ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై కేజ్రీవాల్‌ ధీమా..! | How Many Seats Will AAP Win In Delhi Election Arvind Kejriwal Prediction | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై కేజ్రీవాల్‌ ధీమా..!

Published Tue, Feb 4 2025 4:52 PM | Last Updated on Tue, Feb 4 2025 5:13 PM

How Many Seats Will AAP Win In Delhi Election Arvind Kejriwal Prediction

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి రేపు(బుధవారం) జరుగనున్న ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి 70 సీట్లకు గాను 55 సీట్లను తాము గెలుచుకుంటామన్నారు.  ఒకవేళ బీజేపీ గనుక ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ముగింపు పలకడం ఖాయమన్నారు కేజ్రీవాల్‌(Arvind Kejriwal).

ఈ మేరకు తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు కేజ్రీవాల్‌.  ‘ నా అంచనా ప్రకారం మేము 55 సీట్లను గెలవడం ఖాయం​. ఒకవేళ మహిళల ఇంకాస్త ముందుకొచ్చి పురుషుల చేత ఓట్లను మాకు పడేలా చేస్తే మాత్రం తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తాం. ఇలా జరిగితే 60 సీట్లకు పైగానే గెలుచుకుంటాం.

మీరు(ప్రజలు) కనుక కమలం గుర్తుకు ఓటేస్తే మాత్రం మీరు ఇంటికి వెళ్లేసరికే కరెంట్‌ పోవడం ఖాయం. దేశంలో అత్యంత చౌకగా కరెంట్‌ను అందిస్తున్నది జాతీయ రాజధాని ఢిల్లీలోనే.  ఇక్కడ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటును ఇవ్వడంతో పాటు 400 యూనిట్లకు రూ. 800 మాత్రమే వసూలు చేస్తున్నాం. అదే సమయంలో 24 గంటల విద్యుత్‌ను కూడా అందిస్తున్నాం.  అందుచేత మీరు చీపురు గుర్తు ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేయండి’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

2015లో ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Election 2025)కి జరిగిన ఎన్నికల్లో 67 సీట్లను ఆప్‌ గెలిస్తే. 2020లో 62 సీట్లలో విజయం సాధించింది. మీరు ఎందుకు ఆప్‌కు ఓటేయాలంటే.. ేమేము గత 10 ఏళ్లలో ఎంతో బాధ్యతగా పరిపాలన అందించాం. ిఢిల్లీలో చాలా పనులు ేచేశాం. ఇక ీబీజేపీ అధికారంలో ఉన్న 20 ారాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్‌ అనేదే లేదు’ అని ేకేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement