Arvind Kejriwal
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ హీట్
-
లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్ విచారణ
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం (డిసెంబర్ 21) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.డిసెంబరు 5న ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అనుమతి కోరింది. తాజాగా,లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది.Delhi LG VK Saxena has given sanction to the Enforcement Directorate to prosecute AAP chief and Former Delhi CM Arvind Kejriwal in the excise policy case: LG OfficeOn December 5, the Enforcement Directorate sought permission for sanction of prosecution against Arvind Kejriwal.— ANI (@ANI) December 21, 2024 మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్,విడుదలమద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 13న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.మద్యం పాలసీ కేసు కథేంటీ?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. అరెస్టు చేసింది.ఇదే కేసులో కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు సైతం జైలు శిక్షను అనుభవించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీకి అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
ఢీల్లీ సీఎం డౌన్ డౌన్!
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామన్న కేజ్రీవాల్
-
ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్, బీజేపీ తమ కత్తులకు పదునుపెడుతున్నాయి. మూ డో విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ శాంతి భద్రతల పరిస్థితి దారుణమంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బదులుగా అన్నట్లు, సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికార నివాసానికి రూ.42 కోట్లు వెచ్చించిన అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్(అద్దాల మేడ), ‘7 స్టార్ రిసార్ట్’ను కట్టుకున్నారంటూ ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ విడుదల చేశారు.కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే..‘సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ఇదే. దీన్ని గురించిన వాస్తవాలను మీ ముందుంచబోతున్నాను’ అని పేర్కొంటూ సచ్దేవ్.. ‘ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రతను తీసుకోనని చెప్పిన ఈయన, ఇప్పుడు వైభవోపేతమైన 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నాడు’అని పేర్కొ న్నారు. ‘రూ.1.9 కోట్ల విలువైన మార్బుల్ గ్రానైట్ లైటింగ్, రూ.1.5 కోట్లతో ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్, రూ.35 లక్షల విలువైన జిమ్, స్పా పరికరాలు కలిపి మొత్తంగా వీటికే రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే’ అని విమర్శించారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ ఉల్లంఘించారన్నారు. ఈ డబ్బుతో నిరుపేదలకు 34 ఇళ్ల ఫ్లాట్లు, లేదా 326 ఈ–రిక్షాలను అందజేయవచ్చన్నారు. బీజేపీ ఎంపీ ప్రవీణ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేజ్రీవాల్ చెప్పిన ‘ఆమ్ ఆద్మీ’కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.తిప్పికొట్టిన ఆప్ఈ విమర్శలను ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిప్పికొట్టారు. ‘హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల నిధుల దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులుగా, వారు కేజ్రీవాల్ నివసించిన అధికారిక నివాసంపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే, బీజేపీ నేతలు సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారు’అని ఎదురుదాడికి దిగారు.చదవండి: ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్రానున్న ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, ఈ అంశం రాజకీయంగా ఆప్‌ను ఇరుకున పెట్టేదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయిన మొత్తం వ్యయం రూ.52.71 కోట్లని విజిలెన్స్ డైరెక్టరేట్ 2023లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. రూ.10 లక్షల బీమా, కుమార్తెల పెళ్లికి సాయంఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ ఎన్నికల హామీఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు ప్రచారంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు పలు హామీలను ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్ కొండ్లిలో ఆటో డ్రైవర్ నవనీత్ కుటుంబంతో మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తున్నాను. అవి.. రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుమార్తెల వివాహానికి రూ.1 లక్ష సాయం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వీరి పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తాం’ అని తెలిపారు. -
ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ (ఆప్) కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది.ఈ నేపథ్యంలో బుధవారం పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకుంటామని ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ మాజీ సీఎం స్పందించారు. తాము ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ మూడోసారి సైతం పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024 లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆప్ దూరంగా ఉండటానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేశాయి. ఏడు లోక్‌సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. అన్నీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టే, అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు విషయంలో రెండు పార్టీలు పునరాలోచనలో పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇండియా కూటమిలో చీలికలు మరోవైపు 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అయితే కేజ్రీవాల్ వైఖరితో ఇండియా కూటమిలో చీలిక దిశగా పయనిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆప్‌తో పొత్తు ‘పొరపాటే’ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ సైతం ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే పొరపాటే అవుతుందన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నొక్కి చెప్పారు.‘లోక్‌సభ ఫలితాల తర్వాత ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో ఈ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2015 ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది. 2020లో ఆప్ 62 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుని ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. -
అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా.. సిసోడియా స్థానం మార్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనునన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తేదీలు ప్రకటించకముందే.. ప్రజాక్షేత్ర సమరానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆప్ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్.. తాజాగా సోమవారం 20 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది.ఈ జాబితా ప్రకారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను జంగ్‌పురాకు మార్చారు. పట్పర్గంజ్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సివిల్ సర్వీసెస్ ఉపాధ్యాయుడు అవధ్ ఓజాను ఆప్ బరిలోకి దించుతోంది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణీందర్ సింగ్ ధీర్ గెలిచినప్పటి నుంచి జంగ్‌పురా సీటు ఆప్‌లో ఉంది. అనంతరం మణీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లడంతో 2015, 2020 ఎన్నికలలో ఆప్ ప్రవీణ్ కుమార్‌ను పోటీకి నిలిపింది. ఆయనే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి జంగ్‌పురా నుంచి ఆప్ సిసోడియాను ఎంపిక చేసింది. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి సీటు కల్పించింది.కాగా సిసోడియా 2013లో పట్పర్గంజ్ నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై విజయం సాధించి తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2015 ఎన్నికలలో బిజెపికి చెందిన వినోద్ కుమార్ బిన్నీపై, గత 2020 ఎన్నికలలో రవీందర్ సింగ్ నేగిపై విజయం సాధించారు.ఇదిలా ఉండగా గత నెలలో విడుదల చేసిన తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేటిజాబితాలో 20 అభ్యర్థులను వెల్లడించింది. ఇక 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
సుఖ్బీర్ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన హత్యాయత్నంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ స్పందించారు. శిరోమణి అకాలీదళ్ నేత బాదల్ జరిగిన కాల్పుల ఘటన.. పంజాబ్ ప్రతిష్టను తీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడిలో అనేక శక్తులు పాల్గొన్నాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేడు పంజాబ్‌లో ఊహించని ఓ సంఘటన జరిగిందన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. కానీ ఈఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. అయితే పంజాబ్, పంజాబీ ప్రజల పరువు తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నది ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి' అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.అయితే కాల్పుల సమయంలో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరును కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతేగాక ప్రతిచోటా పంజాబ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా సర్వదేవాలయం ఎదుట సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బాదల్‌పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో బుల్లెట్లు గోడను తాకాయి. ఈ ప్రమాదంలో బాదల్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు ఖలిస్తానీ కార్యకలాపాల్లో అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాదిగా పనిచేసినట్లు తెలిసింది.కాల్పుల ఘటన అనంతరం సుఖ్బీర్ తన శిక్షను కొనసాగించారు. సతీమణి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో కలిసి స్వర్ణదేవాలయంలో వంటపాత్రలు శుభ్రం చేశారు. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ‘సుఖ్బీర్ బాదల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించా’’ అని వెల్లడించారు. -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.#WATCH | AAP national convener Arvind Kejriwal says, "There will be no alliance in Delhi (for assembly elections)." pic.twitter.com/KlPKL9sWrY— ANI (@ANI) December 1, 2024అయితే, కేజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా, ఆప్ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందిస్తూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజలు సింపథీ కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇక.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. -
Arvind Kejriwal: ఢిల్లీలో టెన్షన్.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నం.!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు.. దాడికి పాల్పడిన యువకుడిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం కేజ్రీవాల్ కైలాశ్ ప్రాంతంలో శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యంగా పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. తన చేతిలో ఉన్న ఏదో ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై చల్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం, అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🚨 Security breach: Man throws liquid at former CM Arvind Kejriwal, detained by police 🚨 pic.twitter.com/92nVej1YUJ— Rahul kushwaha (@myy_Rahul) November 30, 2024 అయితే, కేజజ్రీవాల్పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అని ముఖ్యమంత్రి అతిశి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె.. తన ట్విట్టర్లో షేర్ చేశారు. మోదీతో సహా అతను ఆ ఫొటోలో ఉండటం గమనార్హం.आज दिन दहाड़े भाजपा के कार्यकर्ता ने @ArvindKejriwal जी पर हमला किया। दिल्ली का चुनाव तीसरी बार हारने की बौखलाहट भाजपा में दिख रही है।भाजपा वालों: दिल्ली के लोग ऐसी घटिया हरकतों का बदला लेंगे। पिछली बार 8 सीटें आयीं थी, इस बार दिल्ली वाले भाजपा को ज़ीरो सीट देंगे pic.twitter.com/LgJGN1aQ0T— Atishi (@AtishiAAP) November 30, 2024ఇదిలా ఉండగా, అంతకుముందు కేజ్రీవాల్.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, మరోసారి కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం, ఆప్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. -
BJP Vs AAP: గ్యాంగ్స్టర్లతో దందా.. ఎమ్మెల్యే ఆడియో క్లిప్ లీక్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గ్యాంగ్స్టర్ల అండతో బిల్డర్లను బెదిరించి దోపిడీలకు పాలల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యే.. గ్యాంగ్‌స్టర్‌తో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను సోషల్ మీడియాతో షేర్ చేశారు.ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌పై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఈ సందర్భంగా మాలవీయ.. ‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో దోపిడీ రాకెట్ నడుపుతున్నారు. పైగా శాంతి భద్రతలు సరిగా లేవంటూ ఆప్ నేతలు బీజేపీ గురించి మాట్లాడతారు. కేంద్రంపై నిందలేస్తున్నారు. ఢిల్లీని ఆప్ అవినీతి కేంద్రంగా మార్చేసింది. ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్.. గ్యాంగ్‌స్టర్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఢిల్లీ బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎలా డిమాండ్ చేయాలో వారిద్దరూ మాట్లాడుకున్నట్లుగా అందులో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.Explosive: AAP MLA Naresh Balyan’s audio call with gangsters, extorting ransom from Delhi builders and businessmen, goes viral.Arvind Kejriwal is running an extortion network in Delhi and then blames the BJP for poor law and order. (1/3)#फिरौतीबाज_केजरीवाल pic.twitter.com/FhuHNtUIBA— Amit Malviya (@amitmalviya) November 30, 2024మరోవైపు.. బీజేపీ నేత గౌరవ్ భాటియ మాట్లాడుతూ..‘ఆప్ గూండాల పార్టీగా మారిపోయింది.. గ్యాంగ్స్టర్లు ఆప్‌కి పెద్ద మద్దతుదారులుగా మారిపోయారు. ఆప్ ఎమ్మెల్యే సూచనలతోనే సామాన్యులను బెదిరించి బహిరంగంగా డబ్బులు దండుకుని దోపిడీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అంగీకారంతో ఆప్ ఎమ్మెల్యే ఇవ్వన్నీ చేస్తున్నారు. అమాయకులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే ఇలా దందాలు చేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. బీజేపీ నేతల ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. అమిత్ మాలవీయ వ్యాఖ్యలపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అది నకిలీ ఆడియో క్లిప్. ఢిల్లీలో పెరుగుతున్న నేరాల గురించి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరాలను ఆపాల్సింది పోయి.. మాపైనే నిందలేస్తున్నారు. మా నేతను అడ్డుకునేందుకు నకిలీ ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లారెన్స్ బిష్ణోయ్‌ని కేంద్రం సంరక్షిస్తోంది: కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆయన ఆరోపించారు.ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విధ్వంసం సృష్టిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడని, అక్కడి నుంచే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో భద్రతపై అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రశ్నలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు. #WATCH | In the Delhi Assembly, AAP MLA and party's national convener Arvind Kejriwal says, "In the last 10 years, Delhi's law and order is going from bad to worse, especially since 2019 when Amit Shah became the Home Minister...He is unable to handle Delhi...Incidents of murder… pic.twitter.com/vjCa9rGK4h— ANI (@ANI) November 29, 2024గత పదేళ్లలో ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2019లో అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుండి ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో ఆయన అసమర్థులుగా కనిపిస్తున్నారని, ఢిల్లీలో హత్యాయుత ఘటనలు తరచూ జరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జనానానికి దోపిడీ కాల్స్ వస్తున్నాయని, గ్యాంగ్ వార్, కాల్పులు బహిరంగంగానే జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
కేజ్రీవాల్ సంచలనం.. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఛత్తర్పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్ పేర్లను కేజ్రీవాల్ ఖరారు చేశారు.ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్‌లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది. -
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్.. నేడు (సోమవారం) బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, దుష్యంత్ గౌతమ్, హర్ష్ మల్హోత్రా, పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.ఆప్ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పదవికి కూడా గహ్లోత్ ఆదివారం రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే ఇది జరిగిన మరుసటి రోజే సోమవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కైలాష్ మాట్లాడుతూ.. ఆప్‌కు రాజీనామా, బీజేపీలో చేరిక నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒత్తిడితోనే తాను వైదొలిగినట్లు ఆప్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతలకు దూరమైందని ఆరోపించారు..‘నేను ఎలాంటి ఒత్తిళ్ల వల్ల బీజేపీలో చేరలేదు. ఆప్ దాని సిద్ధాంతాలపై రాజీ పడింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఆప్‌లో చేరాను, కానీ ఇప్పుడు పార్టీ దాని అసలు లక్ష్యం డిస్కనెక్ట్ అయ్యింది, ఆప్ నాయకులు 'ఆమ్' (కామన్) నుంిచి 'ఖాస్' (ఎలైట్) గా మారుతున్నారు.కేంద్రంతో పోరాడటంపైనే ఆప్ ప్రభుత్వం దృష్టి సారించింది., అలాంటి వైఖరి ఢిల్లీలో నిజమైన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కేంద్రంలో కలిసి పని చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ రోజు బీజేపీలో చేరాను. ’ అని ఢిల్లీ మాజీ మంత్రి తెలిపారు.కాగా నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యే అయిన గహ్లోత్ ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని.. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు.ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు , యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా 'శీష్ మహల్' చుట్టూ వివాదం ముసురుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హస్తం పార్టీ సీనియర్ నాయకుడు చౌదరీ మతీన్ అహ్మాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం, ఆయన అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. వచ్చే ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీనియర్ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.కాంగ్రెస్ సీనియర్ నేత మతీన్ అహ్మద్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్‌లో ఆయన చేరికను పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలోకి అహ్మాద్‌ను స్వాగతిస్తూ.. మతీన్ సాహబ్ సరైన పార్టీలో చేరారు. అహ్మద్ ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. పార్టీలో చేరిన అహ్మాద్‌కు సరైన గౌవరం, స్థానం ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు.ఢిల్లీలోని సీలంపూర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా 1993 నుండి 2013 వరకు అహ్మాద్ ఎన్నికయ్యారు. ఇక, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. అహ్మద్ కుమారుడు చౌదరి జుబేర్ అహ్మద్.. అతని భార్య, కాంగ్రెస్ కౌన్సిలర్ షగుఫ్తా చౌదరి అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్‌లో చేరారు. కాగా, ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా చౌదరి జుబేర్ అహ్మద్ బరి నిలుస్తారనే చర్చ నడుస్తోంది. Senior Congress leader, 5-time MLA Chaudhary Mateen Ahmed joined AAP today in the presence of AAP National Convenor Arvind Kejriwal.(Pics: AAP) pic.twitter.com/e5k7Sxpvg0— ANI (@ANI) November 10, 2024 दिल्ली के पूर्व मुख्यमंत्री एवं @AamAadmiParty के राष्ट्रीय संयोजक श्री @ArvindKejriwal स्वयं चौधरी मतीन अहमद के घर पहुंचे और उन्हें पार्टी में औपचारिक रूप से शामिल कराया। pic.twitter.com/ci6zX6Kgs2— Chaudhary Mateen Ahmed (@MateenAhmedINC) November 10, 2024 -
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆయన చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.కాగా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని 2016లో తొలిసారి కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో.. ఈ వివాదం ప్రారంభమైంది. అయితే కేజ్రీవాల్ డిమాండ్‌కు ప్రతి స్పందనగా సమాచార హక్కు చట్టం కింద అందించాలంటూ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశించింది. అయితే గుజరాత్ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును కొట్టివేసింది. సమాచారాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంది.అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ బహిరంగంగా, విలేకరుల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. మోదీ విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందడంపై ప్రశ్నిస్తూ.. చేసిన వ్యాఖ్యలను గుజరాత్ యూనివర్సిటీ అవమానకరమైనవిగా, తమ పరువు ప్రతిష్టకు భంగం కలించేవిగా భావించింది.ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిష్ట్రర్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేత సంజయ్ సింగ్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్, ఆప్‌కి చెందిన సంజయ్ సింగ్‌లకు గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కొట్టి వేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. -
బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్ రియాక్షన్
ముంబై: బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర, బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాబా సిద్ధిక్ హత్యతో మహారాష్ట్రే కాదు.. దేశం మొత్తం భయాందోళనకు గురవుతోందని ‘ఎక్స్’ వేదికగా అన్నారు.‘‘ముంబైలో ఎన్సీపీ నేతను బహిరంగంగా కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటనతో మహారాష్ట్ర మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఢిల్లీలో కూడా అదే వాతావరణాన్ని సృష్టించారు. దేశం మొత్తం మీద గ్యాంగ్‌స్టర్ పాలన తీసుకురావాలన్నారు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రజానీకం నిలబడాలి’’ అని అన్నారు.मुम्बई में सरेआम NCP नेता की गोली मारकर हत्या की इस वारदात से ना केवल महाराष्ट्र बल्कि देशभर के लोग ख़ौफ़ज़दा हैं। दिल्ली में भी कमोबेश यही माहौल बना दिया है इन्होंने। ये लोग पूरे देश में गैंगस्टर राज लाना चाहते हैं। जनता को अब इनके ख़िलाफ़ खड़ा होना ही पड़ेगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2024ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: రాహుల్ గాంధీ ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ మరణం చాలా బాధాకరమని, మరణ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబంతో అండగా ఉంటామని ‘ఎక్స్’లో వేదికగా తెలిపారు.‘‘ ఈ భయానక సంఘటన మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమైందని బట్టబయలు చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. న్యాయం గెలవాలి’’ అని అన్నారు.The tragic demise of Baba Siddique ji is shocking and saddening. My thoughts are with his family in this difficult time. This horrifying incident exposes the complete collapse of law and order in Maharashtra. The government must take responsibility, and justice must prevail.— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2024 ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్యపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. “ ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య చాలా బాధాకరం. ఆయన దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తోంది. ఈ ఘటనతో ముంబై, మహారాష్ట్రల్లోని సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా తెలిస్తోంది. ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కుర్చీని కాపాడుకోవడంపైనే అక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబా సిద్దిఖీ హత్య ఘటన పూర్తిగా వైఫల్యం శాంతిభద్రతల లోపం’ అని అన్నారు.#WATCH | Hyderabad, Telangana | Baba Siddique Murder case | AIMIM Chief Asaduddin Owaisi says, "It is very disheartening to hear about the cowardly attack on Baba Siddique, in which he unfortunately lost his life. This shows the complete lack of will of political parties. This… pic.twitter.com/NnWAigRi04— ANI (@ANI) October 13, 2024 ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉండగా.. పలువురు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే.. ఈ కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఇక.. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుమని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఇక.. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గత కొన్ని నెలలుగా ప్లాన్ వేస్తున్నారని, ఆయన నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య చేసినందుకు నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ.50 వేలు అడ్వాన్స్, మారణాయుధాలు ఇచ్చినట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ బాబా సిద్ధిఖీ స్నేహితుడు. ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీ పెంచారు.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
‘ఉచితాలు అమెరికా దాకా వెళ్లాయి’.. ట్రంప్ పోస్టుపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత పథకాల ప్రకటన అమెరికా వరకు వెళ్లాయంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రావాల్ పేర్కొన్నారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ చేసిన పోస్టును కేజ్రావాల్ రీట్వీట్ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైతే కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లా’ అని తెలిపారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం.. ప్రజలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఉచితాల పేరుతో ఆప్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తోంది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్ సమర్థించుకోవడమూ తెలిసిందే.తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారుఅంతేగాక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకివాల్ విసిరారు. నవంబర్‌లో జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే తమ సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయని అన్నారు. -
హరియాణాలో ఆప్ గుండుసున్నా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరవగా, హరియాణాలో మాత్రం చతికిలపడింది. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం మెజార్టీ కలిగిన దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గజయ్సింగ్ రాణాపై 4,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) సభ్యుడైన మెహ్రాజ్ మాలిక్‌కు 32,228 ఓట్లు, గజయ్సింగ్కు 18,690 ఓట్లు లభించాయి. దోడాలో నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏ పీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సాధించారు. మెహ్రాజ్ మాలిక్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020లో డీడీసీ సభ్యుడిగా గెలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించారు. తన విజయం ప్రజలకే దక్కుతుందని మాలిక్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా3 కోసం తన పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆయన ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ‘ఆప్’ 7 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. హరియాణాలో 1.79 శాతం ఓట్లే హరియాణా అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే మిగింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి కేవలం 1.79 శాతం ఓట్లు లభించాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ 89 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014లో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. హరియాణాలో ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేయగా, ఎక్కడా కూడా ‘నోటా’ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడం ఆప్‌ను దెబ్బతీసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. హరియాణాకు రెండు వైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.అతివిశ్వాసం వల్లే ఓటమి: కేజ్రీవాల్న్యూఢిల్లీ: హరియాణాలో అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడారు. అతి విశ్వాసం ఉన్నవారికి హరియాణా ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి సీటూ ముఖ్యమేనని, గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. హరియాణాలో ఇతర పార్టీలతో తాము పొత్తు పెట్టుకొని ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు. -
‘పెద్ద గుణపాఠం’.. హర్యానా ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కేజ్రీవాల్
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా.. ఆశాభంగం తప్పలేదు. హర్యానాలో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోగా.. జమ్ముకశ్మీర్‌లో ఓచోట బోణీ కొట్టింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో 'ఆప్' ఖాతా తెరిచినట్టు అయింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 89 స్థానాల్లో ఒంటరిగా పోటి చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికలు అతిపెద్ద పాఠాన్ని నేర్పాయని పేర్కొన్నారు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనే విషయాన్నిఈ ఫలితాలు మనకు నేర్పించాయని అన్నారు. ‘హర్యానాలో ఫలితాలను గమనిస్తే.. ఎన్నికల్లో అతి విశ్వాసం ఉండకూడదనేది మనకు నేర్పిన గుణపాఠం. ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు.’ అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కాగా ఇదే కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.ఇక హర్యానాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. అకార వ్యతిరేకత ఉన్నప్పటికీ వరుసగా మూడోసారి అధికారిన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంది.