‘మాట మార్చే నైజం కేసీఆర్‌ది’ | Ponnala Lakshmaiah Slams CM KCR | Sakshi
Sakshi News home page

‘మాట మార్చే నైజం కేసీఆర్‌ది’

Published Mon, Jan 16 2017 3:46 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

Ponnala Lakshmaiah Slams CM KCR

హైదరాబాద్‌: ఎప్పటికప్పుడు మాట మారుస్తున్న సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి మోదీకి వంతపాడుతున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేంద్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఆవలంభిస్తోందని విమర్శించారు. నల్లధనాన్ని వెలికి తీస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు పెట్టుబడి దారులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లరద్దు పేరుతో ప్రజలను అవమానపర్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన అన్ని జిల్లాల్లో మహిళా కాంగ్రెస్‌ నిరసనలు చేపడుతుందని చెప్పారు. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలపై కేంద్రం పెట్టిన ఆంక్షలను సడలించాలనే డిమాండ్‌తో ఈనెల 20న ఆర్‌బీఐ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement