aap
-
Punjab Bypoll Voting: డేరా పఠానాలో కాంగ్రెస్-ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్రలలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.యూపీలోని 9 సీట్లు (కర్హాల్, సిసమావు, కతేహరి, కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ఫుల్పూర్, ఖైర్, మజ్వాన్), పంజాబ్‌లోని 4 సీట్లు (గిద్దర్బాద, డేరా బాబా నానక్, చబ్బేవాలా, బర్నాలా), కేరళలోని పాలక్కాడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది.పంజాబ్‌లోని డేరా పఠానా గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ సుఖ్జీందర్ సింగ్ రంధావా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్దీప్ సింగ్ రంధావా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారినీ శాంతిపజేశారు. ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.కృత్రిమ వర్షం అంటే..?కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది. -
కఠిన చర్యలపై ఆలస్యమెందుకు?: ఢిల్లీ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ, గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది. గాలి నాణ్యత సూచీ (AQI) 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంత దాటే వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. అలాగే.. స్టేజ్-4 ఆంక్షల అమలులో ఆలస్యంపై నిలదీసింది. మూడు రోజులు ఆలస్యం ఎందుకు అయిందని అడిగింది. గాలి నాణ్యత 'సీవియర్ ప్లస్' కేటగిరీకి చేరిన దేశ రాజధానిలో.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) అమలులో జాప్యం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర కమిషన్‌ను (ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్)పై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేజ్-4 ఆంక్షలు అమలులో ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటిందని.. 400 దిగువన ఉన్నా ఆంక్షలు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.కాగా ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారి 'సీవియర్ ప్లస్'కి పడిపోయింది. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేస్తోంది. ఈ కాలుష్య నివారణ ప్రణాళిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చింది.దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధిస్తారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు.సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం ఉదయం 481గా ఉంది. దేశ రాజధానిలోని 35 మానిటరింగ్ స్టేషన్లలో అత్యధికంగా 400 ఏక్యూఐ నమోదైంది, ద్వారకలో అత్యధికంగా 499గా నమోరైంది. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
-
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
ఢిల్లీలో దీపావళి కాలుష్యం.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావేళ వేళ బాణాసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. బాణాసంచా కాల్చడం వల్ల దీపావేళ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది. ఈ ఏడాది బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.కాగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(గాలి నాణ్యత సూచీ) 400 తీవ్రమైన మార్కును దాటడంతో సోమవారం గాలి నాణ్యత అధ్వాన్నంగా మారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్య స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక దీపావళి నాటికి పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత పది రోజులలో పంట వ్యర్థాల దగ్దం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ పరిధిలో పొలాల దహనం కేసుల నమోదును తెలపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. -
‘మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. .. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.చదవండి: రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ -
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
ఢిల్లీలో 'ముంబై అండర్‌వరల్డ్' పరిస్థితి: సీఎం అతిషి
ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్‌వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है। दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है। यही…— Atishi (@AtishiAAP) October 20, 2024ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ -
నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో మీకు తెలుసా?: కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.ఆప్ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి లేఖను అందిస్తాం. మరోసారి ఆప్ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక కరెంట్ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగం చేశారు. -
సీఎంకే రక్షణ లేదు.. ఇక మాకేం రక్షణ కల్పిస్తారని ప్రజలు అనుకుంటారేమో మేడం!
సీఎంకే రక్షణ లేదు ఇక మాకేం రక్షణ కల్పిస్తారని ప్రజలు అనుకుంటారేమో మేడం! -
మేం ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాం: ఢిల్లీ సీఎం
ఢిల్లీ: తమ పార్టీని గెలిపించుకొని సీఎం పదవిని పొందే సత్తాలేక బీజేపీ ఢిల్లీ సీఎం నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అతిషి మండిపడ్డారు. ఆప్ నేతలు ప్రజల హృదయాల్లో నివసిస్తారని, బీజేపీ కోరుకుంటే ఆ బంగ్లాను వారే ఉంచుకోవచ్చని అన్నారు. సీఎం నివాసం విషయంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోందని మండిపడ్డారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని అన్నారు.‘‘ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేమని బీజేపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనప్పుడు.. బీజేపీ ‘ఆపరేషన్ కమలం'ను ఆశ్రయిస్తుంది. పార్టీ చేరని నేతలను జైల్లో పెడతారు. సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించుకోలేక ఇప్పుడు సీఎం నివాసాన్ని సీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలలో నివసించేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు. అవసరమైతే వీధుల్లోంచి పాలన చేస్తాం. బీజేపీ వాళ్లు బంగ్లాలో ఆనందించవచ్చు. మేము ప్రజల హృదయాలలో జీవిస్తున్నాం’’ అని అన్నారామె.ఇక.. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకురాలు అతిషికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడంపై వివాదం నెలికొంది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిషి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిషికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.చదవండి: సీఎం అతిషి సామాన్లు పడేశారు.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై ఆప్ ఆరోపణలు -
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ -
‘ఆప్’ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
న్యూఢిల్లీ:పంజాబ్‌కు చెందిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్ -
హర్యానా ఎగ్జిట్ పోల్స్.. ఓటర్లు ఎటువైపు?
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు తమననిర్వహించిన సర్వే విడుదల చేస్తున్నాయి. Dainik Bhaskarబీజేపీ.. 15-29కాంగ్రెస్.. 44-54జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 1-5ఆప్.. 0-1ఇతరులు.. 4-9Dhruv Researchబీజేపీ.. 22-32కాంగ్రెస్..50-64జేజేపీ.. 0ఐఎన్ఎల్డీ..0ఆప్.. 0ఇతరులు.. 2-8Peoples Pulseబీజేపీ.. 20-32కాంగ్రెస్..49-61జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 2-3ఆప్.. 0ఇతరులు.. 3-5Republic Bharat- MATRIZబీజేపీ- 18-24కాంగ్రెస్..55-62ఆప్..0-3జేజేపీ.. 0-3ఐఎన్ఎల్డీ..3-6ఇతరులు..2-5హర్యానా హస్తగతమేనా?హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్-55 , బీజేపీ-26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ, తన ప్రత్యర్థి బీజేపీపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారని తెలిపింది.హర్యానా కాంగ్రెస్‌దే అంటున్న మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్మ్యాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్‌కు 55 నుంచి 62 సీట్లు..హర్యానాలో బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయంటున్న మ్యాట్రిజ్మూడు నుంచి ఆరు సీట్లకే పరిమితం కానున్న ఐఎన్ఎల్డీసీఎన్ఎన్ సర్వేహర్యానాలో కాంగ్రెస్‌కు 59, బీజేపీకి 21 సీట్లువచ్చే అవకాశంకాగా గత రెండు పర్యాయాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మూడోసారి సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామినే ధీమాను వ్యక్తపరుస్తోంది కాషాయ పార్టీ. మరోవైపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరి రాష్ట్ర ఓటర్లు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందివ్వనున్నారా లేక.. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్‌కు అందలం ఇవ్వనున్నారా అనేది మరికాసేపట్లో తేలనుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం సర్వేల ఆధారంగా తెలిపే వివరాలు మాత్రమే.. అక్టోబర్ 8న వెలువడే అధికారిక ఫలితాలే తుది ఫలితాలు. -
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవ్నర్పై సుప్రీం ఆగ్రహం.. ‘అంత తొందరెందుకు?’
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలోని చివరి స్థానానికి(18వ ) కోసం ఎన్నిక జరిపించేందుకు ఎందుకు అంత తొందర అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే.. దీనికి సంబంధించిన ఛైర్మన్ ఎన్నికునే ప్రక్రియపై కూడా స్టే విధించింది. నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఎన్నికలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం వెనుక న్యాయపరమైన ఆధారం ఏంటని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది."నామినేషన్ సమస్య కూడా ఉంది... మేయర్ (అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్) అధ్యక్షత వహించారు. మీకు (ఎల్జీ) అధికారం ఎక్కడ లభిస్తుంది?" అని కోర్టు ప్రశ్నించింది. ‘నామినేషన్ అంశం కూడా ఉంది. దానిని పర్యవేక్షించేందుకు అక్కడ మేయర్(ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్) ఉన్నారు. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా జోక్యం చేసుకొంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. దీనిలో కూడా రాజకీయాలా?’ అని న్యాయమూర్తులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నిలదీశారు. అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు విచారిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.అనంతరం బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్‌ను కమిటీలోకి ఎన్నుకోవడంపై మేయర్ షెల్లీ ఓబ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎల్జీని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరోవైపు ఆప్ తరపున అభిషేక్ సింఘ్వీ మను దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ స్పందిస్తూ..ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని.. రెండు వారాల తర్వాత చూడాలని సూచించింది, -
ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ చీఫ్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం(అక్టోబర్4) కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి కేజ్రీవాల్‌కు ఏర్పడింది. సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్ లైన్స్ ఏరియా 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్ కుటుంబం నివసించింది.ఇక నుంచి ఢిల్లీలోని 5, ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉండనుంది. కేజ్రీవాల్ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్‌మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంటినే ఎంచుకున్నారు.లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో పెరిగిన కాలుష్యం -
‘ఆప్’కు మరో షాక్.. హర్యానా అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరిక
చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా అమర్‌సింగ్‌ను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు -
ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్ ఆగ్రహం
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్ వర్గాలు భగ్గుమన్నాయి. ‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.#WATCH | Delhi CM Atishi reached Bawana police station to meet activist Sonam WangchukShe says, "People of Ladakh want statehood. Sonam Wangchuk and the people of Ladakh, who were going to visit Bapu's Samadhi, were arrested. They did not let me meet Sonam Wangchuk. This is the… pic.twitter.com/j5rmK3KCBa— ANI (@ANI) October 1, 2024 సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్ వాంగత్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.ఇక.. ఇప్పటికే సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు -
పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు పేర్లను తొలిగించారంటూ ఆరోపిస్తూ దిగువ కోర్టులో దాఖలైన క్రిమినల్ పరువునుష్టం కేసు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.కాగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేజ్రీవాల్, అతిషి, ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్లపై పరువునష్టం కేసు దాఖలైంది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్, అతిషి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, అతిషిపై దిగువ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది. -
కేజ్రీవాల్ పాలనపై విమర్శలు.. అతిషికి అభినందనలు
ఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే.. ఢిల్లీకి కొత్త సీఎంగా ఎంపికైన ఆప్ నాయకురాలు అతిషికి ప్రతిపక్ష బీజేపీ నేత హర్ష్ మల్హోత్రా అభినందనలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీని వేధించిన పలు కీలక సమస్యలకు పరిష్కరం చూపించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అవినీతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.‘‘గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలకు అందని అభివృద్ధి, సౌకర్యాలు కనీసం మీ(అతిషి) నాయకత్వంలోనైనా అందేలా చూడాలి. జాతీయ రాజధాని అంతటా అపరిశుభ్రమైన మురుగు, విస్తృతమైన నీటి ఎద్దడి, నిరంతర సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యల ముఖ్యమంత్రిగా పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.ఇదిలాఉండగా.. అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడే ప్రయత్నాలకు అతిషి కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను హర్ష్ మల్హొత్రా ప్రస్తావిస్తూ.. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై అతిషి , కేజ్రీవాల్ ఆలోచించాలన్నారు.మరోవైపు.. అతిషి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.President Murmu officially appoints Atishi as Delhi CM; accepts Kejriwal's resignationRead @ANI Story | https://t.co/R278OnyQt6#DroupadiMurmu #Atishi #ArvindKejriwal pic.twitter.com/RwgGCmrHXn— ANI Digital (@ani_digital) September 20, 2024ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్ గరర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు. చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా.. -
అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషీ మర్లీనా నియామకంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతిషీ ‘డమ్మీ సీఎం’ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేశారు. అప్జల్ గురు అమాయకుడని రాష్ట్రపతికి రాసిన లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలంటూ ఎక్స్‌లో పేర్కొన్నారుदिल्ली के लिए आज बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला को बनाया जा रहा है जिनके परिवार ने आतंकवादी अफ़ज़ल गुरु को फांसी से बचाने की लंबी लड़ाई लड़ी। उनके माता पिता ने आतंकी अफ़ज़ल गुरु को बचाने के लिए माननीय राष्ट्रपति को दया याचिकाऐं लिखी।उनके हिसाब से… pic.twitter.com/SbllONqVP0— Swati Maliwal (@SwatiJaiHind) September 17, 2024 అయితే స్వాతి మాలీవాల్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి మాలీవాల్ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దిలీప్ పాండే మాట్లాడుతూ.. తమ పార్టీ పార్లమెంట్‌కు పంపినప్పటికీ .. ఆమె బీజేపీ స్క్రిప్ట్‌ను చదువుతున్నారని అన్నారు.‘ఆప్ నుంచి మాలీవాల్ రాజ్యసభ టికెట్ తీసుకున్నా, బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారు. అందుకే ఆప్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పదవి చేపట్టాలని సూచించారు. ఢిల్లీ సీఎంగా అతిషీ మర్లీనాఅతిషి మర్లీనా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు. -
నా గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు: అతిషి
ఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎంగా ఎన్నికైన తర్వాత అతిషి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్, నాకు గురు సమానులు అరవింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాపై విశ్వాసం ఉంచి.. కేజ్రీవాల్ నాకు చాలా పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఇలా చేయటం కేవలం ఆప్‌లో మాత్రమే సాధ్యం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నేను ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చా. మరే ఇతర పార్టీలో ఉన్నా బహుశా నాకు ఎన్నికల టిక్కెట్టు కూడా ఇచ్చేవారు కాదు. కానీ, కేజ్రీవాల్ నన్ను నమ్మి ఎమ్మెల్యేని, మంత్రిని చేశారు. ఈరోజు నాకు సీఎం బాధ్యతలు అప్పగించారు...కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం.కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంతో అది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. అరవింద్ కేజ్రీవాల్‌ను తిరిగి సీఎంగా ప్రజలు ఎన్నుకుంటారు. ఆయన ఎంత నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ను సీఎం చేస్తారు.అప్పటివరకు ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తాను. నాకు శుభాకాంక్షలు పూలదండలు వద్దు. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్, ఉచిత వైద్యం ఉండవు’’ అని అన్నారు.#WATCH | Delhi: Atishi addresses the media for the first time after being elected as the leader of Delhi AAP legislative party and the new CM.She says, "First of all, I would like to thank the popular CM of Delhi, AAP national convener and my guru - Arvind Kejriwal. He gave me… pic.twitter.com/kn9fVRILnx— ANI (@ANI) September 17, 2024చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
వారంలోపు ఢిల్లీకి కొత్త సీఎం: సౌరభ్ భరద్వాజ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు.. మంత్రి అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ వంటివారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పిస్తారు. రాజీనామా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా మా వెంటే ఉన్నారు. మాకు స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. మేము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "Tomorrow, Chief Minister (Arvind Kejriwal) will submit his resignation and as soon as the resignation is accepted, there will be a meeting of the legislative party, the legislative party will elect a leader. The… pic.twitter.com/xmPu3X9gY7— ANI (@ANI) September 16, 2024చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!