Delhi Assembly Election 2025
-
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు షాక్..‘ఆప్’కు అఖిలేష్ మద్దతు -
కాంగ్రెస్‌కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కు తాము మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ కాంగ్రెస్‌కు కాకుండా ఆప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అఖిలేష్ మద్దతు తెలపడంపై కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అఖిలేష్ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్ కార్యక్రమంలోనూ అఖిలేష్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణ పోరు జరగనుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్,బీజేపీ మధ్యే ఉండనుంది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది.ఇదీ చదవండి: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్‌ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారుదీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్‌ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్‌కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అంతకుముందు ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!