మహేశ్వర్ రెడ్డికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. భోపాల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన 2 వేల మీటర్ల రేసులో మహేశ్వర్ రెడ్డి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మహేశ్వర్ పసిడి పతకం నెగ్గినందుకు డీజీపీ అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాక్షించారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీ వీవీ శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. 7వ బెటాలియన్‌కు చెందిన మహేశ్వర్ రెడ్డి గతేడాది నిర్వహించిన రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించినట్టు ఐజీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.