maheswar reddy
-
సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం.. మంత్రి ఉత్తమ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను వెయ్యి కోట్లు తీసుకున్నానని.. నీచపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘వినతి పత్రాలు తెచ్చి.. లోపలికి వెళ్లి భూములు సెటిల్మెంట్ మాట్లాడినట్టు కాదు. మేము అధికారంలోకి వచ్చే నాటికి సివిల్ సప్లైస్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, డీఫాల్డ్ చేసే మిలర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదు. డీఫాల్ట్ మిల్లర్లతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై మాట్లాడుతున్నారు’’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు.సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం అంటూ కేటీఆర్, మహేశ్వర్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్ సవాల్ విసిరారు. సివిల్ సప్లైస్ రూ.11 వేల కోట్ల నష్టాల్లోఉంది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను. ధాన్యం కొనుగోళ్లను గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాం. మేం రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి’’అని ఉత్తమ్ మండిపడ్డారు.కేటీఆర్, మహేశ్వర రెడ్డి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా కనీసం వాళ్లని కలవలేదు.. నాలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు.. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు.. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుంది.. టెండర్లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుంది. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం మాదే.. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోంది.. మిల్లర్ల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న వాళ్ళే మిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం మాది కాదు. మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం. మహేశ్వర రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు’’ అంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.‘‘కిషన్‌రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారు. పార్టీలో ఓవర్ స్పీడ్‌గా పోవాలని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నాడు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో 1700 వచ్చింది. ఇప్పుడు 2400 వస్తోంది. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్ చెప్పారు. -
చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నా యని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి కంఫర్టబుల్‌గా లేరని, నేతల తీరుతో అభద్రతా భావంతో ఉన్నారని, దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటు కోసం కుట్ర జరుగుతోందని రేవంత్‌కు ఇంటెలిజెన్స్ నివేదికలు అందినట్లు తమకు తెలుస్తోందని మహేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తనతో వచ్చే 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్తో చేతులు కలుపబోతున్నారని ఆరోపించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మహేశ్వరరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎం రేవంత్‌కు చాలా దగ్గర పోలికలున్నాయనీ, రేవంత్ కూడా బాబు స్కూలే కావడంతో కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారన్నారు. బాబు తన మామను వెన్నుపోటు పొడిచినట్టు రేవంత్ కూడా కాంగ్రెస్ కు ఎప్పుడేం చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్లాన్ ఏ.. ప్లాన్ బీతో రేవంత్ లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు యత్నిస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్‌లో వెన్నుపో టు రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. రేవంత్ దగ్గరున్న రెండు ప్లాన్లలో...ప్లాన్ ఏలో తనతో పాటు ఎంత మంది వస్తారు అని, ప్లాన్ బీలో.. సొంత దుకాణం పెట్టుకుంటే.. ఎంతమంది వస్తారు అనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే నాటికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉందన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బీఆర్ఎస్ లో 20 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ప్రతిపక్ష నేతను మార్చాల్సిందిగా ఫిర్యాదు చేయించేందుకు కార్యాచరణను సిద్ధమైందన్నారు. సీఎం పదవి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు: సీఎం పదవి కోసం పది మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పదవి పూర్తయ్యాక దిగుతారా, ఏదైనా కేసులో ఇరుక్కుని పదవి నుంచి దిగిపోతారా అని అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. కేబినెట్లో నంబర్ టు స్థానం తనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భావించారని, అయితే ఆయన స్థానాన్ని దిగజార్చి సైడ్ చేసే కుట్ర కాంగ్రెస్‌లో జరుగుతోందన్నారు. ఇటీవల యాదాద్రిలో భట్టిని కింద కూర్చోపెట్టారని, తుక్కుగూడ సభ సమయంలో ఆయన డ్రైవర్ ను కొట్టారని దీంతో ఆయనకు ఇప్పుడు అర్థమైందన్నారు. భట్టి 9 శాతం బీ టాక్స్ అంటూ లీక్ చేస్తోంది కాంగ్రెస్ వాళ్లేనని చెప్పారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు సైతం పది మంది ఎమ్మెల్యేలతో తమ సొంత సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పది మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో సైకిల్ కాంగ్రెస్, పింక్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అనే మూడు రకాలున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రంలో ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఉప ఎన్నికలంటూ వస్తే ప్రజలు బీజేపీ వైపే ఉంటారని చెప్పారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరేందుకే కేటీఆర్ యాక్షన్ తాము చేసిన తప్పులకు జైలుకెళ్లే అవకాశం ఉండడంతో కేటీఆర్ పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న చెల్లెలు.. అక్కడ ఎండలు మండుతున్నాయనీ కనీసం ఫ్యాన్ కూడా లేనందున అన్నను ఇక్కడ ఉండే ప్రయత్నం చేయమని చెప్పినట్లు తెలుస్తోందన్నారు. అందుకే కేటీఆర్ ఇక్కడే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరేందుకు పిచ్చి ఎక్కినట్టు నటిస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
ట్రైనీ ఐపీఎస్‌ను ఎలా సస్పెండ్ చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విధానంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) కీలక ప్రశ్నలను సంధించింది. ఆరోపణలు వస్తే దర్యాప్తులో భాగంగా సరీ్వస్ నుంచి మాత్రమే సస్పెండ్ చేసేందుకు నిబంధ నలు అనుమతిస్తున్నాయని, నియామ క ఉత్తర్వులను ఎలా సస్పెండ్ చేస్తారని కేంద్ర హోం శాఖను ప్రశి్నంచింది. దీనిపై వివరణ ఇవ్వాలని క్యాట్ అడ్మిని్రస్టేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ బుధవారం కేంద్ర హోం శాఖను ఆదేశించా రు. సెంట్రల్ సరీ్వసెస్ ఆఫీసర్స్ రూల్స్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్‌రెడ్డిని ఎలా సస్పెండ్ చేశారో వివరణ ఇవ్వా లని కోరారు. తనను పెళ్లి చేసుకున్నాక మోసం చేశాడని భువన అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్వర్‌రెడ్డి వివరణ ఇచ్చాక ఏం జరిగిందో చెప్పాలని ముస్సోరీలో ని కేంద్ర సరీ్వసుల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ను క్యాట్ ఆదేశించింది. మహేశ్వర్ వివరణను జాతీయ పోలీస్ అకాడమీ, కేంద్ర హోం శాఖలకు తెలియజేశారో లేదో చెప్పాలని వివరణ అడిగింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయి దా వేసింది. ఆరోపణల ఫిర్యాదు ఆధారంగా తనను సస్పెండ్ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖను క్యాట్ ఆదేశించింది. -
మిస్డ్ కాల్‌తో మిస్సెస్సై..
ప్రకాశం, గిద్దలూరు: మిస్డ్ కాల్‌తో మిసెస్‌ను చేసుకుని రెండు నెలల కాపురం చేసి ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి పారిపోయి వచ్చిన ఓబులాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి ఉదంతమిది. భర్త ఇంకా వస్తాడని ఎదురు చూసిన భార్య ఎంతకీ రాకపోగా ఫోన్ పని చేయకపోవడంతో గురువారం నేరుగా ఓబులాపురం వచ్చిన యువతి మహేశ్వరరెడ్డి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలతి మండలంలోని ఓబులాపురానికి చెందిన వేమిరెడ్డి మహేశ్వరరెడ్డికి మిస్డ్ కాల్ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని నమ్మబలికి మాలతి కుటుంబ సభ్యులను నమ్మించి గుడిలో మహేశ్వరరెడ్డి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే కాపురం పెడదామని ఉప్పల్‌లోని గణేష్‌నగర్ తీసుకెళ్లి అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలల కాపురం చేసిన తర్వాత భార్యను శ్రీకాకుళం తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం లేదు. ఫోన్ చేయడం లేదు. ఆమె ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇక తన బంధువులకు ముఖం ఎలా చూపించగలనని బాధితురాలు విలపిస్తోంది. తాను వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న మహేశ్వరరెడ్డి తన బంధువుల ద్వారా బెదిరిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. చావైనా బతుకైనా తన భర్త మహేశ్వరరెడ్డితోనేనని, ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెబుతోంది. భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని మాలతి కోరుతోంది. మహేశ్వరరెడ్డి గతంలోనూ గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్తుండగా గమనించిన ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. -
కదనోత్సాహం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతున్న సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వర్గాల వారీగా విడిపోయినా... ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని చెపుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగంలో కదనోత్సాహం నిండిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, వర్గ విభేదాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పూర్తిగా తెలుసు. ఉత్తమ్‌కు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డి శక్తి యాప్ ప్రమోషన్లో చూపించిన ప్రతిభ ద్వారా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే! వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగాల్సిన సాధారణ ఎన్నికలను ఆరు నెలల ముందుగానే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 2న హైదరాబాద్ సమీపంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుకు సిద్ధమేనని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు తెలియజేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హవానే కాంగ్రెస్‌లో నడుస్తుందని భావిస్తున్న ఆయన వర్గం టిక్కెట్ల కేటాయింపులో కూడా పెద్దపాలు దక్కుతుందని యోచిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మహేశ్వర్‌రెడ్డి ఆలోచన కూడా అదే. ఎన్నికల్లో తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కేలా పావులు కదిపే ఆలోచనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, మహేశ్వర్‌రెడ్డి మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వడం గమనార్హం. శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్న దేశంలోని పది మందిని గౌరవించే కార్యక్రమాన్ని రాహుల్‌గాంధీ చేపట్టగా, వారిలో మహేశ్వర్‌రెడ్డి ఉండడం గమనార్హం. కాగా మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు జిల్లాలో ప్రేంసాగర్‌రావు గ్రూపు కూడా టిక్కెట్ల వేటలో తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. మండలాల వారీగా బలాన్ని మరింత పెంచుకొని టిక్కెట్ల పోటీలో ముందు వరుసలో ఉండాలని యోచిస్తున్నారు. రాహుల్‌గాంధీకి సంస్థాగత నివేదిక డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఉద్ధేశించిన శక్తి యాప్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి నివేదికను సమర్పించారు. శక్తి యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఏఐసీసీ తరుపున రాహుల్‌గాంధీ అభినందించారు. అదే సమయంలో కొత్త జిల్లాల వారీగా డీసీసీల ఏర్పాటు అంశం పీసీసీ పరిధిలో ఉండడంతో తన వర్గీయులను అధ్యక్షులుగా నియమించుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటనను మహేశ్వర్‌రెడ్డి వినియోగించుకున్నట్లు సమాచారం. నిర్మల్ మినహా మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల కోసం మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు ప్రేంసాగర్‌రావు వర్గం కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి తన పంతం నెగ్గించుకొనే యోచనతో మహేశ్వర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. వేచి చూసే దోరణిలో ప్రేంసాగర్‌రావు వర్గం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మహేశ్వర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ కావడంతో ప్రేంసాగర్‌రావు వర్గం వేచి చూసే దోరణితో ఉంది. రాష్ట్ర స్థాయిలో భట్టి విక్రమార్క, డీకే అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలకు చెందిన గ్రూపులో ఉన్న ప్రేంసాగర్‌రావు, వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఈ వర్గం నాయకులు స్థానికంగా పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఢిల్లీలో టిక్కెట్ల పంపిణీ నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీరు భావిస్తున్నారు. ఆదివాసీ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు, రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ సమక్షంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బోడ జనార్దన్, రావి శ్రీనివాస్, గతంలో పోటీ చేసి ఓడిపోయిన గండ్రత్ సుజాత, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ వైపు ఉన్నందున వీరికి టిక్కెట్లు ఖాయమని ప్రేంసాగర్‌రావు వర్గం భావిస్తోంది. వీరందరికీ స్థానికంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెల్లడంతో కార్యాచరణ ప్రారంభమైంది. -
సమరోత్సాహం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చాలాకాలంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రారంభించిన బస్సు యాత్రకు స్పందన పెరుగుతుండడం నేతల్లో ఆనందానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో 31 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగించిన కాంగ్రెస్ అతిరథ మహారథులు ఆదివారం మంచిర్యాల పట్టణానికి రాబోతున్నారు. మూడో విడత బస్సుయాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కోరోజు సభ నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతల హడావుడి మధ్య కాంగ్రెస్ జెండాలు కూడా కనిపించకుండా పోతున్న పరిస్థితుల్లో బస్సు యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊపిరిపోస్తోంది. ఈ నేపథ్యంలో నేతలంతా ఐక్యతారాగం పాడుతూ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడుమహేశ్వర్రెడ్డి చొరవతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మూడో విడత బస్సు యాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించేందుకు తనవంతు కృషి చేశారు. గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బస్సు యాత్ర సాగుతుందని ప్రకటించినప్పటికీ, నిర్మల్‌తోనే ఆగిపోయింది. తాను ఇన్చార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో సభను మహేశ్వర్‌రెడ్డి విజయవంతం చేయించారు. అదే సమయంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రజా చైతన్యయాత్రలు నిర్వహించేలా కాంగ్రెస్ నేతలను ఒప్పించారు. అందులో భాగంగానే మూడో విడతలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో ఐదు రోజులపాటు బస్సు యాత్ర సాగనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యే ఈ యాత్ర, సభలను విజయవంతం చేయడం ద్వారా పార్టీకి తిరిగి ఊపిరి పోసినట్లవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నేతల ఐక్యతారాగం మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలంతా ఒక్కటయ్యారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి ఏకతాటిపైకి రావడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రేంసాగర్‌రావు సహజంగానే మాజీ ఎమ్మెల్యే ఎం.అరవింద్‌రెడ్డిని వ్యతిరేకించారు. ఒక సందర్భంలో అరవింద్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల జోక్యంతో వీరిద్దరు ఐక్యతారాగం పాడి కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చింది. సత్తా చాటే ఎత్తుగడలో ప్రేంసాగర్‌రావు మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర సభ ఏర్పాట్లన్నీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. సభా నిర్వహణ ఖర్చు మొదలుకొని, వాహనాలు సమకూర్చడం, భోజనాల ఏర్పాటు, ఆయా మండలాల నాయకుల ఇతర ఖర్చులు అన్నీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలోనే సాగుతుందనేది బహిరంగ రహస్యం. గత రెండేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పాగా వేసుకొని కూర్చున్న పీఎస్ఆర్ ఈ సభ ద్వారా నియోజకవర్గానికి అన్నీ తానే అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం అదే ఊపు కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలనే సంకల్పంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల స్థాయిలో కాకపోయినా.. సభలకు జనం సమీకరించడంలో అందివచ్చే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునే ఆలోచనతో ఉన్నారు. అధిష్టానం నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు రాకపోవడం మిగతా నాలుగు నియోజకవర్గాలకు ఇబ్బంది కరమైన అంశం. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూరులో రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, సిడాం గణపతి సభలను విజయవంతం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు గిరిజనులతో సభను విజయవంతం చేసే యోచనలో ఉన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ ఇన్చార్జి, పీసీసీ సభ్యుడు చిలువల శంకర్ ఆధ్వర్యంలో 17న సభ జరుగనుంది. -
మహేశ్వర్ రెడ్డికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. భోపాల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన 2 వేల మీటర్ల రేసులో మహేశ్వర్ రెడ్డి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మహేశ్వర్ పసిడి పతకం నెగ్గినందుకు డీజీపీ అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాక్షించారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీ వీవీ శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. 7వ బెటాలియన్‌కు చెందిన మహేశ్వర్ రెడ్డి గతేడాది నిర్వహించిన రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించినట్టు ఐజీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
'మంత్రి అవినీతి బాగోతాన్ని బయటపెడతా'
హైదరాబాద్: తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి బాగోతాన్ని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో నెంబర్‌వన్ అసమర్థ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. న్యాయవాదులు, న్యాయాధికారుల సమస్యలు పరిష్కరించడంలో న్యాయశాఖ మంత్రి విఫలమయ్యారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, ఇందుకు సభ్యత్వ నమోదే ని దర్శనమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పది లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించామని, ఆ సంఖ్య దాటి సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించాలనే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోందని, ఇందుకోసం పలు బీమా కంపెనీలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆసరా పింఛన్ల విషయంలో ముఖ్యమంత్రి కలెక్టర్లను నిందించడం తగదన్నారు. ఎవ్వరిని బెవకూఫ్ చేద్దామని సీఎం ఇలా వ్యవహరిస్తు న్నారని ఆయన ప్రశ్నించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏవని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే సుమారు రూ.3.60 లక్షల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. అమలుకు సాధ్యం కాని హా మీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించా రు. ఆయన హామీలను చూసి టీఆర్ఎస్కు ఓటేశారని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతి యా మాట్లాడుతూ.. 2009లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చే వరకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అధికారం, ఇతర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా పొన్నాల, కుంతియ కార్యకర్తలకు సభ్యత్వ రశీదు అందజేశారు. పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా నేతలు నిర్ణయించారు. ఇందుకోసం రూ.పది లక్షలు విరాళంగా అందజేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మరో రూ.పది లక్షల విరాళాన్ని మాజీ మంత్రి వినోద్ ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1.5 లక్షల నుంచి రెండు లక్షల వరకు సభ్యత్వ నమోదు చేపట్టి తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్, పార్టీ నాయకులు భార్గవ్ దేశ్‌పాండే, నారాయణరావు పటేల్, అనిల్‌జాదవ్, హరినాయక్, విశ్వప్రసాద్‌రావు, చిలుముల శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అసోంలో ఏపీ కాంట్రాక్టర్ కిడ్నాప్
-
66 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బల్దియా పోరులో ప్రధాన ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, యువత తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండాకాలం కావడంతో అధిక సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి. వృద్ధులు, రోగులు, వికలాంగులు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. ఆరు మున్సిపాలిటీల్లో సగటున 66.41 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో 187 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1,095 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 325 కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. ఓటర్లను మినహా కేంద్రాల్లో 200 మీటర్ల దూరం వరకు ఎవ్వరిని అనుమతించలేదు. ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎన్నికల పరిశీలకులు సుకుమార్ పరిశీలించారు. పోలింగ్ తీరును పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ గజరావు భూపాల్, అదనపు ఎస్పీ జోయల్ డేవిస్ పట్టణంలోని పిట్టలవాడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు సుకుమార్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల తీరును పరిశీలించారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. భైంసాతోపాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈవీఎంల మొరాయింపు మంచిర్యాలలోని 22, 28 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 19వ వార్డు బూత్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదిలాబాద్ బొక్కలగూడ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 315 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. పలుచోట్ల సాంకేతిక లోపాలు తలెత్తాయి. నిర్మల్ మున్సిపాలిటీలో రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కనెక్టు కాలేదు. ఆదిలాబాద్ పట్టణంలోని మరో పోలింగ్ కేంద్రంలోనూ మొరాయించింది. వీటిని సరిచేసే సరికే చాలా మట్టుకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం పోలింగ్ మందకొడిగా సాగగా, ఎండ తీవ్రతకు ఓటర్లు బయటకు రాలేదు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి ఓటర్ల రాక ఎక్కువైంది. ఐదు గంటల లోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికి అధికారులు స్లిప్‌లను పంపిణీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో73.91 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ మున్సిపాలిటిలో 59.42 శాతం ఓట్లు పోలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మున్సిపల్ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని శిశుమందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో నాయకులు తోపులాడుకున్నారు. నిర్మల్‌లోని సోమవార్‌పేట్‌లో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ మాధవరెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థికి చెందిన సమీపబంధువు ఎన్నికల విధుల్లో ఉండటంతో ప్రత్యర్థి అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో ఆ ఉద్యోగిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. భైంసాలో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టిన కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మండే ఎండలో గంటల తరబడి నిలబడి ఓటేశారు. కేంద్రాల వద్ద కనీసం టెంటు కూడా వేయకపోవడం పట్ల ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కేంద్రాల్లో తాగునీటి వసతి సరిగ్గా లేకపోవడంతో దాహంతో ఇబ్బంది పడ్డారు. ఏర్పాట్లలో లోపం.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికార యంత్రాంగం ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సాక్షాత్తు కలెక్టర్ అహ్మద్ బాబు క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న 19వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కేంద్రం పరిధిలో సుమారు 70 మంది ఓటర్ల పేర్లు గల్లంతవడంతో వారు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ సిబ్బంది ఓటరు స్లిప్‌లు ఇచ్చినా, వాటిని తీసుకుని ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి వెళితే సిబ్బంది ఓటు లేదని తిప్పిపంపడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ అహ్మద్‌బాబు అక్కడికి చేరుకున్నారు. 33వ వార్డు ఇంద్రానగర్లోనూ చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. నిర్మల్‌లోని 21వ వార్డుల్లో అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు అధికారులు గుర్తింపు కార్డులను శనివారమే జారీ చేయాల్సి ఉండగా, పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి కూడా వాటిని జారీ చేయలేదు. ఇలా ఆదిలాబాద్ మున్సిపల్లోని రెండో నంబర్ పోలింగ్ వద్ద ఇద్దరు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం ఎన్నికల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీ ఎంలలో నిక్షిప్తమై ఉంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షె డ్యూల్ ప్రకారం బుధవారం (ఏప్రిల్ 2న) ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో షెడ్యూల్ ప్రకారం లెక్కింపు జరుగుతుందో.. లేదోనని అభ్యర్థుల్లో ఉ త్కంఠ నెలకొంది. ఈ అంశంపై న్యాయస్థానం ఏప్రిల్ 1న తీ ర్పు ఇవ్వనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. -
ఇదేమి హాజరు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు కీలకమైన వేదిక శాసనసభ. ఎంతటి జఠిలమైన సమస్య అయినా సభాదృష్టికి తీసుకెళ్తే ముకుమ్మడి తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎమ్మెల్యేలు సభల్లో పాల్గొని సమస్యలపై పాలకవర్గాలను నిలదీయాలి. సాధించుకునేంత వరకు పట్టుబట్టే అవకాశం ఉంది. అటువంటి మహత్తర అవకాశం శాసనసభ్యులకు మాత్ర మే ఉంది. ఆ ఆశతోనే 2009తో పది మంది ఎమ్మెల్యేలను జిల్లావాసు లు అసెంబ్లీకి పంపించారు. ఎమ్మెల్యేలు ఏం చేశారు. ప్రజల ఆశలను నీరుగార్చారు. ఏజెన్సీలో ఆరోగ్యం అదుపుతప్పి అడవిబిడ్డలు ఏటా వందల మంది మృత్యువాత పడ్డారు. గల్ఫ్ బాధితుల ఇళ్లలో అంతులేని విషాదం. కొందరు అన్నదాతలు ప్రతికూల పరిస్థితులతో కాటికి వెళ్లారు. డీజిల్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అసంపూర్తి ప్రాజెక్టులు, ఉచి త కరెంటుకు మంగళం.. బడుగులకు అందని సంక్షేమ పథకాలతో ప్రజలు సతమతం అయ్యా రు.. ఈ నాలుగున్నరేళ్లలో ఇటువంటి సమస్యలపై స్పందించాల్సిన మన ఎమ్మెల్యేలు సమావేశాలకు తక్కువగా హాజరయ్యారు. ప్రజల పనుల కంటే తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. శాసనసభ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎమ్మెల్యేల హాజరు శాతం ఆందోళన కలిగిస్తోంది. నాలుగున్నరేళ్లలో 177 రోజుల పాటు 13వ శాసనసభ సమావేశాలు జరిగాయి. మన జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 100 రోజుల వరకు అసెంబ్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యపోక తప్పదు. డుమ్మాలో మొదటి స్థానంలో కాంగ్రెస్.. 2009 జూన్‌లో 13వ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నాలుగున్నరేళ్లలో 177 రోజులపాటు అసెంబ్లీ సమావేశమైంది. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి 157 రోజులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ 154 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిర్మల్ ఎమ్మెలే మహేశ్వర్‌రెడ్డి 95 రోజులు హాజరై 82 రోజులు డుమ్మా కొట్టి జిల్లా శాసనసభ్యుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 104 రోజులు సమావేశాలకు హాజరై, 73 రోజులపాటు దూరంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోడం నగేశ్ 131 రోజులు సమావేశాల్లో పాల్గొని, 46 రోజులు దూరంగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ 56 రోజులు అసెంబ్లీకి ఎగనామం పెట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 2011లో రాజీనామా చేసి ఆ ఏడాది డిసెంబర్లో 5 రోజులు అసెంబ్లీకి దూరంగా ఉన్నా.. మొత్తంగా 67 రోజులు శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్యలు రాజీనామా చేయడం వల్ల 2010 ఫిబ్రవరి-మార్చిలలో 31 రోజులపాటు జరిగిన 4వ సెషన్ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. వీటిని కలుపుకుని ఆ ముగ్గురు వరుసగా 115, 100, 71 రోజులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో ప్రజలు ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తే.. అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ఈ రీతిలో గైర్హాజర్ అయితే ఎలా? అన్న చర్చ పలువురిలో సాగుతోంది.