కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు: మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి | Jagadish Reddy Slams BJP Congress Comments on Kavitha Bail | Sakshi
Sakshi News home page

మోదీ , రాహుల్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే: మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి

Published Wed, Aug 28 2024 12:35 PM | Last Updated on Wed, Aug 28 2024 2:43 PM

Jagadish Reddy Slams BJP Congress Comments on Kavitha Bail

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే పద్దతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ స్కాం నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందని తెలిపారు.

చరిత్రల్లో సీబీఐ , ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటని జగదీష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ , కేజ్రీవాల్‌ను ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ, సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారని అన్నారు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్‌పై  వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు.

‘తెలంగాణ కాంగ్రెస్‌ ప్రధాని మోదీకి బీటీమ్‌గా పనిచేస్తుంది. మోదీ దగ్గర రేవంత్‌కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేదు. రేవంత్ సీఎం కావడం మోదీ చాయిసే. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు.

లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీలో విలీనమౌతుంది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. ఎప్పటికయినా మోదీ , రాహుల్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే’ అని జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement