జిల్లాను హరితవనంగా మార్చాలి | district must haritavananga | Sakshi
Sakshi News home page

జిల్లాను హరితవనంగా మార్చాలి

Published Sun, Jul 5 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

district must haritavananga

 బొల్లేపల్లి(భువనగిరి అర్బన్)  
  హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంతగండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని బొల్లేపల్లి గ్రా మంలో గల ప్రథమిక ఆరోగ్య కేం ద్రంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు, భు వనగిరి, ఆలేరు ప్రాంతాల్లో  అడవులు, చెట్లు లేకపోవడంతో  కరువు ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉం దన్నారు.
 
 ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న విధంగా మొక్కలను పెంచితే వర్షాలు కురుస్తాయన్నారు. మొక్కలను నాటడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రా మంలో లక్ష నుంచి రెండు లక్షల  మొ క్కలను పెంచాలన్నారు. రెండు రోజుల్లో 10 లక్షల మొక్కలను నాటామని, ఆదివారం సుమారు 5 లక్షల మొక్కలను నాటినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల 80 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
 
   కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి,  వేముల విరేశం, కుసుకుంట్ల ప్రభాకర్, జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ ఎన్. మధుసూదన్, డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డి, ఎంపీపీ తోట కూర వెంకటేష్‌యాదవ్, జెడ్పీటీసీ సందెల సుధాకర్, వైఎస్ ఎంపీపీ ఎం. శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం. సరస్వతి,  గ్రామ సర్పంచ్ గోద శ్రీనివాస్‌గౌడ్, అబ్బగాని వెంకట్‌గౌడ్, జీలుగు సతీష్‌పవన్, ఎంపీటీసీ జిన్న మల్లేష్, చింతల శ్రీనివాస్,  టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, పట్టణ, మండల అధ్యక్షులు కె.అమరేందర్, మారగోని రాముగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ ఎండ్ల సత్తిరెడ్డి, నాయకులు జనగాం పాండు, చిన్న శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఆస్పత్రి వైద్యులు పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement