కేసీఆర్‌ను డిస్మిస్ చేయాలి
వేరే పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్ రాజ్యాంగ ధర్మాన్ని తప్పాడని.. గవర్నర్ స్పందించి కేసీఆర్‌ను డిస్మిస్ చేయాలని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా హన్మకొండ, ములుగు, ఆత్మకూరులో మంగళవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
వరంగల్ : రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘి స్తూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గవర్నర్‌ను కోరారు. జిల్లాలోని హన్మకొండ, ఆత్మకూరు, ములుగు ప్రాంతాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ సం దర్భంగా హన్మకొండలోని కొత్తూరులో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
రాజ్యాంగంపై ప్రమా ణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ అవగాహనలేమితోనే రాష్ట్ర ప్రజలకు కరెంట్, నీళ్లు, పింఛన్ కష్టాలు మొదలయ్యాయన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి కరెంట్ తెచ్చుకోవాల్సింది పోయి, రెండున్నరేళ్లలో పూర్తిస్థాయి విద్యుత్ అందిస్తానని కాకమ్మ కథలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు 400 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో సుమారు రూ.70వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికే దక్కిందని గుర్తు చేశారు.
సభ్యత్వాన్ని ఉద్యమంగా చేపట్టాలి..
కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఉద్యమంగా చేపట్టాలని పొన్నాల లక్ష్మయ్య పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి ద్రోహం చేసేవారికి సభ్య త్వాన్ని స్వీకరించే హక్కులేదన్నారు. మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలన్నారు.
అనంతరం పొన్నాల లక్ష్మయ్య కార్యకర్తలతో పార్టీ సభ్యత్వంపై ప్రతిజ్ఞ చేయించారు. సిరిసిల్ల రాజయ్య, తాడిశెట్టి విద్యాసాగర్, డాక్టర్ బండా ప్రకాష్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, వెంకట్రాంరెడ్డి, అమృతరావు, ఈవీ శ్రీనివాస్, నరేం దర్‌రెడ్డి, శ్రీనివాస్, వరద రాజేశ్వర్‌రావు, శ్రీని వాస్, పోశాల పద్మ, శ్రీకర్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రావుల సదానందం, రాజారపు ప్రతాప్, యాదగిరి పాల్గొన్నారు.