guntakandla jagadish reddy
-
‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిస్తూ విచారణ ముగించింది. అయితే.. ఈ కేసులో సీఎం, హోం మంత్రి జోక్యం చేసుకోవద్దంటూ మాత్రం ఆదేశాలిచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే.. కేసును విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది. ఏసీబీ డీజీ ప్రాసిక్యూషన్‌కు కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ కేసుపై సీఎం, హోం మంత్రికి రిపోర్ట్ చేయకండి. స్వతంత్ర, పారదర్శక విచారణ జరపాలనదే మా ఉద్దేశం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరపాలన్న వినతిని సైతం తిరస్కరించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలు: కవిత బెయిల్ పిటిషన్ కామెంట్లపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. క్షమాపణలు పబ్లిక్ గా చెప్పారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ తమ విధులు నిర్వహించాలి. రాజ్యాంగ వ్యవస్థలోని మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవం ఇవ్వాలి. కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలకు ఒకే కానీ లక్ష్మణ రేఖ దాటవద్దు. రేవంత్ రెడ్డి తరఫు వాదనలు 👇 కవిత బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కు క్షమాపణ తెలిపిన రేవంత్ అది నా ట్విట్టర్ హ్యాండిల్ కాదు నేను అడ్మినిస్ట్రేటర్ కాదు నేను పీసీసీ అధ్యక్షుడిని కాదు ప్రాసిక్యూటర్ ను మార్చాలని, దీనికి పొలిటికల్ ట్విస్ట్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు వాదనలు 👇 ఏసీబీ డీజీ సీఎం నియంత్రణలో ఉన్నాయి స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు ఉండాలి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నుంచి మాత్రమే ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు అందాలి -
కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే పద్దతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందని తెలిపారు.చరిత్రల్లో సీబీఐ , ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ , కేజ్రీవాల్‌ను ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ, సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారని అన్నారు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్‌పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు.‘తెలంగాణ కాంగ్రెస్ ప్రధాని మోదీకి బీటీమ్‌గా పనిచేస్తుంది. మోదీ దగ్గర రేవంత్‌కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేదు. రేవంత్ సీఎం కావడం మోదీ చాయిసే. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు.లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీలో విలీనమౌతుంది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. ఎప్పటికయినా మోదీ , రాహుల్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే’ అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయను అమిత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ అధిష్టానం ఓకే అంటే.. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబం ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకుంది..? తాము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోమని బీఆర్ఎస్ అధిష్టానానికి ఎందుకు తెగేసి చెప్పింది? దీనిపై పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా ఇతర నేతలతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో ఏం సహకరిస్తారంటూ సుఖేందర్‌రెడ్డి కుటుంబం నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తాము తప్పుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌రెడ్డి దారెటు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో గుత్తా అమిత్‌రెడ్డి భేటీ కావడంతో.. ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, దానిని అమిత్ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డికి గుత్తా కుటుంబానికి బంధుత్వం ఉండటంతో ఆ ప్రచారం సాధారణమేనని, తాము పార్టీ మారే ఆలోచన లేదని సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. పోటీకి సిద్ధంగా ఉన్నామన్నా.. తన కుమారుడు అమిత్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో ప్రకటించారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్లోని జిల్లా నేతలు కొందరు అమిత్‌కు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి చెప్పారు. మొదటి నుంచీ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి మధ్య సఖ్యత లేని కారణంగా మాజీ మంత్రి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇతరులను బరిలో నిలిపేందుకు చర్చలు జరిపారంటూ గుత్తా వర్గం మండిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి భువనగిరి టికెట్ అడుగుతున్నారన్న చర్చ జోరందుకుంది. అయితే, తాము పార్టీ మారుతారనే ప్రచారాన్ని గుత్తా అమిత్‌రెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా మంత్రి కాబట్టే తాను కలిశానని పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, జిల్లాలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలన్నింటిని కేటీఆర్, హరీష్‌రావుకు అమిత్‌రెడ్డి వివరించినట్లు తెలిసింది. ‘గుత్తా’కు అందని ఆహ్వానం! పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో సోమవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీలో నిలిపే అభ్యర్థి విషయంపై చర్చించారు. అనంతరం వారంతా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సమావేశానికి గుత్తా అమిత్‌కు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అందుకే ఆయన హాజరుకాలేదని సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు నల్లగొండ పార్లమెంట్ నియోజకర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విషయంపై మాజీ సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు చర్చించారు. జగదీష్‌రెడ్డి నేతృత్వంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్ తదితర నేతలు సోమవారం కేసీఆర్ వద్దకు వెళ్లారు. అభ్యర్థి విషయంలో ఏదైనా నిర్ణయానికి వచ్చారా అని కేసీఆర్ అడగ్గా నలుగురైదుగురు అడుగుతున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, గట్టి పోటీ ఇవ్వగలిగే వారిలో మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను సూచించినట్లు తెలిసింది. వారిద్దరిలోనే ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష్మిని పోటీచేయించే యోచనలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచీ వ్యవహరిస్తోంది. భువనగిరిలో ఎవరైతే భారీ మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనా కాంగ్రెస్ అధిష్టానం సర్వే చేయిస్తోంది. ప్రస్తుతం టికెట్ అడుగుతున్న వారందరి పేర్లతోనూ సర్వేలు చేయించింది. బలమైన అభ్యర్థినే పోటీలో నిలుపాలన్న ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీని పోటీచేయించాలంటూ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.4.26 కోట్లు
సూర్యాపేట : బీఆర్ఎస్ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం వేసిన నామినేషన్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రూ.1.58 కోట్ల స్థిర ఆస్తులు, రూ.2.68 కోట్ల చరాస్తులు మొత్తం కలిపి రూ.4.26 కోట్లు ఉన్నాయని.. రూ.2.60 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.2.86 లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణి సునీత చేతిలో రూ.9.8 లక్షలు ఉండగా.. ఆమె పేరున రూ.5.94 కోట్ల స్థిరాస్తులు, రూ.4.66 కోట్ల చరాస్తులు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. రూ.3.27 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన పేరున ఒక కారు, తన సతీమణి పేరున రెండు కార్లు, ఒక బైక్, ట్రాక్టర్ ఉన్నట్లు చూపారు. తనపై ఒక కేసు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. సంకినేని కుటుంబ ఆస్తి రూ.రూ.22.63 కోట్లు సూర్యాపేట : బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్రావు ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను రూ.22.63 కోట్లుగా చూపారు. వెంకటేశ్వర్రావు పేరున రూ.1.51 కోట్ల చరాస్తులు, రూ.40 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.1.50 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి లక్ష్మి చేతిలో రూ.13.75 లక్షలు ఉండగా.. 730 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25.32 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. తనపై నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. దామోదర్‌రెడ్డిపై నాలుగు కేసులు.. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రూ.13.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.88 కోట్ల స్థిరాస్తులు తన చేతిలో రూ.25 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
రేవంత్ పిండం వ్యాఖ్యలపై మంత్రిజగదీష్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డిపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనకు పిండం పెడతామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ కక్షలతో కేసీఆర్ ఏనాడు వ్యవహరించలేదని తెలిపారు. పాలించమని ప్రజలు కేసీఆర్‌కు అధికారమిచ్చారని పేర్కొన్నారు. లాంటి నీచమైన మాటలు మాట్లాడమని కేసీఆర్ తమకు నేర్పలేదని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌కు పిండే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జగదీష్ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఆయన ప్రతిసారీ గుర్తుచేస్తున్నది వాళ్ల పార్టీ(టీడీపీ) చరిత్రనేనని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన ద్రోహి అని మంత్రి ధ్వజమెత్తారు. క రెంట్ నీళ్ళు, ఉద్యోగాలు, మత్స్య కార్మికులు, గొర్ల పెంపకదార్లకు అండగా ఉన్నందుకు కేసీఆర్‌కు పిండం పెడతావా అని రేవంత్‌ను నిలదీశారు. రేవంత్ కేవలం కేసీఆర్‌కు మాత్రమే కాదని, తెలంగాణ ప్రజలకు పిండం పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ అభివృద్ది ఏంటో, ఏం చేస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నువ్వు, నీ బాస్(చంద్రబాబు) చేసిన కుట్రల నుంచి బయట పడి, చావు అంచుల దాకా వెళ్లి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ అభివృద్ధి చేస్తూ, దేశంలోనే నంబర్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. మీ వల్ల దెబ్బ తిన్న ప్రజలను కాపాడింది కేసీఆర్. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి మాటలా మాట్లాడేది?. పైసలు పెట్టీ తెచ్చుకున్న పదవిలో కూర్చొని అహంతో మాట్లాడుతున్నావు. ఎక్కువ ఊహాలోకి వెళ్ళకు రేవంత్. వచ్చే రోజుల్లో ప్రజల నుంచి భంగం తప్పదు. సోయి లేకుండా మాట్లాడకు. ఎవరి కోసం త్యాగం చేసి వచ్చావు. రూ.50 లక్షలతో దొరికి చంద్రబాబును ఖతం చేశావు. కరెంట్ విషయంలో మాట్లాడి కాంగ్రెస్‌ను ఖతం చేశావు. చంద్రబాబును, టీడీపీని తెలంగాణలో ఖతం చేసింది నువ్వే కదా’ అని రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
‘నాగార్జునసాగర్ కూడా కేసీఆరే కట్టించాడా?’
సాక్షి, నల్లగొండ: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సోమవారం గుర్రంపోడులో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాలన్న మంత్రి జగదీశ్ కామెంట్లపై భట్టి స్పందించారు. తెలంగాణ కోసం పోరాడిందే.. జలాల కోసం. అలాంటిది అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు కావస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నిస్తే ముక్కు నేలకు రాయాలంటూ విమర్శలు చేసిన మీరు నీళ్లు ఇవ్వకుండా గాడిదలు కాస్తున్నారా?. ఎస్ఎల్బీసీ పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరు?. నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. దీనిపై చర్చించేందుకు నేను సిద్ధం. పది సంవత్సరాలుగా డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయనందుకు చిత్తశుద్ధి ఉంటే సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాలని భట్టి అన్నారు. జిల్లాలో ఏ చిన్న పిల్లాడిని అడిగిన నాగార్జునసాగర్ కట్టింది, కాలువలు తవ్వింది కాంగ్రెస్ అని చెప్తారు. నాగార్జునసాగర్ కూడా కేసీఆర్ కట్టాడన్న భ్రమలో జిల్లా మంత్రి(జగదీష్ రెడ్డిని ఉద్దేశించి..) ఉన్నాడు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా జగదీష్ రెడ్డి ఉండడం దురదృష్టకరం. నాగార్జునసాగర్ నిర్మాణం చేసినందుకా? పార్లమెంట్లో మెజార్టీ లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకా? ఢిల్లీ వరకు ముక్కు రాయాలి?. భూస్వామ్య గడీల మనస్తత్వం ఉన్నవారే ముక్కు నేలకు రాయమంటారు. జగదీష్ రెడ్డి మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా? కేసీఆర్ కు భజన చేస్తూ భూస్వామ్య, ఫ్యూడలిజం సమాజంలో ఉన్నారా?. కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీష్ రెడ్డిలా ఇసుక దందా, భూదందా చేయలేదు. పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే సుఖేందర్ రెడ్డి గారు మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా?. ఏ మాన్యువల్ లేని విధంగా ఎమ్మెల్యేలకు కూడా పైలట్ వాహనాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు కేసీఆర్ ని నిధులు ధైర్యం గుత్తా, జగదీష్ రెడ్డిలకులేదు. వారే రెండు చేతులు జోడించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత జిల్లా మంత్రికి లేదు. యాదాద్రి పవర్ ప్లాంటు త్వరితగరితన పూర్తి చేయకుండా జిల్లా మంత్రి గాడిదలు కాస్తుండా?. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టింది?. ఏ పవర్ ప్రాజెక్టుల నుంచి కరెంటు ఇస్తున్నారు?. ఏ పవర్ ప్రాజెక్టు కట్టి విద్యుత్ ఇస్తున్నారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలి అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదీ చదవండి: గవర్నర్-కేసీఆర్.. ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. సీఎం రాజ్‌భవన్‌కు ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం అని మంత్రి తెలిపారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయాలు మాని.. తన పని తాను చేసుకోవాలని హితవు పలికారు. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదా.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు వరంగల్: గవర్నర్ తమిళిసై బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయని అన్నారు. హుందాగా ప్రవర్తించాలని గవర్నర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, ఆ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు. కాగా గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్ భవన్ లో తమిళిసై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఎవరూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె వ్యాఖ్యనించారు. -
గులాబీ నేతలకు కామన్ సెన్స్ లేదు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు. బీసీ అనే కాకుండా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్‌తోనే టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఎవరికి టికెట్ వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తాన్నారు.మునుగోడుఎన్నికపై దేశం మొత్తం చర్చ జరగుతోందని, సర్వేలపరంగా టీఆర్ఎసే గెలుస్తుందని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖ చిత్రం మీదే ఈ ఎన్నిక ఉండబోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో లాభియింగ్ నడవదని, ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయని వెల్లడించారు. 'మునుగోడు పేరులొనే గోడు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మునుగోడును కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మునుగోడు కు జూనియర్ కళాశాల లేదు. గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఎవరు చెప్పిన చెప్పకున్నా ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే పని చేస్తా' అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చదవండి: ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల -
దొంగలకు ఆశ్రయం కల్పిస్తున్న బీజేపీ
మునుగోడు: దేశంలోని పేద ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని దొంగల్ని, అక్రమ సంపాదనాపరుల్ని కాపాడేందుకు పార్టీలో ఆశ్రయం కల్పిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పంటల సాగుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే దానిని అడ్డుకునే కుట్రలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, కేవలం ఆయన ఆస్తులు పెంచుకునేందుకే రూ. 21వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల్ని తెచ్చుకుని అమ్ముడుపో యారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి కొన్ని వందలసార్లు సీఎం కేసీఆర్ చుట్టూ తిరిగి టీఆర్ఎస్లో చేరతానని బతిమిలాడినా చేర్చుకోలేదన్నారు. 20న మునుగోడులో సభ: ఈ నెల 20న మునుగోడులో మండల కేంద్రంలో ప్రజా తీర్పు సభ నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి? -
లాక్డౌన్: విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పేరిట పోలీసులు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్డౌన్లో భాగంగా పోలీసులు విద్యుత్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో శనివారం విద్యుత్ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు. విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. చదవండి: లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి! -
