— Naveena (@TheNaveena) August 29, 2024 -
సోషల్ మీడియాలో కవిత యాక్టివ్.. ఫోటో షేర్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తాజాగా.. ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు.ఎమ్మెల్సీ కవిత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కవిత.. సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో, కవిత సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆమె పోస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తున్నాయి.సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత రెండు క్రితమే తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు.. కవితకు బెయిల్ ఇవ్వడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
నా బిడ్డొచ్చింది.. కవితను హత్తుకుని భావోద్వేగానికి గురైన శోభమ్మ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, భర్త అనిల్, కుమారుడితో పాటు పార్టీ కీలక నేతలతో కలిసి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత.. సాయంత్రం 5.30కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్ పోర్టు వద్ద కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కవిత సాయంత్రం ఏడు గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.అమ్మకు పాదాభివందనం.. సోదరుడికి రాఖీ.. కవిత రాకకు మునుపే ఆమె నివాసానికి కేసీఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కవితను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ ఇంటికి చేరుకున్న కవితకు శోభమ్మ, శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గుమ్మడి కాయతో దిష్టితీసి హారతి పట్టారు. తల్లి, వదినను కవిత ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శోభమ్మకు పాదాభివందనం చేశారు. కేటీఆర్ సోదరి కవిత చేయిపట్టుకుని కార్యకర్తల నినాదాల నడుమ ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కవిత గురువారం ఎర్రవల్లి నివాసానికి వెళ్లనున్నారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసీఆర్‌తో కవిత భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. కాగా ఆమె రెండు రోజుల పాటు ఎర్రవల్లి నివాసంలో తన తల్లిదండ్రులతోనే ఉండనున్నారు. మరోవైపు గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే నేతలకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా: కవితప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను ఏ విషయంలోనూ, ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం, ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, నిజం నిలకడ మీద ప్రజలకు తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యలపై జరిగే పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. తాను కేసీఆర్ బిడ్డనని వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని అన్నారు. నా చెల్లెలు ఫైటర్అంతకుముందు బుధవారం ఉదయం కవిత హస్తినలో బిజీబిజీగా గడిపారు. ఆమె విడుదల విషయాన్ని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదున్నర నెలల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. కేటీఆర్, కవితలతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన విశేషాలను వివరించారు. హైదరాబాద్ బయలుదేరే ముందు సోదరుడు కేటీఆర్‌తో కవిత కొద్దిసేపు ముచ్చటించారు. మరోసారి కవితను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా చెల్లెలు ఫైటర్ .. పట్టు వదలని విక్రమార్కురాలు..’ అంటూ ఆశీర్వదించారు. -
5 నెలల తర్వాత హైదరాబాద్‌కు కవిత.. (ఫొటోలు)
-
కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే పద్దతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందని తెలిపారు.చరిత్రల్లో సీబీఐ , ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ , కేజ్రీవాల్‌ను ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ, సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారని అన్నారు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్‌పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు.‘తెలంగాణ కాంగ్రెస్ ప్రధాని మోదీకి బీటీమ్‌గా పనిచేస్తుంది. మోదీ దగ్గర రేవంత్‌కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేదు. రేవంత్ సీఎం కావడం మోదీ చాయిసే. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు.లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీలో విలీనమౌతుంది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. ఎప్పటికయినా మోదీ , రాహుల్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే’ అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన కవిత..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్, భర్త అనిత్, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | BRS leader K Kavitha along with party leader and her brother KT Rama Rao in Delhi(Video source: BRS) pic.twitter.com/xYedikX7Ee— ANI (@ANI) August 28, 2024నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.జైలు నుంచి విడుదల..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS— BRS Party (@BRSparty) August 27, 2024 -
కేసీఆర్ బిడ్డను.. తప్పు చేయను: కవిత
మంగళవారం రాత్రి 9.11 గంటలు.. తిహార్ జైలు ప్రాంగణం.. అంతటా ఉద్వేగపూరిత వాతావరణం.. సుమారు ఐదున్నర నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలై.. జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ.. కుమారుడిని, భర్తను, అన్న కేటీఆర్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఐదున్నర నెలలు అక్రమంగా జైలులో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా’నంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు..కవితకు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయి, చార్జిïÙట్లు దాఖలైనా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్ చేస్తూ.. ఆమె బయటికి ఎంతసేపట్లో వస్తుంది, వెంట ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. జైలు బయట భర్తతో కలసి అభివాదం చేస్తున్న కవిత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిహార్ జైలు వద్దకు చేరుకుని.. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఢిల్లీ వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకు ఏనాడూ దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెబుతాను’’ అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. రాత్రి సరిగ్గా 9.11 గంటలకు తీహార్ జైలు నుంచి పిడికిలి బిగించి, జై తెలంగాణ అంటూ బయటకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యను చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, కేటీఆర్ కవిత నుదిటిపై ముద్దుపెట్టారు. భర్త అనిల్, హరీశ్‌రావులతో ఆలింగనం అనంతరం అక్కడున్న బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాలోతు కవిత తదితరులను ఆప్యాయంగా పలకరించారు. కవిత విడుదల అవుతున్నారని తెలుసుకున్న ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్, కవిత కడిగిన ముత్యం, కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. నన్ను జగమొండిని చేశారు కవిత జైలు బయట ఉన్న మీడియా, కార్యకర్తలనుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించారు. ‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు. నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆటోలో కేటీఆర్: కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు కోర్టు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు వెంటపడుతున్న సమయంలో.. అందరికీ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఆ సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటో మాట్లాడుకుని దీన్‌దయాల్ మార్గంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. పది నిమిషాలకోసారి కేసీఆర్ ఫోన్ బెయిల్ మంజూరు అని తెలిసినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్, కవిత భర్త అనిల్‌లకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలోగా బయటకు తెస్తారు, కవితమ్మ వెంట ఎవరెవరు ఉంటారు, జైలు వద్దకు ఎప్పుడు వెళతారంటూ కేసీఆర్ ఆరా తీస్తూనే ఉన్నారు. అక్రమంగా జైలులో పెట్టారు కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కవిత వెంట కారులో కేటీఆర్, కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, పార్టీ నేతలు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పది నిమిషాలకే పార్టీ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్ అని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తనను టార్గెట్ చేసుకుని జైలుకు పంపారంటూ ఆమె నేతలతో చర్చించారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1.ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కారు ఉరితాడు: వైఎస్ జగన్ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. లిక్కర్ కేసు: కవితకు బెయిల్ మంజూరుఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా నజర్జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4. ఈనాడు తప్పుడు రాతలు: సజ్జల వార్నింగ్ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5. లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్ బై! రేసులో ఆ ఇద్దరు..!ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. మార్చి నాటికి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత..పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది!టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9. వాష్టింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌పై సైబర్ దాడిప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10.కవిత బెయిల్‌పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఎక్స్ వేదికగా పొలిటికల్ వార్ నడుస్తోంది. కవిత బెయిల్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారుమరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
తీహార్ జైలు నుంచి కవిత విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టులో కవితకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్ట్27) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.దాదాపూ 165 రోజులు జైలులో ఉన్న ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కవిత తీహార్ జైలు నుంచి విడుదల కావడం సుగమమైంది. #WATCH | Delhi: Supreme Court grants bail to BRS leader K Kavitha in the excise policy irregularities case.BRS MP Ravi Chandra says, "Today is a very good day for us...A wrong case was filed against her and they have no proof against her...Our party believes in judiciary and… pic.twitter.com/d0UjoFQ8Fn— ANI (@ANI) August 27, 2024 తీహార్ జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టుకు కవిత భర్త అని ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ వారెంట్‌తో తీహార్ జైలుకు కవిత తరుఫు న్యాయవాదులు వెళ్లారు. తీహార్ జైల్లో కవితను విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలను సమర్పించారు. కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ కేసు విచారణ కొనసాగుతుండగానే అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు.తీహార్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులుతీహార్ జైలు నుంచి విడుదలతో కవితను పరామర్శించేందుకు తిహార్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్ వచ్చారు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
కవితకు భారీ ఊరట, ఎప్పుడు.. ఏం జరిగింది? (ఫొటోలు)
-
తీహార్ జైలు నుంచి కవిత విడుదల
Updates: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కానున్న కవితకవిత విడుదల ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ కోర్టుషూరిటీ పత్రాలు సమర్పించిన కవిత భర్త అనిల్, ఎంపీ రవిచంద్రరిలీజ్ వారెంట్ తో తీహార్ జైలుకు వెళ్లిన కవిత న్యాయవాదులుతీహార్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంరోడ్లన్నీ జలమయం, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులున్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ‘‘సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తైన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఈ మూడు ప్రధానాంశాల ఆధారంగా నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. కవిత బెయిల్‌కు షరతులుఒక్కో కేసుకు రూ.10 లక్షల పూచీకత్తు చొప్పున.. రెండు షూరిటీల సమర్పణపాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలిసాక్షులను ప్రభావితం చేయకూడదుఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణకు సహకరించాలికవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు.. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. ఈడీ,సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యింది. దర్యాప్తు కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదు. సిసోడియాకు బెయిల్ ఇచ్చి కవితకు ఇవ్వకపోవటం సరికాదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది. ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. 5 నెలలకు పైగా ఈడీ కేసులో, 4 నెలలుగా సీబీఐ కేసులో కవిత జైలులో ఉన్నారు. రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ, సీబీఐ ఆరోపించాయి. కానీ, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు.జస్టిస్ గవాయి వ్యాఖ్యలు..కవిత నిరక్షరాస్యులు కాదుఏది మంచి,ఏది చెడు కాదో తెలియదా?అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు?కవిత దుర్బల మహిళ కాదు అని ఢిల్లీ హై కోర్టు అన్నది కదా ఉన్నత స్థాయి మహిళ కు, దుర్బల మహిళకు తేడా ఉంది కదా ?సీబీఐ వాదనలు.. కవిత తన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేశారు. సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. కుట్రపూరితంగానే ఫోన్లో డేటా డిలీట్ చేశారు. గౌతమ్ గుప్తాతో చేసిన చాటింగ్‌ను డిలీట్ చేశారు. ఈడీ తరపు వాదనలు.. కవిత సాక్షాలను ట్యాంపర్ చేశారు. యాపిల్ ఫోన్ ఫేస్ టైంలో డేటా ఎందుకు లేదు?. నాలుగు అయిదు నెలల నుంచి ఫోన్ వినియోగిస్తే అందులో డేటా ఎలా మాయం అయ్యింది?. క్లిక్ చేయండి: కవిత అరెస్ట్ టూ బెయిల్ధర్మాసనం వ్యాఖ్యలు..ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేయటం సహజమే కదా: సుప్రీం కోర్టుమెసేజ్లు డిలీట్ చేయడాన్ని ఎలా తప్పుబడతారు?అరుణ్ పిళ్ళై తొలుత ఇచ్చిన వాంగ్మూలమే మేము పరిగణనలోకి తీసుకుంటాం ఉపసంహరించుకున్న వాగ్మూలం పట్టించుకోంఈడీ తరఫు వాదనలు..మెసేజ్‌లు డిలీట్ చేయటం కానీ ఫార్మాట్ చేయటం సహజం కాదుకవిత బెదిరింపుల వల్లే పిళ్లై స్టేట్మెంట్ విత్‌డ్రా చేసుకున్నారు.అరుణ్ పిళ్ళై 120రోజుల తర్వాత తన స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారుకవితని విచారణకు పిలిచినప్పుడే అరుణ్ పిళ్ళై అప్రూవర్ స్టేట్మెంట్ ఉపసంహరించడం వెనుక ఎవరు ఉన్నారు?కవిత, అరుణ్ పిళ్ళైలను కలిపి విచారణ జరుపుతాం అనగానే స్టేట్మెట్ రిట్రీట్ చేశారువంద కోట్ల రూపాయల కిక్ బ్యాగ్స్‌కు ఆప్ పార్టీకి ఇవ్వడంలో కవితది కీలకపాత్రఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారులిక్కర్ బిజినెస్‌పై అరవింద్ కేజ్రీవాల్‌ను కలిస్తే కవితను కలవమని చెప్పారుకవితను కలిస్తే లిక్కర్ బిజినెస్ కోసం ఆప్‌కు వంద కోట్లు ఇవ్వాలని చెప్పారుఇందులో 50 కోట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇవ్వాలని కవిత చెప్పారుఈ డేటా మొత్తం ఫోన్ నుంచి డిలీట్ చేశారు.ఈడీపై న్యాయమూర్తుల ఆగ్రహంపిళ్లై సీబీఐ కస్టడీలో ఉంటే కవిత ఎలా బెదిరిస్తారు?మీకు ఇష్టమొచ్చిన వాళ్లను సాక్షులుగా పెడతారా?మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదుకవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారు?జస్టిస్ గవాయి వ్యాఖ్యలు:మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారుఇదేనా పారదర్శకత ?బుచ్చిబాబు, ముత్త గౌతమ్ కేసులో నిందితులుగా ఉన్నారా ?విచారణ పారదర్శకంగా జరుగుతోందా? పక్షపాతం లేకుండా ఉందా ?మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాందర్యాప్తు పూర్తి అయ్యిందిచార్జిషీట్ ఫైలింగ్ పూర్తి అయ్యింది కదా493 మంది సాక్షుల విచారణ ఇప్పుడే పూర్తి కాదుసుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ హర్షంకవితకు బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. తీర్పు అనంతరం ఆటోలో వాళ్లు వెళ్లిపోయారు. అయితే.. సాక్షి టీవీతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. ‘‘సాయంత్రం కల్లా కవిత బెయిల్‌పై బయటకు వస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత వ్యతిరేకంగా ఇలాంటి సాక్షాలు లేవు. ఇన్నాళ్లకు మా న్యాయపోరాటం ఫలించింది. జైల్లో కవిత ఇబ్బందులు పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది అని అన్నారాయన. -
ఢిల్లీ బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ఢిల్లీ బయల్దేరారు. వీరితోపాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు.అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ క్రమంలోనే వీరంతా హస్తీనాకు పయనమయ్యారు.కాగా కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో ఆమె జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఈ కేసుల్లో ఆమె ట్రయల్,హైకోర్టులో బెయిల్ కోసం ఆశ్రయించగా.. న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఈ క్రమంలో మంగళవారం సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకింది.ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలకు కూడా బెయిల్ వచ్చింది. దీంతో, కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, సాక్షి: రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఎక్స్ ఖాతాలో ఉంచారు. ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి. అయినప్పటికీ.. ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ ట్వీట్ చేశారాయన. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్నారు. You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc— KTR (@KTRBRS) August 19, 2024 -
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకో ణంలో ఆరోపణలపై అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశా లను సవాల్ చేస్తూ కవిత తరఫు న్యాయ వాది మోహిత్‌రావు గురువారం క్రిమినల్ ఎస్ ఎల్పీ దాఖలు చేయగా శుక్రవారం రిజిస్ట్రీ వెరిఫై చేసింది.అనంతరం సోమవారం కేసుల విచా రణ జాబితాలో చేర్చింది. ఈడీ, సీబీఐ కేసు ల్లోనూ బెయిల్ కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మా సనం ముందుకు కవిత పిటిషన్ రానుంది. -
కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని చెప్పుకొచ్చారు ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.కాగా, కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ.. తీహార్ జైలులో ఉన్న కవిత ఆరోగ్యం క్షీణించింది. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతోంది. వచ్చే వారంలో బెయిల్‌కు వస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందనే వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది. -
లిక్కర్ స్కాం: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్ కోర్టు. ఇదిలా ఉంటే.. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో.. దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగష్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత ఏ17గా ఉన్నారు. కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. అయితే.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా, కవిత లాయర్‌కు గుర్తు చేశారు. చివరకు.. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేశారు. -
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
కవితకు అస్వస్థత.. నేడు తీహార్ జైలుకు కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.కాగా, కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
కవిత కస్టడీ పొడిగింపు.. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో జూలై 22వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇక, లిక్కర్ కేసులో విచారణ కోసం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు జైలు అధికారులు. ఈ సందర్భంగా తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో(ల్యాడ్ టెస్టులు) వ్యత్యాసాలను కవిత న్యాయమూరి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో, కవితకు వైద్యపరీక్షలకు కోర్టు అనుమతించింది. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్టును కోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రెండు క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికావడంతో దీన్‌దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కాగా, కవితకు ప్రైవేటు ఆసుపత్రిలో చెకప్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దరఖాస్తు చేయడంతో కోర్టు దీనికి అంగీకరించింది. -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
‘కవిత కోసం బీఆర్ఎస్ మంతనాలు.. బండి సంజయ్ వ్యాఖ్యల మర్మమదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏఐసీసీ డైరక్షన్ మేరకే రాష్ట్రంలో చేరికలు జరుగుతున్నాయన్నారు. అలాగే, లిక్కర్ స్కాంలో కవితను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.కాగా, మధుయాష్కీ తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌లో చేరికలు ఏఐసీసీ డైరెక్షన్ మేరకే జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన మూడు రోజులకే సర్కార్ పడిపోతుందన్నారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా బీఆర్ఎస్ పనిచేయలేదా?. దళితుల వ్యతిరేకంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పనిచేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేర్చుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను గేటు వద్దనే గంటల తరబడి నిలబెట్టింది కేసీఆర్ కాదా?. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్చ ఉంది. సీఎం రేవంత్ ఎవరైనా కలవొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నాం. మంత్రి పదవులు ఇస్తాం అని ఎవరికీ చెప్పడం లేదు.రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్ సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్, నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్‌పైనే ప్రస్తుతం బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కల్వకుంట్ల కవిత విడుదల కోసం బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. హరీష్‌రావుపై బండి సంజయ్ ప్రేమ కురిపించడానికి కారణం అదే’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై నిన్న(ఆదివారం)బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ఒకే ఒక మంచి నాయకుడు, వివాదరహితుడు హరీష్ రావు ఒక్కడే అని అన్నారు. అలాగే, హరీష్ ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేశాకే చేరాలని కామెంట్స్ చేశారు.కాగా, నిజంగా ఉద్యోగం కోసం రాసే వారు ఎవరు ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరు. ఉద్యోగాలు వాయిదా వేయడం వలన 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శిక్షణ తరగతులు చెప్పే కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. నారాయణ, చైతన్య కాలేజీలలో హరీష్, కవితకు 17 శాతం వాటాలు ఉన్నాయి.ఇక, పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో అసలు చర్చే లేదు. మంత్రివర్గ విస్తరణపై జరిగింది. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి. ఏయే శాఖలు ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగింది. అదే రోజు పీసీసీపై ఐదు నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మంత్రులపై సమన్వయం చేసే దానిపై చర్చ జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలో ఇంఛార్జి దీపాదాస్ మున్షి పాత్ర ఏమీ లేదు. సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
లిక్కర్ స్కాం.. సీబీఐ కేసులో కవిత విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది.కోర్టులో వాదనలు సందర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ తప్పులు లేవని చెప్పారు.చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు.డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న నితీష్ రాణా వాదించారు. అయితే చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబందం లేదన్న సీబీఐ వాదించింది. చార్జ్‌షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని, తప్పుగా ఉందని మాత్రమే చెబుతుననట్లు నితీష్ రాణా పేర్కొన్నారు.దీనికి సీబీఐ స్పందిస్తూ.. తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేనని కవిత న్యాయవాది ఆరోపించారు. అనంతరం కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్షీట్నుపరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. -
లిక్కర్ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్ వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ విషయమై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డిఫాల్ట్ బెయిల్‌పై రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ కేసులో కవిత కస్టడీని జులై 18 వరకు పొడగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించిందిరౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జులై 18 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు.అదే విధంగా ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరస్తూ న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నారు. -
కవిత జ్యూడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మళ్లీ పొడిగించింది. కస్టడీ ముగియడంతో బుధవారం ఉదయం ఆమెనుతీహార్ జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దీంతో జడ్జి జులై 25వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత కస్టడీని పలుమార్లు పొడిగించింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె చేస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తోసిపుచ్చుతూ వస్తున్నాయి. కవితతో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని సైతం అదే తేదీ దాకా పొడిగించింది. -
లిక్కర్ కేసు: కవితకు మళ్లీ నిరాశే
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. -
కవిత బెయిల్ పిటిషన్లపై సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు(సోమవారం) తీర్పు వెల్లడించనుంది. మూడు నెలలుగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కు రిజర్వు చేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. -
Delhi Liquor Scam: సీబీఐ కేసులో కవిత కస్టడీ మరోసారి పొడిగింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. జూలై 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.అనంతరం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. -
MLC Kavitha: తీహార్ జైలులో కవితను కలిసిన సబిత, సత్యవతి రాథోడ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్ జైలులో ఉన్న కవితలో ములాఖత్ అయ్యారు.మరోవైపు.. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. -
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Delhi Liquor Case May 27 Updates👉 కవిత బెయిల్ విచారణ రేపటికి వాయిదాలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదారేపు మధ్యాహ్నాం 12గం. వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్ట్ ఇవాళ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత తరఫున ముగిసిన వాదనలు40 నిమిషాల పాటు వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాదిరేపు వాదనలు వినిపించనున్న ఈడీ, సీబీఐరేపు వాదనలు పూర్తయ్యాక.. తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ 👉కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్ స్వర్ణ కాంతమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి?: జస్టిస్ స్వర్ణకాంతకేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్ స్వర్ణకాంతకవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు.. దాని వల్ల ఈడీకి వచ్చి లాభం ఏమిటి ?: కవిత తరఫు లాయర్ కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పూర్తి👉పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి👉కేసు ఫైల్ చేసినప్పుడు పేరేది?మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరిఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభంలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్ట్ లో విచారణ ప్రారంభంకవిత బెయిల్ పిటిషన్ విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మవిచారణకు హాజరైన కవిత భర్త అనిల్👉లిక్కర్ స్కామ్ కేసు.. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. తద్వారా తాము వాదనలకు సిద్ధమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. లిక్కర్ కేసులో కవితని కింగ్ పిన్ అని పేర్కొంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) నిరాకరించింది. దీంతో.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మే 24 శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించగా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగించేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈడీ, సీబీఐలకు వాదించేందుకు అవకాశం ఇచ్చింది.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేసి వాదనలకు సిద్ధమని ప్రకటించింది. అయితే సీబీఐ మాత్రం కౌంటర్‌కు, ఛార్జీషీట్ దాఖలుకు గడువు కోరింది. చెప్పినట్లుగానే సీబీఐ ఇవాళ కౌంటర్ వేసింది.లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. PET-CT స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో బెయిల్‌ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. అయితే ఇప్పటికే ఆయనకు మాక్స్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో కోర్టు బెయిల్ పొడిగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.హైకోర్టుకే వెళ్లండి.. పిళ్లై బెయిల్‌పై సుప్రీంసుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు వింది. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని పిళ్లైకి సూచించింది. అదే సమయంలో.. గతంలో ఇచ్చిన ఆదేశాల తో సంబంధం లేకుండా మధ్యంతర బెయిల్ పిటిషన్ పరిశీలన చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సైతం సుప్రీం సూచించింది.గతంలో తాను కవిత బినామీనేనంటూ అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చి.. ఆ తర్వాత ఆ మాట మార్చాడు పిళ్లై. అయితే ఇండో స్పిరిట్ లో కవిత తరఫున పిళ్లై భాగస్వామిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. -
‘కవిత అరెస్ట్‌లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయగా.. కౌంటర్‌కు సీబీఐ గడువు కోరింది. ఇవాళ కవిత తరఫున లాయర్ వాదనలు వినిపించగా.. సోమవారం కూడా ఆ వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు కవిత బెయిల్‌పై కేంద్ర దర్యాప్తుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కవిత అరెస్ట్‌లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి.దానిపై సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ చేశాం.. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.ఆ కేసు జూలైకి వాయిదా పడింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేశాం.మహిళకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణ కింద కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. 2022 ఆగస్టు 7న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు.శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండో స్పిరిట్‌లో వాటా కోసం ఇచ్చారని చెప్పారు.అప్పుడు తొలి సారిగా కవిత పేరు తెరపైకి వచ్చింది. అరుణ్ పిళ్లై ఆ తర్వాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు .అభిషేక్ బోయినపల్లి ఈ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ చెప్పింది.విచారణ జరపకుండా ఈ విషయం రిమాండ్ రిపోర్టులో పెట్టారు.ముందుగా సీబీఐ సీఆర్పీసీ160 నోటీసు ఇచ్చి నవంబర్ 2022 ఆమె ఇంట్లో 7 గంటలు విచారణ జరిపారు. ఈడీ మార్చి 2023లో విచారణ జరిపింది. మహిళను కార్యాలయంలోకి పిలవద్దని, సీఆర్పీసీ160 ప్రకారం నడుచుకోవాలని చెప్పినా ఈడీ వినకుండా కార్యాలయానికి పిలిచింది. అరెస్టు చేసిన వ్యక్తితో కలిపి విచారణ జరపాలని ఢిల్లీకి పిలిచారు. కవిత ఫోన్లు సీజ్ చేశారు. అని కవిత లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. స్పందించిన న్యాయస్థానం దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సీబీఐని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్లపై సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అంతకు ముందు.. మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. అదే విధంగా జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు వెల్లడించింది. సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. మంగళవారం నాడు ఈడీ, సీబీఐ వాదనలు వింటామని తెలిపింది. -
కవిత కేసులో నేడు ఏం జరగనుందో?
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్ తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారామె. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరట ఇవ్వాలని పిటీషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్ పిటిషన్‌పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. జూన్ 3 వరకు కవిత జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
కవిత బయటకు వచ్చేనా?.. కాసేపట్లో బెయిల్‌పై విచారణ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్ గ్రూప్ తరఫున కవిత ఆప్ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న ఆమెను అరెస్ట్ చేశాయి. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు. ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాదనలు ఇలా.. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.ఈడీ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడి వాదనలుఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం. -
MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో, కవిత నేడు జైలు నుంచి బయటకు వస్తుందా? లేదా అనే సస్పెన్స్ నెలకొంది.ఇక, లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పు వెలువడనుంది. కాగా, కవిత పిటిషన్ విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు కొనసాగాయి. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు. -
కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్‌పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్‌లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్‌లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. కవిత బెయిల్‌పై వాదనలు లిక్కర్ స్కాంలో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడి వాదనలు కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి కవిత తరపు లాయర్ వాదనలు మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. -
కవితకు బ్యాడ్ టైమ్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ: నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటం బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 22వ మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇక, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..‘కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్‌ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు’ అని కోరుతున్నారు. -
కవితకు వార్నింగ్ ఇచ్చిన జడ్జి.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 15వ తేదీన ఈడీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితను సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్బంగా కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డు చేసింది. మరోవైపు.. ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు నిన్న(ఆదివారం) కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ఇక, రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. -
లిక్కర్ కేసు: కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో.. ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ ములాఖత్ కొనసాగింది. కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ ఉన్నారు. ఇక.. ములాఖత్ ముగిసిన అనతంరం మీడియాతో మాట్లాడటాన్ని కేటీఆర్ నిరాకరించారు. లాయర్లతో చర్చించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. ఇక.. ఆదివారం(ఏప్రిల్ 14) కవితను కలిసేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. రేపటితో కవిత సీబిఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు అప్పచెప్పారని సీబీఐ అభియోగం. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్‌పై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. కవిత విచారణను సీబిఐ వీడియో రికార్డు చేస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ శనివారం విచారణను ప్రారంభించింది. ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. రూ.100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను శుక్రవారం సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా శనివారం సీబీఐ కవితను ప్రశ్నించింది. -
CBI: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది. చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు ఒక్కో రిటైల్ జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్‌లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది. విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
లిక్కర్ స్కాం: అరెస్ట్‌పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: న్యాయ సలహా కావాలని అడిగినా.. కానీ అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాలులో మాట్లాడిన ఆమె.. తన అరెస్ట్ అక్రమం, సీబీఐ చేస్తోంది తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి పదిన్నరకు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పా’’ అని కవిత పేర్కొన్నారు. కవిత వాదనలు కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత హక్కులను కాపాడాలి. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత రెండు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కస్టడీ పిటిషన్‌పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి. సీబీఐ వాదనలు: ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు. -
లిక్కర్ స్కాం: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 2 గంటలకు వాయిదా వేసింది కోర్టు. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు. జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీ సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్ పై వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి తెలిపారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు. సీబీఐ వాదనలు: ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు #WATCH | BRS leader K Kavitha brought to Delhi's Rouse Avenue Court for hearing in connection with a money laundering case after CBI takes her into its custody. K Kavitha was taken under custody by CBI under sections of criminal conspiracy and falsification of accounts of the… pic.twitter.com/gmRvmmcJSt — ANI (@ANI) April 12, 2024 నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సీబిఐ అరెస్ట్ చేసిందని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది. సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంది. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. -
కవితను అరెస్టు చేసిన సీబీఐ.. ప్రత్యేక కోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. కస్టడీ కోరనున్న సీబీఐ! రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ శనివారం కవితను తీహార్ జైలులో ప్రశ్నించిన విషయం విదితమే. మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్లు, భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
సీబీఐ అరెస్ట్.. కోర్టులో కవితకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌లు.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు.. బెయిల్ పిటిషన్లతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున ఆమె లాయర్ మోహిత్ రావు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని స్పెషల్ కోర్టు తెలిపింది. కవిత పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్‌గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు(శుక్రవారం) తీహార్ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 కు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది. చదవండి: లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ -
లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ తమ అదుపులోకి తీసుకుంది. కాగా లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల తీహార్‌లో జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపిస్తుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేస్తోంది. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే కవితను అరెస్ట్ చేసినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ తరలించారు. రేపు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇక లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు. చదవండి: నన్ను బలి పశువును చేశారు.. కల్వకుంట్ల కవిత లేఖ -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
నేను బాధితురాలిని.. ఇందులో నా ప్రమేయం లేదు: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా హక్కులకు భంగం కలగకుండా, ఈ కేసులో పేర్కొన్న విషయాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని చెప్పాలనుకుంటున్నా. రెండున్నరేళ్లుగా ఈడీ/సీబీఐ దర్యాప్తు ముగింపు లేని దర్యాప్తుగా సాగడం ప్రపంచమంతా చూస్తోంది. ఈ విషయంలో మహిళా రాజకీయ నాయకురాలిగా ఇతరులకన్నా ఎక్కువ బాధితురాలిని నేనే. ఈ కేసు నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసింది. నా వ్యక్తిగత ఫోన్ నంబర్ అన్ని టీవీల్లో ప్రసారం చేయడం నా గోప్యతకు భంగం కలిగిస్తోంది. నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాను. వారి ముందు నాలుగుసార్లు హాజరయ్యాను. నాకు తెలిసినంత వరకూ వారికి సమాధానమిచ్చాను. నా బ్యాంకు, వ్యాపార వివరాలు తెలియజేశాను. నా ఫోన్లు దర్యాప్తు సంస్థకు ఇచ్చి పూర్తిగా సహకరించినా వాటిని ధ్వంసం చేశానని నిందిస్తున్నారు. రెండున్నరేళ్లలో దర్యాప్తు సంస్థలు అనేక మంది విషయంలో పలుసార్లు దాడులకు పాల్పడటంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించి, బెదిరించి అరెస్టు చేశాయి. అయినప్పటికీ తమ ప్రకటనలను, రాజకీయ పొత్తులను మారుస్తూ వచ్చిన వారి నుంచి కొన్ని స్టేట్మెంట్లు సేకరించాయి. ఈ కేసు మొత్తం వాంగ్మూలాల మీదే ఆధారపడి ఉంది. కేసులో డబ్బు లావాదేవీలు ఎక్కడా లేవని... అవినీతికి సంబంధించిన ఆధారాలు లేవనడాన్ని తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సాక్షుల్ని తారుమారు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్నెందుకు అరెస్టు చేయలేదు. రెండున్నరేళ్ల దర్యాప్తు విఫలమైన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. నాపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈడీ/సీబీఐ కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే ఉన్నాయి. నిందితులు బీజేపీలో చేరితే దర్యాప్తు ఆకస్మికంగా నిలిచిపోతోంది. నోరుమెదపకండి లేకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నాయకులు పార్లమెంటు వేదికగానే బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పారీ్టలు ఏదైనా ఉపశమనం లభిస్తుందని న్యాయస్థానాలు వైపు చూస్తున్నాయి. నేను ఈడీ ప్రక్రియ విధానాలకు సహకరించడం తప్ప ఏమీ చేయలేను. ఆ విధంగానే కొనసాగుతున్నాను. అందుకే నాకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నా. నా జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే బాధ్యాతయుతమైన తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చాలా అర్హతలు కలిగిన వ్యక్తిని. అందుకే కుమారుడు బోర్డు పరీక్షలు, ఆప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు నా పాత్ర ఏమిటో అర్థం చేసుకున్నాను. నేను ప్రపంచానికి దూరంగా ఉండే వ్యక్తిని కాదు. నేనేమీ ఒకే సంతానం కలిగిన తల్లిని కాదు. తల్లి స్ధానాన్ని భర్తీ చేయగలమా? చదువు విషయంలో నా కుమారుడుకి ఇది చాలా క్లిష్టమైన సంవత్సరం. నేను గైర్హాజరు కావడం కుమారుడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నా. అందుకే నా బెయిల్ అభ్యర్థన పరిశీలించాలని మళ్లీ కోరుతున్నా’ అని కోర్టులో స్వయంగా ప్రస్తావించేందుకు రాసుకొచ్చిన 4 పేజీల లేఖలో కవిత పేర్కొన్నారు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకోనందున కోర్టు అనుతించకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందన్న అభియోగాలకు సంబంధించిన కేసులో ఈడీ అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఆమెను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆదేశించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో కవితను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. చార్జిషిటులో కవిత పాత్రపై స్పష్టత ఇవ్వడానికి మరో 14 రోజుల గడువు కావాలని కోరారు. అయితే కస్టడీ పొడిగింపు ద్వారా ఈడీ తెలుసుకోవాల్సిన విషయాలేవీ లేవని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదించారు. ఈ కేసులో రెండేళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్నా ఈడీ అధారాలేవీ చూపలేదన్నారు. కవితకు స్వయంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నిందితులకు నేరుగా మాట్లాడే హక్కు ఉందని కవిత న్యాయవాది తెలపగా అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. వాదనల అనంతరం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో కవితను ఆమె భర్త, మామ కలిసి కాసేపు మాట్లాడారు. అంతకుముందు కవిత స్వయంగా వాదించుకొనే అవకాశం వస్తుందని భావించి న్యాయమూర్తి ముందు ఏయే అంశాలు ప్రస్తావించాలో నాలుగు పేజీల్లో రాసుకొని కోర్టుకు వచ్చారు. అయితే న్యాయమూర్తి నిరాకరించడంతో వాటిని మీడియాకు విడుదల చేశారు. -
మళ్లీ తీహార్ జైలుకే కవిత
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా.. కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా, కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపగా, అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కాగా, కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు. మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది. ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
కవితకు దక్కని ఊరట.. బెయిల్ తీర్పులో కీలక అంశాలు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి కావేరి భవేజా 21 పేజీల తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యం అవుతుండడంతో.. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో పిల్లవాడికి తల్లి అవసరం ఉందని కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వానలి కోరారు. అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని కోర్టుకు ఈడీ తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో 4వ తేదీన వాదనలు ముగియగా.. తీర్పు రిజర్వ్ చేసి తీర్పు నేటికి వాయిదా వేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కవిత బెయిల్ తీర్పులో కీలక అంశాలు కవితకు ఈడి నోటీసులు ఇచ్చిన తర్వాత తన ఫోన్లో డాటాను ధ్వంసం చేశారు ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం నిర్ధారణ జరిగింది. బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేయగలరు. బెయిల్ ఇవ్వడానికి ట్రిపుల్ టెస్ట్ పాస్ కాలేదు. కవిత కుమారుడి వయసు 16 సంవత్సరాలు. ఇప్పటికే సగం పరీక్షలు పూర్తయ్యాయి. తండ్రి , పిన్ని తగినంత మానసిక ధైర్యం కుమారుడికి కల్పిస్తారు. పరీక్షల భయం మద్యంతర బెయిల్‌కు తగిన కారణం కాదు. తల్లిదండ్రులు భౌతికంగా అందుబాటులో లేకున్నా, 19 ఏళ్ల కుమారుడు స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు తండ్రి , పిన్ని సమక్షంలో చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మహిళ అనే కారణంతో బెయిల్ ఇవ్వాలన్న అంశంపై కోర్టులు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. నేరాలలో బలి కావడానికి కవిత నిస్సహాయు రాయులైన మహిళ కాదు. కవిత సమాజంలో ఉన్నత స్థానంలోని విద్యావంతురాలు. సాక్షులను బెదిరించడం, సాక్షాలను ధ్వంసం చేయడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళ అయినంత మాత్రాన పీఎంఎల్ఏ సెక్షన్ 45 (1) కింద బెయిల్ ఇవ్వలేం అందుకే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నా. ఇదిలా ఉండగా.. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవిత మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. రేపు(మంగళవారం) మళ్లీ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు.. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ పిటిషన్‌ను త్వరగతిన విచారణ చేప్టాలంటూ ఆమె కోర్టును ఆశ్రయిస్తూ మరో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. -
లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్.. కవితకు కొత్త టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఈరోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ అంశంలో తన రిప్లై ఇచ్చేందుకు సమయంలో ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో, సీబీఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది. అనంతరం, అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి స్పెషల్ కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. -
లిక్కర్ కేసు.. తీహార్ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. తీహార్ జైలులో కవితను లిక్కర్ స్కాం కేసులో విచారించి, ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది. కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్‌టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది. వచ్చే వారం తీహార్ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఆప్‌కు ఇచ్చిన రూ. 100 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించనుంది. అయితే గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ 2022 డిసెంబర్ 2న కవితకు నోటీసులు పంపింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల(మార్చి 15న) కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా ఏడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో మూడు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చగా కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చదవండి: Liquor Case : కవిత బెయిల్‌పై ఏప్రిల్ 8న తీర్పు Delhi excise case: Central Bureau of Investigation (CBI) moves an application seeking permission to interrogate/record the statement of BRS leader K Kavitha in Tihar Jail K Kavitha is presently in judicial custody and was arrested by the Enforcement Directorate. — ANI (@ANI) April 5, 2024 -
వేధింపుల సంస్థలా ఈడీ: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే సంస్థలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం కనిపించడం లేదని, కక్షగట్టి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ‘‘ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే ఏజెన్సీలా వ్యవహరిస్తోంది. న్యాయం, నిష్పక్షపాతం కనిపించడంలేదు. అంతా ప్రీమోటివేటెడ్ విధానంలా ఉంది. అరెస్టు చేసినా, చేయకపోయినా నిత్యం వేధింపులు తప్పవన్నట్టు వ్యవహరిస్తోంది. రోజూ ఒక ఆపిల్ తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెప్పినట్టు..రోజూ సమన్లు ఇవ్వడం ఈడీకి సంతోషంగా ఉంటున్నట్టుంది..’’ అని పేర్కొన్నారు. ఈడీది ప్రత్యేక సామ్రాజ్యమన్నట్టు, కోర్టుకు, రాజ్యాంగానికి అతీతమన్నట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కవితను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? ఈడీ విచారణకు కవిత సహకరించారని, ఆమెను అరెస్టు చేసి ఉండాల్సిన అవసరమే లేదని సింఘ్వి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగానే కవిత ఈడీ విచారణకు హాజరుకాలేదని వివరించారు. ‘‘ఇదేమైనా హత్య కేసా? పీఎంఎల్ఏ సెక్షన్ 19ను ఐపీసీ సెక్షన్ 302లా చూపుతున్నారు. కవిత సమాజంలో పేరున్న మహిళ. ప్రకటిత నేరస్తురాలు కాదు. ఆమె ఎక్కడికీ పారిపోరు..’’ అని స్పష్టం చేశారు. ఈడీ సమన్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ప్రశ్నలు వేశారు? ఇంకా ఎన్ని మిగిలిఉన్నాయో చెప్పాలని కోరారు. అరుణ్పిళ్లై స్టేట్మెంట్లు విభిన్నంగా ఉన్నాయని.. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు, అదనపు చార్జిషీటులో నిందితురాలుగా గానీ, ముద్దాయిగా గానీ కవిత పేరు ఎక్కడా లేదని వివరించారు. కాగా.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు. కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఈడీ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. దీనితో కవిత తరఫున న్యాయవాది సింఘ్వి.. ఈడీ కౌంటర్‌పై రిజాయిండర్‌ను ఈ నెల 3 కల్లా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీనితో విచారణను న్యాయమూర్తి ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు. కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు ఇవ్వండి.. తనకు అందించాల్సిన సౌకర్యాలపై కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జైలు అధికారులు పాటించడం లేదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు, మెడిటేషన్ చేసుకొనేందుకు జపమాల, బూట్లను అనుమతించాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు.