దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే: పొన్నాల | Ponnala Lakshmaiah comments about Congress Party | Sakshi
Sakshi News home page

దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే: పొన్నాల

Published Tue, Jun 20 2017 2:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే: పొన్నాల - Sakshi

దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే: పొన్నాల

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రం నుంచి ఇప్పటిదాకా దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయ ని, అదే కాంగ్రెస్‌ పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో సోమ వారం నిర్వహించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలను పంచారు. అనంతరం పొన్నాల మాట్లా డుతూ.. కొన్ని రాజకీయ స్వార్థపర శక్తులు కాంగ్రెస్‌పై కుటుంబ పాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. రాహుల్‌గాంధీ పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని చెప్పారు. దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్‌గాంధీ ఎదిగారని పొన్నాల అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దెమర్ని నర్సింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, పార్టీ నేతలు జి.నిరంజన్, కొనగల మహేశ్, బొల్లు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement