ponnala lakshmaiah
-
పెట్టుబడులపై రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’’ అంటూ పొన్నాల వ్యాఖ్యానించారు.‘‘సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ. పదేళ్ల కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్పతనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు.. మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి. ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం’’ అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు.‘‘2014, 2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయాంలో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్‌లో కేసీఆర్ హయాం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది. 2014లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటే అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగంలో భారీ పురోగతి సాధించింది...వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా?.స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు? ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు?. రేవంత్ భాష, స్వభావం అలా ఉండటానికి దేశంలో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు’’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శిస్తే తప్పేంటి..?
-
పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, వరంగల్: బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శిస్తున్న ఓ ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు సెటైరిక్‌గా ప్రచారం చేసుకున్నాయి. అయితే సీనియర్ నేత పొన్నాల సైతం ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. ఈ పరిణామంపై వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా, గౌరవంగా కలిసి పలకరించారు. అందులో తప్పేం ఉందో అర్థం కావడం లేదు. పొన్నాల.. మీరొక సీనియర్ లీడర్. స్వార్దంతో పార్టీని వీడిన మీరు.. ఇలా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి స్టేటస్లు పెట్టడం సిగ్గు చేటు. .. మీకు సంస్కారం లేదని ఈ విషయంతో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి మీ దారిన మీరు పోయారు. మీ వయస్సు కు తగ్గ విధంగా ప్రవర్తించండి. మరోసారి ఇలాంటివి పెడితే సహించే ప్రసక్తే లేదు’’ అని వీడియో సందేశం ద్వారా పొన్నాలను ఉద్దేశించి ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్ అయ్యారు. -
పొన్నాలకు రాహుల్ నుంచి ఫోన్!.. స్పందించిన లక్ష్మయ్య..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతల మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ రావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి పొన్నాల లక్ష్మయ్యకు గురువారం ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్బంగా పొన్నాల తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. అలాగే, ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలవాలని రాహుల్ టీమ్ ఆయనను కోరింది. ఈ నేపథ్యంలో పొన్నాల నిర్ణయంపై ఉత్కంఠ చోటుచేసుకుంది. మరోవైపు.. ఫోన్ కాల్‌పై పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ సందర్బంగా పొన్నాల మాట్లాడుతూ.. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించి.. నేను ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నాను. బీసీలను చీడ పురుగులు చూసినట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితం అయ్యే వ్యక్తిని కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్: బహిరంగసభలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఆయననుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘పొన్నాల సీనియర్ నేత. కాంగ్రెస్‌లో అణగారిన వర్గాలకు అవకాశం లేదు.. నాలుగున్నర దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తే చివరికి అవమానమే మిగిలింది.. నాకు బాధేసి ఫోన్లో మాట్లాడి.. పార్టీలోకి రమ్మన్నా.. ఇప్పడు గులాబీ జెండా కప్పుకున్నడు.. అన్ని వర్గాలను బీఆర్ఎస్ ఆదరించి పెద్ద పీట వేస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పొన్నాల మనసు గాయపడితే.. బీఆర్ఎస్ మందు వేసి నయం చేస్తుందని చెప్పుకొచ్చారు. -
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పొన్నాల
సాక్షి, జనగామ: సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరారు. జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వాలి ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీకి మూడు రోజుల క్రితం పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనగామ టికెట్ దక్కదనే బలమైన సంకేతాలతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. బీసీ నేతగా తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 40 ఏళ్లకు పైగా తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు వెన్నంటి ఉంటూ.. కష్ట కాలంలో పెద్ద దిక్కుగా ఉన్న పొన్నాల.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న బీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. డాలర్ లక్ష్మయ్యగా కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఎమ్మెల్యే, మంత్రి, జాతీయ స్థాయిలో పదవులు అధిష్టించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్న పొన్నాల, నేడు అదే పార్టీలో ఒంటరి కావడంతో తన రాజకీయ భవిష్యత్‌ను మరో పార్టీతో పంచుకోనున్నారు. -
కేసీఆర్‌తో పొన్నాల దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దంపతులు.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లిన పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వనించారు. పుష్పగుచ్ఛం అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, జనగామ బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన పొన్నాలను బీఆర్ఎస్లోకి రావాల్సిందిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వనించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల వెల్లడించిన నేపథ్యంలో ఆదివారం కేసీఆర్‌తో జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం జనగామ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్, పొన్నాలను ఆహ్వనించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనగామ సభ వేదికగా పొన్నాల గులాబీ పార్టీలో చేరే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
తెలంగాణలో పొన్నాల రాజకీయం
-
నేడు కేసీఆర్‌తో పొన్నాల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు. సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్‌రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు. -
కేసీఆర్ సమక్షంలో BRSలో చేరనున్న పొన్నాల
-
పొన్నాల ఇంటికి కేసీఆర్ తో పాటు మరికొంత మంది నేతలు
-
బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్న కేటీఆర్
-
పొన్నాలతో కేటీఆర్ భేటీ.. బీఆర్ఎస్లో చేరిక ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. ఇక, కేటీఆర్‌తో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా పొన్నాల ఇంటికి ఇక, భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు పొన్నాల ఇంటికి వచ్చాం. ఆయనను బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించాం. ఈనెల 16వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పొన్నాల చేరుతారు. పొన్నాలకు బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పిస్తాం. ఆయనకు గౌరవం, ప్రాధాన్యత ఇస్తాం. రేపు సీఎం కేసీఆర్‌ను కలవాలని పొన్నాలను కోరాం. కేసీఆర్‌తో భేటీ తర్వాత మిగిలిన విషయాలు పొన్నాల చెతుతారు. కేకే, డీఎస్ వంటి వాళ్లను పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించాం. పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అవమానంగా మాట్లాడారు. 45 ఏళ్లు పనిచేసినా కాంగ్రెస్ అవమానాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు. ఆయన పార్టీలు మారొచ్చు కానీ ఇతరులు గౌరవం లేకపోతే మారొద్దా?. దిగజారుడు సంస్కృతి మంచిది కాదు. చనిపోయే ముందు పార్టీ మారటం ఏంటని మాట్లాడుతున్న నేతలు చిల్లరగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటుకు నోటుకు దొంగను పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారు. పొన్నాలకు మార్టీ న్యాయం చేస్తుంది’ అని కామెంట్స్ చేశారు. అనంతరం.. పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ నన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలుస్తాను. సీనియర్ నాయకుడిపై మాట్లాడేందుకు రేవంత్‌కు ఎంత ధైర్యం. కాంగ్రెస్‌లో రేవంత్ అసెంబ్లీ సీటు గెలిచారా?. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్‌లోకి ఇలాంటి వాళ్లు వచ్చి భ్రష్టుపట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’ -
కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా
-
ఇప్పుడు పార్టీ మారతారా?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి... చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలని విమర్శించారు. 2014లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఓసారి, 2018లో రెండోసారి టికెట్ ఇస్తే ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్యను ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ద యేనని రేవంత్ పేర్కొన్నారు. ఇంతకాలం పెంచి పోషించిన తల్లిలాంటి పార్టీని దూషించి పక్క పార్టీలోకి పోవడానికి ఏం రోగం..? అని వ్యాఖ్యానించారు. పార్టీని పలుచన చేసేందుకే రాజీనామా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో డి.శ్రీనివాస్, కేశవరావు, బొత్స సత్యనారాయణ పార్టీని వదిలి వెళ్లారని.. వెళ్లే వారు వెళ్తూనే ఉంటారని అన్నారు. కానీ పొన్నాల విషయానికి వస్తే అసలు 80 ఏళ్ల వయస్సులో పార్టీ మారడమే బుద్ధిలేని పని అని ఎద్దేవా చేశారు. ఈ వయసులో నూ ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడి.. టికెట్ కావా లని తిరిగారని విమర్శించారు. జనగాం నియోజకవర్గానికి సంబంధించి ప్యానెల్లో రెండు పేర్లు వెళ్లాయని.. ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టం చేశారు. అసలు ఏ కారణం చెప్పి పొన్నాల పార్టీకి రాజీనామా చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల ఏ పార్టీలోకి వెళ్తారో తనకు తెలీదని.. కానీ పార్టీని ఈ సందర్భంలో వీడి వెళ్లడమే అతి పెద్ద నేరం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకుంటే గౌరవం ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యం ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్డ్ అధికారులను ప్రైవేట్ సైన్యంగా మార్చుకుని ఎన్నికల అక్రమాలకు పాల్ప డుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్‌రావు, వేణుగోపాల్ రా వు, నర్సింగరావు, భుజంగరావు తదితరులు ప్రైవే ట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్థిక శాఖ అధికారి రామకృష్ణారావు నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ చెప్పినవారికి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ భూముల వినియోగ మార్పు చేశారని... వీళ్లందరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పద్ధతులు కేటీఆర్‌కు ఏం తెలుసు..? రేవంత్ పైసలు తీసుకుంటున్నాడని మంత్రి కేటీఆర్ అంటే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. అమెరికాలో బాత్రూంలు కడిగేవాడికి కాంగ్రెస్ పద్ధతులు తెలియవు అని విమర్శించారు. రేవంత్ నిర్ణయంతో టికెట్లు ఖరారు కావని, ప్రక్రియ ప్రకారమే అభ్య ర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తాం 75 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల జాబితాను కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు అందించారని... వారి పై నిఘా పెట్టి బెదిరించే పనులను కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ చేస్తోందని రేవంత్ ఆరోపించారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలన్న తాపత్రయం కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలతో భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారన్నారు. 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని అనుకుంటున్నామని.. చారి్మనార్ అసెంబ్లీ స్థానంలో అలీ మస్కత్ను పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరిందన్నారు. -
కాంగ్రెస్‌లో 'బీసీ' కాక!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బీసీల కాక మొదలైంది. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గత 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న సీనియర్ నేత, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు చివరకు అవమానాలే మిగిలాయని, ఈ ఆవేదనతోనే తాను పార్టీని వీడుతున్నానంటూ ఆయన శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీవర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీకి విధేయుడిగా పేరొందిన పొన్నాల రాజీనామా చేయడం, బీసీ నేతలు ఏకంగా గాందీభవన్‌లోనే ధర్నా నిర్వహించాలని ప్రయత్నించడం, అధిష్టానం గట్టిగా హెచ్చరించడం, మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా బీసీ నేతలకు కాంగ్రెస్ పెద్దలు సరిగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, బీసీ నేతలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోత తప్పదనే సంకేతాలు వస్తుండడం లాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పారీ్టలో బీసీ నేతలు కేంద్రంగా ఓరకంగా కలకలమే రేగుతోంది. బీసీలకు ఎన్ని టికెట్లు వస్తాయో తేలాక ఆ వర్గానికి చెందిన మరికొందరు పొన్నాల బాట పట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీసీలకు 34 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 34కు తగ్గకుండా టికెట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల తెలంగాణకు చెందిన 30–40 మంది బీసీ నేతలు హస్తిన బాట పట్టారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతరులు ఉన్నారు. అయితే వీరికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాహుల్, సోనియాలను కలుస్తామని, అక్కడే బీసీల కోటా తేల్చుకుంటామని చెప్పిన బీసీ నేతలు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఉసూరుమంటూ వెనక్కు రావాల్సి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలుస్తారని చెప్పినా ఆయన కేవలం మధుయాష్కీకి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. మిగిలిన నేతలంతా ఏఐసీసీ కార్యాలయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కొందరు నాయకులను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ కలిశారు. పార్టీ అధికారంలోకి రావడం మీకు ఇష్టం లేదా? అంటూ ఆయన ఎదురుదాడికి దిగడంతో వారంతా కంగు తినాల్సి వచి్చందని చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ సర్వేల ఆధారంగా గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి ఇవ్వలేమని చెప్పిన వేణుగోపాల్ కొందరిని వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వారి్నంగ్ కూడా ఇచి్చనట్లు సమాచారం. ఠాక్రే ఫోన్‌తో ధర్నా విరమణ? వాస్తవానికి బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా ఈసారి సీట్లు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చాలాసార్లు స్పష్టం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా తమకు 34 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని గత రెండు నెలలుగా బీసీ నేతలు టీం బీసీ పేరుతో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా 20–25 స్థానాలు మాత్రమే బీసీలకు ఇస్తున్నారని తెలియడంతో శుక్రవారం గాంధీభవన్‌లో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా వారు తమ నిరసన విరమించుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నుంచి వచ్చే ఒకే ఒక్క ఫోన్‌కాల్ కారణమనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. టికెట్ల ప్రకటన సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయవద్దని, గెలిచే వారికే సీట్లిస్తామని, తమను కాదని ధర్నాలు చేస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని ఆయన హెచ్చరించడంతోనే టీం బీసీ నేతలు తమ ఆందోళనను విరమించుకున్నారని తెలుస్తోంది. పొత్తు కుదిరితే బీసీలకిచ్చే సీట్లేనా? వామపక్ష పార్టీలతో పొత్తు కుదిరితే చెరో రెండు సీట్లు చొప్పున సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఆ పార్టీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి సాధారణంగా కాంగ్రెస్ బీసీలకిచ్చే అవకాశం ఉన్న, చాలామంది బీసీ నేతలు ఆశిస్తున్న స్థానాలనే వాదన విన్పిస్తోంది. బీసీలకు ఇచ్చే అవకాశమున్న సీట్లను పొత్తుల్లో వేరే పార్టీలకు ఇచ్చి, పొత్తుల కారణంగానే కొన్ని సీట్లు బీసీలకు ఇవ్వలేకపోయామని చెప్పేందుకే ఈ ఆలోచన చేస్తున్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వేల పేరుతో బీసీ నేతలను దూరం చేసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే.. అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలామంది బీసీ నేతలు పొన్నాల బాటలో పయనించవచ్చనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు నిఖార్సైన నేతలు ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా: పొన్నాల ‘అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీతో కలిసి నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేసిన నేను బాధాతప్త హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను..’అని ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల తెలిపారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు పీవీ నరసింహారావు స్ఫూర్తినిచ్చారు. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 12 ఏళ్ల పాటు మంత్రిగా నిబద్ధతతో సేవలందించాను. అయితే పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు నాకు తీవ్ర బాధను కలిగించాయి. 2015లో పీసీసీ అధ్యక్షుడిగా నన్ను అకారణంగా తొలగించారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేనే బాధ్యుడినని నిందించారు. పార్టీ మూల సిద్ధాంతంతో అనుబంధమున్న నాలాంటి నాయకుడికి పార్టీలో ఎన్నో అవమానాలు కలిగాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు. నిఖార్సైన కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీలో ప్రాధాన్యం కోల్పోయి ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. ఈ విషయాలను పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. కానీ సాధ్యపడలేదు. సామాజిక న్యాయానికి కాలం చెల్లింది. కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టు లాంటి సామాజిక న్యాయానికి ఇప్పుడు పార్టీలో కాలం చెల్లింది. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణలు పార్టీ అంకితభావాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలను చర్చించేందుకు నాలాంటి సీనియర్ నేత కూడా నెలల తరబడి నిరీక్షించాల్సి రావడం, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు పదిరోజులు వేచి ఉన్నా ఫలితం లేకపోవడం దురదృష్టకరం. 50 మంది బీసీ నేతలు ఢిల్లీకి వచ్చినా పెద్దలను కలిసేందుకు అనుమతి లభించలేదు. ఉదయ్‌పూర్, రాయ్‌పూర్ డిక్లరేషన్లు పార్టీలో అమలు కావడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర హోదాలను బీసీ నాయకులకు కల్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీతో అనుబంధాన్ని కొనసాగించలేనని, ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా. ఇన్నాళ్లూ నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు..’అని పొన్నాల తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. ఏఐసీసీకి లేఖను పంపిన తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. 1983 తర్వాత పార్టీ కేవలం మూడు సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి ఏపీలో అధికారం దక్కించుకున్నా తెలంగాణలో మాత్రం సగం సీట్లు పార్టీకి ఎప్పుడూ రాలేదని, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన విషయాలను పార్టీలో చర్చించాలన్నా వీలుపడలేదని చెప్పారు. చెప్పేది వినేవాళ్లు పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పొన్నాల కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్లో చేరుతున్నారా అని ప్రశ్నించగా, ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాత్రమే చేశానని, ఇప్పుడే తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పలేనని అన్నారు. ఒకరిద్దరు వెళ్లినా నష్టమేమీ లేదు: మురళీధరన్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల పార్టీని వీడటంపై విలేకరులు ప్రశ్నించగా..దీనిపై స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే పొన్నాల పార్టీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. -
పీసీసీ చీఫ్‌గా 40 వేల ఓట్లతో ఓడారు: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం పొన్నాల లక్ష్మయ్య చేసిన అతిపెద్ద నేరం. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా అప్పుడు 40 వేల ఓట్లతో ఓడిపోయారాయన. ఇప్పుడు పార్టీ మారడానికి పొన్నాలకు సిగ్గుండాలి అని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి.. పొన్నాల తక్షణమే తన రాజీనామా ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక బీసీలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం దక్కడం లేదన్న పొన్నాల ఆరోపణలను రేవంత్ ఖండించారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 50 శాతం సీట్లు ఇస్తామని రేవంత్ తెలిపారు. ‘‘యాభై శాతం సీట్లు కొలిక్కి వచ్చాయి. మిగిలినవి తొందర్లోనే ఖరారు చేస్తాం. మస్కతి అలీంను చార్మినార్ నుంచి పోటీ చేయాలని కోరాం. ఆరు గ్యారెంటీ లకు తోడుగా ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ ఇస్తున్నాం. నూటికి నూరుశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇక.. బీఆర్ఎస్ సర్కార్‌పైనా రేవంత్ విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ పోలీసు ‘‘రావు’’ అధికారులు.. కేసీఆర్ ప్రైవేట్ సైన్యం గా పని చేస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర క్రిస్టియన్ మైనార్టీ ల సమావేశం ఏర్పాటు చేయడం తగదు. తనకు నచ్చిన వారికి రామకృష్ణ రావు నిధులు విడుదల చేస్తున్నారు. అరవింద్ కుమార్ ఎన్నికల కోడ్ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతిపరులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని ఆరోపించిన రేవంత్.. దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. పొన్నాలను పట్టించుకోవాల్సిన పని లేదు గెలుపు ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేశామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 62 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. వామపక్షాలతో పొత్తుల అనంతరం మిగిలినవి ఫైనల్ చేస్తాం. బస్సు యాత్ర కంటే ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం అని అన్నారు. పొన్నాల ఎపిసోడ్‌పైనా మురళీధరన్ స్పందిస్తూ.. ‘‘ అభ్యర్థుల జాబితా విడుదల కంటే ముందు పొన్నాల ఎలా రాజీనామా చేస్తారు?. పార్టీలోకి చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. పొన్నాల రాజీనామాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. -
పొన్నాల వస్తానంటే.. నేనే ఆహ్వానిస్తా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఒకటి వెంటనే తెర మీదకు వచ్చింది. అయితే.. పార్టీ మారే విషయంపై పొన్నాల ఎటూ స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) స్పందించారు. పొన్నాలను బీఆర్ఎస్లోకి తానే ఆహ్వానిస్తానని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు. ‘‘పొన్నాల మా పార్టీలోకి వస్తానంటే సంతోషం. రేపే ఆయన ఇంటికి వెళ్తా. నేనే ఆయన్ని దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానిస్తా’’ అని కేటీఆర్ చెప్పారు. అంతకు ముందు.. ఇదే విషయంపై మీడియా పొన్నాలను ఆరా తీసింది. ఈ నెల 16వ తేదీన ఆయన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారని.. జనగామ టికెట్ ఆయనకు బీఆర్ఎస్ ఆఫర్ చేసిందని ప్రచారం నడిచింది. అయితే బీఆర్ఎస్లోగానీ.. మరేయిత పార్టీలో గానీ చేరబోతున్నారా? అనే మీడియా ప్రశ్నకు.. పొన్నాల దాటవేత ధోరణి ప్రదర్శించారు. ‘‘పదవుల కోసం మరేదానికోసమే రాజీనామా చేయలేదని, భవిష్యత్తుపై ఎవరెవరో ఏదేదో ఊహిస్తే.. తానేమీ సమాధానం చెప్పనని ఆయన అన్నారు. కేటీఆర్ చిట్‌చాట్ బైట్స్ ►దక్షిణ భారతంలో హ్యాట్రిక్ కొట్టిన సీఎంగా కేసీఆర్ నిలుస్తారు ►మరో నాలుగు రోజుల్లో.. మిగతా ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తాం ►హైదరాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు ►రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ మాత్రమే ►మా అభ్యర్థులు 114 మంది అభ్యర్థులు ప్రచారం లో దూసుకుపోతున్నారు ►కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులే లేరు.. అలాంటపుడు 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతారు? ►పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు .. ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరు ►డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఇస్తున్నారు ► ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకాయన కలిశారు.. కూకట్ పల్లి సీట్ కోసం రూ. 15 కోట్లు అడిగారట ► గతం లో నేను చేప్పినట్టే కర్ణాటక లో అక్రమ డబ్బు జమ అవుతోంది ► తెలంగాణ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ. 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికింది ►అందులో కొడంగల్‌కు రేవంత్ రెడ్డి కోసం ఇప్పటికే రూ. 8 కోట్లు అందాయి ►మేము తొమ్మిదిన్నరేళ్ళు గా చేసిన పనుల గురించి చెబుతున్నాం ►ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం ►మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? ►నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టు ల అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది ► ఓ తండ్రి తన అమ్మాయిని ఎవరితో పెళ్లి చేయాలన్న దాని పై చాలా ఆలోచిస్తారు ► ఓటు వేసే ముందు కూడా ప్రజలు ఆలోచించాలి ► అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదు ► అమిత్ షా మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి ► ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిడుతారు ► ప్రధాని కి అంత అహంకారమా? ►రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్, ఏం రాసిస్తే అది చదువుతారు ► ఈ ఎన్నికలు తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ ► తెలంగాణ కు గుజరాత్ ,ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీ ► బీజేపీ ని వాళ్ళ నాయకత్వం వాళ్ళే సీరియస్ గా తీసుకోవడం లేదు ►బీజేపీ ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం ► బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుంది ► సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారు ► నేను జీహెచ్ఎంసీ, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తాను ► మేనిఫెస్టోలో రైతులు ,మహిళలు ,దళితులు ,గిరిజనులు ,బలహీన వర్గాలు ,మైనారిటీలు ,పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాం ► అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ఊత కర్ర లా ఉంటుంది ► ఆర్థిక క్రమ శిక్షణ లో మేమే ముందు ఉన్నాం .. ► ఏదీ సాధ్యమో ,ఏదీ అసాధ్యమో మేము ప్రభుత్వం లో ఉన్నాం కనుక మాకు తెలుసు ► ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ లో స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా ► నేను వ్యక్తిగతంగా సిరిసిల్ల లో ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయొద్దని నిర్ణయించా.. మిగతా వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళిష్టం ► కాంగ్రెస్ 2004 ,2009 లలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు ► మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టో లోని హామీలు నిలబెట్టుకున్నాం ► రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే అంశం పైనే ఎన్నికలు జరుగుతాయి ► మతం కులం ప్రాతిపదికన ఓట్లు కొంత వరకే పడతాయి ► బీజేపీ తో మాకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు ,కాలేజీ లు ఎందుకు పెడతాం ► సీఎం కేసీఆర్, మోదీని తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదు ► బీజేపీతో స్నేహం ఉంటే ఎందుకు తిడతాం? ►మేము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదు ► మేము ఎవరేమన్నా అతి మంచితనం తో వెళుతున్నాం ► రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ ,ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదు? మా మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి ► ఓటుకు నోటు కేసు ను ఓపెన్ చేయండి.. ఎవరు వద్దన్నారు ► ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే ..అధికారులుకాదు ► అధికారుల బదిలీలను.. బదిలీలలుగా గానే చూస్తాం ►ప్రజలు ఓటేసేపుడు సీఎం ఎవరుంటారు అని చూస్తారు ► కేసీఆర్ పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారు ..మేము చేసింది చెప్పుకుంటాం ► గతం లో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చు ► హుజురాబాద్ లో కూడా మేమే గెలుస్తున్నాం ► ఈటల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదు ► బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో ► షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదు ► రాహుల్ గాంధీ మోదీ లు కూడా ఇక్కడకొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదు ► త్వరలో చాలా మంది ప్రముఖులు బీ ఆర్ ఎస్ లో చేరతారు ► కాంగ్రెస్ లో టికెట్ ల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో తన్నుకుంటారు ► కాంగ్రెస్ లో అపుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు నాకు సమాచారం ఉంది ► గతం లో ఉత్తమ్ మాట్లాడినట్టే.. ఇప్పుడు రేవంత్ మాట్లాడుతున్నారు ► కాంగ్రెస్ అంటే గందర గోళం ,ఆగమాగం -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమండేషన్‌తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్‌తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. -
మేమే అసలైన హిందూ వాదులం ప్రజల ముందు మోదీ దొంగ ఏడుపులు
-
భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్‌కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పాదయాత్రలో లొల్లి షురూ.. భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్ ఉన్న వ్యవహారం భట్టి పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. (హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్) సైడయిపోయిన కొమ్మూరి కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు. ఉల్టా పల్టా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!) -
కర్ణాటకలో తెలుగు ఓటర్లపై పార్టీలు ఫోకస్
-
చాకిరీ మాది... పదవులు మీకా?
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్ పాల్గొన్నారు. -
ఓరుగల్లు కోటలో కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్.. తగ్గేదెవరో? నెగ్గేదెవరో!
కాంగ్రెస్‌లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు గ్రూప్ పాలిటిక్స్ సాధారణమే. తెలంగాణ రాష్ట్రంలో అయితే నాయకులు మరో ఆకు ఎక్కువే చదివారు. సీనియర్లు, జూనియర్లుగా..కొత్త, పాత నేతలుగా విడిపోయి కొట్లాడుకుంటారు. తాజాగా ఓరుగల్లు కాంగ్రెస్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నేతల మధ్య వైరం కొంప ముంచేట్లు ఉందని కేడర్ ఆందోళన పడుతోంది. ఇంతకీ ఓరుగల్లు కోటలో ఏం జరుగుతోందో చదవండి స్వపక్షంలో విపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో టిక్కెట్ రాజకీయాలు జోరందుకున్నాయి. గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని పార్టీ హైకమాండ్ భావిస్తోంటే.. జిల్లా నేతల గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హన్మకొండతో పాటు జనగామలో గ్రూప్ వార్ సాగుతోంది. స్వపక్షంలోనే విపక్షంలా మారి ఒకరికొకరు ప్రత్యర్థులుగా తయారయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య జరుగుతుంటే.. జనగామలో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మధ్య వార్ మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ పోటాపోటీ కార్యక్రమాలతో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరికి ఒకరు మోకాలడ్డు.. వరంగల్ పశ్చిమ టికెట్ కోసం పోటీ పడుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను ఇద్దరు నేతలు వేర్వేరుగా చేపట్టడంతో పాటు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడంతో నిరసన దీక్షను కూడా వేర్వేరుగా చేపట్టారు. ఇద్దరు మధ్య గొడవపై అధిష్టానం ఆరాతీయడంతో జంగా కాస్త వెనక్కి తగ్గారు. నాయిని మాత్రం జంగాపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గలేదు. ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఎదుటివారిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ నాయకత్వాన్ని ఇద్దరూ డిమాండ్ చేస్తున్నారు. జంగా రాఘవరెడ్డి జనగామ, పాలకుర్తి నియజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ పోటీదారులకు కాస్త కలవరంగానే మారారు. చేయికి చేయి.. పోటాపోటీ జనగామ టిక్కెట్ రేసులో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉన్నారు. గత కొంత కాలంగా పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ఇద్దరూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీ శ్రేణుల మద్దతు తనకే ఉందని కొమ్మూరి చెబుతుండగా.. అధిష్టానం తనను కాదని మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశమే లేదన్న ధీమాతో పొన్నాల పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. జనగామలో చేయిచ్చేదెవరికి.? పొన్నాల లక్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ప్రత్యర్థులుగా తలబడ్డ ఇద్దరు నేతలు 2018 ఎన్నికలకు ముందు ఒకే గూటి పక్షులై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొమ్మూరి 2018 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాలతో దోస్తీ కట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నాల గెలుపు కోసం కృషి చేశారు. అయితే పొన్నాల ఓటమి పాలు కావడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. ఓటమి అనంతరం పొన్నాల లక్ష్మయ్య కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. కష్టకాలంలో కార్యకర్తలను, పార్టీని వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ రాజకీయాలు ఒకపట్టాన కొలిక్కి రావు. హైకమాండ్ చెప్పినా వినని నాయకులు చాలామందే ఉంటారు. టిక్కెట్ల విషయంలో అయితే అసలు రాజీపడరు. చివరికి జనగామ టిక్కెట్ విషయంలో ఎవరు నెగ్గుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కేసీఆర్ ప్రసంగం హాస్యాస్పదం: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సుమారు రూ. 5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం కేసీఆర్ దేశం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం గొప్పలు చెప్పుకొనేందుకే తాపత్రయపడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో 17 లక్షల మంది దళితులుంటే కేవలం 30 వేల మందికే దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ దేశమంతా దీన్ని వర్తింపజేస్తానని సీఎం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారని పొన్నాల ఆక్షేపించారు. మిషన్ భగీరథ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు తాగలేని దుస్థితి నెల కొందని, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. -
ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు, రాజకీయా ల కోసమే ప్రజలను మభ్యపెట్టే సీఎం కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య జోస్యం చెప్పా రు. ఎన్నికల సమయంలోనే సీఎంకు పవర్ప్లాంట్లు, మెట్రో రైలు గుర్తుకు వస్తాయన్నారు. తాను అధికారంలోకి వచ్చాక ఎలాంటి కారణం లేకపోయినా మూడేళ్ల పాటు మెట్రో పనులను ఆపేసిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ ఎయిర్‌పోర్టు, హయత్‌నగర్‌లకు మెట్రో ఏర్పాటు ప్రతిపాదనలు తీసు కొచ్చారని పొన్నాల ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొత్తగా సింగరేణి పరిధిలో విద్యుత్‌ప్లాంటు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన కూడా ఎన్నికల కోసమేనని చెప్పారు. -
సీఎంకు ఎన్నికల రోగం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎన్నికల రోగం పట్టుకుందని, అందుకే డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఒక్క రోజు కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుపై సమీక్షలు చేయని వ్యక్తి... ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో పనిచేస్తు న్నట్టుగా రుజువు చేసుకునేందుకే ప్లాంటు సంద ర్శన చేపట్టారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్ ద్రోహ పూరితంగా తెలంగాణను అప్పులు పాలుజేస్తున్నారని ఆరోపించారు. కేవలం రూ.4కే బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభిస్తుంటే యాదాద్రి ప్లాంటు పేరుతో యూనిట్‌కు రూ.10 ఖర్చు పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయడం దుర్మార్గమన్నారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ.29 వేల కోట్ల అంచనా వ్యయం అయితే, ఇప్పటికే రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని, అయినా యాదాద్రి పనులు పూర్తి కాలేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, బొగ్గు ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన పవర్ ప్లాంట్ పనులు పక్కన పెట్టారని విమర్శించారు. -
గాంధీ భవన్ లో పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం
-
గాంధీ భవన్: పొన్నాల ఫైర్.. సముదాయించిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ.. సోమవారం గాంధీభవన్ వద్ద నాటకీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పోలింగ్ సిబ్బంది తీరుపై సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు లిస్ట్‌లో ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులే అందుకు కారణంగా తేలింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం పీసీసీ ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరికీ మాత్రమే ఓటింగ్ అవకాశం ఉంటుంది. జనగామ నుంచి పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డికి ఓటింగ్ ఐడీ కార్డు ఇచ్చింది ఏఐసీసీ. దీంతో.. పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డి ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చారు. అయితే.. శ్రీనివాసరెడ్డికి ఓటు హక్కు లేదని అడ్డుకున్నారు గాంధీ భవన్ పోలింగ్ సిబ్బంది. దీంతో రగడ మొదలైంది. శ్రీనివాసరెడ్డి స్థానంలో ఆ ఓటు హక్కును కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయించినట్లు గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బంది తెలిపారు. దీంతో పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. శ్రీనివాసరెడ్డికి ఓటు నిరాకరించడం ఒక ఎత్తు అయితే.. కొమ్మూరి ప్రతాప్‌కు ఓటు ఇచ్చి తనను అవమానించారంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు పొన్నాల. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న జానారెడ్డి.. పొన్నాలను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ పంచాయితీపై తేలేవరకు గాంధీ భవన్ వీడనని భీష్మించుకుని అక్కడే ఉండిపోయారు పొన్నాల. -
మోదీ, కేసీఆర్ పాలనకు బుద్ధి చెప్పండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీమంత్రి పొన్నాల లక్ష్మ య్య పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలోని రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి లోపాయికారీగా కేసీఆర్ మద్దతునిస్తున్నారని, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పొన్నాల కోరారు. -
కేసీఆర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎందుకో అర్థం కావడం లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కైలాశ్‌కుమార్, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడుతూ, తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేసిన పొన్నాల, గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్ వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని అన్నారు. దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తోందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వచ్చాయని, పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినన తర్వాత ఒక్క మెగావాట్ కూడా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు. -
దళిత, గిరిజన ద్రోహి కేసిఆర్: పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం గాంధీవభన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుధీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగినా ఒక్క అధికారిక ప్రకటన రాలేదని మండిపడ్డారు. నాగార్జున సాగర్ అభివృద్ధిపై మంత్రి మండలిలో చర్చించిన తర్వాత మళ్లీ హాలీయాలో సమీక్ష దేనికని, కేవలం ప్రచార ఆర్బాటమని దుయ్యబట్టారు. హామీల అమలుపై సమీక్ష అంటున్న సీఎం కేసిఆర్, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఎందుకు సమీక్షించలేదని సూటిగా ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి 15 రోజుల్లో నాగార్జున సాగర్‌లో ప్రజా దర్బార్ పెడతానన్న కేసీఆర్ మాట ఏమైందని నిలదీశారు. హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయనే సాగర్‌లో సీఎం పర్యటన చేపట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో కేసీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్, జూలైలో సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం నిన్న నీరు విడుదల చేసిందని మండిపడ్డారు. ఆలస్యంగా నీరు విడుదల చేయడం వల్ల కృష్ణా నది నుండి 45 టీఏంసీల నీరు సముద్రం పాలైందని అన్నారు. దళిత బంధు కేవలం ఓట్లు దండుకోవడానికేనని, దలిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పక్కన పెట్టారని విమర్శించారు. ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తాననడం ప్రచార ఆర్బాటం కాదా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే దళితులు, గిరిజనులు స్వశక్తిగా ఎదుగుతారని అన్నారు. దళిత, గిరిజన ద్రోహి కేసిఆర్, భవిష్యత్తులో తెలంగాణ ద్రోహిగా కేసిఆర్ నిలుస్తాడని పొన్నాల లక్ష్మయ్య విరుచుకపడ్డారు. -
నో చాన్స్..టీపీసీసీలో ఓరుగల్లుకు మొండిచేయి
సాక్షి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)లో ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి వరంగల్‌కు మొండిచెయ్యి చూపింది. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్‌లో మనుగడ సాగిస్తున్న పలువురు సీనియర్లను పార్టీ విస్మరించింది. అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకుల పేర్లు లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆరు జిల్లాల పరిధిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ వేం నరేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య మినహా ఎవరికీ ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యకు గౌరవప్రదంగానైనా ఏ పదవీ ఇవ్వ లేదు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, క్యాంపెయిన్ కమిటీ, ఎలక్షన్ మేనేజ్ మెంట్, ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీల్లోనూ ఓరుగల్లు నేతల పేర్లను పరిగణలోకి తీసుకో లేదు. భౌగోళికంగా ఉమ్మడి కరీంనగర్లో మంథని నియోజకవర్గం ఉన్నా.. ఆ నియోజకవర్గంలోని ఆరు మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిందకు వస్తాయి. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేరు కూడా పీసీసీ చీఫ్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. చివరికి టీపీసీసీలో కనిపించలేదు. కేంద్ర మాజీ మంత్రి, షెడ్యూల్ కులాలకు చెందిన పోరిక బలరాంనాయక్, మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండపల్లి దయాసాగర్‌లను ఈ కమిటీ నిరాశపర్చింది. చదవండి: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినా.. ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన సీనియర్ నేత దొంతి మాధవరెడ్డినీ విస్మరించింది. టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు కీలకంగా మారిన సమయంలో ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనను విస్మరించడం పట్ల కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ జరు గుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పలువురిని కూడా పార్టీ అ«ధిష్టానం నిరాశపర్చడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న .. ధనసరి అనసూయ(సీతక్క)కు ఈ కమిటీలో కీలక పదవే దక్కుతుందని భావించారు. అయితే ఆమెను ఆ పదవికే పరిమితం చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రస్థాయి ఏ కమిటీలోనూ జిల్లా నాయకుల ప్రాధాన్యం లేనట్లైంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన హేమాహేమీ నాయకులు రాష్ట్రకమిటీతో పాటు జాతీయ స్థాయి పదవుల్ని అందుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఈ కమిటీలో ఏర్పడింది. పార్టీ అ«ధిష్టానం పలువురు సీనియర్లకు మొండిచెయ్యి చూపడం కలకలం రేపుతోంది. -
కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏం చేశారని జైల్లో పెడతారు? బీజేపీకి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా’ అని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాల కంటే సీఎం కేసీఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నందున అపుడు ఎవరు గెలుస్తారో చూద్దామని మహేందర్‌రెడ్డి సవాలు చేశారు. చదవండి: చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’ రామ మందిరానికి రూ.లక్ష విరాళం: పొన్నాల ‘నా పేరు లక్ష్మణుడు.. అందుకే రామభక్తితో నా వంతుగా రామ మందిర నిర్మాణానికి రూ.1,00,116 విరాళంగా ఇస్తున్నా..’అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాముణ్ని రాజకీయాల్లోకి లాగకుంటే మంచిదని, గతంలో తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టానని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని కోరారు. -
జంగా, పొన్నాల వర్గీయుల బాహాబాహీ
సాక్షి, జనగామ: జనగామ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని పీసీసీ పిలుపు మేరకు కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘కిసాన్ బచావో–మజ్దూర్ బచావో దివస్’కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంబర్తి కమాన్ వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు ఇరువర్గాలు పోటీ పడ్డాయి. మరోవైపు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మాటామాటా పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. శ్రవణ్‌కుమార్ సాక్షిగా ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. గల్లాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టివేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు. ఒక దశలో కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హఠాత్ పరిణామాన్ని దాసోజుతో పాటు అక్కడున్న వారు చూసి నిశ్చేష్టులయ్యారు. దాసోజు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పొన్నాల వర్గీయులపై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది. చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం... -
పొన్నాల వర్సెస్ జంగా!
సాక్షి , వరంగల్ : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్‌రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరిన కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. -
పార్టీలో ఏకపక్ష పోకడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏకపక్ష పోకడలు పోతున్నారని, సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, దామోదర రాజనర్సింహలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఈ ముగ్గురు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆక్షేపణలు చేసిన ఆ ముగ్గురు నేతలు కుంతియాపై కస్సుబస్సులాడినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జుల నియామకంలో ఎవరిని సంప్రదించారని, ఇష్టం వచ్చిన వారిని ఇన్చార్జులుగా నియమించారని అభ్యంత రం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు టీఆర్ఎస్ కోసం పనిచేస్తుంటే మరికొందరు కాంగ్రెస్‌ను బతికించుకునేందుకు పోరాడుతున్నారని వారు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉంటుందని, సీనియర్లను విస్మరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డ నేతలు.. భవిష్యత్తులోనైనా తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కుంతియాను కోరారు. కాగా, కుంతియాను పలువురు టీపీసీసీ నేతలు కూడా ఆదివారం కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. -
పొన్నాలకు పౌల్ట్రీ లెజెండ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, తిరుమల హేచరీస్ ఫౌండర్ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్యకు పౌల్ట్రీ లెజెం డ్ అవార్డు దక్కింది. పౌల్ట్రీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన పౌల్ట్రీ ఇండియా సంస్థ ఈ అవార్డుకు ఆయన ను ఎంపిక చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే పౌల్ట్రీ ఇండియా 13వ ఎడిషన్ కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు. -
హరీశ్‌రావును పథకం ప్రకారమే తప్పించారు..
సాక్షి, వరంగల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’ అని పీపీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకర్లను తలపించిన పోలీసులను తప్పించుకొని చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. హన్మకొండలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్‌ను విస్మరించి పోలీసులు రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల ముందు కాపలా ఉన్నారన్నారు. కేసీఆర్ కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తుల దక్కించుకోవడానికి ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడుగా ఉన్న హరీశ్‌రావును పథకం ప్రకారమే తప్పించారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ విషయంలో 70 ఏళ్లలో భారతదేశంలో ఇంతటి దుర్దినం కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగించాలని, శనివారం ట్యాంక్‌బండ్ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేత పొన్నాలకు తప్పిన ప్రమాదం
-
పొన్నాల కారును ఢీకొట్టిన షూటింగ్ వాహనం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 1/45 చౌరస్తాలో సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కారులో నుంచి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్‌లోకి వెళ్లిన సమయంలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పొన్నాల తన మనవడితో కలిసి కారులో జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్–1 వైపు షాప్‌కు వచ్చాడు. కారు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అదే సమయంలో సినిమా షూటింగ్ వాహనం రివర్స్ తీసుకునే క్రమంలో చూసుకోకుండా పొన్నాల కారు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అధైర్యపడొద్దు.. మేం అండగా ఉన్నాం
సాక్షి, జనగాం : ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న రిలే నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పొన్నాల కార్మికులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. పొన్నాల లక్ష్మయ్య ఆర్టీసీ డిపోకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి సుమారు రూ. 60 వేల కోట్ల ఆస్తులను ఏళ్ల పాటు తన అనుయాయులకు లీజుకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డదారిలో తొలగిస్తున్నాడన్నారు. ప్రపంచ నియంతల చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలుస్తున్నాడని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడితే కేవలం తన కుటుంబంతో పాటు అనుయాయులకు మేలు చేసుకునే విధంగా రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలన కంటే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్టీసీని దివాలా తీయించారన్నారు. దీనిపై కార్మికులు గర్జిస్తుంటే సమ్మెను తప్పుదారి పట్టించేందుకు అనేక కుట్రలు పన్నుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను 144 సెక్షన్‌తో తొక్కిపడేస్తూ ప్రైవేట్‌పరం చేసేందుకు లోలోపల అంతా సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజల ప్రతిస్పందన చూడబోతున్నావ్... నియంత పాలనతో విసుగుపుట్టిన ప్రజలు తమ ప్రతి స్పందన చూపించబోతున్నారని పొన్నాల అన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులను పస్తులుంచిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని చెప్పారు. హన్మకొండ హంటర్ రోడ్డు ఆర్టీసీ పరిధిలోని రీ ట్రేడింగ్ సెంటర్‌ను కరీంనగర్‌కు బదిలీ చేసి. రూ.100 కోట్ల విలువైన భూమిని కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలి రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అనేక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి సమస్యలను పరిష్కరించకుంటే పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 48 వేల ఆర్టీసీ కుటుంబాలను » జారున పడేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు లింగాజీ, రంగరాజు ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజమౌళి, లక్కార్సు శ్రీనివాస్, అల్వాల ఎల్లయ్య, ధర్మపురి శ్రీనివాస్, వరలక్ష్మి, అజహరొద్దీన్, ఖాదర షరీఫ్, జమాల్‌షరీఫ్, కొమ్ము నర్సింగారావు, ఎండీ.అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, మోర్తాల ప్రభాకర్, జక్కుల వేణుమాధవ్, దిలీప్‌రెడ్డి, క్రాంతి, రంగు రవి, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్ తదితరులున్నారు. -
గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ‘వికారినామ సంవత్సరానికి రాజు శని. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయి. పాలకుల మధ్య వైరం ఉంటుంది. పాలకులు, ప్రజలు రోగాలతో బాధపడతారు. పంటలు స్వల్పంగా పండుతాయి. దేశం, రాష్ట్రంలో పాలకులు, ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజలకు మేలు జరగదు. దేశం, రాష్ట్రంలో అస్థిర రాజకీయ వాతావరణం ఉంటుంది. దేశ ఆదాయం 45 కాగా ఖర్చు 65గా ఉంటుంది. ఆర్థిక వనరులు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. స్వదేశీ పారిశ్రామిక కంపెనీల్లో నకిలీ ఔషధాలు బయటపడతాయి. సాంకేతిక, సమాచార రంగంలో నూతన పోకడలతో యువత ప్రమాదాలను ఎదుర్కొంటారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కుమార్ రావు, కోదండరెడ్డి, వినోద్‌కుమార్, వినోద్ రెడ్డి, జి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఫలితాలొచ్చాయని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరి గిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. గురువారం తన నివాసంలో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి నప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా సమయం కుదరలేదని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు. లేఖ లో పేర్కొన్న విషయాలను ఆయన వివరించారు. పోలిం గ్ రోజున చాలా చోట్ల ఈవీ ఎంలు పనిచేయలేదని, వాటి స్థానంలో తప్పుడు ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన 36 గంటల తర్వాత కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించలేదని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన 3 గంటల్లో పోలింగ్ శాతం వెల్లడైందని, ఆ రాష్ట్రాల కంటే తక్కు వ అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మాత్రం 36 గంటలు పట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో, ఆ తర్వాత అక్రమాలు చేసినందుకే ఇంత సమయం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు.. ఎన్నికల ముందే టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లుగానే ఫలితాలొచ్చాయని, పేర్లతో సహా ఆయన చెప్పిన వారే గెలిచారని, ఇది కూడా ఎన్నికల్లో అక్రమాలకు నిదర్శనమని పొన్నాల పేర్కొన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కౌం టింగ్ ఎందుకు జరిగిందో ఈసీ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదన్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వ్యక్తు లు కూడా ఓట్లు వేసినట్టు నమోదైందని ఎన్నికల తర్వాత మీడియా పరిశోధనల్లో తేలిందన్నారు. -
బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహించం
హైదరాబాద్: తెలంగాణలో బీసీల ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 22%కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరు తూ శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ, అఖిలపక్ష నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 54% ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల రాజ్యం తీసుకురావడానికి రాత్రికి రాత్రే దొంగచాటుగా బీసీలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం అయింద న్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను కొనసాగించాలని ఎంబీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన బీసీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు మల్లయ్య, జి.నరేశ్, కిల్లె గోపాల్, రాకేశ్ నాయి తదితరులు పాల్గొన్నారు. -
మూకుమ్మడిగా ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయడంపై అన్ని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేష న్లు పెంచాల్సి ఉండగా, అనూహ్యంగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. వెనుకబడిన తరగతులను అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అందువల్ల రిజర్వేషన్ల సాధనలకు మూకుమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయగా.. ప్రస్తుతం దీన్ని 22 శాతానికే కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆర్డినెన్సు సైతం జారీ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మూడ్రోజుల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చెపట్టాలని నిర్ణయించాయి. ఈ నెల 28న అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిలను కలిసి పరిస్థితిని వివరించి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ నెల 29న జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు. పార్టీలకతీతంగా ఉద్యమించాలి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు సంగతి సరే.. పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం. ఈ నిర్ణయంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. నాయకుడిగా ఎదిగేందుకు దారిచూపే పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు అవకాశాలు తగ్గితే వారి అభివృద్ధి కష్టమే. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఆయన స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లు తగ్గితే ఊరుకోం. కచ్చితంగా పోరాడతాం. పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు కులసంఘాలే ఓడించాయి బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలని అన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు బీజేపీ ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లను బీసీలకు కేటాయించింది. కానీ ఆ బీసీ అభ్యర్థులను ఓడించింది బీసీ కుల సంఘాల నేతలే. వీరంతా తీర్మానించుకుని టీఆర్ఎస్ను గెలిపిస్తే.. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకతీతంగా బీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన లెక్కలను సర్కారు బయటపెట్టడం లేదు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఏనాడూ చెప్పలేదు. జనగణన వివరాలను సమర్పిస్తే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కోర్టులే స్పష్టం చేశాయి. కలిసి పోరాడకుంటే బీసీలకు తీవ్ర అన్యాయం తప్పదు. – డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానివి కుంటిసాకులు బీసీ జనాభా ఎంతుందో ప్రభుత్వం చెప్పడం లేదు. కానీ రిజర్వేషన్లు మాత్రం అడ్డదిడ్డంగా తగ్గించింది. జనగణన లేనందునే 50% రిజర్వేషన్లు మించొద్దని కోర్టు చెప్పింది. వివరాలు సమర్పిస్తే పెంచొద్దని కోర్టులు చెప్పవు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుంటి సాకులు చెబుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆర్డర్‌ను బూచిగా చూపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ముందుగా జనగణన చేసి వివరాలు వెల్లడించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి. 2016లో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి.. రిజర్వేషన్లపై స్టే తెచ్చుకోవచ్చు. ఆమేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ బీసీల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ప్రధానికి వివరిస్తే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. – జస్టిస్ వి. ఈశ్వరయ్య న్యాయ పోరాటం చేద్దాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటం చేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలి. పాలనను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ పొరుగురాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇలా రాష్ట్రాలు పట్టుకుని సీఎం ఎందుకు తిరుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సును ఉపసంహరించుకున్న తర్వాత పర్యటనలు చేసుకోవాలి. – పొన్నాల – పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు సర్కారు కళ్లు తెరిపిద్దాం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డి నె న్స్ జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్టే తెచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతుంది. ఈ విధమైన రిజ ర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వీటిని సాధించుకునేందుకు పార్టీలకతీ తంగా ఉద్యమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనీస విలువనివ్వడం లేదు. – చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడదాం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు, సం ఘాలు ఒకే వేదిక ద్వారా పోరాడాలి. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్య తదితరులంతా కలిసిరావాలి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు రాష్ట్ర బం ద్‌కు పిలుపునిచ్చి తర్వాత ఉపసంహరించుకోవడంలా బీసీ ఉద్యమాన్ని నడపొద్దు. బీసీ రిజర్వేషన్లను పంచాయతీలతోపాటు.. చట్టసభల్లోనూ అమలుచేసుకునేలా ఐక్యంగా ఉద్యమిద్దాం. – జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
జనగామ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాల నామినేషన్
-
పంతం నెగ్గించుకున్న పొన్నాల..
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పంతం నెగ్గించుకున్నారు. పార్టీ అధిష్టానంతో పోరాడి జనగామ టికెట్‌ను ఆయన సాధించారు. జనగామ నుంచి పొన్నాల బరిలోకి దిగుతారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా స్పష్టం చేశారు. కోదండరామ్ పెద్ద మనుసు చేసుకుని జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జనగామ సీటు విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్‌తో చర్చలు జరిపారు. అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసని, అది తమకు బాగా లాభిస్తుందని అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కోదండరామ్‌తో ప్రచారం చేయిస్తామని తెలిపారు. ప్రజాకూటమి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తారని వెల్లడించారు. కేసీఆర్‌కు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే చేతకాక ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను అంతమొందిచటమే లక్ష్యంగా టీజేఎస్, టీడీపీ, సీపీఐలతో జట్టు కట్టామని పేర్కొన్నారు. మేనిస్టోలోని అంశాలను తూ.చ తప్పుకుండా అమలు చేస్తామని ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3, కాంగెస్ర్ 94 చోట్ల పోటీ చేస్తుందని కుంతియా వెల్లడించారు. -
ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యేనే కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన ఆయన అక్కడ సాక్షితో మాట్లాడారు. తన సర్వే రిపోర్ట్ బాగా లేదంటున్నవారు 65 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్‌ను బయట పెట్టాలన్నారు. ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్నాని తెలిపారు. జనగామ టికెట్‌ను ఎన్నికల కమిటీ తనకు ప్రతిపాదించిందని, అయినా తన పేరు జాబితాలో ఎందుకు రాలేదో తెలియదన్నారు. టీఆర్ఎస్లో చేరుతానని కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, ఏడాదికి పైగా తనకు టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందని తెలిపారు. భువనగిరి ఎంపీ టికెట్ తనకొద్దని, మాజీమంత్రులు అందరినీ లోక్‌సభకు పంపుతున్నారా? అని ప్రశ్నించారు. మహాకూటమి ఒప్పందంలో భాగంగా టీజేఎస్ అధినేత కోదండ రాం జనగామ టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. పొన్నాల లక్ష్మయ్య ఇతర స్థానాలు నుంచి పోటీచేసేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. పొన్నాల మాత్రం తనకు జనగాం తప్పా.. ఏ స్థానం వద్దని పట్టుబడుతున్నారు. -
గ్రామాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా : పొన్నాల
సాక్షి, సిద్దిపేట జిల్లా : గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చర్చించేందుకు టీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చేర్యాలలో మున్సిపల్ ట్యాక్స్‌ని వసూలు చేయడం కోసం షాపులకు తాళం వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌దంటూ ఎద్దేవా చేశారు. గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చర్చించేందుకు టీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అంటూ పొన్నాల సవాల్ చేశారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని పొన్నాల ఆరోపించారు. దానంపల్లి గ్రామ మహిళలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. నీళ్లిచ్చే ఓటు అడుగుతన్న కేసీఆర్ మాట తప్పి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేర్యాలలో అభివృద్ధి జరిగిందన్నారు. నకసి కళలను ప్రోత్సాహించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచి మళ్లీ 9 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏం చేశారని టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ మీ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ప్రజలు మీ నాయకుల్ని తరిమికొడుతున్నారంటూ పొన్నాల మండిపడ్డారు. -
‘కేసీఆర్ నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజమైన తెలంగాణ వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యముంటే నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకోవాల’ని కేసీఆర్‌కు సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులుంటే.. వారికి రైతుబంధు లభించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ డీలర్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేశారని మండిపడ్డారు. రెండు లక్షల మంది ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు తమ సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఐఆర్ లేక ప్రభుత్వ ఉద్యోగులు, సమస్యలు పరిష్కారంచలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని పొన్నాల తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని వడ్డీ తీర్చలేని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. కాంగ్రెస్ ప్రకటించిన కొన్నిరోజులకు నిరుద్యోగ భృతి ప్రకటించారని గుర్తుచేశారు. జాగో బాగో చరిత్ర కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. తను ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని జోస్యం చెప్పారు. -
అల్లుళ్లు అత్తారింటికి రావడం లేదు: పొన్నాల
బచ్చన్నపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో అల్లుళ్లు అత్తారింటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పల్లె నుంచి ప్రగతి భవన్ వరకు అల్లుళ్ల బస్సు యాత్రను మంగళవారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ తెలంగాణలో పేదల ఇల్లు చిన్నగా ఉన్నాయని, అందులోనే గొర్రెలు, బర్రెలను తోలుకొని మనుషులు ఓ మూలన పడుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. అల్లుళ్లు ఇంటికి వస్తే అత్తలు బయట పడుకునే పరిస్థితి నెలకొందని, అందుకే వారందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. వాటిని ఎక్కడ కట్టించారో చూపించాలని డిమాండ్ చేశారు. అల్లుళ్ల మనోభావాలు దెబ్బతిని బస్సుయాత్రను చేస్తున్నారని తెలిపారు. కాగా, బస్సు యాత్రలో వెళ్తున్న వారిని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం వద్ద పోలీసులు బస్సు యాత్రను అడ్డుకొని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
‘కేసీఆర్‌ను ప్రజలు బొందపెడతారు’
సాక్షి, జనగాం : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మూడో ఫ్రంట్ మూన్నాళ్ల ముచ్చట అయినట్లుగానే.. కేసీఆర్‌ను ప్రజలు బొందపెడతారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై అనైతిక వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. తెలంగాణ ద్రోహులతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని టీడీపీతో ఎలా జతకట్టారని ప్రశ్నించారు. అప్పుడు పొత్తుపెట్టుకుని ఇప్పుడు దూషిస్తున్నావ్! నువ్వు మనిషివేనా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ మాటలు సిగ్గుచేటు, అనైతికతకు నిదర్శనమన్నారు. అప్పట్లో పొత్తు పెట్టుకున్న కారణంగానే టీఆర్ఎస్కు 10 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. టీడీపీలో మంత్రి సీటు రాకపోవటంతో కపటనాటకాలు వేసి, దొంగ దీక్షలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచాడని విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని సోకులాగా మాట్లాడితే సరిపోదని, ప్రజలకు అభివృద్ధి చూపించాలని ఎద్దేవా చేశారు. ఈడీ, పాస్ పోర్ట్స్, సహారా కేసుల్లో కేసీఆర్ దోషిగా ఉన్నారని, నిర్దోషిగా బయటపడటానికే మోదీ దగ్గర మోకరిల్లారని పేర్కొన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తీర్చి దిద్దారని ఆరోపించారు. సిమెంట్ ధర పెంచిన ఘనత కేసీఆర్‌దేనని, అమరవీరుల ఆశయాలను, సామాన్యుల నడ్డి విరచడానికే ధరలు పెంచావన్నారు. -
కేసీఆర్ తెలంగాణ వ్యక్తే కాదు : పొన్నాల
సాక్షి, జనగామ: సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యక్తే కాదని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 1956కు ముందు కేసీఆర్ ఫూర్వీకులు తెలంగాణకు సెటిలర్స్గా వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. అలాంటిది ఇక్కడికి బతుకు దెరువు కోసం వచ్చిన వారినే జాగో.. బాగో అంటూ కేసీఆర్ తెలంగాణ వాడిగా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. మోసపూరిత రాజకీయ కుట్రలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అదే రీతిలో ఓటమిచెందక తప్పదని జనగామలో జరిగిన విలేఖరుల సమావేశంలో పొన్నాల ధ్వజమెత్తారు. కేసీఆర్ మూడవ ఫ్రంట్ మూన్నాళ్ల ముచ్చటేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
‘స్పష్టమైన తీర్పునిచ్చినా..దొడ్డిదారిన రద్దు చేశారు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్‌కు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినా..దొడ్డిదారిన అసెంబ్లీ రద్దు చేశారని టీపీసీపీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును అగౌరవపర్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్న కేసీఆర్ మధ్యలోనే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఓటమికి భయపడి ప్రజల తీర్పును అగౌరవపరిచారని ఆరోపించారు. తెంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం పెరిందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50సార్లకు ఎక్కువగా కోర్టులు కేసీఆర్ నిర్ణయాలను తప్పుబట్టాయని గుర్తుచేశారు. మల్లన్న సాగర్‌లో 144 సెక్షన్ పెట్టిన గొప్పనియంత కేసీఆర్అని విమర్శించారు. గత ఎన్నికల మేనిఫెస్టో మీద చర్చకు సిద్దమా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. -
‘విభజన హామీల్లో అదొక్కటే ఉందా?’
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతిచ్చి.. లోక్‌సభలో బైసన్ పోలో గ్రౌండ్‌కోసం నిరసన తెలపడం టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి మద్దతుపలుకుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు పలికి, లోక్‌సభలోనేమో బైసన్ పోలో గ్రౌండ్ కోసం నిరసన చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉండగా కేవలం బైసన్ పోలో గ్రౌండ్ కోసమే పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అందుకే నూతన సెక్రటేరియట్ నిర్మాణం పేరిట నిధులు దోచుకోవడానికే ఈ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. బీజేపీ విభజన హామీలు నెరవేర్చకుండా జాప్యం చేస్తుంటే.. ఇంకా ఆ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం రోజు టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయకుండా సభనుంచి ఎందుకు పారిపోయారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులకు విభజన హామీలు గుర్తుకొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. తెర ముందు బీజేపీని తిడుతూ.. తెరవెనక ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. మీ తెర వెనక రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో వాల్లే మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. -
చుట్టపు చూపు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్తానంపై చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన పొన్నాల.. కొన్ని నెలల నుంచి పూర్తిగా మౌనముద్రలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిం చిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పెద్ద కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరికి తన సొంత నియోజకవర్గం జనగామకు కూడా అరుదుగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ పయనం ఎటు వైపు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అప్పట్లో అన్నీ తానై.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో శాసించారు. రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు మంత్రులుగా పనిచేసినా... కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పూర్తిగా పొన్నాల నిర్ణయంతోనే జరిగాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యారు. కీలకమైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సారథిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో పొన్నాల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవిని వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికలకు ఎవరు దిక్కు..! గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో కీలకంగా పనిచేసినా, వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోనూ పొన్నాల తన ప్రభావాన్ని కొనసాగించారు. మరో వైపు కాంగ్రెస్‌లో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డీఎస్.రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లో కీలక నేతలు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు ఎవరనే అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో నాయకత్వం వహించి పార్టీని నడిపించాల్సిన పొన్నాల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన సందర్భాలలో పొన్నాల తీరు అసంతృప్తిగా ఉంటోందని అంటున్నారు. స్వయంగా కార్యక్రమాలను నిర్వహించడం విషయం ఎలా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల ప్రకారం జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గమైన జనగామకు సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో జనగామ జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన సమయంలోనూ పొన్నాల కీలకంగా వ్యవహరించలేదనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఆ తర్వాత అదే వైఖరి కొనసాగుతోందని అంటున్నారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పాలకుర్తి, నర్సంపేట, మొగుళ్లపల్లి సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పుతోపాటు పలు ఇతర సెగ్మెంట్లలో ఫర్వాలేదనిపించేలా ఈ యాత్ర జరిగింది. ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట పొన్నాల పాల్గొనలేదు. రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్‌కు తరలివచ్చి ‘కాగ్ అద్దంలో కేసీఆర్ అబద్దాలు’ పేరుతో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు దూరంగా ఉన్నారు. పొన్నాల ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన నాయిని రాజేందర్‌రెడ్డి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. దీంతో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో డివి జన్లలో పాదయాత్రను ప్రారంభించారు. గత వారం రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను పురస్కరించుకుని నాయినిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అధికార పార్టీ ఎదురుదాడిలోనూ యాత్ర జరుగుతున్నా సీనియర్ నేత పొన్నాల కన్నెత్తి చూడడం లేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి: పొన్నాల
సాక్షి, జనగామ: వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు పూర్తైందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉమ్మడి రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రజల సంక్షేమం అని భావించి వ్యవసాయానికి లాభం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. అత్యంత పొడవైన సొరంగ మార్గం గల శ్రీశైలం పాజెక్టును 30 సంవత్సరాలలో పూర్తి చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. సింగరేణికి 22 కిలోమీటర్ల భూసేకరణ చేసి విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం రాకుండా చేశామని తెలిపారు. అయినా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది పథకాల మీద కానీ ప్రచారం మీద కాదన్నారు. రైతులకు లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీయిచ్చి మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి, రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు పంట నష్టపోయారని, ఇంతవరకు నష్టపోయిన పంటలను మీ అధికారులైనా.. రైతు సమితి సభ్యులైనా సందర్శించారా అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పండిన పంటకు మద్దతు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధరపైన బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. కౌలు రైతులు, దేవాదాయ భూములు చేసే రైతులు మీ కళ్లకు కనిపించడం లేదా? వారికి కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘నిరూపిస్తే అసెంబ్లీ ముందు ఉరేసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న వార్తలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఏ కుంభకోణంతోనైనా సంబంధం ఉందని నిరూపిస్తే అసెంబ్లీ ముందే ఉరేసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ హయాంలో వెలుగులోకి వచ్చిన నయీం కేసు, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ ఎంతవరకు వచ్చిందో సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్.. ఇంటికో ఉద్యోగం ఏది?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిరుద్యోగులను మోసం చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం ఏది కేసీఆర్.. ఉద్యోగం ఇస్తామంటే ప్రజలు వద్దంటారా అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సారి బడ్జెట్లో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.1,100 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఆ ఇళ్లు పూర్తి కావడానికి 120 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. మరోవైపు బడ్జెట్ ప్రకారం దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇవ్వడానికి 75 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగకపోగా, నాలుగేళ్లలో దాదాపు ఏడు వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. -
రైతులకు పరిహారం ఇవ్వరా..?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్ : వడగండ్ల వర్షాలతో పంట నేలపాలవుతున్నా, పిడుగుపాట్లతో రైతులు మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ...పంట నష్టంపై ఇంతవరకు అధికారులెవ్వరూ క్షేత్రస్థాయికి వెళ్లలేదని, రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పటివరకు కనీసం పరామర్శించని సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుబంధు పేరుతో వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
ఉసురుతీసిన అప్పులు
సాక్షి, జనగామ: అన్నం పెట్టే చేతులకు జీవం లేదు.. భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ రైతు దంపతుల గుండె ఆగిపోయింది. సాగు కోసం చేసిన అప్పులు చివరికి వారి ప్రాణాల మీదకు తెచ్చాయి. తడిసిమోపెడైన అప్పులను తీర్చలేమని మనోవేదనకు గురై సొంత వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలం సిద్ధేంకి గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి(55), లక్ష్మి(51) దంపతులకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. కూతుళ్ల పెళ్లి కోసం నాలుగెకరాల భూమిని అమ్ముకోగా ప్రస్తుతం రెండు ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పెట్టుబడి కోసం రూ. 10 లక్షల వరకు అప్పులు చేశారు. అయితే ఆశించిన పంట దిగుబడి రాకపోవడం.. మరోవైపు అప్పులు భారంగా మారడంతో నర్సిరెడ్డి, లక్ష్మీ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పు తీర్చే మార్గం కానరాక గురువారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దకుమార్తె స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాలను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సందర్శించి నివాళులర్పించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?
-
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా.. అని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు, ప్రగతిభవన్‌కు పలువురు నేతలను పిలిపించుకొని కేసీఆర్ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు పూర్తి, రైతాంగానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్లేకుండా ఉంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంకుశ, గఢీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. -
బిల్డప్ ఇస్తున్నారు: పొన్నాల
సాక్షి, వరంగల్ అర్బన్: కేసీఆర్ పాలన అవినీతికి నిలయంగా, మోసానికి, దగాకు ప్రతీకకగా మారిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల సాక్షిగా సీఎం కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. పోలీస్ అకాడమీ పేరు మార్పు విషయంలో, ఆగస్ట్ 15న ఉద్యోగ నియామకాల విషయంలో చెప్పినవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. అబద్ధాలతో కాలయాపన చేస్తున్న సీఎం ఉద్యమం, సెంటిమెంట్ పేరుతో ప్రజలన మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదించాలో రైతులందరికీ చెప్పాలని కోరారు. ఉత్తమ రైతు అవార్డు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏనాటి ఫోటోలో ఇప్పుడు ట్వీట్ చేసి ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏకఛత్రాధిపత్యంగా తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తామేదో గొప్ప చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ వచ్చాక తెలంగాణ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. ఇకనైనా ఆటలు, మాటలు కట్టిపెట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే మంచిదని సూచించారు. -
అది కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభ
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన సభపై పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం పేరుతో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమంపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. అది కేవలం కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉనికిని కాపాడుకునేందుకే ఈ సభ చేపడుతు న్నారన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసిన కాల్వల ద్వారా నీళ్లిస్తూ.. తమ పార్టీవి మోసపూరిత ప్రాజెక్టులనడం సిగ్గుచేటన్నారు. -
కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో కాంగ్రెస్ నేత
-
కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో కాంగ్రెస్ నేత పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలివి లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకో వాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో దళితులపై దాడులు చేసిన పోలీసులపై కఠినంగా వ్యవహరిం చకుండా పోలీసులకు మద్దతుగా మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఇలాగే వ్యవహరించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పబ్‌లకు అనుమతి ఇచ్చిందో లెక్క తేల్చాలన్నారు. వాటి యజమానులు ఎవరో, వాటికి ఎవరు అండగా ఉన్నారో ధైర్యముంటే బయట పెట్టాలని పొన్నాల ఈ సందర్భంగా సవాల్ చేశారు. -
ఇది గడీల రాజ్యమా: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే పైరవీభవన్ వంటి ప్రగతిభవన్‌కే సీఎం కేసీఆర్ పరిమితం కావడం దొరలు, గడీల రాజ్యానికి కొనసాగింపు కాదా అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బూటకపు వాగ్దానాలు చేసి అవగా హన లేకుండా పాలన చేస్తున్నారన్నారు. ఈమేరకు శుక్ర వారం సీఎం కేసీఆర్‌కు పొన్నాల బహిరంగ లేఖ రాశారు. నోట్ల రద్దు వల్ల వ్యవ సాయ పనులు వదిలిపెట్టి బ్యాంకుల ముందు నగదు కోసం రైతులు పడి గాపులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నోట్ల రద్దుకు మద్దతిచ్చిన సీఎం.. రైతులకు నగదు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వైఫల్యంవల్ల పంటరుణాల మాఫీ పథకం కేవలం వడ్డీమాఫీ పథకంగా మారిందని, బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని స్వయంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసినా రైతులకు ఉపయోగం లేకుండాపోయిందని పేర్కొన్నారు. -
దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం నుంచి ఇప్పటిదాకా దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయ ని, అదే కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో సోమ వారం నిర్వహించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేసి, మిఠాయిలను పంచారు. అనంతరం పొన్నాల మాట్లా డుతూ.. కొన్ని రాజకీయ స్వార్థపర శక్తులు కాంగ్రెస్‌పై కుటుంబ పాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. రాహుల్‌గాంధీ పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని చెప్పారు. దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్‌గాంధీ ఎదిగారని పొన్నాల అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దెమర్ని నర్సింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ నేతలు జి.నిరంజన్, కొనగల మహేశ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటానన్నాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రాన్ని సాధించడం నుంచి ఇప్పటిదాకా దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయని, అదే కాంగ్రెస్‌పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాహుల్‌గాంధీ 48వ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి, మిఠాయిలను పంచుకున్నారు. దేశ భవిశ్యత్తు కాంగ్రెస్‌తోనే.. అనంతరం పొన్నాల మాట్లాడుతూ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తండ్రి, దేశస్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ దేశం కోసమే ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. కొన్నిస్వార్థ రాజకీయ శక్తులు కాంగ్రెస్‌ది కుటుంబపాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేశ ప్రధానమంత్రి పదవి కూడా అధిష్టించే అవకాశం ఉన్నా సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. ఇలాంటి చరిత్రను దాచిపెట్టేవిధంగా మాట్లాడటం మంచిదికాదని హెచ్చరించారు. కాపలా కుక్కలా ఉంటానన్నాడు.. 1999లో మంత్రి పదవి రానందుకే కేసీఆర్ పార్టీ పెట్టారని లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఎన్నికల్లో గెలవడం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని పొన్నాల ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కూడా పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని చెప్పారు. దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్‌గాంధీ ఎదిగారని పొన్నాల అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు. -
కేసీఆర్ పక్కనే తెలంగాణ ద్రోహులు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయినందుకు కె.చంద్రశేఖర్‌రావు ఏం సమాధానం చెబుతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానని చెప్పిన కేసీఆర్, తాను మాట్లాడిన వేదిక మీద కుడి, ఎడమ, వెనుక ఎవరున్నారో చూసుకుని మాట్లాడాల్సిందన్నారు. కేసీఆర్ కేబినెట్లో తెలంగాణవాదులపై దాడులు చేసిన వారు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలన్నారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే నోరువిప్పని కేసీఆర్ ఇప్పుడు ఎరువులు అంటూ ఆశ చూపిస్తున్నారని పొన్నాల విమర్శించారు. -
ఛత్తీస్‌గఢ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి
పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలపై కోట్ల రూపాయల భారం పడుతుందని, అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ఓపెన్ బిడ్ కాకుండా ఎక్కువ ధరకు ఎంఓయూ చేసుకోవడం పెద్ద పొరపాటని అభిప్రాయపడ్డారు. బుధ వారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తక్కువ ధరకే విద్యుత్‌ను ఇస్తామని చెప్పినా, ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుభవలేమితో ఈ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఈ ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు. -
చత్తీస్గడ్ ఒప్పందం రద్దు చేసుకోవాలి
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రజలపై భారం కానున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ తో ఓపెన్ బిడ్ కాకుండా ఎంఓయూ చేసుకోవడం అది కూడా ఎక్కువ ధరకు చేసుకోవడం పొరపాటన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తక్కువధరకే విదు్యత్ను ఇస్తానని చెప్పింది. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా కూడా ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉంది. గత ఒప్పందాల ద్వారానే విద్యుత్ కొనుగోలుకు అవకాశమున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుభవం లేక, అహంకారంతో ఒప్పందం చేయడం వల్లనే ఈ తప్పు జరిగిందన్నారు. గతంలో 2014 లో మాదిరిగా ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ఒప్పందం కారణంగా ప్రజలపై ఏడాదికి కోట్లాది రూపాయల భారం పడుతోందన్నారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఈ ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు. -
ఆ ఒప్పందంతో రూ.వెయ్యి కోట్లు నష్టం
హైదారాబాద్: చత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ ఒప్పందం అనైతికమని, ఆ ఒప్పందం వల్ల తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లితుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనుమానాలు నివృత్తి చెయ్యకుండా మేధావులు, నిపుణులు, మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నదని విమర్శించారు. దొంగచేతికి తాళం ఇచ్చినట్టు విద్యుత్ అమ్మేవాడికే.. ధర నిర్ణయించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్న విషయం వాస్తవం కాదా.. అయినా ఎందుకు కొంటున్నారని సూటిగా అడిగారు. డిసెంబర్ 2015 న కేంద్ర ప్రభుత్వం సౌర, ఇతర విద్యుత్ ఇస్తామని లేఖ రాసినా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని, దాని వెనక ఉన్న కారణం ఏమిటో చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా గ్రిడ్ అనుసంధానం చేసినా కూడా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టి కొంటున్నారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం న్యాయ స్థానం లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మరో సారి మిమ్మల్ని న్యాయస్థానం మొట్టికాయలు వేయకుండా చూసుకోవాలని సూచించారు. చత్తీస్ఘడ్ విద్యుత్ ఒప్పందం వల్ల ప్రజలకు ఏం లాభమో చెప్పాలని కోరారు. -
‘నేను.. నాపాలన.. నాఇష్టంగా’ మారింది
జనగామ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం..నేడు నేను.. నాపాలన.. నాఇష్టంగా మారిందని విమర్శించారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణగా మారిందన్నారు. రైతులు, ఉద్యోగులు, పోలీసులు స్తెతం ఆత్మహత్యలకు పాలుపడుతుడండం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రుణమాఫీ పథకం వడ్డీ మాఫీ పథకంగా, మిషన్ భగీరథ కాస్త మిషన్ కల్వకుంట్లగా మారిందన్నారు. మిషన్ భగీరథ పథకంప్తె బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలపై ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. -
సిమెంట్ కంపెనీలతో..కేసీఆర్ కుమ్మక్కు..!
గుర్రం ముందు గడ్డికట్టి పరిగెత్తించినట్టు రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడోరోజే కేసీఆర్ సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని పొన్నాల ఆరోపించారు. దేవరకొండ : గుర్రం ముందు గడ్డి కట్టి పరిగెత్తించిన చందంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి విమర్శిం చారు. దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనంలో వారు మాట్లాడారు. 2004 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఫైలుపై సంతకం చేస్తే, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడో రోజే సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై వాటి ధరలు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తే కేసీఆర్ మాత్రం రెండు గదుల ఇళ్లు రెండు గ్రామాల్లో కట్టి డబుల్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గాని, సామాన్య ప్రజానికానికి చేస్తున్నది ఏమీ లేదని అన్నారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏక వ్యక్తి పాలన నడుస్తోందని, ప్రజలను పాలించే నైతిక హక్కు ఈ రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్లడానికి జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ నేత కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్‌లాల్‌నాయక్, వడ్త్యా రమేశ్, మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక, నారాయణ, సత్యనారాయణరెడ్డి, నాయకుడు ఎండీ.యూనూస్, పెద్దయ్య, మన్మథరెడ్డి, కిషన్, ఉమర్, నాగేశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. బతుకు తెలంగాణ కావాలి : పొన్నాల కొండమల్లేపల్లి : తెలంగాణలో ప్రజలకు బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, జన ఆవేదన కార్యచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సేకరణ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు యుగేందర్‌రెడ్డి, ఉట్కూరి వేమన్‌రెడ్డి, ప్రమీల వెంకటేశ్, బొడిగె శంకర్‌గౌడ్, పానుగంటి శ్రీకాంత్, జయశంకర్, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులున్నారు. -
పొన్నాల మా భూములు ఆక్రమించారు
⇒ అసెంబ్లీ హౌస్ కమిటీకి దళితుల ఫిర్యాదు ⇒ భూములను పరిశీలించిన హౌస్ కమిటీ మడికొండ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌లోని తమ అసైన్డ్భూములను తిరుమల హేచరీస్ కంపెనీ పేరిట పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారని స్థానిక దళితులు ఫిర్యాదు చేశారు. ఈ భూములను అసెంబ్లీ హౌస్ కమిటీ సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిని కలిసిన స్థానిక దళితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 1971లో రాంపూర్‌కు చెందిన సర్వేనంబర్ 337, 339లోని 8 ఎకరాల 27 గుంటలను అదే గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం అసైన్ చేసింది. తర్వాత పరిశ్రమల కోసమని 1987లో ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఈ భూమిని ఏపీఐఐసీ తిరుమల హేచరీస్‌కు అప్పగించారు. అయితే, తమ భూములను తిరుమల హేచరీస్ పేరిట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అక్రమ పద్దతిలో స్వాధీనం చేసుకున్నారని దళితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి. 1994, 1997లో తిరుమల హేచరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2005లో తిరుమల హేచరీస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాంపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రూబేన్, సండ్ర కొమురయ్య, చిట్యాల పురుషోత్తం, సండ్ర కనుకయ్య వారసులు సీఎం కేసీఆర్‌ను కలసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన అసైన్డ్, దేవాలయ, సొసైటీ భూములపై అధ్యయనానికి ఆసెంబ్లీలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములపై ఏర్పాటైన కమిటీ మొదటిసారిగా తిరుమల హేచరీస్ భూములు పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. -
ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు
అమీర్‌పేట: ధనిక రాష్ట్రమైన తెలం గాణను టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, జన ఆవేదన సభ నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘జన ఆవేదన’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే దేశం ,రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశానికి ఒరిగిందేమి లేదని, పైగా ఉగ్రవాదం, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ప్రతి మహిళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానన్న హమీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక సీఎం కేసీఆర్ మతిస్థిమితం లేని విధంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మంత్రివర్గంలో ఉన్న 32 మంది మంత్రులపై అవినీతి అరోపణలు వస్తే విచారణ జరిపించలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. నయీం కేసుల్లో పట్టుపడ్డ ధనం ఎక్కడ దాచిపెట్టారో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో జన ఆవేదన సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మె ల్యే మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ మాట్లాడారు. -
కేసీఆర్ దళిత ద్రోహి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ దళిత ద్రోహి అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పిన మాట తప్పిన మొదటి సీఎం కేసీఆర్ అని పొన్నాల అన్నారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని, దళితులకు మూడెకరా ల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్... అధికారం దక్కాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సైతం అమలు చేయకుండా మోసం చేస్తు న్నారన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని మోదీ అధోగతి పాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 19 నుంచి నియోజకవర్గ స్థాయిలో జన ఆవేదన సమ్మేళనాలను నిర్వహిస్తు న్నామని పొన్నాల తెలిపారు. -
వైద్యసేవలపై శ్వేతపత్రం ప్రకటించాలి
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంది స్తున్న వైద్యసేవలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కల సి గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసు పత్రుల్లో వైద్య పరికరాల్లేక, సిబ్బంది నిర్ల క్ష్యం, ప్రభుత్వ చేతకానితనం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వైద్యశాఖ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు న్నరేళ్లుగా ఏ పనీ చేయని మంత్రి హరీశ్ కాంగ్రెస్‌పై నిందలేయడం మానుకోవా లని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. -
వైద్యశాఖపై దృష్టిపెట్టండి: పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో అన్నిశాఖలు కుంటుపడ్డాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనునిత్యం ఏదో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్న వార్తలు ఎన్నో వింటున్నాం.. అయినా వైద్యశాఖ అధికారులు చలించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనన్నారు. ఇటీవలి కాలంలో సరోజిని హాస్పిటల్, నీలోఫర్, గాంధీ ఆస్పత్రులలో సరైన సదుపాయాలు లేక, వైద్య పరికరాలు లేక అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యశాఖ పై దృష్టిపెట్టాల్సిన అవసరముందున్నారు. హైదరాబాద్ నగరంలో అయినా, లేదంటే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని వసతులను పరిశీలించడానికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తి మద్దతు: ఉత్తమ్
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తిమద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం కూడా కాంగ్రెస్ చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై శనివారం గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం జరిపే అఖిల పక్షసమావేశంలో తాను పాల్గొంటానని, వర్గీకరణ తొందరగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీల వర్గీకరణ జరిగేదని, అయితే అప్పట్లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఆలస్యమయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ అఖిలపక్షం భేటీతో చేతులు దులిపేసుకోవద్దని హితవు పలికారు. వర్గీకరణ బిల్లు అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒత్తిడితోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందని, ఇప్పుడు వర్గీకరణ అవుతుందంటే అది కాంగ్రెస్ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. -
మోదీని కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నా లాభం లేదు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుల ఆశలు తీర్చటంలో కేంద్ర బడ్జెట్ విఫలమయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులు, పేదలు, సామాన్యులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయే తప్ప ఆదాయం ఏమాత్రం పెరగలేదని విమర్శించారు. నోట్ల రద్దును సమర్ధిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నా, కేంద్రం మాత్రం బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. -
‘మాట మార్చే నైజం కేసీఆర్‌ది’
హైదరాబాద్: ఎప్పటికప్పుడు మాట మారుస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి మోదీకి వంతపాడుతున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేంద్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఆవలంభిస్తోందని విమర్శించారు. నల్లధనాన్ని వెలికి తీస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు పెట్టుబడి దారులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లరద్దు పేరుతో ప్రజలను అవమానపర్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన అన్ని జిల్లాల్లో మహిళా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందని చెప్పారు. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలపై కేంద్రం పెట్టిన ఆంక్షలను సడలించాలనే డిమాండ్‌తో ఈనెల 20న ఆర్బీఐ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. -
'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్ : కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును గురువారం ఆయన కలిశారు. వెంటనే జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా జ్యుడిషియరీ కమిటీ ఏర్పాటు చేయాలని పొన్నాల సూచించారు. -
డీజీపీని కలసిన పీసీసీ మాజీ చీఫ్
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని జనగామలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డీజీపీ అనురాగ్ శర్మకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో అనురాగశర్మను పొన్నాల కలిశారు. జనగామ ప్రత్యేక జిల్లా కోసం పోరాడుతున్న వారిపై కేసులు ఉపసంహరించాలని ఈ సందర్భంగా అనురాగశర్మను పొన్నాల కోరారు. పొన్నాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అనురాగశర్మను కలిసినవారిలో ఉన్నారు. -
డి.కె.అరుణ, పొన్నాల నిరాహార దీక్ష ప్రారంభం
హైదరాబాద్ : జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య శనివారం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారితోపాటు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్తోపాటు వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాబితాలో జనగామ, గద్వాల్ లేకపోవడంతో డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా వారు శనివారం నిరాహారదీక్షకు దిగారు. -
ప్రధాని పర్యటనతో ఒరిగింది శూన్యం : పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు గురించి ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సమయం సరిపోయిందని పొన్నాల అన్నారు. ఇద్దరూ కలసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు, ఉద్యోగుల విభజన, జాతీయ ప్రాజెక్టులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్న కేసీఆర్ ఏమీ పట్టనట్టు వ్యవహరించారన్నారు. మోదీ దళితుల గురించి ప్రస్తావించడం చూస్తుంటే హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని పొన్నాల ఎద్దేవా చేశారు. -
మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: మల్లన్నసాగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసు రాజ్యం నడుస్తోం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసిత ప్రాంతాల్లో పోలీసుల బలగాలతో బాధిత రైతులను అష్ట దిగ్బంధం చేశారని, నాయకులెవరినీ అటువైపు వెళ్లకుండా చూస్తున్నారన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత కనిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం, పెండింగ్ అం శాలను వివరించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరామని పొన్నాల తెలిపారు. అయితే ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నా రు. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు అంశాన్ని అడుగుతామన్నారు. -
జనగామ నుంచే టీఆర్ఎస్ పతనం
భయభ్రాంతులతో ఉద్యమాలను అడ్డుకోలేరు తెలంగాణ పోరాటంలో తప్పుడు కేసులు లేవు సబ్‌జైలులో జేఏసీ నాయకులను పరామర్శించిన పొన్నాల జనగామ : ప్రజాస్వామ్యయుతంగా జనగామ జిల్లా కోసం చేస్తున్న ఉద్యమాలను అణచివేసే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించా రు. జిల్లా ఉద్యమంలో అరెస్ట్ అయి జనగామ సబ్‌జైలులో ఉన్న జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్, ఆకుల వేణుగోపాల్‌రావును బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం పొన్నాల విలేకరుల తో మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్, జనగామలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం వరంగల్ జిల్లా జనగామ నుంచి మొదలైం దని హెచ్చరించారు. కేసులు, పోలీసుల లాఠీలకు భయపడి వెన కంజ వేసే ప్రసక్తేలేదన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలు మరింతం ఎగిసిపడతాయన్నారు. తెలంగాణ ఉద్యమం లో మంత్రులపై దాడులు చేస్తేనే ఆకాంక్షతో చేశారని ఊరుకున్నా మే తప్ప, ఒక్క కేసు, రిమాండ్ చేయలేదన్నారు. జనగామ జిల్లా కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, రెచ్చగొట్టే విధం గా అక్ర మ కేసులను బనాయించి, 144 సెక్షన్ పేరుతో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల జాబి తాలో 11వ పేరు జనగామ అని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నాయకులు పీవీ శ్రీనివాస్, వెన్నెం వెంకటనర్సింహారెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్, ఖాదర్ షరీఫ్, రంగు రవి, వనజారెడ్డి, జమాల్షరీప్, మేకల రాంప్రసాద్, బుచ్చిరెడ్డి, గౌస్, వేమెళ్ల పద్మ, వెన్నెం శ్రీలత, నజీర్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం
విద్యుత్‌సౌధ వద్ద నేతల ధర్నా హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం విద్యుత్‌సౌధ ఎదుట పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్...నాంపల్లి చౌరస్తాలో అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొన్నాల లక్ష్మయ్య, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ... ప్రజావ్యతిరేక ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. పన్నుల భారం వేయమని చెప్పిన సీఎం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ నుంచి ర్యాలీ... చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి తాజ్ ఐల్యాండ్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. సీనియర్ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ స్టేషన్‌కు తరలించారు. -
టీఆర్ఎస్ నాయకులు ఉద్యమంలోకి రావాలి
జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి న్యాయవాదుల దీక్షకు ‘పొన్నాల’ సంఘీభావం కొనసాగుతున్న జేఏసీ రిలే దీక్షలు జనగామ : జనగామ జిల్లా కోసం టీఆర్ఎస్ నాయకులు ఉద్యమంలోకి కలిసిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలో గురువా రం దుకాణ, గ్రేయిన్ మార్కెట్ హమాలీ కార్మికులు గాదరి నర్సింహ్మ, బండ భాస్కర్, గవ్వల రాములు, గాజుల గంగులు, నక్క గణేష్‌లు దీక్షలో కూర్చోగా, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి ప్రారంభించారు. కాగా, న్యాయవాదుల రిలే దీక్షకు పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలి పారు. దీక్షలో ఇషాన్, ఉమాపతి, సత్తెయ్య, కాంతారావు కూర్చోగా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ప్రసాద్, మంచాల రవీందర్, లక్ష్మణస్వామి, రవీందర్ సంఘీభావం తెలిపారు. ఉద్యమ కార్యాచరణపై జేఏసీ నా యకులతో పొన్నాల గంటపాటు చర్చించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, బర్ల శ్రీరాములు, సత్యపాల్‌రెడ్డి, స త్యం, డాక్టర్ రాజమౌళి, జక్కుల వేణుమాధవ్, కేమిడి మల్లయ్య, వైకుం ఠం, తీగల సిద్దూగౌడ్, సౌడ రమేష్, పిట్టల సత్యం, అజహరొద్దిన్, కాసుల శ్రీనివాస్, వీరస్వామి ఉన్నారు. రిప్రజెంటేషన్ కాపీలను ఇవ్వాలి జనగామ : జనగామ జిల్లా కోసం అధికారికం గా ప్రభుత్వానికి పంపించిన వివరాలను ఇవ్వాల్సిందిగా జేఏసీ చెర్మైన్ ఆరుట్ల దశమంతరెడ్డి, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు సమాచార హక్కు చట్టం ద్వారా గురువారం కలెక్టర్‌ను కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలల నుంచి జి ల్లాకు కావాల్సిన వనరులు, రాజకీయంగా ప్ర జాప్రతినిధులు ఇచ్చిన ప్రతులు, భూ సంబందిత వివరాలను అందించాలని అందులో పే ర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కలెక్టర్ పంపించిన నివేదికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖలు, ప్రభుత్వ పరం గా ఆర్డీఓ, తహసీల్దార్ రిపోర్టు కాపీలను ఇవ్వాలని కోరి నట్లు పేర్కొన్నారు. -
పొన్నాల కంటే ఉత్తమ్ ఎంపిక వరస్ట్
- సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కాంగ్రెస్ దుస్థితికి ఉత్తమే కారణం - ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదు - కాంగ్రెస్ పరిస్థితిపై సోనియాకు లేఖ రాస్తా.. సాక్షి, హైదరాబాద్: టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పీసీసీ అధ్యక్షునిగా నేనుంటే ఎన్నికల్లో గెలిపించేవాడిని. ఓడిపోతే పార్టీ పదవికి రాజీనామా చేసేవాడిని. నా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా ఓడించడానికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్తమ్ డబ్బులు ఇచ్చాడు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో సవాల్ విసిరితే తప్పించుకున్న ఉత్తమ్.. పార్టీకి నాయకుడా? మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసిరితే తీసుకోకుండా, తప్పించుకోవడానికి మీ నాన్న కేసీఆర్ రావాలని ఉత్తమ్ ఎలా అంటడు? ఇలాగైతే పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం ఏం కావాలి’ అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని అన్నారు. నంది ఎల్లయ్య లాంటి వ్యక్తిని వరంగల్‌కు ఇన్‌చార్జీగా ఎలా వేస్తారని నిలదీశారు. టీఆర్ఎస్ కంచుకోటలో నంది ఎల్లయ్య ఏం చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటా.. పదవులకోసం తాను పాకులాడటం లేదని, రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోతున్నదన్నారు. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పొన్నాల, ఉత్తమ్ నియామకాలే కారణమన్నారు. పొన్నాల కంటే ఉత్తమ్ ఇంకా వీక్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదన్నారు. ఉద్యమంతో సంబంధంలేని పొన్నాలకు పదవి ఇవ్వడం తప్పయితే ఉత్తమ్‌ను పెట్టి మరో తప్పు చేశారని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్, పాలేరులో పార్టీ ఓటమికి ఉత్తమే కారణమన్నారు. తెలంగాణ ఇవ్వడంతో సోనియాగాంధీ చాలా గొప్ప సాహసం చేశారని, అయితే తెలంగాణ ఇచ్చిన ఘనతను చెప్పుకోవడంలో రాష్ట్ర సారథులు వైఫల్యం చెందారని ఆరోపించారు. తెలంగాణకోసం కొట్లాడిన వారికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండదన్నారు. పార్టీకి సర్జరీ చేయాలని, కోటేసుకుని నాలుగు మాటలు మాట్లాడినోళ్లకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందే పార్టీని నడిపించే నాయకుడిని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే 15, 20 మంది నాయకులు సీఎం అభ్యర్థులమని పార్టీలో ప్రచారం చేసుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో ప్రెస్మీట్లు పెడితే ప్రయోజనం లేదని, ప్రజాక్షేత్రంలో కార్యకర్తలను ఉత్తేజం చేయాలని సూచించారు. మార్పులు చేయకుంటే పార్టీ మనుగడ కష్టమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాలపై సోనియాగాంధీకి లేఖరాస్తానని చెప్పారు. సీఎల్పీ నేత పనితీరును ప్రజలే విశ్లేషిస్తారని అన్నారు. -
మా తరఫున పోరాడండి
పొన్నాలను కోరిన మల్లన్నసాగర్ ముంపు బాధితులు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను గురువారం కలిశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యంపై కొరవడిన స్పష్టత, అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆగడాలతో ముంపు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పొన్నాలకు వివరించారు. భూములను ప్రజల అవసరాల కోసం తీసుకుంటున్నప్పుడు రైతులకు ఇచ్చే పరిహారం విషయంలోనూ, హక్కుల విషయంలోనూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. తమ పక్షాన పోరాడాలని పొన్నాలకు వివిధ గ్రామాల రైతులు విన్నవించారు. -
పొన్నాల వర్గానికి చెక్
పీసీసీ కమిటీల్లో దక్కని ప్రాధాన్యం {పత్యర్థుల్లో ఎక్కువ మందికి పదవులు 11 మంది జిల్లా నేతలకు చోటు వరంగల్ : పీసీసీ తాజా కమిటీల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పొన్నాల వర్గంగా ముద్రపడిన జిల్లా నేతల్లో ఎవరికీ పీసీసీ కమిటీల్లో పదవులు రాలేదు. శనివారం పార్టీ అధిష్టానం పీసీసీ పదవులను ప్రకటించింది. అందులో 11 మంది జిల్లా నేతలకు పదవులు దక్కారుు. పీసీసీ మాజీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో, సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చోటు కల్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పీసీసీ సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, ప్రధాన కార్యదర్శిగా బక్క జడ్సన్ నియమితులయ్యారు. పీసీసీ శాశ్వత ఆహ్వానితులుగా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్, పార్టీ నేతలు కొండపల్లి దయాసాగర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్‌లకు చోటు దక్కింది. కాగా, పీసీసీ కమిటీల్లో పదవులు వచ్చిన వారంతా పొన్నాలకు వ్యతిరేకంగా ఉన్న వారే కావడం గమనార్హం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీ బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మొదటి నుంచి పొన్నాల వ్యతిరేక వర్గంగానే ఉంటున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన బక్క జడ్సన్ 2014 ఎన్నికల్లో పొన్నాలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పొన్నాలకు దూరంగా ఉంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కొండపల్లి దయాసాగర్, నమిండ్ల శ్రీనివాస్ శాశ్వత ఆహ్వానితులుగా నియమితులయ్యారు. పీసీసీ కమిటీల్లో నియామకంతో జిల్లాలో పొన్నాల వర్గానికి పూర్తిగా చెక్ పెట్టినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కమిటీల నియామకంపై పొన్నాల వర్గం నేతల్లో అసంతృప్తి నెలకొంది. -
విపక్షాలకు అనుకూలం
సాక్షి, హైదరాబాద్: శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష, వేద పండితులు చిలుకూరి శ్రీనివాస్‌మూర్తి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. శుక్రవారం ఉగాది వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, సరైన వర్షాలు లేకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రంలో దొంగల స్వైరవిహారం, మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. -
బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే
పార్టీని వీడే ప్రసక్తే లేదు.. పొన్నాల లక్ష్మయ్య స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘‘నేను అసలైన కాంగ్రెస్ వాదిని.. నా మరణం ఎప్పుడు సంభవించినా నా శవం మీద కాంగ్రెస్ జెండాతోనే శవయాత్ర జరుపుకోవాలని నా ఆత్మ ఘోషిస్తోంది. అదీ నా పట్టుదల.. కాంగ్రెస్‌పై నాకున్న విశ్వాసం..’’ అని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సేవలో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తిరిగి వచ్చానని, ప్రజా సేవ చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేననే నమ్మకంతో పని చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. టీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. 21 నెలల పాలన తర్వాత ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టడంలో గొప్పేముందన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పూటకో మాట, రోజుకో హామీతో పబ్బం గడుపుతోందని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పోలింగ్ రోజున విష ప్రచారం చేయటం తగదని పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరచడంతో పాటు సామాజిక కోణంలో అవహేళన, అవమానాలు ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు లేనందుకే టీఆర్ఎస్ అభద్రతా, ఆత్మన్యూనతా భావం తో కుట్రలకు పాల్పడుతోందన్నారు. -
‘ఛత్తీస్’పై నేడు బహిరంగ విచారణ
♦ సింగరేణి భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభం ♦ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన పిటిషన్‌దారులు ♦ వెనక్కి తగ్గేందుకు డిస్కంలు ససేమిరా ♦ విచారణకు రానున్న రఘు, కోదండరాం తదితరులు సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై గురువారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించనుంది. లోపాలపుట్టగా ఉన్న ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని పేర్కొంటూ విద్యుత్ రంగ నిపుణులు, విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు, ఎం.తిమ్మారెడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్ రావు, రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్ ఎల్.నారాయణరెడ్డి ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. కె.రఘు మినహా ఇతరులందరి అభ్యంతరాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వివరణలు ఇచ్చాయి. అయితే తమ అభ్యంతరాలకు సూటిగా సమాధానం చెప్పకుండా నిబంధనలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేశాయని డిస్కంల వివరణలపై పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందంపై వ్యక్తమైన అభ్యంతరాలు, డిస్కంల వివరణలపై ఈఆర్సీ గురువారం ఉదయం 11 గంటలకు సింగరేణి భవన్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట పిటిషన్‌దారులు, డిస్కంల యాజమాన్యాల మధ్య వాడివేడిగా వాదనలు జరగనున్నాయి. ఈ విచారణకు కె.రఘు, ఎం.తిమ్మారెడ్డి, కోదండరాం, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్ రావు, రిటైర్డు విద్యుత్ ఇంజనీర్ ఎల్.నారాయణరెడ్డితో పాటు ఇతర ముఖ్యులు హాజరు కానున్నారు. 12 ఏళ్ల దీర్ఘకాలిక అవసరాల కోసం 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏ భవితవ్యంపై బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందంలో సవరణలు జరపాలని ఈఆర్సీ ఆదేశిస్తే మాత్రం.. రాష్ట్ర డిస్కంలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మేరకు సవరణలు చేయక తప్పని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ఛత్తీస్‌గఢ్ పీపీఏపై దాఖలైన అభ్యంతరాలు, వాటికి డిస్కంలు ఇచ్చిన వివరణలు ఇలా ఉన్నాయి.. ► కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా ఎంవోయూ ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? టెండర్లకు వెళ్తే ఇంత కన్నా తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశం ఉండేది కదా? డిస్కంలు: వార్దా-మహేశ్వరం కారిడార్ బుకింగ్ కోసం పీపీఏ ఒప్పందం అవసరం. అందుకే ఈ ఒప్పందం. ► పీపీఏలో విద్యుత్ ధరల కనీస సమాచారం లేదు. ఈ ధరలను నియంత్రించే అధికారం తెలంగాణ ఈఆర్సీకి కట్టబెట్టకుండా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి ఎందుకు కట్టబెట్టారు? డిస్కంలు: టారిఫ్ నిబంధనల ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరల నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర జెన్కో, ఎన్టీపీసీలతో జరిగే ఒప్పందాల్లో సైతం ధరలను పేర్కొనరు. ► విద్యుత్ కొనుగోలు చేసినా.. చేయకున్నా రూ.వందల కోట్ల స్థిర చార్జీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందంలో నిబంధనలు ఎందుకు ? భవిష్యత్తులో ఇంధన చార్జీలు అడ్డగోలుగా పెంచడానికి ఇది దారితీస్తుంది. డిస్కంలు: ఛత్తీస్‌గఢ్ నుంచి పూర్తిగా వెయ్యి మెగావాట్లు రాష్ట్రానికే తీసుకొచ్చేందుకే ఈ నిబంధనకు అంగీకరించాం. ► విద్యుత్ అమ్మకం ధరను రాష్ట్ర సరిహద్దుల వద్ద కాకుండా ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి సంస్థ సరిహద్దుల వద్ద నిర్ణయించేలా ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? దీంతో అక్కడ్నుంచే సరఫరా, పంపిణీ చార్జీలను మన రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అక్కడి ప్రభుత్వం భవిష్యత్తులో పెంచే పన్నులు, సుంకాల భారాన్ని ఎందుకు ఒప్పుకున్నారు? డిస్కంలు: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాల భారం రాష్ట్ర డిస్కంలపై పడడం వాస్తవమే. తెలంగాణ జెన్కో విషయంలో ఈఆర్సీ అనుమతిస్తున్న పన్నులు, సుంకాల తరహాల మాదిరే ఇవి అమలు కానున్నాయి. -
అమరవీరులను మరిచి అమరావతికి కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ మాజీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. బుధవారం వరంగల్‌లో పోన్నాల మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్తున్న కేసీఆర్ తెలంగాణ అమరవీరులను మరిచిపోయాడని పొన్నాల ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని పొన్నాల స్పష్టం చేశారు. -
రైతుల పేరుతో రాజకీయాలా?: మంత్రి హరీశ్
రైతుల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు రైతులు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్‌రెడ్డి లు అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించారా అని అడిగారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను విమర్శిస్తున్న టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులు ఆంధ్రాలో రుణమాఫీ చేయని ఎందుకు అడగటం లేదన్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. -
ప్రాజెక్టుల డిజైన్లు మార్చొద్దు: పొన్నాల
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను ఇష్టారాజ్యంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల తీవ్ర నష్టాలు ఉంటాయని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌ను కలిశారు. సాగునీటి ప్రాజెక్టులకోసం గతంలో రూపొందించిన డిజైన్లు, వాటికోసం అయ్యే ఖర్చు, ఆయకట్టు, ముంపు వంటి అన్ని అంశాలను గవర్నర్‌కు వివరించారు. వాటిని మారిస్తే ఇప్పటిదాకా చేసిన వ్యయం వృథాకావడంతో పాటు చాలా సమస్యలు వస్తాయని పొన్నాల వివరించారు. -
పొన్నాల పుష్కర స్నానం
మంగపేట: పీసీసీ మాజీచీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజనాల శ్రీహరి, ఆపార్టీ ముఖ్య నాయకులు గురువారం మంగపేటలో పుష్కర స్నానం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పితృ దేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం నాయకులు మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణ పేరిట స్వామివారికి రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్, బండా ప్రకాష్, ఎర్రబెల్లి వరద రాజేశ్వరావు, రమాకాంత్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, నమిళ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, మాజీ సర్పంచ్ గోను తిరుపతి తదితరులు ఉన్నారు. -
‘పొన్నాల’పై పోరు
- ప్రత్యర్థుల విమర్శల దాడి - ఎన్నికలకు దూరంగా పెట్టే వ్యూహం - అయోమయంలో పొన్నాల లక్ష్మయ్య వర్గం - కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం మొదలవుతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం లక్ష్యంగా ప్రత్యర్థులు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాలకు పార్టీ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శల దాడి పెంచుతుండడం దీనినే సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 25న జరిగిన పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే పలువురు కార్యకర్తలు పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారిని కాదని.. సొంత వాళ్లకు టిక్కెట్ వచ్చేలా చేసిన కారణంగానే జిల్లాలో పార్టీ ఘోర పరాజయం పాలైందని గుర్తు చేశారు. కార్యకర్తల సభలోనూ పొన్నాల అనుచరులే ఎక్కువ మంది ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో, లోక్‌సభ ఉప ఎన్నికలో పొన్నాలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని గట్టిగా నినాదాలు చేశారు. దీనికి కొనసాగింపుగా.. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ములుగులో పొన్నాలపై నేరుగా విమర్శలు చేశారు. పొన్నాల కారణంగానే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. పొన్నాల ప్రత్యర్థివర్గంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బస్వరాజు సారయ్య, పోదెం వీరయ్యలతో కలిసి బలరాంనాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నాలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రత్యర్థి వర్గం ఇలా వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. పొన్నాల వర్గీయులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ సభలో నాయకులకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడం సాధారణంగా జరిగేదేనని పేర్కొంటున్నారు. పొన్నాలకు తగ్గుతున్న ప్రాధాన్యం మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా ఉంటున్న పొన్నాల లక్ష్మయ్యకు సాధారణ ఎన్నికల తర్వాత ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. పదేళ్లపాటు వరుసగా మంత్రి పదవిలో ఉన్న ఆయనజిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటుతో మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సారథిగా వ్యవహరించారు. టిక్కెట్ల పంపిణీ విషయంలో జిల్లాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి టిక్కెట్ రాకుండా చేశారనే ప్రచారం పొన్నాలకు అప్రతిష్టత తెచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సాధారణ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోవడం.. దొంతి మాధవరెడ్డి గెలవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను పీసీసీ పదవి నుంచి తొలగించింది. దీంతో పొన్నాల ప్రత్యర్థి వర్గం క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికలను వేదికగా మార్చుకుని జిల్లా కాంగ్రెస్‌లో పొన్నాల ప్రభావాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకు సిద్ధమవుతోంది. పొన్నాల వర్గీయులు ఈ పరిమాణాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నాటికి రెండు వర్గాల రాజకీయం ఎటువైపు దారితీస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ఇంటర్లో పలు సబ్జెక్టుల్లో మారిన సిలబస్ విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో ఈ విద్యాసంవత్సరంలో కొన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి సిలబస్ మారినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎం.మలహల్రావు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ద్వితీయ భాష తెలుగు, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వాణిజ్యశాస్త్రం,ద్వితీయ సంవత్సరంలో చరిత్ర సిలబస్ మారిందని, కొత్త పాఠ్యపుస్తకాలు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. -
ఏడాది లోపే!
పీసీసీ చీఫ్ పదవి మార్పు ‘పొన్నాల’ను తప్పించిన ఏఐసీసీ తెలంగాణ తొలి అధ్యక్షుడిగా రికార్డు జిల్లాకు కలిసిరాని పీసీసీ పదవి వరంగల్ : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పదవి పోయింది. పీసీసీ అధ్యక్షుడిని మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలోనే ఉన్నత పదవిని పొందిన లక్ష్మయ్య అర్ధంతరంగా ఏడాదిలోపే ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత సాధారణ ఎన్నికల ముందు ఆయన పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా 2014 మార్చి 13న బాధ్యతలు తీసుకున్నారు. ఈయన నేతృత్వంలోనే పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లి దారుణంగా ఓటమిపాలైంది. జనగామలో స్వయంగా ఆయన ఓడిపోయారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నుంచి పొన్నాలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారిక నిర్ణయం ప్రకటించింది. దీంతో ఏడాదిలోపే పొన్నాల పీసీసీ చీఫ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పొన్నాలకు అవకాశం వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కలిసిరాలేదు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి మన జిల్లా నేతలకు కలిసిరాలేదు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండుసార్లు జిల్లా నేతలకు దక్కింది. ఈ రెండు సార్లు సాధారణ ఎన్నికల్లో హస్తం పార్టీ దారుణంగా ఓడింది. తాజా ఎన్నికల్లో పొన్నాల కూడా ఓడిపోయారు. 1999 ఎన్నికల ముందు వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా వచ్చేవి. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన మహమ్మద్ కమాలుద్దిన్ అహ్మద్ నియమితులయ్యారు. అప్పుడు కమాలుద్దిన్ హన్మకొండ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా నుంచి పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లే దక్కాయి. కమాలుద్దిన్ అహ్మద్ సొంత జిల్లాలో డోర్నకల్ స్థానంలో డీఎస్ రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ ఇలాగేజరిగింది. -
ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు?
తొలిసారి జిల్లాకు దక్కే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని శనివారం పార్టీ వర్గా ల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను ఎంపిక చేస్తారని ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. నల్లగొండతో పాటు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు బాణసంచాకాల్చి, ర్యాలీలు నిర్వహించారు. కానీ శనివారం పొద్దుపోయేంత వరకు కూడా ఏఐసీసీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అయితే పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను నియమించడం ఖాయమని , ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని కాంగ్రె స్ శ్రేణులు అంటున్నాయి. ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు కీలక పదవులూ (పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత) జిల్లాకే దక్కినట్టవుతుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన జానారెడ్డి సీఎల్పీనేతగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తొలిసారి జిల్లాకు చెందిన నాయకుడికి టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో పాటు అదే సమయంలో సీఎల్పీ నేతగా కూడా జిల్లా నాయకుడే ఉండే అవకాశం కనిపిస్తుండడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. -
పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్యకు వేటు వేసింది. ఆయనకు ఊహించని షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ...కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. మరోవైపు టీ.సీఎల్పీ నేత జానారెడ్డిని తక్షణమే హస్తినకు రావాలని హైకమాండ్ ఆదేశించింది. కాగా పొన్నాల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. అయినా పొన్నాలకు టెన్ జన్‌పథ్ అపాయింట్మెంట్ దొరకలేదు. పొన్నాలతో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. -
గ్రేటర్‌పై కాంగ్రెస్ గురి
కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం 11మందితో ఎన్నికల కమిటీ డీసీసీ చీఫ్ నాయినికి సారథ్యం వరంగల్ రూరల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్‌పై జెండా ఎగుర వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా 11 మంది ముఖ్య నాయకులతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కాంగ్రెస్ కమిటీకి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మహమూద్‌ను సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి జెట్టి కుసుమకుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు. -
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు:పొన్నాల
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం తగదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూచించారు. మీడియాపై ఆంక్షలు విధించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇంతవరకూ నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్ల రూపాయలు దండుకుని..ఇప్పుడు సెటిలర్స్ బాట పట్టారన్నారు. మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలు నిరసన తెలుపుతున్నారని పొన్నాల విమర్శనాస్త్రాలు గుప్పించారు. -
'కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులే'
హైదరాబాద్ : మీడియాకు కూడా సంకెళ్లు వేస్తూ కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్లు దండుకున్న కేసీఆర్...ఇప్పుడు సెటిలర్స్ బాట పట్టారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలే నిరసన తెలుపుతున్నారని పొన్నాల మండిపడ్డారు. నేతలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకుందామని ఆయన ఈ సందర్భంగా సొంతపార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్ సెటిలర్స్ వద్దకు వెళుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులేనని దానం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ క్యాడర్‌ను వేధిస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని దానం హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు టీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు. -
తెలంగాణపై విషం కక్కుతున్న చంద్రబాబు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఈ రాష్ర్టంపై ఏపీ సీఎం చంద్రబాబు విషం కక్కుతూనే ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాగానే విద్యుత్ పీపీఏలను రద్దుచేయడం ద్వారా చంద్రబాబు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఇద్దరు సీఎంల రాజకీయ ఎత్తులు, జిత్తులకు తెలుగు ప్రజలు బలిపశువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు సమయంలోనే ఎంతో దూరదృష్టితో సాగునీరు, విద్యుత్ రంగాలలో అనేక అంశాలను పొందుపర్చినా, వాటిని అమలుచేయడంలో ఇరు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలుకాకుండా తన ఇష్టమున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను, అధికారులను, పోలీసులను రెచ్చగొట్టడం ఏ చట్టంలో ఉందో సీనియర్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక విఫల ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని పొన్నాల ఎద్దేవా చేశారు. విద్యుత్, నదీజలాల్లో వాటా వంటివాటిని కేసీఆర్ సాధించుకోలేకపోతునారని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు త్వరలో ఎన్నికలు జరుగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో బరిలో ఉంచే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. వరంగల్, నల్లగొండ, ఖమం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కత్తి వెంకటస్వామి, చింతపండు నవీన్ పేర్లు పరిశీలిస్తున్నట్టు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గానికి మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్టీ ముఖ్య అధికారప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో పాటు సుభాష్‌రెడ్డి, బంగారయ్య, రవికుమార్ తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. -
అధికారముందని విర్రవీగితే పరాభవమే
బీజేపీకి ఢిల్లీలో పట్టిన గతి టీఆర్ఎస్కు తప్పదు టీఆర్ఎస్కు ఏఐసీసీ నేత కుంతియా హెచ్చరిక హైదరాబాద్: అధికారం ఉందని అహంభావంతో విర్రవీగితే ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా హెచ్చరించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రిని మార్చొద్దంటూ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసుల చేతిలో గాయపడిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డితో కలసి కుంతియా మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రకారం గాంధేయమార్గంలో ర్యాలీని ప్రారంభిస్తే పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కిరాతకంగా దాడి చేయడం గర్హనీయమన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు పడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ రాజధానిలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని కుంతియా అన్నారు. ఢిల్లీలో 15 ఏళ్లపాటు వరుసగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత వల్లే ఓడిపోయామని వివరించారు. అధికారంలోకి వస్తామన్న బీజేపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదంటే 8 నెలల్లోనే ఆ పార్టీపై వచ్చిన వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రజాతీర్పును తెలంగాణరాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా గమనంలో ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు. తప్పులు చేయొద్దంటే దాడిచేస్తారా: పొన్నాల సచివాలయం మార్చడం, ఛాతీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించడం వంటి తప్పులు చేయొద్దంటూ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రజల ఆగ్రహాన్ని, కాంగ్రెస్ ఉద్యమాలను కట్టడి చేయలేరని హెచ్చరించారు. మొన్నటిదాకా తెలంగాణకోసం టీఆర్ఎస్ చేసిన ఉద్యమాలకు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో సహకరించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ను ప్రజాకోర్టులోనే నిలదీస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ- కిరణ్‌బేడీ ఎన్నికల్లో జోడీ కట్టినా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా బీజేపీ యూ-టర్న్ తీసుకున్నదన్నారు. -
'మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేశారు'
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నసమయంలో తెలంగాణకు అన్నివిధాలా అన్యాయం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం ఆరోపించారు. ఆదివారం మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. తన పదవిని కాపాడుకునేందుకే పొన్నాల లక్ష్మయ్య పాదయాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాదయాత్రలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా టీకాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మంత్రి తుమ్మల మండిపడ్డారు. -
టీ పీసీసీ ర్యాలీ ఉద్రిక్తం
గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా నేతలు, కార్యకర్తలు సచివాలయం, ఛాతీ ఆస్పత్రి తరలింపు యోచన విరమించుకోవాలని డిమాండ్ ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించిన పోలీసులు ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరువర్గాల తోపులాట ఘర్షణలో స్వల్పంగా గాయపడిన పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం..: జానారెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయం మార్పు, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రంగా తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో కింద పడిపోయిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. చివరికి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేశారు. ఈ ర్యాలీని భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత జానారెడ్డి గోషా మహల్ పోలీస్ స్టేడియంలో ధర్నా చేయగా... టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో కార్యకర్తలు గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వారు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిలువరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొంతసేపు తీవ్రంగా తోపులాట జరిగింది. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పొన్నాల చేయి మెలితిరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ర్యాలీతో దాదాపు గంట పాటు నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, గీతారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, సిరిసిల్ల రాజయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. పోలీసులు ర్యాలీని భగ్నం చేసి, తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. గోషామహల్ స్టేడియంలోనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ గేటు దగ్గరకు చేరుకుని, లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించడంతో... కొంతసేపు తోపులాట జరిగింది. కాగా... ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆదివారం ధర్నాలు, ఆందోళనలు చేపడతామని టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేసింది. నిర్భంధాలతో ప్రజల పోరాటం ఆగదు.. ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చకుండా పోలీసులతో నిర్భంధిస్తే పోరాటాలు ఆగవని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించిన కాంగ్రెస్ నేతలను పరామర్శించిన జానారెడ్డి అక్కడే పొన్నాల, డి.శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధేయమార్గంలో, ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకోవడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను బయటపెట్టుకుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సినిమాకు క్లైమాక్స్ చూపిస్తాం..: శ్రీధర్‌బాబు, దానం అసలు సినిమా చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చూపించే సినిమాకు క్లైమాక్స్ తామే చూపిస్తామంటూ మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన వారంతా చరిత్రలో కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడితే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు అహంకారంతో వ్యవహరించడం మంచిది కాదని ఎమ్మెల్యే డి.కె.అరుణ హెచ్చరించారు. నిరసన తెలియజేయకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. -
పాదయాత్రను విజయవంతం చేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ రూరల్ : హైదరాబాద్‌లో సచివాలయం, ఛాతి అస్పత్రి తరలింపునకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గాంధీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన స్వగృహంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఎ.కృష్ణ, నమిండ్ల శ్రీనివాస్, ప్రొటోకాల్ కన్వీనర్ బట్టి శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, రాజారపు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయూలకు నిరసనగా చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నాయకులకు పొన్నాల సూచించారు. దళిత చైతన్య సదస్సును జయపప్రదం చేయూలి : నాయిని హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో ఈనెల 9నజరిగే దళిత చైతన్య జిల్లా సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన స్వగృహంలో జిల్లా, నగర నాయకులతో సమావేశమయ్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌తోపాటు సీనియర్ నాయకులు సదససుకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేలా చూడాలని నాయకులకు సూచించారు. సమావేశంలో నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు ప్రతాప్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కోన శ్రీకర్, మనోహర్, మేకల ఉపేందర్ పాల్గొన్నారు. -
ఇదేమి ట్విస్ట్ అధ్యక్షా!
ఎంతైనా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రూటే సపరేట్. ఇప్పుడు ఆయన చూపంతా ఎమ్మెల్సీ సీటుపైనే ఉంది. పీసీసీ అధ్యక్షుడేంటి ఆయనకు ఎమ్మెల్సీ సీటేంటని అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ .. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని 'హస్త'గతం చేసుకోలేదంటే అందుకు ముఖ్య కారణం పొన్నాలే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా సదరు నేతలంతా అధిష్టానం వద్దకు చేరి.... తప్పంతా ఆయనదే అని పొన్నాల వైపు చూపిస్తున్నారని సమాచారం. ఆ విషయం పొన్నాలకు చేరటంతో ... పదవి గండం ముంచుకొచ్చే సమయం అసన్నమైందని ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిదన్న రీతిలో పొన్నాల వ్యూహారచన చేస్తున్నారు. తనను పీసీసీ అధక్ష్య పదవి నుంచి తప్పించాలని భావిస్తే... ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. కాబట్టి ఏదో ఓ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని అధిష్టానానికి పొన్నాల షరతు విధించారని సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పొన్నాల శుక్రవారం హైదరాబాద్‌లో తెలిపారు. కానీ ఆ ఎన్నికల్లో రంగంలోకి దిగే అభ్యర్థులు ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని సెలవిచ్చారు. అయితే ఎమ్మెల్సీ సీటు కావాలని హైకమాండ్‌ను తాను అడగలేదని పొన్నాల స్పష్టం చేశారు. అలాగే గతంలో తాను అడగకపోయినా అధిష్టానం పెద్దలు పిలిచి మరీ అధ్యక్ష పదవి ఇచ్చి పీసీసీ పీఠం ఎక్కించారని ఆయన గుర్తు చేశారు. తన మనసు మాత్రం ఎమ్మెల్సీ సీటుపై లగ్నమైందని పొన్నాల చెప్పకనే చెబుతూ కొత్త ట్విస్ట్ ఇచ్చేశారు. -
కరువుపై నిర్లక్ష్యం ఎందుకు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రైతాంగం కరువుకోరల్లో చిక్కుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరువు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పులపాలై 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 9 తెలంగాణ జిల్లాల్లో 40 శాతం దాకా వర్షపాతం లోటుందన్నారు. దీనిపై నివేదికలు అందినా ప్రభుత్వం కరువుప్రాంతాల ప్రకటన చేయలేదన్నారు. రుణమాఫీ అమలుకాక, ఖరీఫ్ రుణాలు అందక, కరెంటు కోతలతో పంటలెండిపోయి, పండిన పంటలకు మద్దతు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పొన్నాలకు హూస్టింగ్..?
-
ఎర్రగడ్డపాలు కావద్దు
సర్కార్‌పై పొన్నాల ధ్వజం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అనుభవరాహిత్యం, అవగాహనా లోపంతో కేసీఆర్ ప్రభుత్వం ఎర్రగడ్డ పాలు కావద్దని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. తాను ఈ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవి కావని, ప్రజా శ్రేయస్సును కాంక్షించి చెప్తున్న మాటలన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ, సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించడంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఉద్యమాలతోనే ప్రభుత్వం ఫాస్ట్ పథకంపై వెనక్కి తగ్గిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు భయపడే 421 జీఓను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కార్యకర్తలు తమ దృష్టికి తెచ్చారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి బలోపేతం చేస్తామన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యల పట్ల నిలబడి పోరాడుతుందన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా అవతరించేలా చేసింది, కాడెద్దుగా నడుస్తున్న వ్యవస్థను మంగళ్యాన్ వరకు తీసుకొనిపోయింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి, వారి భాగస్వామ్యంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకే జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని అధినాయకత్వానికి పంపుతామన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తరచుగా మీడియాకెక్కడం మంచిదికాదని కార్యకర్తలంటున్నారని, పార్టీలోని కొందరు పెద్దలు దీన్ని పాటించాలని పరోక్షంగా వి.హన్మంతరావు, దానం నాగేందర్‌లాంటి నాయకులనుద్దేశించి పొన్నాల అన్నారు. -
కంగాళీ.. కాంగ్రెస్!
కమిటీలు లేని జాతీయ పార్టీ తొమ్మిది నెలలుగా ఇదే పరిస్థితి పీసీసీ చీఫ్ సొంత జిల్లాలోనే ఈ దుస్థితి కాంగ్రెస్ పటిష్టానికి నేడు జిల్లా స్థాయి చర్చలు పాల్గొనేది ఎవరో తెలియని అయోమయం వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ పార్టీకి తొమ్మిది నెలలుగా కనీసం కమిటీలు కూడా లేవు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే జిల్లా కమిటీ లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. సాధారణ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇదే రోజు అన్ని జిల్లాలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల పీసీసీ స్థాయిలో జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలు ఈ చర్చల్లో పాల్గొనాలని హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. జిల్లాలో ఎమ్మెల్యే, ఆ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం నింపాల్సిన కాంగ్రెస అధిష్టానం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పీసీసీ స్థాయిలో ఇష్టారీతిన పదవులు కట్టబెడుతున్న లక్ష్మయ్యకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పందన లేని ‘పొన్నాల’ గత ఏప్రిల్ నుంచి జరిగిన సాధారణ, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. అధికారంపోవడం, నాయకుల క్రమశిక్షణ రాహిత్యంతో జిల్లా కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటమిని పాఠాలను అధిగించి మళ్లీ బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అన్ని స్థాయిల్లో సమర్థులైన నాయకుల కోసం అన్వేషిస్తోంది. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితి ఉంది. కనీసం కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కోసం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి 2014 ఆగస్టులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిపాదనలు పంపారు. నాయినిని పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జనవరి 12న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నా.. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పొన్నాల మాత్రం స్పందించడంలేదని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి. కాగా ఆదివారం జరిగే సమావేశంలో ఎవరు పాల్గొంటారనేది తెలియని అయోమయ స్థితిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ఫేస్బుక్ ఎకౌంట్ ఉంటేనే కార్యకర్తలతో ఫోటో
-
'అడగకుండానే అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది'
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే ఎమ్మెల్సీ సీటు కావాలని హైకమాండ్‌ను తాను అడగడం లేదని పొన్నాల స్పష్టం చేశారు. తాను అడగకపోయినా పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
రోగుల ఉసురు తాకుద్ది: పొన్నాల
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వృద్ధులు, వితంతు వుల ఉసురే కాదు, టీబీ రోగుల ఉసురూ పోసుకుంటున్నా డని టీ పీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పొన్నాలతో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు గురువారం ఛాతీ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిని తరలించొద్దు: సీపీఎం ఛాతీ ఆసుపత్రిని తరలించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గురువారం సీపీఎం డిమాండ్ చేసింది. అందుబాటులో ఉన్న ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించడంరోగులకు ఇబ్బంది కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి తరలింపు ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సీఎంకు లేఖ రాశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆరు బీసీ సంఘాలు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆస్పత్రి తరలింపు వెనుక ప్రభుత్వ కుట్రలున్నాయని, ఇక్కడున్న వేల కోట్ల విలువైన భూమిని దొడ్డిదారిన విక్రయించి అక్రమాలకు పాల్పడాలని చూస్తోందని ఆర్.కృష్ణయ్య (జాతీయ బీసీ సంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం), జి.మల్లేష్‌యాదవ్(బీసీ ఫ్రంట్), ప్రొఫెసర్ కె.నటరాజ్ (బీసీ కులాల ఐక్యవేదిక), దుర్గయ్యగౌడ్ (బీసీ సమాఖ్య), కె.శ్రీనివాస్(బీసీ విద్యార్థి సంఘం) ఆరోపించారు. -
కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవ!
దానం వర్సెస్ మర్రి పనిలోపనిగా పొన్నాలనూ విమర్శించిన దానం ఫోన్లో అందుబాటులో లేరని మర్రి వివరణ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. పరస్పర విమర్శలతో నేతలు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగారు. హైదరాబాద్‌లో గురువారం ఛాతీ ఆస్పత్రి సందర్శన, పేదలకు ఇళ్ల సమస్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు కార్యక్రమం రూపొం దించారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ గైర్హాజరయ్యారు. దానం నాగేందర్‌ను పిలవడానికి ప్రయత్నించినా దొరకలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తనను పిలవకుండానే కార్యక్రమాలు చేపట్టారని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్‌రెడ్డినే కాకుండా పనిలో పనిగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనా దానం నాగేందర్ విమర్శలు చేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లోకి దానం వెళ్తున్నారని కొందరు, టీడీపీలో చేరుతున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రాకపోవడాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనితో కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. దానం అందుబాటులోకి రాలేదని కాంగ్రెస్‌నేతలు అంటుండగా, తనను నిర్లక్ష్యం చేశారని పొన్నాల, మర్రిపై దానం నాగేందర్ నిప్పులు చెరిగారు. ఫోన్ చేస్తే దొరకలేదు: మర్రి ప్రభుత్వం చేస్తున్న తప్పులపై గవర్నరుకు ఫిర్యాదు చేయడానికి రావాలని దానం నాగేందర్‌కు ఫోన్లు చేశామని, ఫోనులో ఆయన అందుబాటులోకి రాలేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. దీంతో అందుబాటులో ఉన్న గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లామన్నారు. దానం పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉంటారు. పోయేవాళ్లు పోతారు. ఎవరు పోతున్నారో నాకైతే సమాచారం లేదు’ అని శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మర్రి ఎక్కడున్నా విపత్తే : దానం మర్రి శశిధర్ రెడ్డి ఎక్కడ ఉన్నా విపత్తులాంటి వారేనని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ తనకు తానే పెద్దనాయకుడ్ని అనే భ్రమల్లో ఉంటాడన్నారు. పార్టీ అభివృద్ధికోసం ఏమీ చేయలేదన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి ఎక్కడున్నా అక్కడ విపత్తేనని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఆయన ఎక్కడున్నాడో తెలియదన్నారు. సనత్‌నగర్‌లో ఉప ఎన్నికలు వస్తాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నాడని దానం విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇన్స్టంట్ కాఫీలాంటివారని విమర్శించారు. గ్రేటర్ అధ్యక్షునికి చెప్పకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సరైందికాదన్నారు. పార్టీలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా పొన్నాల పనిచేస్తున్నాడని దానం విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా కొనసాగిస్తే కొనసాగించండి, లేకుంటే లేదన్నారు. పార్టీ పదవులు ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని దానం స్పష్టం చేశారు. తాను అందుబాటులో లేనని చెప్పడం సరికాదన్నారు. -
'నేను పనికి రాను అనుకుంటే తీసేయండి'
-
'నేను పనికి రాను అనుకుంటే తీసేయండి'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి తీరుపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. నగర కాంగ్రెస్ ను విభజించి పబ్బం గడుపుకోవడానికి మర్రి చూస్తున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన దానం.. తనకు చెప్పకుండా హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు చెప్పకుండా పార్టీ వ్యవహారాలు నడపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. నగర అధ్యక్షునిగా తాను పనికి రాను అనుకుంటే మరో నేతను తీసుకునే అధికారం పొన్నాలకు ఉందని.. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయలేదన్నారు. తాను పదవి లేకున్నా.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికార పార్టీతో, సీఎంతో పైరవీలు తనకు అవసరం లేదని దానం స్పష్టం చేశారు.'మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్. ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్దనేత అనుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే ఇళ్ల నిర్మాణ అంశంపై నగర నేతలతో కలిసి గవర్నర్ కలవడం సరికాదు' అని దానం విమర్శించారు. -
‘కేజీ టు పీజీ’ అందించడమే లక్ష్యం: కడియం
జనగామ: కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా సోమవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. ఆయనకు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ, కాజీపేట, హన్మకొండలోని ఏకశిల పార్కులో జరిగిన సభల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పదవి వరించిందని.. విశ్వాసంతో పనిచేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఏ సీఎం చేయని విధం గా నాలుగు రోజులు వరంగల్ మురికివాడల్లో పర్యటించి అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి రూ.400 కోట్లు విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పొన్నాలవి ప్రగల్భాలు ‘మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో చావుదెబ్బతిని లేవలేని స్థితిలో ఉన్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.’ అని కడియం విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరూ కలసిరావాలని సీఎం కేసీఆర్ కోరుతుండగా పొన్నాల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 2019లో ఎవరేమిటో తేలుతుందని.. ఇప్పుడు మాత్రం అభివృద్ధికి సహకరించాలన్నారు. రాజయ్యపై ప్రేమ, అభిమానం ఉంది.. డాక్టర్ రాజయ్య తనకు సోదరుడి లాంటివాడని, అతడిపై ప్రేమ, అభిమానం ఉందన్నారు. ఊహించని రీతిలో మార్పు జరిగిందని మంత్రి శ్రీహరి అన్నారు. గ్రామాల్లో కడియం, రాజయ్య వర్గం అంటూ అభిప్రాయభేదాలు సృష్టించవద్దని, ఏమైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మనర్సింగరావు, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎమ్మెల్సీలు రాజలింగం, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. -
భూసేకరణ ఆర్డినెన్సుపై పోరాటం
అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతుల పొట్టకొట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై శనివారం గాంధీభవన్‌లో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రజల అవసరాల ముసుగులో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, ఇది పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్సులో పేద రైతులకు నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అంశాలను సమావేశంలో వివరించారు. 2013 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని అంశాలను కూడా ఈ సందర్భంగా కొప్పుల రాజు వివరించారు. 23న దేశవ్యాప్త ఉద్యమం: పొన్నాల తెలంగాణ పేదలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, మల్లు రవి, శ్యాంమోహన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. దొంగచాటుగా తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతారన్నారు. పరిశ్రమ అవసరాలకు తీసుకున్న భూమిలో, పరిశ్రమ పెట్టకుండా పడావు పెట్టినా అసలు రైతులకు ఈ ఆర్డినెన్సు ద్వారా ఆ భూమి దక్కకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించాలని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి 23న ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పోరాటం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పొన్నాల తెలిపారు. కాగా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు చేయకుండా, వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానానికి నిరసనగా అన్ని పార్టీలను, సంఘాలను కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నాల ఒక కమిటీని ప్రకటించారు. మల్లు రవి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కొనగాల మహేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. -
ఏడ్నెల్ల పసిగుడ్డు ప్రభుత్వంపై ఏడుపెందుకు?
దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారు పొన్నాల దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం చేశారు? నాలుగేళ్లలో తాగునీళ్లివ్వకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్ వరంగల్ పర్యటనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ హన్మకొండ : ఏడు నెలల పసిగుడ్డు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏం సాధించారని మాట్లాడుతున్నారని రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. శనివారం పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్‌తో కలిసి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన కె.తారకరామారావుకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా కోర్టులో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. ప్రజా కోర్టులో ఇచ్చిన తీర్పును కాదని కేసీఆర్‌పై సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేస్తామని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన తప్పిదాలకు కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోండి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి ముందుగా మీపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడండి.. అని ఎద్దేవా చేశారు. పదవులకై పెదవులు మూసుకొన్న నాయకులు, దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని తూర్పారబట్టారు. మీరు ఏం చేయకపోవడంతో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్నారు. దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మెరుగైన అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై గల్లీగల్లీ తిరిగి ప్రజలందరినీ కూడగట్టి అహంకారంతో ఉన్న కాంగ్రెస్‌ను నేలకు దించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. చరిత్రలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉండి నాలుగు నియోజకవర్గాల్లోని పేదల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని వారికి పక్కా ఇళ్లు కట్టించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించి ఏ ఆడబిడ్డ కూడా బిందెతో రోడ్డెక్కొద్దని చెప్పడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతుంటే వారి కష్టాలు చూసి రక్షిత మంచినీటిని నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నాలుగేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తానని, లేకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ పేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.51 వేల ఆర్థిక సహాయం అందించే కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం, దళితులకు మూడెకరాల సాగుభూమి, పింఛన్లు రూ.200 నుంచి రూ.వె య్యి, రూ.1500లకు పెంచడమే కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశారని కేసులు పెడతామని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనులున్నా, పక్కనే గోదావరున్నా కరెంట్‌కై కష్టాలు పడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించి మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించాలనే కార్యాచరణతో ముందుకు పోతున్నారన్నారు. -
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి
హన్మకొండ చౌరస్తా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారాని కి రావాలని జిల్లా నేతలకు ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూ చిం చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన భూ సేకరణ అంశంపై శనివారం సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు కొప్పుల రాజు హాజరుకాగా, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌తో పాటు సీజే శ్రీని వాస్, డాక్టర్ హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ఘం టా నరేందర్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో కొప్పుల రాజు మాట్లాడుతూ ఢిల్లీ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. అలాగే ఫిబ్రవరిలో వరంగల్‌లో జరగనున్న ఎస్సీ సెల్ సమ్మేళ నం విజయవంతానికి కృషి చేయాలన్నారు. -
కుల చైతన్యంతోనే ఈ స్థాయికి వచ్చా...
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాపుగర్జన నిర్వహించాలని సూచన మున్నూరు కాపు భవన నిర్మాణానికి భూమి పూజ హాజరైన కొండా దంపతులు, ఎమ్మెల్సీ పూలరవీందర్ హన్మకొండ చౌరస్తా : ‘నా చిన్న తనంలో మానాన్న వ్యవసాయ జీతగాడిగా పనిచేసే వాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కుల చైతన్యమే’ అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీతో వివిధ ప్రాంతాల్లోని కులబాంధవులను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కాపు సోదరుడు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే కులబంధం గుర్తుకొచ్చిందన్నారు. సంఘం భవన నిర్మాణానికి తన వంతు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. అందరిని ఒక్కతాటి పైకి తెచ్చేందుకు నేటి తరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. కాపు భవన్లో ప్రత్యేక లైబ్రరినీ ఏర్పాటు చేయాలన్నారు. ఐకమత్యంతో ముందుకు పోయి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన నాయకత్వం కులానికి అవసరమన్నారు. వ్యాపార, రాజకీయ, స్నేహబంధాలలో ఆలోచనలు, వైఖరి మారవచ్చు కానీ, కుల బంధంలో ఆలోచనలు మారవన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి కులం ఐక్యత కోసం పనిచేయాలని సూచించారు. కాపు భవనానికి సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయనకు కుల బంధువుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ తనకు రాజకీయంగా ఈ అవకాశం వచ్చిందంటే కాపు సోదరుల ప్రోత్సాహమేనని అన్నారు. అన్ని జిల్లాల్లోని కాపు వర్గాల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కాపు భవన నిర్మాణానికి తన వంతు సాయమందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ కుల అభ్యున్నతి కోసం ప్రతి పనిలో ముందుంటానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొండా సురేఖ విజయానికి కులబాంధవుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, తోట తిరుపతయ్య, డాక్టర్ కాళీప్రసాద్, ఈవీ శ్రీనివాసరావు, ఆశం కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర, గుజ్జుల నర్సయ్య, కనుకుంట్ల రవికుమార్, కోలా జనార్దన్, కేడల ప్రసాద్, తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమబాటలో కాంగ్రెస్ పార్టీ
పార్టీ ముఖ్యులతో టీపీసీసీ చీఫ్ పొన్నాల భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై క్షేత్రస్థాయి ఉద్యమ కార్యాచరణకు దిగాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు, ఆందోళనలను అధ్యయనం చేసి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో పార్టీ ముఖ్యులు కొందరు బుధవారం సమావేశమయ్యారు. చేనేత, రైతు, విద్యార్థి, మహిళ, దళితుల సమస్యలపై తక్షణం దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని నిర్ణయించారు. అయితే పార్టీ మేధోమథనం ఉన్నందున.. అది పూర్తయిన తర్వాత కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. -
‘పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో’
హైదరాబాద్: పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో అని మాజీ మం త్రి పి.శంకర్రావు నినదించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పరాజయానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్థతే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ను పట్టించుకునే నేతలు తెలంగాణలో లేరని పోయారన్నారు. పీసీసీ అధ్యక్షునిగా తనను నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. -
కాంగ్రెస్ చీఫ్ ‘నాయిని’
డీసీసీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ వరంగల్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 17న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడిగా ‘నాయిని’ని నియమించారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తర్వాత.. నారుుని పింఛన్లు, విద్యుత్ కోతలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశారు. కీలక నేతలు పార్టీని వీడినా.. పార్టీపై ఆ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. అన్నింటి కంటే ముఖ్యంగా గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో నడిపించగలుగుతున్నారు. ఇలా ఎనిమిది నెలలుగా పార్టీకి చేసిన కృషితో రాజేందర్‌రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ పూర్తిస్థాయి అధ్యక్ష పదవిని తనకు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీకి, తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభినందనల వెల్లువ డీసీసీ పూర్తి అధ్యక్షుడిగా నియమితుడైన నాయిని రాజేందర్‌రెడ్డికి జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పీసీపీ మీడియా కన్వీనర్ ఇ.వి.శ్రీనివాసరావు, నాయకులు బిన్ని లక్ష్మణ్, కట్ల శ్రీనివాస్, ధనరాజ్, ప్రదీప్, సాదా శ్రీను, టి.మదు, హరి, నలుబోల రాజు, నెక్కొండ కిషన్, మెడకట్ల సారంగపాణి, బాబురావు, తోట వెంకన్న నాయినిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
'ఫిల్మ్‌సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు'
హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్‌సిటీ భూముల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమారుస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గతంలో చెప్పినదానికి విరుద్ధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కేసీఆర్ మాట మారుస్తారని టీఆర్ఎస్ నేతలే... కొంతమంది అంగీకరిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. మాట తప్పుతూనే తాను మాట మార్చే మనిషిని కాను అని చెప్పడం కేసీఆర్‌కే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ భూముల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని పొన్నాల అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, పెన్షన్లు రాని వృద్ధులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదన్నారు. వరంగల్‌లో 4వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్...గతంలో గజ్వేల్‌లో 5వేల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. -
బీజేపీది బలుపు కాదు.. వాపే: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: బీజేపీది బలుపు కాదు వాపేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రధాని కాగానే విశ్వాసం పెరిగినట్టుగా అమిత్‌షా చెప్పుకోవడం కూడా పచ్చి అబద్ధమన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అది తప్పని తేలిందన్నారు. ‘నాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీడబ్ల్యూసీ వంటి పెద్ద పదవులు వస్తున్నాయని కొందరంటున్నారు. మరికొందరు ఎమ్మెల్సీ అవుతానంటున్నారు. ఇప్పుడున్న పీసీసీ పదవి కావాలని కోరుకుంటున్నవారే ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ పదవి ఖాళీ కావాలంటే నన్ను ఏదో ఒక పదవిలోకి వారే పంపుతున్నారు. ఇంతకన్నా పెద్ద పదవే వస్తుందో, ఇక్కడే ఉంటానో.. అక్కడ (ఢిల్లీలో) ఏం జరుగుతున్నదో వీళ్లకు తెలుసా?’ అని పొన్నాల ప్రశ్నించారు. మాజీమంత్రి జె.గీతారెడ్డి పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘గీతారెడ్డి పార్టీ మారతారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆమె సీనియర్, ముఖ్యమైన నేత. టీఆర్ఎస్ వాళ్లకు మైండ్‌గేమ్ ఆడటం అలవాటు. తమ పార్టీలోకి వస్తారంటూ ప్రచారం చేస్తారు. ఇక్కడ కూడా ఇదే తీరు మైండ్‌గేమ్ ప్లాన్. కంటోన్మెంట్ ప్రచారంలో గీతారెడ్డి ఇంటిముందుకు వచ్చి చాయ్ తాగిపిస్తారా? అని మంత్రులు హరీష్‌రావు, తలసాని అడిగినారట. అలా అడిగితే కాదంటారా? . అంతేతప్ప పార్టీ మారాల్సిన అవసరం లేదని గీతారెడ్డితో మాట్లాడితే చెప్పారు. టీఆర్ఎస్ మైండ్‌గేమ్‌కు అంతపెద్ద నాయకులు పడిపోరు’ అని పొన్నాల అన్నారు. బీడీ కార్మికులకు అండగా ఉంటాం బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు దాటవేస్తున్నదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ, అధ్యక్షులు వనమా కృష్ణ, నేతలు నరేందర్, కె.సూర్యం తదితరులు గాంధీభవన్‌లో పొన్నాలను శనివారం కలిసి బీడీ కార్మికుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉద్యమించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీగా అది తమ బాధ్యత అని, బీడీ కార్మికుల పోరాటానికి మద్ధతునిస్తామని పొన్నాల అన్నారు. -
ఎన్నికల కోసమే పర్యటన: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో మురికివాడ సందర్శించేంత వరకు అర్హులకు పింఛన్లు అందడం లేదని సీఎం కేసీఆర్‌కు తెలియలేదా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 44 లక్షల మంది పింఛనుదారులుంటే ఇప్పటి వరకు 27 లక్షల మందినే అర్హులుగా గుర్తించారన్నారు. మిగిలిన 17లక్షల మంది పింఛనుదారులకు, కొత్తగా గుర్తించిన వారికి ఫించను ఇవ్వకుండా ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఏడాది జరిగే వరంగల్ మున్సిపల్ ఎన్నికల కోసమే మురికి వాడల సందర్శనకు వెళ్లారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదని ఆయన చెప్పారు. 20న హైదరాబాద్‌కు దిగ్విజయ్ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు ఈనెల 20న పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నట్లు పొన్నాల తెలిపారు. -
భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు
ఇన్చార్జ్అధ్యక్షుడిగా కొనసాగింపు నియామక ఉత్తర్వు అందించిన పొన్నాల సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాకాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆలేరు మాజీఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసేవరకూ ఇన్చార్జ్ అధ్యక్షుడి హోదాలో పనిచేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డీసీసీ అధ్యక్ష నియామక ఉత్తర్వులను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా భిక్షమయ్యగౌడ్ అందుకున్నారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తూడి దేవేందర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూ రంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ పరిశీలకుడి సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తనను బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమించారు. భిక్షమయ్యగౌడ్ ఇన్చార్జ్ అధ్యక్షుడే అని ప్రకటించినా, ఆయనే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. సింగిల్‌విండో డెరైక్టర్ నుంచి.... బూడిద భిక్షమయ్యగౌడ్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తొలుత యూత్‌కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత గుండాల మండలం సుద్దాల గ్రామ సింగిల్‌విండో డెరైక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్న గౌడ్ 2009 ఎన్నికలలో అనూహ్యంగా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో భిక్షమయ్య చురుగ్గా వ్యవహరించారు. జిల్లాలోని అందరు నాయకులతో ఉన్న సఖ్యతే ఆయన నియామకానికి సహకరించిందని పార్టీవర్గాలంటున్నాయి. అందరితో కలిసి ముందుకెళతా: డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోయి పనిచేస్తానని నూతన డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని, అందరు నేతలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున పనిచేసే గొంతుకనవుతానని తెలిపారు. -
ఐక్యతారాగం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘నువ్వా దరిని.. నేనీ దరిని’ అంటూ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం ఒకే వేదికపైకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ఇన్చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరైన బోధన్ సభలో ఐక్యతారాగం వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు చేదు ఫలితాలు ఇచ్చినా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదన్న ఆపవాదును దూరం చేసే ప్రయత్నం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు తీరుతెన్నులపై సమీక్షించేందుకు బోధన్‌లోని ఓ ఫంక్షన్హాల్లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని విజయవం తం చేసేందుకు రెండు రోజులు బోధన్‌లోనే మకాం వేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అందరినీ ఒకే వేదికపైకి చేర్చేందుకు కృషి చేశారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ దిగ్గజాలు ఐక్యత రాగం వినిపించడం కార్యకర్తలలో చర్చనీయాంశంగా మారింది. శాసనమండలి విపక్షనేత డి. శ్రీనివాస్, ఉపనేత మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ సురేష్‌కుమార్ శెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌పట్వారీ, మాజీ ఎమ్మెల్యేలు సౌదాగర్ గంగారాం, సౌదాగర్ సావిత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ న మోదు కార్యక్రమానికి మరో రెండు నెలల గడువు పెరగగా, ఇప్ప టి కే 82 శాతం పూర్తి చేసిన జిల్లా అగ్రగామిగా ఉందని కుంతి యా, పొన్నాల లక్ష్మయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం లో అధికారం చేపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా వ్యవహరించిందని, రెండు లక్షల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా ఓటర్లను నమోదు చేసి అక్రమ పద్ధతిని అవలంభించిందని రామచంద్ర కుంతియా మండిపడ్డారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ మత మార్పిడులను ప్రోత్సహిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలసలతో కాలం గడుపుతోందన్నారు. ఆరు నెలల పాలనలో బీజేీ ప, టీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలను ఇం కెంతకాలమో మోసం చేయలేరని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేష్‌రెడ్డి, సురేశ్‌శెట్కార్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ కెసీఆర్‌ది నియంతృత్వ పాలన అని ధ్వజమెత్తారు. అ ధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పాకులాడలేదన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోని యా గాంధీ, యువనేత రాహుల్‌గాంధీపై పార్టీ కార్య కర్తలు, ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. మతతత్వ పార్టీలను విశ్వసించవద్దని, దేశ ఐక్యత కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వర్షాభావ పరిస్థి తులతో తీవ్ర కరువు నెలకొన్నందున తక్షణ మే నిజామాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నమ్మి ఓట్లేసి న ప్రజలను నట్టేట ముంచుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుందన్నారు. టీఆర్ఎస్ నేతల వేధింపులపై ఆవేదన సభలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చే శారు. బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోలీసు అధికారులు టీఆర్ఎస్ కా ర్యకర్తలుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ రోపించారు. టీఆర్ఎస్ నేతలు అక్రమవ సూళ్లకు కౌంటర్లు తెరిచారని విమర్శించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ కొందరు నేతలు సభలు, సమావేశాలకే పరిమితమవుతూ, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. పదేళ్లు అ ధికారంలో ఉండి కార్యకర్తలకేమీ చేయలే క పోయామని, ప్రస్తుత పరిస్థితులలో అయి నా, కొందరు నేతలు హైదరాబాద్‌లో ఉంటూ ఫోన్లు ఎత్తకుండా ఉంటే కార్యకర్తలు మన వెంట ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉన్నతస్థాయి నేతలు కార్యకర్తల బాగోగులు చూడాలని కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, బాన్సువాడ ఇన్చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై టీఆర్ఎస్ నేతల పెత్తనం పెరి గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ సభ్యులకు కేటాయించే నిధులను సైతం ఎమ్మెల్యేలు మళ్లించుకుంటున్నారని శోభ ఆరోపించగా, టీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కక్షపూరి తంగా వ్యవహరిస్తూ, అక్రమ కేసులలో ఇరి కిస్తున్నారు బాలరాజు పేర్కొన్నారు. స్పం దించిన పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డి తదితరులు కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ వేధింపులను సహించేది లేదని, ధైర్యంతో ముందుకు సాగుతామన్నారు. కార్యకర్తలకు బాసటగా ఉంటామని ప్రతిన చేశారు. నేతలకు దిశానిర్దేశం చేసిన కుంతియా, పొన్నా ల పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా కలిసి నడవాలని పిలుపునిచ్చారు. -
ప్రజల్లో అసంతృప్తి మొదలైంది: పొన్నాల
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఆదివారం నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నాల మాట్లాడుతూ... ఆధికారం కోసం టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన హామీల భ్రమలు తొలిగిపోతున్నాయని అన్నారు. లౌకికవాదానికి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పొన్నాల స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అపవాదు ఉందని అన్నారు. కాంగ్రెస్‌పార్టీకి 130 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం 130 కోట్ల మంది భారతీయులకు తెలుసన్న విషయాన్ని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
‘కాకా’ స్మారకచిహ్నం నెలకొల్పాలి
కాంగ్రెస్ నేతల డిమాండ్ గాంధీభవన్‌లో వెంకటస్వామి సంస్మరణ సభ కాకలు తీరిన వారికే ‘కాకా’ అని కొనియాడిన నేతలు సాక్షి, హైదరాబాద్: కాకలు తీరిన రాజకీయ నేతలకూ ‘కాకా’గా కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొనియాడారు. దివంగత నాయకుడు వెంకటస్వామి పేరుతో స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పార్టీ అగ్రనేతలు జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, నంది ఎల్లయ్య, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, మల్లు భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్, మాదు సత్యం, కత్తి వెంకటస్వామి, మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి అసామాన్య స్థాయికి ఎదిగిన దళితజాతి రత్నంగా వారు అభివర్ణించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలని, కాకా పేరుతో ఆడిటోరియం నిర్మించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడబోయే వాటిలో ఓ జిల్లా కు కాకా పేరు పెట్టాలని కోరారు. త్రివేణి సంగమంలో అస్థికలు నిమజ్జనం కాటారం: జి.వెంకటస్వామి అస్థికలను శనివారం ఆయన కుమారులు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కాకా కుమారులు మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్‌లు కుటుంబ సభ్యులతో ఉదయం కాళేశ్వరం వచ్చారు. గోదావరి వద్ద ప్రత్యేక పూజలు చేసి, మూడు నదులు కలిసే చోట అస్థికలను నిమజ్జనం చేశారు. -
మోదీ పాలనపై కాంగ్రెస్ పుస్తకం
హామీలను విస్మరించారని నేతల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో భ్రమలు తొలిగిపోయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రధాని మోదీ ఏడు నెలల కాలంపై ఏఐసీసీ ఇంగ్లిష్‌లో ప్రచురించిన ‘మోదీ యూ టర్న్’ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలుగులోకి అనువందింపచేశారు. శుక్రవారం ఈ పుస్తకాన్ని పొన్నాల, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసన మండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్ గాంధీభవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనపై వారు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ టీఆర్ఎస్ అమలు చేయలేదని పొన్నాల అన్నారు. రైతుల ఆత్మహత్యలను నిలవరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మోదీ చెప్పిన దానికి.. ప్రస్తుత పాలనకు పొంతనే లేదని డీఎస్ విమర్శించారు. కార్యక్రమంలో జానారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
భ్రమలన్నీ తొలగిపోయాయి: టి. కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కల్పించిన భ్రమల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏడు నెలల పాలనలో మోదీ సర్కారు పలు అంశాల్లో యూటర్న్ తీసుకుందని విమర్శించారు. హామీలపై వెనక్కు తగ్గుతున్న వైనాన్ని ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తక ముద్రణ కాదు, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పొన్నాల తెలిపారు. ఎన్నికలకుముందు మోదీ చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. మోదీ సర్కార్ కల్పించిన భ్రమలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు తమ పార్టీ బాటలోనే నడుస్తున్నారని మరో నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 'మోదీ యూ టర్న్' పుస్తకాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం: పొన్నాల
కాంగ్రెస్‌లో చేరిన గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందనడానికి ఒక బీసీకి టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించడమే రుజువని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులు, పోరాట సమితి జిల్లాల అధ్యక్షులతో కలసి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం మంది బీసీలు ఉన్నారని, జనాభా దామాషా పద్ధతిలో పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా బీసీలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారని చెప్పారు. గొల్లకుర్మ హక్కుల కోసం జరిగే పోరాటాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. గోసుల శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న గొల్ల కుర్మల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జి.వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత్వం.. ఆరంభశూరత్వం!
మూడు పార్టీలకూ పరీక్షగా మారిన సభ్యత్వ నమోదు ఓటమి నుంచి తేరుకోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ శ్రేణులు సగానికి కూడా చేరుకోని లక్ష్యాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి తేరుకోని పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి మొక్కుబడిగా హాజరవుతున్నారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా రెండు లక్షల క్రియాశీల సభ్యత్వా లు నమోదు చేయించాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు కనాకష్టంగా 60 వేల సభ్యత్వాలునమోదు చేయించి చతికిల పడింది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఫలితం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన కాంగ్రెస్.. ఘోరపరాభవంతో గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమష్టిగా నడుంబిగించింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన జిల్లాకు చెందిన నేతలు ఆ తర్వాత సభ్యత్వ నమోదుకు ఊపు తీసుకురావడంలో విఫలమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన సీనియర్లు ఓటమితో గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కలిసికట్టుగా ముందుకు సాగుతున్నప్పటికీ దిగువశ్రేణి నేతలను ఏకతాటిమీదకు తేలేకపోతున్నారు. ఈ ప్రభావం సభ్యత్వంపై పడుతోంది. ‘దేశం’లోనూ అదే తీరు.. ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినా.. అనంతరం జరిగిన పరిణామాలతో కుదేలైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చతికిలపడింది. జిల్లాలో రెండు లక్షల మందిక్రియాశీల కార్యకర్తలతో సభ్యత్వ నమోదు చేయించాలని టార్గెట్‌గా పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లు.. లక్ష్యంలో సగానికి కూడా చేరుకోలేకపోయారు. గురువారం నాటికి గడువు ముగిసినా లక్ష్యం చేరకపోవడంతో గడువును వారం రోజులపాటు పొడిగించారు. ఎన్నికల అనంతరం పలువురు ముఖ్య నేతలు అధికారపార్టీ గూటికి చేరడంతో టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా ఊగిసలాడుతుండడంతో సభ్యత్వ నమోదు ఊపందుకోలేదు. తాండూరు, మహేశ్వరం, ఎల్బీ నగర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి సారథ్యం వహించే నేతలు లేకపోవడం.. ఉన్న నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పొడచూపడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కమలంలోనూ నైరాశ్యమే.. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల సభ్యత్వాలు చేయించాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటివరకు రెండు లక్షలు కూడా దాటలేకపోయింది. నియోజకవర్గాలవారీగా ఇన్చార్జీలను నియమించినా ఫలితంలేకుండా పోతోంది. పార్టీకి ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తున్నా.. దాన్ని ప్రోది చేసుకోవడంలో విఫలమవుతోంది. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు