సీఎం కేసీఆర్ అసమర్ధుడు | ponnala fire on kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ అసమర్ధుడు

Published Mon, Nov 17 2014 1:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సీఎం కేసీఆర్ అసమర్ధుడు - Sakshi

సీఎం కేసీఆర్ అసమర్ధుడు

టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

జడ్చర్ల: ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆది వారం ఆయన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డీకే ఆరుణ, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లురవి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులతో ఆదివారం గాంధీభవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న మైనారిటీల సదస్సును విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 నాటికి భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వాలను నమోదు  చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement