అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్ | Atishi Marlena Dummy CM Says Swati Maliwal | Sakshi
Sakshi News home page

అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్

Sep 17 2024 3:05 PM | Updated on Sep 17 2024 3:42 PM

Atishi Marlena Dummy CM Says Swati Maliwal

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషీ మర్లీనా నియామకంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతిషీ ‘డమ్మీ సీఎం’ అని అభివర్ణించారు. 

ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేశారు. అప్జల్ గురు అమాయకుడని రాష్ట్రపతికి రాసిన లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలంటూ ఎక్స్​లో పేర్కొన్నారు

 అయితే స్వాతి మాలీవాల్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి మాలీవాల్ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దిలీప్ పాండే మాట్లాడుతూ.. తమ పార్టీ పార్లమెంట్‌కు పంపినప్పటికీ .. ఆమె బీజేపీ స్క్రిప్ట్‌ను చదువుతున్నారని అన్నారు.

‘ఆప్ నుంచి మాలీవాల్ రాజ్యసభ టికెట్ తీసుకున్నా, బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారు.  అందుకే ఆప్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పదవి చేపట్టాలని సూచించారు.  

ఢిల్లీ సీఎంగా అతిషీ మర్లీనా
అతిషి మర్లీనా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement