ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aap) విజయం సాధిస్తే.. అద్దె దారులకు ఉచిత కరెంట్, నీటిని అందిస్తామని ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (delhi assembly elections) నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘వివిధ కారణాల వల్ల ఉచిత విద్యుత్, నీటి పథకాల ప్రయోజనాలను అద్దెదారులు పొందలేకపోతున్నారు. అద్దెదారులు కూడా ఢిల్లీ నివాసితులేనని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఈ ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని ఆయన అన్నారు.
బీజేపీ సైతం
మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.
పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.
బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్
గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయం
ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment