గిట్టుబాటు ధరలకు 500 కోట్లతో నిధి
హైదరాబాద్: వచ్చే ఏడాదిన్నర కాలంలో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో 24 గంటలు కరెంట్ అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పామాయిల్ రైతులు కలిసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో పామాయిల్ రైతులు తమ సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి సాయం చేయాలని సీఎంను రైతులు కోరారు.
గిట్టుబాటు ధరల సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రైతు కమిటీల ఆధ్వర్యంలో వ్యవసాయం ఉత్పత్తుల అమ్మకం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.