ఆప్‌కు బిగ్‌ షాక్‌.. కేజ్రీవాల్‌ సహా కీలక నేతల ఓటమి | Arvind Kejriwal And AAP Leaders Loss In Elections | Sakshi
Sakshi News home page

ఆప్‌కు బిగ్‌ షాక్‌.. కేజ్రీవాల్‌ సహా కీలక నేతల ఓటమి

Published Sat, Feb 8 2025 1:04 PM | Last Updated on Sat, Feb 8 2025 3:22 PM

Arvind Kejriwal And AAP Leaders Loss In Elections

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆప్‌ అ‍గ్ర నేతలకు ఢిల్లీ ఓటర్లు షాకిచ్చారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆయనతో పాటు పార్టీ అగ్ర నేతలు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ ఓడిపోయారు. దీంతో, ఆప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌ పార్టీకి ఓటర్లు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఆప్‌ అగ్ర నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో, ఎన్నికల్లో కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేంద్రజైన్‌ ఓటమిని చవిచూశారు. వీరు ముగ్గురు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. దీంతో, వీరిని ప్రజలు ఓడించారు. మరోవైపు.. కల్కాజీ నియోజకవర్గంలో మాత్రం సీఎం అతిశి విజయం సాధించారు.

కేజ్రీవాల్ ఓటమి

ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ చేతిలో మనీష్‌ సిసోడియా పరాజయం పాలయ్యారు. షాకుర్‌ బస్తీలో సత్యేందర్ జైన్ సైతం ఓటమిని చవిచూశారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement