
హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ HCU భూములపై లోన్ తీసుకరావడానికి 170 కోట్లు కమీషన్ ఇచ్చారు. నిన్న కాక మొన్న కూడా 2వేల బాండ్స్ ద్వారా లోన్స్ తెచ్చారు.
మధ్యలో ఓ కంపెనీ వచ్చి వాల్యుయేషన్ ఎకరాకు రూ. 74 కోట్ల నుండి రూ. 53 కోట్లకు తగ్గించారు. ప్రజాధనం 170 కోట్ల కమిషన్ ఎలా ఇచ్చారో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలి. అప్పు తీసుకోలేదని శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వెంటనే శ్రీధర్ బాబు క్షమాపణలు చెప్పాలి. మద్రాస్ చీకటి ఒప్పందం లో భాగంగానే కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలిసి బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయి’ అని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.