
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు.
సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన.
మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
Comments
Please login to add a commentAdd a comment