
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election 2025) గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. దీనికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి సహా గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్ ఓటమికి సంబంధించిన కారణాలపై ుసుదీర్ఘంగా విశ్లేషించారు. ాపార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ చర్చించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఎవరు అనే అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని భేటీ తర్వాత మీడియాకు స్పష్టం చేశారు అతిషి.
ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు..
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అతిషి విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని ఆమె మండిపడ్డారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా , మద్యాన్ని కూడా ఏరులై పారించారన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులే సాక్ష్యమన్నారు అతిషి. పోలీసుల సాక్షిగానే బీజేపీ(BJP) అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇందులో పోలీసులదే ప్రధాన పాత్ర అయితే ఇంకెవరికి చెప్పుకుంటామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తప్పు చేసిన వాళ్లు పోలీసులే అయితే ఇక జైల్లో ఎవరిని పెడతారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆమె దుయ్యబట్టారు.
కాగా, నిన్న(శనివారం) వెలువరించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లతో అధికారాన్ని కైవసం ేచేసుకుంటే, ఆప్ 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. రెండు పర్యాయాలుగా ఢిల్లీ పీఠాన్ని సాధిస్తూ వస్తున్న ఆప్.. ఈసారి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది.ఆప్ నుంచి పోటీ చేసిన కీలక నేతల్లో అతిషి మినహా మిగతా వారు ఓటమి చెందారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment