
న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కోక్కరికీ రూ. 15 కోట్లు చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ఫలితాలకు ఒక రోజు ముందు కేజ్రీవాల్.. ీబీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ సిద్ధమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించిన బీజేపీ.. ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఆప్ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీజేపీ(BJP) కోరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లేఖ ద్వారా ఎల్జీని కోరింది. దీనిపై స్పందించిన ఎల్జీ.. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు.
ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ
ఎల్జీ ఆదేశాలతో దర్యాప్తుకు సిద్ధమైన ఏసీబీ(ACB).. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటితో ాపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సోదాలు ప్రారంభించింది. దీనిలో ఏసీబీకి చెందిన బృందాలు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనిపై ఆప్ ేనేత సంజయ్ సింగ్ మండిపడుతున్నారు. ఏసీబీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి బదులు సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అన్నారు.

కాగా, ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.
అయితే కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment