కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, ఇందుకు సభ్యత్వ నమోదే ని దర్శనమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పది లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించామని, ఆ సంఖ్య దాటి సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించాలనే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోందని, ఇందుకోసం పలు బీమా కంపెనీలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆసరా పింఛన్ల విషయంలో ముఖ్యమంత్రి కలెక్టర్లను నిందించడం తగదన్నారు. ఎవ్వరిని బెవకూఫ్ చేద్దామని సీఎం ఇలా వ్యవహరిస్తు న్నారని ఆయన ప్రశ్నించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏవని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే సుమారు రూ.3.60 లక్షల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. అమలుకు సాధ్యం కాని హా మీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించా రు. ఆయన హామీలను చూసి టీఆర్‌ఎస్‌కు ఓటేశారని అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతి యా మాట్లాడుతూ.. 2009లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చే వరకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అధికారం, ఇతర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా పొన్నాల, కుంతియ కార్యకర్తలకు సభ్యత్వ రశీదు అందజేశారు.
పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా నేతలు నిర్ణయించారు. ఇందుకోసం రూ.పది లక్షలు విరాళంగా అందజేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మరో రూ.పది లక్షల విరాళాన్ని మాజీ మంత్రి వినోద్ ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1.5 లక్షల నుంచి రెండు లక్షల వరకు సభ్యత్వ నమోదు చేపట్టి తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్, పార్టీ నాయకులు భార్గవ్ దేశ్‌పాండే, నారాయణరావు పటేల్, అనిల్‌జాదవ్, హరినాయక్, విశ్వప్రసాద్‌రావు, చిలుముల శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.