కొందరికి లాభం..కొందరికి నష్టం
సాక్షి, హైదరాబాద్: స్వల్ప తేడాతో శ్లాబులు మారిపోయి చాలామంది వినియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా జూన్ నెలలో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోయాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి ఈ అంశం పై వివరణ ఇచ్చారు. మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కాలేదని, దీంతో గత మూడు నెలల విద్యుత్ వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్‌ను ఈ నెలలో ఒకేసారి తీసి సగటున ఒక్కో నెల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేశామని తెలిపారు. సోమవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్వల్పంగా కొన్ని పాయింట్ల తేడాతో అనేకమంది వినియోగదారులకు సంబంధించిన శ్లాబులు మారిపోయింది వాస్తవమే అని అంగీకరించారు. దీంతో కొంత మంది వినియోగదారులు లాభపడ్డారని, కొందరు నష్టపోయారని అన్నారు. వేసవిలో విద్యుత్‌ను ఎక్కువగా వాడడం వల్లే చాలా మందికి బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎమ్మెల్యేలు సైతం తమకు బిల్లులు ఎక్కువ వచ్చాయంటూ ఫిర్యాదు చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఏవైనా సాంకేతిక లోపాల వల్ల ఎవరికైనా అధికంగా బిల్లులు వస్తే వాటిని సరిదిద్దుతామన్నారు. గత మూడు నెలలకు సంబంధించిన బిల్లుల బకాయిలను వచ్చే మూడు నెలలపాటు వాయిదాల్లో 1.5 శాతం వడ్డీతో చెల్లించేందుకు అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. -
క్షమించండి.. పోటీ చేయలేను : సునీత
సాక్షి, సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత ‘సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కావాలి’ అంటూ వచ్చిన కరపత్రాలు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె చైర్పర్సన్ అయితే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందంటూ ఆ పార్టీ జిల్లా నాయకులు పోలా రాధాకృష్ణ పేరుతో ఈ కరపత్రాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఈ కరపత్రాల విషయం ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి నిజంగానే ఆమెను చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపుతారా..? అని టీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చర్చ జరిగింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జగదీశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేశారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం, విద్యావంతురాలు కావడంతో ఆమె మున్సిపల్ బరిలోకి దిగుతారా..?’ అని పార్టీ ముఖ్య నేతలు కూడా గుసగుసలాడారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళా కావడంతో మంత్రి ఆమెను బరిలోకి దింపితే స్వాగతిస్తామని కొందరు నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ కోరికను మన్నించలేక పోతున్న... శనివారం నామినేషన్లకు చివరి రోజున సునీత స్పందించారు. పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సూర్యాపేట పట్టణ ప్రజలకు నమస్కారం. గత కొద్దిరోజులుగా నన్ను సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికలలో పోటీ చేయాలని చాలా మంది అభిమానులు కోరుతున్నారు. కానీ మా పిల్లల చదువు బాధ్యతల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చెయ్యడానికి సిద్ధంగా లేను. 2014,2018 శాసనసభ ఎన్నికలలో నా భర్త గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో నన్ను ఆదరించి వారిని గెలిపించిన మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న యస్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాను. నాపై అభిమానం చూపించి నన్ను ఆహ్వానించిన మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ కోరికను మన్నించలేక పోయినందుకు క్షమించాల్సిందిగా విజ్ణప్తి చేస్తున్నాను.’ అని ప్రకటన విడుదల చేశారు. -
30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
సాక్షి, సూర్యాపేట: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన హాజరై మాట్లాడారు. మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ ఒక గడువు పెట్టకుండా ఏ పనులు కూడా కావడం లేదని తెలిసి ఈ కార్యక్రమానికి 30రోజుల ప్రణాళికగా డెడ్‌లైన్ పెట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, డ్రెయినేజీల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలన్నారు. 14ఏళ్లు ఉద్యమంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబవర్‌వన్‌గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయని విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం సీఎం ఆకాంక్ష.. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామాభివృద్ధి చేయడంలో ప్రజలను మమేకం చేయాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఈ 30రోజుల ప్రణాళికలో భాగస్వాముడు కావాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. వీలున్న చోట్ల మొక్కలు నాటి పచ్చధనం ఉండేలా చూడాలన్నారు. గ్రామాలకు గతం కంటే మెరుగ్గా నిధులు.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రమంత ఒకేసారి చేస్తే విజయవంతమవుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారని, గ్రామాలకు గతం కంటే నిధులు మెరుగ్గా ఉంటాయన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ నడుం బిగించి 30రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుల్లో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీఆర్ఓ చంద్రయ్య, ఆర్డీఓ మోహన్‌రావు, అర్వపల్లి జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు సాగర్ గేట్లు ఎత్తనున్న ఇరు రాష్ట్రాల మంత్రులు
సాక్షి, నాగార్జునసాగర్ : రెండు రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డితో కలిసి సంయుక్తంగా సాగర్ కుడి, ఎడమ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎంఆర్ కాలువల ద్వారా మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మంత్రి జగదీష్ నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు -
మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనుకోని కల!
సాక్షి, సుర్యాపేట: సూర్యాపేట జిల్లా చరిత్రలో నవశకానికి అడుగులు పడబోతున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటు ఊహకందని కల అని, కళ్ల ఎదుటే సాక్షాత్కరించబోతుందని స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో సూర్యాపేట చరిత్రలోనే నవశకానికి నాంది పడింది అన్నారు. అభివృద్ధిలో జిల్లా ముందు ఉందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్ రావడంతో ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. అంతేకాక కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి చేసిన సేవలు మరువలేమన్నారు. కళాశాల అభివృద్ధి కి ఉన్న అడ్డంకులను అన్ని అధిగమించి కళాశాల ఏర్పాటు చేసుకొవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన తీర్చడానికి నేను ఉన్నానంటూ విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. సూర్యపేట మెడికల్ కళాశాలో చదువుకున్న విధార్ధులు దేశ వ్యాప్తంగా పేరు తీసుకురావాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తుడటంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఆశయం వెరసి ఏర్పడిన మెడికల్ కళాశాలలో శ్రావణ శుక్రవారం తొలిఘడియాలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కాబోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాల పునర్విభజన లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు పరచడమే కాకుండా అదనంగా కొత్త జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని పేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో సాక్షాత్కరించబోతుంది. సుమారు 500 కోట్ల అంచనా వ్యయంతో పేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నఅంశాన్ని గుర్తించిన మంత్రి జగదీష్ రెడ్డి మినరల్ ఫండ్‌తో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెడికల్ కళాశాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేసిన విషయం విదితమే.ఇచ్చిన హామీని అతి తక్కువ కాలంలో ఆచరణలోకి తేవడమే కాకుండా కళాశాలను ప్రారంభిస్తున్న శుభవేళ సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొంది. -
పేలుతున్న మాటల తూటాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు, ఇతర నేతలు ఒకటి.. రెండంటూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చివరకు రాజకీయ విమర్శలు కాస్త.. వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శల దాడిని మొదలు పెట్టారు. ఈ విమర్శలకు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలుత ప్రతి విమర్శకు పోకుండా ఒకింత సంయమనం పాటించారు. కాంగ్రెస్‌నుంచి వ్యక్తిగత విమర్శల దాడి పెరగడంతో వేమిరెడ్డి కూడా ప్రతివిమర్శలకు తెరలేపారు. మరోవైపు జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై, ప్రధానంగా అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలపై ఘాటైన విమర్శలే చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం మంత్రి జగదీశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. దీం తో ఆయన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ‘వేమిరెడ్డి’పై మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది. ‘అభ్యర్థులకు ముఖం చెల్లకే .. కేసీఆర్‌ను చూ సి ఓట్లేయమని అడుగుతున్నారు. కేసీఆర్ డమ్మీలకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి తెలగాణ ప్రజ లను అవమాన పరుస్తున్నారు. రా ష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాల ని టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఇది కేసీ ఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం..’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రచారంలో తీవ్రస్థాయిలోనే టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. ఉత్తమ్ చేస్తున్న విమర్శలను అటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తిప్పికొడుతున్నారు. ‘ఉత్తమ్‌కు ఓటమి భయం పట్టుకుంది. నాపై మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. నేను దేనికైనా సిద్ధం.. నిరూపించలేక పోతే ఉత్తమ్ ముక్కు నేలకు రాస్తాడా...’ అని వేమిరెడ్డి సవాల్ చేశారు. మరో వైపు మంత్రి జగదీశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్ధిపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ‘కాంగ్రెస్ నాయకుల మధ్య వారికి వారికే సమన్వయం లేదు. ఉత్తమ్ నాయకత్వంపై ఆ పార్టీ వారికే నమ్మ కం లేదు. అందుకే ఎమ్మెల్యేలు టీఆ ర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆయన నా యకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం.. ఏప్రిల్ 11తో కాంగ్రెస్ శని విరగడవుతుంది..’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రక్తి కడుతోంది. ‘ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. మంత్రిగా చేసినప్పుడు హౌసింగ్‌లో అవినీతికి పాల్పడ్డాడు. అది త్వరలోనే రుజువు అవుతుంది. కారులో నోట్ల కట్టలు తగలబెట్టుకుంది ఆయన కాదా..? నిన్న కూడా ఆయనకు సంబంధించిన డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి.’ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ‘ఉత్తమ్ .. ఉత్తర కుమారుడు. ఎంపీగా గెలుస్తానని నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలంటే పారిపోతుండు. ఉత్తమ్ నాయకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఆయన తన ఓటమిని ముందే అంగీకరించాడు.’ – జి.జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ‘టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన డమ్మీ అభ్యర్థి. అలాంటి వ్యక్తి పార్లమెంటులో ఎలా మాట్లాడుతారు? రూ.100కోట్లు తీసుకుని టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది..’ – ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి -
‘ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే’
నల్గొండ: తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా అంతిమ విజయం టీఆర్ఎస్దేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఈ నెల 16న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే పార్లమెంటు స్థాయి సన్నాహక సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, ఆయన మార్క్ పాలన దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాక్యానించారు. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఢిల్లీలో శక్తిగా మారుతుందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలతో యువతలో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొన్నదని చెప్పారు. గులాబీ కార్యకర్తలను సైనికుల్లాగా కేటీఆర్ తయారు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం గులాబీ పార్టీ గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ వందేళ్లు నిలిచి, గెలిచేలా సీఎం కేసీఆర్ పునాదులు వేస్తున్నారని పొగిడారు. పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారని కొనియాడారు. -
పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట: లింగా ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి ఆలయం మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వేడుకలు మొదలయ్యాయి. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో దేవరపెట్టెకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదవులు ఈ పెట్టెను కాలినడక పెద్దగట్టుకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. -
విధేయతకు పట్టం
సీఎం కేసీఆర్ విధేయతకు పట్టం కట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం చేశారు. సీఎం నేరుగా జగదీశ్‌రెడ్డికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మిగతా మంత్రులతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన రెండో సారి మంత్రి పదవి చేపడుతున్నారు. సాక్షిప్రతినిధి, సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా జగదీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన తర్వాత అధికారుల నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక్కడికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో పార్టీతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే పై చేయి అయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా ఉమ్మడి జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. సీఎం జిల్లాకు ఎప్పుడు వచ్చినా జగదీశ్‌రెడ్డి ముందుండి కార్యక్రమాలు నడిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మది స్థానాల్లో ఆపార్టీ విజయఢంకా మోగించడం, సూర్యాపేట నుంచి జగదీశ్‌రెడ్డి విజయంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. నేతలు, పార్టీ శ్రేణుల ప్రచారాన్ని వాస్తవం చేస్తూ సీఎం మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరగణం ఆనందంలో మునిగింది. ఉద్యమం నుంచి గులాబీ బాస్ వెన్నంటే.. ఉద్యమం నుంచి జగదీశ్‌రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుల్లో ఒకడిగా ఉండడంతో తొలి నుంచి కేసీఆర్ ఆయనకు గుర్తింపునిచ్చారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరించారు. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పని చేశారు. విద్యుత్ శాఖ ఆయనకు అప్పగించిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా దామరచర్ల, పాల్వంచ, మణుగూరులో నూతనంగా విద్యుత్ ప్లాంట్లు మంజూరయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో ప్రభుత్వం సాధించిన ఘనతలో జగదీశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందాయి. ఇలా అన్నింటా కేసీఆర్‌కు అనుంగు నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. ప్రమాణస్వీకారానికి తరలుతున్న నేతలు.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో జరగనుంది. అయితే జగదీశ్‌రెడ్డికి సీఎం నుంచి మంత్రి పదవిపై ఫోన్ రావడంతో జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ఆయన వెంటే ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయనను అభినందించడానికి జిల్లా నుంచి తరలివెళ్తున్నారు. జగదీశ్‌రెడ్డి బయోడేటా పేరు : గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి : చంద్రారెడ్డి తల్లి : సావిత్రమ్మ భార్య : సునీత కుమారుడు : వేమన్‌రెడ్డి కూతురు : లహరి పుట్టినతేదీ : 18.07.1965 స్వగ్రామం : నాగారం (నాగారం మండలం) విద్యార్హత : బీఏ, బీఎల్ 27.04.2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యులు 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి 2002 మహబూబ్‌నగర్ పాదయాత్ర ఇన్చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు..) 2003 మెదక్ ఉప ఎన్నికల ఇన్చార్జి 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి (హరీష్‌రావు ఎన్నిక) 2005 సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల ఇన్చార్జి 2008 ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్చార్జి, మెదక్ జిల్లా ఇన్చార్జి 2009లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ 2013లో నల్లగొండ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి 2014లో సూర్యాపేట నుంచి పోటీ .. విజయం తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి ఆతర్వాత విద్యుత్‌శాఖ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి 2108 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు.. సూర్యాపేట నుంచి విజయం -
అయోమయంలో ప్రతిపక్షాలు
ఆత్మకూర్ –ఎస్ (సూర్యాపేట) : టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. వారికి ఏం హామీలు ఇవ్వాలో తెలియక ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మండల పరిధిలోని పాతర్లపహాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద దాదాపు 70 హోలియ దాసరి కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధిని చూసి వివిధ వర్గాలు టీఆర్ఎస్లో చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్నాయకులు ఇచ్చే హామీలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాకి కృపాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బెల్లంకొండ యాదగిరి, మర్ల చంద్రారెడ్డి, ఆరెంపుల దానియేల్, గోపగాని సత్యం, తూడి నర్సింహారావు, కసగాని బ్రహ్మం, లింగయ్య, ముత్తయ్య, వెంకటయ్య, వీరయ్య, దానబోయిన సాయిల్, రావుల శ్రీనివాస్, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
గుంటకండ్ల జగదీష్ రెడ్డి - లీడర్
-
కేసీఆర్ సభతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
నల్లగొండ రూరల్ : కేసీఆర్ సభతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆపద్ధర్మ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు . మంగళవారం మర్రిగూడ బైపాస్‌లోని సీఎం సభాస్థలి ఏర్పాట్లను మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీప నియోజక వర్గాలనుంచి 50 వేల మందిని తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి 4 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం సభతో జిల్లాలో 12 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు. సీఎం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సభలో సీఎం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తారన్నారు. కాంగ్రెస్‌లో రౌడీ , గుండా నాయకులు ఉన్నారని ప్రజలను గౌరవిం చి మాట్లాడే విధానం వారికి తెలియదని ఆయన విమర్శించారు. హెలీపాడ్ ట్రయల్ రన్.. నల్లగొండలో జరిగే సీఎం సభకు హెలిపాడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 4న సీఎం నల్లగొండలో నిర్వహిస్తున్న ఆశీర్వాద సభకు వస్తుండడంతో హెలిప్యాడ్‌ను ట్రయల్ రన్‌ను ప్రత్యేక అధికారులు పరిశీలించారు. టీఆర్ఎస్లో పలువురి చేరిక కనగల్ : మండలంలోని లింగాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ లో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో టీ æఆర్ఎస్ వందకుపైగా ఎమ్మెల్యే స్థానాలను గెల ు స్తుందన్నారు.ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓర్సు మారయ్య, సైదులు, నాగయ్య, మైసయ్య, వెం కన్న, పరశురాం, రాజు, లింగయ్య, వెంటయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మేమేంటో.. సభే చెబుతుంది
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ‘ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని.. చెప్పేలా ఈ నెల 4న నల్లగొండ జిల్లాకేంద్రంలో సభ నిర్వహిస్తున్నాం.. గతంలో ఏ పార్టీ చేయనట్లుగా ఈ సభ అద్భుతంగా ఉండబోతోంది. ప్రజలు ద్విచక్ర వాహనాలు, పాదయాత్రలతో స్వచ్ఛందంగా.. ఉత్సాహంగా సభకు తరలేందుకు సన్నద్ధమవుతున్నారు. మూడున్నర లక్షల మంది ఈ సభకు హాజరుకాబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ఏం చెబుతారో వినేందుకు ప్రజలు తరలుతున్నారు. మాయకూటమికి ఉమ్మడి జిల్లాలో ఓటు అడిగేందుకు.. ఒక్క అంశంపైనా అర్హత లేదు. ఉమ్మడి జిల్లాలో మేమేంటో సభే చెబుతుంది’ అని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో నిర్వహించబోతున్న ఆ పార్టీ సభ, అభ్యర్థుల విజయావకాశాలు, ఉమ్మడి జిల్లాకు చేసిన అభివృద్ధిపై సోమవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే.. టీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉంది.. రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉంది. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అక్షరాన్ని అమలుచేశాం. ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఉమ్మడి జిల్లాలో ప్రతి కేటగిరీ లబ్ధి పొందింది. టీఆర్ఎస్ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం.. రైతులకు రైతుబంధు, ప్రమాదబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచాం. గ్రామీణవృత్తులకు జీవం పోసింది.. ఈ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలకాపరులకు గొర్రెలు, మత్స్య కార్మికుల కోసం చేపల పంపిణీ చేపట్టి వారి ఆదాయాన్ని పెంచాం. ఇలా వంద కారణాలు ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి ఉన్నాయి. మాయకూటమిలోని పార్టీల పాలనలో భూములకు నీళ్లందాయా.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల కాలంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర్‌లో డెడ్‌స్టోరేజీ నీళ్లు ఉన్నా.. సాగుకు నీళ్లిచ్చాం. రాజవరం, ముదిమాణిక్యం, జానపహాడ్ లాంటి టెయిలాండ్ భూములకు ఇప్పుడు నీళ్లందాయి. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఏనాడైనా సాగునీళ్ల కోసం తమ ప్రభుత్వాల్లో ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే తమ మంత్రి పదవులు ఎక్కడ ఊడిపోతాయోనని మిన్నకుండా ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావాల్సిన కరెంటు, నీళ్లను ఇవ్వొద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశాడు. ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో సాగర్, శ్రీశైలం నీటి విడుదలపై పేచీ పెట్టింది టీడీపీ కాదా. 12 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం.. జిల్లాలో 12 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతుంది. నాలుగైదుసార్లు మంత్రులుగా పనిచేసిన వారి ఇలాఖాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడబోతోంది. ఉమ్మడి జిల్లాలో పాలమూరు, డిండి, శివన్నగూడెం, ఎస్సారెస్పీ జలాలు, నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కళాశాలలు, ఏయిమ్స్, యాదాద్రి పవర్‌ప్లాంటు, యాదాద్రి దేవాలయం ఇలా అభివృద్ధి ఆకాశాన్ని తగిలింది. ప్రజలు ఈ అభివృద్ధిని చూసే 12 స్థానాల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్నారు. ఫ్లోరోసిస్ భూతాన్ని ఉమ్మడిజిల్లాలో తరిమికొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. రక్షిత మంచినీటిని అందించేందుకు పెట్టిన మిషన్‌భగీరథ పథకం సక్సెస్ అవుతోంది. మరోవైపు 28 ఏళ్లలో ఏనాడు నాటి పాలకులు మూసీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీటిని అందించలేదు. కాకతీయులు, అసఫ్జాహీలా కాలంలో తవ్విన కాలువలు ధ్వంసమైతే తమ ప్రభుత్వమే ఆధునికీకరించింది. తొలిసారి ఖరీఫ్, రబీ పంటలకు వరుసగా.. నీళ్లు ఇచ్చింది తమ ప్రభుత్వమే. అసమ్మతులు సమసిపోతున్నాయ్.. ప్రజాభిమానం ఉన్న పార్టీలో టిక్కెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా పోటీ పడడం అన్నది సహజం. జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో అసమ్మతులు సమసిపోతున్నాయ్. అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అందరం కలిసి కృషి చేస్తున్నాం. ఈనెల 4న జరిగే సభతో మా సత్తా ఏంటో ఉమ్మడి జిల్లాలో తేలిపోతుంది. జిల్లాలో మాకేదో ఉందని.. బీరాలు పలుకుతున్న నేతల కళ్లు సభను చూసి బైర్లు కమ్ముతాయి. 59 మండలాలకు వెళ్లా.. ఉమ్మడి జిల్లాలో 59 మండలాల్లో 400 గ్రామాలకు వెళ్లా. ఈ గ్రామాల్లో శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశా. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏ మంత్రి కూడా అన్ని మండలాలకు వెళ్లి ఇన్ని గ్రామాలను సందర్శిం చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి మంత్రివర్గానికి చేసిన సూచనలతో ప్రజల వద్దకు పాలన అంటూ గ్రామాలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో గడిపాం. వాళ్లకు ఏం కావాలో ఇచ్చాం. వాళ్లడగనివి సైతం అమలుచేశాం. ఇదే మా గెలుపునకు గీటురాయి.