TS Assembly: అసెంబ్లీలో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ ఫైర్‌ | Telangana Assembly Budget Session 2025 March 15th Live Updates, Top News Headlines And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Telangana Assembly 2025 Updates: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. డే3 అప్‌డేట్స్‌

Published Sat, Mar 15 2025 9:57 AM | Last Updated on Sat, Mar 15 2025 12:49 PM

Telangana Assembly Budget Session 2025 March 15th Updates

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజు కూడా హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్‌ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్‌ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

  • రుణమాఫీ చరిత్రలో మిగిలిపోయే అంశం.
  • ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేశాం.
  • క్వింటాల్ కి 10 కిలోల తరుగు పేరిట కోట్లు కొల్లగోట్టారు.
  • తరుగు తీస్తే.. తొలు తీస్తాం అని మేము చెప్పాం.
  • కృష్ణ బేసిన్‌లో 299 టీఎంసీ లు చాలు అని సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్.. ఇది నిజం కదా..?
  • వైఎస్సార్  ఆశీర్వాదంతో కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు.
  • అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడ్డుకుంటే పోతురెడ్డి పాడు పెద్దది అయ్యేదా..?
  • కేసీఆర్ ఏడాది నుంచి 55 లక్షల జీతం జీతం తీసుకొని.. సభకు వచ్చింది రెండు రోజులు మాత్రమే.

సీఎం రేవంత్‌ ప్రసంగం

  • రైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్‌

  • సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చాం

  • గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం చేసింది

  • మార్చి 31వ తేదీ నాటికి రైతులందరినీ భరోసా అందిస్తాం

  • అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం

  • రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాం

  • వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్‌ అన్నారు

  • గతంలో ఎక్కడ పంట పండినా.. కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు 

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

  • కేబినెట్ విధానాలనే గవర్నర్ ప్రసంగిస్తారు.. 
  • మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం 
  • ఈ మాత్రం అవగాహన లేకుండా మంత్రులుగా ఎలా చేశారో తెలియడం లేదు 
  • ఇష్టారీతిలో మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతే.. భవిష్యత్‌లో కూడా బీఆర్‌ఎస్‌కు సున్నానే వస్తది

 

బీఆర్‌ఎస్‌ బాయ్‌కాట్‌

  • మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ నిరసన
  • రేవంత్‌ ప్రసంగం కొనసాగుతున్న వేళ సభ నుంచి బాయ్‌కాట్‌
     

గవర్నర్‌ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం 

  • 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది 
  • ఆ తర్వాత కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగం చేర్చారు
  • ఓ గవర్నర్‌ అందునా మహిళా గవర్నర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హేళన చేసింది 
  • మేము రాజ్యంగబద్ద వ్యవస్థ కు గౌరవం ఇస్తాం
  • గవర్నర్‌ ప్రసంగం.. గాంధీ భవన్‌ ప్రసంగంలా ఉందని కొందరు హేళన  చేస్తున్నారు
  • అజ్ణానమే కొందరు విజ్ణానం గా భావిస్తున్నారు. 

శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి..

  • కృష్ణ బేసిన్ ప్రాజెక్టుల్లో తెలిమెట్రీలను పెట్టిస్తాం 

  • గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయింది 

  • కృష్ణ జలాలు అక్రమంగా తరలిపోవడానికి గత ప్రభుత్వం సహకారం ఉంది. 

  • కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటా కోసం మేము పోరాటం చేస్తాం

బకాయిల పాపం ఎవరిది?: మంత్రి శ్రీధర్‌‌ బాబు

  • బకాయిలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి?
  • పేరుకుపోయిన బకాయిలను 14 నెలల నుంచి చెల్లిస్తున్నాం
  • ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దు
  • బకాయిలంతా మీరు అధికారంలో ఉన్న సమయంలోవే
  • మీరు పెండింగ్లో ఉంచిన బకాయిలను మేమే అధికారంలోకి వచ్చాక చెల్లించాము
  • పళ్ల రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి
  • మీ ఇంజనీరింగ్ కాలేజ్‌లకు దీటుగా.. మేము మా ప్రభుత్వ కాలేజ్‌లను ముందుకు తీసుకవెళ్ళతాము

ఇంత బ్లైండ్‌గా మాట్లాడుతారనుకోలేదు: భట్టి

  • మేం పనులు చేశాం.. మీలా ప్రచారాలు చేసుకోవడంలేదు
  • ఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలోపు రుణమాఫీ చేశాం
  • అన్ని గ్రామాల్లో ఆ జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం
  • పల్లా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాస్తవాలు చెబుతారని అనుకున్నాం.
  • కానీ, ఇంతబ్లైండ్‌గా మాట్లాతారనుకోలేదు
  • బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారు
  • బీఆర్‌ఎస్‌ పాలనలో డ్రాపౌట్స్‌ ఎందుకు పెరిగాయి?
  • 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడులు మానేశారు?
  • మేం యూనివర్సిటీలను ధారదత్తం చేసి విద్యను అమ్ముకోలేదు
  • టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ఎవరు ఇచ్చారు?
  • ఇంకా 5, 6 మంది టీచర్లను రిక్రూట్‌ చేసుకుంటాం
  • ఒక్కసారైనా ఐటీఐల గురించి పట్టించుకున్నారా?. మేం అధికారంలోకి రాగానే వాటిని స్కిల్‌ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించాం. మీలాగా గాలికి వదిలేయలేదు
  • అన్ని వర్సిటీలకు వీసీలను నియమించాం
  • చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వెళ్లి ఎప్పుడైనా చూశారా?
  • వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించిన ఘనత రేవంత్‌రెడ్డిదే
  • సీఎం ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోండి
  • మీరు చూసిన సీఎంలాగా ఇప్పటి సీఎం  చేయరు

     


  •  ప్రభుత్వానికి BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్
  • జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి.
  • సీఎం, డిప్యూటీ సీఎం ఏ గ్రమానికైనా రచ్చి వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలి.
  • ఏ గ్రామంలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!
  • ఆ గ్రామంలోనే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా.
  • జనగామనే కాదు డిప్యూటీ సీఎం మధిర అయినా పర్లేదు.
  • వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి..

  • రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదనడం సరికాదు
  • అధికారంలో వచ్చిన మూడు నెలలోనే రుణమాఫీ చేశాం
  • సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్ధిపేట నియోజకవర్గాలకు ఆ నేతలు చేసిన దానికంటే.. మేం చేసిన మేలు ఎక్కువ
  • ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తాం
  • ప్రతీ పథకాలను లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధం
  • అధికారంలో ఉన్నన్నాళ్లూ మీరు ప్రచారాలు చేసుకున్నారు
  • మేం అన్నీ చేసుకుంటూ పోతున్నాం.. కానీ, ప్రచారం చేసుకోవడం లేదు
  • కావాలంటే.. శాసన సభ ప్రాంగణంలో రైతు బంధు, రైతు భరోసా లిస్టులు అంటిస్తాం
  • 115 నియోజకవర్గాలకు సంబంధించి.. గృహజ్యోతితో పాటు అన్ని పథకాల సమాచారం మా దగ్గర ఉంది
  • మేం పని చేసేది ప్రజల కోసం మీలాంటి రాజకీయ పార్టీల కోసం కాదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  ప్రశాంత్‌ రెడ్డి

  • ముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు.. డిప్యూటీ సీఎం చెబుతున్నారు
  • డిప్యూటీ సీఎం ఎలాగైనా సీఎంకు రావాల్సిన క్రెడిట్‌ కొట్టేసి.. ప్రమోషన్‌ పొందాలని చూస్తున్నారు
  • మేం అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి
  • మా ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేశాం
  • రైతు భరోసా ఎంత మందికి  ఇచ్చారు?
  • ఎంత మందికి ఇచ్చారో కాదు.. ఇంకా ఎంతమందికి ఇవ్వలేదో ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా?
  • అధికారంలోకి వచ్చి 15నెలలు అయ్యింది.. ఇంకెతం కాలం పడి ఏడుస్తారు?
  • వరికి రూ.500 బోనస్‌ ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు?

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

  • ఉమ్మడి నల్గొండ జిల్లా లో మెజార్టీ రైతులకు రుణమాఫీ అయ్యింది.. రైతు భరోసా ఇచ్చాము.
  • మీ ప్రభుత్వo లో లక్ష రూపాయల రుణమాఫీ  నాలుగు ఇన్స్టాల్ మెంట్ చేశారు...మేము 2లక్షలు ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..
  • దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా మేము ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..
  • మేము రుణమాఫీ చేస్తే మీరు ఓర్వలేక పోతున్నారు..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • రేపు సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ వస్తున్నారు.
  • దేవాదుల ఆన్ చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలి.
  • ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయి.
  • రేపు సీఎం పంటనష్టం పై రైతులకు నిదులు ఇవ్వాలి.

అంతకుముందు.. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ అంశం పునఃసమీక్షించాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు. ఇక ఇవాళ గవర్నర్‌ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించే అవకాశంఘుంది. అలాగే ఇవాళ కీలకమైన యూనివర్సిటీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది. విభజన చట్టం 10 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడం, తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్లు లాంటి అంశాలను ఈబిల్లులో పొందుపరిచారు.

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం
ఇవాళ అసెంబ్లీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్లు చేశారు. లాబీలో శ్రీధర్ బాబు ఛాంబర్ ముందు ఈ ఇద్దరు మంత్రులలు ఎదురు పడ్డారు. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందని కోమటిరెడ్డి అనగా.. అసెంబ్లీ సిబ్బంది, అధికారులు నవ్వుకున్నారు. వెంకన్న నాపై అభిమానంతో అలా అంటారు..ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దని శ్రీధర్ బాబు అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement