హన్మకొండ చౌరస్తా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారాని కి రావాలని జిల్లా నేతలకు ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూ చిం చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన భూ సేకరణ అంశంపై శనివారం సమీక్ష జరిగింది.
ఈ సమీక్షకు కొప్పుల రాజు హాజరుకాగా, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌తో పాటు సీజే శ్రీని వాస్, డాక్టర్ హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ఘం టా నరేందర్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో కొప్పుల రాజు మాట్లాడుతూ ఢిల్లీ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. అలాగే ఫిబ్రవరిలో వరంగల్‌లో జరగనున్న ఎస్సీ సెల్ సమ్మేళ నం విజయవంతానికి కృషి చేయాలన్నారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి
Published Sun, Jan 25 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement
Advertisement